సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ ‘పైన పటారం..లోన లొటారం’ అన్న చందంగా ఉందని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు ఎం.కోదండరెడ్డి, తెలంగాణ పీసీసీ అధికార ప్రతినిధి నిరంజన్ విమర్శించారు. వారిద్దరూ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. స్వయంగా ముఖ్యమంత్రి ప్రభుత్వ భూములను అమ్మి ఆయా శాఖలకు డబ్బు కేటాయిస్తామని చెప్పడం ఇందుకు నిదర్శనమన్నారు. రాష్ట్ర్రాన్ని కేసీఆర్ అప్పులపాలు చేస్తున్నారని మొదట నుంచి కాంగ్రెస్ చెబుతూనే ఉందన్నారు.
ప్రభుత్వ భూములు అమ్మడాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందన్నారు. భూముల అమ్మకాలపై.. భవిష్యత్ అవసరాలు దృష్టి కోణంలో ప్రభుత్వం ఆలోచించాలని సూచించారు. వ్యవసాయ అభివృద్ధి 6.5 శాతం అన్నారని..కానీ రైతుల ఆదాయం పెరగలేదన్నారు. ఎంఎస్పీ కూడా పెరగలేదన్నారు. రుణమాఫీకి ఈ బడ్జెట్‌లో ఆరు వేల కోట్లు కేటాయించారని..38 వేలకోట్ల రుణమాఫీ ఎన్నేళ్లకు చేస్తారని ప్రశ్నించారు. ఏకకాలంలో చేయకపోతే గత అనుభవాలే పునరావృతం అవుతాయన్నారు. రైతుబంధు పథకంలో స్పష్టత లేదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment