
వయసు పై బడడం అంటే కలల దారులు మూసివేయడం కాదు. గంభీర ఏకాంతవాసం కాదు. క్షణక్షణం ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవడం. ‘వయసు పై బడింది’ అని ఎప్పుడూ భారంగా అనుకోలేదు ఈ మహిళలు. ‘ఈ వయసులో ఆటలేమిటీ!’ అనే నిట్టూర్పు వారి నోటి నుంచి ఎప్పుడూ వినిపించలేదు. వెటరన్ అథ్లెట్స్‌లో సత్తా చాటుతూ నిత్యోత్సాహానికి నిలువెత్తు చిరునామాగా నిలుస్తున్నారు...
ఇటీవల గుంటూరులో ఏపీ మాస్టర్ అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన 6వ ఏపి మాస్టర్స్ అథ్లెటిక్ చాంపియన్‌షిప్‌లో... రేస్ వాక్ విభాగంలో బంగారు పతకాన్ని గెలుచుకున్న శిరీషారెడ్డి, షాట్‌పుట్, జావెలిన్ థ్రో, జంప్స్‌లో మూడు బంగారు పతకాలు గెలుచుకున్న ఎం.లక్ష్మి, పరుగులో మూడు బంగారు పతకాలు సాధించిన వి. విజయ... ఆత్మవిశ్వాసం, నిత్యోత్సాహం మూర్తీభవించిన మహిళలు.
గుంటూరుకు చెందిన విజయకు పదిహేనేళ్ల క్రితం భర్త చనిపోయాడు. ఇద్దరు కుమార్తెలలో ఒకరు దివ్యాంగురాలు. ఇళ్లలో పనిచేస్తూ, ఇంటి ముందు టిఫిన్ బండి పెట్టుకొని కుటుంబాన్ని పోషిస్తోంది. కొన్ని సంవత్సరాల క్రితం తాను పనిచేసే ఇంటి యజమాని కుమార్తె కోసం మైదానంలో అడుగుపెట్టింది. ఒక జిమ్ ట్రైనర్ సూచన ప్రకారం వెటరన్ అథ్లెటిక్స్ కోసం సాధనప్రారంభించింది. పతకాలు సాధించడం ఇప్పుడామెకు పరిన్టిగా మారింది.
క్యాన్సర్ బారిన పడినప్పుడు ‘ఇక నా పని అయిపోయింది’ అని నిరాశలోకి వెళ్లిపోలేదు శిరీష. ఆ మనోధైర్యానికి కారణం...క్రీడాస్ఫూర్తి. నెల్లూరు చెందిన 71 ఏళ్ల శిరీషా రెడ్డికి ఆటల్లో గెలవడం వల్ల వచ్చినవి పతకాలు మాత్రమే కాదు. అంతకంటే విలువైన ఆత్మవిశ్వాసం తాలూకు శక్తులు!
విశాఖపట్టణానికి చెందిన 86 ఏళ్ల లక్ష్మి వయసు న్తికేళ్ల దగ్గరే ఆగిపోవడానికి కారణం ఆటలు! ‘ఆటలు ఆనందాన్నే కాదు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయి’ అంటున్న లక్ష్మి ఆరోగ్య రహస్యం... క్రమశిక్షణ. ఆ ఉక్కు క్రమశిక్షణకు మూలం... ఆటలు.
‘విరమణ అనేది ఉద్యోగానికే. ఆటలకు కాదు’ అంటున్న నెల్లూరు జిల్లా కావలికి చెందిన 76 సంవత్సరాల కోటేశ్వరమ్మ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు గెలుచుకుంటోంది.
వెటరన్ అంటే మాటలు కాదు... గెలుపు దారిలో విరామం లేకుండా ఉత్సాహమే శక్తిగా పరుగులు తీయడమే అని చెప్పడానికి ఈ వెటరన్ అథ్లెట్లు తిరుగులేని ఉదాహరణ.
– మురమళ్ళ శ్రీనివాసరావు,
సాక్షి, గుంటూరు
– కె.ఎస్., సాక్షి, కావలి, నెల్లూరు జిల్లా
క్యాన్సర్ నుంచి బయటపడి...
గత 35 ఏళ్ళ నుండి క్రీడాసాధన చేస్తున్నాను. 2011లో క్యాన్సర్ సోకింది. కొంత కాలం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాను. మొండి ధైర్యంతో దానిని సులభంగా జయించాను. 2021లో కాలు ఫ్రాక్చర్ అయ్యింది. ఆటలు ఆడడం కష్టమయ్యింది. అయినా వెనకడుగు వేయలేదు. ఏడు పదుల వయసులో ఎన్నో జాతీయ స్థాయి పతకాలు సాధించాను.
– ఎల్. శిరీషా రెడ్డి, నెల్లూరు
కష్టాల్లోనూ నవ్వడం నేర్చుకున్నా
ఆరు పదుల వయసు దాటినా కష్టాలు మాత్రం వెన్నంటే ఉంటున్నాయి. అందుకే అవి చుట్టుముట్టినప్పుడల్లా నవ్వుతోనే ఎదుర్కొంటాను. ఆ నవ్వుకు కారణం ఆటలు. పదకొండు అంతర్జాతీయ వెటరన్స్ పోటీల్లో మూడు బంగారు పతకాలతో సహా మొత్తం పదకొండు పతకాలు సాధించాను. గుంటూరులో జరిగిన పోటీల్లో మూడు బంగారు పతకాలు సాధించాను. ఊపిరి ఉన్నంత వరకు పోటీల్లో పాల్గొంటాను.
– వి.విజయ, గుంటూరు
86 = ఎనర్జిటిక్
ఉదయించే సూర్యుడు అస్తమించే వరకు తన విధి నిర్వర్తిస్తాడు. పుట్టుకకు, మర ణానికి మధ్యలో ఉండే జీవితాన్ని సంతోషంగా, ఆరోగ్యంగా నడిపించాలనేది నా సిద్ధాంతం. నేను పూర్తి శాకాహారిని. ఎక్కడ పోటీలున్నా ఒంటరిగానే వెళతాను. క్రమశిక్షణకుప్రాణం ఇస్తాను.
– ఎం.లక్ష్మి, 86, విశాఖపట్నం
కావాలి... ఇలాంటి శక్తి
అంతర్జాతీయ వెటరన్ క్రీడాకారిణిగా రాణిస్తున్న నెల్లూరు జిల్లా కావలి పట్టణానికి చెందిన ఏనుగుల కోటేశ్వరమ్మ వయస్సు 76 ఏళ్లు. అయినా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అసమాన క్రీడా నైపుణ్యాన్ని ఆమె ప్రదర్శిస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్రస్థాయిలో 125, జాతీయ స్థాయిలో 115, అంతర్జాతీయ స్థాయిలో 17 పతకాలు సాధించింది. కావలిలోని జవహర్ భారతి కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్‌గా విధులు నిర్వహించింది. పదవీ విరమణ చేసినప్పటికీ ఆటలపై ఆసక్తితో పలు జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో న్ల్గొంటూ విజేతగా నిలుస్తోంది. లక్షల రూన్యలు ఖర్చు అయ్యే అంతర్జాతీయ క్రీడా పోటీల్లో న్ల్గొనడానికి తనకు వచ్చే పింఛన్ నగదును దాచుకొని వాటితో క్రీడాపోటీల్లో న్ల్గొంటోంది.
ఆటలే ఆరోగ్యం... మహాభాగ్యం
సింగపూర్, మలేసియా, ఆస్ట్రేలియా, శ్రీలంక, జన్న్ లలో బంగారు పతకాలు సాధించినప్పటికీ, స్వీడన్ లో సాధించిన కాంస్య పతకం సంతోషాన్ని ఇచ్చింది. ఒలింపిక్స్‌లో న్ల్గొన్న క్రీడాకారులతో పోటీపడి అన్నిరకాల ప్రీ పోటీల్లో విజేతగా నిలవడంతో చివరి పోటీల్లో న్ల్గొనే అర్హత రావడమే చాలా గొప్ప విషయం. రోజూ గ్రౌండ్‌లోప్రాక్టీస్ చేస్తూనే ఉంటా. అందువల్లనే ఆరోగ్య సమస్యలు లేకుండా హుషారుగా ఉంటాను.
– ఏనుగుల కోటేశ్వరమ్మ
Comments
Please login to add a commentAdd a comment