ప్రముఖ రచయిత, ప్రేమకథా చిత్రాల స్పెషలిష్ట్ దీన్ రాజ్ తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం ‘భారతీయన్స్’. నీరోజ్ పుచ్చా, సోనమ్ టెండప్, సుభా రంజన్, హీరోలుగా... సమైరా సందు, రాజేశ్వరి చక్రవర్తి, పెడెన్ నాంగ్యాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని భారత్ అమెరికన్ క్రియేషన్స్ పతాకంపై ప్రవాస భారతీయుడు డాక్టర్ శంకర్ నాయుడు అడుసుమిల్లి భారీ బడ్జెట్ తో అత్యంత నిర్మించారు.
తాజాగా ఈ చిత్రాన్ని మాజీ సైనికాధికారుల కోసం ప్రసాద్ ల్యాబ్ ప్రివ్యూ థియేటర్ లో ప్రత్యేకంగా ప్రదర్శించారు. చైనా నీచ బుద్ధిని ఎండగడుతూ... రూపొందిన "భారతీయన్స్" చిత్రం సంచలన విజయం సాధించాలని వారు కోరుకున్నారు. దేశ రక్షణ కోసం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో తాము నిర్వర్తించిన విధులను ఈ సందర్భంగా గుర్తు చేసుకుని... మాజీ సైనికా దుకారులు ఉద్వేగానికి గురయ్యారు.
నిర్మాత డాక్టర్ శంకర్ నాయుడు మాట్లాడుతూ... మన సైనికుల ప్రాణాలు బలి తీసుకుంటూ... మన దేశ సమగ్రతకు, సార్వభౌమత్వానికి భంగం కలిగించే నీచ చర్యలకు పాల్పుతున్న చైనా పేరును తొలగించమని సెన్సార్ వారు చెప్పడం తనకు ఆశ్చర్యం కలిగించిందని, ఈ విషయంలో ఎంత దూరం వెళ్ళడానికయినా తాను సిద్ధంగా ఉన్నామని అన్నారు. త్రివిధ దళాల్లో పనిచేసిన మన దేశ ముద్దుబిడ్డలైన సైనికాధికారులు "భారతీయన్స్" చిత్రం చూసి మెచ్చుకోవడం... తమకు ఎంతో గర్వంగా ఉందన్నారు దర్శకుడు దీన్ రాజ్. ఈ కార్యక్రమంలో ఈ చిత్ర సంగీత దర్శకుల్లో ఒకరైన కపిల్ కుమార్, హీరోల్లో ఒకరైన నీరోజ్ పుచ్చా ఫాదర్ రమణ మూర్తి, మాజీ సైనికాధికారులు శ్రీనేష్ కుమార్ నోరి, కెప్టెన్ సురేష్ రెడ్డి, రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment