searched
-
కేటీఆర్ బావమరిది పార్టీ కేసు.. విజయ్ మద్దూరి ఇంట్లో సోదాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన జన్వాడ పార్టీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో నిందితుడైన విజయ్ మద్దూరి ఇంట్లో మోకిల పోలీసులు సోదాలు చేపట్టారు. రాజ్‌పాకాల ఫాంహౌజ్ పార్టీలో విజయ్ మద్దూరి కొకైన్ తీసుకున్నట్లు నిర్ధారణ అయ్యింది. సోమవారం విచారణకు విజయ్ హాజరుకాలేదు. పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు.ఈ కేసులో కొకైన్ పాజిటివ్ వచ్చిన విజయ్ మద్దూరికి సంబంధించిన డ్రగ్ టెస్ట్ కిట్‌తోపాటు ఆయన ఫోన్‌ను సీజ్ చేసినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. అయితే ఆ పార్టీలో పాల్గొన్న ఓ మహిళ తన ఫోన్ సీజ్ చేశారని పోలీసులకు తెలిపింది. దీంతో పోలీసులు ఆమె స్టేట్మెంట్ను రికార్డు చేసుకున్నారు. కేసు కోర్టు పరిధిలోకి ఉన్నందున కోర్టు అనుమతి తర్వాత ఫోన్‌ను తిరిగిస్తామని వెల్లడించారు. విజయ్ను అదుపులోకి తీసుకునే సమయంలో ఆయన తన ఫోన్‌కు బదులు పక్కన ఉన్న మహిళ ఫోన్‌ను ఇచ్చారు. విజయ్ మద్దూరి సెల్‌ఫోన్ సీజ్ చేసేందుకు పోలీసులు వచ్చినట్లు సమాచారం.కాగా, అనుమతి లేకుండా మద్యం పార్టీ నిర్వహించారనే కారణంతో రాజ్ పాకాల (51)తోపాటు, కొకైన్ తీసుకున్నట్టు నిర్ధారణ అయిన విజయ్ మద్దూరి (56)పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం రాత్రి విజయ్ మద్దూరికి 41 సీఆర్పీసీ కింద పోలీసులు నోటీసులు ఇచ్చి, స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు. విచారణ నిమిత్తం సోమవారం పోలీస్‌స్టేషన్‌కు రావాలని వారు సూచించినా.. ఆయన సాయంత్రం వరకు కూడా స్టేషన్‌కు రాలేదు. ఇక శనివారం రాత్రి పార్టీ నుంచి వెళ్లిపోయిన రాజ్ పాకాల అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ నేపథ్యంలో మోకిల పోలీసులు సోమవారం దర్యాప్తు కోసం రాయదుర్గంలోని రాజ్ పాకాల నివాసానికి వెళ్లారు. తాళం వేసి ఉండటంతో ఇంటి బయట నోటీసులు అతికించారు. -
2023లో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా గూగుల్‌లో సెర్చ్ చేసిన అంశాలు
న్యూస్‌కు సంబంధించి.. 1. ఇజ్రాయెల్–పాలస్తీనా యుద్ధం 2. టైటానిక్ సబ్‌మెరైన్ 3. టర్కీ భూకంపం వ్యక్తులు 1. డామర్ హామ్లిన్ (అమెరికన్ ఫుట్‌బాలర్) 2. జెరెమీ రెన్నర్ (అమెరికన్ నటుడు) 3. ఆండ్రూ టేట్ (కిక్బాక్సర్–సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్) సంగీత కళాకారులు 1. షకీరా (కొలంబియా సింగర్) 2. జేసన్ ఆల్డీన్ (అమెరికన్ సింగర్) 3. జో జోనాస్ (అమెరికన్ సింగర్–నటుడు) సినిమాలు 1. బార్బీ 2. ఓపెన్ హైమర్ 3. జవాన్ క్రీడాకారులు 1. డామర్ హామ్లిన్ (అమెరికన్ ఫుట్‌బాలర్) 2. కైలియన్ ఎంబాపే (ఫ్రెంచ్ ఫుట్‌బాలర్) 3. ట్రావిస్ కెల్స్ (అమెరికన్ ఫుట్‌బాలర్) చనిపోయిన ప్రముఖులు 1. మాథ్యూ పెర్రీ (కెనడా నటుడు) 2. టీనా టర్నర్ (అమెరికన్ సింగర్, నటి) 3. సినీడ్ ఓ కానర్ (ఐరిష్ సింగర్, లిరిసిస్ట్) -
వెయ్యి సార్లు వెతికినా చిల్లిగవ్వ దొరకదు: కేజ్రీవాల్
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ నివాసంలో ఈడీ సోదాలపై సీఎం కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈడీ 1000 సార్లు దాడులు చేసినప్పటికీ లిక్కర్ స్కాంలో కేసులో అక్రమంగా సంపాదించినట్లు ఒక్క రూపాయి కూడా కనిపెట్టలేకపోయారని అన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల ముందు ప్రతిపక్షాలను దెబ్బతీయడానికి ప్రధాని మోదీ ప్రభుత్వం విశ్వప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. "Nothing will be found at his residence," Arvind Kejriwal reacts to ED's raid on Sanjay Singh Read @ANI Story | https://t.co/oTADiHIxnP#ArvindKejriwal #EDRaid #SanjaySingh pic.twitter.com/txzXtqdGgQ — ANI Digital (@ani_digital) October 4, 2023 'ఎంపీ సంజయ్ సింగ్ ఇంట్లోనూ ఏమీ లభించలేదు. గత ఏడాది నుంచి లిక్కర్ స్కాం అంటూ దర్యాప్తు చేస్తున్నారు. అయినా.. లిక్కర్ స్కాం అంటూ ఆరోపణలు చేస్తున్నారు. వెయ్యి సార్లు సోదాలు చేశారు.. కానీ ఏమీ లభించలేదు. త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. బీజేపీకి పరాజయం తప్పదు. ఇదే వీరికి చివరి అవకాశం' అంటూ సీఎం కేజ్రీవాల్ ధ్వజమెత్తారు. సంజయ్ సింగ్ ఇంట్లో ఈడీ సోదాలు ఆప్ ఎంపీ(రాజ్యసభ) సంజయ్ సింగ్‌కు చెందిన నార్త్ అవెన్యూ నివాసంలో బుధవారం ఉదయం ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మొదటి నుంచి ఈయన ఈడీ నజర్లో ఉన్నప్పటికీ.. ఇప్పుడు నేరుగా నివాసాల్లో తనిఖీల దాకా వెళ్లడం గమనార్హం. ఆయన ఇంట్లో కీలక పత్రాల కోసం ఈడీ సోదాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో ఢిల్లీ వ్యాపారవేత్త దినేష్ అరోరా నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. దినేష్‌ను సంజయ్ సింగ్ దగ్గరుండి మాజీ మంత్రి మనీశ్‌సిసోడియాకు కలిపించాడని ఈడీ తన అభియోగాల్లో పేర్కొంది. బీజేపీ ఫైర్ సీఎం కేజ్రీవాల్ వ్యాఖ్యలపై అటు బీజేపీ కూడా మండిపడింది. దర్యాప్తు సంస్థలు సోదాలు చేస్తే ఆప్ నేతలకు ఎందుకు భయమైతుందని బీజేపీ నేతలు ప్రశ్నించారు. లిక్కర్ స్కాం కేసులో ఏడు నెలలుగా ఆప్ నేత మనీష్ సిసోడియా జైలులోనే గుడుపుతున్నారు.. త్వరలో మరో నేత జైలు కెళ్లబోతున్నారని ఆప్ భయపడుతోందని అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసులో కేజ్రీవాలే కింగ్ పిన్ అని ఆరోపించారు. ఆప్ సర్కారుకు వ్యతిరేకంగా బీజేపీ ఆందోళనలు చేపట్టింది. ఇదీ చదవండి: Delhi Liquor Policy Case: ఆప్ కోసం లిక్కర్ స్కామ్ డబ్బులు.. అందుకే సంజయ్ సింగ్ ఇంట సోదాలు? -
గూగుల్ లో ఎక్కువగా సెర్చ్ చేసిన సినిమాలు ఇవే..!
-
7 బస్తాల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం
అక్రమంగా దాచి ఉంచిన గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఇస్లాంపూర వీధిలో ఉన్న రాజూ కిరాణ దుకాణంలో శనివారం సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో దుకాణంలో అక్రమంగా దాచిన 7 బస్తాల గుట్కా ప్యాకెట్లు లభ్యమయ్యాయి. వీటిని పోలీసులు సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న గుట్కా ప్యాకెట్ల విలువ సుమారూ రూ. లక్ష వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా ఎవరినీ అరెస్టు చేయలేదు. -
గూగుల్ క్వీన్ రాధికా ఆప్తే