రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి ఆత్మహత్య | Retired Soldier Allegedly Commits Suicide Over One Rank One Pension | Sakshi
Sakshi News home page

Published Wed, Nov 2 2016 12:08 PM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM

హర్యానాకు చెందిన ఓ రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి జంతర్ మంతర్ వద్ద ఆత్మహత్య చేసుకుని మృతిచెందాడు. మాజీ సైనికుల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన వన్ ర్యాంకు వన్ పెన్షన్ విధానం ఆలస్యం కావడంపై తమ గోడును వెల్లబుచ్చుకోవడానికి రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్తో భేటీ కావడం కుదరకపోవడంతో మనస్తాపం చెందిన సుబేదార్ రామ్ కిషన్ గ్రెవాల్ ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే మనోహర్ పారికర్ను కలిసేందుకు ఎలాంటి అభ్యర్థనను తాము రక్షకుడిని నుంచి స్వీకరించలేదని మంత్రి సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈ ఆర్మీ ఉద్యోగి వన్ ర్యాంకు వన్ పెన్షన్లో మార్పులు డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో కూడా పాలుపంచుకున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement