మోకిలా పీఎస్‌కు చేరుకున్న రాజ్‌ పాకాల.. | Raj Pakala Will Attend Police Investigation At Mokila PS, Check More Details Inside | Sakshi
Sakshi News home page

మోకిలా పీఎస్‌కు చేరుకున్న రాజ్‌ పాకాల..

Published Wed, Oct 30 2024 7:33 AM | Last Updated on Wed, Oct 30 2024 1:33 PM

Raj pakala Will Attend Police Investigation At Mokila PS

Raj Pakala Updates..

మోకిలా పీఎస్‌కు పాకాల..

  • జన్వాడ ఫామ్‌ హౌస్‌ కేసుకు సంబంధించి పోలీసుల విచారణ కోసం రాజ్‌ పాకాల మోకిలా పీఎస్‌కు చేరుకున్నారు. 

  • తన లాయర్‌తో కలిసిన ఆయన స్టేష​న్‌కు చేరుకున్నారు. 

  • ఈ సందర్భంగా ఫామ్‌ హౌస్‌లో జరిగిన పార్టీకి సంబంధించిన పోలీసులు విచారించనున్నారు. 

👉జన్వాడ ఫామ్‌ హౌస్‌లో మందు పార్టీ కేసు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ కేసులో అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష నేతల మధ్య ఆరోపణల మాటల యుద్ధం నడిచింది. ఇక, ఈ కేసులో నేడు మోకిలా పోలీసుల వద్ద కేటీఆర్‌ బావ మరిది రాజ్‌ పాకాల విచారణను హాజరు కానున్నారు.

👉రాజ్‌ పాకాల నేడు తన అడ్వకేట్‌తో పాటుగా మోకిలా పీఎస్‌కు మధ్యాహ్నం 12 గంటలకు రానున్నారు. ఈ సందర్బంగా మందు పార్టీ కేసుపై పోలీసులు విచారణ చేపట్టే అవకాశం ఉంది. కాగా, రాజ్‌ పాకాలకు మంగళవారంతో హైకోర్టు ఇచ్చిన గడువు ముగియడంతో ఆయన నేడు విచారణకు హాజరు కానున్నారు. మరోవైపు.. మంగళవారం రాత్రి విజయ్‌ మద్దూరి నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో విజయ్‌ మద్దూరి అందుబాటులో లేకపోవడంతో ఆయన కోసం ఆరా తీస్తున్నారు. మోకిలా పోలీసులు.. అతని ఫోన్ స్వాధీనం చేసుకొనే ప్రయత్నం చేస్తున్నారు.

👉ఇదిలా ఉండగా.. జన్వాడ ఫామ్‌ హౌస్‌ మందు పార్టీ కేసులో పోలీసులు ఇప్పటికే పలువురికి నోటీసులు ఇచ్చారు. అదే విధంగా కొంతమంది స్టేట్‌మెంట్‌ కూడా రికార్డు చేశారు. ఇక, నేడు రాజ్‌ పాకాల విచారణ ఈ కేసులో కీలక మారే అవకాశం ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement