
షిమ్లా: వన్ ర్యాంక్ వన్ పెన్షన్ (ఓఆర్‌ఓపీ)పై నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ‘ఓన్లీ రాహుల్ ఓన్లీ ప్రియాంక ’అని వ్యంగ్యంగా అర్థం చెప్పగా, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా ‘దేశం ప్రస్తుతం ఓడొమోస్ (ఓవర్ డోస్ ఆఫ్ ఓన్లీ మోదీ ఓన్లీ షా)తో ఇక్కట్లు పడుతోంది’అని అన్నారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ (ఓఆర్‌ఓపీ)కి కాంగ్రెస్ అర్థం మార్చేసిందని, ఓఆర్‌ఓపీ అంటే వారి దృష్టిలో ’ఓన్లీ రాహుల్, ఓన్లీ ప్రియాంక’ అని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వ్యంగ్యంగా అన్నారు. 70 ఏళ్లుగా ఏ ప్రభుత్వం కూడా సైనికులను పట్టించుకోలేదని, మోదీ ప్రభుత్వం వచ్చాకనే మాజీ సైనికులకు నిజాయితీగా వన్ ర్యాంక్ వన్ పెన్షన్ స్కీమ్ అమలు చేసిందని ఆయన తెలిపారు. ‘ దశాబ్దాలుగా అధికారంలో ఉండి మీరప్పుడు పేదరికం గురించి ఎందుకు పట్టించుకోలేదు. బీజేపీ తీసుకుంటున్న విప్లవాత్మక చర్యలు, పథకాల ద్వారానే దేశంలో పేదరికం తగ్గుతోంది’అని షా వ్యాఖ్యానించారు.
రాహుల్ జోకరేగా: ప్రియాంక గాంధీని ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ ట్రంప్ కార్డుగా వ్యవహరిస్తున్నారని, మరి ఇన్నిరోజులు జోకర్‌గా రాహుల్ వ్యవహరించారా అని మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సరోజ్ పాండే అన్నారు. తూర్పు ఉత్తరప్రదేశ్ కు ప్రియాంకా గాంధీని పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించడంపై కాంగ్రెస్ నేత ఆజాద్ ప్రియాంకను కాంగ్రెస్ ట్రంప్ కార్డుగా వ్యవహరించిన విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment