
పోలీసుల ఓవరాక్షన్.. స్పందించిన కేటీఆర్
హైదరాబాద్: ఉప్పల్ నల్లచెరువు ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసులు ఓవరాక్షన్ చేశారు. ఓ చిరువ్యాపారిపై దాడి చేశారు. పోలీసుల దాడి ఘటన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఓ వ్యక్తి ఈ దృశ్యాలను ట్వట్టర్‌లో మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తూ.. ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎక్కడ ఉంది? అని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. సదరు ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామన్నారు. ప్రజలతో సంబంధాలు కలిగి ఉండే కిందిస్థాయి సిబ్బందికి అవగాహన కల్పించాల్సిన అవసరముందని తెలంగాణ డీజీపీకి కేటీఆర్ సూచించారు.