kodanda reddy
-
ప్రతి రైతుకు అందుబాటులో ఉంటా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రతి రైతుకు అందుబాటులో ఉంటానని వ్యవసాయ, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి హామీ ఇచ్చారు. బీఆర్కేఆర్ భవన్లో బుధవారం వ్యవసాయ, రైతు కమిషన్ చైర్మన్‌గా కోదండరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. వ్యవసాయం, రైతు సంక్షేమం రెండూ చాలా ముఖ్యమైనవని, వ్యవసాయ నిపుణులు, ఆర్థిక శాస్త్రవేత్తలు, ఎన్జీవోలు తగు సూచనలు చేయాలని కోరారు. శక్తివంచన లేకుండా వ్యవసాయం, రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తానన్నారు. ప్రస్తుతం రైతుకు గిట్టుబాటు ధర రాక, పెట్టుబడి పెరిగి అనేక ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ అమలు చేశారని ప్రశంసించారు. సన్న వడ్లకు అదనంగా రూ.500 బోనస్ ఇవ్వాలని సీఎం ఆదేశించారని తెలిపారు. మరోవైపు రాబోయే పంట కాలానికి రైతు భరోసా కింద అర్హులైన రైతులకు పెట్టుబడిగా రూ.7500 ఆర్థిక సాయం చేస్తామని సీఎం ప్రకటించడం గొప్ప నిర్ణయమన్నారు. -
భూదందాలకు ఇవిగో ఆధారాలు
సాక్షి, హైదరాబాద్: నిషేధిత భూముల జాబితాను అడ్డుపెట్టుకుని గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని పెద్దలు అనేక భూ కుంభకోణాలకు పాల్పడ్డారని ఏఐసీసీ కిసాన్‌సెల్ వైస్‌చైర్మన్ ఎం.కోదండరెడ్డి ఆరోపించారు. షామీర్పేట మండలం తూంకుంట, బొంరాస్‌పేట, చేవెళ్ల మండలం చందవెల్లి, మాజిల్‌పూర్ గ్రామాల్లో జరిగిన భూకుంభకోణాలకు సంబంధించిన సమగ్ర ఆధారాలను సమర్పించానని, వీటిపై విచారణ జరిపించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. శనివారం గాందీభవన్‌లో కోదండరెడ్డి మీడియాతో మాట్లాడారు. షామీర్పేట మండలం తూంకుంట గ్రామంలోని 164/1 సర్వే నెంబర్లోని 26 ఎకరాల అటవీ భూమిని జూన్, 2022లో ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టారని ఆరోపించారు. బొంరాస్‌పేట గ్రామంలోని 260/2, 261, 265/8, 361/7, 361/9 సర్వే నెంబర్లలో రక్షణ శాఖకు చెందిన భూమిని బాలాజీ అసోసియేట్ అనే సంస్థకు ఇచ్చారని, అదే గ్రామంలోని 65 ఎకరాల ప్రైవేటు భూమిని రైతులకు కాకుండా అప్పట్లో రాజ్యసభ సభ్యుడు సంతోశ్ కుటుంబానికి చెందిన ఎఫ్ఫర్ఎల్ ఫార్మ్ అనే సంస్థకు దారాధత్తం చేశారని నిందించారు. నిషేధిత జాబితాలో పెట్టిన భూములను 2018లో ఎన్నికలు కాగానే అంబుజ్ అగర్వాల్ పేరిట రిజి్రస్టేషన్ చేశారని ఆరోపించారు. 24లక్షల ఎకరాల అసైన్డ్ భూమిని నిషేధిత జాబితాలో పెట్టి వారికి అనుకూలమైన వ్యక్తులకు కట్టబెట్టారని కోదండరెడ్డి విమర్శించారు. దళితుల భూములను కేటీఆర్ అమ్ముకున్నారు చేవెళ్ల మండలం చందవెల్లి అనే గ్రామంలో దళితుల నుంచి ఎకరం రూ.9 లక్షల చొప్పున 1,500 ఎకరాలు తీసుకుని తనకు అనుకూలంగా ఉన్న మల్టినేషనల్ కంపెనీకి ఎకరానికి రూ.1.30 కోట్లకు కేటీఆర్ అమ్ముకున్నారని కోదండరెడ్డి ఆరోపించారు. మాజిల్‌పూర్ అనే గ్రామంలో ల్యాండ్‌సీలింగ్‌లో ఉన్న 25 ఎకరాల భూమిని పట్టా చేసుకున్నారని చెప్పారు. వీటన్నింటికీ సంబంధించి సమగ్ర ఆధారాలను ప్రభుత్వానికి ఇచ్చానని, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి ఫిర్యాదు చేశానని ఆయన తెలిపారు. భూములను కాజేయాలనే కుట్రపూరిత ఆలోచనలతోనే కేసీఆర్ ధరణికి రూపకల్పన చేశారని, రాష్ట్రంలో జరిగిన భూకుంభకోణాలు, అక్రమాలకు కేసీఆర్, కేటీఆర్‌లే బాధ్యులని ఆరోపించారు. అప్పటి సీఎస్ సోమేశ్‌కుమార్ ఆధ్వర్యంలో దేశంలోనే అతిపెద్ద భూకుంభకోణం జరిగిందని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. పార్లమెంటు ఎన్నికలు పూర్తికాగానే చర్యలకు ఉపక్రమించి కేసీఆర్, కేటీఆర్‌లతో పాటు ఇందుకు బాధ్యులైన ఎంతటి వారిపైన అయినా కఠినచర్యలు తీసుకోవాలని కోదండరెడ్డి డిమాండ్ చేశారు. -
కేంద్ర గుర్తింపు కలిగిన సంస్థతో ధరణి నిర్వహణ
శామీర్‌పేట్: కేంద్ర గుర్తింపు కలిగిన సంస్థతో ధరణి పోర్టల్‌ను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ధరణి కమిటీ సభ్యుడు కోదండరెడ్డి అన్నారు. ప్రభుత్వ ఆదేశాలతో ఈ కమిటీ ధరణి ప్రక్షాళనకు చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నెల 1 నుంచి 17వ తేదీ వరకు చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా గురువారం మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండల పరిధిలోని బొమ్మరాశిపేట గ్రామంలో ధరణి కమిటీ సభ్యులు పర్యటించారు. అనంతరం బొమ్మరాశిపేట రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ధరణి వల్ల ఎదుర్కొంటున్న సమస్యలను రైతులు కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. కోదండరెడ్డి, ధరణి కమిటీ న్యాయ సలహాదారు సునీల్‌లు మాట్లాడుతూ.. బొమ్మరాశిపేట గ్రామంలో ధరణిలో ఉన్న లొసుగులను అడ్డుపెట్టుకొని కొందరు అధికారులు, బడా బాబులు కుమ్మక్కై భూ సమస్యలను సృష్టించినట్లు గుర్తించామని తెలిపారు. ధరణిలో ఉన్న లోపాలను గుర్తించేందుకు బొమ్మరాశిపేట గ్రామంలో నెలకొన్న భూ సమస్యను ఓ కేస్ స్టడీగా పరిగణనలోకి తీసుకొని అధ్యయనం చేస్తామన్నారు. ధరణి వెబ్సైట్లో మార్పులు చేపట్టి, సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేస్తామని అన్నారు. రైతులెవరూ అధైర్య పడవద్దని, త్వరలోనే ప్రభుత్వం సమస్యలన్నింటినీ పరిష్కరిస్తుందని వారు భరోసా ఇచ్చారు. లొసుగులను వాడుకొని.. ధరణిలో ఉన్న లొసుగులను వాడుకొని కొందరు బడాబాబులు తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని బొమ్మరాశిపేట రైతులు ధరణి కమిటీ సభ్యుల ముందు వాపోయారు. 50 ఏళ్ల క్రితం 1,050 ఎకరాల భూమి కొనుగోలు చేసి సాగుచేస్తున్నామని, ఇటీవల కొందరు వ్యక్తులు వచ్చి ఆ భూమి తమదంటూ.. అధికారులతో కుమ్మక్కై భూములను బ్లాక్ లిస్ట్‌లో చేర్పించారని కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. తమ భూమిపై ఎలాంటి లావాదేవీలు జరుపుకోకుండా అడ్డుపడుతున్నారని, కొంత స్థలం అమ్మి కూతుళ్ల పెళ్లిచేయాలని ప్రయత్నించినా ధరణి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. -
గత ప్రభుత్వ అక్రమాలపై విచారణ జరపాలి
సాక్షి, హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అన్ని అక్రమాలపై విచారణ జరపాలని ఏఐసీసీ కిసాన్‌సెల్ వైస్‌చైర్మన్ ఎం.కోదండరెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని ప్రతిసారీ చేసింది కాంగ్రెస్ నేతలయితే, కేసీఆర్ కుటుంబం సెంటిమెంట్‌ను వాడుకుని రాష్ట్రాన్ని దోచుకుందని ఆయన ఆరోపించారు. సోమవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ నాగరిగారి ప్రీతం, ఫిషర్మెన్ చైర్మన్ మెట్టు సాయికుమార్‌లతో కలిసి ఆయన మాట్లాడుతూ, హెచ్ఎండీఏలో ఉద్యోగిని అవినీతి నిరోధక శాఖ పట్టుకుంటే పెద్దోళ్లు బయటకు వస్తున్నారని అన్నారు. ఈ శాఖను కేసీఆర్ కుమారుడు కేటీఆర్ నిర్వహించిన నేపథ్యంలో ఈ అవినీతిలో ఎవరెవరు ఉన్నారన్నది బట్టబయలు చేయాలని కోరారు. ఏకకాలంలో రైతు రుణమాఫీ చేసిన చరిత్ర తమదని, తెలంగాణ రైతాంగానికి కూడా రుణమాఫీ చేస్తామని, రైతుల అప్పుల వివరాలు సేకరించే పనిలో ప్రభుత్వం ఉందని చెప్పారు. నాడు పోపో అంటే... నేడు రా.. రా అంటున్నారు: జగ్గారెడ్డి ధరణి పోర్టల్ లోపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని, రైతులకు ఉపయోగపడని ధరణిని రద్దు చేయాలని రాహుల్‌గాం«దీనే చెప్పారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు. రాష్ట్రంలో తొమ్మిదేళ్ల తర్వాత అసెంబ్లీలో మూడున్నర గంటలపాటు చర్చ జరిగిందని, అసెంబ్లీలో ఏం జరుగుతోందన్నది తెలంగాణ ప్రజలకు ఇప్పుడు అర్థమవుతోందన్నారు. గతంలో ప్రతిపక్ష నాయకుడిని పోపో అని నోరు మూసేవారని, ఇప్పుడు సీఎం రేవంత్ మాత్రం రా..రా.. అంటున్నా ప్రతిపక్ష నేత సభకు రావడం లేదని ఎద్దేవా చేశారు. అధికారం ఇవ్వకపోతే కేసీఆర్ అసెంబ్లీకి రాడా అని ప్రశ్నించారు. ప్రజలిచ్చిన తీర్పును కేసీఆర్ అవమానపరుస్తున్నారని జగ్గారెడ్డి విమర్శించారు. -
కేసీఆర్ త్వరగా కోలుకోవాలి... అసెంబ్లీకి రావాలి
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు త్వరగా కోలుకుని శాసనసభకు రావాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. ఆదివారం మంత్రి సీతక్క, మాజీ మంత్రి షబ్బీర్ అలీతో కలసి హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి వెళ్లిన రేవంత్.. కేసీఆర్‌ను పరామర్శించారు. ఆయనతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అక్కడే ఉన్న మాజీ మంత్రి కేటీఆర్, వైద్యులతోనూ మాట్లాడారు. తర్వాత ఆస్పత్రి బయట రేవంత్ మీడియాతో మాట్లాడారు. ‘‘కేసీఆర్‌ను పరామర్శించాను. క్రమంగా కోలుకుంటున్నారు. ఆయన వైద్యం కోసం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్‌ను ఇప్పటికే ఆదేశించాం. కేసీఆర్ త్వరగా కోలుకుని అసెంబ్లీకి రావాలని ఆకాంక్షిస్తున్నా. మంచి ప్రభుత్వ పాలన అందించడానికి ఆయన సూచనలు అవసరం. ప్రజల పక్షాన అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడాల్సిన అవసరముంది. ఆయన త్వరగా కోలుకుని అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాలని ఆకాంక్షిస్తున్నా..’’అని రేవంత్ అన్నారు. కేటీఆర్, హరీశ్‌లను కలసిన పొన్నం మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. యశోద ఆస్పత్రి వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. తన నియోజకవర్గానికి చెందిన ఓ కార్యకర్తను పరామర్శించేందుకు ఆస్పత్రికి వచ్చానని.. అక్కడే ఉన్న కేసీఆర్ కుటుంబ సభ్యులను కలసి మాట్లాడానని పొన్నం ప్రభాకర్ చెప్పారు. కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారని కేటీఆర్, హరీశ్‌రావు చెప్పారన్నారు. ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవని, కేసీఆర్ త్వర గా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు. కేసీఆర్‌కు వీహెచ్, కోదండరెడ్డి పరామర్శ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కాంగ్రెస్ సీనియర్ నేతలు వి.హనుమంతరావు, కోదండరెడ్డి పరామర్శించారు. సోమాజిగూడ యశోద ఆసుపత్రికి ఆదివారం వెళ్లిన ఇద్దరు నేతలు కేసీఆర్‌ను కలిశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తొలుత కేసీఆర్‌ను కలిసేందుకు ఆసుపత్రి వర్గాలు అనుమతించకపోవడంతో.. మాజీ మంత్రి కేటీఆర్ చొరవ తీసుకుని ఇద్దరు కాంగ్రెస్ నేతలను లోపలికి తీసుకెళ్లారు. మరో రెండు, మూడు రోజుల్లో కేసీఆర్ డిశ్చార్జ్? సాధారణంగా తుంటి మారి్పడి సర్జరీ చేయించుకున్న అనంతరం రెండు రోజుల్లోనే డిశ్చార్జ్ చేస్తారు. అయితే వయసు, ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కేసీఆర్ డిశ్చార్జిని కొద్దిగా పొడిగించినట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఆయన బాగానే కోలుకుంటున్నారని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయనకు సాధారణ మందుల వాడకం, సులభమైన వ్యాయామాలు తప్ప మరే ప్రత్యేకమైన వైద్య సేవలూ అవసరం లేదని అంటున్నారు. దీంతో ఆయనను మరో 2, 3 రోజుల్లోనే డిశ్చార్జి చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే పూర్తిగా కోలుకుని తన కార్యకలాపాలు య «థావిధిగా నిర్వర్తించేందుకు మరి కొన్ని వారా లు పడుతుందని వైద్యులు అంటున్నారు. -
ఆ గ్రామాలను ప్రకృతి వ్యవసాయ జోన్‌గా ప్రకటించాలి
