ex servicemen
-
‘భారతీయన్స్’పై మాజీ సైనికాధికారులు ప్రశంసలు!
ప్రముఖ రచయిత, ప్రేమకథా చిత్రాల స్పెషలిష్ట్ దీన్ రాజ్ తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం ‘భారతీయన్స్’. నీరోజ్ పుచ్చా, సోనమ్ టెండప్, సుభా రంజన్, హీరోలుగా... సమైరా సందు, రాజేశ్వరి చక్రవర్తి, పెడెన్ నాంగ్యాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని భారత్ అమెరికన్ క్రియేషన్స్ పతాకంపై ప్రవాస భారతీయుడు డాక్టర్ శంకర్ నాయుడు అడుసుమిల్లి భారీ బడ్జెట్ తో అత్యంత నిర్మించారు. తాజాగా ఈ చిత్రాన్ని మాజీ సైనికాధికారుల కోసం ప్రసాద్ ల్యాబ్ ప్రివ్యూ థియేటర్ లో ప్రత్యేకంగా ప్రదర్శించారు. చైనా నీచ బుద్ధిని ఎండగడుతూ... రూపొందిన "భారతీయన్స్" చిత్రం సంచలన విజయం సాధించాలని వారు కోరుకున్నారు. దేశ రక్షణ కోసం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో తాము నిర్వర్తించిన విధులను ఈ సందర్భంగా గుర్తు చేసుకుని... మాజీ సైనికా దుకారులు ఉద్వేగానికి గురయ్యారు. నిర్మాత డాక్టర్ శంకర్ నాయుడు మాట్లాడుతూ... మన సైనికుల ప్రాణాలు బలి తీసుకుంటూ... మన దేశ సమగ్రతకు, సార్వభౌమత్వానికి భంగం కలిగించే నీచ చర్యలకు పాల్పుతున్న చైనా పేరును తొలగించమని సెన్సార్ వారు చెప్పడం తనకు ఆశ్చర్యం కలిగించిందని, ఈ విషయంలో ఎంత దూరం వెళ్ళడానికయినా తాను సిద్ధంగా ఉన్నామని అన్నారు. త్రివిధ దళాల్లో పనిచేసిన మన దేశ ముద్దుబిడ్డలైన సైనికాధికారులు "భారతీయన్స్" చిత్రం చూసి మెచ్చుకోవడం... తమకు ఎంతో గర్వంగా ఉందన్నారు దర్శకుడు దీన్ రాజ్. ఈ కార్యక్రమంలో ఈ చిత్ర సంగీత దర్శకుల్లో ఒకరైన కపిల్ కుమార్, హీరోల్లో ఒకరైన నీరోజ్ పుచ్చా ఫాదర్ రమణ మూర్తి, మాజీ సైనికాధికారులు శ్రీనేష్ కుమార్ నోరి, కెప్టెన్ సురేష్ రెడ్డి, రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తుపాకీ పట్టిన చేతులతో మేడి పట్టిన మాజీ సైనికులు
తుపాకీ చేతపట్టి సరిహద్దు రేఖపై పహారా కాసిన వారే.. నాగలి చేతబూని పంటచేలో సేద్యం చేస్తున్నారు. ప్రాణాలకు తెగించి దేశం కోసం పరితపించిన వారే నిరంతర శ్రామికులై శ్వేదం చిందిస్తూ అన్నదాతలుగా మారారు. వేలాది మంది సైనికులు, మాజీ సైనికులకు నిలయమైన జిల్లాలో ఏళ్ల తరబడి దేశసేవలో తరించిన మాజీ సైనికులు వ్యవసాయ అనుబంధ రంగాల్లో రాణిస్తున్నారు. కష్టం మాకు లెక్కేం కాదంటూ అవిశ్రాంతంగా మండుటెండల్లో.. పంట చేలల్లో కాయకష్టం చేస్తూ గర్వంగా మీసం మెలేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జై జవాన్.. జై కిసాన్.. అన్న నినాదాన్ని సార్థకం చేస్తున్నారు ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ సైనికులు. జిల్లాలో దేశానికి సేవ చేసిన.. చేస్తున్న జవాన్లు వేల సంఖ్యలో ఉన్నారు. సైనికులకు పశ్చిమ ప్రకాశం పెట్టింది పేరు. ప్రధానంగా గిద్దలూరు నియోజకవర్గంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న సైనికులు, మాజీ సైనికులతో పోల్చుకుంటే అత్యధిక శాతం ఉన్నారు. నియోజకవర్గంలోని అర్థవీడు మండలం జిల్లాలోనే అత్యధికంగా సైనికులు, మాజీ సైనికులున్న మండలంగా గుర్తింపు పొందింది. ఆ తరువాత స్థానాల్లో కూడా గిద్దలూరు నియోజకవర్గంలోని కొమరోలు, బేస్తవారిపేట, రాచర్ల, కంభం మండలాలున్నాయి. ఆ తరువాత స్థానాల్లో కనిగిరి నియోజకవర్గం, మార్కాపురం నియోజకవర్గాలు ఉన్నాయి. దేశానికి సేవలందించటంలో జిల్లాకు గుర్తింపు దేశ సేవలో వేలాది మంది జిల్లావాసులు పునీతులయ్యారు. జిల్లా వ్యాప్తంగా మాజీ సైనికులు 28 వేల మంది ఉన్నారు. అదేవిధంగా ప్రస్తుతం దాదాపు 15 వేల మందికి పైగా త్రివిధ దళాల్లో పనిచేస్తున్నారు. గ్రామాలకు గ్రామాలే సైన్యంలో పనిచేస్తున్నారు. మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం, పాకిస్థాన్, చైనాతో జరిగిన యుద్ధాల్లోనూ జిల్లా సైనికులు అత్యంత సాహసాన్ని కనబరిచారు. కార్గిల్‌లాంటి యుద్ధాల్లో ప్రాణాలు ఫణంగా పెట్టారు. త్రివిధ దళాల్లో 15 నుంచి 30 సంవత్సరాల వరకు సేలందించి పదవీ విరమణ చేసిన వారు వేల సంఖ్యలో ఉన్నారు. సైనికులుగా పనిచేసిన తరువాత వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలు కూడా పొందే అవకాశం మాజీ సైనికులకు ఉంటుంది. అలా వెళ్లిన వారు కొంతమంది మాత్రమే ఉంటారు. మరికొంతమంది వివిధ రంగాల్లో అంటే వ్యాపారాలు, పరిశ్రమలు, ఇతర రంగాల్లో స్థిరపడ్డారు. ఎక్కువ మంది వ్యవసాయం మీద మక్కువతో కష్టమైనా ఇష్టంగా పనిచేస్తున్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లోనే అత్యధికంగా.. సైనికుడంటే ఒక క్రమశిక్షణతో కూడిన జీవనం. ఆ క్రమశిక్షణ సోమరితనాన్ని పారదోలుతుంది. జవానుగా పదవీ విరమణ చేసిన వేలాది మంది మాజీ సైనికులు విశ్రాంత జీవితాన్ని ఖాళీగా గడపకుండా.. వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాల్లో రాణిస్తున్నారు. మాజీ సైనికులు ఇతర రంగాలతో పోల్చుకుంటే వ్యవసాయ అనుబంధ రంగాల్లో స్థిరపడినవారి సంఖ్య అధికంగా ఉంది. ప్రధానంగా పశ్చిమ ప్రాంతంలో వీరి సంఖ్య దాదాపు 10 వేల మంది వరకు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. వ్యవసాయ, ఉద్యాన పంటలు ఎక్కువగా సాగు చేస్తున్నారు. మరికొందరు పశువుల పెంపకం ప్రధాన వృత్తిగా చేసుకున్నారు. కొందరు వ్యవసాయంతోపాటు చేపల చెరువులు వేస్తూ అందులో మంచి ఫలితాలు సాధిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వ్యవసాయం, చేపల పెంపకంతో.. ఇతని పేరు దూదేకుల మౌలాలి. రాచర్ల మండలంలోని గుడిమెట్ట కొత్తపల్లె గ్రామానికి చెందిన ఈయన 26 ఏళ్లపాటు ఆర్మీ జవానుగా పని చేసి 2018లో పదవీ విరమణ చేశారు. అనంతరం స్వగ్రామానికి వచ్చి కుటుంబ సభ్యులతో కలిసి వారికున్న 6.50 ఎకరాల వ్యవసాయ భూమిని సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. టమోటా, మిరప, బత్తాయి, పత్తి పంటలతో పాటు చేపల పెంపకం చేపడుతున్నారు. తక్కువ ఆదాయం వస్తున్నా వ్యవసాయంపై మక్కువతో పంటలు సాగుచేస్తున్నట్లు మౌలాలి చెబుతున్నారు. జత ఎడ్లతో పాటు, నాలుగు పాడి గేదెలను పెంచుకుంటున్నారు. కుటుంబంలోని అందరూ వ్యవసాయ పనులు చేసుకుంటూ మరికొంత మందికి తన వ్యవసాయం, చేపల పెంపకం ద్వారా ఉపాధి కల్పిస్తున్నారు. పొలం కౌలుకు తీసుకొని.. రాచర్ల మండలం అంకిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన కఠారు పూర్ణ రంగయ్య 22 ఏళ్ల పాటు మిలిటరీలో పనిచేశారు. తనకు పెన్షన్ వస్తున్నా, మిలిటరీ క్యాంటీన్లో కావాల్సిన వస్తువులు నాణ్యమైనవి, తక్కువ ధరకు వస్తున్నా సరిపెట్టుకోలేదు. శరీరంలో శక్తి ఉన్నంత వరకు ఖాళీగా ఉండకూడదని నిర్ణయించుకున్నారు. తనకు పొలం లేకపోయినా 4 ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నారు. ఆ పొలంలో ఒక ఎకరంలో వరి సాగుచేస్తుండగా మిగతా మూడెకరాల్లో మిర్చితో పాటు కూరగాయల సాగు చేపడుతూ శ్రమను నమ్ముకున్నారు. భార్యాభర్తలు ఇద్దరూ కష్టపడుతూ కౌలుకు తీసుకున్న పొలం అయినా ఇష్టంగా పంటలు పండిస్తున్నారు. పెట్టుబడి, కౌలు ఖర్చులు, కూలీ ఖర్చులు పోనూ ప్రతి సంవత్సరం ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. (క్లిక్ చేయండి: వెలుగులు విరజిమ్మనున్న చీమకుర్తి గెలాక్సీ గ్రానైట్) -
దేశ సేవకు పునరంకితం కావాలి
అనంతపురం సెంట్రల్ : కార్గిల్ యుద్ధంలో భారత సైనికుల పోరాటం, వారి ప్రాణత్యాగాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని దేశ సేవకు పునరంకితం కావాలని మాజీ సైనికులు పిలుపునిచ్చారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా నగరంలో మంగళవారం జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఆర్ట్స్ కళాశాల నుంచి టవర్‌క్లాక్, సుభాష్‌రోడ్డు మీదుగా సప్తగిరి సర్కిల్ చేరుకుని అక్కడ అమరవీరుల స్తూపం వద్ద ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా సైనిక సంక్షేమాధికారి తిమ్మప్ప, మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కెప్టెన్ షేకన్న మాట్లాడుతూ మాట్లాడుతూ ప్రాణాలను ఎదురొడ్డి దేశరక్షణకు అహర్నిశలు పోరాడుతున్న భారత సైనికులు, అమరుల జీవితాలు అందిరికీ స్ఫూర్తిదాయం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం హెచ్చెల్సీ కాలనీలో మాజీ సైనికులతో సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి, సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్, డాక్టర్ రామసుబ్బయ్య, డిప్యూటీ మేయర్ గంపన్న, టౌన్ బ్యాంకు అధ్యక్షులు మురళీ, తదితరులు పాల్గొన్నారు. కొవ్వొత్తుల నివాళి.. కార్గిల్ అమర వీరులకు బీజేపీ నాయకులు ఘన నివాళులర్పించారు. మంగళవారం టవర్‌క్లాక్ వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించి వారి సేవలు కొనియాడారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి దుద్దకుంట వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత యువత కార్గిల్ అమరవీరులను స్ఫూర్తిగా తీసుకుని దేశ సేవకు నడుంబిగించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ నగర అధ్యక్షులు శ్రీనివాసులు, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి, నాయకులు లలిత్‌కుమార్, శ్రీనివాసులు, గోవిందరాజులు, చంద్రశేఖర్, సోమయ్య, సయ్యద్ తదితరులు పాల్గొన్నారు. -
'మాట నిలబెట్టుకోలేకపోతే ఆయనేం ఆర్థికమంత్రి'
న్యూఢిల్లీ: మరోసారి ఓఆర్ఓపీ పెన్షన్ దారులు ఆందోళన బాట పట్టారు. వారంతా ఢిల్లీలోని కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ అధికారిక నివాసం ముందు దర్నాకు దిగారు. తమ ఆందోళనలు కేంద్ర ప్రభుత్వ పట్టించుకోవడం లేదని, తాము చేసిన సూచనలు పెడచెవిన పెడుతున్నారని ఆరోపిస్తూ ఆదివారం వారంతా జైట్లీ ఇంటిముందు నినాదాలతో హోరెత్తించారు. ఈ నేపథ్యంలో పోలీసులు ముందుగానే బారీకేడ్లు భారీ స్థాయిలో ఇంటి ముందుపెట్టించడమే కాకుండా పోలీసులను కూడా మోహరించారు. మంత్రుల నివాసాల ముందు నేరుగా మాజీ సైనికులు పెన్షన్ల కోసం ధర్నాలకు దిగడం గడిచిన వారం రోజుల్లో ఇది రెండో సారి. 'ఇదే నెలలో 3న మేం ఇదే మంత్రి నివాసం ముందు ధర్నాకు వచ్చినప్పుడు ఆయన కేంద్ర రక్షన మంత్రితో మాట్లాడతామని హామీ ఇచ్చారు. వారంలోగా ఆ పని పూర్తిచేయాలని మేం కోరాం. కానీ ఇప్పటికీ రెండు వారాలు అవుతోంది. ఆయన మాత్రం ఏ విధంగాను స్పందించలేదు. ఆయన ఇచ్చిన మాటనే నిలబెట్టుకోలేకపోతే ఆయనను ఇక ఏం ఆర్థికమంత్రి అనుకోవాలి' అని వీకే గాంధీ అనే మాజీ సైనికుడు అన్నారు. -
‘వన్ పెన్షన్’ వచ్చేసింది
-
'ప్రభుత్వ ప్రకటన సంతృప్తిగా లేదు.. నిరసన కొనసాగిస్తాం'
న్యూఢిల్లీ: వన్ ర్యాంక్ వన్ పెన్షన్ అమలుపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పట్ల మాజీ సైనికులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై పోరాటాన్ని కొనసాగిస్తామని మాజీ సైనికులు తెలిపారు. ఓఆర్ఓపీ డిమాండ్లపై కేవలం ఒక్కదాన్నే ప్రభుత్వం ఆమోదించిందని మాజీ సైనిక ఉద్యోగులు చెప్పారు. తాము చేసిన ఆరు డిమాండ్లను కేంద్రం తిరస్కరించిందని చెప్పారు. ఓఆర్ఓపీ విధానంపై కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ శనివారం మధ్యాహ్నం ప్రకటన చేశారు. కాగా ప్రభుత్వ ప్రకటనపై తాము పూర్తిగా సంతృప్తి చెందలేని, నిరసన కొనసాగిస్తామని మాజీ సైనికులు చెప్పారు. -
వన్ ర్యాంక్ వన్ పెన్షన్ అమలుకు గ్రీన్ సిగ్నల్
► 2014 జూలై 1 నుంచి ఓఆర్ఓపీ అమలు ► నాలుగు విడతల్లో ఆరేసి నెలల్లో బకాయిల చెల్లిపు ► రక్షణ మంత్రి మనోహర్ పారిక్కర్ ప్రకటన న్యూఢిల్లీ: మాజీ సైనికుల కల ఫలించింది. 42 ఏళ్లుగా ఎదురుచూస్తున్న వన్ ర్యాంక్ వన్ పెన్షన్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ విషయాన్ని రక్షణ మంత్రి మనోహర్ పారిక్కర్ శనివారం మధ్యాహ్నం ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రకటించారు. 2014 జూలై ఒకటో తేదీ నుంచి అమలయ్యేలా ఓఆర్ఓపీని అమలుచేస్తామని, దీనికి సంబంధించిన బకాయిలను నాలుగు విడతల్లో ఆరేసి నెలలకు ఒకసారి చొప్పున ఇస్తామని తెలిపారు. యుద్ధ వితంతువులకు మాత్రం ఒకే సారి మొత్తం బకాయిలు చెల్లిస్తామన్నారు. ఐదేళ్లకోసారి పింఛనును సవరిస్తుంటామని పారిక్కర్ చెప్పారు. దీనివల్ల ఖజానాపై 8000 కోట్ల నుంచి 10000 కోట్ల వరకు ఖర్చవుతుంది. అలాగే బకాయిల చెల్లింపునకు మరో 10-12 వేల కోట్ల వరకు ఖజానాపై భారం పడుతుందని రక్షణ మంత్రి తెలిపారు. మన భద్రతాదళాలు అపార ధైర్యసాహసాలు ప్రదర్శిస్తున్నాయని, వీళ్లు శాంతి భద్రతలతో పాటు విపత్తులు వచ్చినప్పుడు కూడా తమ సేవలు అందిస్తున్నారని ఈ సందర్భంగా పారిక్కర్ ప్రశంసించారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ దాదాపు నాలుగు దశాబ్దాలుగా పెండింగులో ఉందని, దీనిపై ఇంతకు ముందు ప్రభుత్వాలు చాలావరకు నిర్లక్ష్యం వహించాయని చెప్పారు. యూపీఏ సర్కారు గతంలో ఒకసారి 500 కోట్లు బడ్జెట్లో ప్రవేశపెట్టినా, అది సరిపోతుందా లేదా అన్న విషయం ఆలోచించలేదని విమర్శించారు. దీన్ని అమలుచేయడానికి పాలనా పరమైన, సాంకేతిక, ఆర్థిక సమస్యలున్నాయని 2009లో పార్లమెంటులో చెప్పారన్నారు. అందుకే ఈ ప్రభుత్వం కూడా ఓఆర్ఓపీ అమలుకు కొంత సమయం తీసుకుందని, అయినా ప్రధాని నరేంద్రమోదీ మాత్రం పలు సందర్భాల్లో ఓఆర్ఓపీని అమలు చేస్తామనే చెప్పారన్నారు. దీని అమలుకు నిపుణులు, మాజీ సైనికులతో చర్చించామని... అయితే వీఆర్ఎస్ తీసుకున్నవాళ్ల విషయంలోనే కొంత సమస్య వచ్చిందని పారిక్కర్ తెలిపారు. ఒకే ర్యాంకులో ఒకే సర్వీసు పూర్తిచేసిన వాళ్లకు ఎప్పుడు రిటైరయ్యారన్నదాంతో సంబంధం లేకుండా ఒకే తరహాలో ఇక మీదట పింఛను వస్తుందన్నారు. -
రాహుల్.. గో బ్యాక్!
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి దేశ రాజధానిలో చేదు అనుభవం ఎదురైంది. 'రాహుల్.. గో బ్యాక్' అంటూ నిరసనకారులు నినదించారు. వచ్చింది చాలు, ఇక వెళ్లచ్చని హితవు పలికారు. 'ఒక ర్యాంకు - ఒక పెన్షన్' డిమాండు సాధన కోసం నిరసన ప్రదర్శన చేస్తున్న మాజీ సైనికులకు సంఘీభావంగా వెళ్లినప్పుడు ఇలా జరిగింది. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద మాజీ సైనికోద్యోగులు నిరసన ప్రదర్శన చేస్తుండగా.. వారికి సంఘీభావంగా ఉండేందుకు రాహుల్ గాంధీ అక్కడకు వెళ్లారు. అయితే, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించి తీరుతో విసుగెత్తి ఉన్నారో ఏమో గానీ.. మాజీ సైనికులు ఆయనను సాదరంగా స్వాగతించలేకపోయారు. ఇక మరోవైపు పోలీసులు మాజీ సైనికులను అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నించగా తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఇది బ్లాక్ ఇండిపెండెన్స్ డే అని వాళ్లు అభివర్ణించారు.