కట్టుకథలు, అర్ధ సత్యాలు మాత్రమే! | Mallepally Laxmaiah Article on Ambedkarite, Neo Buddhist Half Truth | Sakshi
Sakshi News home page

కట్టుకథలు, అర్ధ సత్యాలు మాత్రమే!

Published Fri, Oct 28 2022 1:18 PM | Last Updated on Fri, Oct 28 2022 1:18 PM

Mallepally Laxmaiah Article on Ambedkarite, Neo Buddhist Half Truth - Sakshi

అంబేడ్కర్‌ ప్రతి మాటనూ అంబేడ్కర్‌వాదులూ, నియోబుద్ధిస్టులూ గుడ్డిగా సమర్థిస్తారు. అంబేడ్కర్‌పై చిన్న విమర్శను కూడా వారు సహించలేరు.

అక్టోబర్‌ 21న మల్లెపల్లి లక్ష్మయ్య రాసిన ‘ఆ ప్రతిజ్ఞలే మార్గదర్శకాలు’ వ్యాసానికి ఇది స్పందన. గత అరవై ఏళ్లుగా నియోబుద్ధిస్ట్‌ లాబీ, అంబేడ్కర్‌వాదులూ అంబేడ్కర్‌ గురించి కట్టుకథలు, అర్ధసత్యాలు సృష్టించడంలో విజయం సాధించారు. అరుణ్‌ శౌరి (వర్షిపింగ్‌ ఫాల్స్‌ గాడ్స్‌) తప్ప ఎవరూ అంబేడ్కర్‌కు సంబంధించిన నిజానిజాలను  వెలికితీసే విషయంలో ధైర్యం చేయలేకపోయారు. 

అంబేడ్కర్‌ ప్రతి మాటనూ అంబేడ్కర్‌వాదులూ, నియోబుద్ధిస్టులూ గుడ్డిగా సమర్థిస్తారు. అంబేడ్కర్‌పై చిన్న విమర్శను కూడా వారు సహించలేరు. వారికి మాత్రం హిందూ మతంపైనా, హిందూ దేవుళ్లపైనా విమర్శలు చేసే వాక్‌ స్వాతంత్య్రం ఉంది. అంబేడ్కర్‌ స్వయంగా తన రచనల్లో హిందూ మతం పైనా, బ్రాహ్మణులపైనా తన ద్వేషాన్ని వెళ్లగక్కారు. 

1956 అక్టోబర్‌ 14న అమాయక హిందువులను బౌద్ధ మతంలోకి మారుస్తూ దీక్ష ఇచ్చిన సమయంలో చేయించిన 22 ప్రతిజ్ఞల్లోనూ ఇదే విద్వేషం కనిపిస్తుంది. ఆరోజు అక్కడ చేరినవారందరూ తాము బౌద్ధంలోకి మారుతున్నామనే అనుకున్నారు. బౌద్ధంలో ఈ 22 ప్రతిజ్ఞలు లేవని వారెవరికీ తెలియదు. నిజానికి అంబేడ్కర్‌ బౌద్ధమతంలోకి మార్చే పేరుతో ఆయనే ఓ సొంత మతాన్ని ఆవిష్కరించారు. 

 డాక్టర్‌ పి. కృష్ణమోహన్‌ రెడ్డి
అసోసియేట్‌ ప్రొఫెసర్, ఎస్‌వీయూ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement