గుట్కా వ్యాపారంపై పోలీసుల నిఘా | Trade quid police surveillance | Sakshi
Sakshi News home page

గుట్కా వ్యాపారంపై పోలీసుల నిఘా

Published Sat, Aug 20 2016 12:08 AM | Last Updated on Mon, Sep 17 2018 6:20 PM

Trade quid police surveillance

మంగపేట: నిషేధిత గుట్కా, అంబర్‌ పాకెట్ల వ్యాపారంపై స్థానిక పోలీసులు నిఘా పెడుతున్నారు. గుట్కాల నివార ణపై ఏటూరునాగారం సీఐ రఘుచందర్‌ ఆదేశం మేరకు ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. 
రాజుపేట, కమలాపురం తదితర గ్రామాల్లో దాడులు నిర్వహించి పలువురిని పట్టుకుని కేసు నమోదు చేశారు. కొందరు  షాపుల యజమానులు  రహస్యంగా గుట్కా వ్యాపారం నిర్వహిస్తున్నారనే పక్కా సమాచారంతో గురువారం రాత్రి మంగపేట, కమలాపురం గ్రామాల్లో గుట్కాలు విక్రయిస్తున్న  కిరా ణ షాపులపై దాడులు నిర్వహించారు. గుండా సత్యనారాయణ, కమలాపురాని కి చెందిన అనంతుల క్రిçష్ణమూర్తి, చిదురాల సతీష్‌ కిరాణ షాపుల్లో గుట్కా, అంబర్‌ ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని  కేసు నమోదు చేశారు.    
ఏటూరునాగారం : మండల కేంద్రం లోని కిరాణం షాపుల్లో ఎస్సై నరేష్‌ సిబ్బందితో ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు. మేర్గు స్వామికి చెందిన  కిరాణం షాపులో రూ.7వేల విలువైన  గుట్కాలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. గు ట్కాలు విక్రయించినట్లు తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని ఎస్సై కోరారు. వారి వివరాలు గోప్యంగా ఉంచుతామ న్నారు. గుట్కాలు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement