మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డి
సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు రీ డిజైను పేరుతో రంగారెడ్డి జిల్లాకు సాగు, తాగునీరు అందకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ద్రోహం చేయాలని చూస్తున్నారని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎం.కోదండరెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో శనివారం విలేకరులతో వారు మాట్లాడుతూ, ప్రాణహిత-చేవెళ్ల ఉద్దేశమే రంగారెడ్డి జిల్లాకు నీరు అందించడమని, ఇప్పుడు రీ డిజైను పేరుతో రంగారెడ్డి జిల్లాకు చుక్క నీరు అందకుండా వివక్ష చూపిస్తున్నారని ఆరోపించారు. రంగారెడ్డి జిల్లాలో సాగుకు అవకాశమున్న 8 లక్షల ఎకరాలకు నీటిని ఎలా అందిస్తారో చెప్పాలని సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టత ఇవ్వకుంటే పోరాటానికి దిగుతామని హెచ్చరించారు.
రంగారెడ్డికి ద్రోహం చేస్తారా?
Published Sun, Mar 13 2016 3:37 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM
Advertisement
Advertisement