న్యూఢిల్లీ: రక్షణ శాఖలో ‘ఒకే ర్యాంకు ఒకే పెన్షన్(ఓఆర్‌ఓపీ)’ అమలు చేయాలన్న డిమాండ్‌తో ఉద్యమిస్తున్న మాజీ సైనికులు తమ ఆందోళనను మరింత తీవ్రం చేయాలని నిర్ణయించారు. ఈ నెల 24 నుంచి నిరవధిక నిరాహార దీక్షకు దిగనున్నట్టు ‘యునెటైడ్ ఫ్రంట్ ఆఫ్ ఎక్స్ సర్వీస్‌మెన్ మూవ్‌మెంట్’ మీడియా సలహాదారు కల్నల్(రిటైర్డ్) అనిల్ కౌల్ తెలిపారు.
మాజీ జవాన్లు డిమాండ్ చేస్తున్న ఓఆర్‌ఓపీని ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదించిందని పంద్రాగస్టున ప్రధాని చెప్పినప్పటికీ.. దీనిని ఎప్పటినుంచి అమలు చేసేది పేర్కొనకపోవడం వారిని నిరాశకు గురిచేసింది.
24 నుంచి నిరశన దీక్ష: మాజీ సైనికులు
Published Mon, Aug 17 2015 10:27 AM | Last Updated on Sun, Sep 3 2017 7:37 AM
Advertisement
Advertisement