సాక్షి, హైదరాబాద్: నగరంలో బీఆర్‌ఎస్ నేత బావమరది ఫామ్ హౌస్‌లో జరుగుతున్న రేవ్ పార్టీని సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు భగ్నం చేశారు. వీఐపీల రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నట్టు తేలడంతో కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. అలాగే, ఫారిన్ లిక్కర్, డ్రగ్స్‌ను పోలీసులు సీజ్ చేశారు. అలాగే, రేవ్ పార్టీలో క్యాసినో కూడా ఆడినట్టు సమాచారం. క్యాసినోకు సంబంధించిన మెటీరియల్‌ను ఫామ్ హౌస్‌లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
వివరాల ప్రకారం.. జన్వాడలోని రిజర్వ్ కాలనీలో రాజ్ పాకాల ఫామ్ హౌస్‌లో వీఐపీల రేవ్ పార్టీ జరుగుతోందని పోలీసులకు సమాచారం అందింది. డీజే సౌండ్స్‌తో బీభత్సం సృష్టించడంతో స్థానికులు పోలీసులు సమాచారం ఇచ్చారు. దీంతో, రంగంలోకి దిగిన సైబరాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు రేవ్ పార్టీని భగ్నం చేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. రేవ్ పార్టీలో విదేశీ మద్యం, డ్రగ్స్ ఉన్నట్టు గుర్తించారు. ఈ క్రమంలో వారికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా కొకైన్ తీసుకున్నట్టు తేలింది. మరో ఇద్దరికి కూడా డ్రగ్స్ పాజిటివ్‌గా తేలినట్టు సమాచారం. పార్టీలో 42 మంది పాల్గొన్నట్టు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఇక, రైడ్ సందర్భంగా భారీగా విదేశీ మద్యం, డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొరికిన విదేశీ మద్యం బాటిళ్లను ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. దీంతో, సెక్షన్-34 ఎక్సైజ్ యాక్ట్ కింద మరో కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా.. రేవ్ పార్టీ నిర్వహించిన ఫామ్‌హౌస్‌కు పేరు లేకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment