కేటీఆర్‌ బావమరిది పార్టీ కేసు.. విజయ్‌ మద్దూరి ఇంట్లో సోదాలు | Police Searched Vijay Madduri Farm House In Janwada Party Case | Sakshi
Sakshi News home page

కేటీఆర్‌ బావమరిది పార్టీ కేసు.. విజయ్‌ మద్దూరి ఇంట్లో సోదాలు

Published Tue, Oct 29 2024 9:07 PM | Last Updated on Tue, Oct 29 2024 9:23 PM

Police Searched Vijay Madduri Farm House In Janwada Party Case

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో సంచలనం సృష్టించిన జన్వాడ పార్టీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో నిందితుడైన విజయ్‌ మద్దూరి ఇంట్లో మోకిల పోలీసులు సోదాలు చేపట్టారు. రాజ్‌పాకాల ఫాంహౌజ్ పార్టీలో విజయ్ మద్దూరి కొకైన్ తీసుకున్నట్లు నిర్ధారణ అయ్యింది. సోమవారం విచారణకు విజయ్‌ హాజరుకాలేదు. పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు.

ఈ కేసులో కొకైన్‌ పాజిటివ్‌ వచ్చిన విజయ్‌ మద్దూరికి సంబంధించిన డ్రగ్‌ టెస్ట్‌ కిట్‌తోపాటు ఆయన ఫోన్‌ను సీజ్‌ చేసినట్లు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. అయితే ఆ పార్టీలో పాల్గొన్న ఓ మహిళ తన ఫోన్‌ సీజ్‌ చేశారని పోలీసులకు తెలిపింది. దీంతో పోలీసులు ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసుకున్నారు. కేసు కోర్టు పరిధిలోకి ఉన్నందున కోర్టు అనుమతి తర్వాత ఫోన్‌ను తిరిగిస్తామని వెల్లడించారు. విజయ్‌ను అదుపులోకి తీసుకునే సమయంలో ఆయన తన ఫోన్‌కు బదులు పక్కన ఉన్న మహిళ ఫోన్‌ను ఇచ్చారు. విజయ్‌ మద్దూరి సెల్‌ఫోన్‌ సీజ్‌ చేసేందుకు పోలీసులు వచ్చినట్లు సమాచారం.

కాగా, అనుమతి లేకుండా మద్యం పార్టీ నిర్వహించారనే కారణంతో రాజ్‌ పాకాల (51)తోపాటు, కొకైన్‌ తీసుకున్నట్టు నిర్ధారణ అయిన విజయ్‌ మద్దూరి (56)పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం రాత్రి విజయ్‌ మద్దూరికి 41 సీఆర్‌పీసీ కింద పోలీసులు నోటీసులు ఇచ్చి, స్టేషన్‌ బెయిల్‌పై విడుదల చేశారు. విచారణ నిమిత్తం సోమవారం పోలీస్‌స్టేషన్‌కు రావాలని వారు సూచించినా.. ఆయన సాయంత్రం వరకు కూడా స్టేషన్‌కు రాలేదు. ఇక శనివారం రాత్రి పార్టీ నుంచి వెళ్లిపోయిన రాజ్‌ పాకాల అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ నేపథ్యంలో మోకిల పోలీసులు సోమవారం దర్యాప్తు కోసం రాయదుర్గంలోని రాజ్‌ పాకాల నివాసానికి వెళ్లారు. తాళం వేసి ఉండటంతో ఇంటి బయట నోటీసులు అతికించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement