మంచి ఆరోగ్యంగా ఫిట్‌గా ఉండే వారిని అడిగి మరీ హెల్త్ సీక్రెట్స్ తెలుసుకుంటాం. మనం కూడా వాటిని ఫాలో అయ్యే ప్రయత్నం చేస్తాం. సర్వసాధారణం. ఇలానే వందేళ్లకు పైగా జీవించిన వృద్ధుల వద్దకు వెళ్లి వారి ఆరోగ్య సలహలు తీసుకునే యత్నం చేస్తాం. ఇలా అస్సలు చేయడదట. ఎందుకంటే అందుకు చాలా కారణాలు ఉంటాయని, అందరికీ ఒకేలాంటి పరిస్థితులు ఎదరవ్వవని నిపుణులు అంటున్నారు. పైగా అర్థరహితమైన ప్రశ్నగా కొట్టిపారేస్తున్నారు.
ఎందుకంటే..?
సుదీర్ఘకాలం ఎలా జీవించారో తెలుసుకుని వారి నుంచి ఆరోగ్య సలహాలు తీసుకోవడం వంటి చేయకూడదు. దాని వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని నిపుణుల చెబుతున్నారు. పైగా దీన్ని సర్వైవర్‌షిప్ బయాస్‌గా చెబుతున్నారు. ఏంటీ సర్వైవర్‌షిప్ బయాస్ అంటే..రెండో ప్రపంచయుద్ధంలో మిత్రరాజ్యల నిపుణులు యుద్ధ నష్టాన్ని అంచనా వేసేందుకు తిరిగొచ్చిన యుద్ధ విమానాలను లెక్కించేది. మరీ తిరిగి రానీ విమానాల సంగతేంటన్నది ఆలోచించేవారు కాదు. ఈ డ్యామేజ్ అయిన విమానాకు రక్షణ కవచాలను ఏర్పాటు చేసి రంగంలోకి దింపేవారు. ఇది సరైయనది కాదని, తప్పుదారి పట్టించే గణన అని చెబతున్నారు.
దీన్నే సర్వైవర్‌షిప్ బయాస్ అని పిలుస్తారు. కేవలం చుట్టూ ఉన్నవాటినే లెక్కించి, మనుగడ లేని వాటిని విస్మరించడాన్ని సర్వైవర్‌షిప్ బయాస్ అంటారు. అలాగే ఓ వందమంది సముహం తీసుకుందాం. వారంతా జీవితమంతా పొగతాగితే..వారిలో కొందరు ఊపిరితిత్తుల వ్యాధి లేదా గుండె జబ్బులతో ముందుగానే చనిపోతారు. ఒకరు లేదా ఇద్దరు మాత్రమే వాటన్నింటిని తప్పించుకుని సుదీర్ఘకాలం జీవిస్తారు. వారిని ఇంటర్యూస్తే..అతడు రోజు ఒక ప్యాకెట్ దమ్ము పీల్చడం అంటే అంగీస్తారా?.
నిజానికి ఇది అందరి విషయంలోనే సరైయినది కాదు కదా. కష్టాలు ఎదురై విజయం సాధించిన నటులు లేదా వ్యాపారవేత్త విజయగాథలే వింటాం. అందుకోలేకపోయిన వాళ్ల సంగతి గురించి ఆలోచించం. ఎన్నడూ ప్రయత్నం చేయని వాళ్ల గురించి కూడా విని ఉండం. అందువల్ల ఓన్లీ విజయ పరంపరనే లెక్కలోకి తీసుకుని సక్సెస్ అనొద్దు మీగతా వాళ్లు కూడా అంతే కష్టపడవచ్చు అందుకోలేకపోవడానికి ఏదో కచ్చితమైన కారణాలు కూడా ఉంటాయి. అలాగే కొందరూ వృద్ధులు మంచి వ్యాయామాలతో 60లో కూడా మంచి ఫిట్‌గా ఆరోగ్యంగా ఉంటారు.
మరికొందరూ భయానక వ్యాధుల బారిన పడినా కూడా సేఫ్‌గా బయటపడతారు. వీళ్లు కూడా సుదీర్ఘకాలం జీవించినా..ఆయా వ్యక్తుల్లా వృధాప్యంలో చురుకుగా ఉండకపోవచ్చు. ఇక్కడ వ్యక్తి మంచి ఆరోగ్యం వ్యాయామంతో ముడిపడి ఉన్నా..కొంరిలో అందుకు మరో కారణం కూడా ఉంటుందని అంటున్నారు నిపుణులు. దీనిపై ఇప్పటి వరకు సరైన స్పష్టత లేదని అంటున్నారు. మాములుగా సుదీర్ఘకాల జీవనానికి మంచి అలవాట్ల జాబితా చాలా ఉన్పప్పటికీ.. దీంతోపాటు సానుకూల దృక్పథం, మంచి సంబంధబాంధవ్యాలు వంటివి కూడా ఉంటాయని అంటున్నారు నిపుణులు.
(చదవండి: మథర్స్ డే వెనకాల మనసును కథలించే కథ!)
Comments
Please login to add a commentAdd a comment