సాక్షి, హైదరాబాద్: జీవో 111 పరిధిలోకి వచ్చే గ్రామాలను ప్రకృతి వ్యవసాయ (ఆర్గానిక్ ఫామింగ్) జోన్‌గా ప్రకటించాలని, రెండు జలాశయాల్లో పూర్తిస్థాయి నీటిమట్టం (ఎఫ్టీఎల్) లోపల ఉన్న అక్రమ నిర్మాణాలను వెంటనే కూల్చివేయాలని టీపీసీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జీవో 111 అధ్యయన కమిటీ అభిప్రాయపడింది. ఈ మేరకు కమిటీ చైర్మన్ ఎం. కోదండరెడ్డి, కన్వినర్ సంగిశెట్టి జగదీశ్వరరావు నేతృత్వంలోని బృందం తాము రూపొందించిన నివేదికను బుధవారం టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డికి అందజేసింది. జీవో 111 ప్రాంతంలో ఇప్పటికీ వ్యవసాయం చేస్తున్న రైతులను గుర్తించాలని, ప్రత్యేక ప్యాకేజీ కింద వారికి ఎకరానికి లక్ష రూపాయల చొప్పున రెండు విడతల ఆర్థిక సాయం అందజేయాలని కోరింది. అక్కడ ప్రకృతి ఆధారిత పంటలు పండించేలా ప్రోత్సాహమివ్వాలని, వ్యవసాయ, ఉద్యాన శాఖ పరిశోధనశాలలు ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని కోరింది. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర వచ్చేలా ప్రత్యేక మార్కెటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని, రైతుల ఇష్టంతో భూములు అమ్ముకున్నప్పటికీ, కొనుగోలు చేసిన వారు కూడా వ్యవసాయం చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు గుర్తింపు కార్డు లు ఇవ్వాలని కోరింది. జీవో111కు బదులు సమగ్రమైన చట్టాన్ని తేవాలని పేర్కొన్నారు. పర్యావరణంపై సీఎంకు అవగాహన లేదు: కోదండరెడ్డి తమ నివేదికను రేవంత్‌కు ఇచ్చిన అనంతరం గాం«దీభవన్‌లో సంగిశెట్టి జగదీశ్వర్‌రావు, అధ్యయన కమిటీ సభ్యులతో కలసి కోదండరెడ్డి మీడియాతో మాట్లాడుతూ 111 జీవో పరిధిలోని 80 శాతం భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లో ఉన్నాయన్నారు. ఎఫ్టీఎల్ పరిధిలో మంత్రులు ఫామ్‌హౌస్‌లు కట్టుకున్నారని, వారి ఫాంహౌస్‌లు మునిగిపోకుండా ఉండేందుకే హిమాయత్‌సాగర్ పూర్తిగా నిండకముందే గేట్లు తెరిచారని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌కు పర్యావరణంపై అవగాహ న లేదని, కేటీఆర్ అవగాహనరాహిత్యం వల్ల జంట జలాశయాలకు ముప్పు వాటిల్లుతోందని చె ప్పారు. రియల్టర్ల కోసమే జీవో 111ను ఎత్తివేశారని, ఈ జీవో పరిధిలో అన్ని నిబంధనలూ పేదలకే వర్తింపజేస్తున్నారని, పెద్దలు మాత్రం ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని తమ అధ్యయనంలో తేలిందని కోదండరెడ్డి చెప్పారు. -
రాహుల్ సభ.. రైతుల కోసమే
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలోని రైతాంగానికి భరోసా కల్పించి వారిలో ధైర్యం నింపేందుకే వచ్చే నెల 6న వరంగల్‌కు రాహుల్‌గాంధీ వస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నించి రైతుల్లో ధైర్యం నింపుతారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు వ్యవసాయ ఆధారిత వర్గాలకు ఎలాంటి పథకాలు అమలు చేస్తున్నాయో వరంగల్ రైతు సంఘర్షణ సభలో వెల్లడిస్తారు. భవిష్యత్తులో వ్యవసాయ రంగానికి కాంగ్రెస్ ఏం చేయనుందో కూడా చెబుతారు’ అని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు తెలిపారు. రాహుల్ సభ విజయవంతం కోసం పార్టీ నేతలందరమూ కృషి చేస్తున్నామని, రాజకీయాలకు అతీతంగా రైతులందరూ సభకు వచ్చి రాహుల్ ఏం చెప్తారో వినాలని కోరారు. ఆదివారం అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయంలో విలేకరులతో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, శ్రీధర్‌బాబు, టీపీసీసీ ప్రచార, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్లు మధుయాష్కీగౌడ్, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు ఎం. కోదండరెడ్డి మాట్లాడారు. రైతులకు రుణమాఫీ ఏది?: భట్టి కాంగ్రెస్‌కు పోటీగా టీఆర్ఎస్ రుణమాఫీ ప్రకటించినా అమలు చేయకపోవడంతో రూ. లక్ష రుణానికి వడ్డీలు పెరిగి రూ.4 లక్షలు అయ్యాయని, ఇప్పుడు ఆ రుణం తీర్చడం రైతులకు కష్టంగా మారిందని భట్టి అన్నారు. కాంగ్రెస్ హయాంలో రైతులకు రూ.లక్ష లోపు వడ్డీలేని రుణం, రూ. 3 లక్షల వరకు పావలా వడ్డీ, సబ్సిడీపై ఎరువులు, విత్తనాలు, ట్రాక్టర్లు వ్యవసాయ యంత్ర పరికరాలు డ్రిప్స్, స్ప్రింకర్లతో పాటు పందిరి సాగు కోసం 100 శాతం సబ్సిడీ ఇచ్చామని గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలో పేదలకు వ్యవసాయం కోసం అసైన్ చేసిన భూములను టీఆర్ఎస్ సర్కారు లాక్కుని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇచ్చే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. రైతులను కేసీఆర్, మోదీ ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని ఉత్తమ్ ఆరోపించారు. కేసీఆర్ చేతకానితనంతోనే వరి రైతులు నష్టపోయారన్నారు. మూడేళ్ల క్రితమే ఉచితంగా ఎరువులు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా యేటా ఎరువుల ధరలు పెంచుతున్నారని మండిపడ్డారు. రైతులకు కూలి కూడా గిట్టట్లేదు: కోమటిరెడ్డి సీఎం కేసీఆర్ రైతులను మోసం చేశారని, ఆయన ఇచ్చే మద్దతు ధరతో కూలి కూడా గిట్టడం లేదని కోమటిరెడ్డి చెప్పారు. రుణమాఫీ ఊసే ఎత్తకపోవడం దురదృష్టకరమన్నారు. ఓట్ల కోసం రాహుల్ వరంగల్‌కు రావట్లేదని, రైతుల కోసం వస్తున్నారని చెప్పారు. వరంగల్ సభ ఏర్పాట్ల నుంచి అన్ని అంశాలపై స్పష్టంగా ముందుకెళ్తామన్నారు. ప్రశాంత్ కిశోర్, టీఆర్ఎస్ నేతల భేటీ గురించి విలేకరులు ప్రశ్నించగా పీకే గురించి పార్టీ నుంచి తమకు ఎలాంటి వివరణ అందలేదని, ఊహాగానాలపై చర్చ అవసరం లేదని, మీడియా కథనాలపై స్పందించలేమని కాంగ్రెస్ నేతలు చెప్పారు. పార్టీ అధిష్టానం తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటామన్నారు. మీడియాతో మాట్లాడుతున్న ఉత్తమ్. చిత్రంలో కోదండరెడ్డి, జగ్గారెడ్డి, భట్టి, కోమటిరెడ్డి, శ్రీధర్‌బాబు -
కేసీఆర్‌ది రాజకీయ ప్రా‘ధాన్యం’: రేవంత్
సాక్షి, హైదరాబాద్: యాసంగి ధాన్యం కొనుగోళ్ల విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్ క్షుద్ర రాజకీయ క్రీడ నడుపుతున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. కేంద్రం ఉప్పు డు బియ్యం కొనదని చెబుతున్నందున యాసంగి ధాన్యం సేకరించేదిలేదని కేసీఆర్ చెప్పడం రైతులను రాజకీయంగా వాడుకోవడమేనని అన్నారు. గురువారం గాంధీభవన్‌లో జాతీయ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. పంటల కొనుగోలు, పంటలపై ఆంక్షలు, ధరణి సమస్యలు, రుణమాఫీ వంటి అంశాలపై చర్చ జరిగింది. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ యాసంగిలో వడ్లు కొనబోమని చెప్పడంతో ఈసారి రాష్ట్రంలో వరిసాగు 35 లక్షల ఎకరాలకే పరిమితమైందని, తద్వారా 70 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని అన్నారు. మార్చి నాటికే యాసంగి ధాన్యం కొనుగోలుపై ప్రణాళికలు రూపొందించి అమలు చేయాల్సిన ప్రభు త్వం చేతులెత్తేయడంతో రైతులు దిక్కుతోచనిస్థితిలో ఉన్నా రని విచారం వ్యక్తం చేశారు. దీన్ని ఆసరాగా చేసుకొని మిల్ల ర్లు రైతుల వద్ద నుంచి క్వింటాకు రూ.1,400 నుంచి రూ. 1,500 కొనుగోలు చేసేందుకు ఇప్పటి నుంచే ఒప్పందాలు చేసుకుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఇక్కడ సమస్యలు సృష్టించి కేంద్రంతో కొట్లాడుతున్నట్టు రాజకీయం చేస్తున్నా రని విమర్శించారు. కాగా, మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో నిజానిజాలు బయటకు రావాలంటే జ్యుడీషి యల్ విచారణ జరిపించాలని రేవంత్ డిమాండ్ చేశారు. రైతు సమస్యలపై 5వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపట్టనున్నట్టు ఆయన తెలిపారు. -
టీపీసీసీ క్రమశిక్షణా సంఘానికి కోదండరెడ్డి రాజీనామా
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ క్రమశిక్షణా సంఘం చైర్మన్ పదవికి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఎం. కోదండరెడ్డి ఆదివారం రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి మెయిల్ ద్వారా పంపారు. రాజీనామా ప్రతులను ఎంపీ రాహుల్‌గాంధీ, ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి కె.సి.వేణుగోపాల్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్, టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డిలకు పంపారు. తనకు ఇన్నేళ్లు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తన టీంను ఏర్పాటు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించాలన్న ఉద్దేశంతోనే రాజీనామా చేస్తున్నానని తెలిపారు. తన రాజీనామా విషయమై కోదండరెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ కొత్త పీసీసీ అధ్యక్షుడి నియామకం తర్వాత గతంలో ఉన్న కమిటీలకు రాజీనామాలు చేయడం కాంగ్రెస్ పార్టీ సంప్రదాయమని చెప్పారు. కొన్ని పిటిషన్లు తన వద్ద పెండింగ్‌లో ఉన్నందున అప్పుడు రాజీనామా చేయలేదని, ఇప్పుడు అన్ని పిటిషన్ల విచారణ పూర్తి అయిందని చెప్పారు. రాజీనామాకు ప్రత్యేక కారణాలు ఏమీ లేవని ఆయన స్పష్టం చేశారు. -
టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ పదవికి కోదండరెడ్డి రాజీనామా
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ పదవికి కోదండరెడ్డి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను సోనియా, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి పంపించారు. రాజీనామా అనంతరం మీడియాతో కోదండ రెడ్డి మాట్లాడుతూ.. నూతన టిపీసీసీ అధ్యక్షుని నియామకం సందర్భంగా కొత్త కమిటీ ఏర్పాటుకు వెసులుబాటుగా రాజీనామా చేశానన్నారు. ఇంతకాలం కొన్ని కేసులు పెండింగ్ లో ఉండటంతో ఆగానని, క్రమశిక్షణ కమిటీకి అందిన ఫిర్యాదుల విచారణ పూర్తయ్యాకే రాజీనామా సమర్పించానని ఆయన పేర్కొన్నారు. రాజీనామా వెనుక వేరే ఉద్దేశం ఏమీ లేదన్నారు. ఇవీ చదవండి: ‘మంత్రి మల్లారెడ్డి ఒక బడాచోర్’ సాధారణ ఎన్నికలు లేకున్నా రాజకీయ సందడి.. ఎందుకంటే! -
టీ.బడ్జెట్.. పైన పటారం..లోన లొటారం..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ ‘పైన పటారం..లోన లొటారం’ అన్న చందంగా ఉందని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు ఎం.కోదండరెడ్డి, తెలంగాణ పీసీసీ అధికార ప్రతినిధి నిరంజన్ విమర్శించారు. వారిద్దరూ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. స్వయంగా ముఖ్యమంత్రి ప్రభుత్వ భూములను అమ్మి ఆయా శాఖలకు డబ్బు కేటాయిస్తామని చెప్పడం ఇందుకు నిదర్శనమన్నారు. రాష్ట్ర్రాన్ని కేసీఆర్ అప్పులపాలు చేస్తున్నారని మొదట నుంచి కాంగ్రెస్ చెబుతూనే ఉందన్నారు. ప్రభుత్వ భూములు అమ్మడాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందన్నారు. భూముల అమ్మకాలపై.. భవిష్యత్ అవసరాలు దృష్టి కోణంలో ప్రభుత్వం ఆలోచించాలని సూచించారు. వ్యవసాయ అభివృద్ధి 6.5 శాతం అన్నారని..కానీ రైతుల ఆదాయం పెరగలేదన్నారు. ఎంఎస్పీ కూడా పెరగలేదన్నారు. రుణమాఫీకి ఈ బడ్జెట్లో ఆరు వేల కోట్లు కేటాయించారని..38 వేలకోట్ల రుణమాఫీ ఎన్నేళ్లకు చేస్తారని ప్రశ్నించారు. ఏకకాలంలో చేయకపోతే గత అనుభవాలే పునరావృతం అవుతాయన్నారు. రైతుబంధు పథకంలో స్పష్టత లేదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. -
‘అందులో బీజేపీలో చేరతానని రాయలేదు’
సాక్షి, హైదరాబాద్ : ఈ నెల 17న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్, పీసీపీని అవమానించేలా మాట్లాడినందుకే ఆయనకు షోకాజ్ నోటీసులు అందించామని ఆ పార్టీ క్రమశిక్షణకమిటీ చైర్మన్ కోదండరెడ్డి అన్నారు. షోకాజ్ నోటీస్ ఇచ్చినా రాజగోపాల్‌రెడ్డి తీరు మార్చుకోకపోవడమే కాకుండా కఠినంగా రిప్లై ఇచ్చారన్నారు. గురువారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఖతం అయిపోందని రాజగోపాల్‌రెడ్డి అనడం వలనే ఆయనకు నోటీస్ ఇచ్చామన్నారు. పార్టీ విలువలను కాపాపడానికి తప్పు చేసిన వారికి షోకాజ్ నోటీసులు అందించడం సహజమన్నారు. తమ నోటీసులకి రిప్లై ఇచ్చిన లెటర్లో బీజేపీలో చేరుతానని రాజగోపాల్‌రెడ్డి పేర్కొనలేదని చెప్పారు. రాజగోపాల్‌రెడ్డి తన బాధ్యతలను నిర్వర్తించడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. -
మేమే రాజీనామా చేయాలి
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయానికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాల్సింది రాహుల్ గాంధీ కాదని, ఆయా రాష్ట్రాల నాయకత్వాలుగా ఉన్న తామేనని ఏఐసీసీ కిసాన్ సెల్ వైస్ చైర్మన్ కోదండరెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీని నడిపించడంలో రాహుల్‌కు స్పష్టమైన అవగాహన ఉందని, 2019 ఎన్నికల్లో ఆయన పరిణతి చెందిన రాజకీయ నాయకుడిగా ప్రచారం నిర్వహించారన్నారు. అయితే ఈ ఎన్నికల్లో ఓటమిని రాహుల్‌కు ఆపాదించడం సరైంది కాదని అన్నారు. ఆయన రాజీనామా చేయాల్సిన పనిలేదని, దీనికి ఆయా రాష్ట్రాల నాయకత్వాలే బాధ్యత తీసుకుని రాజీనామాలు చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. రాహుల్ కొనసాగాలి: రంగారెడ్డి, మల్లు రవి రాహుల్ నిర్ణయం సరైంది కాదని, ఆయన తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డి కోరారు. ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఉండటాన్ని తాము పూర్తిగా సమర్థిస్తున్నామని బుధవారం విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు. పార్టీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రాహుల్ తప్ప ఎవరు అధ్యక్షుడైనా.. పార్టీ పటిష్టం కాలేదని, ఆయనే కొనసాగాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి బుధవారం ఓ ప్రకటనలో కోరారు. వితండవాదం మానుకోండి: కోదండరెడ్డి నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పరాజయం గురించి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన వితండవాదాన్ని మానుకోవాలని కోదండరెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన టీపీసీసీ కిసాన్‌సెల్ చైర్మన్ అన్వేష్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఎన్ఎస్యూఐ ప్లకార్డుల ప్రదర్శన రాహుల్ గాంధీనే ఏఐసీసీ అధ్యక్షుడిగా కొనసాగాలంటూ భారత జాతీయ విద్యార్థి సంఘం (ఎన్ఎస్యూఐ) ఆధ్వర్యంలో గాంధీభవన్ వద్ద ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాహుల్ తన పదవిలో కొనసాగాలంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నగేష్ బహిష్కరణకు రంగం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నగేష్ ముదిరాజ్‌ను కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించేందుకు రంగం సిద్ధమైంది. దీని కోసం పార్టీ క్రమశిక్షణా సంఘం చైర్మన్ కోదండ్‌రెడ్డి, ఇతర సభ్యులు అత్యవసరంగా సమావేశమయ్యారు. ఇందిరా పార్క్ వద్ద అఖిలపక్ష సమావేశంలో మాజీ ఎంపీ వి. హనుమంతరావుపైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నగేష్ ముదిరాజ్ దాడి చేసినట్లు క్రమశిక్షణా సంఘం భావిస్తోన్నట్లు తెలిసింది. ఏఐసీసీ ఇంఛార్జ్ కార్యదర్శి ఆర్సీ కుంతియా సభలో పాల్గొన్న సమయంలో వీహెచ్‌పైన దాడి జరిగిందని భావిస్తున్నట్లు వెల్లడించింది. సీనియర్ నాయకులు, పార్టీలో అనేక పదవులు నిర్వహించిన వీహెచ్‌పైన నగేశ్ ముదిరాజ్ అనుచితంగా ప్రవర్తించి భౌతిక దాడికి దిగడాన్ని క్రమశిక్షణా సంఘం తీవ్రంగా ఖండింది. క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించేది లేదని క్రమశిక్షణా సంఘం తేల్చి చెప్పింది. ఈ అంశంపైనా అక్కడ సభలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు పొన్నం ప్రభాకర్, మండలి విపక్ష మాజీ నేత షబ్బీర్ అలీలను కమిటీకి నివేదిక ఇవ్వాలని ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి ఆర్సీ కుంతియా సూచన చేశారు. ప్రాథమికంగా ఉన్న సమాచారం ప్రకారం, వారు ఇచ్చిన నివేదిక ఆధారంగా నగేష్ ముదిరాజ్‌పైన చర్యలు తీసుకునేందుకు క్రమశిక్షణా సంఘం రంగం సిద్ధం చేసింది. క్రమశిక్షణ విషయంలో ఎలాంటి వారినైనా, ఎంత పెద్దవారైనా చర్యలు తప్పవని హెచ్చరికలు పంపింది. -
కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా కోదండ రెడ్డి
న్యూఢిల్లీ: ఆలిండియా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా కోదండ రెడ్డిని నియమిస్తూ కాంగ్రెస్ అదిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ అశోక్ గహ్లోత్ ఓ ప్రకటనలో తెలిపారు. కోదండ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ చైర్మన్‌గా పనిచేస్తున్నారు. కోదండ రెడ్డితో పాటు పలు రాష్ట్రాలకు చెందిన వారిని ఉపాధ్యక్షులుగా, జాతీయ కోఆర్డినేటర్లుగా, జాతీయ జాయింట్ కోర్డినేటర్లుగా నియమించారు. ఉపాధ్యక్షులు 1. ఎస్ ఎస్ రామ సుబ్బు(తమిళనాడు) 2. కోదండ రెడ్డి(తెలంగాణ) 3. శ్యామ్ పాండే(మహారాష్ట్ర) 4. సురేందర్ సోలంకి(ఢిల్లీ) జాతీయ కోఆర్డినేటర్లు 1. నారాయణ్ పాల్(ఉత్తరాఖండ్) 2.కోదండ రామా రావు(తెలంగాణ) 3. బసంత దాస్(అస్సాం) 4.అజయ్ చౌదరీ(ఉత్తర్ ప్రదేశ్) 5. సుభాష్ బాత్రా(హర్యానా) 6. రామేశ్వర్ చౌదరీ(మధ్యప్రదేశ్) 7. సుఖ్బిలాష్ బర్మ(పశ్చిమ బెంగాల్) 8. లాల్ వార్ఘేస్(కేరళ) 9. రాజేశ్ కుమార్ సింగ్(పంజాబ్) 10. ముఖేష్ బావా(బిహార్) జాతీయ జాయింట్ కోఆర్డినేటర్లు 1. పాల్ బాయ్ అంబాలియా(గుజరాత్) 2. రాజు మన్(హర్యానా) 3. డాక్టర్ అనిల్(హర్యానా) 4. ఆర్సీ పాండే(ఉత్తర్ ప్రదేశ్) 5.ప్రిత్పాల్ సింగ్(పంజాబ్) 6. మహ్మాద్ హిష్మాన్ ఒస్మానీ(మహారాష్ట్ర) 7.కమల్ చౌదరీ(రాజస్తాన్) 8. భారత్ ప్రియా(జమ్మూ కశ్మీర్) 9.లెగాంగ్టే(మణిపూర్) 10. దేవేందర్ పటేల్(మహారాష్ట్ర) 11. ప్రియా గ్రావేల్(హర్యానా) 13. కేడీ ద్వివేది(ఉత్తర్ ప్రదేశ్) -
రైతు మిత్ర సంఘాలను పునరుద్ధరిస్తాం’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతుల సంక్షేమమే ప్రాధాన్యాంశంగా పనిచేయాలని కిసాన్ కాంగ్రెస్ సూచించింది. రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం చైర్మన్ కోదండరెడ్డి అధ్యక్షతన శని వారం గాంధీభవన్‌లో జరిగింది. గతంలో కాం గ్రెస్ ఆధ్వర్యంలో ఇచ్చిన ఆర్మూర్ డిక్లరేషన్‌కు అదనంగా పార్టీ మేనిఫెస్టోలో చేర్చాల్సిన రైతు సంక్షేమ, అభివృద్ధి అంశాలపై కిసాన్ కాంగ్రెస్ నేతలు చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నా రు. కల్తీ విత్తనాల కట్టడికి రాష్ట్ర స్థాయిలో సమగ్ర విత్తన చట్టం తేవాలని, మానవహక్కుల కమిష న్ తరహాలో వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేయాలని, రైతు సమన్వయ సమితుల స్థానం లో రైతు మిత్ర సంఘాలను పునరుద్ధరించాలని, సన్న, చిన్నకారు రైతులకు సబ్సిడీపై ట్రాక్టర్లు అందజేయాలని, భూరికార్డుల ప్రక్షాళనలో అవకతవకలను సరిదిద్దడానికి నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయాలను టీపీసీసీకి అందిస్తామని, వీటిని పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చేలా చర్యలు తీసుకుం టామని కిసాన్ కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. -
ఎన్నికల కోసమే మద్దతు ధర: కోదండరెడ్డి
సాక్షి, హైదరాబాద్: రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే కేంద్ర ప్రభుత్వం పంటలకు మద్దతు ధరలు పెంచిందని టీపీసీసీ కిసాన్‌సెల్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి ఆరోపించారు. గురువారం గాంధీభవన్‌లో మాట్లాడిన ఆయన...ఎన్నికల కోసమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులపై కపట ప్రేమను చూపిస్తున్నాయని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగిన నష్టానికి ఇప్పటికీ పరిహారం చెల్లించలేదని, రూ.7,400 కోట్లకు సంబంధించిన పరిహారం వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు కేంద్రానికి పంపలేదన్నారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి మాట్లాడుతూ...టీఆర్ఎస్, బీజేపీలకు బుద్ధి చెప్పేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారన్నారు. -
ఫార్మాసిటీతో సర్వనాశనం
యాచారం : తెలంగాణ ప్రభుత్వం ఫార్మాసిటీని చట్టానికి విరుద్ధంగా ఏర్పాటు చేస్తుంది, నింబంధనలను తుంగలో తొక్కి కాలుష్యంతో ఈ ప్రాంతాన్ని సర్వనాశనం చేయాలని చూస్తుందని కాం గ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ముదిరెడ్డి కోదండరెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని నక్కర్తమేడిపల్లిలో శుక్రవారం ఫార్మా భూబాధితులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భూసేకరణ చట్టం 2013కు విరుద్ధంగా రైతుల నుంచి భూసేకరణ చేయడమే కాక, రాళ్లు, రప్పల పేరుతో ఇచ్చే పరిహారాన్ని కూడా న్యాయంగా అందజేయలేదన్నారు. చట్టానికి విరుద్ధంగా జరిగిన భూసేకరణ వల్ల కోర్టుల్లో రైతులకే న్యాయం జరిగే అవకాశం ఉందని అన్నారు. ఖరీఫ్ సీజన్ దృష్ట్యా రైతులు మళ్లీ ఫార్మాకిచ్చిన భూముల్లో సాగు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం పట్టాదారు, పాసుపుస్తకంలో ఉన్న ఎకరాలకు న్యాయమైన పరిహారం ఇవ్వకుండా రైతులను నష్టాలకు గురి చేసిందని మండిపడ్డారు. ఫార్మా పేరుతో రియల్ వ్యాపారం చేస్తున్న ప్రభుత్వం రైతులకు మాత్రం తక్కువ పరిహారం ఇచ్చి వారి జీవోపాధికి కల్పించే సాగు భూములను లాక్కోవాలని చూస్తుందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఆటలు సాగనీవ్వమని హెచ్చరించారు. ఫార్మాసిటీలో వందలాది విష కాలుష్య పరిశ్రమలు ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్ని సర్వనాశనం చేయాలని చూస్తుందన్నారు. చట్టం రైతులకు అనుకూలంగా ఉంది ఏ మాత్రం భయపడొద్దని సూచించారు. పలువురు న్యాయవాదులు పాల్గొని చట్టానికి విరుద్ధంగా చేపడుతున్న ఫార్మాసిటీ వల్ల న్యాయస్థానాల్లో ఏ విధంగా అనుకూలమైన తీర్పులు వస్తాయో తెలిపారు. కార్యక్రమంలో నక్కర్తమేడిపల్లి సర్పంచ్ భాషా, ఉప సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, పర్యావరణవేత్త సరస్వతి , పలు పార్టీల నాయకులు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. -
సాహితీ.. మహాసముద్రం
అనంతను కార్యక్షేత్రంగా మలుచుకుని సాహితీ సేవలు అందిస్తున్న వారిలో విశ్రాంత ప్రొఫెసర్ మహాసముద్రం కోదండరెడ్డి దేవకి ఒకరు. చిత్తూరు జిల్లా వరిగిపల్లి గ్రామంలో జన్మించిన ఆమె ఉద్యోగరీత్యా 1979 నుంచి 2011 వరకు ఎస్కేయూలోని తెలుగు విభాగంలో అధ్యాపకురాలిగా పనిచేశారు. బాలల సాహిత్యంలో పరిశోధనలు చేసిన తొలి మహిళ దేవకితో ‘సాక్షి హృదయరాగం’ మీ కోసం.. మహిళా స్వేచ్ఛను హరిస్తున్నారు నాటి కన్యాశుల్కం రోజుల నుంచి నేటిదాకా నిత్యమూ బాధలనుభవిస్తోంది మహిళలే. అన్ని చోట్లా స్త్రీ.. దారుణంగా మోసపోతోంది. చిన్నతనంలో తల్లిదండ్రుల వద్ద, యుక్తవయసులో భర్త వద్ద వివక్ష కొనసాగుతోంది. భద్రత పేరుతో స్వేచ్ఛను హరిస్తున్నారు. మా పొలాల్లో కూలికి వచ్చే మగవారికి రెండు రాగి ముద్దలు, కొంత డబ్బు ఇస్తే.. అదే పని చేసిన ఆడవారికి అందులో సగం డబ్బు, ఒక రాగి ముద్ద ఇచ్చేవారు. అప్పట్లోనే దీన్ని నేను బాగా వ్యతిరేకించాను. యూనివర్సిటీలో చేరాక కూడా అనేక ఘోరాలు చూడాల్సి వచ్చింది. మహిళలను ఆటవస్తువులుగా చూడొద్దంటూ అరవడం అరణ్యరోదనే అని అర్థమైపోయింది. సమాజంలో మార్పు రానంత వరకు ఏమీ చేయలేం. – మహాసముద్రం కోదండరెడ్డి దేవకి ఇల్లే విద్యాలయం మా కుటుంబ నేపథ్యం చాలా ఆసక్తిగా ఉంటుంది. కేవలం మూడో తరగతి వరకు చదువుకున్న మా నాన్న కోదండరెడ్డి శ్రీ వేంకటేశ్వరస్వామిపై వేల కొద్ది పాటలు, పద్యాలు రాశారు. అవన్నీ ఛందోబద్ధంగా ఉన్నాయి. చిన్నాన్న బి.ఎన్.రెడ్డి.. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయానికి వైస్ చాన్సలర్‌గా పనిచేశారు. అమ్మ, అక్కలు కూడా ఆసువుగా జానపద గేయాలను ఆలపించగలరు. ఈ నేపథ్యంలోనే నేను కూడా రాయగలననే నమ్మకంతో ప్రయత్నించాను. ఎదుటి వారిలో శక్తిని గుర్తిస్తే మనలోని ఎంత ప్రతిభనైనా వెలికితీయొచ్చన్నది నా కుటుంబం ద్వారా నేర్చుకున్నాను. టాలెంట్ హంట్ చేపట్టాలి మా ఆయన (ఆచార్య పీఎల్ శ్రీనివాసరెడ్డి)తో కలిసి నేను ‘రసలాస్య’ అనే కళా సాంస్కృతిక సంస్థను ఎస్కేయూలో ఏర్పాటు చేశాను. వర్సిటీలో పనిచేసే ఉద్యోగులు, అధ్యాపకులు, విద్యార్థులలోని టాలెంట్‌ను గుర్తించడం, వాటిని ప్రదర్శించేందుకు సంగీతాన్ని ఆలంబనగా చేసుకున్నాము. దానికి మేము పెట్టిన ‘పురమాయిస్తుంది సమాజాన్ని సంగీతం సరిగ పదమని’ అనే ట్యాగ్‌లైన్ కూడా ఎంతో మందిని ఆకట్టుకుంది. అందరూ ఓ చోట చేరి మనసారా ఆడిపాడుకోవడం వల్ల ఓ చక్కటి వాతావరణం ఏర్పడుతుంది. అలాంటి ప్రయత్నం అన్ని చోట్లా సాగినపుడే అంతరాలు, అహం తొలిగిపోతాయి. ప్రతి కథలోను బాలసాహిత్యం బాల సాహిత్యం కోసం ఎన్నో ఊర్లు తిరగాల్సి వచ్చింది. ఎన్నో పుస్తకాలను అతి కష్టంపై సేకరించాను. నేను రాసిన ‘ తారంగం తారంగం, గోరుముద్దలు, బాలసాహిత్యం, జాతిరతనాలు, తెలుగు నాట జానపద వైద్య విధానాలు, దాక్షిణాత్య సాహిత్యం–తులనాత్మక పరిశీలన, ఇర్ల చెంగి కథలు, ముళ్ల దోవ, మండల వడిలో’ వంటి బాలల గేయాలు, వ్యాస సంపుటిలు..ఇలా ప్రతి దానిలో ఉత్తమ విలువలే చోటు చేసుకున్నాయి. మరో 10 పుస్తకాలు నా సంపాదకత్వంలో వెలువడ్డాయి. ‘జాతి రత్నాలు’ పేరిట ఉపవాచకంలో నా రచనలను 9వ తరగతి విద్యార్థులకు పాఠ్యాంశంగా పెట్టారు. ప్రపంచ తెలుగు సభల సందర్భంగా తెలుగు అకాడమీ వారు ‘బాల సాహిత్యం’ అనే గ్రంథాన్ని ప్రచురించారు. ఇది అనంతకు దక్కిన గౌరవంగానే భావించాను. ఇప్పుడు సామెతలెక్కడున్నాయి? విస్తృతమైన భావాన్ని అతి కొద్ది మాటల్లో చురుగ్గా, సూటిగా అందించే సామెతలు ఒకప్పుడు నిత్య వ్యవహారంలో ఉండేవి. ఏ సందర్భంలో, ఏ అర్థంలో వాటిని వాడాలో మన తెలుగు వారికి తెలిసినంతగా మరెవరిలోనూ కనిపించదు. వాటి వాడకం తెలుసుకుంటే తెలుగు భాష మరింత అందంగా ఉంటుంది. దాని కోసమే నేను ‘సామెతల సూరమ్మత్త’ పాత్రతో వేలాది సామెతలు, పొడుపుకథలు సేకరించాను. వివిధ పత్రికల్లో వచ్చాయి. త్వరలో వాటికి గ్రంథ రూపం ఇవ్వాలనుకుంటున్నా. విద్యార్థులకు ఆటల పాటల రూపంలో పొడుపు కథలను విప్పమని చెప్పడం, లేదంటే వారు సేకరించిన పొడుపు కథలను చెప్పాలన్న నియమం పెట్టడంతో చాలా మంది ఆసక్తికరంగా నేర్చుకున్నారు. ఈ ప్రయోగాన్ని నేను పాతికేళ్ల పాటు కొనసాగించాను. ‘అనంత’ ఎప్పుడూ ప్రత్యేకతే అనంత ప్రత్యేకత ఎప్పటికీ భిన్నమే. వేరుశనగ గురించి చెప్పుకోవాలంటే దేశంలోనే అనంత పేరే ముందుగా గుర్తొస్తుంది. కానీ అనంత రైతాంగమే విలవిలలాడిపోతోంది. వారి ఆవేదన కూడా అనేక వ్యాసాలు, కథల రూపంలో వెలువరించాను. ఈ ప్రాంతంలో రేగిన ఉద్యమాలు కూడా ఎంతో మందికి స్ఫూర్తినిచ్చాయి. కానీ ఇక్కడ కూడా మహిళలకు అన్యాయమే జరుగుతోంది. ఎంత మంది మహిళలను ఉద్యమకారులుగా, నడిపించే నేతలుగా గుర్తిస్తారు చెప్పండి. కాబట్టే మేము మా సాహిత్యంతోనే ఉద్యమాలలో పరోక్ష పాత్ర పోషించాం. కథలు రాయించిన నిరుద్యోగ జీవితం నేను పరిశోధన గ్రంథం సమర్పించిన తర్వాత నిరుద్యోగిగా ఆరు నెలల పాటు స్వగ్రామంలో గడపాల్సి వచ్చింది. ఆ సమయంలో ‘తరం మారింది, సెలయేట్లో గులకరాళ్లు’ అనే రెండు నవలలు రాశాను.వరకట్న దురాచారాన్ని వ్యతిరేకిస్తూ రాసిన మొదటి నవలే ఎందరినో కదిలించింది. అలాగే మొదటి కథ ‘ఎంగిలాకు’ను అధ్యాపకులందరూ బాగుందన్న తర్వాత ‘ఆకలి చెప్పిన తీర్పు’ కథను రాశాను. కథల కాణాచి కాళీపట్నం రామారావు (కారా మాస్టారు) అంతటి వారు నా కథల్ని ప్రశంసించడం పెద్ద అవార్డుగానే భావిస్తాను. తర్వాత ఎన్నో కథలు వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. స్త్రీ వాదంపై ఎన్నో వ్యాసాలు రాశాను. ఫకృద్దీన్ ఆలీ అహ్మద్‌తో కలిసి.. రాష్ట్రపతిగా 1974 – 77లో ఫకృద్దీన్ ఆలీ అహ్మద్ ఉండేవారు. ఆ సమయంలో నేను బాలల అకాడమీలో సభ్యురాలిగా ఉండేదాన్ని. అప్పట్లో హైదరాబాదులో నాలుగురోజుల పాటు జరిగిన బాలల సదస్సులో ఆయన పూర్తిగా సమయాన్ని కేటాయించి విలువైన సలహాలు, సూచనలు అందించారు. బాలల సాహిత్యం పట్ల నేను చేస్తున్న కృషిని గుర్తించి ప్రత్యేకంగా నన్ను అభినందించడం మరచిపోలేను. ఇతరుల ప్రతిభను మెచ్చుకోవడం తక్కువ ఇటీవల ఇతరులలోని ప్రతిభా పాటవాలను గుర్తించకపోవడం, తెలిసినా వెనక్కు లాగడం ఎక్కువైంది. దీని వల్ల మంచి సాహిత్యం వెలుగులోకి రాకుండా పోయింది. బాలల సాహిత్యంలో నేను సాగిస్తున్న కృషికి తిక్కవరపు రామిరెడ్డి బంగారు పతకం, వెంకటకృష్ణారావు స్మారక పురస్కారం, సీతామహాలక్ష్మి పురస్కారం, ఉగాది పురస్కారాలతో పాటు భారత మహిళా పురస్కారం నన్ను వరించాయి. కర్నూలు తెలుగు భాషా వికాస ఉద్యమం వారు విశిష్ట మహిళా పురస్కారమందించారు. తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ రచయిత్రి అవార్డునందించింది. జానపద సాహిత్యాన్ని మరవొద్దు మన జీవన విధానంలోని విభిన్న కోణాలు మన ఆచార వ్యవహారాలలో వ్యక్తమవుతాయి. ఏ తరం వారికైనా జానపద సాహిత్యం దిశానిర్దేశం చేస్తుందనేది నా భావన. ఆ దిశగా నేను రాసిన ఎన్నో జానపద సాహితీ గ్రంథాలు నాకు అవార్డులు, రివార్డులతో పాటు కొత్త ఒరవడికి నాంది పలికాయి. ఇవన్నీ మన రాష్ట్రంలోనే కాకుండా మహారాష్ట్ర లాంటి చోట్ల కూడా అనంత వాసుల రచనలు పాఠ్యాంశాలుగా మారడం గర్వించదగిన విషయం. స్వయంగా నేను ఓ జానపదుల ఇంట పుట్టడం వల్ల జానపదుల స్థితి గతులపై విస్తారంగా చర్చించే అవకాశమొచ్చింది. బయోడేటా పూర్తిపేరు : మహాసముద్రం కోదండరెడ్డి దేవకి జన్మస్థలం : వరిగిపల్లి గ్రామం, చిత్తూరు జిల్లా తల్లిదండ్రులు : కోదండరెడ్డి, కమలమ్మ భర్త : ఆచార్య పి.ఎల్. శ్రీనివాసరెడ్డి విద్య : ఎంఎ.. పీహెచ్డీ., వృత్తి : ఎస్కేయూ ప్రొఫెసర్‌గా ఉద్యోగ విరమణ రచనలు : ‘ తారంగం తారంగం’, ‘గోరుముద్దలు’, ‘బాలసాహిత్యం’, ‘జాతిరతనాలు’, ‘తెలుగు నాట జానపద వైద్య విధానాలు’ మొదలైనవి స్ఫూర్తి : కుటుంబమే పురస్కారాలు : ఉగాది పురస్కారం, భారత మహిళా పురస్కారం -
రైతులను ఆదుకోవడంలో విఫలం
సాక్షి, హైదరాబాద్: రైతులను ఆదుకోవడంలో, వ్యవసాయాన్ని సంక్షోభం నుంచి కాపాడటంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విఫలమ య్యారని టీపీసీసీ కిసాన్‌సెల్ అధ్యక్షుడు ఎం.కోదండరెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ, వ్యవసాయ రంగాన్ని సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. రైతులకు రుణమాఫీ చేయకుండా, వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించకుండా వట్టి మాటలకే టీఆర్ఎస్ ప్రభుత్వం పరిమితమైందన్నారు. మెదక్ జిల్లాతో పాటు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో భూగర్భ జలాలు చాలా ప్రమాదకర స్థాయిలో ఉన్నాయన్నారు. అలాంటప్పుడు 24 గంటల కరెంటు ఇచ్చినా రైతులకు వచ్చే ప్రయోజనం ఏంటని కోదండరెడ్డి ప్రశ్నించారు. 24 గంటల కరెంటు ఇవ్వడానికి వ్యతిరేకం కాదని, భారీ ప్రచారానికే వ్యతిరేకమన్నారు. భూగర్భజలాలు లేకుండా కరెంటు ఇవ్వడం వల్ల నష్టం తప్ప ప్రయోజనం ఏమీ లేదని రైతులు చెబుతున్నారని వెల్లడించారు. -
రంగారెడ్డికి ద్రోహం చేస్తారా?
మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డి సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు రీ డిజైను పేరుతో రంగారెడ్డి జిల్లాకు సాగు, తాగునీరు అందకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ద్రోహం చేయాలని చూస్తున్నారని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎం.కోదండరెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో శనివారం విలేకరులతో వారు మాట్లాడుతూ, ప్రాణహిత-చేవెళ్ల ఉద్దేశమే రంగారెడ్డి జిల్లాకు నీరు అందించడమని, ఇప్పుడు రీ డిజైను పేరుతో రంగారెడ్డి జిల్లాకు చుక్క నీరు అందకుండా వివక్ష చూపిస్తున్నారని ఆరోపించారు. రంగారెడ్డి జిల్లాలో సాగుకు అవకాశమున్న 8 లక్షల ఎకరాలకు నీటిని ఎలా అందిస్తారో చెప్పాలని సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టత ఇవ్వకుంటే పోరాటానికి దిగుతామని హెచ్చరించారు. -
'రైతు సమస్యలపై అసెంబ్లీ, పార్లమెంట్లో చర్చిస్తాం'
హైదరాబాద్: రైతు ఆత్మహత్యలను నివారించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైయ్యాయని తెలంగాణ కాంగ్రెస్ నేత కోదండరెడ్డి విమర్శించారు. కరువు మండలాల ప్రకటనలో శాస్త్రీయతను పాటించలేదని ఆయన మండిపడ్డారు. బుధవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. కరువు మండలాలపై పున: సమీక్షించి కేంద్రానికి సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరారు. పంట నష్టపరిహారం రైతులను మరింత అప్పుల పాలు చేసేలా ఉందని అన్నారు. పంట నష్టపరిహారం కింద ఎకరాకు 20 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతాంగ సమస్యలపై అసెంబ్లీ, పార్లమెంట్లో చర్చిస్తామని కోదండ రెడ్డి తెలిపారు. -
'రైతుల్ని మోసం చేసిన కేసీఆర్ సర్కార్'
హైదరాబాద్: పంటల బీమాపై రైతులను తెలంగాణ ప్రభుత్వం మోసం చేసిందని టి.కాంగ్రెస్ నేత కోదండరెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. సర్కార్ ఇచ్చిన రూ.90 కోట్ల బీమా మొత్తాన్ని పెండింగ్‌లో పెట్టడం సరికాదన్నారు. ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీల పేరుతో బీమా ప్రీమియంలో అవకతవకలు ఉన్నాయని ఆరోపించారు. పంటల బీమా పథకం అవకతవకలపై ప్రభుత్వం వెంటనే విచారణ జరిపించాలని కోదండరెడ్డి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. -
'రైతుల రుణాలు మాఫీ చేయాలి'
-
'ఆ రెండు రైతు వ్యతిరేక ప్రభుత్వాలే'
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై కేసీఆర్ సర్కార్ స్పందించడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ, వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోదండరెడ్డిలు మండిపడ్డారు. నరేంద్ర మోదీ సర్కార్‌తో కేసీఆర్ సర్కార్ కుమ్మక్కైందని వారు దుయ్యబట్టారు. రైతు సంక్షేమాన్ని కేంద్ర, రాష్ట్రాలు విస్మరిస్తున్నాయని విమర్శించారు. కేంద్ర, రాష్ట్రాలు రెండు రైతు వ్యతిరేక ప్రభుత్వాలేనని చెప్పారు. తెలంగాణలో తీవ్ర కరువు పరిస్థితులు ఉన్నా కేంద్రానికి కేసీఆర్ నివేదిక ఇవ్వలేదన్నారు. కరవుకు తోడు అకాల వర్షాలతో తెలంగాణ రైతులు తీవ్రంగా నష్టపోయారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టపోయిన రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. హెక్టార్‌కు రూ. 20వేల పరిహారం ఇవ్వాలని కోరారు. అలాగే 500 కోట్లతో మార్కెట్ ఇంటర్వెన్షన్ పన్నులు ఏర్పాటు చేయాలన్నారు. భూ సేకరణ ఆర్డినెన్స్‌తో వ్యతిరేకత వస్తుందనే వెంకయ్యనాయుడు, ఇతర మంత్రులు పరామర్శించారని విమర్శించారు. బియ్యం లెవీని 75శాతం నుంచి 25 శాతం తగ్గించడం సరికాదన్నారు. ఇది ముమ్మూటికీ రైతు వ్యతిరేక చర్యేనని షబ్బీర్ అలీ, పొంగులేటి, కోదండరెడ్డిలు ధ్వజమెత్తారు