betamcharla
-
అబ్బురం.. సన్యాసి గుహల అందాలు
సాక్షి, బేతంచెర్ల(కర్నూలు) : బుగ్గానిపల్లె గ్రామ సమీపంలో పచ్చని అటవీ ప్రాంతంలో సన్యాసి గుహలు ప్రకృతి ప్రేమికులను అబ్బుర పరుస్తున్నాయి. ఇక్కడ పూర్వం ఓ సన్యాసి ఉండేవాడని, అందుచేత వాటికి సన్యాసి గుహలుగా పేరు వచ్చిందని గ్రామస్తులు చెబుతున్నారు. బుగ్గానిపల్లె, సిమెంట్‌నగర్, పాణ్యం మండలం కందికాయపల్లె, బనగానపల్లె మండలం రామతీర్థం ప్రజలకు తప్ప.. గుహలు ఉన్నట్లు వేరెవరికీ తెలియదు. బుగ్గానిపల్లె గ్రామం నుంచి 4 కిలో మీటర్ల దూరంలో ఉన్న అటవీ ప్రాంతంలో ఈ గుహలు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. సరైన రహదారి లేకపోయినా స్థానికులు ఏడాదికోసారైనా గుహల అందాలను చూసి సంభ్రమాశ్చర్యాలకు గురువుతున్నారు. గుహల్లో నాగశేషుని ఆకారం, రాజుల కట్టడాలు, నీరు పారుతున్నట్లుగా, జంతువుల ఆకారాలు, గాజుతో తయారైన చిత్రాలు అబ్బుర పరుస్తున్నాయి. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి, రోడ్డు సౌకర్యం కల్పించి, గుహలను అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. -
కొలుములపల్లెలో జెండా ఆవిష్కరించిన వైఎస్ జగన్
-
రాజకీయ వ్యవస్థకు విశ్వసనీయత రావాలి
-
మామూళ్లు ఇవ్వలేదని ఎస్ఐ చితకబాదాడు
-
దోపిడీ ముఠా అరెస్ట్
బేతంచర్ల (కర్నూలు) : వ్యక్తిని గాయపరిచి అతని వద్ద ఉన్న నగదును అపహరించుకుపోయిన ముగ్గురు దుండగులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 6.10 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా బేతంచర్లలో శుక్రవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 18 న బనగానపల్లి మండలానికి చెందిన నాగరాజు అనే యువకుడు బైక్‌పై డబ్బుల బ్యాగుతో వెళ్తున్న సమయంలో.. దారి కాచి అతన్ని గాయపరిచిన శ్రీనివాస్ ముఠా అతని వద్ద ఉన్న నగదుతో ఉడాయించింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు శుక్రవారం శ్రీనివాస్‌తో పాటు దారిదోపిడికి అతనికి సహకరించిన మరో ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 6.10 లక్షలను రికవరీ చేశారు. -
రూ.1.50 లక్షల విలువైన గుట్కా స్వాధీనం
బేతంచర్ల: కర్నూలు జిల్లా బేతంచర్లలో అక్రమంగా తరలిస్తున్న 72 వేల గుట్కా ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు. బనగానిపల్లెకు చెందిన మారేపాటి నందీశ్వరుడు కొన్ని రోజులుగా చుట్టుపక్కల ప్రాంతాలకు గుట్కా ప్యాకెట్లను అక్రమంగా సరఫరా చేసి విక్రయిస్తున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు, సీఐ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో వాహన తనిఖీలు ప్రారంభించారు. నందీశ్వరుడు ఆటోలో గుట్కా ప్యాకెట్లతో డోన్ వైపు వెళ్తుండగా బేతంచర్ల వద్ద పట్టుకున్నారు. నిందితుడితో పాటు మొత్తం రూ.1.50 లక్షల విలువైన 72,800 గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.