long life
-
సుదీర్ఘకాలం జీవించాలంటే..ఈ అలవాట్లు ఉండాలంటున్న పరిశోధకులు!
వందేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని మన పెద్దవాళ్లు ఆశీర్వదిస్తుంటారు. నేటి ఉరుకులు పరుగుల జీవన విధానంలో సక్రమమైన జీవనశైలి అనుసరించక ఆయుర్దాయం పడిపోతుంది. జస్ట్ యాభైకే అనేక వ్యాధుల బారినపడి 60 ఏళ్ల వరకు బతికి బట్టగట్టగలగడం గగనంగా ఉంది. అయితే కొందరూ మాత్రం వయసు పరంగా సెంచరీ దాటి మరీ ఆరోగ్యంగా జీవించడం విశేషం. అలా మనం అన్నేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలంటే ఈ అలవాట్లను తమ జీవన విధానంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో సవివరంగా చూద్దాం..!.వందేళ్లు జీవించిన వృద్ధులు విజయవంతమైన వృద్ధాప్యానికి ఉదాహరణగా నిలుస్తారు. అంతేగాదు వీళ్లు తరుచుగా దీర్ఘకాలికి వ్యాధుల బారిన పడటం అనేది తక్కువగా ఉంటుంది. పైగా 90లలో కూడా తమ పనులు తామే చేసుకుంటూ స్వతంత్రంగా జీవిస్తారు. అందుకు ప్రధాన కారణం జన్యుశాస్త్రమే అయినా, దీంతోపాటు 60% వారు అనుసరించే చక్కటి జీవనశైలి అని చెబుతున్నారు నిపుణులు. దీర్ఘాయువుపై 2000 సంవత్సరం నుంచి పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు 34 అధ్యయనాల్లో అందుకు గల కారణాల జాబితాను సవివరంగా తెలిపారు. వందేళ్ల ఆయువుకు దోహదం చేసిన ఆహారం, మందుల వాడకం గురించి కూడా ప్రస్తావించారు. అయితే ఆయా అధ్యయనాల్లో సుదీర్ఘ దీర్ఘాయువు కోసం కీలకమైన నాలుగు అలవాట్లను జీవనశైలిలో భాగం చేసుకోవాలని సూచించారు. అవేంటంటే..సంతులిత ఆహారం: వందేళ్లు హాయిగా జీవించాలంటే ఆహారంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండాలని చెబుతున్నారు. సుమారు 57 నుంచి 65% ప్రోటీన్, కొవ్వులు ఉంటాయి. ఆహారంలో ప్రధానంగా పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్లు, మెడిటేరియన్ డైట్, చేపలు, చిక్కుళ్లు, ఉంటాయి. ముఖ్యంగా ఉప్పు తక్కువ తీసుకోవడం అత్యంత ముఖ్యం అని చెబుతున్నారు. తక్కువ మందుల వాడకం: చాలా వరకు మందులు వాడకానికి దూరంగా ఉండేలా జీవనశైలి ఉండాలి. పూర్వం పెద్దవాళ్లు సహజసిద్ధమైన వాటితోనే చికిత్స పొందుతూ ఇంగ్లీష్ మందులకు దూరంగా ఉండేవారు. వాళ్లు రోగాల బారిన పడటం అరుదుగా ఉండేది. పైగా చాలా ఏళ్లు జీవించేవారని చెబుతున్నారు. అందువల్ల మందుల వాడకాన్ని వీలైనంతగా తగ్గించేలా మంచి ఆహారపు అలవాట్లు చేసుకోవాలని సూచిస్తున్నారు. మంచి నిద్ర: నాణ్యమైన నిద్ర అత్యంత అవసరం. రోజుకి ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోడం అనేది మొత్తం ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. ప్రకృతిలో జీవించడం: గ్రామాల్లో జీవించే వారిలో సుమారు 75% మంది సుదీర్ఘకాలం జీవిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇలా ప్రకృతిలో ఎక్కువగా గడపడం వల్ల ఒత్తిడి, దీర్ఘకాలికి వ్యాధుల బారిన పడటం తక్కువగా ఉంటుందని తెలిపారు పరిశోధకులు. వాస్తవానికి ఇవన్నీ వందేళ్లు జీవిస్తారని నిర్థారణ చేసి చెప్పలేకపోయిన ఒక వ్యక్తి ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచి ఆయుర్దాయం పెంచే అవకాశం ఉందని వెల్లడించారు పరిశోధకులు. (చదవండి: 'అరంగేట్రం' చేసిన తొలి నర్తకిగా 13 ఏళ్ల చైనా విద్యార్థిని రికార్డు..!) -
కొలెస్ట్రాల్ కంట్రోల్‌తో సెంచరీ కొట్టేశాడు! ఎలాగంటే..
గోర్డాన్ గ్రెన్లే హంట్ అనే వ్యక్తి 104వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. అతనికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. ఈ ఏజ్‌లో కూడా తన పనులు తాను చేసుకుంటాడు. అతను రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి వ్యక్తి. ఆ టైంలో ఆక్స్‌ఫర్డ్‌లోని కార్ల తయారీ సంస్థ బ్రిటిష్ లైలాండ్ రాయల్ ఎలక్ట్రిక్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్‌లో పనిచేసేవాడు. అతనికి విపరీతమైన ఆకలి ఉందని, అయినా సమతుల్యమైన ఆహారం తీసుకుని జిహ్వ చాపల్యాన్ని అదుపులో ఉంచుకుంటానని చెబుతున్నాడు. ప్రతిరోజు తాను ఇంట్లో చేసిన అల్పహారాన్నే తీసుకుంటానని చెబుతున్నాడు. ఎక్కువ ఫ్రూట్ సలాడ్ తీసుకుంటానని, తరుచుగా సాల్మన్ చేపలు, చిప్స్ తీసుకుంటానని అన్నారు. అంతేగాదు అతడి శరీరంలో కొలస్ట్రాల్ స్థాయిలు కూడా నార్మల్‌గానే ఉన్నాయి. అతడి రెండో భార్య 2019లో మరణించడంతో డోర్సెట్‌లోని లార్క్సెలీస్ రెంట్ హోమ్‌లో నివశిస్తున్నాడు. తన తండ్రి దీర్ఘాయువుకి తిండిపై ఉన్న ఇష్టం, శ్రద్ధేనని కొడుకు ఫిలిప్స్ చెబుతున్నాడు.తన తండ్రి గుర్రం మాదిరిగా వేగంగా తింటాడు, డైట్ దగ్గరక వచ్చేటప్పటికీ చాలా స్ట్రిట్‌గా ఉంటాడని అన్నారు. అతను తన వయసు గురించి చాలా గర్వంగా ఫీలవ్వుతుంటాడని చెబుతున్నాడు. ఆ వృద్ధుడి సుదీర్ఘ జీవితానికి కొలస్ట్రాల్ స్థాయిలు ఎలా తోడ్పడయ్యన్నది సవివరంగా చూద్దాం.కొలస్ట్రాల్ స్థాయిలు జీవితకాలాన్ని ఎలా ప్రభావితం చేస్తాయంటే..కొలస్ట్రాల స్థాయిని అదుపులో ఉంచుకోవడం వల్ల సుదీర్ఘకాలం ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు. అధిక కొలస్ట్రాల్ స్థాయిలు గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. అంతేగాదు పరిశోధనల్లో వారానికి రెండు భాగాలు సాల్మాన్ చేపలు తీసుకోవడం వల్ల అధిక కొలస్ట్రాల్‌ను అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. సాల్మన్ చాలా పోషకాలను కలిగి ఉన్న ఆహారాల్లో ఒకటి. ప్రతి వంద గ్రాముల సాల్మన్లో 25 గ్రాముల ప్రోటీన్, 11 గ్రాముల కొవ్వు, ఒమేగా 3 ప్యాటీ యాసిడ్, విటమిన్ బీ12, సెలీనియం, నియాసిన్, పాంతోతేనిక్ ఆమ్లం, థియామిన్, ఫోలిక్ యాసిడ్, పోటాషియం, ఫాస్ఫరస్ తదితరాలు ఉంటాయి. అలాగే శాకాహారులకు కొలస్ట్రాల్‌ని అదుపులో ఉంచుకునేందుకు తీసుకోవాల్సినవి..నట్స్: బాదం, వాల్నట్ వంటి కొన్ని గింజలలో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు, ఫైబర్, ప్లాంట్ స్టెరాల్స్ అధికంగా ఉంటాయి. ఇవి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.అవకాడోలు: మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు సమృద్ధిగా ఉన్న అవకాడోలు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.చిక్కుళ్ళు: బీన్స్, కాయధాన్యాలు, చిక్పీస్ వంటి కొన్ని చిక్కుళ్ళు దానిలోని ఫైబర్లు కొలస్ట్రాల్‌ని కరిగించి జీర్ణవ్యవస్థను మెరుగ్గా ఉంచుతాయి.(చదవండి: ఆ వ్యాధులకు తప్పుదారి పట్టించే ఆ ఫుడ్ ప్రకటనలే కారణం!) -
ఆ వ్యక్తుల హెల్త్ సీక్రెట్స్‌తో యూస్ ఉండదట!
మంచి ఆరోగ్యంగా ఫిట్‌గా ఉండే వారిని అడిగి మరీ హెల్త్ సీక్రెట్స్ తెలుసుకుంటాం. మనం కూడా వాటిని ఫాలో అయ్యే ప్రయత్నం చేస్తాం. సర్వసాధారణం. ఇలానే వందేళ్లకు పైగా జీవించిన వృద్ధుల వద్దకు వెళ్లి వారి ఆరోగ్య సలహలు తీసుకునే యత్నం చేస్తాం. ఇలా అస్సలు చేయడదట. ఎందుకంటే అందుకు చాలా కారణాలు ఉంటాయని, అందరికీ ఒకేలాంటి పరిస్థితులు ఎదరవ్వవని నిపుణులు అంటున్నారు. పైగా అర్థరహితమైన ప్రశ్నగా కొట్టిపారేస్తున్నారు. ఎందుకంటే..?సుదీర్ఘకాలం ఎలా జీవించారో తెలుసుకుని వారి నుంచి ఆరోగ్య సలహాలు తీసుకోవడం వంటి చేయకూడదు. దాని వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని నిపుణుల చెబుతున్నారు. పైగా దీన్ని సర్వైవర్‌షిప్ బయాస్‌గా చెబుతున్నారు. ఏంటీ సర్వైవర్‌షిప్ బయాస్ అంటే..రెండో ప్రపంచయుద్ధంలో మిత్రరాజ్యల నిపుణులు యుద్ధ నష్టాన్ని అంచనా వేసేందుకు తిరిగొచ్చిన యుద్ధ విమానాలను లెక్కించేది. మరీ తిరిగి రానీ విమానాల సంగతేంటన్నది ఆలోచించేవారు కాదు. ఈ డ్యామేజ్ అయిన విమానాకు రక్షణ కవచాలను ఏర్పాటు చేసి రంగంలోకి దింపేవారు. ఇది సరైయనది కాదని, తప్పుదారి పట్టించే గణన అని చెబతున్నారు. దీన్నే సర్వైవర్‌షిప్ బయాస్ అని పిలుస్తారు. కేవలం చుట్టూ ఉన్నవాటినే లెక్కించి, మనుగడ లేని వాటిని విస్మరించడాన్ని సర్వైవర్‌షిప్ బయాస్ అంటారు. అలాగే ఓ వందమంది సముహం తీసుకుందాం. వారంతా జీవితమంతా పొగతాగితే..వారిలో కొందరు ఊపిరితిత్తుల వ్యాధి లేదా గుండె జబ్బులతో ముందుగానే చనిపోతారు. ఒకరు లేదా ఇద్దరు మాత్రమే వాటన్నింటిని తప్పించుకుని సుదీర్ఘకాలం జీవిస్తారు. వారిని ఇంటర్యూస్తే..అతడు రోజు ఒక ప్యాకెట్ దమ్ము పీల్చడం అంటే అంగీస్తారా?. నిజానికి ఇది అందరి విషయంలోనే సరైయినది కాదు కదా. కష్టాలు ఎదురై విజయం సాధించిన నటులు లేదా వ్యాపారవేత్త విజయగాథలే వింటాం. అందుకోలేకపోయిన వాళ్ల సంగతి గురించి ఆలోచించం. ఎన్నడూ ప్రయత్నం చేయని వాళ్ల గురించి కూడా విని ఉండం. అందువల్ల ఓన్లీ విజయ పరంపరనే లెక్కలోకి తీసుకుని సక్సెస్ అనొద్దు మీగతా వాళ్లు కూడా అంతే కష్టపడవచ్చు అందుకోలేకపోవడానికి ఏదో కచ్చితమైన కారణాలు కూడా ఉంటాయి. అలాగే కొందరూ వృద్ధులు మంచి వ్యాయామాలతో 60లో కూడా మంచి ఫిట్‌గా ఆరోగ్యంగా ఉంటారు. మరికొందరూ భయానక వ్యాధుల బారిన పడినా కూడా సేఫ్‌గా బయటపడతారు. వీళ్లు కూడా సుదీర్ఘకాలం జీవించినా..ఆయా వ్యక్తుల్లా వృధాప్యంలో చురుకుగా ఉండకపోవచ్చు. ఇక్కడ వ్యక్తి మంచి ఆరోగ్యం వ్యాయామంతో ముడిపడి ఉన్నా..కొంరిలో అందుకు మరో కారణం కూడా ఉంటుందని అంటున్నారు నిపుణులు. దీనిపై ఇప్పటి వరకు సరైన స్పష్టత లేదని అంటున్నారు. మాములుగా సుదీర్ఘకాల జీవనానికి మంచి అలవాట్ల జాబితా చాలా ఉన్పప్పటికీ.. దీంతోపాటు సానుకూల దృక్పథం, మంచి సంబంధబాంధవ్యాలు వంటివి కూడా ఉంటాయని అంటున్నారు నిపుణులు.(చదవండి: మథర్స్ డే వెనకాల మనసును కథలించే కథ!) -
సుదీర్ఘమైన ఆరోగ్యకర జీవితానికి త్రీ సీక్రెట్స్ ఇవే!
చాలా మంది వృద్ధులు సుదీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించిన పలు ఘటనలను చూశాం. వాళ్లు అంతకాలం ఎలా జీవించారు. జీవితంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించి మరీ అంతకాలం ఎలా జీవించారని కూడా అనుకుంటాం. అందకు రహస్యలివే అంటూ.. ప్రముఖ పారిశ్రామిక వేత్త హర్ష్ గోయెంకా ఓ వీడియోని షేర్ చేశారు. ఆయన ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గ్ ఉంటూ మంచి మంచి వీడియోలను నెటిజన్లతో పంచుకుంటుంటారు. అలానే ఈసారి ఆరోగ్యగానికి సంబంధించిన వీడియోని షేర్ చేశారు. ఆ వీడియోలో ఓ డాక్టర్ సుదీర్ఘమైన ఆరోగ్యకర జీవిత రహాస్యలను వెల్లడించారు. ఆ వీడియోలో డాక్టర్ నిషిత్ చోక్సీ అనే వ్యక్తి 90 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసు గల రోగులతో సంభాషణ ద్వారా తాను తెలుసుకున్న విషయాలను గురించి చెప్పుకొచ్చారు. దాదాపు తన పేషంట్లలో చాలామంది సుదీర్ఘమైన ఆరోగ్యకర జీవితానికి సంతోషం, సంతృప్తి ప్రాముఖ్యతల గురించి నొక్కి చెప్పినట్లు తెలిపారు. వాళ్లందరూ చెప్పిన మరో కామన్ పాయింట్ వ్యాయామం అని అన్నారు. చక్కటి వ్యాయామం దీర్ఘాయువుని నిర్ణయిస్తుందని వారంతా చెప్పినట్లు తెలిపారు. తన పేషంట్లలో కొంతమంది వృద్ధులు కర్ర లేకుండా నడవగలరని, కొందరూ అసలు కళ్లద్దాలు ఉపయోగించకుండా పుస్తకాలు, పేపర్లు చదవగలరని చెప్పుకొచ్చారు. వారిలో చాలామంది తమ పనులను వారే స్వయంగా చేసుకుంటారు. అంతేగాదు చాలామంది మోతాదుకు మించి తిని ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటారని అన్నారు. ఓ వయసు వచ్చాక మితంగా తినాలని, అలాగే ఎక్కువ ఒత్తిడిగా ఉన్న సమయంలో మనం తీసుకునే ఆహారంలో తేడాలు ఉంటాయని కూడా చెప్పారన్నారు. "ఎందుకంటే.. ఒత్తిడిగా ఉంటే కొందరు తినరు, మరికొందరూ అతిగా తింటారు. ఇవి రెండూ కూడా ప్రమాదమే. పిడుగు వచ్చి మీద పడిపోయేంత సమస్య అయినా.. తాపీగా జరేది జరగక మానదు..నా చేతిలో ఏమిలేదు అనేది సత్యాన్ని గట్టిగా విశ్వసించాలి. అప్పుడూ ఎంతటి ఒత్తడి అయినా తట్టుకుంటారు, నిదానంగా తినేందుకు యత్నిస్తారు. అప్పుడు రక్తపోటు పెరగదు. కాబట్టి జీవితంలో సంతోషం, సంతృప్తికి ప్రాధాన్యత ఇస్తూ వీలైనంతలో వ్యాయామం చేయండి చాలు. ఈ మూడే సుదీర్ఘ కాలం ఆరోగ్యంగా జీవించడానికి కీలకమైనవని డాక్టర్ నిషిత్ అన్నారు. అందుకు సంబంధించిన వీడియోకి "సుదీర్ఘ జీవితానికి రహస్యాలు" అనే క్యాప్షన్‌ని జోడించి మరీ పోస్ట్ చేశారు హర్ష గోయెంకా. ఈ వీడియోని చూసిన నెటిజన్లు..ఆ వైద్యుడు చెప్పిన వాటితో ఏకీభవిస్తూ ఆరోగ్యమే అసలైన సంపద అంటూ పోస్టులు పెట్టారు. అలాగే మెదడు షార్ప్‌గా ఉండేలా పజిల్స్ లేదా కొత్త భాషను నేర్చుకునే ప్రయత్నాలు చేస్తుంటే కూడా ఆరోగ్యంగా ఉంటామని పోస్టుల్లో పేర్కొన్నారు. Simple secrets to long life… pic.twitter.com/nuVzuGGR2C — Harsh Goenka (@hvgoenka) March 27, 2024 (చదవండి: అందం కోసం పాము రక్తమా? ఎక్కడో తెలుసా!) -
ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు! ఆమె ఆరోగ్య రహస్యం ఇదే..!
ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా అమెరికాలో జన్మించిన స్పానిష్ మహిళ బ్రన్యాస్ మోరారే నిలిచింది. ఆమె ఇటీవలే తన 117వ పుట్టిన రోజుని జరుపుకుంది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్సు ప్రకారం..ఫ్రాన్స్‌కు చెందిన 118 ఏళ్ల లూసిల్ రాండన్ మరణం తర్వాత మోరారేనే 117 ఏళ్లు సుదీర్థకాలం జీవించిన మహిళగా రికార్డు సృష్టించింది. ఇక మోరారే తల్లిదండ్రులు యూఎస్‌కు వలస వచ్చిన ఒక ఏడాది తర్వాత మార్చి 04, 1907న కాలిఫోర్నియాలో శాన్ఫ్రాన్సిస్కోలో జన్మించారు. మళ్లీ ఎనిమిదేళ్లకు స్పెయిన్ తిరిగి వచ్చి అక్కడ కాటలోనియాలో స్థిరపడింది. గత 22 ఏళ్లుగా మోరారే ఆ ప్రాంతంలోనే ఒక నర్సింగ్ హోమ్ రెసిడ్ఎన్సియా శాంటా మారియా డెల్ తురాలో కాలం వెళ్లదీస్తోంది. ఈ వృద్ధురాలు ప్రపంచ యుద్ధాలు, స్పానిస్ అంతర్యుద్ధం, స్పానిష్ ఫ్లూ వంటి మహమ్మారీలన్నింటిని తట్టుకుంది. చివరిగా 2020లో కోవిడ్ -19తో పోరాడారు. ఆమె ఈ వైరస్ బారిన తన 113వ పుట్టిన రోజు జరుపుకున్న కొద్ది వారాలకే పడింది. అయినప్పటికి త్వరగా కోలుకోవడం విశేషం. ఇన్స్టాగ్రామ వేదికగా గిన్నస్ వరల్డ్ రికార్డ్స్ ఆ వృద్ధరాలికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపడమే గాక గత ఏడాది జనవరి 2023న ఆమె ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా ధృవీకరించిన విషయాన్ని పేర్కొంది. చింతించొద్దు, విచారించొద్దు.. మోరేరా తన ఆరోగ్య రహస్యంగా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ప్రశాంతంగా ఉండటం, కుటుంబం, స్నేహితులతో మంచి అనుబంధం, భావోద్వేగ స్థిరత్వం తదితర వాటివల్లే ఇంతలా ఆరోగ్యంగా సుదీర్ఘకాలం జీవించగలిగానని చెప్పుకొచ్చింది. అంతేగాదు ఎక్కువగా చింతించడం, విచారించడం మానేయాలని, విషపూరితమైన వ్యక్తులకు దూరంగా ఉండటం వంటివి చేస్తే ఆయురారోగ్యాలతో ఉండగలరని చెప్పుకొచ్చింది. ఇక ఆమె వ్యక్తిగత జీవితం దగ్గరకు వచ్చేసరికి మోరారే 1931లో కాటలాన్ వైద్యుడు జోన్ మోరెట్ను వివాహం చేసుకుంది. ఆమెకు ముగ్గురు పిల్లలు. ఆమె తన పెళ్లి రోజు చాలా సంఘటనలతో ముడిపడి ఉందని చెప్పింది. ఇక ఆమె భర్త 72 ఏళ్ల వయసులో చనిపోయారు. ప్రస్తుతం ఆమెకు ముగ్గురు పిల్లలు, 11 మంది మనవళ్లు, 13 మంది మనవరాళ్లు ఉన్నారు. సైంటిస్టులు ఏం అన్నారంటే.. మోరారేతో మాట్లాడిన సైంటిస్ట్ మానెల్ ఎస్టేల్లర్ మాట్లాడుతూ.."ఆమెను పరీక్షించగా పూర్తిగా స్పష్టమైన తల ఉంది. కేవలం నాలుగేళ్ల వయసులో జరిగిన సంఘటనలను సైతం గుర్తించుకుంటుంది. అలాగే వృద్ధులకు ఉండే సాధారణ హృదయ సంబంధ వ్యాధులు ఏమీ లేవు. ఆమె కుటుంబంలో 90 ఏళ్లు పైబడిన వాళ్లు చాలామంది ఉండటం విశేషం. ఇక్కడ జన్యుసంబంధ కారణమే అయ్యి ఉండొచ్చు. ఇక మోరారే మూత్రం, లాలాజలం, రక్తనమునాలు ఆమె 80 ఏళ్ల కుమార్తెతో సరిపోలుతాయి. ఆమె డీఎన్ఏ వయసు సంబంధిత వ్యాధులతో పోరాడగల ఔషధ సృష్టికి దోహదపడొచ్చు" అని ఎస్టేల్లర్ అన్నారు. (చదవండి: ప్రాణాంతక కేన్సర్‌తో పోరాడుతూ భావోద్వేగ పోస్ట్..'భర్తకు ప్రేమతో'..) -
ఇలా చేస్తే ఎక్కువకాలం బతికేయొచ్చు.. రీసెర్చ్‌లో వెల్లడైంది కూడా
మీరు ఎక్కువ కాలం జీవించాలనుకుంటున్నారా? అయితే, మీరు మీ జీవనశైలిలో కొన్ని సర్దుబాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే, ప్రపంచంలో ఎక్కువ కాలం జీవించే వ్యక్తులు ఆరోగ్యకరమైన తిండి, నిద్రవేళలను కచ్చితంగా కలిగి ఉంటారని అధ్యయనాలు చెబుతున్నాయి ►ఆరోగ్యకరమైన జీవనశైలికి మంచి నిద్ర ప్రణాళిక అవసరం. ప్రతిరోజూ ఒకే సమయంలో పడుకోవడం, మేల్కొనడం వంటి స్థిరమైన నిద్ర షెడ్యూల్‌ను పాటించడం మీకు ఎక్కువ కాలం జీవించడంలో ఉపకరిస్తుంది. అలాగని ఎప్పుడు పడితే అప్పుడు పడుకోవద్దు. ప్రతిరోజు ఒక షెడ్యూల్ ఫిక్స్ చేసుకుని అదే సమయంలో కచ్చితంగా నిద్రించాలి. అంతేకాదు, రోజూ ఒకే సమయంలో నిద్ర నుంచి మేలుకోవాలి. ► కొన్ని అధ్యయనాల ప్రకారం, దీర్ఘకాలం జీవించాలనుకుంటే, మీ మెదడు, శరీరాన్ని పునరుద్ధరించడానికి ప్రతి రాత్రి 8 గంటల నిద్ర అవసరం. తగినంత నిద్ర మీ మెదడు పనితీరు, రోగనిరోధక శక్తి, శక్తి స్థాయులను మెరుగుపరుస్తుంది. చెదిరిన లేదా కలత నిద్ర మీ మెదడు పనితీరును, ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ► విశ్రాంతి తీసుకోవడానికి సమయాన్ని వెచ్చించాలి. దీనివల్ల మీ మనస్సుకే కాదు, శరీరానికి కూడా రోజంతా హాయిగా ఉండేందుకు అవసరమైన విరామం లభిస్తుంది. మీరు దీన్ని ఎలా చేస్తారు? మీరు ఎక్కడ నివసిస్తున్నారనేది వ్యక్తి నుండి వ్యక్తికి మారుతూ ఉంటుంది. ► ప్రపంచంలోని చాలా మంది ప్రజలు మధ్యాహ్నం విశ్రాంతి తీసుకోవడం అలవాటు చేసుకుంటారు. వారు క్రమం తప్పకుండా నడవడం, పుస్తకం చదవడం, వెచ్చని చామంతి టీ తాగడం వంటివి చేస్తారు. ఆనందంగా ఉండటమే.. ఎక్కువ కాలం జీవించేందుకు కారణం. ► సుదీర్ఘ జీవితాన్ని గడపడంలో మీ ఆహారం కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా తినొద్దు. సరైన సమయంలో తగినంత తినడం శరీర బరువును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. మీరు అల్పాహారం, మధ్యాహ్న భోజనం మీకు నచ్చినట్లుగా తినవచ్చు. రాత్రి భోజనాన్ని మితంగా తీసుకోవచ్చు. ►కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కలిసి కబుర్లు చెప్పుకుంటూ సంతోషంగా భోజనం చేయడం వల్ల ఎక్కువ కాలం జీవించవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. -
COVID-19: ప్రతి 10 మందిలో ఒకరికి లాంగ్ కోవిడ్
వాషింగ్టన్: ఒమిక్రాన్ వేరియెంట్ తర్వాత కరోనా బాధితుల్లోని ప్రతీ 10 మందిలో ఒకరికి లాంగ్ కోవిడ్ బయటపడుతోందని అమెరికా అధ్యయనంలో వెల్లడైంది. కోవిడ్ సోకిన ప్రతీ పది మందిలో ఒకరు ఇప్పటికీ అనునిత్యం ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్టుగా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అధ్యయనం నివేదిక తెలిపింది. చిన్న పనికే అలిసిపోవడం, మెదడుపై ప్రభావం, తల తిరగడం, గ్యాస్ట్రిక్ సమస్యలు, గుండె దడ, సెక్స్‌పై అనాసక్తత, తరచూ దాహం వేయడం, రుచి, వాసన కోల్పోవడం, విపరీతమైన దగ్గు, ఛాతీలో నొప్పి వంటివన్నీ లాంగ్ కోవిడ్ ఉన్నవారిలో కనిపిస్తున్నాయని ఆ నివేదిక వివరించింది. -
మీరు ఎక్కువకాలం బతకాలనుకుంటున్నారా?
ఫిట్‌గా దృఢంగా ఉండి.. ఎక్కువకాలం జీవించాలనుకుంటున్నారా? అయితే, ఇందుకోసం కొంచెం ఒళ్లు వంచండి. జిమ్‌కు వెళ్లకపోయినా పర్వాలేదు. ఇంట్లోనే రోజూ క్రమంతప్పకుండా కసరత్తులు చేయండి అంటున్నారు శాస్త్రవేత్తలు. బస్కీలు (పుష్అప్స్), గుంజీలు (సిట్అప్స్) వంటి కసరత్తులను క్రమంతప్పకుండా చేసేవారు.. తమ జీవితకాలానికి మరికొన్నేళ్లు జోడించుకొని ఆయుష్షును పెంచుకోవచ్చునని తాజా అధ్యయనంలో వెల్లడైంది. శారీరక బలాన్ని పెంపొందించుకునేందుకు కసరత్తులు చేసేవారిలో అకాలపు మరణాలు సంభవించే అవకాశం 23శాతం తక్కువ అని, అదేవిధంగా క్యాన్సర్ సంబంధిత మరణాలు 31శాతం తగ్గే అవకాశముందని తాజా అధ్యయనంలో తేలింది. 'శారీరక బలాన్ని పెంపొందించుకొనే ఎక్సర్సైజ్లు.. సైక్లింగ్, జాగింగ్లాగా ఆరోగ్యానికి కీలకమైనవే కాకుండా క్యాన్సర్ మరణాల ముప్పును తగ్గించడంలో ఇవి అత్యంత ముఖ్యమైనవని మా అధ్యయనంలో తేలింది' అని సిడ్నీ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ ఎమాన్యుయేల్ స్టామటకిస్ తెలిపారు. మొత్తం 80,306మందిని రెండేళ్లపాటు పరిశీలించి.. వయస్సు, లింగభేదం, ఆరోగ్య పరిస్థితి, జీవనశైలి వంటి వాటి ఆధారంగా కొన్ని మార్పులు సూచించి.. ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న వారందరూ గుండె వ్యాధి లేదా క్యాన్సర్ సోకి ప్రారంభదశలో ఉన్నారు. ఈ పరిశోధన కాలంలో చనిపోయిన వారిని మినహాయించి మిగతావారిపై అధ్యయనం కొనసాగించారు. 'ప్రత్యేకమైన పరికరాలు ఏమీలేకుండా సొంతంగా చేసే శారీరక ఎక్సర్సైజ్లు.. జిమ్ ట్రైనింగ్ అంతటి ప్రభావాన్ని చూపిస్తాయి. కసరత్తులు అనేగానే.. ప్రజలు జిమ్‌కు వెళ్లి బరువులు ఎత్తాలని భావిస్తుంటారు. నిజానికి అది అవసరం లేదు. చాలామంది ఖర్చు కారణంగా, తమ పని సంస్కృతి కారణంగా జిమ్‌కు వెళ్లడానికి భయపడుతుంటారు. అలాంటి వారు ఇంట్లో లేదా పార్కులో పుష్అప్స్, సిట్అప్స్, ట్రైసెప్స్ డిప్స్ వంటివి చేయడం ద్వారా ఆరోగ్యాన్ని దృఢంగా పెంపొందించుకోవచ్చు' అని పరిశోధకులు తెలిపారు. ఈ వివరాలను అమెరికన్ జర్నల్ ఎపిడెమియాలజీలో ప్రచురించారు. -
వృద్ధాప్యం ఇక రానే రాదు!
సెనిసెంట్ కణాల తొలగింపుతో ఆయుష్షు, ఆరోగ్యం సొంతం! ఎలుకలపై జరిపిన ప్రయోగం సక్సెస్ బతికినన్ని రోజులూ ఎలాంటి రోగాలు లేకుండా ఆనందంగా గడవాలనేది దాదాపు ప్రతీ వ్యక్తి కోరిక. నేటి టెక్నాలజీ యుగంలో ప్రాణాంతకమైన వ్యాధులను సైతం సమర్థవంతంగా ఎదుర్కొనే స్థాయిలో వైద్యశాస్త్రం అభివృద్ధి చెందింది. కానీ చత్వారం, కీళ్లనొప్పులు, మతిమరుపు.. శరీర పటుత్వం తగ్గడం వంటి వృద్ధాప్య లక్షణాలు రాకుండా చేయలేకపోతున్నాం. వీటిని సైతం రూపుమాపి మనిషిని నిత్య యవ్వనుడిగా ఉంచేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో శాస్త్రవేత్తలు కీలకమైన విజయాలు సాధించారు. - సాక్షి, హైదరాబాద్ మన శరీరం వివిధ రకాల కణాలతో నిండి ఉంటుంది. ఒకటి రెండుగా... ఆ రెండు నాలుగుగా విభజితమై.. బహుకణాలుగా మారి అవయవాలు ఏర్పడ్డాయని మనకు తెలుసు. అయితే ఈ శరీర కణాలు మనం జీవించినంతకాలం విభజితం కావు. కొన్నాళ్లకు అలసిపోయి విభజన సాధ్యం కాదని ఆగిపోతాయి. ఒక కణం దాదాపు 60 సార్లు విభజితమవుతుందని ఓ అంచనా. విభజితం ఆగిపోయిన కణాలను సినసెన్స్ కణాలంటారు. వయసు పెరిగే కొద్దీ శరీరంలో ఈ కణాలూ పెరుగుతాయి. యుక్త వయసులో శరీర వ్యాధి నిరోధక వ్యవస్థ ఈ రకం కణాలను ఎప్పటికప్పుడు తొలగిస్తుంది. వృద్ధాప్యంలో వ్యాధి నిరోధక వ్యవస్థ మందగించడంతో వృథా కణాలు శరీరంలో పేరుకుపోతాయి. చర్మంలో పేరుకుపోయే కణాలు ముడుతలకు కారణమైతే... మిగిలిన కణజాలాలు, అవయవాల్లోనివి రకరకాల ఇన్ఫ్లమేషన్లకు కారణమవుతాయి. దీంతో రకరకాల సమస్యలు, వ్యాధులు చుట్టుముడతాయి. ఏదో ఒక మందును వాడి ఈ వృథా కణాలన్నింటినీ లేదా ఎక్కువవాటిని శరీరం నుంచి తొలగిస్తే....? ఎలుకల ఆయుష్షు పెరిగింది సెనిసెంట్ కణాలను శరీరం నుంచి తొలగించడం ద్వారా ఆయుష్షును పెంచవచ్చని మేయో క్లినిక్ శాస్త్రవేత్త వాన్ డ్యూరసెన్ తాజాగా నిరూపించారు. శరీరంలోని అన్ని రకాల కణాలను గుర్తించగలిగే విధం గా జన్యుమార్పిడి చేసిన ఎలుకలకు వారానికి రెండుసార్లు చొప్పున 6 నెలల పాటు ఒక రసాయనాన్ని ఎక్కించినప్పుడు వాటి ఆయుష్షు దాదాపు 25% పెరిగింది. వయసుతోపాటు వచ్చే మార్పుల వేగం గణనీయంగా తగ్గింది. సాధారణ ఎలుకలతో పోలిస్తే వీటి మూత్రపిండాలు, గుండె మెరుగ్గా పనిచేసినట్లు గుర్తించారు. ఈ కణాలు తగ్గిన ఎలుకలు ఎంతో చురుకుగా కని పించాయి. అయితే ఈ విధానం మనుషుల్లోనూ పనిచేస్తుందా? సాధ్యమే అంటున్నారు డ్యూరసెన్. ఈ కణాలను తొలగించేందుకు వాడే మందుల తయారీకి ఓ కంపెనీని ఏర్పాటు చేశారు. ఇతర మార్గాలూ ఉన్నాయ్.. ఆయుష్షు పెంచేందుకు సెనిసెంట్ కణాలను తొలగించడం ఒక్కటే మార్గం కాదు. కొన్ని రకాల జన్యువులను తొలగించడం ద్వారా, కేలరీలను తగ్గించడం ద్వారా ఆయుష్షు పెంచవచ్చు. ఈ పద్ధతులు మనుషులకు అంత ఆచరణయోగ్యం కాదని నార్త్ కారొలినా స్కూల్ ఆఫ్ మెడిసన్ జన్యుశాస్త్రవేత్త నెడ్ షార్ప్లెస్ చెప్పారు. ఈ కణాల తొలగింపు ద్వారా ఆయుష్షు పెంచడం ఇదే తొలిసారి అని అన్నారు. డ్యూరసెన్ కంపెనీ సెనిసెంట్ కణాలను సమర్థంగా తొలగించేందుకు తగిన విధానాన్ని, రసాయనాన్ని తయారు చేస్తే త్వరలో మంచి ఆరోగ్యంతో కష్టాల్లేని వృద్ధాప్యాన్ని అనుభవించవచ్చునేమో!