కేటీఆర్ బావమరిదిని బద్నాం చేసే ప్రయత్నం ఇది
మీడియా సమావేశంలో మాజీ మంత్రులు తలసాని, వేముల, సబిత, శ్రీనివాస్‌గౌడ్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడుతూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉధృతంగా ముందుకు వెళుతున్నందునే, ప్రభుత్వం టార్గెట్ చేసి రచ్చచేస్తోందని మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, వి.శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. కేటీఆర్ బావమరిది రాజ్‌పాకాల సొంతంగా ఫామ్‌హౌస్ కట్టుకుని గృహ ప్రవేశం చేశారని, దాన్ని రేవ్‌పార్టీ అంటూ కుట్రలకు తెరతీశారని వారు విమర్శించారు. ఈ మేరకు ఆదివారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వా రు మాట్లాడారు.
ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ, ప్రభుత్వంపై కేటీఆర్ దూకుడుగా వెళ్తున్నందునే ఆయనను టార్గెట్ చేస్తున్నారు. కేటీఆర్ బావమరిది కాబట్టి బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. వ్యక్తిగత కక్షలు రాజకీయాల్లో ఇప్పుడే చూస్తున్నాం అన్నారు. వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ, కేటీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక కుట్ర చేస్తున్నారని, ఆయనపై కక్ష తీర్చుకునేందుకు కుటుంబ సభ్యులను బలిచేసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఎవరూ శుభకార్యం చేసుకోవద్దా అని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు.
పోలీసు కుటుంబాలు రోడ్డెక్కితే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించలేదని, రాజ్ పాకాల విషయంలో మా త్రం వీడియో రిలీజ్ చేశారని విమర్శించారు. మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, తెలంగాణలో కక్షపూరిత రాజకీయాలు లేవని, ఇప్పుడు కొత్తగా అలాంటి సంస్కృతిని తీసుకురావద్దని అన్నారు. లేని ఆధారాలను సృష్టించి నా తమ్ముడిని అరెస్ట్ చేశారని శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. కాగా, మాజీ మంత్రి కేటీఆర్ ను లక్ష్యంగా చేసుకుని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కుట్రలు చేస్తు న్నారని బీఆర్‌ఎస్ సీని యర్ నాయకుడు దాసోజు శ్రవణ్ ఓ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేటీఆర్‌ను ఇరికించే ప్రయత్నమిది
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను అమ లు చేయకుండా, సమస్యలపై నిలదీస్తున్న కేటీఆర్ పై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు వివేకానంద, సంజయ్, నాయకు లు గెల్లు శ్రీనివాస్, సతీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. జన్వాడ పార్టీ వ్యవహారంలో ఆయనను కావాలనే ఇరికిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం వారు తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment