వందేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని మన పెద్దవాళ్లు ఆశీర్వదిస్తుంటారు. నేటి ఉరుకులు పరుగుల జీవన విధానంలో సక్రమమైన జీవనశైలి అనుసరించక ఆయుర్దాయం పడిపోతుంది. జస్ట్ యాభైకే అనేక వ్యాధుల బారినపడి 60 ఏళ్ల వరకు బతికి బట్టగట్టగలగడం గగనంగా ఉంది. అయితే కొందరూ మాత్రం వయసు పరంగా సెంచరీ దాటి మరీ ఆరోగ్యంగా జీవించడం విశేషం. అలా మనం అన్నేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలంటే ఈ అలవాట్లను తమ జీవన విధానంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో సవివరంగా చూద్దాం..!.
వందేళ్లు జీవించిన వృద్ధులు విజయవంతమైన వృద్ధాప్యానికి ఉదాహరణగా నిలుస్తారు. అంతేగాదు వీళ్లు తరుచుగా దీర్ఘకాలికి వ్యాధుల బారిన పడటం అనేది తక్కువగా ఉంటుంది. పైగా 90లలో కూడా తమ పనులు తామే చేసుకుంటూ స్వతంత్రంగా జీవిస్తారు. అందుకు ప్రధాన కారణం జన్యుశాస్త్రమే అయినా, దీంతోపాటు 60% వారు అనుసరించే చక్కటి జీవనశైలి అని చెబుతున్నారు నిపుణులు.
దీర్ఘాయువుపై 2000 సంవత్సరం నుంచి పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు 34 అధ్యయనాల్లో అందుకు గల కారణాల జాబితాను సవివరంగా తెలిపారు. వందేళ్ల ఆయువుకు దోహదం చేసిన ఆహారం, మందుల వాడకం గురించి కూడా ప్రస్తావించారు. అయితే ఆయా అధ్యయనాల్లో సుదీర్ఘ దీర్ఘాయువు కోసం కీలకమైన నాలుగు అలవాట్లను జీవనశైలిలో భాగం చేసుకోవాలని సూచించారు. అవేంటంటే..
సంతులిత ఆహారం: వందేళ్లు హాయిగా జీవించాలంటే ఆహారంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండాలని చెబుతున్నారు. సుమారు 57 నుంచి 65% ప్రోటీన్, కొవ్వులు ఉంటాయి. ఆహారంలో ప్రధానంగా పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్లు, మెడిటేరియన్ డైట్, చేపలు, చిక్కుళ్లు, ఉంటాయి. ముఖ్యంగా ఉప్పు తక్కువ తీసుకోవడం అత్యంత ముఖ్యం అని చెబుతున్నారు.
తక్కువ మందుల వాడకం: చాలా వరకు మందులు వాడకానికి దూరంగా ఉండేలా జీవనశైలి ఉండాలి. పూర్వం పెద్దవాళ్లు సహజసిద్ధమైన వాటితోనే చికిత్స పొందుతూ ఇంగ్లీష్ మందులకు దూరంగా ఉండేవారు. వాళ్లు రోగాల బారిన పడటం అరుదుగా ఉండేది. పైగా చాలా ఏళ్లు జీవించేవారని చెబుతున్నారు. అందువల్ల మందుల వాడకాన్ని వీలైనంతగా తగ్గించేలా మంచి ఆహారపు అలవాట్లు చేసుకోవాలని సూచిస్తున్నారు.
మంచి నిద్ర: నాణ్యమైన నిద్ర అత్యంత అవసరం. రోజుకి ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోడం అనేది మొత్తం ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది.
ప్రకృతిలో జీవించడం: గ్రామాల్లో జీవించే వారిలో సుమారు 75% మంది సుదీర్ఘకాలం జీవిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇలా ప్రకృతిలో ఎక్కువగా గడపడం వల్ల ఒత్తిడి, దీర్ఘకాలికి వ్యాధుల బారిన పడటం తక్కువగా ఉంటుందని తెలిపారు పరిశోధకులు.
వాస్తవానికి ఇవన్నీ వందేళ్లు జీవిస్తారని నిర్థారణ చేసి చెప్పలేకపోయిన ఒక వ్యక్తి ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచి ఆయుర్దాయం పెంచే అవకాశం ఉందని వెల్లడించారు పరిశోధకులు.
(చదవండి: 'అరంగేట్రం' చేసిన తొలి నర్తకిగా 13 ఏళ్ల చైనా విద్యార్థిని రికార్డు..!)
Comments
Please login to add a commentAdd a comment