బేతంచర్ల (కర్నూలు) : వ్యక్తిని గాయపరిచి అతని వద్ద ఉన్న నగదును అపహరించుకుపోయిన ముగ్గురు దుండగులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 6.10 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా బేతంచర్లలో శుక్రవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 18 న బనగానపల్లి మండలానికి చెందిన నాగరాజు అనే యువకుడు బైక్‌పై డబ్బుల బ్యాగుతో వెళ్తున్న సమయంలో.. దారి కాచి అతన్ని గాయపరిచిన శ్రీనివాస్ ముఠా అతని వద్ద ఉన్న నగదుతో ఉడాయించింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు శుక్రవారం శ్రీనివాస్‌తో పాటు దారిదోపిడికి అతనికి సహకరించిన మరో ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 6.10 లక్షలను రికవరీ చేశారు.