respond
-
ఉద్యోగికి యాక్సిడెంట్.. మేనేజర్ రియాక్షన్‌కు షాక్!
ఆఫీసులకు ఆలస్యంగా వస్తే.. ఉద్యోగులు తమ ఆలస్యానికి అనేక కారణాలు చెబుతారు. కారణం బలమైనదైతే బాస్ కూడా ఏమి అనలేరు. అయితే ఇటీవల ఒక ఉద్యోగి ఆఫీసుకు లేటుగా రావడానికి కారు ప్రమాదం కారణమని చెప్పినా.. మేనేజర్ వ్యవహరించిన తీరు ఉద్యోగిని చాలా బాధించింది. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.ఉద్యోగి కారు ప్రమాదానికి గురై ముందు భాగం భారీగా దెబ్బతినింది. ఈ విషయాన్ని మేనేజర్‌ను తెలియజేస్తూ.. దెబ్బతిన్న కారు ఫోటోలను షేర్ చేశారు. ఉద్యోగికి ఏమైందో అడగటం మానేసి.. మీరు ఏ సమయానికి ఆఫీసుకు రావాలనుకుంటున్నారో తెలియజేయండి అని మెసేజ్ చేశారు. అంతటితో ఆగకుండా.. కుటుంబంలో ఎవరైనా చనిపోతే తప్పా గైర్హాజరు క్షమించరానిదని వెల్లడించారు.ఉద్యోగి, మేనేజర్ మధ్య జరిగిన ఈ సంభాషణకు సంబంధించిన స్క్రీన్ షాట్స్.. ఉద్యోగి సోషల్ మీడియాలో షేర్ చేశారు. మీ మేనేజర్ ఇలా చెబితే మీరందరూ ఎలా స్పందిస్తారు? అని ప్రశ్నించారు.దీనిపైన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తూ విరుచుకుపడుతున్నారు. ప్రమాదం జరిగినప్పుడు ఉద్యోగి క్షేమం గురించి అడగకుండా.. పని గురించే ఆలోచించే మేనేజర్ మీద చాలామంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఉద్యోగుల మానసిక ఆరోగ్యం మీద పెద్ద ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.ఆ ఉద్యోగానికి రాజీనామా చేస్తాను, అని ఒక వ్యక్తి అంటే.. ఆ కంపెనీకి ఇకపై వెళ్ళవద్దు అని సలహా ఇచ్చారు. ఎందుకు ఉద్యోగం వదిలేసావు అనే విషయాన్ని ఎవరైనా అడిగితే, స్క్రీన్ షాట్స్ చూపించండి అని అన్నారు. మేనేజర్‌కు కూడా ఇలాంటి అవస్థ వచ్చేలా చేస్తానని ఇంకొకరు పేర్కొన్నారు.what would y’all respond with if your manager says this? pic.twitter.com/bZznlPZrLT— kira 👾 (@kirawontmiss) October 22, 2024 -
ఆగస్టు నుంచి 'జీమెయిల్' షట్‌డౌన్! నిజమేనా?
ప్రపంచవ్యాప్తంగా చాలామందికి జీమెయిల్ లాగిన్ చేయడంతోనే రోజు ప్రారంభమవుతుంది. మరి కొందరు రోజుకు ఒక్కసారైనా జీమెయిల్ చూస్తుంటారు. అలాంటి జీమెయిల్ సర్వీస్ త్వరలో నిలిచిపోనున్నట్లు నెట్టింట్లో కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో చాలా మంది యూజర్స్ ఆందోళనకు గురయ్యారు. గూగుల్ కంపెనీ దీనిపై స్పందిస్తూ.. జీమెయిల్ యూజర్స్ భయపడాల్సిన అవసరం లేదని, కేవలం HTML ఫీచర్ మాత్రమే నిలిచిపోనున్నట్లు క్లారిటీ ఇచ్చింది. ఈ విషయాన్ని కంపెనీ గత సెప్టెంబర్‌లోనే ధ్రువీకరించింది. జీమెయిల్ సర్వీసు నిలిచిపోనున్నట్లు వస్తున్న వార్తలు నమ్మొద్దంటూ సంస్థ అధికారికంగా వెల్లడించింది. Gmail is here to stay. — Gmail (@gmail) February 22, 2024 నిజానికి గత ఏడాది సెప్టెంబర్‌లోనే జీమెయిల్ సర్వీసులో HTML ఫీచర్ నిలిపివేయాలని కంపెనీ యోచిస్తున్నట్లు తెలిపింది. దీని ప్రకారం ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ ఫీచర్‌ను నిలిపివేయనున్నట్లు, ఇదే స్టాండర్డ్ వ్యూకు మారుతుందని సంస్థ స్పష్టం చేసింది. గూగుల్ సర్వీస్ మరింత మెరుగుపడాలనే ఉద్దేశ్యంతోనే కంపెనీ చిన్న అప్డేట్స్ జోడించనున్నట్లు, అయితే ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్న వార్తల ప్రకారం జీమెయిల్ పనిచేయకపోవడం అనేది ఉండదని, సంబంధిత అధికారులు ఎక్స్ (ట్విటర్) వేదికగా తెలిపింది. ఇదీ చదవండి: దుబాయ్ వెళ్లే భారతీయులకు శుభవార్త - ఏంటో తెలుసా.. this is insane. I hate this company pic.twitter.com/pXBRezPAyX — Daniel (@growing_daniel) February 22, 2024 -
పక్క కంపెనీల నుంచి లాగేసుకోవడం కరెక్టేనా? టెక్ సీఈవోల మాటలు ఇవే..
అన్ని పరిశ్రమల్లోనూ పోటీ అనేది సర్వసాధారణం. అయితే ఇది ఐటీ పరిశ్రమలో మరీ ఎక్కువైంది. పోచింగ్ (ఉద్యోగుల అక్రమ వలసలు) ఐటీ కంపెనీల మధ్య అనారోగ్యకరమైన పోటీకి దారితీస్తోంది. దీనిపై మిశ్రమ స్పందన వస్తోంది. దేశీయ ఐటీ దిగ్గజాలు విప్రో, ఇన్ఫోసిస్‌ల నుంచి చాలా మంది టాప్ ఎగ్జిక్యూటివ్‌లు బయటికి వెళ్లిపోయారు. వీరిలో చాలా మంది ప్రత్యర్థి కాగ్నిజెంట్‌లో చేరారు. కాగ్నిజెంట్ సీఈఓ రవి కుమార్ తాను ఇంతకుముందకు పనిచేసిన ఇన్ఫోసిస్, విప్రో నుంచి దాదాపు 20 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను నియమించుకున్నట్లు సమాచారం. విప్రో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జతిన్ దలాల్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మహ్మద్ హక్ సహా 10 మంది టాప్ ఎగ్జిక్యూటివ్‌లను కాగ్నిజెంట్‌కు కోల్పోయింది. ఈ ధోరణికి అడ్డుకట్ట వేయడానికి కాగ్నిజెంట్‌పై దావా వేసింది. ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు సీఎఫ్ఓ జతిన్ దలాల్‌ను రూ.25.15 కోట్ల నష్టపరిహారం కోరింది. ఐటీ కంపెనీల మధ్య సాగుతున్న ఈ పోచింగ్ వార్‌పై ఆయా కంపెనీల సీఈవోలు స్పందించారు. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సందర్భంగా సీఎన్‌బీసీ-టీవీ18తో ఎవరెవరు ఏమేమి అన్నారో ఇప్పుడు చూద్దాం.. ఒప్పందాన్ని గౌరవించడం ముఖ్యం తాము ఎవరికీ ఉపాధి లేదా ఉద్యోగ అవకాశాలను నిరోధించడం లేదని, సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని గౌరవించడం చాలా ముఖ్యం, ఇదేమీ అసమంజసమైన అభ్యర్థన కాదని విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ అన్నారు. ఒప్పంద ఉల్లంఘనతో తమ సంస్థ సమాచార గోప్యతకు భంగం కలగకుండా తమను తాము రక్షించుకోవాలని కోరుకుంటున్నామని తెలిపారు. మేము అదృష్టవంతులం ఇన్ఫోసిస్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ సలీల్ పరేఖ్ స్పందిస్తూ "మేము అదృష్టవంతులం. మాకు నాయకత్వ కొరత లేదు. కంపెనీ నాయకత్వ పునర్నిర్మాణాన్ని చాలా త్వరగా పూర్తి చేశాం. కంపెనీలో ఉన్న చాలా మందిని పెద్ద బాధ్యతాయుతమైన పాత్రలలోకి తీసుకున్నాం. అది నిజంగా బాగా పనిచేస్తున్నట్లు అనిపిస్తుంది. కాబట్టి నాకు ఎటువంటి ఆందోళనా కనిపించడం లేదు. నిజానికి మార్పు వల్ల కొన్నిసార్లు ప్రయోజనం కలుగుతుంది" అన్నారు. మాకేం డోకా లేదు "మేము చాలా కాలం నుంచి చాలా స్థిరమైన నాయకత్వాన్ని కలిగి ఉన్నాం. మా తోటివారిలో కొందరికి ఇది రాజీగా అనిపిస్తుంది. కానీ మేము మంచి స్థానంలో ఉన్నందుకు సంతోషిస్తున్నాము" అని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో సి.విజయకుమార్ పేర్కొన్నారు. నా పని మాత్రమే చేస్తున్నా.. “నేను నా పని మాత్రమే చేస్తున్నాను. నేను కాగ్నిజెంట్‌ను ఉద్యోగులు కోరుకునే కంపెనీగా మార్చాలనుకుంటున్నాను” అని కాగ్నిజెంట్ సీఈవో రవి కుమార్ అన్నారు. "ఇది స్థిరమైన ప్రక్రియ. నేను మొదటి నుంచి ఇదే చెప్తున్నాను. కంపెనీ కోసం సమర్థులైనవ్యక్తులను అన్వేషించడమే నా పని. మాకు క్లయింట్ సెంట్రిసిటీ డీఎన్ఏ ఉంది. కంపెనీ వారసత్వాన్ని నేను పునరుద్ధరిస్తున్నాను” అన్నారాయన. -
యాది మరువలేదు.. ‘సాక్షి’ కథనంపై స్పందించిన సీఎంఓ
సాక్షి, కామారెడ్డి: ‘రేవంతన్నా.. నన్ను యాది మరవకు’ శీర్షికన ‘సాక్షి’ మెయిన్‌లో ఆదివారం ప్రచురితమైన కథనంపై ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది. సీఎంఓ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామంలో భిక్కనూరు లక్ష్మి ఇంటికి వెళ్లారు ఆమె కుటుంబ వివరాలు సేకరించారు. గతేడాది మార్చి 28న జిల్లాలో హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా రేవంత్‌రెడ్డి కూలిపోయిన ఇంట్లో ఉంటున్న భిక్క నూరు లక్ష్మి బాధలు ఆలకించారు. అధికారంలోకి రాగానే ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ‘సాక్షి’ కథనం ప్రచురించింది. దీనిపై సీఎంఓ స్పందించి, వివరాలు సేకరించాలని కలెక్టర్‌ను ఆదేశించింది. దీంతో వెంటనే రెవెన్యూ ఇన్స్పె క్టర్ పూల్‌సింగ్, ఏడీ నర్సింహారెడ్డి చిన్నమల్లా రెడ్డి గ్రామానికి వెళ్లి లక్ష్మి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కూలిపోగా మిగిలిన కొద్ది భాగంలో లక్ష్మి కుటుంబం నివసిస్తున్న విషయాన్ని నోట్ చేసుకున్నారు. ఇప్పటికిప్పుడు ఇబ్బంది ఉంటే పొరుగునే ఉన్న తిమ్మక్‌పల్లిలో నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్ రూం ఇల్లు కేటాయిస్తా మని అధికారులు చెప్పారు. అయితే కూలిపోయిన ఇంటి స్థలంలోనే కొత్త ఇల్లు నిర్మాణానికి సాయం అందించాలని లక్ష్మి కోరడంతో ప్రభుత్వానికి ప్రతిపాద నలు పంపిస్తామని రెవెన్యూ అధికారులు పేర్కొ న్నారు. ఈ సందర్భంగా లక్ష్మితో పాటు ఆమె కు టుంబ సభ్యులు ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపారు. -
లిస్టెడ్ కంపెనీలు స్పందించాల్సిందే
న్యూఢిల్లీ: మార్కెట్ పుకార్లు లేదా వార్తలు తదితరాలపై లిస్టెడ్ కంపెనీలు స్పందించవలసి ఉంటుందని క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రకటించింది. అక్టోబర్ 1నుంచి డిస్క్లోజర్ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. వెరసి ఇకపై లిస్టెడ్ కంపెనీలు ప్రధాన మీడియా సంస్థలలో వెలువడే మార్కెట్ రూమర్లను ఖండించడం, లేదా స్పష్టతనివ్వడం వంటివి చేపట్టవలసి ఉంటుంది. మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) రీత్యా టాప్–100 కంపెనీలకు ఆదేశాలు అక్టోబర్ 1నుంచి వర్తించనున్నట్లు సెబీ నోటిఫికేషన్ పేర్కొంది. ఈ బాటలో టాప్–250 లిస్టెడ్ కంపెనీలకు 2024 ఏప్రిల్ 1నుంచి డిస్క్లోజర్ నిబంధనలు అమలుకానున్నాయి. ఈ కంపెనీలన్నీ ప్రధాన మీడియాలో వచ్చే మార్కెట్ పుకార్లను ఖండించడం లేదా వివరణ ఇవ్వడం లేదా స్పష్టం చేయడం వంటివి చేపట్టవలసి ఉంటుంది. అసహజరీతిలో పుట్టే పుకార్లు లేదా వార్తలు లేదా ఇతర సమాచారంపై కంపెనీలు 24 గంటల్లోగా స్పష్టతను ఇవ్వవలసి ఉంటుంది. ప్రత్యేక హక్కులపై.. లిస్టెడ్ కంపెనీల కార్పొరేట్ పాలనను మరింత పటిష్టం చేసేందుకు వీలుగా సెబీ ప్రత్యేక హక్కుల జారీపైనా మార్గదర్శకాలను విడుదల చేసింది. తద్వారా కొంతమంది ప్రధాన వాటాదారులకు నిరంతరంగా ప్రత్యేక హక్కులను కల్పించడంపైనా సెబీ దృష్టిపెట్టింది. లిస్టెడ్ కంపెనీలు ఎవరికి ఎలాంటి ప్రత్యేక హక్కులను కేటాయించినా సాధారణ సమావేశంలో వాటాదారుల నుంచి అనుమతిని పొందవలసి ఉంటుంది. ఇలాంటి ప్రత్యేక హక్కులను కేటాయించినప్పటినుంచి ప్రతీ ఐదేళ్లలో ఒకసారి ఇందుకు ప్రత్యేక పద్ధతిలో వాటాదారుల అనుమతి తీసుకోవలసి ఉంటుంది. ప్రమోటర్లు, వ్యవస్థాపకులు, ఇతర కార్పొరేట్ బాడీ సభ్యులకు ఇలాంటి ప్రత్యేక హక్కులను జారీ చేయడంపై కొంతకాలంగా సాధారణ వాటాదారులతోపాటు సంస్థాగత ఇన్వెస్టర్లు సైతం ఆందోళనలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో సెబీ తాజా నిబంధనలకు తెరతీసింది. 2024 ఏప్రిల్ నుంచి సెబీ కొత్త మార్గదర్శకాల ప్రకారం ఇకపై లిస్టెడ్ కంపెనీలు డైరెక్టర్ల ఎంపికలోనూ సాధారణ వాటాదారుల నుంచి అనుమతి పొందవలసి ఉంటుంది. 2024 ఏప్రిల్ 1నుంచి ఐదేళ్ల కాలంలో కనీసం ఒకసారైనా వాటాదారుల అనుమతి కోరవలసి ఉంటుంది. 2024 మార్చికల్లా బోర్డులోగల ఎవరైనా గత ఐదేళ్లలో వాటాదారుల నుంచి అనుమతి పొందకుంటే తప్పనిసరిగా అదే ఏడాది మార్చి 31 తదుపరి బోర్డును సమావేశపరచి వాటాదారుల నుంచి గ్రీన్‌సిగ్నల్ పొందవలసి ఉంటుంది. కొనుగోళ్లు, షేర్ల కన్సాలిడేషన్, సెక్యూరిటీల బైబ్యాక్ తదితర మెటీరియల్ సమాచారాన్ని వెల్లడించే గడువును 24 గంటల నుంచి 12 గంటలకు కుదించింది. ఇదేవిధంగా డైరెక్టర్ల బోర్డు తీసుకునే నిర్ణయాలను సమావేశం ముగిసిన తదుపరి 30 నిమిషాలకు వెల్లడించవలసి ఉంటుంది. -
APSRTC: ఫేస్బుక్ పోస్ట్‌కు స్పందించిన ఆర్టీసీ అధికారులు
సాక్షి, విజయవాడ: ప్రయాణికుల అభ్యర్థనలకు ఏపీఎస్ఆర్టీసీ అధికారులు తక్షణమే స్పందిస్తున్నారు. ఫేస్ బుక్ పోస్ట్‌కు ఆర్టీసీ అధికారులు వెంటనే స్పందించారు. 40 మంది ఉన్నాం మాకో బస్సు ఏర్పాటు చేయాలంటూ ఎస్. వెంకటరావు అనే వ్యక్తి ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు. వెంకటరావు అభ్యర్థనకు సత్వరమే స్పందించిన ఆర్టీసీ ఈడీ బ్రహ్మనందరెడ్డి.. పామర్రు నుంచి విజయనగరం జిల్లా నెల్లిమర్లకు బస్సు ఏర్పాటు చేశారు. కాగా, ప్రజా రవాణా సంస్థ ప్రయాణికుల కోసం వివిధ రకాల ఆఫర్లను ప్రకటించింది. ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) మెరుగు పరుచుకునేందుకు ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టారు. అలాగే సీనియర్ సిటిజన్ల (వయో వృద్ధులు)కు టిక్కెట్లో 25 శాతం రాయితీ కల్పిస్తోంది. దీంతోపాటు ఇప్పుడు మరికొన్ని రాయితీలను కల్పించింది. చదవండి: ఆర్టీసీలో ఆఫర్లు.. టిక్కెట్లో 25 వరకు శాతం రాయితీ -
KTR: మాస్టర్‌ప్లాన్‌పై స్పందించిన మంత్రి కేటీఆర్
సాక్షి, కామారెడ్డి జిల్లా: మాస్టర్ ప్లాన్‌పై మంత్రి కేటీఆర్ స్పందించారు. నగరాల అభివృద్ధి కోసమే మాస్టర్‌ప్లాన్ అని ఆయన స్పష్టం చేశారు. మాస్టర్ ప్లాన్‌పై అభ్యంతరాలుంటే ప్రభుత్వం దృష్టికి తేవాలని కోరారు. ప్రజల అభ్యంతరాలను ప్రజాప్రతినిధులు సమగ్రంగా సమీక్షించాలన్నారు. కాగా, మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి కలెక్టరేట్ వద్ద రైతుల ధర్నాకు దిగారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు రైతులకు సంఘీభావం తెలిపారు. కలెక్టర్ వచ్చి మెమోరాండం తీసుకోవాలని రైతుల డిమాండ్ చేశారు. కలెక్టర్ వచ్చే వరకు కదిలేది లేదని రైతులు భీష్మించారు. పోలీసులకు సహకరిస్తామని, అత్యుత్సాహం ప్రదర్శిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బీజేపీ నేత వెంకట రమణారెడ్డి హెచ్చరించారు. చదవండి: కామారెడ్డిలో ఉద్రిక్తత.. బెడిసికొట్టిన మున్సిపల్ మాస్టర్ ప్లాన్! -
పవన్ నోరు ఇప్పటం లేదు
-
అమెరికా అధ్యక్ష బరిలో బరాక్ ఒబామా భార్య.. స్పందించిన మిచెల్
అమెరికా మాజీ ప్రథమ మిచెల్ ఒబామాకి తరుచుగా ఎదరవుతున్న ప్రశ్న అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేస్తారా? లేదా అని. ఈ ప్రశ్న ఆమెకి తన భర్త ఒబామా అధ్యక్షుడిగా (2009 నుంచి 2017) ఉన్న సమయంలో కూడా ఈ ప్రశ్న ఎదురైంది. తదుపరి అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతారా అంటూ పలువురు ఇప్పటికీ ఆమెను ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు ఆమె ఈ విషయమై స్పందించింది. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు మిచెల్. ప్రస్తుతం జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా చక్కగా పాలిస్తున్నారని, అతని పరిపాలనలో ప్రారంభించిన కార్యక్రమాలను ఆమె ప్రశంసించారు. అలాగే బైడెన్ రెండోసారి అమెరికాకు అధ్యక్షుడిగా ఉండాలనుకుంటున్నారా అన్న ప్రశ్నకు కూడా ఆమె చాలా తెలివిగా తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ‘ఇది బైడెన్, అతని కుటుంబం అలోచించుకోవాల్సిన విషయం. ఇది పూర్తిగా బైడెన్ వ్యక్తిగతానికి సంబంధించిన విషయం. అలాగే బైడెన్, జిల్ బైడెన్ ఏమి చేయాలో ఏమి చేయకూడదో ఆలోచించే మిలియన్లమంది వ్యక్తులలో ఒకరిగా తాను ఉండాలనుకోవడం లేదు’ అంటూ కౌంటరిచ్చారు. అయితే ఆమె బైడెన్ మళ్లీ అధ్యక్షుడిగా ఉండాలనుకుంటున్నారా అనే దానికి పూర్తి అంగీకారం ఇవ్వకుండా పరోక్షంగా చెప్పాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పకనే చెప్పారు. (చదవండి: అమెరికాలో ట్రంప్ ఫెయిల్: బైడెన్) -
కట్టుకథలు, అర్ధ సత్యాలు మాత్రమే!
అక్టోబర్ 21న మల్లెపల్లి లక్ష్మయ్య రాసిన ‘ఆ ప్రతిజ్ఞలే మార్గదర్శకాలు’ వ్యాసానికి ఇది స్పందన. గత అరవై ఏళ్లుగా నియోబుద్ధిస్ట్ లాబీ, అంబేడ్కర్‌వాదులూ అంబేడ్కర్ గురించి కట్టుకథలు, అర్ధసత్యాలు సృష్టించడంలో విజయం సాధించారు. అరుణ్ శౌరి (వర్షిపింగ్ ఫాల్స్ గాడ్స్) తప్ప ఎవరూ అంబేడ్కర్‌కు సంబంధించిన నిజానిజాలను వెలికితీసే విషయంలో ధైర్యం చేయలేకపోయారు. అంబేడ్కర్ ప్రతి మాటనూ అంబేడ్కర్‌వాదులూ, నియోబుద్ధిస్టులూ గుడ్డిగా సమర్థిస్తారు. అంబేడ్కర్‌పై చిన్న విమర్శను కూడా వారు సహించలేరు. వారికి మాత్రం హిందూ మతంపైనా, హిందూ దేవుళ్లపైనా విమర్శలు చేసే వాక్ స్వాతంత్య్రం ఉంది. అంబేడ్కర్ స్వయంగా తన రచనల్లో హిందూ మతం పైనా, బ్రాహ్మణులపైనా తన ద్వేషాన్ని వెళ్లగక్కారు. 1956 అక్టోబర్ 14న అమాయక హిందువులను బౌద్ధ మతంలోకి మారుస్తూ దీక్ష ఇచ్చిన సమయంలో చేయించిన 22 ప్రతిజ్ఞల్లోనూ ఇదే విద్వేషం కనిపిస్తుంది. ఆరోజు అక్కడ చేరినవారందరూ తాము బౌద్ధంలోకి మారుతున్నామనే అనుకున్నారు. బౌద్ధంలో ఈ 22 ప్రతిజ్ఞలు లేవని వారెవరికీ తెలియదు. నిజానికి అంబేడ్కర్ బౌద్ధమతంలోకి మార్చే పేరుతో ఆయనే ఓ సొంత మతాన్ని ఆవిష్కరించారు. – డాక్టర్ పి. కృష్ణమోహన్ రెడ్డి అసోసియేట్ ప్రొఫెసర్, ఎస్వీయూ -
వెనక్కి తగ్గేదేలే! రాజీపడం అంటున్న తైవాన్.... చైనాకి స్ట్రాంగ్ వార్నింగ్
తైపీ: బీజింగ్‌లో ఐదేళ్లకు ఒకసారి జరిగే కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ ప్రారంభోత్సవంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తైవాన్‌పై బలప్రయోగాన్ని ఎప్పటికి వదులుకోమని కరాఖండిగా చెప్పారు. అలాగే హాంకాంగ్‌పై పట్టు సాధించి నియంత్రణలోకి తెచ్చుకున్నామని తర్వాత తైవానే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తైవాన్ తీవ్రంగా ప్రతిస్పందించింది. తన సార్వభౌమాధికారం, స్వేచ్ఛపై రాజీపడేదే లేదని, వెనక్కి తగ్గమని తెగేసీ చెప్పింది తైవాన్. ఈ మేరకు తైవాన్ అధ్యక్ష కార్యాలయం ఒక ప్రకటనను కూడా విడుదల చేసింది. ఇరు దేశాల మధ్య శాంతి స్థిరత్వాన్ని కాపాడుకోవటం ఇరుపక్షాల భాద్యత అని నొక్కిచెప్పింది. యుద్ధం ఒక్కటే ఆప్షన్ కాదని తేల్చి చెప్పింది. తైవాన్‌లో సుమారు 23 మిలియన్ల మంది ప్రజలు ఉన్నారని, వారికి తమ భవిష్యత్తును నిర్ణయించుకునే హక్కు ఉందని స్పష్టం చేసింది. అలాగే తాము బీజింగ్ ఏకపక్ష నిర్ణయాన్ని ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించమని తెగేసి చెప్పింది. వాస్తవానికి 2016లో ప్రెసిడెంట్ త్సాయ్ ఇంగ్-వెన్ తొలిసారిగా ఎన్నికైనప్పటి నుంచి చైనాతో ఉన్న సంబంధాలను కట్టడి చేసింది. రాజీకీయాలతో దిగ్బంధం చేసి సైనిక బలగాలతో బలవంతంగా అధీనంలోకి తెచ్చుకోవాలనే కుట్రలను విడిచిపెట్టాలని చైనీస్ కమ్యూనిస్ట్ అధికారులకు పిలుపినిచ్చింది తైవాన్. మరోవైపు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తైవాన్ విషయంలో విదేశీ శక్తులు జోక్యం చేసుకుంటున్నాయని, తైవాన్‌ని స్వతంత్ర దేశంలా ఉంచే క్రమంలో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణాన్ని నెలకొల్పుతున్నారంటూ ఆరోపణలు చేశారు. పైగా శాంతియుత పునరేకీకరణ కోసం ప్రయత్నిస్తాం కానీ యుద్ధం చేయమని హామీ ఇవ్వం అని చెప్పారు. (చదవండి: హాంకాంగ్‌పై నియంత్రణ సాధించాం.. తర్వాత తైవానే.. జిన్‌పింగ్ కీలక ప్రకటన) -
మావోయిస్టు లేఖపై స్పందించిన మంత్రి సీదిరి అప్పలరాజు
సాక్షి, అమరావతి: మావోయిస్టు లేఖపై మంత్రి సీదిరి అప్పలరాజు స్పందించారు. ఇటువంటి లేఖపై స్పందించాల్సి రావడం దురదృష్టకరమన్నారు. ‘‘నేను భూములు ఆక్రమించుకున్నట్లు లేఖలు వచ్చాయి. ఆ భూములతో నాకు ఎటువంటి సంబంధం లేదు’’ అని మంత్రి స్పష్టం చేశారు. చదవండి: ఎన్నికలకు ఇప్పటినుంచే సన్నద్ధం కావాలి: సీఎం జగన్ విశాఖను రాజధానిగా చేస్తే చంద్రబాబుకు వచ్చిన నష్టమేంటి అని మంత్రి ప్రశ్నించారు. ‘‘అమరావతిని ఏ ప్యాకేజీ కోసం పవన్ సమర్థిస్తున్నారు. చంద్రబాబు తొత్తుగానే పవన్ మాట్లాడుతున్నారు. కచ్చితంగా పాదయాత్రను అడ్డుకుని తీరతాం’’ అని అప్పలరాజు అన్నారు. మా గుండెల మీద తంతాం. నోటి కాడ కూడు లాగేస్తామంటే ఊరుకుంటామా.. ఎట్టి పరిస్థితుల్లో పాదయాత్రను అడుగు పెట్టనివ్వం’’ అని మంత్రి అప్పలరాజు తేల్చి చెప్పారు. -
చనిపోయిందనుకుని టెంట్ వేసి కూర్చొబెట్టారు...ఆ తర్వాత
తగరపువలస (భీమిలి): జీవీఎంసీ రెండో వార్డుకు చెందిన లక్కోజు అన్నపూర్ణ అనే 74 ఏళ్ల వృద్ధురాలు సోమవారం ఉదయం వృద్ధాప్యం కారణంగా ఇంటి వరండాలో పడిపోయి చనిపోయింది. దీంతో ఇంటి ముందు టెంట్ వేసి వారి సాంప్రదాయం ప్రకారం కూర్చొబెట్టారు. బంధువులంతా ఇంటికి చేరుకున్నారు. పగలంతా ఎండ తీవ్రంగా ఉండటంతో మధ్యాహ్నం 3.30 సమయంలో ఆమె భౌతికకాయాన్ని శ్మశానవాటికకు తరలించేందుకు స్నానం చేయిస్తుండగా శరీరంలో కదలికలు కనిపించాయి. వెంటనే పల్స్మీటర్తో తనిఖీ చేయగా సాయంత్రం 4.30 గంటల వరకు ఆమె స్పందించింది. 70 నుంచి 90 వరకు పల్స్ రేట్ చూపించడంతో అప్పటి వరకు విషాదం అలుముకున్న ఆ ఇంట సంభ్రమాశ్చర్యాలు చోటుచేసుకున్నాయి. వెంటనే ఆమెకు కుటుంబ సభ్యులు సపర్యలు చేశారు. అనంతరం స్పూన్‌తో టీ తాగించగా గుటకలు వేసింది. ఆమె స్పందిస్తున్నందుకు సంతోషంతో ఆస్పత్రికి తరలించేందుకు 108 వాహన సిబ్బందికి ఫోన్ చేశారు. వారు సాయంత్రం 5 గంటలకు వచ్చి తనిఖీలు చేయగా చనిపోయినట్టు నిర్ధారించారు. అంతలోనే మళ్లీ వారింట విషాదం అలముకుంది. అనంతరం ఆమెకు అంత్యక్రియలు పూర్తి చేశారు. (చదవండి: ప్రియుడు, మేనత్తతో కలిసి రామలక్ష్మి ఏం చేసిందంటే..?) -
చంద్రబాబు అప్పుడెందుకు స్పందించలేదు
రంపచోడవరం: టీడీపీ హయాంలో మహిళలపై అనేక దాడులు జరిగితే స్పందించని మాజీ సీఎం చంద్రబాబునాయుడు ఇప్పుడు పెద్దగా మాట్లాడుతున్నారని, అప్పుడు లేవని గొంతు ఇప్పుడేందుకు లేస్తోందని రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి ధ్వజమెత్తారు. రంపచోడవరంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం స్థానిక విలేకరులతో ఆమె మాట్లాడారు. విజయవాడలో మానసిన వికలాంగురాలుపై జరిగిన దాడిపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించిందన్నారు. బాధితురాలికి రూ. 10 లక్షల పరిహారం అందజేయడమే కాకుండా ఆ కుటుంబంలో వారికి ఉద్యోగం కల్పించేందుకు చర్యలు చేపట్టిందన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మహిళల రక్షణ కోసం దిశ యాప్‌ను రూపొందించిందన్నారు. ఈ యాప్ ఉంటే ప్రతి మహిళకు ఒక సెక్యూరిటీ గార్డు వెంట ఉన్నట్టే అన్నారు. తహసీల్దార్ వనజాక్షిపై దాడి జరిగినప్పుడు చంద్రబాబు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. టీడీపీ మహిళా నేతలు ఎందుకు ఆ సంఘటనను ఖండించలేదని ప్రశ్నించారు. ప్రతి దానిని రాజకీయం చేయడం తగదన్నారు. టీడీపీకి చెందిన వ్యక్తి వేధింపులకు బాలిక సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంటే చంద్రబాబునాయుడు ఎందుకు మాట్లాడలేదన్నారు. కాల్‌మనీ కేసులో కుటుంబాలను రోడ్డుపై లాగారని విమర్శించారు. వీటిపై ప్రశ్నించిన మంత్రి రోజాను అప్పుడు ఏడాది పాటు అసెంబ్లీకి రాకుండా సస్పెండ్ చేశారని గుర్తు చేశారు. విజయవాడ సమావేశాలకు పిలిచి పోలీస్ వ్యాన్‌లో రోజాను తిప్పిన సంఘటనను చంద్రబాబు గుర్తుతెచ్చుకోవాలన్నారు. ముంపు గ్రామాలను నూరుశాతం తరలింపు : పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా దేవీపట్నం మండలంలో ముంపునకు గురవుతున్న గ్రామాల్లో నిర్వాసితులను బయటకు తరలించామని రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి తెలిపారు. ఒకటి రెండు గ్రామాలకు పునరావాస కాలనీ నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. అప్పటి టీడీపీ పర్సంటేజీల కోసం కాఫర్ డ్యామ్ నిర్మాణం చేసి నిర్వాసితుల గురించి పట్టించుకోలేదన్నారు. ఏ ముఖం పెట్టుకుని ఈ రోజు నిర్వాసితుల తరఫున మాట్లాడుతున్నరని నిలదీశారు. వైఎస్సార్ సీపీలో గెలుపొంది టీడీపీకి అమ్ముడు పోయిన వంతల రాజేశ్వరి నిర్వాసితుల కోసం ఏం చేయలేదన్నారు. ఇప్పుడు న్యాయపోరాటం చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నిర్వాసితుల కోసం రాజేశ్వరి ఏం చేశారో ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, ఇళ్ల నిర్మాణం వేగవంతం చేసి కాలనీలకు తరలించినట్లు తెలిపారు. పోలవరం నిర్వాసితులు అందరికీ న్యాయం చేస్తామన్నారు. పోలరవం ప్రాజెక్టు కోసం వారి జీవితాలను త్యాగం చేశారని, పుట్టి పెరిగిన గ్రామాలను జ్ఞాపకాలను వదిలి వెళ్లిన వారికి ఎంత చేసిన తక్కువేనని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారన్నారు. నిర్వాసితుల విషయంలో తమ ప్రభుత్వం ఎప్పుడు సానుకూలంగా వారికి న్యాయం చేసేందుకు సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. (చదవండి: ప్రోత్సహిస్తే సిరులే!) -
మిస్సైల్ రచ్చ! పాక్ సంచలన ఆరోపణలు.. స్పందించిన భారత రక్షణ శాఖ
భారత సూపర్ సోనిక్ నిరాయుధ మిస్సైల్ పాకిస్తాన్ భూభాగంలో పేలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై భారత రక్షణశాఖ కీలక ప్రకటన చేసింది. వివరాల ప్రకారం.. 9 మార్చి 2022న, భారత క్షిపణి సాధారణ నిర్వహణ సమయంలో, సాంకేతిక లోపం కారణంగా ప్రమాదవశాత్తు పాకిస్తాన్ భూభాగంలో ఆ క్షిపణి పేలిందని భారత రక్షణ శాఖ తెలిపింది. భారత ప్రభుత్వం ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లు తెలిపింది. ( చదవండి: PM Modi: పంజాబ్‌లో ప్రభంజనం.. ‘ఆప్’కు మోదీ అభినందనలు.. కేజ్రీవాల్ రిప్లై ఇదే ) ఈ క్షిపణి పాకిస్థాన్‌లోని ఓ ప్రాంతంలో పడిన ఘటన తీవ్ర విచారం కలిగిస్తోందని, ప్రమాదం కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం కూడా ఉపశమనం కలిగించే విషయమని పేర్కొంది.కాగా బుధవారం సాయంత్రం సిస్రా(హర్యానా) వైపు నుంచి సూపర్సోనిక్ మిస్సైల్ ఒకటి 124 కిలోమీటర్ల అవతల పాక్ సరిహద్దులో కూలిందని పాక్ ఆరోపించింది. భారత సరిహద్దు నుంచి వచ్చిన మిస్సైల్ అనుమానిత వస్తువును స్వాధీనం చేసుకుంది. అయితే ఈ ఘటనలో ఎలాంటి నష్టం వాటిల్లలేదు. కానీ, అక్కడే ఉన్న గోడ మాత్రం నాశనం అయ్యింది పాక్ అధికారి వెల్లడించాడు. -
ట్రోల్స్‌పై ప్రియమణి స్పందన, వారికి మాత్రమే సమాధానంగా ఉంటాను..
సౌత్ స్టార్ హీరోయిన్స్‌లో ప్రియమణి ఒకరు. యమదొంగ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ప్రియమణి తొలి చిత్రంతో సూపర్ హిట్ కొట్టింది. కానీ ఆ తర్వాత ఆమె చేసిన సినిమాలు పెద్ద గుర్తింపు పొందలేదు. ఈ క్రమంలో ఆడపదడపా చిత్రాలు చేసుకుంటునే వ్యాపారవేత్త ముస్తాఫా రాజును పెళ్లాడింది. పెళ్లి అనంతరం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఆమె ఆ తర్వాత ఫ్యామిలీ మ్యాన్ 2తో రీఎంట్రీ ఇచ్చింది. ఈ వెబ్ సిరీస్‌లో తన నటనకు జాతీయ అవార్డును కూడ అందుకుంది. అప్పటీ నుంచి వరస సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ కెరీర్ పరంగా ప్రియమణి ఫుల్ బిజీ అయిపోయింది. చదవండి: వరుణ్ తేజ్‌తో పెళ్లిపై తొలిసారి స్పందించిన లావణ్య, ఏం చెప్పిందంటే.. ఆమె తాజాగా ‘భామాకలాపం’ అనే వెబ్ సిరీస్ చేస్తోంది. త్వరలో ఇది ఆహాలో విడుదల కానుంది. ఇలా సైలెంట్‌గా తన పని తను చూసుకుంటూ, సినిమాలు చేసుకుంటున్న ప్రియమణిని తరచూ ట్రోలర్స్ టార్గెట్ చేస్తుంటారు. ఆంటీ అంటూ విమరించడమే కాక ఒకనోక సమంలో తనని బాడీ షేమింగ్ కూడా చేశారు. వీటికి ఆమె గతంలో ఘాటూగానే సమాధానం ఇచ్చింది. అయినప్పటికీ ట్రోల్స్ తగ్గడం లేదు. ఈ క్రమంలో తాజాగా ‘భామాకలాపం’ ప్రమోషన్లో భాగంగా ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రోల్స్‌పై స్పందించింది ప్రియమణి. ఆమె మాట్లాడుతూ.. ‘పెళ్లి అయిన తర్వాత కెరీయర్ పరంగా ఇప్పుడు బిజీ అయ్యాను. ఇప్పుడు చాలా సంతృప్తిగా అనిపిస్తోంది. వెబ్ సిరీస్, సినిమాలు వరుసగా చేస్తున్నాను. (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: మోడల్ ఆత్మహత్యాయత్నం కేసులో బయటకొచ్చిన షాకింగ్ నిజాలు.. 2006 నుంచి 2012 వరకు చాలా బిజీగా ఉన్నాను. అంతేకాదు ఫ్యామిలీ లైఫ్ కూడా చాలా ముఖ్యం. అందుకని పని తగ్గించుకుని ఫ్యామిలీ లైఫ్‌ను బ్యాలెన్స్ చేస్తున్నాను. అప్పుడు టీవీ షోస్ చేస్తూ వెళ్లాను. సినిమాల్లో అవకాశాలు తగ్గడం వల్లనే టీవీ షోలు చేస్తుందని కొంతమంది కామెంట్ చేసి ఉండొచ్చు. కానీ నేను ఎప్పుడూ కూడా యూట్యూబ్ చూడను .. కామెంట్లు చదవను .. వాటి గురించి అసలు పట్టించుకోను. ఎందుకంటే ప్రతి కామెంట్‌కు రియాక్ట్ కాలేము కదా? అంటూ చెప్పకొచ్చింది. అంతేకాదు తనకు ఫ్యామిలీ సపోర్ట్ ఉందని, ఏదైన ఉంటే నా ఫ్యామిలీ, భర్తకు సమాధానం చెప్పుకుంటాని, వేరే వాళ్లకు నేను వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు’ అంటూ ట్రోలర్స్ ఘాటుగా సమాధానం ఇచ్చింది. -
శభాష్.. పోలీస్.. 30నిమిషాల వ్యవధిలోనే
మంచిర్యాలక్రైం: 100డైల్ కాల్స్ ఫిర్యాదుతో స్పందించిన బ్లూ కోల్ట్స్ పోలీసులు వెంటనే స్పందించి 30నిమిషాల వ్యవధిలో తప్పిపోయిన బాలున్ని కుటుంబ సభ్యులకు అప్పగించి శభాష్ బ్లూ కోల్ట్స్ అనిపించుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే... జన్నారం మండలం గంగవ్వకు చెందిన బంధువులు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిని చూసేందుకు గంగవ్వ తన 7సంవత్సరాల కుమారుడితో కలిసి మంగళవారం ఆసుపత్రికి వచ్చింది. గంగవ్వ ఆసుపత్రిలో బంధువులతో మాట్లాడుతుండగా బాలుడు అక్కడి నుంచి కనిపించకుండా పోయాడు. ఖంగు తిన్న గంగవ్వ కుటుంబ సభ్యులకు సమాచారం అందించి స్థానికుల సలహాలు, సూచనల మేరకు 100డైల్కు ఫోన్ చేసి చెప్పడంతో క్షణంలోనే స్పందించిన సీఐ నారాయణ్‌నాయక్ బ్లూ కోల్ట్స్ పోలీసులను అప్రమత్తం చేసి గాలించారు. రంగంలోకి దిగిన బ్లూ కోల్ట్స్ సిబ్బంది ఉస్మాన్పాష, తిరుపతి ఐబీ ప్రాంతం నుంచి ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో పరిశీలించగా ఐబీ వైపు నుంచి ఫ్లై ఓవర్ బ్రిడ్జి వైపు ఏడుస్తూ వెళ్తున్న బాలున్ని గమనించి, అదుపులోకి తీసుకున్నారు. ఆ బాలున్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో బ్లూ కోల్ట్స్ సిబ్బందిని స్థానికులు, అధికారులు అభినందించారు. -
‘ఎన్ని పిటిషన్లు వేసినా.. వాటిని చేస్తూనే ఉంటా’
న్యూఢిల్లీ: తూర్పు ఢిల్లీకి చెందిన బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఇటీవల వేలాది మందికి ఫాబీఫ్లూ అనే మందులను కరోనా బాధితులకు ఉచితంగా అందజేశారు. అయితే దీంతో గంభీర్‌పై కోర్టులో వ్యతిరేకంగా వ్యాజ్యం దాఖలైంది. తాజాగా ఈ అంశంపై గంభీర్ స్పందించారు. ఎన్ని పిటిషన్లు వేసినా...ప్రజా సేవను ఆపను గంభీర్ ఈ అంశంపై మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేయాల్సిన అవసరం ఉందని భావించాను, కనుక ఎలాంటి శిక్షను ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉన్నానని అన్నారు. నేను పంపిణీ చేసిన మందులు అత్యవసరమైనవని, నాపై వేల సంఖ్యలో వ్యాజ్యాలు దాఖలు చేసినప్పటికీ తాను మాత్రం ప్రాణాలు రక్షించేందుకు ప్రజాసేవను కొనసాగిస్తానని స్పష్టం చేశారు. కాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎంపీ గౌతం గంభీర్ పెద్ద మొత్తంలో ఔషధాలను నిల్వ ఉంచారని, ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఒకే వ్యక్తి ఇలా ఔషధాలు నిల్వ చేయడం వల్ల ఇతర నియోజకవర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. దీనిపై న్యాయస్థానం సోమవారం విచారణ చేపట్టింది. వ్యాజ్యంలో పేర్కొన్న విధంగా ఫావిపిరవిర్ ఔషధ పంపిణీ విషయంలో బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ వ్యవహరించిన తీరుపై ఢిల్లీ హైకోర్టు విచారణకు ఆదేశించింది. గంభీర్‌కు ఇంతపెద్ద మొత్తంలో మందులు ఎలా లభించిందన్న విషయంపై దర్యాప్తు చేపట్టమని డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు ఆదేశాలు జారీ చేసింది. చదవండి: Rajasthan Cm: కోటి వ్యాక్సిన్లు ఓ రోజుకి సరిపోవు -
చంద్రబాబు ట్వీట్‌పై స్పందించిన వైద్యారోగ్యశాఖ
సాక్షి, విజయవాడ: ఒంగోలు జీజీహెచ్‌లో కరోనా రోగి మృతదేహాన్ని పట్టించుకోలేదని ప్రతిపక్ష నేత చంద్రబాబు ట్వీట్‌పై రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అధికారులు స్పందించారు. జరిగిన వాస్తవాన్ని అధికారులు వెల్లడించారు. రాధాకృష్ణారెడ్డి అనే పేషెంట్ కోవిడ్ లక్షణాలతో మార్కాపురం కోవిడ్ ఆస్పత్రిలో చేరారని, అక్కడ శానిటైజర్ తాగి ఆత్మహత్యకు యత్నించాడని అధికారులు తెలిపారు. దీంతో ప్రాథమిక చికిత్స చేసి ఒంగోలు జీజీహెచ్‌కు తరలించామని, అక్కడ వార్డుకు తరలించే సమయంలో మూడో ఫ్లోర్ నుంచి దూకేశాడని వివరించారు. వైద్యులు పరీక్షించగా రాధాకృష్ణారెడ్డి చనిపోయినట్లుగా తేలిందని.. ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారని అధికారులు వివరించారు. -
క్యాన్సర్ రోగులకు పరిమితులొద్దు..
సాక్షి, అమరావతి: కళ్లకు క్యాన్సర్ సోకిన చిన్నారి హేమ అనారోగ్యంపై పత్రికల్లో వచ్చిన కథనంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించారు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక గ్రామానికి చెందిన చిన్నారి హేమ అనారోగ్యంపై సీఎం జగన్ ఆరా తీశారు. చిన్నారి కుటుంబంతో మాట్లాడి, వైద్యం కోసం అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా సంబంధిత అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ఇలాంటి నిరుపేదలను పూర్తిస్థాయిలో ఆదుకోవడానికి ఆరోగ్యశ్రీలో భారీ సంస్కరణలు తీసుకురావడానికి గతంలోనే నిర్ణయం తీసుకున్నామని సీఎం వెల్లడించారు. క్యాన్సర్ రోగులకు ఆరోగ్యశ్రీ కింద ఎన్ని విడతలు చికిత్స అవసరమైనా చేయించాలని సీఎం స్పష్టం చేశారు. చికిత్సలో ఎన్ని సైకిల్స్ అవసరమైనా పూర్తి ట్రీట్మెంట్ అందిస్తున్నామని పేర్కొన్నారు. గతంలో మాదిరిగా కాకుండా ఆరోగ్యశ్రీ కింద క్యాన్సర్ రోగులకు ఏ పరిమితి లేకుండా చికిత్స అందింస్తున్నామని చెప్పారు. జనవరి 1 నుంచి ఇది అమల్లోకి వస్తోందని.. అత్యవసర కేసులు ఉంటే.. ఆ రోగులకు వెంటనే చికిత్సలు అందించాలని సీఎం జగన్ ఆదేశించారు. -
స్పర్శను గుర్తించే రోబో చర్మం
బెర్లిన్: ఇకపై రోబోలు స్పర్శకు స్పందిస్తాయి. చుట్టూ ఉన్న వేడిని, వాతావరణంలో మార్పును, ప్రమాదాలను గుర్తించగలవు. రోబో శరీరంపై అమర్చిన ప్రత్యేకమైన చర్మం ద్వారా అవి వీటిని చేయగలవు. రోబోలు ఈ పనులు చేయగలిగేలా చేసే చర్మాన్ని జర్మనీకి చెందిన మునిచ్ సాంకేతిక విశ్వవిద్యాలయం పరిశోధకులు తయారుచేశారు. చర్మం తీరిది... ఈ చర్మంలో హెక్సాగోనల్ సెల్స్‌ను అమర్చారు. ఇందులోని ప్రతి సెల్ ఒక మైక్రోప్రాసెసర్‌ను, కొన్ని సెన్సార్లను కలిగి ఉంటుంది. ఇవి వేగాన్ని, ఉష్ణోగ్రతను, చిన్న మార్పులను సైతం గుర్తించగలవు. స్పర్శాజ్ఙానం పెరగడం వల్ల, రోబోలు మరింత కచ్చితత్వంతో పనిచేస్తాయని చర్మాన్ని రూపొందించిన గోర్డోన్ చెంగ్, అతని బృందం తెలిపారు. చర్మం సెల్స్‌ను పదేళ్ల క్రితమే తయారుచేశామని అయితే దాన్ని రోబోలు ఆకళింపు చేసుకునేలా సాంకేతికత అభివృద్ధి చెందడానికి సమయం పట్టిందన్నారు. సెన్సార్ల నుంచి వచ్చే సమాచారాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. సమాచారం ఎక్కువ కాకూడదు.. గతంలో తయారుచేసిన సెల్స్‌తో సమాచారం అధికంగా వచ్చేదని దీని వల్ల పనితీరు 90 శాతం వరకూ తగ్గిందని తెలిపారు. మనుషుల్లాగే సమాచారాన్ని పంపే వ్యవస్థ తయారీ కోసం లోతైన పరిశోధనలు చేస్తున్నామని తెలిపారు. ఉదాహరణకు మనిషి టోపీ ధరిస్తే, పెట్టుకున్న వెంటనే సమాచారం అందుతుంది. కానీ సమయం గడిచే కొద్దీ టోపీ ఉందన్న సంగతి కూడా మర్చిపోతాం. రోబో చర్మాన్ని కూడా అలాంటి సమాచార వ్యవస్థతో నిర్మిస్తున్నామని వెల్లడించారు. ఎక్కడ ఉపయోగపడతాయంటే.. ప్రస్తుతం తయారుచేసిన రోబోలో 1,260 సెల్స్ ఉన్నాయి. అందులో 13 వేలకు పైగా సెన్సార్లు ఉన్నాయి. వీటిని తల, చేతులు, మొండెం, కాళ్లు, కాలి వేళ్లలో అమర్చారు. వీటి వల్ల స్పర్శను గుర్తించే శక్తి రోబోకు అందుతుంది. నేల చదునుగా ఉన్న ప్రాంతాల్లో కాలి వేళ్ల సెన్సార్ల ద్వారా గుర్తించి జాగ్రత్తగా నడుస్తుంది. మనుషులకు హాని కలగకుండా ఆలింగనం చేసుకోగలదు. ఒకే కాలిపై నిలబడగలిగే సదుపాయాన్ని కూడా ఇందులో పొందుపరచారు. అయితే ఈ రోబోలు పరిశ్రమల అవసరాలకు ఉపయోగవడవు. వృద్ధులు, రోగులకు సహాయం అందించడం, మనుషులతో దగ్గరగా ఉండే పనులు చేయడంలో మాత్రమే ఉపయోగపడతాయి. -
టీ.బడ్జెట్.. పైన పటారం..లోన లొటారం..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ ‘పైన పటారం..లోన లొటారం’ అన్న చందంగా ఉందని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు ఎం.కోదండరెడ్డి, తెలంగాణ పీసీసీ అధికార ప్రతినిధి నిరంజన్ విమర్శించారు. వారిద్దరూ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. స్వయంగా ముఖ్యమంత్రి ప్రభుత్వ భూములను అమ్మి ఆయా శాఖలకు డబ్బు కేటాయిస్తామని చెప్పడం ఇందుకు నిదర్శనమన్నారు. రాష్ట్ర్రాన్ని కేసీఆర్ అప్పులపాలు చేస్తున్నారని మొదట నుంచి కాంగ్రెస్ చెబుతూనే ఉందన్నారు. ప్రభుత్వ భూములు అమ్మడాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందన్నారు. భూముల అమ్మకాలపై.. భవిష్యత్ అవసరాలు దృష్టి కోణంలో ప్రభుత్వం ఆలోచించాలని సూచించారు. వ్యవసాయ అభివృద్ధి 6.5 శాతం అన్నారని..కానీ రైతుల ఆదాయం పెరగలేదన్నారు. ఎంఎస్పీ కూడా పెరగలేదన్నారు. రుణమాఫీకి ఈ బడ్జెట్లో ఆరు వేల కోట్లు కేటాయించారని..38 వేలకోట్ల రుణమాఫీ ఎన్నేళ్లకు చేస్తారని ప్రశ్నించారు. ఏకకాలంలో చేయకపోతే గత అనుభవాలే పునరావృతం అవుతాయన్నారు. రైతుబంధు పథకంలో స్పష్టత లేదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. -
ఇదో రూ.3 కోట్ల ముచ్చట
సాక్షి, విశాఖపట్నం: విశాఖ సాగర తీరంలో దేశంలోనే తొలిసారిగా నిర్వహించతలపెట్టిన యాటింగ్ ఫెస్టివల్‌కు పర్యాటకుల నుంచి ఆశించనంత స్థాయిలో స్పందన కనిపించలేదు. విదేశాల్లో మాత్రమే నిర్వహించే ఈ ఫెస్టివల్‌కు భారీగా ఏర్పాట్లు చేశారు. నాలుగు నెలలుగా ఆన్లైన్ వేదికగా దేశ విదేశాల్లో విస్తృత ప్రచారం కల్పించారు. ఆన్లైన్ ద్వారా ఆరు లక్షల మందికి ఆహ్వానాలు పంపగా తొలుత 1500 మంది ఆసక్తి చూపారు. చివరకు కేవలం 16 మంది మాత్రమే ఈ ఫెస్టివల్లో పాల్గొనేందుకు ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్నారు. బుకింగ్ ద్వారా వచ్చిన ఆదాయం రూ.2.50 లక్షలు కాగా ఖర్చు మాత్రం రూ.3 కోట్లకు పైగా దాటిస్తోంది. కేవలం ఒక్క బోటు రాక షెడ్యూల్ ప్రకారం బుధవారమే ఫెస్టివల్ ప్రారంభించాల్సి ఉంది. కానీ బోట్ల రాకలో జాప్యం, పర్యాటకుల నుంచి స్పందన కరువవడంతో గురువారానికి పొడిగించారు. యాటింగ్ ఫెస్టివల్లో పాల్గొనేందుకు తొమ్మిది బోట్లు వస్తాయని పర్యాటక శాఖ ప్రకటించింది. వీటిలో గోవా నుంచి ఐదు, చెన్నై నుంచి రెండు, థాయ్‌లాండ్ నుంచి మరో రెండు సోమ, మంగళవారాల నాటికే విశాఖ చేరుకోవాల్సి ఉంది. ఇప్పటివరకు కేవలం ఒకే ఒక్క బోటు విశాఖ సాగర తీరానికి చేరుకుంది. మిగిలిన బోట్లన్నీ మార్గంమధ్యలో ఉన్నాయని పర్యాటక శాఖాధికారులు చెబుతున్నారు. మిగిలినవి గురువారం మధ్యాహ్నానికి చేరుకుంటాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు వీవీఐపీలతో కలిసి చేయాల్సిన యాటింగ్ విహారంపై సందిగ్ధత నెలకొంది. ట్రాలీ దిగని బోటు బుధవారం సాయంత్రం ట్రయిల్ రన్ నిర్వహించాలని భావించినప్పటికీ ఒకే ఒక్క బోటు అదీ అతికష్టమ్మీద సాయంత్రానికి చేరుకోవడంతో విరమించుకోవల్సి వచ్చింది. ట్రాలీపై వచ్చిన ఆ బోటును కిందకు దించలేకపోయారు. బుధవారం రాత్రి టూర్ ఆపరేటర్లు, మీడియా ప్రతినిధులు, కొంతమంది వీఐపీలను ట్రయిల్ రన్‌కు తీసుకెళ్తామని ప్రకటించారు. కానీ బోటు దింపే పరిస్థితి లేకపోవడంతో ట్రయిల్ రన్‌కు సైతం ముఖం చాటేశారు. ఇది ఇలా ఉండగా యాటింగ్ బోట్‌ను మంత్రి గంటా శ్రీనివాసరావు, కలెక్టర్ ప్రవీణŠకుమార్‌లు తిలకించి ఏర్పాట్లను సమీక్షించారు. మిగిలిన బోట్లు ఎప్పుడొస్తాయి..? ఆరా తీశారు. గత ఫెస్టివల్స్ అన్నీ తుస్ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో గతంలో నిర్వహించిన పలు ఫెస్టివల్స్ కూడా ఇదే రీతిలో తుస్సుమన్నాయి. హెలిటూరిజం, బెలూన్ ఫెస్టివల్, విండ్ ఫెస్టివల్, సౌండ్ ఆన్ సాండ్, దసరావళి వంటి కార్యక్రమాలన్నీ అట్టర్ ప్లాప్ అయ్యాయి. వాటి సరసనే ఈ యాటింగ్ ఫెస్టివల్ కూడా చేరే సూచనలు కన్పిస్తున్నాయి. -
'పెట్టె' ఫలితమివ్వలే!
గ్రామాల్లో జరిగే కొన్ని నేరాలపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి కొందరు జంకుతారు. పోలీసులు ఎక్కడ తమ పేరు బయట పెడుతారోనన్న భయంతో చాలావరకు ఫిర్యాదు చేయడానికి ముందుకు రావడంలేదు. వీరికోసమే పోలీసులు వినూత్న రీతిలో ప్రతి పంచాయతీ వద్ద ఫిర్యాదుల పెట్టెను ఏర్పాటు చేశారు. అయినా పెద్దగా స్పందన లేకపోవడంతో పోలీసులు చేపట్టిన ప్రయత్నంవిఫలమవుతోంది. అడ్డాకుల (దేవరకద్ర): మహబూబ్‌నగర్ జిల్లాలో అడ్డాకుల మండలాన్ని పోలీసుశాఖ మోడల్ మండలంగా ఎంపిక చేసింది. ఫిర్యాదుల పెట్టె పేరుతో వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. 2017 జనవరి 5న కందూర్‌లో ఫిర్యాదుల పెట్టెపెట్టెను మహబూబ్‌నగర్ డీఎస్పీ భాస్కర్ ప్రారంభించారు. ఇందులో భాగంగా మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ పోలీసు అధికారి కార్యాలయం బయట ఓ ఫిర్యాదుల పెట్టెను అమర్చారు. ఫిర్యాదు రాసి పెట్టెలో వేస్తే.. పోలీసు శాఖకు సంబం«ధించిన ఏదైనా సమస్యను ఓ తెల్లకాగితంపై రాసి ఫిర్యాదుల పెట్టెలో వేయాలి. రాసేవారు తమ పేరును రాయాల్సిన పనిలేదు. అయితే ప్రతి సోమ, గురువారాల్లో నిర్వహించే గ్రామ పోలీసు కార్యక్రమం నిమిత్తం గ్రామానికి వచ్చే పోలీసు అధికారి డబ్బాలో ఉన్న ఫిర్యాదులను పరిశీలించి వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటారు. అడ్డాకుల మండలంలో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ విధానం ఫలితమిస్తే జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేయాలని భావించారు. ఎలాంటి స్పందనా రాలే! ప్రతి గ్రామ పం చాయతీ కార్యాలయం వద్ద ప్రత్యే కంగా ఫి ర్యాదు పెట్టెను ఏర్పాటు చేశారు. వాటి వినియోగంపై ప్రతి గ్రామంలోనూ ప్రచారం చేశారు. ప్ర తి సోమ, గురువారాల్లో పోలీసు అధికారులు తమ కార్యాలయాలకు వచ్చినప్పుడు ఫిర్యాదుల పెట్టె తాళం తీసి అందులో ఉన్న సమస్యల తెలుసుకుం టారు. దాన్ని పరిష్కరించేందుకు చర్యతీసుకుంటారు. ఈవ్ టీజింగ్, పేకాట, ఇసుక అక్రమ రవాణా, మత్తు మం దుల విక్రయాలు, ఇతర సమస్యలపై ఫిర్యాదు చేయొచ్చని ప్రచారం చేశారు. అయినా ప్రజలనుంచి ఎలాంటి స్పందన లేదని చెబుతున్నారు. చిన్న తగాదాలను పోలీసు అధికారుల దృష్టికి తేవాలని సూచించినా పెద్దగా స్పందన రాలేదు. ప్రజలు ముందుకు రావాలి ఫిర్యాదుల పెట్టె ప్రయోగాన్ని అధికారులు ప్రయోగాత్మకంగా చేపట్టినా ప్రజల నుంచి స్పందన రావడంలేదు. గ్రామాల్లో జరిగే నేరపూరిత చర్యలపై పోలీసులకు సమాచారం ఇవ్వడానికి మంచి అవకాశం ఉన్నా ప్రజలు ఫిర్యాదుల పెట్టెను వినియోగించుకోలేదు. మరోసారి దీన్ని చేపట్టే అంశం ఉన్నతాధికారుల నిర్ణయంపై ఆధారపడి ఉంది. – ఎం.బాలస్వామి, ఏఎస్ఐ అడ్డాకుల -
హరీష్‌రావు లేఖకు దేవినేని స్పందన
అమరావతి: ఆర్డీఎస్ సమస్య పరిష్కారంపై తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు ఇటీవల రాసిన లేఖకు ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ స్పందించారు. ఆర్డీఎస్ సమస్య పరిష్కారం సాంకేతిక అంశాలతో ముడిపడి ఉన్న అంశం అంటూ హరీష్‌రావుకు రాసిన లేఖలో దేవినేని పేర్కొన్నారు. మంత్రుల స్థాయి సమావేశం జరగడానికి ముందే ఇరిగేషన్ ఇంజనీర్లు, అధికారుల స్థాయిలో సమావేశం జరపాలని హరీష్‌కు సూచించారు.