Buddhist
-
14వ దలై లామా (బౌద్ధ గురువు) రాయని డైరీ
‘‘ఎలా ఉన్నారు?’’ అనే ప్రశ్నకు సమాధానం ఆ ప్రశ్న వేయటం వెనుక ఉన్నది పలకరింపా, పరామర్శా, ఆందోళనా లేక ఆరా తీయటమా అనే దానిని బట్టి మారుతూ ఉండవచ్చు. అయితే ఒక బౌద్ధ గురువు ఇలాంటి ఒక దైహికమైన ప్రశ్న ఎదుర్కొన్నప్పుడు ఆ గురువు ఇచ్చే సమాధానం... ప్రశ్న వేయటానికి వెనుక ఉన్న ఉద్దేశంతో నిమిత్తం లేకుండా సర్వకాల సర్వావస్థల్లో ఒకేలా ఉండాలి. అంటే... ఆయన ధర్మశాల పట్టణంలోని తన హిమాలయ నివాసంలో ఉన్నా, న్యూయార్క్‌లోని మోకాళ్ల శస్త్ర చికిత్సా కేంద్రంలో ఉన్నా సమాధానం మారకూడదు. అది కూడా, ‘‘నాకేం! నిక్షేపంగా ఉన్నాను’’ అని కాకుండా, ‘‘నీకేం! నిశ్చింతగా ఉండు’’ అని... భరోసా ఇచ్చేలా ఆ సమాధానం ఉండాలి. బౌద్ధాచార్యులైన ఒక దలై లామా ఎంతటి వృద్ధాప్యంలోనైనా ‘గుంభనం’గా ఉన్నప్పుడే ఆయన భక్తులు, అనుచరులు, పాలకులు ఆయన అంతిమ శ్వాసను గురించిన ఆలోచనలు చేయకుండా ఉంటారు.జూన్‌లో శస్త్ర చికిత్స జరిగాక నా మోకాలి కదలికలు కాస్త మెరుగుపడ్డాయి. నలుగురు కలిసి నడిపిస్తే నడవ గలుగుతున్నాను. ఇద్దరు కలిసి కూర్చోబెడితే కూర్చోగలుగుతున్నాను.ప్రపంచానికైతే నాకసలు చికిత్స జరిగింది కుడి కాలికా, ఎడమ కాలికా అన్న సంగతే తెలియదు. అదే ‘గుంభనత్వం’ అంటే! ఎవరికీ, ఏదీ తెలియనివ్వకపోవటం! ముఖ్యంగా మన ఆరోగ్యం గురించి! దర్శనాలకు సమయమౌతుండగా మిస్ డోల్మా త్సెరింగ్ తేఖాంగ్ వచ్చి, ‘‘ఎలా ఉన్నారు ఆచార్యా?’’ అని నన్ను పరామర్శించారు! ఆమె అలా మంద్రస్థాయిలో ఇటీవల కొంతకాలంగా నన్ను పరామర్శిస్తూ వస్తున్నారు!‘‘ఎందుకు మీరలా పదే పదే సందేహిస్తున్నారు మిస్ తేఖాంగ్?’’ అన్నాను. ధర్మశాలలోని ప్రవాస టిబెటన్ ప్రభుత్వ పార్లమెంటు డిప్యూటీ స్పీకర్ ఆమె.వచ్చే ఏడాది జూలై 6కు నాకు 90 ఏళ్లు నిండుతాయన్న ఆలోచన... ఆరామంలోని అందరితో పాటుగా మిస్ తేఖాంగ్నూ హృదయ శూన్యతకు గురిచేస్తోందా?! లేక, మునుపటి దలైలామా 57 ఏళ్లకే పరమపదించటం వల్ల, అది ఊహించుకుని ఆమె కలత చెందుతున్నారా?!‘‘ఇప్పటిలా వారానికి మూడుసార్లు కాకుండా, వారానికి ఒకసారి మాత్రమే సందర్శకులను అనుమతించటం వల్ల మీకు మరికాస్త విశ్రాంతి దొరుకుతుందని సిక్యోంగ్ పెన్పా త్సెరిన్ తలపోస్తున్నారు ఆచార్యా’’ అన్నారు తేఖాంగ్. సిక్యోంగ్ పెన్పా త్సెరిన్... ప్రవాస టిబెటన్ ప్రభుత్వ ప్రధాని. ‘‘వృద్ధాప్యంలో విశ్రాంతి అవసరమే మిస్ తేఖాంగ్. కానీ కలలకు వృద్ధాప్యం ఉంటుందా?! నా కల ప్రకారం నేను 110 సంవత్సరాలు జీవించబోతానని మునుపు నేను చెప్పిన మాటనే ఇప్పుడూ చెబుతున్నాను. మీరూ, మీ ప్రధానే నా కలపై విశ్వాసం లేక చింతాక్రాంతులై ఉన్నట్లున్నారు. నేనెలా ఉన్నాను అనే దానికన్నా, నా తర్వాత ఎవరున్నారు అన్నదే మీఆందోళనగా నాకు కనిపిస్తోంది’’ అన్నాను చిరునవ్వుతో. తేఖాంగ్ కలవరంగా చూశారు. ‘‘ఆచార్యా... మేము కేవలం సామాన్యులం.మీ జ్ఞానాన్ని అర్థం చేసుకోలేము. అందువల్లనే మీరేమైనా చెబుతారేమోనని ఎదురుచూస్తున్నాం...’’ అన్నారు మిస్ తేఖాంగ్! నాకర్థమైంది. వారు నా పునర్జన్మ కోసం చూస్తున్నారు! 15వ దలైలామా ఆగమనం కోసం నిరీక్షిస్తున్నారు. కానీ వారికి అర్థం కానిది ఏమిటంటే – మరణించాక మాత్రమే పునర్జన్మ ఉండదనీ, కర్తవ్య నిర్వహణ కాంక్ష అన్నది ఒకే జన్మలో అనేక పునర్జన్మల్ని ప్రసాదిస్తుందనీ!‘‘నా దగ్గరింకా 20 హ్యాపీ న్యూ ఇయర్లుమీ అందరి కోసం మిగిలే ఉన్నాయి మిస్ తేఖాంగ్. ధీమాగా ఉండండి...’’ అని ఆమెతో నవ్వుతూ చెప్పాను. -
బొజ్జన్న కొండపై భౌద్ధ భిక్షవుల ధ్యానం
-
కొడుకు చేసిన పనికి తండ్రికి శిక్ష.. పార్టీ సభ్యత్వం రద్దు..
లడఖ్: లడఖ్‌కు చెందిన బీజేపీ సీనియర్ నేత నజీర్ అహ్మద్(74) కుమారుడు నెలరోజుల క్రితం ఒక బౌద్ధ మహిళను ప్రేమించి ఆమెతో కలిసి ఉడాయించాడు. దీంతో ఆగ్రహించిన స్థానిక బీజేపీ పార్టీ పెద్దలు ఆయనను పార్టీ నుంచి బహిష్కరించారు. అచ్చం 'దేశముదురు' సినిమా కథను తలపిస్తూ లడఖ్ బీజేపీ వైస్ ప్రెసిడెంట్ నజీర్ అహ్మద్ తనయుడు మంజూర్ అహ్మద్(39) ఓ బౌద్ధ యువతిని ప్రేమించాడు. తల్లిదండ్రులను ఎదిరించి మరీ పెళ్లాడాడు. వివాహానికి నజీర్ కుటుంబమంతా వ్యతిరేకమే అయినప్పటికీ బీజేపీ పార్టీ మాత్రం ఈ మతాంతర వివాహంలో ఆయన పాత్ర ఉందని ఆరోపిస్తూ ఆయన ప్రాధమిక పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేసింది. ఈ మేరకు లడఖ్ బీజేపీ పార్టీ చీఫ్ ఫంచోక్ స్టాంచిన్ బుధవారం నిర్వహించిన పార్టీ సమావేశంలో సస్పెన్షన్ ఆర్డర్ జారీ చేశారు. పార్టీ బహిష్కరణ తర్వాత నజీర్ అహ్మద్ మాట్లాడుతూ.. నా కుమారుడికి ఆ బౌద్ధ యువతికి 2011లోనే నిఖా జరిగి ఉంటుంది. గతనెల వారు మళ్ళీ కోర్టు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి నాకు గానీ నా కుటుంబ సభ్యులకు గానీ ఎవ్వరికీ ఇష్టం లేదు. వారి పెళ్లి జరిగినప్పుడు నేను ఇక్కడ లేను. హాజ్ యాత్రకు వెళ్లాను. తిరిగొచ్చాక విషయం తెలిసినప్పటి నుండి వాడి కోసం గాలిస్తూనే ఉన్నాను. శ్రీనగర్ తదితర ప్రాంతాలన్నీ వెతికాను. ఎక్కడా వారి ఆచూకీ దొరకలేదు. నా కొడుకు పెళ్ళికి నన్నెందుకు నిందిస్తున్నారో నాకైతే అర్ధం కాలేదని వాపోయారు. ఇది కూడా చదవండి: చెంపదెబ్బకి అదుపుతప్పి రైల్వే ట్రాక్‌పై పడ్డాడు.. తర్వాత.. -
కట్టుకథలు, అర్ధ సత్యాలు మాత్రమే!
అక్టోబర్ 21న మల్లెపల్లి లక్ష్మయ్య రాసిన ‘ఆ ప్రతిజ్ఞలే మార్గదర్శకాలు’ వ్యాసానికి ఇది స్పందన. గత అరవై ఏళ్లుగా నియోబుద్ధిస్ట్ లాబీ, అంబేడ్కర్‌వాదులూ అంబేడ్కర్ గురించి కట్టుకథలు, అర్ధసత్యాలు సృష్టించడంలో విజయం సాధించారు. అరుణ్ శౌరి (వర్షిపింగ్ ఫాల్స్ గాడ్స్) తప్ప ఎవరూ అంబేడ్కర్‌కు సంబంధించిన నిజానిజాలను వెలికితీసే విషయంలో ధైర్యం చేయలేకపోయారు. అంబేడ్కర్ ప్రతి మాటనూ అంబేడ్కర్‌వాదులూ, నియోబుద్ధిస్టులూ గుడ్డిగా సమర్థిస్తారు. అంబేడ్కర్‌పై చిన్న విమర్శను కూడా వారు సహించలేరు. వారికి మాత్రం హిందూ మతంపైనా, హిందూ దేవుళ్లపైనా విమర్శలు చేసే వాక్ స్వాతంత్య్రం ఉంది. అంబేడ్కర్ స్వయంగా తన రచనల్లో హిందూ మతం పైనా, బ్రాహ్మణులపైనా తన ద్వేషాన్ని వెళ్లగక్కారు. 1956 అక్టోబర్ 14న అమాయక హిందువులను బౌద్ధ మతంలోకి మారుస్తూ దీక్ష ఇచ్చిన సమయంలో చేయించిన 22 ప్రతిజ్ఞల్లోనూ ఇదే విద్వేషం కనిపిస్తుంది. ఆరోజు అక్కడ చేరినవారందరూ తాము బౌద్ధంలోకి మారుతున్నామనే అనుకున్నారు. బౌద్ధంలో ఈ 22 ప్రతిజ్ఞలు లేవని వారెవరికీ తెలియదు. నిజానికి అంబేడ్కర్ బౌద్ధమతంలోకి మార్చే పేరుతో ఆయనే ఓ సొంత మతాన్ని ఆవిష్కరించారు. – డాక్టర్ పి. కృష్ణమోహన్ రెడ్డి అసోసియేట్ ప్రొఫెసర్, ఎస్వీయూ -
ఆ దేవాలయంలో బుద్ధుడికి వైన్‌ని నైవేద్యంగా ఎందుకు పెడతారంటే......
ఆ దేవాలయంలో బుద్ధుడికి వైన్‌ని నైవేద్యంగా పెడతారు. పైగా ఆ దేవాలయం పేరుతో వైన్‌ని విక్రయిస్తారట కూడా. ఇదేం వింత అనుకుంటున్నారా? అక్కడ వైన్‌ని తయారు చేయడం అనేది మంచి పనిగా భావిస్తారు అక్కడి ప్రజలు. వివరాల్లోకెళ్తే...జపాన్‌లో కొండపై చెట్లతో కూడిన ఒక బౌద్ధ దేవాలయం ఉంది. అక్కడ బుద్ధుడికి ప్రజలు వైన్‌ని నైవేద్యంగా పెడతారు. ద్రాక్ష పండ్ల ఉత్పత్తికి పేరుగాంచిన ఆ ప్రాంతంలోని బౌద్ధ దేవాలయాన్ని ద్రాక్ష దేవాలయంగా పిలుచుకుంటారు అక్కడి ప్రజలు. ఐతే అధికారికంగా మాత్రం ఆ దేవాలయాన్ని డైజెంజీగా వ్యవహరిస్తారు. ఈ దేవాలయం టోక్యోకి సుమారు 100 కి.మీ దూరంలో ఉన్న యమనాషి ప్రాంతంలో ఉంది. బౌద్ధ సన్యాసులు మామాలుగా బౌద్ధ దేవాలయాల వద్ద సేవ చేస్తుంటారు. కానీ ఇక్కడ అందుకు విరుద్ధం. వారు వైన్‌ని తయారు చేసి అందిస్తుంటారు. ఆ దేవాలయాని ప్రధాన సన్యాసి వైన్యార్డ్ కో ఆపరేటివ్(వైన్ తయారీ కంపెనీకి) గౌరవాధ్యక్షుడు. పురాణల ప్రకారం ప్రసిద్ధ బౌద్ధ సన్యాసి, గ్యోకీ అనే యాత్రికుడు జపనీస్ భాషల యకుషిన్యోరైగా అని పిలిచే ఔషధ బుద్ధుడిని కలలో కలుసుకున్నాడని చెబుతారు. అతను చేతిలో ఒక ద్రాక్ష గుత్తిని పట్టుకుని ఉన్నాడని, యమనాషి నివాసితులకు ఔషధ ప్రయోజనాల కోసం వైన్‌ని ఎలా తయారు చేయాలో నేర్పించినట్లుగా కథకథలుగా చెబుతున్నారు. మరోక కథనం ప్రకారం రైతు కగేయు ద్రాక్ష సాగును అదే ప్రాంతంలో మొదటిసారిగా ప్రారంభించాడని అందువల్ల వైన్‌ని సమర్పిస్తారని కొందరు చెబుతున్నారు. అయితే ఇక్కడ పెంచే ద్రాక్షలు చైనాకు సంబంధించిన హైబ్రేడ్ ద్రాక్ష పండ్ల డీఎన్ఏతో పోలి ఉంటుంది. చైనా నుంచి ద్రాక్ష విత్తనాలను తీసుకువచ్చి ఇక్కడ ద్రాక్ష తోటలని పెంచారా? లేక ముందు నుంచి ఇక్కడ ఈ ద్రాక్ష సాగు ఉందా? అనేది ఒక సందేహాస్పదంగా ఉంది. ఈ ఆలయం వద్ద పెంచుతున్న ద్రాక్ష తోటల నుంచే వైన్‌ని తయారు చేసి నైవేద్యంగా పెడుతుంటారు. అంతేగాదు దేవాలయం పేరు మీద ఆ వైన్‌ని విక్రయిస్తారు కూడా. అక్కడి ప్రజలు ద్రాక్ష తోటలను పండించి వైన్‌ని తయారు చేయడాన్ని చాలా మంచి పనిగా విశ్వసిస్తారు. (చదవండి: అరుదైన సంగీత శస్త్ర చికిత్స: బ్యాండు మేళం వాయిస్తుంటే.. సర్జరీ చేసేశారు) -
బౌద్ధ గురు థిక్ నాక్ హాన్ మృతి
హనోయ్: ప్రముఖ బౌద్ధ గురువు, జెన్ సన్యాసి థిక్ నాక్ హాన్ 95 సంవత్సరాల వయసులో శనివారం మరణించారు. పశ్చిమ దేశాల్లో జెన్, బౌద్ధిజంను వ్యాపింపజేయడంలో ఆయన కృషి గణనీయం. థిక్ నాక్ హాన్ మృతికి ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. వియత్నాంలోని టు హైయు పగోడాలో ఆయన చివరి శ్వాస విడిచారు. 1926లో జన్మించిన థిక్ నాక్ హాన్ 16ఏళ్ల వయసులో సన్యాసం స్వీకరించారు. 1961లో ఆయన అమెరికా పర్యటనకు వెళ్లారు. 1966లో మార్జిన్ లూథర్ కింగ్ (జూ)తో పలు విషయాలపై చర్చలు జరిపారు. వియత్నాం అంతర్యుద్ధం నివారణకు ఆయన చేసిన కృషిని గుర్తించిన మార్టిన్, థిక్‌నాక్ పేరును నోబెల్ శాంతి బహుమతికి సిఫార్సు చేశారు. ఆ సమయంలో ఆయన తిరిగి వియత్నాం రాకుండా నిషేధం కూడా విధించారు. దీంతో ఫ్రాన్స్‌లో నిర్మించిన ప్లమ్ విలేజ్‌లో ఆయన ఎక్కువకాలం గడిపారు. జెన్ బుద్ధిజం ముఖ్యాంశాలను ఆయన విరివిగా ప్రచారం చేశారు. 2014లో ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. 2018లో ఆయన వియత్నాంకు వచ్చి చివరి వరకు అక్కడే కాలం గడిపారు. కరేజ్ ఆఫ్ కన్సైస్ (1991), పసెమ్ ఇన్ టెర్రిస్ పీస్ అండ్ ఫ్రీడం(2015) అవార్డులు ఆయన్ను వరించాయి. 2017లో ఎడ్యుకేషన్ యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్ ఆయనకు గౌరవ డాక్టరేట్ ఇచ్చింది. ఆయన చరిత్ర ఆధారంగా ద సీక్రెట్ ఆఫ్ 5 పవర్స్ అనే నవల కూడా వచ్చింది. స్వయంగా ఆయన కొన్ని చిత్రాల్లో, డాక్యుమెంటరీల్లో కనిపించారు. ఆయన మరణం తనను బాధిస్తోందని బౌద్ధ గురు దలైలామా విచారం వ్యక్తం చేశారు. -
శివాలయంలో బౌద్ధ సంతాన దేవత విగ్రహం
సాక్షి, హైదరాబాద్: బౌద్ధంలో సంతాన దేవతగా పేర్కొనే హారీతి శిల్పాన్ని యాదాద్రి భువనగిరి జిల్లా కొలనుపాక సమీపంలో దక్షిణ కాశీగా అభివర్ణించే రాఘవాపురం శివాలయంలో గుర్తించారు. 8 లేదా 9వ శతాబ్దం నాటిదని భావిస్తున్న ఈ విగ్రహాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధకులు శ్రీరామోజు హరగోపాల్, ఎల్లేటి చంటి, రవి గుర్తించారు. జైనం, బౌద్ధం, హైందవంలో ప్రత్యేకంగా సంతాన దేవతలను అర్చించే విధానం ఉంది. దీంతో విగ్రహం లక్షణాల ఆధారంగా చరిత్ర పరిశోధకులు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి, బద్దెల రామచంద్రారెడ్డి, డాక్టర్ స్మితారెడ్డి, టి.మహేశ్ తదితరులతో సంప్రదించి బౌద్ధ సంతాన దేవత హారీతిగా గుర్తించినట్టు హరగోపాల్ వెల్లడించారు. చదవండి: Yadagirigutta: బలిపీఠానికి బంగారు తొడుగు పాకిస్థాన్‌లోని లాహోర్, అజంతా రెండో గుహ, ఒడిశాలోని లలితానగర్‌లో వెలుగు చూసిన హారీతి విగ్రహాలతో ఇది సరిపోలి ఉందని వెల్లడించారు. తలపై కిరీటం లేకుండా పెద్ద సిగ, మెడలో ముత్యాలహారం ఉన్నాయన్నారు. దేవత కుడి తొడమీద శిశువును కూర్చోబెట్టుకున్నట్టు ఉందని, ఎడమ చేతిలో మూలిక లాంటిది కనిపిస్తోందని పేర్కొన్నారు. జైనం రాకముందు 9వ శతాబ్దం దాకా బౌద్ధ నిర్మాణాలుండేవని తెలుస్తోందన్నారు. ఈ విగ్రహం వెలుగు చూసిన నేపథ్యంలో రాఘవాపురంలో హారీతిదేవికి ఆలయం ఉండేదని తెలుస్తోందని వివరించారు. ఆలయంలో ఇటీవల కొత్తగా అన్నపూర్ణాదేవి విగ్రహాన్ని ప్రతిష్టించినట్టు వెల్లడించారు. చదవండి: తెలంగాణలో కొత్తగా 12 ఒమిక్రాన్ కేసులు -
చరిత్రకు ఆనవాళ్లు.. అబ్బురపరుస్తున్న కళాఖండాలు
చుంచుపల్లి: సంప్రదాయాలకు చిహ్నాలు.. పురాతన బౌద్ద సంస్కృతులు, వారి జీవన విధానాలు.. కళాత్మకమైన కట్టడాలే కాకుండా అపురూప శిల్పాలను చెక్కడంలో వారికి వారే సాటి లాంటి బౌద్దుల నైపుణ్య సృష్టికి ఆనవాళ్లుగా నిలిచాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం కారుకొండ గుట్టలు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేలకొండపల్లి తరువాత కొత్తగూడెం కారుకొండపై 1860లో బౌద్దులు చెక్కిన అపురూప శిల్ప సంపద నేటికీ చెక్కు చెదరలేదు. వివరాల్లోకి వెళితే.. భారత పర్యటనకు వచ్చిన టిబెట్ బౌద్ద బిక్షువులు బౌద్ద మతాన్ని ప్రచారంలో భాగంగా మధ్యమధ్యలో ధ్యానం చేసుకునేవారు. దానికి వీలుగా కొన్ని గుహలను ఏర్పరుచుకొని ఆ ప్రాంతాల్లో అపురూప కళాఖండాలను తీర్చిదిద్దేవారు. ఆ నేపధ్యంలోనే కొత్తగూడెం కారుకొండ గుట్టపైకి పర్యటనకు వచ్చిన బౌద్దులు ప్రత్యేక గుహలను ఏర్పాటు చేసుకున్నారు. ఆ విధంగా ఏర్పాటు చేసుకున్న గుహల్లోనే 30 నుంచి 40 రోజుల వరకు ధ్యానంలో గడిపేవారని ఇక్కడ చరిత్ర ఆనవాళ్ళు చెపుతున్నాయి. ఆ గుట్టపైన ఉన్న పెద్ద పెద్ద బండరాళ్లపై బౌద్ద శిల్పాలు చెక్కినట్లు చరిత్ర చెపుతోంది. ఒకే బండరాయిపై బుద్దుడు పద్మాసనంలో కూర్చుని ద్యానం చేస్తున్న ప్రతిమలు ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. అలనాటి బౌద్దులు చెక్కిన అపురూప శిల్పాలను చూసెందుకు చుట్టుపక్కల గ్రామస్తులు గుట్టపైకి వెళ్తుంటారు. కొన్ని దశాబ్దాలుగా వీటిని పట్టించుకోకపోవడంతో అక్కడి శిల్పాలు శిధిలావçస్థకు చేరుకోవటంతో 1986లో ప్రముఖులు, గ్రామస్తులు వీటి విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం 2016లో బౌద్ద గుహల వ్యవహారాలను పురావస్తు శాఖకు అప్పగించింది. పురావస్తు శాఖాధికారులు కారుకొండ గుట్ట చుట్టూ ఇనుప వైరింగ్ ప్రహరీని ఏర్పాటు చేసి గుహలకు కొంత భద్రతను కల్పించారు. ప్రభుత్వం,పురావస్తుశాఖ కారుకొండ బౌద్ద గుహల విషయంలో ప్రత్యేక దృష్టి సారిస్తే మరింత ప్రాచుర్యంలోకి వచ్చే వీలుంది. -
మూగజీవాల రక్షకుడు.. 8వేల కుక్కలను కాపాడిన భిక్షువు..
ఈయన పేరు హి జియాంగ్. చైనా షాంఘై నగరంలోని పురాతన బౌద్ధ మఠంలో ప్రధాన భిక్షువు. అంతే కాదు.. చైనాలో మూగజీవాలకు ఈయన దేవుడు. ఆయన చేతుల్లో ఉన్న కుక్కపిల్ల రోడ్డుపై దొరికినదే. దానిని సంరక్షించి, అమెరికాలోని ఓ వ్యక్తికి దత్తత ఇచ్చారు. ఆయనే స్వయంగా ఎయిర్‌పోర్టుకు వచ్చి దానిని సాగనంపారు. ఆ సందర్భంగా ఆయన కన్నీరు పెట్టుకున్నారు. జంతువులంటే ఆయనకి అంత ప్రీతి. 51 ఏళ్ల జియాంగ్ చైనాలోని వేలాది మూగ జీవాలకు సంరక్షకుడు. ఇందుకోసం తన మఠంలోనే మూగ జీవాల సంరక్షణాలయం కూడా ఏర్పాటు చేశారు. అక్కడ వివిధ రకాల జంతువులను, పక్షులను, వీధి శునకాలు వేలాదిగా ఉన్నాయి. శునకాలే 8 వేలు ఉన్నాయి. ఆయనే స్వయంగా వాటి ఆలనా పాలనా చూసుకుంటున్నారు. ఒక్కోసారి పశువైద్యుడి అవతారం ఎత్తి ఆ మూగ జీవాలకు వ్యాక్సిన్లు కూడా వేస్తుంటారు. ఇన్ని వేల మూగజీవాలను సంరక్షించడం ప్రపంచంలోనే చాలా అరుదు. చదవండి: స్నేక్ అటెంప్ట్ మర్డర్ అంటే ఇదేనేమో? మొదట్లో ఆయన ప్రమాదాల్లో గాయపడ్డ మూగజీవాలకు వైద్య చికిత్స చేయించేవారు. 1994 నుంచి వాటిని సంరక్షించే బాధ్యత కూడా తీసుకున్నారు. అధికారిక లెక్కల ప్రకారం రెండేళ్ల క్రితం చైనాలో సుమారు 5 కోట్ల మూగ జీవాలు వీధుల్లో ఉన్నాయని అంచనా. వీటి సంఖ్య ఏటా పెరుగుతోంది. ‘‘చైనా ప్రజలకు ఆదాయం పెరిగింది కానీ, మూగజీవాలను పట్టించుకునే తీరిక లేకుండా పోయింది. అందుకే వారు తమ పెంపుడు జంతువులను వీధుల్లో వదిలేస్తున్నారు’’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కుక్కలకు కొత్త జీవితం షాంఘై పోలీసులు ఇటీవల ఇరుకుగా ఉన్న బోనుల్లో కొన్ని వీధి కుక్కలను బంధించి ఉంచారు. వాటిలో 20 వరకూ పిల్లలు కూడా ఉన్నాయి. ఈ విషయం జియాంగ్ చెవిన పడింది. వెంటనే ఆయన అక్కడకు చేరుకున్నారు. పోలీసులతో మాట్లాడారు. కొద్ది సమయంలో ఆ శునకాలకు బోనుల నుంచి విముక్తి లభించింది. వాటిని తీసుకుని జియాంగ్ తన సంరక్షణాలయానికి చేరుకున్నారు. ఆ శునకాల్లో గాయపడ్డ వాటికి, జబ్బుతో ఇబ్బంది పడ్డవాటికి సపర్యలు చేశారు. ప్రేమగా లాలించారు. వాటిని రక్షించి కొత్త జీవితాన్ని ఇచ్చారు. జీవుల పట్ల తనకున్న ప్రేమను చాటుకున్నారు. ‘‘నేను వాటిని రక్షించక పోతే.. అవి చనిపోయి ఉండేవి’’ అని జియాంగ్ చెబుతారు. అప్పు చేసి ఆహారం కుక్కలతో పాటు పిల్లులు, కోళ్లు, బాతులు, నెమళ్లు కూడా జియాంగ్ మఠంలో ఆశ్రయం పొందుతున్నాయి. వీటన్నిటికీ ఆహారం పెట్టాలంటే ఓ భిక్షువుకు తలకు మించిన భారమే అవుతుంది. ఏటా వీటి ఆహారానికి సుమారు 14 కోట్ల రూపాయలు ఖర్చవుతోందట. ప్రభుత్వం నుంచి ఆయనకు ఏమాత్రం సహకారం అందదు. చందాలతోనూ, అప్పులతోనూ ఇప్పటి వరకూ నెట్టుకొచ్చారు. అయితే ఇకపై అప్పు పుట్టే పరిస్థితి లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకని ఆయన ఇతర దేశాల్లోని సంరక్షకుల వద్దకు, దత్తత తీసుకునే వారికి ఆ శునకాలను ఆయన ఇచ్చేస్తున్నారు. ఇంగ్లీషు తెలిసిన తన వాలంటీర్లతో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇటీవల అమెరికా, కెనడా, యూరోపియన్ దేశాలకు సుమారు 300 కుక్కలను పంపారు. అలా పంపడం తనకు ఇష్టం లేదని, అయితే వాటికి కొత్త జీవితాలను ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ పని చేస్తున్నానని ఆయన తెలిపారు. ఏదొక రోజు వెళ్లి వాటిని చూసి వస్తానని చెబుతున్నారు. – సాక్షి, ఏపీ సెంట్రల్ డెస్క్ -
57 అడుగుల విగ్రహం.. 35 కేజీల మాస్క్
టోక్యో: కరోనా వ్యాప్తి మొదలైన నాటి నుంచి మాస్క్ తప్పనిసరి అయ్యింది. మాస్క్ ధరించకుండా బయటకు వెళ్తే జరిమానా విధిస్తున్నారు. మాస్క్ లేకపోతే ఎక్కడికి అనుమతించడం లేదు. మనుషులకు మాస్క్ సరే కానీ దేవుడి విగ్రహాలకు కూడా మాస్క్ పెట్టడం కొంత విడ్డూరంగా ఉంటుంది. అయితే అది కూడా చిన్నచితకా మాస్క్ కాదండోయే.. ఏకంగా 35 కేజీల భారీ మాస్క్ దేవతా విగ్రహానికి పెట్టారు. ఈ సంఘటన జపాన్‌లో చోటు చేసుకుంది. జపాన్‌లో 57 మీటర్లు ఎత్తున్న బౌద్ధ మాత విగ్రహానికి భారీ మాస్క్ ధరింపజేశారు. 57 మీటర్ల ఎత్తు విగ్రహానికి 5.3 మీటర్ల పొడవు, 4.1 మీటర్ల వెడల్పు కలిగిన ‘35 కిలోలు’ బరువు ఉన్న మాస్కును బౌద్ధ మాతకు ధరింపజేశారు. అనంతరం కరోనా మహమ్మారి నుంచి తమను కాపాడాల్సిందిగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు జపాన్‌లోని కుషిమా ప్రిఫెక్చర్ ప్రాంతం వాసులు. 57 మీటర్ల ఎత్తున్న బౌద్ధ మాత విగ్రహాన్ని 33 సంవత్సరాల క్రితం నిర్మించారు. బోలుగా ఉండే ఈ విగ్రహం భుజం వరకు వలయాకారంలో మెట్లను ఏర్పాటు చేశారు. చిన్న బిడ్డను ఎత్తుకున్నట్లు ఉండే ఈ విగ్రహం వద్ద జనాలు తమ పిల్లలను కాపాడమని.. సుఖప్రసవాలు అయ్యేలా చూడమని వేడుకుంటారు. జపాన్ అంటేనే భూకంపాలకు నిలయంగా ఉంటుందనే విషయం తెలిసిందే. ఈక్రమంలో గత ఫిబ్రవరిలో సంభవించిన భూకంపానికి బౌద్ధ మాత విగ్రహం పాక్షికంగా దెబ్బతింది. దీంతో విగ్రాహానికి మరమ్మత్తులు చేసిన అనంతరం ఈ భారీ మాస్కును తయారుచేసి బౌద్ధ మాతకు ధరింపజేసి..కరోనా నుంచి మా బిడ్డలను కాపాడు తల్లీ అంటూ ప్రార్థనలు చేశారు. చదవండి: వైరల్: మాస్క్ పెట్టుకున్నాడు.. మొహం వింతగా మారిపోయిందే! -
నాగార్జున కొండ.. బౌద్ధ ఆనవాళ్లే నిండా
సాక్షి, గుంటూరు: ‘బుద్ధం శరణం గచ్చామి.. ధర్మం శరణం గచ్చామి.. సంఘం శరణం గచ్చామి’ అంటూ ధర్మబోధ చేసిన బౌద్ధ చరిత్రకు గుంటూరు జిల్లా మాచర్ల మండలం నాగార్జున సాగర్ ప్రాజెక్టు సమీపంలోని నాగార్జున కొండ, అనుపులు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. పూర్వం ఇది ఓ చారిత్రక పట్టణం కాగా.. ప్రస్తుతం ఒక ద్వీపం. శాతవాహన చక్రవర్తి యజ్ఞశ్రీ శాతకర్ణి నాగార్జునుడి కోసం శ్రీ పర్వతంపై మహాచైత్య విహారాలను నిర్మించాడని ఇతిహాసం తెలియజేస్తోంది. నాగార్జున సాగర్ నిర్మాణ సమయంలో బయల్పడిన సామాన్య శక పూర్వం (క్రీస్తు పూర్వం) 2వ శతాబ్దం నాటి బౌద్ధావశేషాలను జలాశయం మధ్య కొండపై నిర్మించిన ద్వీపపు ప్రదర్శన శాలలో భద్రపరిచారు. ఇది ప్రపంచంలోని పురావస్తు ప్రదర్శన శాలలు అన్నిటిలోనూ అతిపెద్ద ద్వీప ప్రదర్శన శాల. బుద్ధునిదిగా చెప్పబడుతున్న దంతావశేషం ఇందులో చూడదగ్గవి. బౌద్ధ చరిత్రను తెలియజేసే శిలా శాసనాలు, స్థూపాలు కొండపై గల ఐలండ్ మ్యూజియంలో పదిలంగా ఉన్నాయి. ఆచార్య నాగార్జునుడు నెలకొల్పిన నాగార్జున విశ్వవిద్యాలయం శిథిలాలు కూడా ఇక్కడికి అతి సమీపంలోని అనుపులో దర్శనమిస్తాయి. కరోనా వైరస్ వ్యాప్తికి ముందు దేశ, విదేశాల బౌద్ధ ఆరాధకులు, పర్యాటకులతో ఈ ప్రాంతాలు కళకళలాడుతుండేవి. కరోనా వ్యాప్తి కారణంగా ఏడాది కాలంగా ఇక్కడ పర్యాటక శోభ తగ్గింది. 144 ఎకరాల విస్తీర్ణంలో.. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఎగువన 14 కిలోమీటర్ల దూరంలో జలాశయం మధ్యలో నల్లమల కొండల నడుమ 144 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ప్రాంతమే నాగార్జున కొండ. ఈ కొండపై 1966లో మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. చుట్టూ నీరు ఉండి మధ్యలో ఐలండ్ మ్యూజియం ఉంటుంది. ఇక్ష్వాకుల కాలంలో ప్రసిద్ధి చెందిన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం శిథిలాలు అనుపులో పదిలంగా ఉన్నాయి. విజయపురి సౌత్‌కు 8 కిలోమీటర్ల దూరంలోని అనుపులో విశ్వవిద్యాలయం ఉంది. మహాయాన బౌద్ధమత ప్రచారానికి ప్రధాన భూమిక పోషించిన కృష్ణా నది లోయలో కేంద్ర పురావస్తు శాఖ 3,700 చదరపు హెక్టార్లలో జరిపిన తవ్వకాలలో విశ్వ విద్యాలయం శిథిలాలు బయటపడ్డాయి. తరువాత కాలంలో ఈ శిథిలాలను పాత అనుపు వద్ద పునర్నిర్మించారు. అనుపులో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నమూనా, యాంపీ స్టేడియం, శ్రీరంగనాథస్వామి ఆలయం దర్శనమిస్తాయి. విశ్వవిద్యాలయ ప్రస్థానం ఆచార్య నాగార్జునుడు కృష్ణా నది లోయలో విద్యాలయాన్ని నిర్మించాడు. చారిత్రక ఆధారాలను బట్టి ఇది ఐదు అంతస్తులను కలిగి ఉన్నట్టు తెలుస్తోంది. దీనిని పర్వత విహారమని కూడా పిలిచేవారు. ప్రతి అంతస్తులోనూ బుద్ధుని స్వర్ణ ప్రతిమ శిథిలాలు ఆనాటి శిల్పకళకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. అప్పట్లో చైనా, భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్ విద్యార్థులు ఇక్కడికి వచ్చి విద్యనభ్యసించారు. రసాయన, వృక్ష, ఖనిజ, వైద్య విద్యలను ఇక్కడ బోధించేవారు. ఇక్కడే ఆచార్య నాగార్జునుడు అపరామృతం కనుగొన్నట్టు ఆధారాలున్నాయి. చరిత్రకారులు పాహియాన్, హ్యుయాన్‌త్సాంగ్, ఇత్సింగ్ ఈ విద్యాలయాన్ని సందర్శించి కొంతకాలం గడిపి మహాయాన బౌద్ధమతం గురించి అధ్యయనం చేశారని చరిత్ర చెబుతోంది. నాగార్జునుని మరణానంతరం కూడా విశ్వవిద్యాలయం కొన్ని శతాబ్దాల పాటు వర్థిల్లినట్టు ఆధారాలున్నాయి. దేశంలోని ఈశాన్య రాష్ట్రాలతో పాటు జపాన్, చైనా, శ్రీలంక, మలేషియా, టిబెట్, భూటాన్, థాయ్‌లాండ్, బర్మా వంటి దేశాల నుంచి బౌద్ధ ఆరాధకులు ఏటా నాగార్జున కొండ, అనుపు సందర్శనకు వస్తారు. ఆర్థికంగా నష్టపోయాం కరోనా వ్యాప్తి కారణంగా గత ఏడాది నుంచి పర్యాటకుల తాకిడి లేదు. దీంతో వ్యాపారాలు లేవు. ఆర్థికంగా చితికిపోయాం. కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిన అనంతరం ప్రభుత్వాలు పర్యాటకంగా మా ప్రాంతాన్ని అభివృద్ధిపరచాలి. రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపరచాలి. – వెంకట్రావు, హోటల్ నిర్వాహకుడు, విజయపురి సౌత్ -
Sanchi Stupa: అనగనగా.... ఓ బౌద్ధస్థూపం
రెండు వందల నోటు మీద గాంధీజీ ఉంటాడు. నోటును వెనక్కి తిప్పితే గాంధీ కళ్లద్దాలతోపాటు... ఓ పురాతన కట్టడం కూడా కనిపిస్తుంది. అదే... అశోకుడు కట్టించిన గొప్ప బౌద్ధ స్థూపం. రెండు వేల మూడువందల ఏళ్ల నాటి సాంచి స్థూపం. సాంచి బౌద్ధ స్థూపం పర్యటనకు వెళ్లే ముందు సాంచి స్థూపం ఉన్న ప్రదేశం గురించి చెప్పుకోవాలి. సాంచి స్థూపాన్ని నిర్మించిన అశోకుడి భార్య పేరు విదిశ. ఆమె పేరు మీద సాంచికి పది కిలోమీటర్ల దూరాన ఒక పట్టణం కూడా ఉంది. అశోకుడితోపాటు విదిశ కూడా బౌద్ధాన్ని విస్తరింపచేయడంలో కీలక పాత్ర వహించింది. బౌద్ధ ప్రచారం కోసం శ్రీలంక వెళ్లిన సంఘమిత్ర, మహేంద్రలు అశోకుడు– విదిశల పిల్లలే. అశోక స్తంభం బౌద్ధ ఆరామాలు సాధారణంగా నీటి వనరులకు దగ్గరగా ఒక మోస్తరు ఎత్తున్న కొండల మీదనే ఉంటాయి. అలాగే... నివాస ప్రదేశాలకు సుమారు కిలోమీటరు దూరానికి మించకుండా ఉంటాయి. సన్యాసులు ప్రశాంతంగా వారి జీవనశైలిని కొనసాగించడానికి, గ్రామంలోకి వచ్చి భిక్ష స్వీకరించడానికి అనువుగా ఉండేటట్లు నిర్మించుకునే వాళ్లు. సాంచి స్థూప నిర్మాణంలోనూ అదే శైలిని అనుసరించారు. స్థూపంలో చక్కని శిల్పసౌందర్యం ఉంది. బుద్ధుని జీవితంలోని ఘట్టాలను శిల్పాల రూపంలో చెక్కారు. ఈ స్తూపం వ్యాసం 120 అడుగులు, ఎత్తు 54 అడుగులు. స్థూపానికి నాలుగు వైపుల ఉన్న తోరణ ద్వారాల్లో దక్షిణ ద్వారానికి దగ్గరగా అశోకుని స్తంభం ఉంది. ఇది సాంచి అశోకుని స్తంభం అంటారు. నాలుగు సింహాలు నాలుగు దిక్కులను చూస్తున్న స్థూపం ఇది. మన జాతీయ చిహ్నంగా సింహాలను ఈ స్థూపం నుంచి తీసుకున్నారు. స్థూపం ఆవరణలో ఉన్న మ్యూజియంలో నమూనా స్థూపాన్ని చూడవచ్చు. మహాభిక్షపాత్ర సాంచి స్థూపం ఇప్పుడు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నిర్వహణలో ఉంది. ఇక్కడ బౌద్ధ సాహిత్యం, సాంచి స్థూపం నమూనాలను కొనుక్కోవచ్చు. ఇక్కడి మ్యూజియంలో పెద్ద భిక్ష పాత్ర ఉంటుంది. అది రాతితో చెక్కిన పాత్ర. సాంచి పర్యటనకు వచ్చే వాళ్లు ఎక్కువగా భోపాల్‌లోనే బస చేస్తుంటారు. అయితే ఇక్కడ శ్రీలంక మహాబోధి సొసైటీ ఆరామంతోపాటు అనేక దేశాల బౌద్ధ సన్యాసులు నిర్మించుకున్న ఆరామాలు కూడా ఉన్నాయి. సాంచి స్థూపం గురించి... సాంచి పట్టణం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నగరానికి యాభై కిలోమీటర్ల దూరాన ఉంది. పురాతన కట్టడాల అన్వేషణలో భాగంగా మనదేశంలో పర్యటించిన బ్రిటిష్ అధికారి జనరల్ టేలర్ 1818లో సాంచి బౌద్ధస్థూపం ప్రాముఖ్యతను గుర్తించాడు. తర్వాత 1881 నుంచి పునర్నిర్మాణ పనులు మొదలయ్యాయి. అప్పటి నుంచి నెమ్మదిగా సాగిన మరమ్మత్తు పనులు 1912 – 1919 మధ్య కాలంలో సర్ జాన్ మార్షల్ ఆధ్వర్యంలో త్వరితగతిన పూర్తయ్యాయి. ఈ స్థూపం 1989లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు పొందింది. బౌద్ధ బంధం మయన్మార్ బౌద్ధ సన్యాసులను ఐదేళ్ల కిందట మనదేశంలో ఉన్న బౌద్ధ క్షేత్రాల సందర్శనకు తీసుకు వెళ్లాను. ఆ సన్యాసులందరూ నాగార్జున యూనివర్సిటీలో మహాయాన బుద్ధిస్ట్ స్టడీస్‌లో చదువుకోవడానికి మనదేశానికి వచ్చినవాళ్లు. కొందరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కొందరు రీసెర్చ్ కోసం వచ్చారు. బౌద్ధాన్ని ఆచరించే కుటుంబాలు తమ పిల్లల్లో ఒకరిద్దరిని ధర్మ పరిరక్షణ కోసం అంకితం చేస్తాయి. అలా వాళ్లు చిన్నప్పుడే బౌద్ధ సన్యాసులుగా మారిపోతారు. అశోకుడు– విదిశ తమ పిల్లలను బౌద్ధానికి అంకితం చేశారు. – డాక్టర్ బి. రవిచంద్రారెడ్డి, బౌద్ధ ఉపాసకులు Meenmutty Waterfalls: మీన్ముట్టి జలపాతం.. అద్భుతానికే అద్భుతం -
ధర్మ దాన దీపోత్సవం
బౌద్ధం వల్ల ఎన్నో పండుగలు ప్రపంచానికి పరిచయం అయ్యాయి. వాటిలో దీపావళి ఒకటి. బౌద్ధ దీపావళికి ఒక ధార్మిక పునాది ఉంది. చారిత్రక నేపథ్యం ఉంది. అంతకుమించి ఒక మంచి సందర్భం కూడా ఉంది.అది ఇది కపిలవస్తు నగర రాజమందిరం. సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు భార్య గౌతమీ సమేతంగా శుద్ధోదన మహారాజు. ఆయన ఒక మంత్రి ని పిలిపించి – ‘అమాత్య! నా కుమారుడు సిద్ధార్థుడు ఇల్లు విడిచి ఆరేళ్లు దాటింది. అతనిప్పుడు బోధి వృక్షం కింద సంబోధిని పొంది బుద్ధుడు అయ్యాడు. బుద్ధత్వం పొందటం అసాధారణ విషయం. అన్యులకు అసాధ్యం. ఇప్పుడు నా బిడ్డను చూడాలనే కోరిక ఉంది. వారిప్పుడు మగధ రాజధాని రాజగృహæ నగరం లోని వేణు వనంలో ఉన్నారు. మీరు వెంటనే వెళ్లి నా బిడ్డను తీసుకుని రండి’‘అన్నాడు. అతని ముఖంలో ఏదో తెలియని ఆత్రుత. ఆనందం. ‘ఈ అమ్మ మాట గా కూడా చెప్పండి. మీ తల్లి మిమ్మల్ని చూడాలని వేయి కళ్ళతో ఎదురు చూస్తుంది అని చెప్పండి’ అంది గౌతమి. ఆమె కళ్ళల్లో ఆనంద బాష్పాలు. రాజుగారి ఆజ్ఞ మేరకు ఆ మంత్రి రాజగృహకి వెళ్ళాడు. కానీ తిరిగి రాలేదు. ఆయన బుద్ధుని ప్రబోధం విని తాను కూడా బౌద్ధ సంఘంలో చేరి పోయాడు. భిక్షు గా మారిపోయాడు. అక్కడే ఉండిపోయాడు. ఆ తర్వాత మరో మంత్రి వెళ్ళాడు. ఆయన కూడా అంతే. తిరిగి పోలేదు. అలా మొత్తం తొమ్మిది మంది మంత్రులు వెళ్లారు. ఏ ఒక్కరూ తిరిగి రాలేదు. చివరికి సిద్ధార్థుని చిన్ననాటి మిత్రుడు అయిన కాలు ఉదాయి ని పంపాడు. ఈ కాలు ఉదాయి బుద్ధుడు పుట్టిన రోజునే పుట్టాడు. సిద్ధార్థుని బాల్యమిత్రుడు. ఉదాయి వెళ్లి విషయం చెప్పి బుద్ధుని ఒప్పించాడు. అలా బుద్ధుడు తన బౌద్ధ సంఘంతో కలిసి తన జన్మ స్థలానికి బయలుదేరారు. జ్ఞానాన్ని పొందడం అంటే.. అజ్ఞానపు చీకట్లను పారద్రోలడం. అది చీకటి ని చీల్చి వెలుగులు విరజిమ్మే విజ్ఞానపు వెలుగు దీపం. కాబట్టి విజ్ఞానానికి వెలుగుల దీపం ప్రతీక కాబట్టి తన బిడ్డ నడిచివచ్చే దారిపొడవునా... ఊరూరా.... దీపాలు వెలిగించి స్వాగతం పలికే ఏర్పాటు చేశాడు శుద్ధోదనుడు. బుద్ధుడు బహుళ చతుర్దశి నాటికి కపిలవస్తు నగరం లో అడుగుపెట్టాడు. ఆరోజు బౌద్ధులకు అతి ముఖ్యమైన రోజు. ఉపవాసం పాటించే పర్వదినం. కాబట్టి నగరాన్ని అంతా దీపాలతో అలంకరించి బుద్ధునికి స్వాగతం పలికారు కపిలవస్తు ప్రజలు. అలా ఆనాటినుండి ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాడు వేలాది దీపాలతో బౌద్ధ ఆరామాలను... స్తూపాలను అలంకరించి సంప్రదాయం మొదలైంది. అందుకే ఈ స్తూపాలకు దీపాలదిన్నెలు అనే పేరు వచ్చింది. గహస్తులు ఈరోజు తమ ఇండ్లను దీపాలతో అలంకరించి విశేషంగా దానధర్మాలు చేస్తారు. కాబట్టి ఈ పండుగను ధర్మ దాన దీపోత్సవం గా కూడా పిలుస్తారు. ప్రపంచంలో అందరూ విశేషంగా జరుపుకుంటారు. –డా. బొర్రా గోవర్ధన్ -
వైరల్ : ఏనుగు రంకెలు.. జనం పరుగులు
కొలంబో : బౌద్ధ మతస్తులు శ్రీలంకలో ప్రతియేటా జరుపుకునే ఏనుగుల అందాల పోటీల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. అందంగా ముస్తాబైన ఏనుగుల కవాతు జరుగుతుండగా ఊహించని ఘటన కలకలం రేపింది. ఓ ఏనుగు ఉన్నట్టుండి రంకెలు వేసింది. జనంపైకి లగెత్తింది. ఏనుగు ఉగ్రరూపంతో పోటీలు వీక్షిస్తున్న ప్రజలు, పక్కనే ఉన్న భక్తులు బతుకుజీవుడా అని పరుగులు పెట్టారు. ఈ క్రమంలో చేతికి చిక్కిన వారందరినీ తొండంతో, కాళ్లతో ఏనుగు చావబాదింది. ఈ దాడిలో 18 మంది గాయపడ్డారు. ఏనుగుపై ఉన్న మావటి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటన రాజధాని కొలంబో సమీపంలోని కొటే పట్టణంలో శనివారం రాత్రి జరిగింది. క్షతగాత్రుల్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. స్వల్ప గాయాలపాలైన 16 మంది డిశ్చార్జి అయ్యారని, మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారని వైద్యులు వెల్లడించారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. శ్రీలంకలో ఏనుగులు కలిగిఉండటం సంపన్నులు గౌరవంగా భావిస్తారు. ప్రతియేట బౌద్ధాలయాల్లో వాటికి అందాల పోటీలు నిర్వహిస్తారు. ఇదిలాఉండగా.. కొన్ని రోజుల క్రితం జరిగిన ఇదే తరహా పోటీల్లో 70 ఏళ్ల ముసలి ఏనుగు ‘టికిరి’ని పోటీలకు దింపిన సంగతి తెలిసిందే. బొక్కల గూడులా ఉన్న దాని శరీరం కనిపించకుండా నిండుగా బట్టలతో అలంకరించారు. అయితే, ఆ గుట్టు కాస్తా బయటపడటంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. జంతుప్రేమికులు ఆగ్రహంతో అధికారులు చర్యలు చేపట్టారు. టికిరిని పోటీలను నుంచి తప్పించి, వైద్యం చేయించారు. -
వజ్రాభరణమా? ధర్మాభరణమా?ర్మాభరణమా?
రాజ్యం, అధికారం, సంపదల కంటె సత్యం, ధర్మం ఎంతో విలువైనవిగా ఎంచి బుద్ధుడు అన్నిటినీ త్యజించి భిక్షువుగా మారాడు. భిక్షుసంఘాన్ని స్థాపించి ధర్మప్రబోధాలు చేస్తూ దేశదేశాలు తిరుగుతున్నాడు.శాక్యవంశానికి చెందిన యువరాజులు అనిరుత్థుడు, భిద్ధయుడు, ఆనందుడు, కింబిలుడు, దేవదత్తుడు అనే ఐదుగురు భిక్షువులుగా మారాలని నిర్ణయించుకున్నారు. ఒకరోజున వారు తమ ఇంట్లోని వారికి చెప్పకుండా బయలుదేరారు. వారు తమకు తోడుగా ఆస్థాన క్షురకుడైన ఉపాలిని వెంటతీసుకుని వెళ్లారు. నగర పొలిమేరలు దాటాక, వారు తాము ధరించిన విలువైన వస్త్రాల్ని, ఆభరణాల్ని తీసి మూటగట్టారు. నారబట్టలు ధరించారు. ఉపాలితో కేశఖండనం చేయించుకుని, ‘‘ఓ ఉపాలీ! విలువైన మా వస్త్రాలూ, ఆభరణాలూ నీవు తీసుకో: వాటితో జీవితాంతం హాయిగా జీవించు’’అని వెళ్లిపోయారు. ఆ మూటలు తీసుకుని వెనుదిరిగాడు ఉపాలి. కొంతదూరం పోయాక ఉపాలికి ఒక ఆలోచన వచ్చింది. ‘రాకుమారులు ఇంత విలువైన ఆభరణాలు త్యజించి, వాటిని గడ్డిపోచగా ఎంచి నాకు ఇచ్చేశారు. అంటే... వారు ఈ ఆభరణాల కంటె విలువైనదాన్ని పొందడం కోసమే ఈ పని చేసి ఉంటారు. మరి నాకెందుకూ ఈ ఆభరణాలు? నేను కూడా వారితోనే పోయి ఆ వెలలేని ఆభరణాల్ని పొందాలి’ అనుకుని ఆ వస్త్రాల్ని, మూటల్ని అక్కడే పడేసి, పరుగు పరుగున వచ్చి, వారిని కలిశాడు. ‘‘ఆ విలువైన ఆభరణాల్ని నీవు కూడా అందుకుందువుగాని రా’’ అని చెప్పి వారు తమ వెంట తీసుకుపోయారు. బుద్ధుడు ఆ ఆరుగురిలో ముందుగా ఉపాలికి దీక్ష ఇచ్చాడు. న వరత్నాలు పొదిగిన ఆభరణాల కంటె బుద్ధుడు ప్రవచించిన ధర్మం అనే ఆభరణమే విలువైనదని గ్రహించిన ఉపాలి, అతి తొందరలోనే అగ్రభిక్షువు కాగలిగాడు. ఉపాలికి బౌద్ధసంఘంలో ఎంతటి గౌరవం దక్కిందంటే... బుద్ధుడు నిర్వాణం పొందిన మూడు నెలలకి జరిగిన మొదటి బౌద్ధ సంగీతికి అతడే అధ్యక్షుడు. త్రిపిటకాలలో భిక్షు నియమావళిని బోధించే వినయపిటకం కూర్పుకు సారథి. రత్నాభరణాల్ని వదిలి ధర్మాభరణాన్ని ధరించిన ఉపాలి బౌద్ధసంఘంలో ఒక వజ్రంలా ప్రకాశించాడు. -
సుందర గుహాలయాలు
ఉండవల్లి గుహలు గుంటూరు నుంచి 30 కి.మీ. విజయవాడ నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఇవి మొదట బౌద్ధానికి సంబంధించినవి. తర్వాత క్రమంగా గుహాలయాలుగా ప్రసిద్ధి చెందాయి. ఈ గుహలు బౌద్ధ, హైందవ శిల్పకళారీతుల సమ్మేళనం. ఈ నాలుగు అంతస్తుల గుహల సముదాయాన్ని మొదట బౌద్ధ భిక్షువుల నివాసం కోసం ఏర్పాటు చేసినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. మలినిర్మాణం 6–7 శతాబ్దాల కాలంలో జరిగింది. గుహాలయాల మొదటి అంతస్తు సంపూర్ణంగా లేదు. రెండవ అంతస్తు త్రికూటాలమయం. మూడవ అంతస్తు అనంత శయన విష్ణుమూర్తి, పన్నిద్దరాళ్వార్లు, ఆంజనేయ విగ్రహాలు ఉన్నాయి. నాలుగవ అంతస్తులో పూర్తి కాని త్రికూటాలయం ఉంది. వీటిలోని శిల్పకళారీతుల ఆధారంగా చాళుక్యరాజుల కాలం నాటివిగా తెలుస్తోంది. శనిదోషాలను నివారించే విదురాశ్వత్థ వృక్షం విదురుడు నాటిన రావిచెట్టు కాబట్టి దీనికి విదురాశ్వత్థ వృక్షం అని పేరు వచ్చింది. ఈ చెట్టు ఉన్న ప్రదేశం కాబట్టి ఆ ఊరికి విదురాశ్వత్థ అనే పేరు వచ్చింది. ఈ విశాలమైన వృక్షరాజాన్ని అత్యంత మహిమాన్వితమైనదిగా భావిస్తారు. కావేరి, ఆర్కావతి నదుల సంగమస్థానం ఇది. మహాశిల్పి జక్కన, టిప్పుసుల్తాన్‌లు ఈ క్షేత్రంలో పుట్టారని అంటారు. వృక్షం మూలభాగం బ్రహ్మరూపమని, మధ్యభాగం విష్ణురూపం అని, అగ్రభాగం శివరూపం అని భావిస్తారు. కోరిన కోర్కెలు తీర్చే కల్పవృక్షంగా పేరు పొందిన వృక్షం ఇది. విష్ణు అంశ గల చెట్టు ఇది. శని దృష్టి సంబంధితమైనందు వల్ల శనివారం రోజు ఈ క్షేత్రాన్ని వేలాది మంది దర్శించుకుంటారు. శనివారం తప్ప ఇతర రోజుల్లో ఈ వృక్షాన్ని తాకరు. భూత ప్రేతపిశాచ రోగాలు, సంతానహీనత తొలగించే వృక్షం. శనిదోషాలతో బాధపడేవారు దీని దర్శనం చేసుకుంటే శాంతి సుఖాలు పొందుతారని విశ్వాసం. సోమేశ్వరం, గణేశుడు, లక్ష్మీనారాయణుడు, ఆంజనేయ స్వామి ఆలయాలతోపాటు వేలకొలదీ నాగ ప్రతిమలు దర్శనమిస్తాయి. బెంగళూరు నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. హిందూపురం నుంచి కూడా ఈ క్షేత్రానికి బస్సులు ఉన్నాయి. కానీ వసతి సౌకర్యాలు ఉండవు. -
కశ్మీర్లో లవ్ వార్
లడఖ్‌లో లవ్ జీహాద్ మంటలు ప్రధాని అపాయింట్మెంట్ కోరిన ఎల్బీఏ ఉద్రిక్తంగా పరిస్థితులు శ్రీనగర్: కశ్మీర్లో మళ్లీ మరో వివాదం రాజుకుంది.. సరిహద్దు గొడవలు, ఉగ్రదాడులు.. రాళ్లు రువ్వుకోవడం వంటివి కాకపోయినా.. అంతే స్థాయిలో మంటలు రేగుతున్నాయి. ఈ వివాదాన్ని ప్రధాని నరేంద్రమోదీకి వివరించేందుకు ఒక వర్గంవారు అపాయింట్మెంట్ కోరడంతో వివాదం స్థాయి మరింత పెరిగింది. కశ్మీర్లో రాజుకున్న వివాదంపై పూర్తి వివరాలు ఇవే. కొంత కాలంగా శ్రీనగర్‌లోని లద్దాక్ బుద్ధిస్ట్ అసోసియేషన్(ఎల్బీఏ) స్థానిక ముస్లింల మధ్య వివాదాలు తీవ్రస్థాయిలో కొనసాగుతున్నాయి. లవ్ జీహాద్ ఇందుకు కారణం అని ఎల్బీఏ చెబుతోంది. లవ్ జీహాద్‌పై చర్యలు తీసుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సదరు సంస్థ పీడీపీ-బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తోంది. గత ఏడాది బౌద్ధమతానికి 30 ఏళ్ల అమ్మాయిని మత మార్పడి చేసి ఒక ముస్లిం అబ్బాయి వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచీ ఇక్కడ ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. ఈ వివాహం చెల్లదని బౌద్దులు వాదిస్తున్నారు. పెళ్లి చేసుకున్న వారిని వేధించడం సరికాదని ఈ ఏడాది రాష్ట్ర హై కోర్టు తేల్చి చెప్పింది. దీనిపై స్పందించిన బౌద్దులు.. ఈ పెళ్లిని రద్దు చేయడం కోసం చివరి రక్తపు బొట్టువరకూ పోరాడతాం అని ప్రకటించారు. లడఖ్ నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను ప్రధాని నరేంద్రమోదీకి వివరిస్తామని అందుకోసం ఆయన అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు ఎల్బీఏ చెబుతోంది. లడఖ్‌లో బౌద్ధుల జనాభా 51 శాతం ఉంటుంది. చదువుకున్న, అందంగా ఉన్న బౌద్ధమతానికి చెందిన అమ్మాయిలను ప్రేమ పేరుతో వివాహం చేసుకుని ఇస్లాం మతంలోకి మారుస్తున్నారని బౌద్ధ సంఘాలు ఆరోపిస్తున్నాయి. మూడేళ్లలో ఇలా 45 మంది అమ్మాయిలను ఇస్లాంలోకి మార్చారని లడఖ్ బుద్దిస్ట్ అసోసియేషన్ చెబుతోంది. ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పెళ్లి చేసుకున్న వారిని రహస్య ప్రదేశంలో సురక్షితంగా ఉంచినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో 1989 నుంచి ఇరువర్గాల మధ్య అత్యంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. గతంలో దాదాపు దశాబ్దకాలం పాటు ముస్లింల వస్తువులు కొనకుండా బౌద్దులు బహిష్కరించారు. ముస్లింలు లవ్‌జీహాద్‌ను మానకపోతే భవిష్యత్‌లో ఇటువంటి పరిస్థితులు మళ్లీ పునరావృతం అవుతాయని బౌద్ధులు చెబుతున్నారు. -
స్వర్గం... నరకం!
ఆత్మీయం బౌద్ధానికీ, తావోయిజానికి జరిగిన సమ్మేళనానికే జెన్ అని పేరు. జెన్ అంటే ధ్యానం అని అర్థం. ధ్యానమంటే లోపల, వెలుపల నిరంతరం ఎలాంటి అడ్డుగోడలు లేకుండా గమనించడం. జెన్ అనేది ఒక జ్ఞానసాగరం. అందులో జలకాలాడి ముత్యాలు ఏరి మానవసమాజానికి అందించిన వారున్నారు. కేవలం మాటలను మాత్రం నమ్మే స్థితి నుంచి బయటపడేసేందుకు, మనిషి మనసుని వాస్తవమనే దాన్ని నేరుగా స్పృశించడానికి, స్వభావాన్ని సహజసిద్ధంగా తెలుసుకుని నడుచుకోవడానికి తోడ్పడేదే జెన్. ‘‘కోపం, గర్వం, ద్వేషం, అసూయ వంటి గుణాలు వీడనప్పుడు జీవితం నరకమవుతుంది. రాగద్వేషాలు లేకుండా సహనాన్ని పాటించినప్పుడు జీవితం స్వర్గమవుతుంది’’ అని చెబుతుంది జెన్. మచ్చుకు ఓ చిన్న కథను చూద్దాం: ఓ జెన్ గురువును కలిసిన సైనికుడు ‘‘స్వర్గం, నరకం అంటుంటారు కదా? అవి ఎలా ఉంటాయి’’ అని ప్రశ్నించాడు. అప్పుడా గురువు ‘‘ఏంటీ నువ్వు సైనికుడివా? నువ్వు ఓ బిచ్చగాడిలా కనిపిస్తున్నావు. నిన్నసలు ఏ చక్రవర్తి సైనికుడిగా నియమించాడు?’’ అని తాపీగా అన్నాడు. ఈ మాటలతో సైనికుడికి ఎక్కడ లేని కోపమొచ్చింది. వెంటనే ఒరలోంచి కత్తి తీసి నరికేస్తానని ఆయన మీదకెళ్ళాడు. కానీ గురువు ఏ మాత్రం చలించలేదు. ‘‘ఇదిగో ఈ నీ కోపావేశమే నీకు నరకం చూపుతుంది’’ అని ఎంతో శాంతంగా చెప్పిన మాటలతో సైనికుడి లో ఆవేశం అణగారిపోయింది. గురువుగారిపై తీసిన కత్తిని తీసినట్లే ఒరలో పెట్టి ఆయనకు నమస్కరించాడు. ఆ వెంటనే గురువు ‘‘ఇదిగో ఈ ప్రవర్తనతో నీకు స్వర్గద్వారాలు తెరచుకున్నాయి’’ అని అతడి కళ్ళు తెరిపించాడు. -
హైదరాబాద్‌లో అంతర్జాతీయ బుద్ధిజం సెమినార్
-
జీవితంపై అవగాహన అవసరం
మార్కొండపాడు (చాగల్లు) : ప్రతి ఒక్కరూ ప్రకృతి, సమాజాన్ని పరిరక్షిస్తూ తన సుఖాన్ని సమాజ సుఖంగా పెంపొందించుకోవాలని ఉండ్రాజవరం బౌద్ధధర్మ పీఠం గురువు పూజ్యాబతి అనాలియో అన్నారు. చాగల్లు మండలం మార్కొండపాడులోని సుంకవల్లి వెంకన్నచౌదరి నివాసంలో సోమవారం జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. ప్రతి మనిషికి జీవితంపై అవగాహన కలిగి సన్మార్గంలో పయనించాలని సూచించారు. సత్యాన్వేషి అయిన బుద్ధుని సూక్తులు అందరూ అచరించాలని సందేశమిచ్చారు. వియత్నం, మలేషియా నుంచి వచ్చిన బౌద్ధులు ఆయనతో ఉన్నారు. సుంకవల్లి ఫౌండేష¯ŒS అధినేత సుంకవల్లి వెంకన్నచౌదరి, వైఎస్సార్ సీపీ నాయకులు ఉప్పూలూరి బాబురావు, తమ్మిశెట్టి సుబ్బారావు పాల్గొన్నారు. -
వేపాకు మందు
బౌద్ధ వాణి వారణాసి రాజు బ్రహ్మదత్తునికి లేకలేక కొడుకు పుట్టాడు. దాంతో అతణ్ణి అతి గారాబంగా పెంచారు. అలా అబ్బరంగా పెంచడంతో అన్నీ అవలక్షణాలే అలవర్చుకున్నాడు. ప్రతివారినీ కొట్టేవాడు. ప్రతిదానికీ తిట్టేవాడు. దాంతో అందరూ అతణ్ణి ‘‘దుష్టకుమారుడు’’ అని పిలిచేవారు. తన కొడుకు ఇలా అవలక్షణాలతో పెరిగి పెద్దవాడైతే, తన రాజ్యాన్ని సరిగా పాలించలేడనీ, తను వంశగౌరవం మంట కలుపుతాడనీ బ్రహ్మదత్తుడు భయపడ్డాడు. ఎందరో గురువుల దగ్గరకు పంపాడు. అతగాణ్ణి సరైన దారిలో పెట్టడం ఏ ఒక్కడి వల్లా కాలేదు. చివరికి గురుకులాలే దెబ్బతిన్నాయి. ఇక, తన కుమారుణ్ణి చక్కదిద్దే శక్తి ఒక్క బుద్ధునికే ఉందని నమ్మాడు - బ్రహ్మదత్తుడు. మహాశక్తి (మహాగురువు)గా పేరు పొందిన బుద్ధుడే తన బిడ్డకు తగిన గురువు అని భావించి, ఒక రోజున తన బిడ్డను తీసుకొని వెళ్లి, నమ స్కరించి విషయం చెప్పాడు. ‘‘సరే! నా దగ్గర ఉంచి వెళ్లు’’ అని చెప్పాడు. రాకుమారుణ్ణి తనతో వాహ్యాళికి తీసుకుపోయాడు బుద్ధుడు. దారిలో ఒక చిన్న వేప మొక్క కనిపించింది. ‘‘నాయనా! ఎంతో అందంగా ఉన్నాయి. ఆ లేత ఆకుల్ని తీసుకుని తిను’’ అన్నాడు. దుష్టకుమారుడు రెండు ఆకులు కోసుకుని, నమిలి, ఖాండ్రించి ఉమ్మాడు. వెంటనే కోపంతో ఆ చుట్టుపక్కల కనిపించిన వేప మొక్కల్ని పీకేయడం మొదలుపెట్టాడు. ‘‘నాయనా! ఆగు! ఎందుకు పీకుతున్నావు?’’ అని అడిగాడు బుద్ధుడు. ‘‘ఛీఛీ! ఇవి కటిక చేదు. ఇవి పనికిరావు. వీటిని పీకి, మంచి మొక్కలు నాటిస్తాను’’ అన్నాడు. ‘‘మరి, నీకు నచ్చకపోతే వీటిని పీకేస్తున్నావు. అలాగే నీ ప్రవర్తన కూడా అంతకంటే చేదుగా ఉంటుంది కదా! అప్పుడు నీ తోటివారు నిన్ను ఎలా చూడాలి? ఏం చెయ్యాలి? తమ రాజు చెడ్డవాడని భావించిన ప్రజలు, రేపు నిన్ను సింహాసనం నుండి పీకేసి, మరో మంచి రాజును తెచ్చుకుంటారు గదా!’’ అన్నాడు. ఆ మాటలతో అతనికి జ్ఞానోదయం కలిగింది. ఇక ఆ రోజు నుండి మంచి నడవడిక నేర్చుకున్నాడు. తండ్రికి తగిన రాజుగా పేరు పొందాడు. - బొర్రా గోవర్ధన్ -
అక్రమంగా కట్టారని మసీదుకు నిప్పు పెట్టారు
మయన్మార్‌లో బుద్ధిస్టుల తీవ్ర చర్య నేపీతా: మయన్మార్‌లో జాతుల హింస కొనసాగుతూనే ఉంది. దేశంలో జాతుల హింసను అరికట్టాలని ఐక్యరాజ్యసమితి ప్రత్యేక రిపోర్టర్ యాంఘీ లీ మయన్మార్ ప్రభుత్వాన్ని కోరిన రోజే.. బుద్ధిస్టులు ఓ మసీదుకు నిప్పుపెట్టారు. దేశ రాజధాని నేపీతాకు 652 కిలోమీటర్ల దూరంలో ఉన్న హపకంత్ పట్టణంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. పట్టణంలో అక్రమంగా కట్టిన ముస్లింల ప్రార్థన మందిరాన్ని కూల్చేయాలని బుద్ధిస్టులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ముస్లింలు మాత్రం అధికారులు ఆదేశాలిస్తేనే తాము ప్రార్థన మందిరాన్ని తొలగిస్తామని చెప్తూ వచ్చారు. ఈ అంశంపై ఉద్రిక్తత కొనసాగుతున్న నేపథ్యంలో శుక్రవారం వందలమంది బుద్ధిస్టులు కత్తులు, కర్రలు పట్టుకొని వచ్చి ప్రార్థన మందిరం ముందు ఆందోళనకు దిగారు. అదుపు తప్పిన అల్లరిమూక ప్రార్థన మందిరానికి నిప్పు పెట్టింది. అక్కడే ఉన్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా.. వారిని కూడా అల్లరిమూక అడ్డుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతలు రేపింది. మరోవైపు మయన్మార్ పర్యటనకు వచ్చిన ఐరాస రిపోర్టర్ లీ దేశంలో ఏళ్లుగా కొనసాగుతున్న మైనారిటీ ముస్లిం-బుద్ధిస్టు జాతుల మధ్య హింసను నివారించాలని ప్రజాస్వామిక ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గత 50 ఏళ్లలో తొలి ప్రజాస్వామిక ప్రభుత్వం మయన్మార్‌లో నెలకొన్న నేపథ్యంలో జాతుల హింసకు చెక్ పెట్టేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. -
మరణించిన మూడేళ్ళ తర్వాత...
ఓ బౌద్ధ సన్యాసి భౌతికకాయం... చైనాలో ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. మరణించి మూడేళ్ళు దాటిన తర్వాత కూడా ఆయన.. గడ్డం, కనుబొమలు కలిగి ఉండటం చూపరులను విస్మయానికి గురి చేస్తోంది. తన జీవితాన్ని బౌద్ధ మతానికి అంకితం చేసిన ఫుహౌ మరణం తర్వాత ఆయన భౌతికకాయాన్ని ఓ తొట్టిలో భద్రపరిచారు. ఫుహౌ మరణానంతరం మూడేళ్ళ తర్వాత బుద్ధుడుగా మారతానని చెప్పాడంటూ అనుచరులు ఇటీవల ఆ బౌద్ధ సన్యాసి మమ్మీని తెరచి చూశారు. విలక్షణంగా ఉండే ఆయన గుబురు గడ్డంతోపాటు.. కనుబొమలు కూడా ఎప్పట్లాగే ఉండటాన్నిచూసి శిష్యగణం నిశ్చేష్టులయ్యారు. 1919 సంవత్సరంలో జన్మించిన ఫుహౌ 2012 జూన్ నెలలో మరణించారు. అప్పటికి ఆయనకు 94 ఏళ్ళ వయసు. పదమూడవ ఏటనే బౌద్ధమతం స్వీకరించిన ఆయన... అప్పట్లో తల నీలాలను తీయించుకొని గుండుతో... తూర్పు ప్రావిన్స్, ప్రధాన నగరం ఖ్వాంన్జులోని ఓ మఠంలో చేరారు. ఆయన ధాతృత్వంతో పులకించిపోయిన సహచరులు ఆయన్ను అమితంగా గౌరవించడం ప్రారంభించారు. ఆ తర్వాత కొన్నాళ్ళకు ఆయనను ఖ్వాంన్జు ఫుజ్ హావ్ దేవాలయ మఠాధిపతిగా నియమించారు. బౌద్ధ సన్యాసి అయిన ఫుహౌ మరణించిన మూడేళ్ళకు బుద్ధుడుగా మారతానని చెప్పడంతో ఆయన శరీరాన్ని శిష్యుడైన జియాంగ్ యుఫెంగ్... కమలంవంటి ఓ తొట్టిలో ప్రత్యేక భంగిమలో భద్రపరిచాడు. అయితే గతవారం ఫుజ్ హావ్ ఆలయంలో ఫుహౌను భద్రపరిచిన తొట్టెను తెరిచి చూసిన శిష్యులు... మూడేళ్ళు దాటినా ఆయన శరీరం యథాస్థితిలో ఉండటంతోపాటు.. గడ్డం, కనుబొమలు కలిగి ఉండటంతో ఫుహౌ నిజంగా బుద్ధుని అవతారమేనని ప్రకటించారు. అంతేకాక భవిష్యత్తులో ఆయన శరీరం సురక్షితంగా ఉండేందుకు కావలసిన ఏర్పాట్లు చేసి... ప్రజలు, భక్తులు సందర్శించేందుకు వీలుగా సిద్ధం చేస్తున్నారు. అయితే ఆధ్యాత్మిక పరమైన బౌద్ధ కర్మల పట్ల చైనాలోని అధిక శాతం ప్రజలు ఎప్పట్నుంచో అనుమానాలు వ్యక్తం చేస్తున్నా... స్థానిక టావోయిజం, ఇస్లాం మతం, ప్రొటెస్టంట్, కాథలిక్ మత సంస్థలతోపాటు బుద్ధిజం కూడా అధికారికంగా ఒకటి కావడంతో సన్యాసులు పారంపర్యంగా వారి సంప్రదాయాలను కొనసాగిస్తున్నారు. -
అమరావతికి అంకురార్పణ
అది తథాగతుడు నడయాడిన నేల. ధర్మ వర్తననూ, సామాజిక ఆచరణనూ ఆయనే స్వయంగా బోధిస్తున్న వేళ చెవులారా విని తరించిన గడ్డ. అనంతర కాలంలో అశోక చక్రవర్తి ఆదేశాలతో బుద్ధుడి దంతావశేషాన్ని నిక్షేపించుకుని వినువీధికెగసిన అతి పెద్ద స్థూపమూ ఇక్కడిదే. పొత్తిళ్ల దశనుంచి బౌద్ధం ఎదిగిన క్రమానికీ... దాని అత్యున్నత దశకూ...అందులో సాగిన అంతర్మథనానికీ... పర్యవసానంగా సంభవించిన అనేక మార్పులకూ...చివరకు దాని అవసాన దశకూ అమరావతి ప్రత్యక్ష సాక్షి. అమరావతి జైన మతం అభివృద్ధినీ చూసింది... అది అప్రాధాన్యంగా మారడాన్నీ గమనించింది. శైవం వీర శైవమై తాండవమాడటాన్నీ తిలకించింది. బహుశా తనను ఒరుసుకుంటూ ప్రవహిస్తున్న కృష్ణమ్మలో కొత్త నీరొచ్చి పాత నీరును సాగనంపుతున్న తీరులో ఈ ఘట్టాలన్నిటికీ అది సాదృశ్యాన్ని వెతుక్కుని ఉంటుంది. ఇంతటి మహత్తరమైన, ఉత్తేజపూరితమైన సన్నివేశాలను పొదువుకొని పునీతమైంది గనుకనే అది అమరావతి అయి ఉంటుంది. అమరావతి అంటే మృత్యువు దరి చేరలేని ప్రదేశం. సహస్రాబ్దాల చరిత్ర కలిగిన ఆంధ్రుల జీవనంతో అనేక శతాబ్దాలపాటు పెనవేసుకుపోయిన ప్రదేశం అమరావతి. ఇంతటి ఘన చరిత్ర గల ప్రాంతాన్ని తనలో కలుపుకొని అదే పేరిట ఆవిర్భవించబోతున్న నవ్యాంధ్రప్రదేశ్ రాజధానికి విజయ దశమి పర్వదినాన గురువారం ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ రాజధాని ప్రజా రాజధానిగా రూపుదిద్దుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ప్రకటించి ఉన్నారు. ఆయన ఏ అర్ధంలో ప్రజా రాజధాని అన్నారోగానీ...మన దగ్గరున్న అత్యున్నత శ్రేణి ఇంజనీరింగ్ నిపుణులను విస్మరించి సింగపూర్ ప్రభుత్వ సౌజన్యంతో, వారి ఆలోచనాధోరణులతో రూపొందించిన బ్లూప్రింట్‌లో అందుకు సంబంధించిన అంశాలు ఛాయామాత్రంగానైనా లేవు. ఇక రాజధాని నగరం కోసం భూములు తీసుకునే ప్రక్రియ అంతకు చాలా ముందే మొదలై...రైతులు, కౌలు రైతులు, రైతుకూలీల జీవితాల్లో ఎంతటి కల్లోలాన్ని సృష్టించిందో అందరూ చూశారు. పంట భూముల్లో ఉన్నట్టుండి మంటలంటుకున్నాయి. సెక్షన్ 144, సెక్షన్ 30లతో భయానక వాతావరణం సృష్టించారు. సామాజిక ప్రభావ మదింపు (ఎస్ఐఏ) అనేదే లేదు. స్వచ్ఛందంగా ఇవ్వకపోతే భూసేకరణ చట్టాన్ని ప్రయోగించి బలవంతంగా లాక్కొంటామన్న బెదిరింపులు నిత్యకృత్యమయ్యాయి. విభజన జరిగాక ఏర్పడ్డ నవ్యాంధ్ర ప్రదేశ్‌కు రాజధానిగా ఉండగల సౌకర్యవంతమైన నగరమంటూ లేకపోవడం వాస్తవం. దీన్నేవరూ కాదనరు. కాకపోతే ముక్కారు పంటలు పండే చోట...కూరగాయల సాగులో దేశానికే తలమానికమైనచోట... పూల పరిమళాలు గుప్పున పలకరించేచోట దీనికి పూనుకోవడమెందుకని అందరూ అడిగారు. మీరనుకున్నచోటే రాజధాని నిర్మించండి...అందుకు మెట్ట ప్రాంతముంది, ఎకరాలకొద్దీ ప్రభుత్వ భూములున్నాయన్నారు. ప్రపంచ ప్రఖ్యాత రాజధానులేవీ 2,000 ఎకరాలకు మించి లేవని గుర్తు చేశారు. సమాచార సాంకేతికత అపారంగా విస్తరించిన వర్తమాన పరిస్థితుల్లో ఆ మాత్రం కూడా అవసరం ఉండదని తెలిపారు. సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, ఇతర ముఖ్యమైన పరిపాలనా కార్యాలయాలు ఉండే సీడ్ క్యాపిటల్‌ను ఒక పరిమిత ప్రాంతంలో నిర్మిస్తే దానికి అనుబంధంగా క్రమేపీ అన్నీ విస్తరిస్తాయని... తమ భూములకు భవిష్యత్తులో మంచి ధర పలికితే వాటిని అమ్ముకోవాలా, లేదో రైతులే నిర్ణయించుకుంటారని అన్నారు. అభివృద్ధిని కేంద్రీకరించడం పర్యవసానంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో జిల్లాలు వెనకబడిన ప్రాంతాలుగా మిగిలిపోయాయని గణాంకాలతో సహా వివరించారు. కనుక కీలకమైనవాటన్నిటినీ వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పాటుచేయాలని సూచించారు. ఇలా చెప్పినవారిలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే కాదు...మేథా పాట్కర్, ఈఏఎస్ శర్మ, జయప్రకాశ్ నారాయణ్ వంటి మేథావులు, పౌర సమాజ కార్యకర్తలు ఉన్నారు. బాబు ప్రభుత్వం వీటన్నిటినీ పెడచెవిన పెట్టింది. అసలు ఈ విషయాన్ని అసెంబ్లీలో చర్చించడానికే ఇష్టపడలేదు. ఒకపక్క రాజధాని నగరానికి అమరావతిగా నామకరణం చేసి... దాని స్ఫూర్తినీ, సారాన్ని విస్మరించి ఇంత అప్రజాస్వామికంగా, ఇంత ఏకపక్షంగా వ్యవహరించడం, దాన్నొక రియల్ ఎస్టేట్ వెంచర్‌గా చూడటం, రైతుల భూముల్ని వ్యాపారులకు కట్టబెట్టే పనికి పూనుకోవడం బాబుకు తప్ప మరెవరికీ సాధ్యం కాదు. ఒక కొత్త రాజధానిని నిర్మించే అవకాశం వచ్చినప్పుడు రాశిలోగాక వాసిలో...స్థాయిలోగాక సారంలో అది సమున్నతంగా ఉండేలా చూడటం...దాన్ని సాధారణ పౌరులకు సైతం నివాసయోగ్యంగా చేయడం పాలకులుగా ఉండేవారి బాధ్యత. ఆ బాధ్యతను విస్మరిస్తే...రాష్ట్రం నలుమూలలా ఉండే పౌరులందరూ తమ జీవిక కోసం రాజధాని నగరానికి వలస రాక తప్పని స్థితి కల్పిస్తే...ఎలాంటి నగరానికైనా అనుబంధంగా ఏర్పడేవి మురికి వాడలే! అప్పుడు అక్కడి రోడ్లు నరకానికి నకళ్లవుతాయి. చిన్న చిన్న సదుపాయాలు కూడా అందని ద్రాక్షలవుతాయి. పౌరులంతా నానా యాతనలూ పడతారు. ఇందుకు బెంగళూరు, ముంబై నగరాలు మాత్రమే కాదు... స్వాతంత్య్రానంతరం రూపుదిద్దుకున్న చండీగఢ్, గాంధీనగర్ వంటివి కూడా ప్రత్యక్ష సాక్ష్యం. ఒక్క రాయ్‌పూర్ మాత్రం ఇందుకు మినహాయింపు అది పూర్తిగా స్వదేశీ నమూనా. దురదృష్టవశాత్తూ బాబుకు రాయ్‌పూర్ కాక సింగపూర్ నగరం ఆదర్శంగా మారింది. ఇక ప్రపంచ దేశాల మాటేమోగానీ... నదీ తీరాల్లో నగర నిర్మాణాలున్నచోట్ల ఆ నదులు కాలుష్య కాసారాలవుతుండటం ఇక్కడి వాస్తవం. గంగా, యమున నదులకే ఇది తప్ప లేదు. అమరావతి నిర్మాణంలో పొంచి ఉన్న ఈ ప్రమాదాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించినట్టు కనబడదు. ఒకపక్క కొత్త రాష్ట్రానికి అన్నీ సమస్యేలేనని చెబుతూనే, దేనికీ డబ్బుల్లేవంటూనే రూ. 400 కోట్ల ప్రజాధనంతో అట్టహాసంగా శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించడంవల్ల కేంద్రానికి ఎలాంటి సంకేతాలు వెళ్తాయి? ప్రత్యేక హోదా హామీ అమలుపై కేంద్రీకరించి దాన్ని సాకారం చేసుకోవాల్సిన తరుణంలో ఈ హడావుడేమిటి? ఈ ఆర్భాటాలేమిటి? కనీసం ఈ క్షణంనుంచి అయినా పాలకులకు వివేచన కలగాలని... తాము చేయాల్సిందేమిటో, చేస్తున్నదేమిటో గ్రహింపునకు రావాలని సామాన్యులు కోరుకుంటున్నారు. -
పరిపూర్ణ బౌద్ధుడు దొమ్మేటి
ప్రజ్ఞ, శీలం, కరుణ ప్రధాన మార్గాలుగా కుల మతాలకు అతీతంగా నడిచే బౌద్ధ ధర్మం అశోకుని కాలంనుంచి నవ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ వరకూ ఎందరికో స్ఫూర్తినిచ్చింది. మరెందరికో ఇప్పటికీ ఆచరణాత్మక విధానంగా ఉన్నది. ఆ వరసలో బౌద్ధాన్ని త్రికరణశుద్ధిగా ఆచ రించి ప్రచారం చేసిన ప్రముఖుడు దొమ్మేటి సత్య నారాయణ బోధి ఈ నెల 13న కాకినాడలో పరిని ర్వాణం చెందారు. 70వ దశకంలో పశ్చిమ బెంగాల్లో రైల్వే శాఖలో పనిచేస్తూ అక్కడి మార్క్సిస్టు మేధావుల ప్రభావంతో రైల్వే ఉద్యోగుల నాయకు డిగా ఎదిగి ఆయన అనేక పోరాటాలను నిర్వహిం చారు. 1974లో దేశవ్యాప్తంగా జరిగిన రైల్వే సమ్మె లో ప్రముఖ పాత్రవహించి ఆ క్రమంలో ఉద్యోగాన్ని పోగొట్టుకున్నారు. జార్జి ఫెర్నాండెజ్‌తో సాన్నిహి త్యం కారణంగా జనతాపార్టీ పాలనలో తిరిగి ఉద్యో గాన్ని పొంది అక్కడే పనిచేస్తూ 1984లో రిటైరయ్యా రు. ఉద్యోగ విరమణానంతరం కాకినాడలో స్థిరప డ్డాక ఆయన ఆలోచనలన్నీ బౌద్ధం చుట్టూ తిరిగా యి. 1988లో బౌద్ధ ధర్మాచరణలో మమేకం కావడా నికి ముందు ఆయన దళిత రచయిత లు, కవులు, మేధావుల ఐక్యవేదికకు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. బోధిగా మారాక సామాజికంగా ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. వీటన్నిటినీ అధిగమించడమే కాదు... కుటుంబం మొత్తం బౌద్ధ ధర్మాచరణకు బద్ధులయ్యేలా చేయగలిగారు. దేశవ్యా ప్తంగా ఉన్న బౌద్ధభిక్షువులతో సత్యనారాయణ బోధి నిత్య సంబంధాల్లో ఉంటూ బౌద్ధ ధర్మప్రచారంలో, అందుకు సంబంధించిన సాహిత్య అధ్యయనంలో తలమునకలయ్యారు. సుదీర్ఘకాలం బెంగాల్లో ఉం డటంవల్ల కావొచ్చు... హిందీ, ఆంగ్లం, ఒరియా, మరాఠీ, బెంగాలీ భాషల్లో ఆయన సంపూర్ణంగా పట్టు సాధించారు. కలంపట్టి ‘ఈ మతమేమిటి?’, ‘ఆర్య అష్టాంగ మార్గం’, ‘మీ కష్టాలను అధిగమించ డమెలా?’వంటి ఎన్నో స్వతంత్ర రచనలు చేశారు. హిందీలో ఉన్న సచిత్ర ఫూలే జీవిత చరి త్రను తెలుగులోకి అనువదించారు. ఎ.ఎస్. ధమ్మానంద ఆంగ్ల గ్రంథాలను తెలుగులోకి అనువదించారు. దేశం లోని దాదాపు అన్ని విశ్వవిద్యాలయాల్లో బుద్ధిజంపై పత్రాలు సమర్పించారు. ధమ్మపథం ఆధారంగా దూరదర్శన్‌లో 2002లో జాతక కథలపై ప్రసంగాలు చేశారు. 1996 నుంచి పరినిర్వాణం పొందేవరకూ ఆకాశవాణిలో బుద్ధ చింతన పేరిట దాదాపు వంద ప్రసంగాలు చేశారు. బౌద్ధధర్మంపై కరపత్రాలు రూపొందించి భుజా నికి ఎప్పుడూ వేలాడే సంచీలో ఉంచుకుని ఎక్కడికెళ్లినా పంచేవారు. సత్యనారా యణ బోధి జ్ఞానతృష్ణ అపరిమితమైనది. బౌద్ధ ధర్మప్రచారం కోసం దేశవ్యాప్తంగా జరిగిన సెమి నార్లు, సభల్లో పాల్గొనేందుకు ఆయన చేసిన పర్యట నలకు అవధుల్లేవు. ఈ జిల్లాలోని కోరుకొండలో ఉన్న బౌద్ధారామం విశిష్టతను తెలియజేస్తూ 2007లో రాజమండ్రిలో ఆయన చేసిన ప్రసంగం దేశం నలుమూలలనుంచీ వచ్చిన మేధావులను, పురావస్తు శాస్త్రవేత్తలను ఎంతగానో ఆకట్టుకున్నది. కృష్ణా జిల్లాలోని చల్లపల్లిలో పదిరోజు లుండి అక్కడ పదిహేను ఎకరాల విస్తీర్ణంలో ఉన్న మహాబోధి విహారాన్ని, దాని ప్రత్యేకతను వెలుగు లోకి తెచ్చిన గొప్ప వ్యక్తి సత్యనారాయణ బోధి. ప్రశాంత చిత్తం, ప్రసన్న వదనం, స్నేహశీలత...తన విశ్వాసాల కోసం దృఢ సంకల్పంతో పనిచేసే గుణం ఆయన సొంతం. సత్యనారాయణ బోధి పెద్ద కుమారుడు సుధాకరరావు చెప్పినట్టు కోటానుకోట్ల విలువచేసే బుద్ధిజాన్ని కుటుంబానికీ, తనచుట్టూ ఉన్న సమా జానికీ పంచి, ఆ ధర్మంలో నడిచేందుకు ఎందరికో స్ఫూర్తినిచ్చిన విశిష్ట వ్యక్తి సత్యనారాయణ బోధి. ఆయనకిదే నా స్మృత్యంజలి. (నేడు కాకినాడలో సత్యనారాయణ బోధి సంస్మరణ సభ సందర్భంగా) జి. సుబ్బారావు కొత్తపేట ఫోన్ 9959335876 -
ఆలయాలను ఫొటో తీస్తున్నారా?
హిందూ, జైన, బౌద్ధ దేవాలయాల సందర్శనకు వెళ్లినప్పుడు అక్కడ తామూ ఫొటోలు దిగడానికి ఆసక్తి చూపుతారు. వాటిని ఎవరికైనా చూపించడానికి ‘ఫలానా దేవాలయం ముందు ఫొటో దిగాం’ అని చెప్పుకుంటారు. కానీ, అంతకన్నా దేవాలయ నిర్మాణంపై దృష్టి పెట్టి తీసిన ఫొటోలతో ఎదుటివారి ముందు ఒక చారిత్రక ఘట్టాన్ని ఆవిష్కరించవచ్చు. ముందుగా ఆలయం వెలుపలి నిర్మాణం అంతా ఫొటోలో వచ్చే విధంగా జాగ్రత్తపడాలి. తర్వాత నిర్మాణ కళకు సంబంధించిన వివరాలను తెలియజేసే ఒక్కో భాగాన్ని క్లోజప్ షాట్స్‌లో తీసుకోవాలి. ఆ తర్వాత దేవాలయాల లోపలి గదులను ఫొటోలకు ఎంచుకోవాలి. గదులు చీకటిగా ఉంటాయి. ఆ చీకటిని చీల్చుకుంటూ వచ్చే కాంతి మార్గం, దీపాల వెలుగు ద్వారా లోపలి అద్భుతాన్ని చూపించగలగాలి. పూజారులు, బౌద్ధ సన్యాసులు, అఘోరాలు.. ఇలా ఆ ఆలయానికి ప్రత్యేకం అనిపించేవారిని ఫొటో తీసుకోవాలి. ఇవన్నీ వరుస క్రమంలో అమర్చి ఒక ఆల్బమ్ తయారుచేస్తే మీరు వెళ్లి, సందర్శించిన ఆలయం, అక్కడి శిల్ప సంపద, చారిత్రక వైభవం చక్కగా కళ్లకు కడతాయి. నోట్: ఆలయాలలో ఫొటోలకు అనుమతులు తప్పనిసరి. ఫొటో నిషేధిత ఆజ్ఞలను తప్పక పాటించాలి. -
ఇంద్రియాలను జయించిన మహావీరుడు
ఏప్రిల్ 13న మహావీరుడి జయంతి హిందూ, జైన, బౌద్ధ, సిక్కు వుతాల్లో బౌద్ధ, జైనమతాలు కొంచెం భిన్నమైనవి. అహింస, సత్యవాక్పాలన, ఆస్తేయం (దొంగతనం చేయకుండా ఉండటం), బ్రహ్మచర్యం, అపరిగ్రహం (ఇతరుల ఆస్తిని కబళించకపోవటం) అనే ఐదు సూత్రాల ఆధారంగా ఏర్పడినదే జైనమతం. జినులు అంటే జయించినవారు అని అర్థం. వారు జయించింది ఇంద్రియాలను, ఆ తర్వాత జనుల హృదయాలను. జైనమత వ్యాపకుడైన వర్థమాన మహావీరుడు రాజుగా పుట్టాడు. తల్లిదండ్రులు ఆయనకు పెట్టిన పేరు వర్ధమానుడు. పెరిగి పెద్దవాడయ్యాక ఆయన ఇతర రాజ్యాల మీద దండెత్తి రాజులను జయించి ఉంటే అందరూ వీరుడని కొనియాడేవారేమో! అయితే వర్థమానుడు అలా చేయలేదు. రాగద్వేషాలను, అంతఃశత్రువులైన అరిషడ్వర్గాలను జయించి మహావీరుడయ్యాడు. క్రీ.పూ. 599లో నేటి బీహార్‌లోని విదిశ (నాటి వైశాలి) లో త్రిశల, సిద్ధార్థుడు అనే రాజదంపతులకు జన్మించిన వర్థమానుడు బాల్యం నుంచి ప్రాపంచిక విషయాల మీద ఏమాత్రం ఆసక్తి చూపేవాడు కాదట. యశోధర అనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అయితే తల్లిదండ్రుల మరణానంతరం భార్యాబిడ్డలను వదిలి సన్యాసం స్వీకరించాడు. వృషభనాథుడు ప్రతిపాదించిన జైనమతాన్ని తన బోధనల ద్వారా, ఆచరణ ద్వారా బలోపేతం చేశాడు. వర్థమాన మహావీరుడిని ఆనాటి ప్రజలు సాక్షాత్తూ భగవంతుడి ప్రతిరూపంగా ఆరాధించారు. - డి.వి.ఆర్. వర్థమానుడి తత్వం ద్వైతం. ఆయన సిద్ధాంతం ప్రకారం రెండు రకాల పదార్థాలున్నాయి. ఒకటి జీవుడు, రెండు అజీవుడు. జీవుడంటే ఆత్మ, అజీవుడంటే పదార్థం. అజీవుడు అణునిర్మితమైతే, జీవుడు అమర్త్యం. మనిషి మూర్తిత్వం ఈ రెండింటితోనూ నిర్మితమవుతుంది. కర్మల కారణంగానే జన్మలు ఏర్పడతాయి. జన్మరాహిత్యం చేసుకోవాలంటే మోహవికారాదులను, ఇంద్రియానుభవాలను తగ్గించుకోవాలి. అందుకు సన్యాసం, తపస్సు రెండూ అవసరమవుతాయి. తిరిగి పుట్టని ఆత్మ నిర్వాణాన్ని పొందుతుంది. అంటే నిష్క్రియాత్మకమైన, నిర్మలమైన శాశ్వతానందం. నిర్వాణం లక్ష్యంగా ఉన్నవారు దుష్కర్మలను పరిహరించాలి. అంతేకాదు, నూతనకర్మలు చేయకుండా ఉన్న కర్మలను క్రమంగా నశింపజేసుకోవాలి. ఇలాంటి ప్రవర్తన త్రిరత్నాల ఆధారంగా జరగాలి. అంటే సమ్యక్ విశ్వాసం, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ ప్రవర్తన. -
ఏలూరులో బుద్ద విగ్రహం వద్ద వినూత్న నిరసన