Janwada Farmhouse
-
విచారణకు హాజరైన నాగేశ్వర్ రెడ్డి
-
రాజ్ పాకాల నివాసంలో ముగిసిన సోదాలు
-
జన్వాడ కేసు: 8 గంటల పాటు ప్రశ్నించి.. రాజ్ పాకాలకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: జన్వాడ కేసులో రాజ్‌పాకాల స్టేట్మెంట్ను పోలీసులు రికార్డు చేశారు. అనంతరం ఆయనను జన్వాడ నివాసానికి పోలీసులు తీసుకెళ్లారు. మరోసారి జన్వాడ నివాసంలో సోదాలు నిర్వహించారు. అనంతరం రాజ్ పాకాలను మళ్లీ మోకిల పీఎస్‌కు తీసుకెళ్లి విచారించిన పోలీసులు.. 35(3) బీఎంఎస్ యాక్ట్ కింద నోటీసులు జారీ చేశారు. సుమారు 8 గంటల పాటు విచారించారు. విజయ్ మద్దూరి స్టేట్మెంట్ ఆధారంగా విచారణ కొనసాగింది.కాగా, రాజ్ పాకాల తన అడ్వకేట్‌తో పాటుగా మోకిలా పీఎస్‌కు వచ్చారు. రాజ్ పాకాలకు మంగళవారంతో హైకోర్టు ఇచ్చిన గడువు ముగియడంతో ఆయన నేడు విచారణకు హాజరయ్యారు. మరోవైపు.. మంగళవారం కూడా రాత్రి విజయ్ మద్దూరి నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఆయన ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.అనుమతి లేకుండా మద్యం పార్టీ నిర్వహించారనే కారణంతో రాజ్ పాకాల తోపాటు, కొకైన్ తీసుకున్నట్టు నిర్ధారణ అయిన విజయ్ మద్దూరి (56)పై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆదివారం రాత్రి విజయ్ మద్దూరికి 41 సీఆర్పీసీ కింద పోలీసులు నోటీసులు ఇచ్చి, స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు. విచారణ నిమిత్తం సోమవారం పోలీస్‌స్టేషన్‌కు రావాలని వారు సూచించినా.. ఆయన సాయంత్రం వరకు కూడా స్టేషన్‌కు రాలేదు.ఇక శనివారం రాత్రి పార్టీ నుంచి వెళ్లిపోయిన రాజ్ పాకాల అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ నేపథ్యంలో మోకిల పోలీసులు సోమవారం దర్యాప్తు కోసం రాయదుర్గంలోని రాజ్ పాకాల నివాసానికి వెళ్లారు. తాళం వేసి ఉండటంతో ఇంటి బయట నోటీసులు అతికించారు. కాగా, బుధవారం రాజ్ పాకాల విచారణకు హాజరయ్యారు. -
హైదరాబాద్ మోకిల పీఎస్ కు రాజ్ పాకాల
-
నేడు మోకిలా పీఎస్‌కు రాజ్ పాకాల..
-
మోకిలా పీఎస్‌కు చేరుకున్న రాజ్ పాకాల..
Raj Pakala Updates..మోకిలా పీఎస్‌కు పాకాల..జన్వాడ ఫామ్ హౌస్ కేసుకు సంబంధించి పోలీసుల విచారణ కోసం రాజ్ పాకాల మోకిలా పీఎస్‌కు చేరుకున్నారు. తన లాయర్‌తో కలిసిన ఆయన స్టేషన్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఫామ్ హౌస్‌లో జరిగిన పార్టీకి సంబంధించిన పోలీసులు విచారించనున్నారు. 👉జన్వాడ ఫామ్ హౌస్‌లో మందు పార్టీ కేసు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ కేసులో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష నేతల మధ్య ఆరోపణల మాటల యుద్ధం నడిచింది. ఇక, ఈ కేసులో నేడు మోకిలా పోలీసుల వద్ద కేటీఆర్ బావ మరిది రాజ్ పాకాల విచారణను హాజరు కానున్నారు.👉రాజ్ పాకాల నేడు తన అడ్వకేట్‌తో పాటుగా మోకిలా పీఎస్‌కు మధ్యాహ్నం 12 గంటలకు రానున్నారు. ఈ సందర్బంగా మందు పార్టీ కేసుపై పోలీసులు విచారణ చేపట్టే అవకాశం ఉంది. కాగా, రాజ్ పాకాలకు మంగళవారంతో హైకోర్టు ఇచ్చిన గడువు ముగియడంతో ఆయన నేడు విచారణకు హాజరు కానున్నారు. మరోవైపు.. మంగళవారం రాత్రి విజయ్ మద్దూరి నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో విజయ్ మద్దూరి అందుబాటులో లేకపోవడంతో ఆయన కోసం ఆరా తీస్తున్నారు. మోకిలా పోలీసులు.. అతని ఫోన్ స్వాధీనం చేసుకొనే ప్రయత్నం చేస్తున్నారు.👉ఇదిలా ఉండగా.. జన్వాడ ఫామ్ హౌస్ మందు పార్టీ కేసులో పోలీసులు ఇప్పటికే పలువురికి నోటీసులు ఇచ్చారు. అదే విధంగా కొంతమంది స్టేట్మెంట్ కూడా రికార్డు చేశారు. ఇక, నేడు రాజ్ పాకాల విచారణ ఈ కేసులో కీలక మారే అవకాశం ఉంది. -
కేటీఆర్ బావమరిది పార్టీ కేసు.. విజయ్ మద్దూరి ఇంట్లో సోదాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన జన్వాడ పార్టీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో నిందితుడైన విజయ్ మద్దూరి ఇంట్లో మోకిల పోలీసులు సోదాలు చేపట్టారు. రాజ్‌పాకాల ఫాంహౌజ్ పార్టీలో విజయ్ మద్దూరి కొకైన్ తీసుకున్నట్లు నిర్ధారణ అయ్యింది. సోమవారం విచారణకు విజయ్ హాజరుకాలేదు. పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు.ఈ కేసులో కొకైన్ పాజిటివ్ వచ్చిన విజయ్ మద్దూరికి సంబంధించిన డ్రగ్ టెస్ట్ కిట్‌తోపాటు ఆయన ఫోన్‌ను సీజ్ చేసినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. అయితే ఆ పార్టీలో పాల్గొన్న ఓ మహిళ తన ఫోన్ సీజ్ చేశారని పోలీసులకు తెలిపింది. దీంతో పోలీసులు ఆమె స్టేట్మెంట్ను రికార్డు చేసుకున్నారు. కేసు కోర్టు పరిధిలోకి ఉన్నందున కోర్టు అనుమతి తర్వాత ఫోన్‌ను తిరిగిస్తామని వెల్లడించారు. విజయ్ను అదుపులోకి తీసుకునే సమయంలో ఆయన తన ఫోన్‌కు బదులు పక్కన ఉన్న మహిళ ఫోన్‌ను ఇచ్చారు. విజయ్ మద్దూరి సెల్‌ఫోన్ సీజ్ చేసేందుకు పోలీసులు వచ్చినట్లు సమాచారం.కాగా, అనుమతి లేకుండా మద్యం పార్టీ నిర్వహించారనే కారణంతో రాజ్ పాకాల (51)తోపాటు, కొకైన్ తీసుకున్నట్టు నిర్ధారణ అయిన విజయ్ మద్దూరి (56)పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం రాత్రి విజయ్ మద్దూరికి 41 సీఆర్పీసీ కింద పోలీసులు నోటీసులు ఇచ్చి, స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు. విచారణ నిమిత్తం సోమవారం పోలీస్‌స్టేషన్‌కు రావాలని వారు సూచించినా.. ఆయన సాయంత్రం వరకు కూడా స్టేషన్‌కు రాలేదు. ఇక శనివారం రాత్రి పార్టీ నుంచి వెళ్లిపోయిన రాజ్ పాకాల అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ నేపథ్యంలో మోకిల పోలీసులు సోమవారం దర్యాప్తు కోసం రాయదుర్గంలోని రాజ్ పాకాల నివాసానికి వెళ్లారు. తాళం వేసి ఉండటంతో ఇంటి బయట నోటీసులు అతికించారు. -
జన్వాడ కేసులో కొత్త కీలక మలుపు
-
రాజ్ పాకాలకు నోటీసులు
శంకర్పల్లి: మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఇంట్లో అనుమతి లేని పార్టీ నిర్వహణ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అనుమతి లేకుండా మద్యం పార్టీ నిర్వహించారనే కారణంతో రాజ్ పాకాల (51)తోపాటు, కొకైన్ తీసుకున్నట్టు నిర్ధారణ అయిన విజయ్ మద్దూరి (56)పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం రాత్రి విజయ్ మద్దూరికి 41 సీఆర్పీసీ కింద పోలీసులు నోటీసులు ఇచ్చి, స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు. విచారణ నిమిత్తం సోమవారం పోలీస్‌స్టేషన్‌కు రావాలని వారు సూచించినా.. ఆయన సాయంత్రం వరకు కూడా స్టేషన్‌కు రాలేదు. ఇక శనివారం రాత్రి పార్టీ నుంచి వెళ్లిపోయిన రాజ్ పాకాల అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ నేపథ్యంలో మోకిల పోలీసులు సోమవారం దర్యాప్తు కోసం రాయదుర్గంలోని రాజ్ పాకాల నివాసానికి వెళ్లారు. తాళం వేసి ఉండటంతో ఇంటి బయట నోటీసులు అతికించారు. సోమవారం రాత్రి 11 గంటలకల్లా తమ ముందు విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. మరోవైపు ఈ కేసు విషయంలో రాజ్ పాకాల హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తాను 48 గంటల్లో విచారణకు హాజరవుతానని పేర్కొంటూ న్యాయవాదుల ద్వారా పోలీసులకు లేఖ అందజేశారు. ఇంటికి అనుమతులు లేవన్న అధికారులు రాజ్ పాకాలకు రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం జన్వాడ గ్రామ పరిధిలోని సర్వే 691, 692 లలో శ్రీమాతే ప్రాపర్టీస్ పేరుతో సుమారు 8 ఎకరాల భూమి ఉంది. అందులో దాదాపు 1,500 గజాల విస్తీర్ణంలో జీ+1 ఇంటి నిర్మాణం చేపట్టారు. జన్వాడ గ్రామం 111 జీవో పరిధిలో ఉండటంతో ఇంటి నిర్మాణానికి అనుమతులు ఇవ్వలేదని అధికారులు చెప్తున్నారు. దీంతో ఈ ఇంటికి శ్రీమాతే ప్రాపర్టీస్ పేరుతో 7– 90 ఇంటి నంబర్‌తో పంచాయతీకి పన్ను చెల్లిస్తున్నట్టు తెలిసింది. పార్టీలో పాల్గొన్నవారి విచారణ రాజ్ పాకాల ఇంట్లో పార్టీకి హాజరైన వారందరికీ పోలీసులు నోటీసులు ఇచ్చి విచారించనున్నారు. ఇప్పటికే ముగ్గురికి నోటీసులిచ్చి విచారించగా.. మరో ముగ్గురు స్వచ్ఛందంగా పీఎస్‌కు వచ్చి, వెళ్లినట్టు పోలీసులు తెలిపారు. మిగతా 32 మందికి రెండు రోజుల్లో నోటీసులిచ్చి, విచారిస్తామని వెల్లడించారు. కేసుపై ఏసీపీ సమీక్ష రాజ్ పాకాల ఇంట్లో పార్టీ కేసును నార్సింగి ఏసీపీ రమణగౌడ్ పర్యవేక్షిస్తున్నారు. సోమవారం ఆయన స్టేషన్‌కు వచ్చి, కేసు దర్యాప్తు తీరు, ఇతర వివరాలను తెలుసుకున్నారు. రాజ్ పాకాల, విజయ్ మద్దూరి విచారణకు హాజరుకాకపోతే తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై ఆయన సూచనలు చేసినట్టు తెలిసింది. ఇక ముందస్తు చర్యల్లో భాగంగా సైబరాబాద్ కమిషనరేట్ నుంచి 10 మంది ప్రత్యేక పోలీస్ సిబ్బందిని మోకిల పీఎస్‌కు పంపించారు. ఫోన్ సీజ్‌లో ట్విస్ట్ ఈ కేసులో కొకైన్ పాజిటివ్ వచ్చిన విజయ్ మద్దూరికి సంబంధించిన డ్రగ్ టెస్ట్ కిట్‌తోపాటు ఆయన ఫోన్‌ను సీజ్ చేసినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. అయితే ఆ పార్టీలో పాల్గొన్న ఓ మహిళ తన ఫోన్ సీజ్ చేశారని పోలీసులకు తెలిపింది. దీంతో పోలీసులు ఆమె స్టేట్మెంట్ను రికార్డు చేసుకున్నారు. కేసు కోర్టు పరిధిలోకి ఉన్నందున కోర్టు అనుమతి తర్వాత ఫోన్‌ను తిరిగిస్తామని వెల్లడించారు. విజయ్ను అదుపులోకి తీసుకునే సమయంలో ఆయన తన ఫోన్‌కు బదులు పక్కన ఉన్న మహిళ ఫోన్‌ను ఇచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. -
జన్వాడ ఫామ్ హౌస్ కేసు: హైకోర్టు కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్, సాక్షి: జన్వాడ ఫామ్ హౌస్ కేసులో రాజ్ పాకాల పోలీసుల విచారణకు హాజరయ్యేందుకు రెండు రోజులు సమయం ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిబంధనల ప్రకారమే విచారణలో ముందుకు వెళ్లాలని కోర్టు పోలీసులకు సూచించింది. మోకిలా పోలీసులు కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు నోటీసులు ఇచ్చారు. బీఎన్ఎస్ యాక్ట్ 35(3) సెక్షన్ ప్రకారం ఈ నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు. రాజ్ పాకాల ఇంట్లో లేకపోవడంతో ఓరియన్ విల్లాస్లోని నెంబర్ 40 విల్లాకు ఈ నోటీసులను పోలీసులు అంటించిన విషయం తెలిసిందే. పోలీసులు తనని అక్రమంగా అరెస్టు చెయ్యాలని ప్రయత్నాలు చేస్తున్నారన్న సమాచారం నేపథ్యంలో రాజ్ పాకాల తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. రాజ్ పాకాల దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి బెంచ్ విచారించింది. పిటిషన్ తరఫు న్యాయవాది మయూర్ రెడ్డి.. వాదనలు వినిపించారు. ‘‘రాజ్ పాకాల ఇంట్లో పార్టీ చేసుకుంటే అక్రమంగా పోలీసులు వచ్చి దాడి చేశారు. రాజ్ పాకాల ఉద్యోగికి డ్రగ్ పాజిటివ్ వస్తే.. రాజ్ పాకాలను నిందితుడిగా చేర్చారు. డ్రగ్స్ టెస్ట్‌కు సాంపుల్ ఇవ్వాలని మహిళలను ఇబ్బంది పెట్టారు. ప్రతిపక్ష నేత కేటీఆర్ బావమరిది కనుకనే ఆయన్ను టార్గెట్ చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే కేసులు పెట్టారు’’ అని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ‘‘ మేము అరెస్ట్ చేస్తామని ఎక్కడ చెప్పలేదు. ఇప్పటి వరకు ఈ కేసులో ఎవరినీ అరెస్ట్ చేయలేదు. అక్రమంగా మద్యం బాటిళ్లు లభించడంతో పాటు ఒక వ్యక్తికి డ్రగ్ తీసుకున్నట్లు పాజిటివ్ వచ్చింది. ఇందులో రాజకీయ దురుద్దేశం లేదు. రాజ్ పాకాలకు నిబంధనల ప్రకారమే 41a నోటీసులు ఇచ్చాం’’ అని కోర్టుకు ఏఏజీ ఇమ్రాన్ ఖాన్ తెలిపారు.తర్వత మళ్లీ.. రాజ్ పాకాల న్యాయవాది మయూర్ రెడ్డి వాదనలు నిపించారు. ‘‘ రాజ్ పాకాలకు ఈరోజు ఉదయం 9:30 గంటలకు నోటీసు ఇచ్చి ఉదయం 11.00 గంటలకు విచారణకు రమ్మన్నారని తెలిపారు. ‘‘ మాకు అరెస్ట్ చేసే ఉద్దేశం లేదు. విచారణకు రాకపోతే అరెస్ట్ చేస్తామని నోటీసులో పేర్కొన్నారు. విచారణలో సమాచారం లేదా ఆధారాలు లభిస్తే చర్యలు తీసుకుంటాం’’ అని ఏఏజీ కోర్టుకు తెలిపారు.చదవండి: జన్వాడ ఫామ్ హౌస్ కేసులో మరో ట్విస్ట్! -
జన్వాడ ఫామ్ హౌస్ కేసులో మరో ట్విస్ట్!
సాక్షి, హైదరాబాద్: జన్వాడలోని ఫామ్ హౌస్‌లో రేవ్ పార్టీ వ్యవహారం తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. రేవ్ పార్టీ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణకు రాకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. దీంతో, స్పందించిన రాజ్ పాకాల.. విచారణకు హాజరయ్యేందుకు రెండు రోజులు సమయం కావాలని కోరారు.జన్వాడ ఫామ్ హౌస్ కేసుకు సంబంధించి రాజ్ పాకాలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. బీఎన్ఎస్ఎస్ 35(3) సెక్షన్ ప్రకారం మోకిల పోలీసులు నోటీసులు జారీ చేశారు. రేవ్ పార్టీ కేసుకు సంబంధించి విచారించాల్సి ఉందని.. నేడు విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొన్నారు. విచారణకు రాకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.ఈ సందర్భంగా రాజ్ పాకాల..అడ్రస్ ఫ్రూఫ్, కేసుకు సంబంధించిన ఆధారాలను సమర్పించాలని సూచించారు. అయితే, రాజ్ పాకాల.. పోలీసులకు అందుబాటులోకి రాకపోవడంతో మోకిల ఇన్స్పెక్టర్ పేరుతో ఉన్న నోటీసులను రాయదుర్గంలోని ఓరియన్ విల్లాస్‌లో ఆయన నివాసానికి అతికించారు. ఇక, పోలీసుల నోటీసుల నేపథ్యంలో హైకోర్టును రాజ్ పాకాల ఆశ్రయించారు. అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు అక్రమంగా ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలని పిటిషన్లో ఆయన కోరారు. మరోవైపు.. పోలీస్ విచారణకు హాజరు అవ్వడానికి రెండు రోజులు గడువు కావాలని న్యాయవాది ద్వారా మోకిల పోలీసులకు ఆయన లేఖ పంపారు. -
రాజ్ పాకాలకు మోకిలా పోలీసుల నోటీసులు
-
రాజ్ పాకాల ఫ్యామిలీ ఫంక్షన్ కు ఆహ్వానిస్తే వెళ్లాను: మద్దూరి విజయ్
-
"రేవ్" రచ్చ.. "డ్రగ్స్" డ్రామా.. పొలిటికల్ వార్
-
హీటెక్కిన జన్వాడ రగడ... రాజ్ పాకాల ఎక్కడ ?
-
రేవ్ పార్టీ కాదు.. ఫ్యామిలీ దావత్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీని, తమను రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతూ కుట్రలకు పాల్పడుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మండిపడ్డారు. తనను ఎదుర్కోలేక కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని పేర్కొన్నారు. జైళ్లకు పంపినా, ఎక్కడికి పంపినా తాము ఉద్యమ బాటలో నడుస్తామని.. చావుకు తెగించి ఉద్యమం చేశామని, ఈ కేసులకు, చిల్లర ప్రయత్నాలకు భయపడబోమని స్పష్టం చేశారు. కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఇంట్లో జరిగిన పార్టీపై కేసు నమోదైన నేపథ్యంలో కేటీఆర్ ఆదివారం రాత్రి మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వరుస వైఫల్యాలు, ఆరు గ్యారంటీలు, రేవంత్ బావమరిదికి కట్టబెట్టిన అమృత్ టెండర్లు, సివిల్ సప్లైస్ స్కామ్‌పై బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ధీరోదాత్తంగా పోరాటం చేస్తున్నారు. వాటిపై మాకు సమాధానం చెప్పే పరిస్థితి ప్రభు త్వానికి లేదు. చేతనైతే రాజకీయంగా తలబడండి. శాసనసభ పెట్టండి. రుణమాఫీ కావచ్చు.. మూసీ సుందరీకరణ కావచ్చు.. ఆరు గ్యారంటీల అమలు కావచ్చు.. ప్రతి అంశం మీద సావధానంగా చర్చించి మిమ్మల్ని ఎండగట్టడానికి కేసీఆర్ ఆధ్వర్యంలో సిద్ధంగా ఉన్నాం. కానీ ఈ రకంగా గొంతునొక్కి, ఇష్టమొచ్చినట్లు కేసులు పెట్టి.. రాజకీయంగా మా కుటుంబ సభ్యులను వేధించి ఏదో సాధిస్తామని అనుకుంటే మీరు సాధించేది ఏమీ ఉండదు. నా బావమరిదికి నెగెటివ్ వచ్చిందిగా.. దీపావళికి ఒక ఇంట్లో దావత్ చేసుకోవాలంటే పర్మిషన్ తీసుకోవాలంట. మా బావమరిది రాజ్ పాకాల జన్వాడ రిజర్వ్ కాలనీలో కొత్త ఇల్లు కట్టుకున్నారు. అది ఫామ్‌హౌస్ కాదు.. నా బావమరిది నివాసం ఉండే ఇల్లు. రాజ్ పాకాల ఏం తప్పు చేశాడు. తన సొంతింట్లో దావత్ చేసుకుంటే రేవ్ పార్టీ అని పేరుపెట్టి.. దాన్నో సినిమా చేశారు. ఆ పార్టీలో మా బావమరిది తల్లి, చిన్న పిల్లలు కూడా ఉన్నారు. పార్టీలో ఉన్నది ఎవరో పురుషులు, మహిళలు కాదు.. భార్యాభర్తలు. పొద్దున నాలుగు మందు బాటిళ్లు దొరికాయని ఎక్సైజ్ కేసు పెట్టారు. కానీ సాయంత్రానికి డ్రగ్స్ కేసుగా మారిపోయింది.ఎన్‌డీపీఎస్‌లో 25, 27, 29 సెక్షన్లు పెట్టారు. అసలు ఆ సెక్షన్లు ఏమిటి? సప్లయర్, కన్సంప్షన్, కోహోస్ట్ అని పెట్టారు. అసలు సప్లయర్ అనే సెక్షన్ పెట్టాలంటే అక్కడ డ్రగ్స్ దొరికి ఉండాలి. లేదా ఎవరో ఒకరు సప్లై చేసి ఉండాలి. అసలు డ్రగ్సే దొరకలేదని మీరే చెబుతున్నారు. ఇంకా కేసు ఎలా పెడతారు? అక్కడ 14 మందికి టెస్ట్ చేస్తే 13 మందికి నెగెటివ్ వచ్చింది. డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన ఒక్కరు కూడా.. ఆయన ఎక్కడ తీసుకున్నాడో తెలుసుకోకుండా ఎలా కేసు పెడతారు? మత్తుపదార్థం దొరికిందా? ఏ రకంగా బద్నాం చేస్తారు? నేను కూడా ఉన్నానని తప్పుడు ప్రచారం కుటుంబ కార్యక్రమాన్ని రేవ్ పార్టీ అంటూ కొందరు పైశాచిక ఆనందం పొందుతున్నారు. నేను అక్కడ లేకున్నా నా పేరుతో అడ్డగోలుగా వార్తలు ప్రచారం చేస్తున్నారు. ప్రజాజీవితంలో ఉంటే మాపై ఎలాంటి మాటలైనా అడ్డగోలు ప్రచారం చేయవచ్చా? అది రాజ్ పాకాల ఇల్లు, ఫాంహౌజ్ కాదు. కుటుంబ సభ్యులను పురుషులు, మహిళలు అంటూ చెప్పి అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ఈ 21 గంటలు పరిశోధించి పట్టుకున్నది ఏమిటి? అక్కడ ఏం లేదని చాలా స్పష్టంగా అధికారులే చెప్పారు, అయినా ఎందుకీ దు్రష్పచారం. రాజ్ పాకాలకు డ్రగ్స్ టెస్ట్ చేస్తే నెగిటివ్ వచ్చింది. అయినా ఆయనపై బీజేపీ, కాంగ్రెస్ నాయకులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. అయినా ఎన్డీపీఎస్ కేసు ఎలా పెడతారు? ఉదయం ఇచ్చిన పంచనామాకు, ఎఫ్ఐఆర్కు తేడా ఎలా వచ్చింది? బాంబులు అని చెప్పి కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేదు. ఎంత ఇబ్బంది పెట్టినా పోరాటం ఆపం.. అక్రమ కేసులు పెట్టినా, జైళ్లకు పంపినా.. మమ్మల్ని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా పోరాటాన్ని ఆపబోం. రేవంత్‌రెడ్డి వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటాం. మీరిచ్చిన హమీలు నెరవేర్చకపోవడం, ప్రజలను మోసం చేయడాన్ని ప్రజల్లోకి తీసుకెళతాం. కేసీఆర్ నేరి్పన ఉద్యమ బాటలో నడుస్తాం.’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. -
టార్గెట్ చేసి రచ్చ చేస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉధృతంగా ముందుకు వెళుతున్నందునే, ప్రభుత్వం టార్గెట్ చేసి రచ్చచేస్తోందని మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, వి.శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. కేటీఆర్ బావమరిది రాజ్‌పాకాల సొంతంగా ఫామ్‌హౌస్ కట్టుకుని గృహ ప్రవేశం చేశారని, దాన్ని రేవ్‌పార్టీ అంటూ కుట్రలకు తెరతీశారని వారు విమర్శించారు. ఈ మేరకు ఆదివారం తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వా రు మాట్లాడారు.ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ, ప్రభుత్వంపై కేటీఆర్ దూకుడుగా వెళ్తున్నందునే ఆయనను టార్గెట్ చేస్తున్నారు. కేటీఆర్ బావమరిది కాబట్టి బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. వ్యక్తిగత కక్షలు రాజకీయాల్లో ఇప్పుడే చూస్తున్నాం అన్నారు. వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ, కేటీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక కుట్ర చేస్తున్నారని, ఆయనపై కక్ష తీర్చుకునేందుకు కుటుంబ సభ్యులను బలిచేసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఎవరూ శుభకార్యం చేసుకోవద్దా అని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు.పోలీసు కుటుంబాలు రోడ్డెక్కితే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించలేదని, రాజ్ పాకాల విషయంలో మా త్రం వీడియో రిలీజ్ చేశారని విమర్శించారు. మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, తెలంగాణలో కక్షపూరిత రాజకీయాలు లేవని, ఇప్పుడు కొత్తగా అలాంటి సంస్కృతిని తీసుకురావద్దని అన్నారు. లేని ఆధారాలను సృష్టించి నా తమ్ముడిని అరెస్ట్ చేశారని శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. కాగా, మాజీ మంత్రి కేటీఆర్ ను లక్ష్యంగా చేసుకుని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కుట్రలు చేస్తు న్నారని బీఆర్ఎస్ సీని యర్ నాయకుడు దాసోజు శ్రవణ్ ఓ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్‌ను ఇరికించే ప్రయత్నమిదికాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను అమ లు చేయకుండా, సమస్యలపై నిలదీస్తున్న కేటీఆర్ పై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు వివేకానంద, సంజయ్, నాయకు లు గెల్లు శ్రీనివాస్, సతీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. జన్వాడ పార్టీ వ్యవహారంలో ఆయనను కావాలనే ఇరికిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం వారు తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. -
జన్వాడపై బీఆర్ఎస్, కాంగ్రెస్ రాజీ: కేంద్ర మంత్రి బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ రాజీపడుతున్నట్లు జన్వాడ రేవ్ పార్టీ విషయంలో మరోసారి రుజువైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ఆదివా రం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడు తూ ట్విట్టర్ టిల్లు బామ్మర్ది ఫామ్ హౌజ్‌లో రేవ్‌పార్టీ కేసు నీరుగార్చే కుట్ర మొదలైందని, ఆ పార్టీలో డ్రగ్స్ ఆనవాళ్లు లేవని పోలీసులతో చెప్పించేలా కాంగ్రెస్ నుంచి ఒత్తిడి కొనసాగుతోందని, లిక్కర్ పార్టీయే తప్ప రేవ్‌పార్టీ కాదని బుకా యించేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. జన్వాడ ఫామ్ హౌజ్ రేవ్ పార్టీపై సుద్దపూస ఏమంటాడో వేచి చూస్తున్నట్లు తెలిపారు.రేవ్‌పార్టీ పంచనామాలోనే డ్రగ్స్ ఆనవాళ్లు లేకుండా కుట్ర చేశారని, విదేశీ మద్యం బాటిళ్ల పేర్లను మాత్రమే ప్రస్తావించినట్లు తెలిసిందని అన్నారు. ట్విట్టర్ టిల్లు, ఆయన కుటుంబ సభ్యులను తప్పించి, ఈ కేసులో అనామకుల పేర్లను చేర్చుతున్నారని, తద్వారా బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వం దీపావళి బహుమతి ఇస్తోందని పేర్కొన్నారు. సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్న డ్రగ్స్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం రాజీధోరణి ప్రదర్శిస్తోందని, సీఎం రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని అన్నారు. సీసీ ఫుటేజీ సహా ఇతర ఆధారాలు ధ్వంసం కాకుండా చూడాలని, బడా నేతలతోసహా రేవ్‌పార్టీలో ఉన్న వాళ్లందరినీ అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జన్వాడ పార్టీ వివరాలు బయటపెట్టాలిగజ్వేల్: జన్వాడ ఫామ్ హౌజ్ రేవ్‌పార్టీ వివరాలన్నీ బయట పెట్టాలని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు ప్రభు త్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన సిద్దిపేట జిల్లా గజ్వేల్‌కు వచ్చిన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. -
బుకాయిస్తే తప్పు ఒప్పు కాదు
సాక్షి, హైదరాబాద్: తాగి దొరికిన కేసులో బుకాయిస్తే తప్పు ఒప్పవుతుందని అను కోవడం పొరపాటని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. దొరికిన దొంగలు సమర్థించుకుంటూనే ప్రభుత్వాన్ని బద్నాం చేసే పనిలో ఉండడం దారుణమని అన్నారు. జన్వాడ ఫామ్‌హౌ జ్ ఘటనపై ఆదివారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ విషయంలో ఎలాంటి కక్ష సాధింపు చర్యలు లేవని స్పష్టం చేశారు. స్థానికుల ఫిర్యా దు మేరకు పోలీసులు దాడి చేస్తే దొరికారని చెప్పా రు.మాదకద్రవ్యాలు తీసుకోవడం తప్పుకాదనే ధోరణిలో బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని, పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతీసే విధంగా విమర్శ లు చేయడం సరికాదని అన్నారు. నిజంగా నిర్దోషు లయితే నిరూపించుకోవాలని హితవు పలికారు. ఈ కేసులో ముఖ్యమంత్రి, మంత్రుల జోక్యం ఉంద నడం బీఆర్ఎస్ మాజీ మంత్రులు, శాసనసభ్యుల అవివేకానికి నిదర్శమని పొన్నం వ్యాఖ్యానించారు. సమగ్ర విచారణ జరిపించాలిజన్వాడ ఫామ్‌హౌజ్‌లో జరిగిన రేవ్‌పార్టీ, అనుమతి లేని మద్యం వినియోగం కేసులో సమగ్ర విచారణ జరిపించాలని కేటీఆర్‌కు డ్రగ్స్ టెస్ట్ చేయాలని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ ఎం.ఎ.ఫహీమ్, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఎస్.శివసేనా రెడ్డి, రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి డిమాండ్ చేశారు. జన్వాడ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత, మహిళా ప్రతినిధులు సైబరాబాద్ ఏసీపీకి ఫిర్యాదు చేశారు. -
TG: ‘విందు’పై రాజకీయం
సాక్షి, హైదరాబాద్: జన్వాడలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఇంట్లో జరిగిన విందు రాజకీయ రంగు పులుముకుంది. పోలీసుల దాడులు.. రేవ్ పార్టీ జరిగిందనే ప్రచారం.. అనుమతి లేకుండా మద్యంతో పార్టీ నిర్వహించారంటూ కేసులు.. ఒకరికి డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ వచ్చిందనే వార్తలు.. రాయదుర్గంలోని కేటీఆర్ బావమరుదుల నివాసాల్లో పోలీసుల సోదాలు.. అధికార, విపక్షాల నేతల విమర్శలతో ఆదివారం పొద్దంతా హైడ్రామా చోటు చేసుకుంది. శనివారం అర్ధరాత్రి రాజ్ పాకాల ఇంటిపై ఎక్సైజ్, ఎస్వోటీ పోలీసులు చేసిన దాడిలో విదేశీ మద్యం సీసాలు దొరకడం, విందులో పాల్గొన్న ఒకరు డ్రగ్స్ తీసుకుని ఉన్నట్టు తేలడంతో.. కేసులు నమోదు చేశారు. ఇదే సమయంలో రేవ్ పార్టీ జరిగిందంటూ మీడియాలో, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. దీనితో కేటీఆర్ లక్ష్యంగా కాంగ్రెస్, బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. కేటీఆర్ లక్ష్యంగా కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేయగా.. విందుకు సంబంధించిన సీసీ ఫుటేజీ విడుదల చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్, బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు డిమాండ్ చేశారు. మరోవైపు ఈ ఘటనపై కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర ప్రభుత్వం తీరుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. మాజీ మంత్రులు హరీశ్‌రావు, తలసాని, సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి తదితరులు కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. తమను రాజకీయంగా ఎదుర్కొలేక కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు కేసులతో కుట్రలు చేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. కొత్తగా ఇల్లు కట్టుకుని, దీపావళికి దావత్ చేసుకుంటే.. రేవ్ పార్టీ అని ప్రచారం చేశారని, అక్కడ తన బావమరిది తల్లి, చిన్న పిల్లలు కూడా ఉన్నారని వివరించారు. అసలు డ్రగ్స్ ఏమీ దొరకలేదని చెప్తూనే.. కేసులు ఎలా పెట్టారని నిలదీశారు. -
మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేకనే ఈ కేసులు : కేటీఆర్
సాక్షి,హైదరాబాద్ : బీఆర్ఎస్ను రాజకీయంగా ఎదుర్కొలేక కాంగ్రెస్ ప్రభుత్వం దాడులు చేస్తోందని, ఇలాంటి బెదిరింపులకు తాము భయపడబోమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. జన్వాడ రాజ్ పాకాల ఇంట్లో జరిగిన ఫ్యామిలీ ఫంక్షన్ ఘటనపై కేటీఆర్ స్పందించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతుంటే.. వాటిపై బీఆర్ఎస్ మానసిక దెబ్బ తీసేలా మా కుటుంబ సభ్యులపై కేసులు పెడుతోంది. జన్వాడలో నా బావమరిది విల్లా కాదు. ఇల్లు. నా బావమరిది రాజ్ పాకాల ఉంటున్న సొంత ఇంట్లో దీపావళి పండుగ సందర్భంగా దావత్ చేసుకోవడం తప్పా? గృహ ప్రవేశం సందర్భంగా బంధువులను పిలిచి దావత్ ఇచ్చారు. కొందరు రేవ్‌పార్టీ అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. అటు ప్రభుత్వం,మీడియా,సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారు. అసలు రేవ్ పార్టీ అంటే అర్థం తెలుసా? వృద్ధులు, చిన్న పిల్లలతో సహా కుటుంబం మొత్తం బంధుమిత్రులతో కలిసి ఉంటే దాన్ని రేవ్ పార్టీ అని ప్రచారం చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారు’అని కేటీఆర్ మండిపడ్డారు. -
జన్వాడ ఫామ్‌హౌస్ ఘటన: డీజీపీకి కేసీఆర్ ఫోన్
సాక్షి,హైదరాబాద్ : జన్వాడ ఫామ్‌హౌస్ ఘటనపై మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. తెలంగాణ డీజీపీ జితేందర్‌కి కేసీఆర్ ఫోన్ చేశారు. రాజ్ పాకాల, శైలేంద్ర పాలకాల ఇళ్లల్లో ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా సోదాలు ఎలా చేస్తారంటూ ప్రశ్నించారు. వెంటనే సోదాలు నిలిపివేయాలని డీజీపీని కోరారు. కాగా, శనివారం జన్వాడలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు 30 ఎకరాల్లో ఉన్న ఫామ్‌హౌస్‌పై సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు దాడులు చేశారు. భారీ శబ్దాలతో ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. 21 మంది పురుషులు, 14 మంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు. 35 మందితో నిర్వాహకులు మద్యం పార్టీ నిర్వహించారు. ఇక్కడ డ్రగ్స్ పరీక్షలు నిర్వహించిన పోలీసులు..విజయ్ మద్దూరి అనే వ్యక్తి కొకైన్ తీసుకున్నట్లు నిర్ధరించారు. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. విదేశీ మద్యం సహా భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. 👉చదవండి : రేవ్ పార్టీ అంటూ అసత్య ప్రచారమా? బీఆర్ఎస్ ఆగ్రహం -
ఇందులో డ్రగ్స్ ఎక్కడున్నాయో చెప్పాలి.. ఇంట్లో దావత్ చేసుకోవద్దా..
-
ఫామ్ హౌస్ పార్టీలో సంచలన విషయాలు
-
జన్వాడ ఫార్మ్ హౌస్ లో రేవ్ పార్టీ.. భారీగా డ్రగ్స్ స్వాధీనం
-
జన్వాడలో రేవ్ పార్టీపై స్పందించిన బండి సంజయ్
-
జన్వాడ రేవ్ పార్టీ సంచలనం.. అర్ధరాత్రి పోలీసులకు చుక్కలు?
సాక్షి, హైదరాబాద్: జన్వాడ ఫామ్ హౌస్‌లో రేవ్ పార్టీ తెలంగాణలో రాజకీయంగా సంచలనంగా మారింది. రేవ్ పార్టీలో కేటీఆర్ బావ మరిది ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరోవైపు.. రేవ్ పార్టీపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏ1గా కార్తిక్, ఏ2గా రాజ్ పాకాలను చేర్చారు. జన్వాడ ఫామ్ హౌస్ రేవ్ పార్టీ తతంగంపై ఎక్సైజ్ పోలీసులు కూడా రంగం దిగారు. తాజాగా ఫామ్ హౌస్ మేనేజర్లు కార్తిక్, రాజేంద్ర ప్రసాద్ ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఈవెంట్‌కి అనుమతి లేదని చెప్పారు. అలాగే, రేవ్ పార్టీ కోసం మహారాష్ట్ర, ఢిల్లీకి చెందిన అనుమతి లేని మద్యం తీసుకువచ్చినట్టు వెల్లడించారు. ఫామ్ హౌస్‌లో డ్యూటీ ఫ్రీ మద్యం లభ్యమైనట్టు చెప్పారు. దీంతో, ఎక్సైజ్ యాక్ట్ సెక్షన్ 34 కింద కేసును నమోదు చేశారు. అలాగే, ఈ పార్టీలో విదేశీ మద్యం కూడా స్వాధీనం చేసుకున్నారు.ఇదిలా ఉండగా.. రేవ్ పార్టీలో మొత్తం 35 మంది పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. పాల్గొన్న వారిలో 21 మంది పురుషులు, 14 మంది మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రేవ్ పార్టీలో విజయ్ మద్దూరి అనే వ్యక్తి కొకైన్ తీసుకున్నట్లు పోలీసుల పరీక్షల్లో నిర్ధారణ అయింది. కొకైన్ తీసుకున్నట్లు పరీక్షలో తేలడంతో ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఇక, మహిళలకు టెస్టులు చేసే సమయంలో పోలీసులకు వారికి సహాకరించలేదని సమాచారం. పోలీసులకు చుక్కలు చూపించినట్టు తెలిసింది. విజయ్ మద్దూరి కూడా పోలీసులను బెదిరించినట్టు సమాచారం. అలాగే, రేవ్ పార్టీలో క్యాసినో పరికరాలు సైతం స్వాధీనం చేసుకోవడంతో క్యాసినో నిర్వహించినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫామ్ హౌస్‌లో ప్లేయింగ్ కార్డ్స్, ప్లాస్టిక్ కైన్స్ వంటివి కూడా స్వాధీనం చేసుకున్నారు. కాగా, 30 ఎకరాల్లో రాజ్ పాకాల ఫామ్‌హౌస్ విస్తరించి ఉంది. రేవ్ పార్టీ, అక్రమంగా ఫామ్ హౌస్ నిర్మించారనే ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం దీన్ని సీజ్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. -
జన్వాడ రేవ్ పార్టీ.. బండి సంజయ్ సంచలన ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: జన్వాడలో రేవ్ పార్టీపై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రేపు పార్టీ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఫామ్ హౌస్ సీసీ టీవీ పుటేజీ సహా ఆధారాలు ధ్వంసం కాకుండా చూడాలని కోరారు.జన్వాడ ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీ జరుగుతున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. కేటీఆర్ బావ మరిది రాజ్ పాకాల డ్రగ్స్ పార్టీ నిర్వహించినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ..‘సుద్దపూస.. ఇప్పుడేమంటాడో. బావ మరది ఫామ్ హౌస్‌లోనే రేవ్ పార్టీలా?. డ్రగ్స్ తీసుకుంటూ అడ్డంగా దొరికినా బుకాయిస్తాడేమో. ‘సుద్దపూస’ను కావాలనే తప్పించారనే వార్తలొస్తున్నాయి.సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్న డ్రగ్స్‌పై రాజీ ధోరణి ఎందుకు?. కాంగ్రెస్, బీఆర్ఎస్ కాంప్రమైజ్ పొలిటిక్స్ సిగ్గు చేటు. చిత్తశుద్ధి ఉంటే సమగ్ర విచారణ జరపాలి. సీసీ పుటేజీ సహా ఆధారాలు ధ్వంసం కాకుండా చూడాలి. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాల్సిందే. బడా నేతలతో సహా రేవ్ పార్టీలో ఉన్న వాళ్లందరినీ అరెస్ట్ చేయాలి. చట్టం ముందు అందరూ సమానమని నిరూపించేలా చర్యలు ఉండాలని’ డిమాండ్ చేశారు. -
రంగారెడ్డి జిల్లా జన్వాడలో వీఐపీల రేవ్ పార్టీ భగ్నం
-
HYD: కేటీఆర్ బావ మరిది ఫామ్ హౌస్‌లో రేవ్ పార్టీ భగ్నం..
సాక్షి, హైదరాబాద్: నగరంలో బీఆర్ఎస్ నేత బావమరది ఫామ్ హౌస్‌లో జరుగుతున్న రేవ్ పార్టీని సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు భగ్నం చేశారు. వీఐపీల రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నట్టు తేలడంతో కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. అలాగే, ఫారిన్ లిక్కర్, డ్రగ్స్‌ను పోలీసులు సీజ్ చేశారు. అలాగే, రేవ్ పార్టీలో క్యాసినో కూడా ఆడినట్టు సమాచారం. క్యాసినోకు సంబంధించిన మెటీరియల్‌ను ఫామ్ హౌస్‌లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల ప్రకారం.. జన్వాడలోని రిజర్వ్ కాలనీలో రాజ్ పాకాల ఫామ్ హౌస్‌లో వీఐపీల రేవ్ పార్టీ జరుగుతోందని పోలీసులకు సమాచారం అందింది. డీజే సౌండ్స్‌తో బీభత్సం సృష్టించడంతో స్థానికులు పోలీసులు సమాచారం ఇచ్చారు. దీంతో, రంగంలోకి దిగిన సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు రేవ్ పార్టీని భగ్నం చేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. రేవ్ పార్టీలో విదేశీ మద్యం, డ్రగ్స్ ఉన్నట్టు గుర్తించారు. ఈ క్రమంలో వారికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా కొకైన్ తీసుకున్నట్టు తేలింది. మరో ఇద్దరికి కూడా డ్రగ్స్ పాజిటివ్‌గా తేలినట్టు సమాచారం. పార్టీలో 42 మంది పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఇక, రైడ్ సందర్భంగా భారీగా విదేశీ మద్యం, డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొరికిన విదేశీ మద్యం బాటిళ్లను ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. దీంతో, సెక్షన్-34 ఎక్సైజ్ యాక్ట్ కింద మరో కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా.. రేవ్ పార్టీ నిర్వహించిన ఫామ్‌హౌస్‌కు పేరు లేకపోవడం గమనార్హం. -
అనుమతులు చెల్లవ్: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ‘‘జన్వాడలో తాను లీజుకు తీసుకున్న ఫామ్‌హౌస్‌కు సర్పంచ్ ఇచ్చిన అనుమతులు ఉన్నాయని కేటీఆర్ అంటున్నారు. సర్పంచ్‌లకు అనుమతులిచ్చే అధికారం ఉండదనే విషయం పదేళ్లు మంత్రిగా చేసిన కేటీఆర్‌కు తెలియదా? డీటీసీపీకి మినహా సీఎంకు సైతం ఆ అధికారం లేదు. అసలు ఫామ్‌హౌజ్ లీజు విషయాన్ని కేటీఆర్ ఎన్నికల అఫిడవిట్లో వెల్లడించారా? వెల్లడించకుంటే కేటీఆర్‌పై అనర్హత వేటుతో పాటు విచారణను ఎదుర్కోక తప్పదు..’’అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. తాను 2020లో జన్వాడ ఫామ్‌హౌస్‌పై కోర్టులో కేసు వేసినప్పుడు, అక్రమాలుంటే తానే కూల్చివేస్తానని కేటీఆర్ అన్నారని.. మరి ఎందుకు కూల్చివేయలేదని ప్రశ్నించారు. హిమాయత్ సాగర్, ఉస్మాన్సాగర్లు జలమండలి పరిధిలోకి వస్తాయని.. 111 జీవో పరిధిలో నిర్మాణాలకు ఆ సంస్థే ఎన్ఓసీ ఇవ్వాల్సి ఉంటుందని, సర్పంచ్ కాద ని స్పష్టం చేశారు. తన కుటుంబ సభ్యుల అక్రమ నిర్మాణాలేమైనా ఉంటే కేటీఆర్ ఆ జాబితా తీసుకురావాలని.. తానే దగ్గరుండి కూల్చివేయిస్తానని రే వంత్ చెప్పారు. బుధవారం సచివాలయంలో సీఎం రేవంత్ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. 111 జీవోలో మార్పుల్లేవు సుప్రీంకోర్టు నిబంధనలను పూర్తిగా అమలుచేయకుండా 111 జీవో విషయంలో అంగుళం మార్పు కూడా చేయలేమని సీఎం రేవంత్ పేర్కొన్నారు. భూముల రేట్లు పెంచి వ్యాపారం చేసుకోవడానికే గత ప్రభుత్వం 111 జీవో ఎత్తివేత కోసం కమిటీని ఏర్పాటు చేసిందని ఆరోపించారు. ఆ కమిటీలోని అధికారులు రిటైర్ కావడంతో కదలిక లేదని చెప్పారు. ఉమ్మడిగా తనిఖీలకు వెళ్దాం.. వస్తారా? విపక్ష నేతలు, ఎమ్మెల్యేలే లక్ష్యంగా కూల్చివేతలు జరుగుతున్నాయనే ఆరోపణలను రేవంత్ తోసిపుచ్చారు. కాంగ్రెస్ నేత పల్లంరాజు కట్టడాన్ని కూడా కూల్చామని చెప్పారు. ‘‘చెరువుల్లో అక్రమ నిర్మాణాలపై ఉమ్మడిగా తనిఖీలు చేద్దాం రండి. ప్రజాకోర్టు నిర్వహించి నిజనిర్ధారణ చేద్దాం. ప్రభుత్వ శాఖల అధికారులూ ఇందులో పాల్గొంటారు..’’అని విపక్ష నేతలకు సవాలు విసిరారు. అకడమిక్ సంవత్సరం మధ్యలో విద్యార్థులకు నష్టం జరగవద్దన్న ఉద్దేశంతో.. అక్బరుద్దీన్, పల్లా రాజేశ్వర్‌రెడ్డిల కాలేజీల భవనాలను కూల్చకుండా హైడ్రా సమయం ఇచ్చిందని చెప్పారు. శాస్త్రీపురంలో ఐదంతస్తుల కట్టడాన్ని (ఓ ఎంఐఎం ఎమ్మెల్యేకు సంబంధించిన) కూల్చామని, అక్కడ ఎవరుంటారో మీకు తెలుసు కదా అని అసదుద్దీన్ ఒవైసీని ఉద్దేశించి పరోక్షంగా ప్రస్తావించారు. భూములు కొన్నవారిదే బాధ్యత! కూల్చివేతలతో సాధారణ ప్రజలు కూడా నష్టపోతారని మీడియా ప్రశ్నించగా.. స్థలాల కొనుగోళ్లకు ముందు దస్తావేజుల తనిఖీ బాధ్యత కొనుగోలుదారులదేనని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ప్రభుత్వ స్థలంలో 50 ఏళ్ల నుంచీ ఉన్నా కూల్చివేయడానికి నోటీసులు అవసరం లేదంటూ రాయదుర్గ్‌లోని లిడ్‌క్యాప్ స్థలంలో జరిపిన కూల్చివేతలను సమర్ధించారు. అక్రమ నిర్మాణాలకు అనుమతులిచ్చిన అధికారులపై చర్యలు తప్పవన్నారు. ఇక కూల్చివేయడమే! ఎఫ్టీఎల్, బఫర్ జోన్, నాలా, పార్కుల్లో అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించడానికి ఆస్కారం ఉండదని, వాటిని కూల్చివేయడమే లక్ష్యమని రేవంత్‌రెడ్డి చెప్పారు. హైడ్రా పరిధిని ఔటర్ రింగ్‌రోడ్డును తాకే గ్రామపంచాయతీల వరకు నోటిఫై చేసినట్టు తెలిపారు. హైడ్రా పరిధి వెలుపలి ప్రాంతాల్లోని మున్సిపల్ కమిషనర్లు తమ పరిధిలోని అక్రమ కట్టడాల కూల్చివేతకు హైడ్రా సహాయాన్ని కోరవచ్చని చెప్పారు. హైడ్రాకు పోలీసుస్టేషన్ హోదా కల్పించి ఎఫ్ఐఆర్లు నమోదు చేసే అధికారం ఇస్తామని తెలిపారు. 10 ఏళ్లలో రికార్డులు మాయం హెచ్ఎండీఏ ఎన్ని చెరువులను నోటిఫై చేసిందనే అంశంపై పరిశీలన జరుగుతోందని రేవంత్ చెప్పారు. గత పదేళ్లలో కొన్ని రికార్డులు మాయమయ్యాయని, దీంతో రాష్ట్రం ఏర్పాటుకు ముందున్న రికార్డులను పరిశీలిస్తున్నామని తెలిపారు. జీవో 58, 59 కింద గత ప్రభుత్వంలో అక్రమంగా క్రమబధ్దీకరించిన ప్రభుత్వ భూములను గుర్తించి నిషేధిత భూముల జాబితాలో చేర్చినట్టు వెల్లడించారు. వారంలో జర్నలిస్టుల సొసైటీకి స్థలాలుజవహర్లాల్ నెహ్రూ జర్నలిస్టు కో–ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ (జేఎన్జే)కి పేట్‌బïÙరాబాద్‌లో కేటాయించిన భూములను వారంలోగా అప్పగిస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఖమ్మం జిల్లా పర్యటనలో సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొనాల్సి ఉండడంతో.. గురువారం రవీంద్రభారతిలో తలపెట్టిన సమావేశాన్ని వాయిదా వేయాల్సి వచ్చిందని తెలిపారు. కేజ్రీవాల్‌కు బెయిల్ రాలేదు.. కవితకు ఎలా వచ్చింది?ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్‌కు ఇంకా బెయిల్ రాలేదని.. మనీశ్ సిసోడియాకు బెయిల్ కోసం 16 నెలలు పట్టిందని.. కవితకు 5 నెలల్లోనే ఎలా బెయిల్ వచ్చిందని సీఎం రేవంత్ ప్రశ్నించారు. కవితకు ఒక న్యాయం, మిగతా వారికి ఇంకో న్యాయమా? అని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తమ ఓట్లను బీజేపీకి బదిలీ చేసిందని, ఆ రెండు పార్టీల మధ్య అవగాహన జరిగిందని ఆరోపించారు.కేటీఆర్ కొడంగల్‌కు వెళ్తే అభ్యంతరం లేదురుణమాఫీపై హరీశ్‌రావు, కేటీఆర్‌ల ఆరోపణలు అవాస్తవమని.. ఆగస్టు 15లోగా 22,37,848 ఖాతాలకు రూ.17,933 కోట్ల రుణమాఫీ చేశామని రేవంత్ చెప్పారు. గత ప్రభుత్వం 2018–23 మధ్యకాలంలో 23,61,849 ఖాతాలకు సంబంధించి రూ.13,329 కోట్ల రుణాలను వాయిదాల్లో మాఫీ చేసిందన్నారు. హరీశ్, కేటీఆర్, బీఆర్ఎస్ కార్యకర్తలు గ్రామగ్రామాన తిరిగి రుణమాఫీ జరగని వారి వివరాలను సేకరించి ప్రభుత్వానికి అందిస్తే వారికీ రుణమాఫీ చేస్తామన్నారు. కొడంగల్‌లో రుణమాఫీ పరిశీలనకు కేటీఆర్ వెళ్తానని అన్నారని మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా.. తనకేమీ అభ్యంతరం లేదని చెప్పారు. నెలాఖరులోగా కొత్త బీసీ కమిషన్ ఏర్పాటు చేసి కులగణన ప్రారంభిస్తామన్నారు.ఏపీకి రూ.2,500 కోట్ల వడ్డీల చెల్లింపు..ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న రుణాలను జనాభా దామాషా ప్రకారం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు పంచుకోవాలన్న తెలంగాణ వాదనను తమ ప్రభుత్వ కృషితో ఏపీ అంగీకరించిందని రేవంత్ చెప్పారు. తెలంగాణ వాటా వడ్డీల కింద ఏపీకి రూ.2,500 కోట్లను చెల్లించడానికి కేంద్రం రుణాన్ని మంజూరు చేసిందని, దానితో తెలంగాణకు మేలు జరిగిందని చెప్పారు. కర్ణాటకలో జరిగిన వాల్మీకి స్కామ్‌లో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు వాటాలు అందాయన్న కేటీఆర్ ఆరోపణలను రేవంత్ తోసిపుచ్చారు. బీఆర్ఎస్ నేతలకే వాటాలు ఉండవచ్చని విమర్శించారు. రాష్ట్రంలో నిజమైన కేసుల విచారణకు సీబీఐకి అనుమతిస్తామని, తప్పుడు కేసులకు ఇవ్వబోమని ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
బుల్కాపూర్ నాలా మాయం!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం జన్వాడలో మాజీ మంత్రి కేటీఆర్ లీజుకు తీసుకున్నట్లు చెబుతున్న ఫాంహౌస్‌కు ఆనుకుని ఉన్న బుల్కాపూర్ నాలాను మంగళవారం రెవెన్యూ ఇన్స్పెక్టర్ తేజ, సర్వేయర్ సాయి తేజ, ఇరిగేషన్ ఇన్స్పెక్టర్ లింగంలు సందర్శించారు. రెవెన్యూ రికార్డులతో పాటు గ్రామ నక్ష ఆధారంగా.. కబ్జాకు గురైన బుల్కాపూర్ నాలా ఎటు నుంచి ఎటు వైపు వెళ్తోంది? ఎన్ని మీటర్ల మేర కబ్జాకు గురైంది? ఎవరి కబ్జాలో ఉంది? వంటి వివరాలపై ఆరా తీశారు. రెవెన్యూ రికార్డులను, క్షేత్రస్థాయిలో నాలా పరిస్థితిని సరిపోల్చుకున్నారు. శంకర్పల్లి–ఖానాపూర్ రోడు్డలో ఉన్న ఈ నాలా ప్రస్తుతం చాలావరకు కన్పించకుండా పోయింది. మాజీ మంత్రి కేటీఆర్ సన్నిహితునిదిగా చెబుతున్న జన్వాడ ఫాంహౌస్ ప్రధాన గేటు, ప్రహరీ ఈ నాలాపై నిర్మించినట్లు 2020 జూన్‌లోనే ఇరిగేషన్ అధికారులు నిర్ధారించారు. సర్వే నంబర్ 301, 302, 309, 311, 313లో దాదాపు 27 ఎకరాల్లో ఈ ఫాంహౌస్ ఉంది. ఇందులో అక్రమ నిర్మాణాలతో పాటు 2.24 ఎకరాల నాలా, 11 గుంటల బఫర్ జోన్ ఉన్నట్లు ధ్రువీకరించారు. ఫాంహౌస్ తూర్పు భాగంలో, నాలా, బఫర్ జోన్లు ఆక్రమణకు గురైనట్లు గుర్తించారు. తాజాగా నాలా ఎంత మేర కబ్జాకు గురైందనే అంశాన్ని నిర్ధారించేందుకు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు క్షేత్రస్థాయికి చేరుకుని, కొలతలు తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. కాగా ఆయా విభాగాల అధికారులు బుధవారం మరోసారి జన్వాడను సందర్శించే అవకాశం ఉందని తెలిసింది. గతంలో రేవంత్‌పై కేసు, అరెస్టు సీఎం రేవంత్‌రెడ్డి గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జన్వాడ ఫాంహౌస్ సందర్శనకు వెళ్లారు. అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నివసిస్తున్న ఈ ఫాంహౌస్‌పై డ్రోన్లు ఎగరేశారనే ఆరోపణలతో అప్పట్లో రేవంత్‌పై కేసు నమోదు చేసి, అరెస్టు కూడా చేశారు. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, ఇటీవల చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ భూముల పరిరక్షణ పేరుతో హైడ్రాను తెరపైకి తీసుకురావడం తెలిసిందే. ఇదే క్రమంలో జన్వాడ ఫాంహౌస్‌కు నోటీసులు జారీ చేయగా, హైడ్రా చర్యలను ఆపాల్సిందిగా కోరుతూ కేటీఆర్ సన్నిహితుడు బి.ప్రదీప్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో నిబంధనల మేరకు నడుచుకోవాలని కోర్టు ప్రభుత్వానికి సూచించింది.