రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి వ్యక్తి
గోర్డాన్ గ్రెన్‌లే హంట్ అనే వ్యక్తి 104వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. అతనికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. ఈ ఏజ్‌లో కూడా తన పనులు తాను చేసుకుంటాడు. అతను రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి వ్యక్తి. ఆ టైంలో ఆక్స్‌ఫర్డ్‌లోని కార్ల తయారీ సంస్థ బ్రిటిష్ లైలాండ్ రాయల్ ఎలక్ట్రిక్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్‌లో పనిచేసేవాడు. అతనికి విపరీతమైన ఆకలి ఉందని, అయినా సమతుల్యమైన ఆహారం తీసుకుని జిహ్వ చాపల్యాన్ని అదుపులో ఉంచుకుంటానని చెబుతున్నాడు.
ప్రతిరోజు తాను ఇంట్లో చేసిన అల్పహారాన్నే తీసుకుంటానని చెబుతున్నాడు. ఎక్కువ ఫ్రూట్ సలాడ్ తీసుకుంటానని, తరుచుగా సాల్మన్ చేపలు, చిప్స్ తీసుకుంటానని అన్నారు. అంతేగాదు అతడి శరీరంలో కొలస్ట్రాల్ స్థాయిలు కూడా నార్మల్‌గానే ఉన్నాయి. అతడి రెండో భార్య 2019లో మరణించడంతో డోర్సెట్‌లోని లార్క్సెలీస్ రెంట్ హోమ్‌లో నివశిస్తున్నాడు. తన తండ్రి దీర్ఘాయువుకి తిండిపై ఉన్న ఇష్టం, శ్రద్ధేనని కొడుకు ఫిలిప్స్ చెబుతున్నాడు.
తన తండ్రి గుర్రం మాదిరిగా వేగంగా తింటాడు, డైట్ దగ్గరక వచ్చేటప్పటికీ చాలా స్ట్రిట్‌గా ఉంటాడని అన్నారు. అతను తన వయసు గురించి చాలా గర్వంగా ఫీలవ్వుతుంటాడని చెబుతున్నాడు. ఆ వృద్ధుడి సుదీర్ఘ జీవితానికి కొలస్ట్రాల్ స్థాయిలు ఎలా తోడ్పడయ్యన్నది సవివరంగా చూద్దాం.
కొలస్ట్రాల్ స్థాయిలు జీవితకాలాన్ని ఎలా ప్రభావితం చేస్తాయంటే..
కొలస్ట్రాల స్థాయిని అదుపులో ఉంచుకోవడం వల్ల సుదీర్ఘకాలం ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు. అధిక కొలస్ట్రాల్ స్థాయిలు గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. అంతేగాదు పరిశోధనల్లో వారానికి రెండు భాగాలు సాల్మాన్ చేపలు తీసుకోవడం వల్ల అధిక కొలస్ట్రాల్‌ను అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది.
సాల్మన్ చాలా పోషకాలను కలిగి ఉన్న ఆహారాల్లో ఒకటి. ప్రతి వంద గ్రాముల సాల్మన్‌లో 25 గ్రాముల ప్రోటీన్, 11 గ్రాముల కొవ్వు, ఒమేగా 3 ప్యాటీ యాసిడ్, విటమిన్ బీ12, సెలీనియం, నియాసిన్, పాంతోతేనిక్ ఆమ్లం, థియామిన్, ఫోలిక్ యాసిడ్, పోటాషియం, ఫాస్ఫరస్ తదితరాలు ఉంటాయి. అలాగే శాకాహారులకు కొలస్ట్రాల్‌ని అదుపులో ఉంచుకునేందుకు తీసుకోవాల్సినవి..
నట్స్: బాదం, వాల్‌నట్ వంటి కొన్ని గింజలలో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు, ఫైబర్, ప్లాంట్ స్టెరాల్స్ అధికంగా ఉంటాయి. ఇవి ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.
అవకాడోలు: మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు సమృద్ధిగా ఉన్న అవకాడోలు ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.
చిక్కుళ్ళు: బీన్స్, కాయధాన్యాలు, చిక్‌పీస్ వంటి కొన్ని చిక్కుళ్ళు దానిలోని ఫైబర్లు కొలస్ట్రాల్‌ని కరిగించి జీర్ణవ్యవస్థను మెరుగ్గా ఉంచుతాయి.
(చదవండి: ఆ వ్యాధులకు తప్పుదారి పట్టించే ఆ ఫుడ్ ప్రకటనలే కారణం!)
Comments
Please login to add a commentAdd a comment