
పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న దేశభక్తి చిత్రం ‘భారతీయన్స్’ టీజర్‌పై ప్రఖ్యాత దక్షిణాఫ్రికా క్రికెటర్ ఏబీ డివిలియర్స్ ప్రశంసల జల్లు కురిపించారు. హీరో నీరోజ్ పుచ్చా ఉజ్వల భవిష్యత్తు ఉందని డివిలియర్స్ పేర్కొన్నారు. కోట్లాది క్రికెట్ ప్రేమికుల ఆదరాభిమానాలు కలిగిన డివిలియర్స్ తన సినిమా టీజర్ ను మెచ్చుకోవడం, తనను అభినందించడం పట్ల నీరోజ్ పుచ్చా ఉబ్బితబ్బిబ్బు అవుతున్నారు. జీవితాంతం డివిలియర్స్ ను గుర్తుంచుకుంటానని, ఆయన గర్వపడే స్థాయికి చేరుకోవడానికి కృషి చేస్తానని నీరోజ్ పేర్కొన్నారు.
(చదవండి: కాల్పుల్లో అభిమాని మృతి.. సూర్య భావోద్వేగ లేఖ)
నీరోజ్ పుచ్చా, సోనమ్ టెండప్, సుభా రంజన్ హీరోలుగా... సమైరా సందు, రాజేశ్వరి చక్రవర్తి, పెడెన్ నాంగ్యాల్ హీరోయిన్లుగా నటించిన బహు భాషా చిత్రం 'భారతీయన్స్'. భారత్ అమెరికన్ క్రియేషన్స్ పతాకంపై ప్రవాస భారతీయుడు డాక్టర్ శంకర్ నాయుడు అడుసుమిల్లి భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ప్రముఖ రచయిత - ప్రేమకథా చిత్రాల స్పెషలిస్ట్ దీన్ రాజ్ ఈ దేశభక్తి చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment