అక్రమంగా దాచి ఉంచిన గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఇస్లాంపూర వీధిలో ఉన్న రాజూ కిరాణ దుకాణంలో శనివారం సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో దుకాణంలో అక్రమంగా దాచిన 7 బస్తాల గుట్కా ప్యాకెట్లు లభ్యమయ్యాయి. వీటిని పోలీసులు సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న గుట్కా ప్యాకెట్ల విలువ సుమారూ రూ. లక్ష వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా ఎవరినీ అరెస్టు చేయలేదు.
7 బస్తాల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం
Published Sat, Oct 31 2015 3:35 PM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement