
ఢిల్లీ : పెన్షన్ల జాప్యంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ పథకం అమలు చేయకపోవడపై కేంద్రంపై సీరియస్ అయ్యింది.
భారత సైన్యంలో రీటైర్డ్ రెగ్యులర్ కెప్టెన్‌లకు చెల్లించే కేంద్రం నిర్ణయం తీసుకోకపోవడంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వన్‌ర్యాంక్ వన్ పెన్షన్ చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని, ఈ ప్రక్రియలో ఏళ్ల తరబడి జాప్యం చేస్తోందని మండిపడింది.
ఈ క్రమంలో కేంద్రానికి రెండు లక్షలు జరిమానా విధించింది. ప్రభుత్వానికి చివరి అవకాశం ఇచ్చిన సుప్రీం కోర్టు నవంబర్ 14లోగా సమస్యను పరిష్కరించాలని ఆదేశించింది. లేదంటే పెన్షన్ పెంపుపై తామే ఆదేశాలు ఇవ్వాల్సి వస్తుందని హెచ్చరించింది సుప్రీం కోర్టు. పెన్షన్ విషయంలో దాఖలైన పిటిషన్లను జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఆర్ మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.
Comments
Please login to add a commentAdd a comment