ప్రపంచవ్యాప్తంగా చాలామందికి జీమెయిల్ లాగిన్ చేయడంతోనే రోజు ప్రారంభమవుతుంది. మరి కొందరు రోజుకు ఒక్కసారైనా జీమెయిల్ చూస్తుంటారు. అలాంటి జీమెయిల్ సర్వీస్ త్వరలో నిలిచిపోనున్నట్లు నెట్టింట్లో కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో చాలా మంది యూజర్స్ ఆందోళనకు గురయ్యారు.
గూగుల్ కంపెనీ దీనిపై స్పందిస్తూ.. జీమెయిల్ యూజర్స్ భయపడాల్సిన అవసరం లేదని, కేవలం HTML ఫీచర్ మాత్రమే నిలిచిపోనున్నట్లు క్లారిటీ ఇచ్చింది. ఈ విషయాన్ని కంపెనీ గత సెప్టెంబర్‌లోనే ధ్రువీకరించింది. జీమెయిల్ సర్వీసు నిలిచిపోనున్నట్లు వస్తున్న వార్తలు నమ్మొద్దంటూ సంస్థ అధికారికంగా వెల్లడించింది.
Gmail is here to stay.
— Gmail (@gmail) February 22, 2024
నిజానికి గత ఏడాది సెప్టెంబర్‌లోనే జీమెయిల్ సర్వీసులో HTML ఫీచర్ నిలిపివేయాలని కంపెనీ యోచిస్తున్నట్లు తెలిపింది. దీని ప్రకారం ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ ఫీచర్‌ను నిలిపివేయనున్నట్లు, ఇదే స్టాండర్డ్ వ్యూకు మారుతుందని సంస్థ స్పష్టం చేసింది.
గూగుల్ సర్వీస్ మరింత మెరుగుపడాలనే ఉద్దేశ్యంతోనే కంపెనీ చిన్న అప్డేట్స్ జోడించనున్నట్లు, అయితే ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్న వార్తల ప్రకారం జీమెయిల్ పనిచేయకపోవడం అనేది ఉండదని, సంబంధిత అధికారులు ఎక్స్ (ట్విటర్) వేదికగా తెలిపింది.
ఇదీ చదవండి: దుబాయ్ వెళ్లే భారతీయులకు శుభవార్త - ఏంటో తెలుసా..
this is insane. I hate this company pic.twitter.com/pXBRezPAyX
— Daniel (@growing_daniel) February 22, 2024
Comments
Please login to add a commentAdd a comment