Bharateeyans Movie
-
'భారతీయన్స్' సినిమా రివ్యూ
టైటిల్: భారతీయన్స్ నటీనటులు: నీరోజ్ పుచ్చా, సుభా రంజన్, సోనమ్ టెండప్ తదితరులు నిర్మాత: డాక్టర్ శంకర్ నాయుడు అడుసుమిల్లి దర్శకుడు: దీనరాజ్ సంగీతం: సత్య కశ్యప్, కపిల్ కుమార్ సినిమాటోగ్రఫీ: జయపాల్ రెడ్డి నిమ్మల విడుదల తేదీ: జూలై 14 దేశభక్తిని చాటే చిత్రాలు అరుదుగా వస్తుంటాయి. మన సైనికుల ప్రాణ త్యాగాలు, శత్రు దేశాల కుట్రలను చూపిస్తూ ఇప్పటికే చాలానే మూవీస్ వచ్చాయి. ఇప్పుడు 'భారతీయన్స్' పేరుతో ఓ చిత్రం థియేటర్లలోకి వచ్చింది. ప్రవాస భారతీయుడు శంకర్ నాయుడు నిర్మించగా.. దీనరాజ్ దర్శకుడు. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. (ఇదీ చదవండి: Baby Movie Review: ‘బేబీ’ మూవీ రివ్యూ) కథేంటి? ఈ కథలో పాత్రలకు పేర్లుండవు. ప్రాంతాల పేర్లతో పిలుస్తుంటారు. అలా భోజ్ పురి, తెలుగు, నేపాలీ, బెంగాలీ, త్రిపుర, పంజాబీలు ఇలా ఆరుగురు ఒకే చోటకు చేరుతారు. వాళ్లందరికీ కొందరు ట్రైనింగ్ ఇస్తారు. చివరకు వారిని ఇండియన్ బోర్డర్ దాటి చైనాలోకి వెళ్లమని చెబుతారు. అక్కడి గెస్ట్ హౌస్‌లోని ల్యాబ్‌లో ఏం జరుగుతోంది? అక్కడి సీక్రెట్స్ ఏంటో తెలుసుకు రావాలని చెబుతారు. అసలు ఆ ఆరుగురు ఒకే చోటకు ఎందుకు వచ్చారు? వారి నేపథ్యం ఏంటి? వారికి ట్రైనింగ్ ఇచ్చిన వారు ఎవరు? చైనా వాడు వేసిన ఎత్తు ఏంటి? చివరకు ఏమైందనేదే స్టోరీ. ఎలా ఉందంటే? దేశభక్తి సినిమాలు, సరిహద్దు సమస్యలు, ఉగ్రవాద కుట్రలు, చైనా, పాకిస్థాన్, ఇండియా అనే అంశాల మీద సినిమా తీయడం అంటే సాహసమే. ఆ సాహసాన్ని నిర్మాత శంకర్, దర్శకుడు దీనరాజ్ చేశారు. అయితే ఈ దేశ భక్తి సినిమాను ప్రేక్షకులను కనెక్ట్ చేయడంలో కొంత మేర సక్సెస్ అయ్యారు. ఎమోషన్స్ వర్కవుట్ అయ్యాయి. నటీనటుల ప్రభావం ఆడియెన్స్ మీద మరి కొంత పడుంటే బాగుండేది. ప్రథమార్థం అంతా పాత్రల పరిచయం, వారి వారి నేపథ్యాలు చూపించడంతో గడిచింది. ద్వితీయార్థంలోనే అసలు కథ, ట్విస్టులుంటాయి. క్లైమాక్స్ ఫైట్ ఉత్కంఠ భరితంగా సాగుతుంది. చివరి పది నిమిషాలు దేశ భక్తి రగిల్చేలా ఉంటుంది. క్లైమాక్స్ కోసం బాగానే కష్టపడినట్లుగా కనిపించింది. సినిమా ముగింపు అందరినీ కదిలిస్తుంది. ప్రాంతాలు వేరైనా మనమంతా భారతీయులమని చాటి చెప్పే చిత్రమిది. ఎవరెలా చేశారు? 'భారతీయన్స్' సినిమాలో ఎక్కువగా ఎమోషన్స్ ఉంటాయి. దేశభక్తిని చాటే సన్నివేశాలుంటాయి. వాటిలో నటీనటులు చక్కగా నటించారు. భోజ్ పురి, పంజాబీ, నేపాలి, త్రిపుర, తెలుగు, బెంగాలి ఇలా అందరూ చక్కగా నటించారు. పంజాబీ, త్రిపుర, బెంగాలి పాత్రల్లో చేసి అమ్మాయిలు తెరపై అందంగా కనిపించారు. ఎమోషన్స్, యాక్షన్ సీక్వెన్సుల్లోనూ మెప్పించారు. మిగిలిన పాత్రల్లో నటించిన వారు పరిధి మేరకు పర్వాలేదనిపించారు. సాంకేతికంగా ఈ సినిమా బాగుంది. సిక్కిం ఏరియా, సరిహద్దు ప్రాంతాలను చక్కగా కెమెరామెన్ చూపించారు. సంగీతం బాగుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని సీన్లని నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లింది. ఎడిటింగ్, ఆర్ట్ డిపార్ట్మెంట్ విభాగాలు చక్కగా కుదిరాయి. నిర్మాత ఖర్చు పెట్టిన ప్రతీ పైసా తెరపై కనిపిస్తుంది. నిర్మాణ విలువలు గొప్పగా ఉన్నాయి. ఫైనల్ గా చెప్పాలంటే దేశభక్తి నేపథ్యంలో సినిమా తీయడం నిజంగా అభినందనీయం. (ఇదీ చదవండి: ‘మహావీరుడు’ మూవీ రివ్యూ) -
బూట్లలో ఉప్పు వేసుకొని అక్కడ షూటింగ్ చేశాం: ఢైరెక్టర్
చైనా బోర్డర్లో ఎన్నో వ్యయప్రయాసలకోర్చి భారతీయన్స్ సినిమా షూటింగ్ చేశాం. వర్షాలు కురిసి, కొండచరియలు విరిగిపడి ఎప్పుడు షూటింగ్ ఆగిపోతుందో తెలియని పరిస్థితుల్లో ఈ సినిమాను పూర్తి చేశాం. జీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ‘శ్మీర్ ఫైల్స్ ’దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ‘భార తీయన్స్’ చిత్రంపై ప్రశంసలు కురిపించడం మేము పడ్డ కష్టం అంతా మర్చిపోయేలా చేసింది’ అని ప్రముఖ రచయిత దీనరాజ్ అన్నారు. ప్రేమించుకుందాం రా, ప్రేమంటే ఇదేరా, కలిసుందాం రా వంటి సూపర్‌హిట్ చిత్రాలకు కథా రచయితగా పనిచేసిన దీనరాజ్ తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం ‘భారతీయన్స్’. జులై 14న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► భారతీయన్స్ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. డ్రోన్స్‌తో షూట్ చేయడానికి, బాంబ్ పేలుళ్లు జరపడానికి, అడవుల్లో షూటింగ్‌కు ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతులు తీసుకున్నాం.ఒక్కోసారి మధ్యాహ్నం 2 గంటలకే లైటింగ్ ఫెయిల్ అయి షూటింగ్ చేయలేకపోయేవాళ్ళం. చిత్ర యూనిట్ సభ్యులకు ఈశాన్య రాష్ర్టాల ఫుడ్ సరిపడకపోవడంతో ఆరోగ్య సమస్యలు ఎదురయ్యేవి. కొండచరియలతోపాటు.. చెట్లు విరిగి మా కార్లమీద పడడంతో కొందరు యూనిట్ సభ్యులు బతుకు జీవుడా అని దొరికిన వాహనాన్ని పట్టుకుని హైదరాబాద్ వచ్చేశారు. ► అడవుల్లో షూటింగ్ చేస్తున్నప్పుడు జలగలు మా కాళ్లని పట్టుకుని సైలెంట్‌గా రక్తాన్ని పీల్చేవి. సమీప గ్రామాల నుంచి ఉప్పు బస్తాలు తెప్పించి... చెప్పుల్లో, బూట్లలో ఉప్పు వేసుకుని షూటింగ్ కొనసాగించాం. సిక్కిం, సిలిగురి అడవుల్లో దోమల్లాంటి కీటకాలు ఎగురుతూ ముఖం మీద డైరెక్ట్‌గా వాలి రక్తాన్ని పీల్చేవి. యాక్షన్ అని డైరెక్టర్ అనగానే ఆర్టిస్టులు చేతులతో ఆ కీటకాలను తోలుకుంటూ ఉండేవారు ► క్లైమాక్స్ కోసం కొండల మధ్యలో ఉన్న ఒక లోయను ఎన్నుకున్నాం. ప్రతిరోజూ వేకువజామున 3.30కే బయల్దేరి మూడు గంటలపాటు కొండల మధ్య ప్రయాణం చేసి ఆ లోయను చేరుకునేవాళ్ళం. ఎన్ని కష్టాలు పడితే ఏంటి? తెలుగు వాళ్లు గర్వపడే సినిమా తీశాం. జూలై 14వ తేదీన విడుదల కాబోతున్న మా సినిమాని చూశాక మీరంతా మమ్మల్ని కచ్చితంగా అభినందిస్తారనే నమ్మకం మాకుంది. -
చైనాకు వంత పాడుతున్నారా?.. సెన్సార్ బోర్డుపై నిర్మాత సంచలన కామెంట్స్!
ప్రముఖ రచయిత, ప్రేమకథా చిత్రాల స్పెషలిష్ట్ దీన్ రాజ్ తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం ‘భారతీయన్స్’. నీరోజ్ పుచ్చా, సోనమ్ టెండప్, సుభా రంజన్, హీరోలుగా... సమైరా సందు, రాజేశ్వరి చక్రవర్తి, పెడెన్ నాంగ్యాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని భారత్ అమెరికన్ క్రియేషన్స్ పతాకంపై ప్రవాస భారతీయుడు డాక్టర్ శంకర్ నాయుడు అడుసుమిల్లి భారీ బడ్జెట్ తో నిర్మించారు. శంకర్ నాయుడు అడుసుమిల్లి మాట్లాడుతూ..'మన దేశంపై చైనా దురాగతాలను వెల్లడిస్తూ రూపొందిన మొదటి సినిమా ఇది. భారతీయ మూలాలు కలిగి, అమెరికాలో స్థిరపడిన తెలుగువాడిని. అతి త్వరలో మీ ముందుకు "భారతీయన్స్" చిత్రాన్ని తీసుకొస్తాం. సెన్సార్ బోర్డు ఉన్నతాధికారులు చైనాకు భయపడి ఈ సినిమాలో మన గొంతును మూయించే ప్రయత్నం చేస్తున్నారు. చైనా దాడులు, బ్యాక్‌స్టాబ్‌లు చాలావరకు మీకు తెలిసి ఉండవచ్చు.' అని అన్నారు. చైనా వక్రబుద్ధిపై మాట్లాడుతూ.. 'చైనా మనతో ప్రపంచంలోనే అతి పొడవైన సరిహద్దులలో ఒకటిగా ఉంది. చైనా ఎల్లప్పుడూ మన వెనుక కత్తితో దాడి చేసే శత్రువు. అత్యంత ప్రమాదకరమైన, మోసపూరిత, దుర్మార్గమైన చైనా... కొన్ని శతాబ్దాల క్రితం బ్రిటీష్ వారిలాగే సాధ్యమైన ప్రతి దేశాన్ని వలసరాజ్యం చేయడానికి ప్రయత్నిస్తూ అధికారంలో ఉండటానికి దాని స్వంత ప్రజలను సైతం చంపుతుంది. ఈ దుర్మార్గపు, నిరంకుశం గురించి మా సినిమా భారతీయన్స్లో ఎండగట్టాం.' అని అన్నారు. దురదృష్టవశాత్తు సెన్సార్ బోర్డు నన్ను సినిమాలో చైనా పేరును ఉపయోగించవద్దని కోరిందని తెలిపారు. మరింత విచారంగా గాల్వాన్ వ్యాలీ పేరును కూడా తొలగించమని అడిగారు. ఇది ఎంత అరాచకం? ఎంత అవమానకరం? గాల్వాన్ వ్యాలీని చైనాకు అప్పగిస్తున్నామా? మనం చైనాకు లొంగిపోతున్నామా? మీ అందరికీ ఇదే నా విజ్ఞప్తి. మీ అందరూ భారతీయన్స్ చిత్రానికి మద్దతు ఇవ్వాలని శంకర్ నాయుడు కోరారు. -
ఆ సినిమాపై సెన్సార్ అభ్యంతరం.. రాజీపడని నిర్మాత!
మన దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేందుకు విఫలయత్నాలు చేస్తూ, అనునిత్యం హేయమైన కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనా దురహంకారానికి వ్యతిరేకంగా తీసిన 'భారతీయన్స్' చిత్రానికి సినిమాకు సెన్సార్ పరంగా కలుగుతున్న అసౌకర్యంపై చిత్ర నిర్మాత, ప్రవాస భారతీయుడు డా.శంకర్ నాయుడు అడుసుమిల్లి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మాతృదేశంపై తన అభిమానం, మమకారంతో లాభాపేక్ష లేకుండా ఎంతో కష్టపడి నిర్మించిన 'భారతీయన్స్'కు సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేయడంలో జాప్యంపై శంకర్ నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నీరోజ్ పుచ్చా, సోనమ్ టెండప్, సుభా రంజన్ హీరోలుగా.. సమైరా సందు, రాజేశ్వరి చక్రవర్తి, పెడెన్ నాంగ్యాల్ హీరోయిన్లుగా నటించిన బహు భాషాచిత్రం 'భారతీయన్స్'. భారత్ అమెరికన్ క్రియేషన్స్ పతాకంపై ప్రవాస భారతీయుడు డాక్టర్ శంకర్ నాయుడు అడుసుమిల్లి భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ప్రముఖ రచయిత - ప్రేమకథా చిత్రాల స్పెషలిస్ట్ దీన్ రాజ్ ('ప్రేమించుకుందాం రా', 'కలిసుందాం రా' ఫేమ్) ఈ దేశభక్తి చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. భారత మాజీ ఉప రాష్ట్రపతి ఎమ్.వెంకయ్యనాయుడు, 'కశ్మీర్ ఫైల్స్' దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి లాంటి ప్రముఖులతోపాటు మాజీ సైనికాధికారుల ప్రశంసలు పొందిన 'భారతీయన్స్' చిత్రంలోని చైనా పేరుని, గల్వాన్ వ్యాలీ పేరును తొలగించాలని సెన్సార్ బోర్డ్ చేసిన సూచనతో తాను విభేదిస్తున్నానని, ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడనని నిర్మాత శంకర్ నాయుడు తేల్చి చెప్పారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీలోకి 22 సినిమాలు.. ఆ ఒక్కటి మాత్రం!) -
‘భారతీయన్స్’పై మాజీ సైనికాధికారులు ప్రశంసలు!
ప్రముఖ రచయిత, ప్రేమకథా చిత్రాల స్పెషలిష్ట్ దీన్ రాజ్ తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం ‘భారతీయన్స్’. నీరోజ్ పుచ్చా, సోనమ్ టెండప్, సుభా రంజన్, హీరోలుగా... సమైరా సందు, రాజేశ్వరి చక్రవర్తి, పెడెన్ నాంగ్యాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని భారత్ అమెరికన్ క్రియేషన్స్ పతాకంపై ప్రవాస భారతీయుడు డాక్టర్ శంకర్ నాయుడు అడుసుమిల్లి భారీ బడ్జెట్ తో అత్యంత నిర్మించారు. తాజాగా ఈ చిత్రాన్ని మాజీ సైనికాధికారుల కోసం ప్రసాద్ ల్యాబ్ ప్రివ్యూ థియేటర్ లో ప్రత్యేకంగా ప్రదర్శించారు. చైనా నీచ బుద్ధిని ఎండగడుతూ... రూపొందిన "భారతీయన్స్" చిత్రం సంచలన విజయం సాధించాలని వారు కోరుకున్నారు. దేశ రక్షణ కోసం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో తాము నిర్వర్తించిన విధులను ఈ సందర్భంగా గుర్తు చేసుకుని... మాజీ సైనికా దుకారులు ఉద్వేగానికి గురయ్యారు. నిర్మాత డాక్టర్ శంకర్ నాయుడు మాట్లాడుతూ... మన సైనికుల ప్రాణాలు బలి తీసుకుంటూ... మన దేశ సమగ్రతకు, సార్వభౌమత్వానికి భంగం కలిగించే నీచ చర్యలకు పాల్పుతున్న చైనా పేరును తొలగించమని సెన్సార్ వారు చెప్పడం తనకు ఆశ్చర్యం కలిగించిందని, ఈ విషయంలో ఎంత దూరం వెళ్ళడానికయినా తాను సిద్ధంగా ఉన్నామని అన్నారు. త్రివిధ దళాల్లో పనిచేసిన మన దేశ ముద్దుబిడ్డలైన సైనికాధికారులు "భారతీయన్స్" చిత్రం చూసి మెచ్చుకోవడం... తమకు ఎంతో గర్వంగా ఉందన్నారు దర్శకుడు దీన్ రాజ్. ఈ కార్యక్రమంలో ఈ చిత్ర సంగీత దర్శకుల్లో ఒకరైన కపిల్ కుమార్, హీరోల్లో ఒకరైన నీరోజ్ పుచ్చా ఫాదర్ రమణ మూర్తి, మాజీ సైనికాధికారులు శ్రీనేష్ కుమార్ నోరి, కెప్టెన్ సురేష్ రెడ్డి, రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వీడియో: ‘భారతీయన్స్’పై క్రికెటర్ ఏబీ.డివిలియర్స్ ప్రశంసలు
-
‘భారతీయన్స్’పై క్రికెటర్ ఏబీ.డివిలియర్స్ ప్రశంసలు
పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న దేశభక్తి చిత్రం ‘భారతీయన్స్’ టీజర్‌పై ప్రఖ్యాత దక్షిణాఫ్రికా క్రికెటర్ ఏబీ డివిలియర్స్ ప్రశంసల జల్లు కురిపించారు. హీరో నీరోజ్ పుచ్చా ఉజ్వల భవిష్యత్తు ఉందని డివిలియర్స్ పేర్కొన్నారు. కోట్లాది క్రికెట్ ప్రేమికుల ఆదరాభిమానాలు కలిగిన డివిలియర్స్ తన సినిమా టీజర్ ను మెచ్చుకోవడం, తనను అభినందించడం పట్ల నీరోజ్ పుచ్చా ఉబ్బితబ్బిబ్బు అవుతున్నారు. జీవితాంతం డివిలియర్స్ ను గుర్తుంచుకుంటానని, ఆయన గర్వపడే స్థాయికి చేరుకోవడానికి కృషి చేస్తానని నీరోజ్ పేర్కొన్నారు. (చదవండి: కాల్పుల్లో అభిమాని మృతి.. సూర్య భావోద్వేగ లేఖ) నీరోజ్ పుచ్చా, సోనమ్ టెండప్, సుభా రంజన్ హీరోలుగా... సమైరా సందు, రాజేశ్వరి చక్రవర్తి, పెడెన్ నాంగ్యాల్ హీరోయిన్లుగా నటించిన బహు భాషా చిత్రం 'భారతీయన్స్'. భారత్ అమెరికన్ క్రియేషన్స్ పతాకంపై ప్రవాస భారతీయుడు డాక్టర్ శంకర్ నాయుడు అడుసుమిల్లి భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ప్రముఖ రచయిత - ప్రేమకథా చిత్రాల స్పెషలిస్ట్ దీన్ రాజ్ ఈ దేశభక్తి చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. -
‘భారతీయన్స్’ టీజర్ బాగుంది: సురేశ్ బాబు
ప్రముఖ రచయిత, ప్రేమకథా చిత్రాల స్పెషలిష్ట్ (ప్రేమించుకుందాం రా, కలిసుందాం రా ఫేమ్) దీన్ రాజ్ తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం ‘భారతీయన్స్’. నీరోజ్ పుచ్చా, సోనమ్ టెండప్, సుభా రంజన్, హీరోలుగా... సమైరా సందు, రాజేశ్వరి చక్రవర్తి, పెడెన్ నాంగ్యాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని భారత్ అమెరికన్ క్రియేషన్స్ పతాకంపై ప్రవాస భారతీయుడు డాక్టర్ శంకర్ నాయుడు అడుసుమిల్లి భారీ బడ్జెట్ తో అత్యంత నిర్మించారు. (చదవండి: యంగ్ హీరోతో కలిసి స్టెప్పులేసిన నిహారిక.. వీడియో వైరల్) తాజాగా ఈ చిత్రం టీజర్‌ని ప్రముఖ నిర్మాత డి. సురేశ్ బాబు రిలీజ్ చేసి, చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. తమ సంస్థకు "ప్రేమించుకుందాం రా, కలిసుందాం రా" వంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దీన్ రాజ్ దర్శకుడిగా పరిచయమవుతున్న "భారతీయన్స్" బిగ్గెస్ట్ బ్లస్టర్ కావాలని ఆకాంక్షించారు. (చదవండి: ఈ వారం ఓటీటీలో అలరించే సినిమాలివే!) దర్శకుడు దీనరాజ్ మాట్లాడుతూ ''దేశభక్తి సినిమాతో దర్శకుడిగా పరిచయం కావాలని ఈ కథ రాశా. మా నిర్మాతకు కూడా దేశభక్తి ఎక్కువ. కథ నచ్చి సినిమా ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వచ్చారు. ప్రతి ఒక్కరిలో దేశభక్తిని పెంపొందించే చిత్రమిది. భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి ప్రశంసలు అందుకున్న మా చిత్రం టీజర్ ను సురేష్ బాబు రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది'అని అన్నారు. హీరో నీరోజ్ మాట్లాడుతూ ''హీరోగా నాకు ఫస్ట్ సినిమా ఇది. అవకాశం ఇచ్చిన నిర్మాత శంకర్ గారికి, దర్శకులు దీన్ రాజ్ గారికి థాంక్స్'' అని అన్నారు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాకు సత్య కశ్యప్ & కపిల్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.