Quid
-
నోటి క్యాన్సర్ అంటున్నారు.. ఏం చేయాలి!
నా వయసు 49 ఏళ్లు. నేను ఇరవై ఏళ్లుగా గుట్కా తింటున్నాను. ఒక నాలుగు నెలల నుంచి నా నోటిలో వాపు కనిపించడంతో పాటు నొప్పి కూడా చాలా ఎక్కువగా వస్తోంది. గత రెండు నెలల నుంచి ఈ బాధ మరీ ఎక్కువయ్యింది. నోటిలో పుండ్లు (మౌత్ అల్సర్స్) కూడా వస్తున్నాయి. డాక్టర్‌ను సంప్రదిస్తే నోటిక్యాన్సర్ కావచ్చని, దగ్గర్లోని పెద్ద ఆసుపత్రికి వెళ్లమని అంటున్నారు. నాకు ఆందోళనగా ఉంది. నాకు తగిన సలహా ఇవ్వండి. – ఎన్. రామస్వామి, సూళ్లూరుపేట గుట్కాలు/పొగాకు నమిలివారిలో నోటి క్యాన్సర్ వచ్చేందుకు అవకాశం ఎక్కువ. నోటి పరిశుభ్రత (ఓరల్ హైజీన్) పాటించకపోవడంతో పాటు, ఇలా గుట్కాలు, పొగాకు నమలడం, ఆల్కహాల్ తీసుకోవడం వంటి అంశాలు క్యాన్సర్‌ను ప్రేరేపిస్తాయి. ముందుగా క్యాన్సర్ స్పెషలిస్ట్ మిమ్మల్ని పరీక్షించి, మీ చెంపలు, నాలుక, చిగుళ్లు... ఇలా నోటిలో ఏ భాగంలో క్యాన్సర్ వచ్చిందో తొలుత పరీక్షించి చూడాల్సి ఉంటుంది. మీకు నోటిలో వాపు కూడా వచ్చిందంటే దాన్ని క్యాన్సర్‌గా అనుమానించాల్సి ఉంటుంది. మీరు చెబుతున్న లక్షణాలైతే క్యాన్సర్‌కు సంబంధించినవిగానే కనిపిస్తున్నాయి. ►మొదట మీకు సమస్య ఉన్న భాగంతో పాటు, మెడ భాగంలోనూ సీటీ స్కాన్ లేదా ఎమ్మారై స్కానింగ్ పరీక్షలు చేయించి, క్యాన్సర్ వ్యాధి తీవ్రతను అంచనా వేయాలి. ఈ పరీక్షల వల్ల పుండు పడిన చోటి నుంచి, అది ఏ మేరకు వ్యాపించిందో కూడా తెలుస్తుంది. అది ఇప్పటికే మీ దవడ ఎముకను చేరిందా, లేక ఎముకను దాటి మెడలోని లింఫ్ గ్రంథులకూ వ్యాపించిదా అన్న విషయాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. మీరు మామూలుగా నోరు తెరవగలుగుతూ ఉంటే, క్యాన్సర్ మీ దవడ కండరాల్లోకి వ్యాపించి ఉండకపోవచ్చు. ► ఒకవేళ క్యాన్సర్ దవడ కండరాల్లోకి వ్యాపిస్తే నోరు తెరవడం కూడా కష్టమవుతుంది. మీలోని క్యాన్సర్ ఇతరచోట్లకు వ్యాపించకపోతే శస్త్రచికిత్స ద్వారా క్యాన్సర్ వచ్చిన భాగం మేరకు తొలగించాల్సి ఉంటుంది. అలా తొలగించిన భాగాన్ని ఆ తర్వాత ప్లాస్టిక్ సర్జరీ లేదా రీ–కన్స్ట్రక్టివ్ సర్జరీ ద్వారా పునర్మించవచ్చు. ఈ పద్ధతుల ద్వారా దవడ ఎముకను తొలగించి కూడా మళ్లీ మునుపటిలాగే అమర్చేలా చూడవచ్చు. ► సర్జరీ తర్వాత నోరు మునపటిలా తెరచుకోదేమోనని కొందరు ఆందోళన చెంతుటుంటారు. కానీ రోబోటిక్ సర్జరీతో కుట్లూ ఉండవు. నోరు కూడా పూర్తిగా మునపటిలాగే తెచుకుంటుంది. ముందులాగే నోటిద్వారా ఆహారం తీసుకోవచ్చు. ► ఒకవేళ మెడలోని లింఫ్ గ్రంథుల్లోకి కూడా క్యాన్సర్ వ్యాపించి ఉంటే, వాటన్నింటినీ నెక్ డిసెక్షన్ ద్వారా తొలగించాల్సి ఉంటుంది. బయాప్సీ రిపోర్టు ఆధారంగా శస్త్రచికిత్స గాయలు పూర్తిగా మానిపోయాక, రేడియోథెరపీ ప్లాన్ చేయాల్సి ఉంటుంది. మొదట మీరు గుట్కా/పొగాకు నమలడం పూర్తిగా మానేయండి. అది కేవలం నోటికే గాక, మెడ, ఆహారనాళం లేదా కడుపులోని ఏ భాగానికైనా క్యాన్సర్ వచ్చేలా చేయగలదు. మీరు వీలైనంత త్వరగా మీకు దగ్గర్లోని క్యాన్సర్ నిపుణుడిని సంప్రదించండి. డాక్టర్ సచిన్ మార్దా, సీనియర్ ఆంకాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్, యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్ -
రూ.3.6 కోట్ల గుట్కా పట్టివేత
హైదరాబాద్: గుట్కా తయారీ కేంద్రాలపై దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి ముగ్గురిని అరెస్ట్ చేశారు. రూ.3.6 కోట్ల విలువైన గుట్కా, సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇన్చార్జి కమిషనర్ వి.వి.శ్రీనివాసరావు, దక్షిణ మండలం డీసీపీ సత్య నారాయణ గురువారం ఇక్కడ కేసు వివరాలు వెల్లడించారు. మల్లేపల్లికి చెందిన షుజాత్ అలీ ఖాన్(48), హుమాయున్‌నగర్‌కు చెందిన ఖాజా సలీముద్దీన్(46) డబ్బులు సంపాదించేందుకు గుట్కా తయారీ ప్రారంభించారు. మహారాష్ట్ర ఔరంగాబాద్‌కు చెందిన అలీం, గోఖలే నుంచి గుట్కా ముడిసరుకు కొనుగోలు చేసి బండ్లగూడ ఇస్మాయిల్‌నగర్‌లో 4 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ‘ఆదత్’, ‘పెట్రోల్’ బ్రాండ్లతో గుట్కా తయారు చేసి ఔరంగాబాద్ కు సరఫరా చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ ఎస్.చైతన్య కుమార్ నేతృత్వంలో ఇన్స్పెక్టర్ కె.మధుమోహన్‌రెడ్డి, ఎస్సైలు జి.వెంకటరామిరెడ్డి, మహ్మద్ తఖీయుద్దీన్ దాడులు చేసి షుజాత్ అలీఖాన్, సలీముద్దీన్, రహీముద్దీన్‌ను అరెస్ట్ చేశారు. స్వాధీనం చేసుకున్న సామగ్రి: నిందితుల వద్ద నుంచి ఎనిమిది మిషన్లు, ఒక మిక్సింగ్ మిషన్, ఆదత్, పెట్రోల్ బ్రాండ్లకు చెందిన 80 సంచుల గుట్కా, నాలుగు సంచుల్లో ఏ–జర్దా బ్రాండ్ గుట్కా, 24/7 బ్రాండ్ గుట్కా, మెగ్నీషియం కార్బొనేట్ పౌడర్, సుపారీ బ్యాగ్‌లు, గులాబ్ జెల్ బాటిళ్లు, పుదీనా క్రిస్టల్స్ కాటన్లు, 100 సంచుల పౌడర్, 50 కిలోల జర్దా, ఆటోట్రాలీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుట్కారహిత నగరంగా హైదరాబాద్: కమిషనర్ నగర చరిత్రలో మొదటిసారిగా ఇంత పెద్ద మొత్తంలో గుట్కాను పట్టుకున్నట్లు కమిషనర్ తెలిపారు. గుట్కా రహిత నగరం కోసం చర్యలు తీసుకుంటున్నామన్నారు. గంజాయి రవాణా కాకుండా చూస్తున్నామని చెప్పారు. -
శ్రీశైలంలో గుట్కా ప్యాకెట్ల స్వాధీనం
శ్రీశైలం ఆలయ పరిధిలో తనిఖీలు చేపట్టిన పోలీసులు పెద్ద మొత్తంలో గుట్కా,ఖైనీ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. సున్నిపెంట వైపు నుంచి వచ్చిన వాహనాలను సీఐ విజయకృష్ణ ఆధ్వర్యంలో ఆలయ ముఖద్వారం వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న రూ.40వేల విలువైన గుట్కా, ఖైనీలను పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారిని ఫుడ్ సేఫ్టీ అధికారులకు అప్పగించారు. -
చర్లలో గుట్కా విక్రయాలు
చర్ల మండల కేంద్రంలో మళ్లీ గుట్కాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. గత రెండు నెలల క్రింత గుట్కా విక్రయాలపై దృష్టి సారించిన పోలీసులు పలువురు విక్రేతలను పట్టుకొని కేసులు నమోదు చేశారు. సరిగ్గా నెల తిరగక ముందే మళ్లీ చర్లలో గుట్కాల విక్రయాలు ఆరంభ కాగా ప్రస్తుత ముమ్మరంగా ఈ విక్రయాలు సాగుతున్నాయి. మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్, బస్టాండ్ సెంటర్, గాందీ సెంటర్, తహశీల్దార్ కార్యాలయం సెంటర్లలో గల పా¯ŒSషాపులలో వీటిని పెద్ద ఎత్తున విక్రయిస్తున్నారు. ఈ విక్రయాలపై పోలీసులకు సమాచారం ఉన్నప్పటికీ పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తున్నారంటూ పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే చర్ల మండలంలో వీటి బారిన పడి పలువురు మృత్యువాత పడగా... మళ్లీ విచ్చల విడిగా సాగుతున్న ఈ గుట్కాల విక్రయాల వల్ల మళ్లీ ఎందరి ప్రాణాలు పోతాయోనని గుట్కా ప్రియులతో పాటు వాటి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. చర్ల మండల కేంద్రంలో సాగుతున్న గుట్కాల విక్రయాలపై మళ్లీ పోలీసులు దృష్టి సారించి వాటిని పూర్తి స్థాయిలో నిర్మూలించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని పలువరు కోరుతున్నారు. -
గుట్కా తయారీ కేంద్రంపై దాడి..
-విలువైన సామగ్రి స్వాధీనం ఖమ్మం అర్బన్ నగర శివారులోని బల్లేపల్లి సమీపంలో మల్లిడి జగన్ అనే వ్యక్తికి సంబంధించిన మామిడితోటలో అక్రమంగా గుట్కా తయారు చేస్తున్న కేంద్రంపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. సుమారు రూ.50 లక్షలు విలువచేసే యంత్రాలు, ముడిపదార్ధాన్ని, రూ.5 లక్షల విలువ చేసే గుట్కా ప్యాకెట్లు, కారు, ఒక ట్రాలీ, మూడు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి నలుగురు తెలుగు వాళ్లను, 9 మంది ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన కూలీలను అరెస్ట్ చేశారు. ఈ దాడులు వరంగల్ విజిలెన్స్ అడిషనల్ ఎస్పీ సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గుట్కా వ్యాపారంపై పోలీసుల నిఘా
మంగపేట: నిషేధిత గుట్కా, అంబర్ పాకెట్ల వ్యాపారంపై స్థానిక పోలీసులు నిఘా పెడుతున్నారు. గుట్కాల నివార ణపై ఏటూరునాగారం సీఐ రఘుచందర్ ఆదేశం మేరకు ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. రాజుపేట, కమలాపురం తదితర గ్రామాల్లో దాడులు నిర్వహించి పలువురిని పట్టుకుని కేసు నమోదు చేశారు. కొందరు షాపుల యజమానులు రహస్యంగా గుట్కా వ్యాపారం నిర్వహిస్తున్నారనే పక్కా సమాచారంతో గురువారం రాత్రి మంగపేట, కమలాపురం గ్రామాల్లో గుట్కాలు విక్రయిస్తున్న కిరా ణ షాపులపై దాడులు నిర్వహించారు. గుండా సత్యనారాయణ, కమలాపురాని కి చెందిన అనంతుల క్రిçష్ణమూర్తి, చిదురాల సతీష్ కిరాణ షాపుల్లో గుట్కా, అంబర్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఏటూరునాగారం : మండల కేంద్రం లోని కిరాణం షాపుల్లో ఎస్సై నరేష్ సిబ్బందితో ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు. మేర్గు స్వామికి చెందిన కిరాణం షాపులో రూ.7వేల విలువైన గుట్కాలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. గు ట్కాలు విక్రయించినట్లు తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని ఎస్సై కోరారు. వారి వివరాలు గోప్యంగా ఉంచుతామ న్నారు. గుట్కాలు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. -
రూ.70వేల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం
ఖమ్మం రూరల్ మండలం దాన వాయిగూడెంలో విజిలెన్స్ అధికారులు రూ.70వేల విలువ చేసే గుట్కా, అంబర్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. గ్రామానికి చెందిన మల్లికార్జున్ అనే వ్యక్తిని ఇంట్లో ఇవి నిల్వ ఉంచిన సమాచారం తెలుసుకుని బుధవారం ఆ ఇంట్లో సోదాలు జరిపారు. ఇందుకు సంబంధించి మల్లికార్జున్‌పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
గుట్కా ప్యాకెట్లను కాల్చి వేసిన పోలీసులు
గుట్టు చప్పుడు కాకుండా గుట్కాలు విక్రయిస్తున్నారనే సమాచారంతో దాడులు నిర్వహించిన పోలీసులు భారీగా గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్ మండలం మొహమ్మద్ నగర్లో పలు దుకాణాలపై దాడులు నిర్వహించిన పోలీసులు మూడు బస్తాల గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని వాటిని కాల్చి వేశారు. -
మారింది స్థావరాలే !
అమ్మకాలు మాత్రం ఆగలేదు.. భారీగా గుట్కా, ఖైనీ విక్రయాలు స్టాక్ పాయింట్లను పట్టించుకోని అధికారులు చిరువ్యాపారులపైనే పోలీసుల దాడులు హన్మకొండ : 2016 జూన్ 20న పరకాలలో గుట్కాలు నిల్వ చేసిన ఇంటిపై పోలీసులు దాడి చేసి రూ.లక్ష విలువైన గుట్కాలు, ఖైనీలు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత వా రం వ్యవధిలోనే జూన్ 27న వర్ధన్నపేటలో పోలీసుల దాడి లో రూ. 1.5 లక్షల విలువైన గుట్కాలు లభ్యమయ్యూరుు. ఇ లా పోలీసుల వరుస దాడులు చేపడుతున్నా గుట్కా అమ్మకా లు తగ్గడం లేదు. గుట్కా అక్రమ వ్యాపారంలో పెద్దలను వ దిలి చిరువ్యాపారులపై దాడులు జరుగుతుండటంతో ఆశిం చిన ఫలితం రావడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గుట్కా వ్యాపారానికి స్టాకిస్టు(నిల్వ చేసేవారు) కేంద్ర బిందువులుగా వ్యవహరిస్తున్నారు. గుట్కాలు, ఖైనీలను పెద్ద ఎత్తున నిల్వ చేస్తూ జిల్లా నలుమూలకు సరఫరా చేస్తున్నారు. తనిఖీ చేసే అధికారులు స్టాకిస్టు పాయింట్లపై దృష్టి సారించకుండా చిన్నచిన్న కిరాణ షాపులపై దాడులు చేసి సరిపెడుతున్నారు. దీంతో గుట్కా అమ్మకాలు తగ్గడంలేదు. వరంగల్ కేంద్రంగా.. జిల్లాలో గుట్కా క్రయవిక్రయాలకు వరంగల్ నగరం ప్రధాన కేంద్రంగా ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి గుట్కాలను పెద్ద ఎత్తున రాత్రి వేళలో హైదరాబాద్, విజయవాడ నుంచి వరంగల్ నగరానికి చేరుస్తున్నారు. ఇలా చేరిన గుట్కా, ఖైనీ, పాన్మసాలను గతంలో వరంగల్ బీట్బజారు, పిన్నావారి వీధిలో ప్రధానంగా నిల్వ చేసేవారు. పోలీసుల దాడుల నేపథ్యంలో నగరం మధ్య నుంచి శివారు ప్రాంతాల్లో అనుబంధ గోదాములను ఏర్పాటు చేసుకుని అక్కడ నిల్వ చేయడం ఆరంభించారు. ఆ పారుుంట్ల నుంచి జిల్లా నలుమూలలకు ‘మాల్’ను సరఫరా చేస్తున్నారు. ఏ ఒక్క చోట పర్మినెంట్‌గా గుట్కాలను నిల్వ చేయకుండా తరుచుగా అడ్డా మారుస్తూ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. జిల్లాలో ఇతర ప్రాంతాలకు సరఫరా చేసేందుకు కాశిబుగ్గ, ధర్మారం, కరీమాబాద్ ప్రధాన రహదారులకు సమీపంలో గోదాములు ఏర్పాటు చేశారు. గుట్కాలు, ఖైనీలు పెద్ద ఎత్తున నిల్వ చేస్తున్న గోదాములను వదిలేసి పోలీసులు చిరువ్యాపారులపైనే తమ ప్రతాపం చూపిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. గుట్కా వ్యాపారుల నుంచి పోలీసుశాఖకు నెలవారీ మాముళ్లు అందుతున్న ఫలితంగానే గోదాములపై దాడులు జరగడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొత్త అడ్డాలివే.. విజయవాడ వైపు నుంచి రాత్రి వేళ వచ్చే గుట్కాలు, ఖైనీల ను నాయుడు పంపు జంక్షన్, మామూనూరు సమీపంలో జాతీయ రహదారికి పక్కన ఉన్న గోదాములు, ఇళ్లలో తాత్కాలికంగా నిల్వ చేస్తున్నారు.కాజీపేట సమీపంలో సోమిడి వద్ద గతంలో గుట్కా వ్యాపారుల గోదాం ఉండేది. ఈ విషయం బయటకు పొక్కడం, తరచుగా దాడులు జరుగుతుండటంతో వ్యాపారులు ఇటీవలహన్మకొండ, భీమారం సమీపానికి అడ్డాలు మార్చారు. వరంగల్ బీట్బజార్ను అడ్డాగా చేసుకున్న గుట్కా వ్యాపారులు అనుబంధ స్టాక్ పాయింట్‌ను ఎల్లంబజార్‌లో ఏర్పాటు చేశారు. డిమాండ్‌ను బట్టి స్టాక్ తీసుకొచ్చి కిరాణ సరుకులతో కలిపి చిరు వ్యాపారులకు విక్రయిస్తున్నారు.ములుగు, భూపాలపల్లి, పరకాల వైపు ట్రాన్స్పోర్ట వాహనాల్లో గుట్కాను సరఫరా చేసే వ్యాపారులు కాశిబుగ్గ ప్రాం తంలో నిల్వ కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నారు. నర్సంపేట, మహబూబాబాద్ వైపు గుట్కాలు సరఫరా చే సే వ్యాపారులు గీసుగొండ మండలం ధర్మారం సమీపం లో కొత్తగా స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేసుకున్నారు. -
20 బస్తాల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం
అక్రమంగా దాచి ఉంచిన గుట్కా స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 20 బస్తాల గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన అనంతపురం పట్టణంలోని ఆర్కే నగరంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానిక ఆర్కే నగర్‌లోని ఓ ఇంట్లో అక్రమంగా గుట్కా ప్యాకెట్లను నిల్వ ఉంచారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు 20 బస్తాల గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకన్నారు. -
రూ.5.50 లక్షల గుట్కా స్వాధీనం
గుంటూరు ఆటోనగర్‌లో పోలీసులు భారీ మొత్తంలో గుట్కా, ఖైనీని స్వాధీనం చేసుకున్నారు. తమకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు సీఐ శేషారావు ఆధ్వర్యంలో పెద్దకాకాని పోలీసులు శనివారం ఉదయం ఆటోనగర్‌లోని ఓ గోదాముపై దాడి చేశారు. గోదాములో ఉన్న రూ.5.50 లక్షల విలువైన గుట్కా, రాజా ఖైనీని స్వాధీనం చేసుకున్నారు. విజయవాడకు చెందిన గోదాము యజమాని ఉడతా రాజశేఖర్‌పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
7 బస్తాల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం
అక్రమంగా దాచి ఉంచిన గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఇస్లాంపూర వీధిలో ఉన్న రాజూ కిరాణ దుకాణంలో శనివారం సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో దుకాణంలో అక్రమంగా దాచిన 7 బస్తాల గుట్కా ప్యాకెట్లు లభ్యమయ్యాయి. వీటిని పోలీసులు సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న గుట్కా ప్యాకెట్ల విలువ సుమారూ రూ. లక్ష వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా ఎవరినీ అరెస్టు చేయలేదు. -
రూ.1.50 లక్షల విలువైన గుట్కా స్వాధీనం
బేతంచర్ల: కర్నూలు జిల్లా బేతంచర్లలో అక్రమంగా తరలిస్తున్న 72 వేల గుట్కా ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు. బనగానిపల్లెకు చెందిన మారేపాటి నందీశ్వరుడు కొన్ని రోజులుగా చుట్టుపక్కల ప్రాంతాలకు గుట్కా ప్యాకెట్లను అక్రమంగా సరఫరా చేసి విక్రయిస్తున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు, సీఐ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో వాహన తనిఖీలు ప్రారంభించారు. నందీశ్వరుడు ఆటోలో గుట్కా ప్యాకెట్లతో డోన్ వైపు వెళ్తుండగా బేతంచర్ల వద్ద పట్టుకున్నారు. నిందితుడితో పాటు మొత్తం రూ.1.50 లక్షల విలువైన 72,800 గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. -
రూ. 5లక్షలు విలువ చేసే గుట్కా స్వాధీనం
ఆమదాలవలస : మండలంలోని కొత్తరోడ్ సమీపంలో శుక్రవారం రాత్రి ఆమదాలవలస సీఐ డి.నవీన్‌కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన దాడుల్లో సుమారు రూ. 5లక్షలు విలువ చేసే గుట్కా బండిల్స్‌ను ఎస్ఐ కె.గోవిందరావు, పోలీసు సిబ్బంది పట్టుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. నరసన్నపేటకు చెందిన జామి సంతోష్, శ్రీకాకుళం మండలం గురుగుబెల్లికి చెందిన వారణాసి కృష్ణ, ఆమదాలవలసకు చెందిన గుడ్ల హరిప్రసాద్ ఒడిశా నుంచి శ్రీకాకుళానికి ప్రైవేటు బస్సులో సుమారు ఐదు లక్షలు విలువ చేసే 17 బండిల్స్ గుట్కాను తరలిస్తున్నారు. ఆమదాలవలస సీఐకు వచ్చిన సమాచారం ప్రకారం ఆయన నిఘా వేసి ఒడిశా నుంచి వచ్చిన బస్సును గమనించి కొత్తరోడ్ సమీపంలో ఆ సరుకును దింపించి వారిని అదుపులోకి తీసుకున్నామని సీఐ తెలిపారు. పట్టుపడ్డ సరుకును, వ్యక్తులను ఫుడ్ ఇన్స్పెక్టర్కు అప్పగిస్తామని సీఐ చెప్పారు. పట్టుపడ్డ బండిల్స్‌ను ప్రయివేటు ఆటోలలో ఆమదాలవలస పోలీస్‌స్టేషన్‌కు తరలించి స్టేషన్లో ఉంచామని సీఐ తెలిపారు. అదే విధంగా శ్రీకాకుళం ఫుడ్ ఇన్స్పెక్టర్ ఎస్.ఈశ్వరి ఆధ్వర్యంలో ఆమదాలవలస పట్టణంలో శుక్రవారం నిర్వహించిన దాడుల్లో రెండు దుకాణాల్లో సుమారు రూ. 17వేలు విలువ గల గుట్కాలను పట్టుకున్నామని తెలిపారు. ఆ దుకాణాల్లో అక్రమ నిల్వలు ఉన్నట్లు వచ్చిన సమాచారం మేరకు దాడులు నిర్వహించామని ఆమె తెలిపారు. నిల్వలున్న వ్యాపారులను శ్రీకాకుళం జేసీ కోర్టులో హాజరు పరుస్తామని వివరించారు. -
రూ. లక్ష విలువైన గుట్కాలు పట్టివేత
పాలకొల్లు : పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండల సంతలపూడేరు గ్రామ సమీపంలో అక్రమంగా తరలిస్తున్న రూ. లక్ష విలువ చేసే గుట్కాను పోలీసులు పట్టుకున్నారు. వివరాలు.. భీమవరం నుంచి పాలకొల్లుకు అక్రమంగా గుట్కాను తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో భీమవరం-పాలకొల్లు రోడ్డులో తనిఖీలు నిర్వహించి గుట్కాను తరలిస్తున్న వ్యాన్‌ను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వ్యాన్‌ను సీజ్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పొగాకు ఉత్పత్తులపై నిషేధం విధించిన ఢిల్లీ సర్కారు
సాక్షి, న్యూఢిల్లీ: గుట్కా, ఖైనీ, జర్దాతో పాటు అన్ని పొగాకు ఉత్పత్తులపై ఢిల్లీ సర్కారు నిషేధం విధించింది. ఢిల్లీలో పొగాకు ఉత్పత్తుల అమ్మకం, కొనుగోలు, నిల్వలపై ఆరోగ్య విభాగం విధించిన నిషేధం సోమవారం నుంచి అమల్లోకి రానుంది. ఈ నిషేధం ఏడాది పాటు అమల్లో ఉంటుంది. నిషేధాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు చేపడతామని అధికారులు చెప్పారు. -
రూ. 11 లక్షల విలువైన గుట్కాలు పట్టివేత
విజయనగరం : అక్రమంగా తరలిస్తున్న గుట్కా, ఖైనీల లోడును పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటన శుక్రవారం తెల్లవారుజామున విజయనగరం జిల్లా బొమ్మలక్ష్మిపురం మండలంలో చోటు చేసుకుంది. వివరాలు..ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ఓ లారీలో గంగాం జిల్లా నుంచి కొరాపూర్ జిల్లాకు గుట్కా, ఖైనీలను రాష్ట్రం గుండా అక్రమంగా తర లిస్తున్నారు. గురువారం అర్ధరాత్రి పోలీసులు తనిఖీలు నిర్వహించగా గుట్కా లోడు బయటపడింది. అనంతరం లారీని సీజ్ చేసి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. స్వాధీనం చేసుకున్న లోడ్ విలువ దాదాపు రూ.11 లక్షలు ఉండవచ్చని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. (బొమ్మలక్ష్మిపురం) -
రూ.10 లక్షల విలువైన గుట్కాలు స్వాధీనం
బనగానపల్లె: పట్టణంలో హోల్‌సెల్ గుట్కా వ్యాపారం నిర్వహిస్తున్న సుబ్రమణ్యం, ప్రసాద్, దత్తుల నుంచి ఆదివారం రూ.10 లక్షల విలువ గల గుట్కాలను స్వాధీనం చేసుకున్నారు. వారిపై పంచనామ నమోదు చేసినట్లు బనగానపల్లె సీఐ శ్రీనివాసులు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం స్థానిక పోలీసు స్టేషన్లో ఎస్ఐ మంజునాథ్‌తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ మాట్లాడారు. బనగానపల్లెలో పెద్ద ఎత్తున గుట్కా వ్యాపారం సాగుతున్నట్లు తెలిసిందన్నారు. ఈ మేరకు పలు గౌడోన్లపై దాడులు జరిపి గుట్కాలను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. గుట్కాలతో పాటు నమోదు చేసిన పంచనామను ఫుడ్ఇన్స్పెక్టర్కు అందజేస్తున్నామన్నారు. విచారణ తర్వాత జిల్లా జాయింట్ కలెక్టర్ వీరికి నిబంధనల మేర జరిమానా విధిస్తారని తెలియజేశారు. మూడు రోజుల క్రితమే మరో రూ.10 లక్షల విలువ గల గుట్కాలు ఇతర ప్రాంతాలకు రవాణ జరిగినట్లు సమాచారం అందిందన్నారు. వాటిపై కూడా దర్యాప్తు జరుపుతున్నామన్నారు. గుట్కా రవాణా ఎక్కువగా ట్రాన్స్‌పోర్టుల ద్వారా జరుగుతోందని తెలిపారు. గుట్కాలు ట్రాన్స్‌పోర్టులో లభిస్తే వారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గుట్కా, మట్కా, పేకాట, జూదాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. -
ప్రజల చెంతకే పోలీసు వ్యవస్థ
నెల్లూరు(క్రైమ్): పోలీసు సేవలను ప్రజలకు మరింత దగ్గర చేస్తున్నామని ఎస్పీ ఎస్.సెంథిల్‌కుమార్ వెల్లడించారు. నెల్లూరులోని ఉమేష్‌చంద్ర మెమోరియల్ కాన్ఫరెన్స్ హాలులో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పోలీసుల సేవలను మరింత విస్తృతం చేసి ప్రజలకు మెరుగైన శాంతిభద్రతలను అందేలా చర్యలు చేపట్టామన్నారు. అసాంఘిక శక్తుల ఆగడాలను పూర్తిగా నిర్మూలించేందుకు చేపట్టిన చర్యల్లో ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. తమ ప్రాంతాల్లో ఎర్రచందనం అక్రమ రవాణా, గుట్కా, మట్కా, క్రికెట్ బెట్టింగ్, ఈవ్‌టీజింగ్, ర్యాగింగ్, వ్యభిచారం, రౌడీయిజం, అరాచకశక్తుల ఆగడాలపై ప్రజలు నేరుగా ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదన్నారు. వారి కోసం 94946 26644 నంబర్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఈ నంబర్ 24 గంటలూ అందుబాటులో ఉంటుందన్నారు. ఏదేని సమాచారాన్ని ఎస్ఎంఎస్, వాట్సాప్ ద్వారా కూడా తెలియజేయవచ్చన్నారు. మిస్డ్ కాల్ ఇచ్చినా వెంటనే తమ సిబ్బంది కాల్ చేసి సమాచారం తీసుకుంటారన్నారు. ఫేస్‌బుక్‌లోని ‘నెల్లూరు పోలీసు’కు సమాచారం ఇవ్వవచ్చన్నారు. సమాచారం ఇచ్చే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. నేరరహిత సమాజ ఏర్పాటులో భాగస్వాములు కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పోలీసు అధికారులు, సిబ్బంది సైతం దీనిపై విసృ్తత ప్రచారం కల్పించాలన్నారు. ఇప్పటికే డయల్ 100, 1090, నెల్లూరు పోలీసు ఫేస్బుక్ అకౌంట్‌కు అనేక ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. వాటిని పరిశీలించి కేసులు సైతం నమోదు చేస్తున్నామన్నారు. 94946 26644నంబర్‌కు తప్పుడు ఫిర్యాదులు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ఫోన్ నంబర్ సేవలకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏఎస్పీ రెడ్డి గంగాధర్‌రావు, డీఎస్పీలు బి.వి రామారావు, వీఎస్ రాంబాబు, శ్రీనివాసరావు, మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
గుట్కా రవాణాకు రాచబాట!
నగరమే అడ్డా ఎస్ఓటీ, టాస్క్‌ఫోర్స్ దాడుల్లో చిక్కుతున్న రూ.కోట ్ల సరుకు కాసుల మత్తులో ఖాకీలు, ఫుడ్ ఇన్స్పెక్టర్లు కేసు నమోదు చేయని సీఐలు చలానాతో వదిలేస్తున్న ఫుడ్ ఇన్స్పెక్టర్లు సాక్షి, సిటీబ్యూరో: నిషేధిత గుట్కా తయారీ వ్యాపారం నగరం, శివార్లలో జోరుగా సాగుతోంది. కోట ్ల ఖరీదు చేసే లారీల కొద్దీ సరుకు పోలీసుల కనుసన్నల్లో రాష్ట్రం దాటిపోతోంది. దీనిపై కన్నేసిన సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ), నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేసి పట్టుకుంటున్నా.. ఇంతవరకు ఒక్క కేసూ నమోదు కాలేదంటే ఏ మేరకు ‘చేతులు తడిపి’ ఉంటారో అర్థం చేసుకోవచ్చు. పట్టుబడిన ప్రతిసారి గుట్కా ప్యాకెట్ల విలువ రూ.లక్షల్లో ఉంటే దానిని వేలల్లో చూపించి చలానా విధించి వదిలేస్తున్నారు. కాసులకు పోలీసులు, ఫుడ్ ఇన్స్పెక్టర్లు దాసోహమవడంతో తయారీదారులు, సరఫరాదారులు తమ దందా యథేచ్ఛగాసాగిస్తున్నారు. చట్టంలో ఉన్న లొసుగును ఆసరాగా చేసుకుని తమ అక్రమాలకు మార్గం సుగమం చేసుకుంటున్నారు. ఇలా పట్టుకుంటారు.. అష్ట కష్టాలకోర్చి ఎస్ఓటీ, టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడిచేసి పట్టుకున్న అక్రమార్కులను గ్రేటర్ ఫుడ్ ఇన్స్పెక్టర్లు, ఎస్హెచ్ఓలు చట్టంలోని లొసుగులను ఆసరా చేసుకుని వదిలేస్తున్నారు. ఇందుకు వారిని తయారీదారులు సంతృప్తి పరుస్తున్నారు. ఎస్ఓటీ, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది ఇన్ఫార్మర్లకు భరోసా ఇచ్చి, వారిచ్చిన సమాచారం మేరకు లారీల్లో రహస్యంగా గుట్కా ప్యాకెట్లు సరఫరా అవుతున్న సమయంలో దాడులు చేసి పట్టుకుంటున్న సంఘటనలు సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్లలో కొల్లలుగా ఉన్నాయి. పట్టుబడిన లారీలు, డ్రైవర్లను వీరు ఆయా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్లకు అప్పగిస్తారు. దీనిపై ఆయా ఇన్స్పెక్టర్లు.. గుట్కా ప్యాకెట్లు ఎక్కడి నుంచి ఎక్కడికి సరఫరా అవుతున్నాయి. ప్రధాన సూత్రధారి ఎవరు, తయారీ ఎక్కడ తదితర అంశాలపై దర్యాప్తు చేయాలి. అనంతరం యంత్రాలను సీజ్‌చేసి, కేసు నమోదు చేసి కోర్టుకు అప్పగించే అధికారం ఉంది. కానీ సంబంధిత ఇన్స్పెక్టర్లు ‘గుట్కా ఫుడ్ ఐటం’ అన్న కారణంతో అంశాన్ని ఫుడ్ ఇన్స్పెక్టర్లకు అప్పగించి చేతులు దులుపుకుంటున్నారు. నిందితుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని ఇలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. నెల క్రితం శంషాబాద్ పరిధిలో ఓ ఇన్స్పెక్టర్ గుట్కా తయారీ దారుడి నుంచి రూ.10 లక్షలు తీసుకుని వదిలిపెట్టినట్టు ఆరోపణలున్నాయి. అలా వదిలిపెడతారు.. ఎస్ఓటీ, టాస్క్‌ఫోర్స్ పోలీసుల నుంచి స్థానిక ఇన్స్పెక్టర్కు అక్కడి నుంచి జీహెచ్ఎంసీ ఫుడ్ ఇన్స్పెక్టర్ వద్దకు గుట్కా కేసు వచ్చి చేరుతుంది. ఇక్కడ కూడా అధికారులు కాసులకు లొంగిపోయి లక్షల ఖరీదు చేసే ప్యాకెట్లు పట్టుబడితే కేవలం వేలల్లో పట్టుబడినట్లు దొంగ లెక్కలు చూపించి చలానాలు కట్టించుకుని వదిలి పెడుతున్నారు. గుట్కా తయారీ, సరఫరాలో ముంబై మాఫియా హస్తం ఉన్నట్టు సమాచారం. తయారీ దారులు కోట్లాది రూపాయల గుట్కా ప్యాకెట్లను నగరం, శివార్లతో తయారు చేసి ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. వందల సార్లు లారీల సరుకు నగరం దాటుతుంటే ఒకసారి పోలీసులకు చిక్కుతారు. ఇక్కడా వారు చలానా చెల్లించి దర్జాగా వెళ్లిపోతున్నారు. ఇందులోనూ కేసు లేదు, దర్యాప్తు ఉండదు.. శిక్ష అసలే లేదు. లోపం ఎక్కడుందో ఉన్నతాధికారులకే తెలియాలి. పెండింగ్‌లో 100కుపైగా కేసులు... పోలీసు శాఖలోని రెండు విభాగాల నుంచి చివరకు జీహెచ్ఎంసీకి చేరిన సుమారు 100 ‘గుట్కా’ కేసులు నేటికీ పెండింగ్‌లో ఉన్నాయి. నిందితులు గత ఆరు నెల లుగా దర్జాగా బయటే తిరుగుతున్నా.. అధికారులు వీరి వద్ద నుంచి చలాన్ కూడా కట్టించలేకపోయారు. అసలు చలానా ఎంత కట్టాలనేది కూడా అధికారులు నిర్ణయించలేదు. ఈ కేసులలో గుట్కాలను తరలిస్తున్న వాహనాల (లారీలు, ఆటోలు, ద్విచక్ర)ను సైతం జీహెచ్ఎంసీ అధికారులు విడిచిపెట్టారు. వాహనాలను సీజ్ చేసే అధికారం తమకు లేదని జీహెచ్ఎంసీ అధికారులంటున్నారు. నిషేధిత వస్తువులు తరలిస్తున్న వాహనాలను పట్టుకొని వెంట నే విడిచిపెట్టేస్తుండటంతో కొందరు నిర్భయంగా ఈ దం దాను కొనసాగిస్తున్నారు. గుట్కాలను సరఫరా చేస్తున్న అక్రమార్కులపై జీహెచ్ఎంసీ అధికారులు ‘2006- ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారటీ ఆఫ్ ఇండియా-రూల్స్ మేక్-2011 గుట్కా యాక్ట్’ కింద కేసులు నమోదు చేస్తున్నారు. ఈ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినా నిందితులను జైలుకు పంపే అవకాశం లేదు. కేవలం జాయింట్ కలెక్టర్ ఎదుట హాజరుపర్చి జరిమానా మాత్రమే విధిస్తారు. ఇదే నిందితులకు వరంగా మారింది. -
యథేచ్ఛగా గుట్కా విక్రయాలు
- లోపించిన అధికారుల నిఘా - రెట్టింపు ధరలతో విక్రయం బాన్సువాడ : ప్రాణాంతకంగా మారిన గుట్కా, పాన్‌మసాల విక్రయాన్ని ప్రభుత్వం నిషేధించినప్పటికీ, గుట్టుచప్పుడుకాకుండా యథేచ్ఛగా గుట్కా విక్రయాలు సాగుతున్నాయి. గుట్కా నిర్ణీత ధరకు రెండింతలు పెంచి విక్రయిస్తున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవడంలో సంబంధిత అధికార యంత్రాంగం విఫలమవుతుండడంతో బ్లాక్ మార్కెట్ విస్తరించింది. జిల్లాలో గుట్కా, పాన్ మసాలా బ్లాక్ మార్కెటింగ్ నిత్యం రూ. 5 లక్షలకు పైగా అమ్మకాలు జరుగుతున్నాయి. పట్టించుకోవాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారు. వాణి జ్య పన్నుల శాఖ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, పోలీసులు, విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గుట్కా విక్రయాలను అరికట్టాల్సి ఉంది. అలాగే మున్సిపాలిటీల్లో మున్సిపల్ హెల్త్ అధికారులు దాడి చేయాలి. కానీ ఈ అధికారులు కన్నెత్తి చూడడం లేదు. గుట్కా హోల్‌సెల్ వ్యాపారుల నుంచి నెలవారీ మామూళ్లు అధికారులకు అందుతున్నాట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గుట్కా, పాన్‌మసాలా లాంటి పొగాకు ఉత్పత్తులు క్యాన్సర్‌తోపాటు పలు రకాల రోగాలకు కారణమవుతున్నాయని భావించి ప్రభుత్వం గతేడాది జనవరి 15 నుంచి వీటి విక్రయాలను నిషేధించింది. అయితే ఉన్న గుట్కా స్టాకును విక్రయించుకొనే పేరుతో వ్యాపారులు అక్రమ అమ్మకాలు చేస్తున్నారు. గుట్కా, పాన్ మసాలాకు అలవాటుపడిన వారి బలహీనతలను ఆసరాగా చేసుకొని అసలు ధర కంటే రెండు, మూడు రేట్లు అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. గుట్కా, పాన్ మసాలాలను హైదరాబాద్‌తోపాటు మహారాష్ట్రాలోని నాందేడ్, దెగ్లూర్, కర్ణాటకలోని ఔరాద్ తదితర ప్రాంతాల నుంచి స్థానికంగా కొంత మంది హోల్‌సేల్ వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నారు. వీరి నుంచి జిల్లాలోని మండల కేంద్రాలు, గ్రామాల్లోని పాన్ షాపులకు సరఫరా అవుతోంది. బాన్సువాడ, బోధన్ పట్టణాల్లో నిలువ చేస్తూ పరిసర మండలాలకు ఆటోలు, మోటర్ సైకిళ్లపై అతి రహస్యంగా చేరవేస్తున్నారు. రాత్రి వేళ నల్ల ప్లాస్టిక్ కవర్లలో గుట్కాలు వేసుకొని వారికి చేరవేస్తారు. పాన్ షాపుల్లో గుట్కాలను బయటవారి కంట పడనీయకుండా రహస్యంగా విక్రయిస్తున్నారు. నిజామాబాద్ నగరంలోని అహ్మదీ బజార్లో రహస్యంగా హోల్ సెల్ విక్రయాలు సాగుతున్నట్లు సమాచారం. అక్రమంగా దిగుమతి చేసుకున్న నిషేధిత కంపెనీల గుట్కాలు, పాన్‌మసాలా ప్యాకెట్లను అసలు ధరకన్నా రెండు మూడు రేట్లు అధిక ధరకు విక్రయిస్తున్నారు. గతంలో రూ. 1.50 ధర ఉన్న గుట్కా ప్రస్తుతం రూ. 5, రూ. 3 ఉన్న గుట్కా ప్యాకెట్‌ను ప్రస్తుతం రూ. 8, రూ. 4 విలువ గల గుట్కా రూ. 10, రూ. 10 ఉండే రకం రూ. 20కు విక్రయిస్తున్నారు. కాగా గుట్కాకు అలవాటు పడిన వారు ధర ఎక్కువైనా కొనుగోలు చేస్తున్నారు. దీన్ని అసరాగా చేసుకొని హోల్‌సెల్ వ్యాపారులు, పాన్‌షాపుల యజమానులు యథేచ్ఛగా దోచుకొంటున్నారు. గుట్కా విక్రయాలు విచ్చలవిడిగా సాగుతున్నా, సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా యువత గుట్కా వ్యసనానికి అలవాటు పడి తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. వాటిలో ఉండే పలు రసాయనాల ప్రభావంతో క్యాన్సర్‌తోపాటు ఇతర ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గుట్కా విక్రయాలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
క్షయవ్యాధి నివారణకు పాటుపడాలి
నల్లగొండ టౌన్, న్యూస్‌లైన్,సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్క రూ క్షయవ్యాధి నివారణకు పాటుపడాలనికలెక్టర్ టి.చిరంజీవులు పిలుపునిచ్చారు. ప్రపంచ క్షయ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం జిల్లా కేంద్ర వైద్యశాలలో క్షయ నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్ర జల భాగస్వామ్యం, డాక్టర్ల అంకితభావంతో పనిచేస్తే క్షయవ్యాధిని సంపూర్ణ ంగా నిర్మూలించవచ్చునన్నారు. మసూ చీ, ప్లేగు, పోలియో వ్యాధులను శాశ్వతంగా నిర్మూలించగలిగామన్నారు. కానీ ప్రజలను చైతన్యపరచని కారణంగా మలేరియా, పైలేరియా, క్షయ వ్యాధుల ను నిర్మూలించలేకపోతున్నామని విచా రం వ్యక్తం చేశారు. పౌష్టికాహార లోపం, అవగాహన రాహిత్యం కారణంగా క్షయవ్యాధి పెరిగిపోతుందన్నారు. కొన్ని రకా ల వృత్తులు కూడా క్షయ, ఇతర అంటురోగాలకు కారణమవుతున్నాయని చె ప్పారు. సిగరేట్, గుట్కా, పొగాకు ఇత ర వ్యసనాలు విడిచి పౌష్టికాహారాన్ని తీసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఆర్ఎంపీలు నిజ మైన వైద్య సేవలు అందించాలన్నారు. సేవాభావంతో పనిచేసే ఆర్ఎంపీలకు సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ పి.ఆమోస్ మాట్లాడుతూ ప్రపంచంలోనే చైనా తర్వాత ఇండియా క్షయవ్యాధిలో 2వ స్థానంలో ఉందన్నారు. జిల్లాలో ఇప్పటికే గుర్తించిన 4 వేల మంది రోగులకు వైద్య సౌకర్యం అంది స్తున్నట్లు తెలిపారు. అనంతరం క్షయవ్యాధి నియంత్రణకు సహకరించిన అధికారులకు, సిబ్బందికి కలెక్టర్ మెమోంటో, ప్రశంసపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ అరుంధతి, డీఐఓ డాక్టర్ ఎబీనరేంద్ర, అడిషనల్ డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ విజయ్‌కుమార్, డీసీహెచ్ఎస్ డాక్టర్ హరినాథ్, డాక్టర్ గౌరి శ్రీ, డెమో తిరుపతయ్య పాల్గొన్నారు. -
రూ.లక్ష విలువైన ఖైనీ, గుట్కాల పట్టివేత
గజపతినగరం, న్యూస్‌లైన్:నిషేధిత ఖైనీ,గుట్కాల వ్యాపారం చేస్తున్న గజ పతినగరంలోని అమృతస్వీట్ షాపు యజమాని సరుకును పోలీసులు గురువారం సీజ్ చేశారు. షాపు యజ మాని రాము విజయనగరంనుంచి సుమారు రూ.లక్ష విలువైన ఖైనీ, గుట్కాలను తెస్తుండగా స్థానికులు పట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదు విషయంలో తమకు సంబంధంలేదని ఆహారకల్తీ నిరోధక శాఖ అధికారులకు తెలియపరచాలని పోలీసులు చెప్పడంతో విజయనగరానికి చెందిన ఫుడ్ ఇన్స్పెక్టర్ వీరభద్రరావుకు స్థానికులు సమాచారం అందజేశారు. పట్టుబడిన గుట్కాలు, ఖైనీలను పోలీ సులు స్వాధీనం చేసుకుని పంచనామా జరిపిన తరువాతే తాము చర్యలు తీసుకోగలమని ఫుడ్ ఇన్స్పెక్టర్ తెలిపారు. ఇలా ఈ రెండు శాఖల అధికారుల మధ్య సుమారు రెండు గంటల పాటు హైడ్రామా నడించినప్పటికీ ఏ ఒక్క అధికారీ సంఘటనా స్థలానికి రాలేదు. వ్యాపారులకు అధికారుల మద్దతు ఉండడంతోనే ఈ అక్రమ వ్యాపారాలకు అడ్డుఅదుపూ లేకుండా పోతోం దని స్థానికులు అగ్రహం వ్యక్తం చేశారు. చివరకు ఎస్ఐ టి.కామేశ్వరరావు అమృత షాపులో ఉన్న రెండు బస్తాల ఖైనీ, గుట్కాలను స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీనిపై ఫుడ్ ఇన్స్పెక్టర్ను వివరణ కోరగా తాను విజయనగరంలో కోర్టుకు హాజరు కావాల్సి ఉన్నందున గజపతినగరం రాలేనని స్థానిక పోలీసలు కేసు నమెదు చేసి పంచనామా జరిపిన తరువాత చట్టపరమైన చర్యలు తీసుకోగలనన్నారు. -
పేరుకే నిషేధం జోరుగా గుట్కా అమ్మకాలు
గుట్కా అమ్మకంపై నిషేధం పేరుకే పరిమితమవుతోంది. అక్రమార్కులు అండమాన్ నికోబార్ దీవుల నుంచి గుట్టుగా గుట్కాను దిగుమతి చేసుకుంటున్నారు. యథేచ్ఛగా అమ్మకాలు సాగిస్తున్నారు. నెలన్నర వ్యవధిలో 251 టన్నుల గుట్కా పట్టుబడడమే ఇందుకు నిదర్శనం. చెన్నై, సాక్షి ప్రతినిధి: ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం రాష్ట్రంలో గుట్కా క్రయవిక్రయూలపై నిషేధం విధించింది. గుట్కా అమ్మకం, నిల్వ, ఉత్పత్తి, పంపిణీ అన్నీ నిషేధం కిందకు వస్తాయని స్పష్టం చేసింది. ఈ నిషేధం ఆరు నెలల నుంచి అమలులో ఉంది. అధికారులు అడపాదడపా దాడులు చేస్తున్నారు. అయితే అక్రమమార్గాల్లో టన్నుల కొద్దీ సరుకు చెన్నైకి చేరుతూనే ఉంది. అనేక సిగరెట్, కిళ్లీ బంకుల్లో గుట్కా అమ్మకాలు గుట్టుగా సాగిపోతున్నాయి. చెన్నైలోని ఒక హార్బర్, శివారు ప్రాంతమైన ఎన్నూరులోని మరో హార్బర్ గుట్కా స్మగ్లింగ్‌కు అడ్డాగా మారాయి. అండమాన్ నికోబార్ దీవుల్లో గుట్కా అమ్మకాలపై నిషేధం లేదు. దీంతో అక్రమార్కులు టూరిస్టు వీసాలతో అక్కడికి వెళ్లి భారీ మొత్తంలో సరుకును హార్బర్లకు బుక్ చేసి చెన్నైకి చేరవేస్తున్నారు. ఈ సమాచారం అధికారుల చెవినపడడంతో నెలరోజులుగా తనిఖీలు ముమ్మురం చేశారు. గత నెల 3న 16 టన్నులు, 12న 75 టన్నుల గుట్కా అధికారుల తనిఖీల్లో పట్టుబడింది. గురువారం మధ్యాహ్నం నుంచి శుక్రవారం రాత్రి వరకు అధికారులు అవిశ్రాంతంగా వాహనాల తనిఖీ నిర్వహించారు. విశాలమైన రోడ్లను వదులకుని ఇరుకుసందుల గుండా వస్తున్న ఒక లారీని కస్టమ్స్ అధికారులు వెంబడించారు. తండియార్పేట సమీపం ఎన్నూర్ హైరోడ్డు వైద్యనాథన్ బ్రిడ్జి వద్ద లారీని తనిఖీ చేశారు. అందులో 40 కిలోల బరువుతో కూడిన అనేక గోతాం సంచుల్లో 160 టన్నుల గుట్కా దొరికింది. చెన్నై కొత్త చాకలిపేటకు చెందిన లారీ డ్రైవర్ ఎం.అరుళ్దాస్ను పోలీసులు అరెస్ట్ చేశారు. తండియార్పేటలోని హార్బర్ వేర్‌హౌస్ నుంచి సరుకును తరలిస్తున్నట్లు నిందితుడు అంగీకరించాడు. అలాగే షావుకార్పేటలో శుక్రవారం సాయంత్రం మరో టన్ను గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గుట్కాను నగర శివారు కొడుంగయూర్లో ధ్వంసం చేయనున్నట్లు అధికారులు తెలిపారు.