అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు.
ఆత్మకూరు (ఎం): అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు. నల్లగొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రం సమీపంలో ఉన్న ఇక్కేరు వాగు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. తమకు అందిన సమాచారం మేరకు ఎస్‌ఐ శివనాగప్రసాద్ సిబ్బందితో వాగు వద్దకు చేరుకుని ట్రాక్టర్లను సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. యజమానులపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టు చెప్పారు.