ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ నివాసంలో ఈడీ సోదాలపై సీఎం కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈడీ 1000 సార్లు దాడులు చేసినప్పటికీ లిక్కర్ స్కాంలో కేసులో అక్రమంగా సంపాదించినట్లు ఒక్క రూపాయి కూడా కనిపెట్టలేకపోయారని అన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల ముందు ప్రతిపక్షాలను దెబ్బతీయడానికి ప్రధాని మోదీ ప్రభుత్వం విశ్వప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు.
"Nothing will be found at his residence," Arvind Kejriwal reacts to ED's raid on Sanjay Singh
— ANI Digital (@ani_digital) October 4, 2023
Read @ANI Story | https://t.co/oTADiHIxnP#ArvindKejriwal #EDRaid #SanjaySingh pic.twitter.com/txzXtqdGgQ
'ఎంపీ సంజయ్ సింగ్ ఇంట్లోనూ ఏమీ లభించలేదు. గత ఏడాది నుంచి లిక్కర్ స్కాం అంటూ దర్యాప్తు చేస్తున్నారు. అయినా.. లిక్కర్ స్కాం అంటూ ఆరోపణలు చేస్తున్నారు. వెయ్యి సార్లు సోదాలు చేశారు.. కానీ ఏమీ లభించలేదు. త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. బీజేపీకి పరాజయం తప్పదు. ఇదే వీరికి చివరి అవకాశం' అంటూ సీఎం కేజ్రీవాల్ ధ్వజమెత్తారు.
సంజయ్ సింగ్ ఇంట్లో ఈడీ సోదాలు
ఆప్ ఎంపీ(రాజ్యసభ) సంజయ్ సింగ్‌కు చెందిన నార్త్ అవెన్యూ నివాసంలో బుధవారం ఉదయం ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మొదటి నుంచి ఈయన ఈడీ నజర్‌లో ఉన్నప్పటికీ.. ఇప్పుడు నేరుగా నివాసాల్లో తనిఖీల దాకా వెళ్లడం గమనార్హం. ఆయన ఇంట్లో కీలక పత్రాల కోసం ఈడీ సోదాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో ఢిల్లీ వ్యాపారవేత్త దినేష్ అరోరా నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. దినేష్‌ను సంజయ్ సింగ్ దగ్గరుండి మాజీ మంత్రి మనీశ్‌సిసోడియాకు కలిపించాడని ఈడీ తన అభియోగాల్లో పేర్కొంది.
బీజేపీ ఫైర్
సీఎం కేజ్రీవాల్ వ్యాఖ్యలపై అటు బీజేపీ కూడా మండిపడింది. దర్యాప్తు సంస్థలు సోదాలు చేస్తే ఆప్ నేతలకు ఎందుకు భయమైతుందని బీజేపీ నేతలు ప్రశ్నించారు. లిక్కర్ స్కాం కేసులో ఏడు నెలలుగా ఆప్ నేత మనీష్ సిసోడియా జైలులోనే గుడుపుతున్నారు.. త్వరలో మరో నేత జైలు కెళ్లబోతున్నారని ఆప్ భయపడుతోందని అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసులో కేజ్రీవాలే కింగ్ పిన్ అని ఆరోపించారు. ఆప్ సర్కారుకు వ్యతిరేకంగా బీజేపీ ఆందోళనలు చేపట్టింది.
ఇదీ చదవండి: Delhi Liquor Policy Case: ఆప్ కోసం లిక్కర్ స్కామ్ డబ్బులు.. అందుకే సంజయ్ సింగ్ ఇంట సోదాలు?
Comments
Please login to add a commentAdd a comment