లడఖ్: లడఖ్‌కు చెందిన బీజేపీ సీనియర్ నేత నజీర్ అహ్మద్(74) కుమారుడు నెలరోజుల క్రితం ఒక బౌద్ధ మహిళను ప్రేమించి ఆమెతో కలిసి ఉడాయించాడు. దీంతో ఆగ్రహించిన స్థానిక బీజేపీ పార్టీ పెద్దలు ఆయనను పార్టీ నుంచి బహిష్కరించారు.
అచ్చం 'దేశముదురు' సినిమా కథను తలపిస్తూ లడఖ్ బీజేపీ వైస్ ప్రెసిడెంట్ నజీర్ అహ్మద్ తనయుడు మంజూర్ అహ్మద్(39) ఓ బౌద్ధ యువతిని ప్రేమించాడు. తల్లిదండ్రులను ఎదిరించి మరీ పెళ్లాడాడు. వివాహానికి నజీర్ కుటుంబమంతా వ్యతిరేకమే అయినప్పటికీ బీజేపీ పార్టీ మాత్రం ఈ మతాంతర వివాహంలో ఆయన పాత్ర ఉందని ఆరోపిస్తూ ఆయన ప్రాధమిక పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేసింది. ఈ మేరకు లడఖ్ బీజేపీ పార్టీ చీఫ్ ఫంచోక్ స్టాంచిన్ బుధవారం నిర్వహించిన పార్టీ సమావేశంలో సస్పెన్షన్ ఆర్డర్ జారీ చేశారు.
పార్టీ బహిష్కరణ తర్వాత నజీర్ అహ్మద్ మాట్లాడుతూ.. నా కుమారుడికి ఆ బౌద్ధ యువతికి 2011లోనే నిఖా జరిగి ఉంటుంది. గతనెల వారు మళ్ళీ కోర్టు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి నాకు గానీ నా కుటుంబ సభ్యులకు గానీ ఎవ్వరికీ ఇష్టం లేదు. వారి పెళ్లి జరిగినప్పుడు నేను ఇక్కడ లేను. హాజ్ యాత్రకు వెళ్లాను. తిరిగొచ్చాక విషయం తెలిసినప్పటి నుండి వాడి కోసం గాలిస్తూనే ఉన్నాను. శ్రీనగర్ తదితర ప్రాంతాలన్నీ వెతికాను. ఎక్కడా వారి ఆచూకీ దొరకలేదు. నా కొడుకు పెళ్ళికి నన్నెందుకు నిందిస్తున్నారో నాకైతే అర్ధం కాలేదని వాపోయారు.
ఇది కూడా చదవండి: చెంపదెబ్బకి అదుపుతప్పి రైల్వే ట్రాక్‌పై పడ్డాడు.. తర్వాత..
Comments
Please login to add a commentAdd a comment