
రాహుల్.. గో బ్యాక్!
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి దేశ రాజధానిలో చేదు అనుభవం ఎదురైంది. 'రాహుల్.. గో బ్యాక్' అంటూ నిరసనకారులు నినదించారు. వచ్చింది చాలు, ఇక వెళ్లచ్చని హితవు పలికారు. 'ఒక ర్యాంకు - ఒక పెన్షన్' డిమాండు సాధన కోసం నిరసన ప్రదర్శన చేస్తున్న మాజీ సైనికులకు సంఘీభావంగా వెళ్లినప్పుడు ఇలా జరిగింది. ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద మాజీ సైనికోద్యోగులు నిరసన ప్రదర్శన చేస్తుండగా.. వారికి సంఘీభావంగా ఉండేందుకు రాహుల్ గాంధీ అక్కడకు వెళ్లారు.
అయితే, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించి తీరుతో విసుగెత్తి ఉన్నారో ఏమో గానీ.. మాజీ సైనికులు ఆయనను సాదరంగా స్వాగతించలేకపోయారు. ఇక మరోవైపు పోలీసులు మాజీ సైనికులను అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నించగా తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఇది బ్లాక్ ఇండిపెండెన్స్ డే అని వాళ్లు అభివర్ణించారు.