సీఎం, మంత్రుల జోక్యం ఉందనడం అవివేకం: మంత్రి పొన్నం
సాక్షి, హైదరాబాద్: తాగి దొరికిన కేసులో బుకాయిస్తే తప్పు ఒప్పవుతుందని అను కోవడం పొరపాటని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. దొరికిన దొంగలు సమర్థించుకుంటూనే ప్రభుత్వాన్ని బద్‌నాం చేసే పనిలో ఉండడం దారుణమని అన్నారు. జన్వాడ ఫామ్‌హౌ జ్ ఘటనపై ఆదివారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ విషయంలో ఎలాంటి కక్ష సాధింపు చర్యలు లేవని స్పష్టం చేశారు. స్థానికుల ఫిర్యా దు మేరకు పోలీసులు దాడి చేస్తే దొరికారని చెప్పా రు.
మాదకద్రవ్యాలు తీసుకోవడం తప్పుకాదనే ధోరణిలో బీఆర్‌ఎస్ నేతలు మాట్లాడుతున్నారని, పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతీసే విధంగా విమర్శ లు చేయడం సరికాదని అన్నారు. నిజంగా నిర్దోషు లయితే నిరూపించుకోవాలని హితవు పలికారు. ఈ కేసులో ముఖ్యమంత్రి, మంత్రుల జోక్యం ఉంద నడం బీఆర్‌ఎస్ మాజీ మంత్రులు, శాసనసభ్యుల అవివేకానికి నిదర్శమని పొన్నం వ్యాఖ్యానించారు.
సమగ్ర విచారణ జరిపించాలి
జన్వాడ ఫామ్‌హౌజ్‌లో జరిగిన రేవ్‌పార్టీ, అనుమతి లేని మద్యం వినియోగం కేసులో సమగ్ర విచారణ జరిపించాలని కేటీఆర్‌కు డ్రగ్స్ టెస్ట్ చేయాలని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ ఎం.ఎ.ఫహీమ్, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఎస్.శివసేనా రెడ్డి, రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి డిమాండ్ చేశారు. జన్వాడ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత, మహిళా ప్రతినిధులు సైబరాబాద్ ఏసీపీకి ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment