రూ.1.50 లక్షల విలువైన గుట్కా స్వాధీనం | rs.1.50 lakshs worth quid seized in betamcharla | Sakshi
Sakshi News home page

రూ.1.50 లక్షల విలువైన గుట్కా స్వాధీనం

Published Wed, Jul 15 2015 2:38 PM | Last Updated on Sun, Sep 3 2017 5:33 AM

rs.1.50 lakshs worth quid seized in betamcharla

బేతంచర్ల: కర్నూలు జిల్లా బేతంచర్లలో అక్రమంగా తరలిస్తున్న 72 వేల గుట్కా ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు. బనగానిపల్లెకు చెందిన మారేపాటి నందీశ్వరుడు కొన్ని రోజులుగా చుట్టుపక్కల ప్రాంతాలకు గుట్కా ప్యాకెట్లను అక్రమంగా సరఫరా చేసి విక్రయిస్తున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు, సీఐ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో వాహన తనిఖీలు ప్రారంభించారు. నందీశ్వరుడు ఆటోలో గుట్కా ప్యాకెట్లతో డోన్ వైపు వెళ్తుండగా బేతంచర్ల వద్ద పట్టుకున్నారు. నిందితుడితో పాటు మొత్తం రూ.1.50 లక్షల విలువైన 72,800 గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement