పాలకొల్లు : పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండల సంతలపూడేరు గ్రామ సమీపంలో అక్రమంగా తరలిస్తున్న రూ. లక్ష విలువ చేసే గుట్కాను పోలీసులు పట్టుకున్నారు. వివరాలు.. భీమవరం నుంచి పాలకొల్లుకు అక్రమంగా గుట్కాను తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో భీమవరం-పాలకొల్లు రోడ్డులో తనిఖీలు నిర్వహించి గుట్కాను తరలిస్తున్న వ్యాన్‌ను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వ్యాన్‌ను సీజ్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రూ. లక్ష విలువైన గుట్కాలు పట్టివేత
Published Thu, Apr 16 2015 1:33 PM | Last Updated on Sun, Sep 3 2017 12:23 AM
Advertisement
Advertisement