Mokila village
-
జన్వాడ కేసు: 8 గంటల పాటు ప్రశ్నించి.. రాజ్ పాకాలకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: జన్వాడ కేసులో రాజ్‌పాకాల స్టేట్మెంట్ను పోలీసులు రికార్డు చేశారు. అనంతరం ఆయనను జన్వాడ నివాసానికి పోలీసులు తీసుకెళ్లారు. మరోసారి జన్వాడ నివాసంలో సోదాలు నిర్వహించారు. అనంతరం రాజ్ పాకాలను మళ్లీ మోకిల పీఎస్‌కు తీసుకెళ్లి విచారించిన పోలీసులు.. 35(3) బీఎంఎస్ యాక్ట్ కింద నోటీసులు జారీ చేశారు. సుమారు 8 గంటల పాటు విచారించారు. విజయ్ మద్దూరి స్టేట్మెంట్ ఆధారంగా విచారణ కొనసాగింది.కాగా, రాజ్ పాకాల తన అడ్వకేట్‌తో పాటుగా మోకిలా పీఎస్‌కు వచ్చారు. రాజ్ పాకాలకు మంగళవారంతో హైకోర్టు ఇచ్చిన గడువు ముగియడంతో ఆయన నేడు విచారణకు హాజరయ్యారు. మరోవైపు.. మంగళవారం కూడా రాత్రి విజయ్ మద్దూరి నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఆయన ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.అనుమతి లేకుండా మద్యం పార్టీ నిర్వహించారనే కారణంతో రాజ్ పాకాల తోపాటు, కొకైన్ తీసుకున్నట్టు నిర్ధారణ అయిన విజయ్ మద్దూరి (56)పై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆదివారం రాత్రి విజయ్ మద్దూరికి 41 సీఆర్పీసీ కింద పోలీసులు నోటీసులు ఇచ్చి, స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు. విచారణ నిమిత్తం సోమవారం పోలీస్‌స్టేషన్‌కు రావాలని వారు సూచించినా.. ఆయన సాయంత్రం వరకు కూడా స్టేషన్‌కు రాలేదు.ఇక శనివారం రాత్రి పార్టీ నుంచి వెళ్లిపోయిన రాజ్ పాకాల అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ నేపథ్యంలో మోకిల పోలీసులు సోమవారం దర్యాప్తు కోసం రాయదుర్గంలోని రాజ్ పాకాల నివాసానికి వెళ్లారు. తాళం వేసి ఉండటంతో ఇంటి బయట నోటీసులు అతికించారు. కాగా, బుధవారం రాజ్ పాకాల విచారణకు హాజరయ్యారు. -
మోకిలా పీఎస్‌కు చేరుకున్న రాజ్ పాకాల..
Raj Pakala Updates..మోకిలా పీఎస్‌కు పాకాల..జన్వాడ ఫామ్ హౌస్ కేసుకు సంబంధించి పోలీసుల విచారణ కోసం రాజ్ పాకాల మోకిలా పీఎస్‌కు చేరుకున్నారు. తన లాయర్‌తో కలిసిన ఆయన స్టేషన్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఫామ్ హౌస్‌లో జరిగిన పార్టీకి సంబంధించిన పోలీసులు విచారించనున్నారు. 👉జన్వాడ ఫామ్ హౌస్‌లో మందు పార్టీ కేసు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ కేసులో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష నేతల మధ్య ఆరోపణల మాటల యుద్ధం నడిచింది. ఇక, ఈ కేసులో నేడు మోకిలా పోలీసుల వద్ద కేటీఆర్ బావ మరిది రాజ్ పాకాల విచారణను హాజరు కానున్నారు.👉రాజ్ పాకాల నేడు తన అడ్వకేట్‌తో పాటుగా మోకిలా పీఎస్‌కు మధ్యాహ్నం 12 గంటలకు రానున్నారు. ఈ సందర్బంగా మందు పార్టీ కేసుపై పోలీసులు విచారణ చేపట్టే అవకాశం ఉంది. కాగా, రాజ్ పాకాలకు మంగళవారంతో హైకోర్టు ఇచ్చిన గడువు ముగియడంతో ఆయన నేడు విచారణకు హాజరు కానున్నారు. మరోవైపు.. మంగళవారం రాత్రి విజయ్ మద్దూరి నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో విజయ్ మద్దూరి అందుబాటులో లేకపోవడంతో ఆయన కోసం ఆరా తీస్తున్నారు. మోకిలా పోలీసులు.. అతని ఫోన్ స్వాధీనం చేసుకొనే ప్రయత్నం చేస్తున్నారు.👉ఇదిలా ఉండగా.. జన్వాడ ఫామ్ హౌస్ మందు పార్టీ కేసులో పోలీసులు ఇప్పటికే పలువురికి నోటీసులు ఇచ్చారు. అదే విధంగా కొంతమంది స్టేట్మెంట్ కూడా రికార్డు చేశారు. ఇక, నేడు రాజ్ పాకాల విచారణ ఈ కేసులో కీలక మారే అవకాశం ఉంది. -
జన్వాడ ఫామ్ హౌస్ కేసులో మరో ట్విస్ట్!
సాక్షి, హైదరాబాద్: జన్వాడలోని ఫామ్ హౌస్‌లో రేవ్ పార్టీ వ్యవహారం తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. రేవ్ పార్టీ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణకు రాకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. దీంతో, స్పందించిన రాజ్ పాకాల.. విచారణకు హాజరయ్యేందుకు రెండు రోజులు సమయం కావాలని కోరారు.జన్వాడ ఫామ్ హౌస్ కేసుకు సంబంధించి రాజ్ పాకాలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. బీఎన్ఎస్ఎస్ 35(3) సెక్షన్ ప్రకారం మోకిల పోలీసులు నోటీసులు జారీ చేశారు. రేవ్ పార్టీ కేసుకు సంబంధించి విచారించాల్సి ఉందని.. నేడు విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొన్నారు. విచారణకు రాకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.ఈ సందర్భంగా రాజ్ పాకాల..అడ్రస్ ఫ్రూఫ్, కేసుకు సంబంధించిన ఆధారాలను సమర్పించాలని సూచించారు. అయితే, రాజ్ పాకాల.. పోలీసులకు అందుబాటులోకి రాకపోవడంతో మోకిల ఇన్స్పెక్టర్ పేరుతో ఉన్న నోటీసులను రాయదుర్గంలోని ఓరియన్ విల్లాస్‌లో ఆయన నివాసానికి అతికించారు. ఇక, పోలీసుల నోటీసుల నేపథ్యంలో హైకోర్టును రాజ్ పాకాల ఆశ్రయించారు. అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు అక్రమంగా ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలని పిటిషన్లో ఆయన కోరారు. మరోవైపు.. పోలీస్ విచారణకు హాజరు అవ్వడానికి రెండు రోజులు గడువు కావాలని న్యాయవాది ద్వారా మోకిల పోలీసులకు ఆయన లేఖ పంపారు. -
HMDA: భూములు వేలం.. హెచ్‌డీఎంకు బిడ్డర్ల ఝలక్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ)కు బిడ్డర్లు హ్యాండ్ ఇచ్చారు. హెచ్ఎండీఏ పరిధిలో ఇటీవల ఈ-వేలంలో ప్లాట్లకు పాటపాడి బిడ్డర్లు డబ్బులు చెల్లించకుండా డిఫాల్టర్లుగా మారుతున్నారు. హెచ్ఎండీఏ పరిధిలోని ఆరు లేఅవుట్లలో ఏకంగా 497 మంది డిఫాట్లర్టుగా మారడం గమనార్హం. కాగా, డబ్బులు చెల్లించేందుకు నిర్ణీత గడువు కంటే ఎaక్కువ సమయం ఇచ్చినా బిడ్డర్లు మిగతా వాయిదాలు చెల్లించలేదు. దీంతో, ఆ ప్లాట్ల ధరావతు సొమ్ము రూ.4.5 కోట్లకుపైగా హెచ్ఎండీఏ జప్తు చేసింది. వివరాల ప్రకారం.. హెచ్ఎండీఏలో ఈ-వేలంలో ప్లాట్లను దక్కించుకున్న వారిలో చాలామంది డిఫాల్టర్లుగా నిలిచారు. ఆరు లేఅవుట్లకు సంబంధించి 497 మంది చెల్లింపులు చేయలేక చేతులెత్తేశారు. వారికి నిర్ణీత గడువు కంటే మరికొంత సమయం ఇచ్చినా సొమ్ము చెల్లించలేదు. ఈ క్రమంలో చేసేదేమీ లేకపోవడంతో ఆ ప్లాట్ల ధరావతు సొమ్ము రూ.4.5 కోట్లకుపైగా హెచ్ఎండీఏ జప్తు చేసింది. ► ఇక, మోకిలలో ఇటీవల నిర్వహించిన ఈ-వేలంలో చదరపు గజం రూ.లక్ష పలకడం రియల్ ఎస్టేట్ రంగంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇలా అధిక ధరకు ప్లాట్లు దక్కించుకున్న చాలామంది డబ్బులు చెల్లించడంలో వెనకడుగు వేశారు. ఒక్క మోకిలలోనే 148 మంది వరకు డిఫాల్టర్లుగా మిగిలారు. షాబాద్‌లో 50 ప్లాట్లకుగాను కేవలం 10 మందే చెల్లింపులు చేశారు. తొర్రూరులో 504 ప్లాట్లకు 114 మంది డబ్బులు కట్టలేదు. మిగతా లేఅవుట్లలోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. ►ఆరు నెలల్లో మోకిల, మేడిపల్లి, బాచుపల్లి, బహదూర్‌పల్లి, తొర్రూరు, షాబాద్ తదితర ప్రాంతాల్లో వెయ్యికి పైగా ప్లాట్లను హెచ్ఎండీఏ వేలం వేసింది. వేలంలో పాల్గొనాలంటే ప్రతి ప్లాటుకు తొలుత రూ.లక్ష ధరావతు చెల్లించాలి. కొన్నిచోట్ల ఈ మొత్తం తక్కువ ఉంటుంది. అలా వేలంలో ప్లాటు దక్కించుకున్న తర్వాత మిగతా మొత్తం కట్టకుంటే డిఫాల్టర్లుగా తేల్చి ఆ ధరావతును జప్తు చేస్తారు. అంతేకాక డిఫాల్టర్లు భవిష్యత్తులో వేలంలో పాల్గొనలేరు. -
చివరి రోజూ మోకిలలో అదే ఊపు.. రూ. 716 కోట్ల ఆదాయం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో భూముల వేలం హెచ్ఎండీఏకు కాసులుకు కురిపిస్తోంది. మోకిలలో ప్లాట్ల ఈ-వేలానికి రియల్ ఎస్టేట్ సంస్థల నుంచి అనూహ్య స్పందన లభించింది. చివమోకిల హెచ్ఎండీఏ వెంచర్ ప్లాట్ల వేలంలో చివరి రోజు మొత్తానికి మొత్తం 60 ప్లాట్లు మంచి రేట్లతో అమ్ముడుపోయాయి. మోకిలలో చేస్తున్న భారీ వెంచర్లో ఫేజ్–1లో 50 ప్లాట్లు, ఫేజ్–2లో 300 ప్లాట్లతో కలిపి 350 ప్లాట్లకు వేలం నిర్వహించగా వాటిలో 346 ప్లాట్లు మంచిరేట్లతో అమ్ముడయ్యాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎం.ఎస్.టి.సి ఆధ్వర్యంలో హెచ్ఎండీఏ వెంచర్ ప్లాట్లను ఆన్లైన్(ఈ–ఆక్షన్)లో అమ్మకాలు నిర్వహించిన విషయం తెలిసిందే. చివరి రోజు మంగళవారం మొత్తం 60 ప్లాట్లు అమ్ముడుపోయాయి. దీంతో రెండు దశల్లో 346 ప్లాట్లకు మొత్తం రూ.716.39 కోట్ల రెవెన్యూ వచ్చింది. చదవండి: కాంగ్రెస్‌లో తీవ్ర పోటీ!.. 29 స్థానాలకు 263 దరఖాస్తులు -
హైదరాబాద్‌లో మరో భారీ భూ వేలంపాట
సాక్షి, హైదరాబాద్: నగరం శివారులో మరో భారీ భూ వేలం పాటకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధం అవుతోంది. మొకిలా ఫేజ్- 2 భూ వేలానికి హెచ్ఎండీఏ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. రంగారెడ్డి జిల్లా మొకిలా వద్ద మూడు వందల పాట్ల అమ్మకానికి నోటిఫికేషన్ ఇచ్చింది. మూడు వందల ప్లాట్లలో 98,975 గజాలను అమ్మకానికి పెట్టిన సర్కార్.. ఈ లేఔట్లో మూడు వందల నుంచి 5 వందల గజాల ప్లాట్స్‌ను అందుబాటులో ఉంచింది. నేటి నుంచి ఆగస్ట్ 21వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించింది. రూ. 1,180 ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వేలంలో పాల్గొనే వారు EMD రూ. 1 లక్ష చెల్లించాల్సి ఉంటుంది. చదరవు గజానికి 25 వేల రూపాయలు అప్సెట్ ధరగా నిర్ణయించారు. మొకిలా మొదటి ఫేజ్‌లో గజానికి అత్యధిక ధర 1లక్ష 5వేలు కాగా, అత్యల్పంగా 72వేలు నిర్ణయించారు. ఫెజ్ వన్‌లో గజంపై ప్రభుత్వానికి సరాసరిగా రూ. 80,397 ఆదాయం వచ్చింది. ఇప్పుడు 98,975 గజాలకు 8 వందల కోట్లు వచ్చే అవకాశం ఉందంటున్నారు. చదవండి: బుద్వేల్ భూం భూం.. -
కాసులు కురిపించిన మోకిలా.. ప్లాట్లకు మూడు రెట్ల ధర.. గజం రూ.1,05,000
సాక్షి, హైదరాబాద్: మోకిలాలోని హెచ్ఎండీఏ ప్లాట్లకు సోమవారం నిర్వహించిన ఆన్లైన్ వేలానికి అనూహ్యమైన స్పందన లభించింది. చదరపు గజం అత్యధికంగా రూ.1,05,000, కనిష్టంగా రూ.72,000 చొప్పున ధర పలికింది. సగటున రూ.80,397 చొప్పున ఆన్లైన్ బిడ్డింగ్‌లో విక్రయించినట్టు హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. మొత్తం 50 ప్లాట్లపైన హెచ్ఎండీఏకు రూ.121.40 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ ప్లాట్లకు చదరపు గజానికి రూ.25 వేల చొప్పున కనీసధర నిర్ణయించగా, దానికి మూడురెట్లు వేలంలో డిమాండ్ వచ్చినట్టు అధికారులు తెలిపారు. నార్సింగి–శంకర్పల్లి మార్గంలో ఉన్న మోకిలాలో భూములు హాట్‌కేకుల్లా అమ్ముడుపోవడం విశేషం. హెచ్ఎండీఏకు ఇక్కడ 165 ఎకరాల భూమి ఉంది. వీటిలో 15,800 చదరపు గజాల్లో విస్తరించి ఉన్న 50 ప్లాట్లకు సోమవారం ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలుగా అధికారులు వేలం నిర్వహించారు. ఒక్కో ప్లాట్ 300 గజాల నుంచి 500 గజాల వరకు ఉంది. ఇటీవల కోకాపేటలో నియోపోలీస్ రెండో దశ భూముల తరహాలోనే మోకిలాలోనూ హెచ్ఎండీఏ ప్లాట్లకు భారీ డిమాండ్ రావడం గమనార్హం. ఈ లే అవుట్లో త్వరలో రెండోదశ ప్లాట్లకు కూడా ఆన్లైన్ వేలం నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. చదవండి: ఆర్టీసీ బస్సుల్లో సీటు బెల్టులు -
పేదల భూములు లాక్కోవడం హేయం
మా పొట్టకొట్టకుండ్రి సారూ.. పశ్చిమరంగారెడ్డి జిల్లా జేఏసీ చైర్మన్ శ్రీనివాస్ శంకర్పల్లి: నిరుపేదలకు ఇచ్చిన భూములను ప్రభుత్వం లాక్కొవడం హేయమైన చర్య అని పశ్చిమరంగారెడ్డి జిల్లా జేఏసీ చైర్మన్ శ్రీనివాస్ అన్నారు. ప్రభుత్వం మోకిల గ్రామంలోని సర్వే నెంబర్ 96, 197లో పేదలకు కేటాయించిన లావణి పట్టా భూములను తిరిగి స్వాధీనం చేసుకుని ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకుంటోందని మోకిల గ్రామానికి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులు తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ కోదండరామ్‌కు ఫిర్యాదు చేశారు. కోదండరామ్ ఆదేశాల మేరకు పశ్చిమరంగారెడ్డి జిల్లా జేఏసీ బృందం గురువారం మోకిల గ్రామాన్ని సందర్శించింది వివరాలు సేకరించింది. ఈ సందర్భంగా స్థానిక రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికే 27 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని మూడు నెలల క్రితం ఎకరం రూ.2 కోట్ల చొప్పున ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకుందని, ఒక్కరూపాయి కూడా నష్ట పరిహారం ఇవ్వలేదని ఆరోపించారు. తమకు 1975 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం సర్వే నెంబర్ 96, సర్వే నెంబర్ 197లో సుమారు 700 ఎకరాలు లావణి భూమి కేటాయించి సర్టిఫికెట్లు కూడా జారీ చేసిందన్నారు. నాటి నుంచి నేటివరకు తామే ఆ భూమిని సాగుచేసుకుంటున్నామని, ఇప్పుడు ప్రభుత్వం అందులోని 27 ఎకరాలు వేలం వేసి ప్రైవేటు వ్యక్తులకు అమ్మిందని రైతులు వాపోయారు. మరికొంత భూమి అమ్మెందుకు ప్రణాళిక తయారు చేస్తోందని విడతల వారిగా కొంతమందికి నోటీసులు జారీచేస్తోందని వారు ఆరోపించారు. ప్రభుత్వం ఇచ్చిన భూమిలోనే సాగు చేసుకొని జీవనం కొనసాగిస్తున్నామని, తమ పొట్టకొట్టవద్దని రైతులు వేడుకుంటున్నారు. జేఏసీ నాయకులు మాట్లాడుతూ నిరుపేదలకు మూడు ఎకరాల భూమి ఇస్తామని చెప్పి పీఓటీ కింద ఇచ్చిన భూమిని స్వాధీనం చేసుకోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. తాము ఎన్నో సంవత్సరాలుగా కబ్జాలో, ఖారీజు ఖాతలో ఉన్నట్లు కంప్యూటర్ రికార్డులో నమోదు ఉందని, ఉన్నట్లుండి ప్రస్తుతం కంప్యూటర్లో వారి పేర్లు తీసేసి లావణి పట్టా, ఖారీజ్ ఖాత నిల్‌గా చూపిస్తోందని అన్నారు. అక్కడి నుంచి నేరుగా పంటపొలాలను జేఏసీ నాయకులు పరిశీలించి చైర్మన్ కోదండరామ్‌కు ఫోన్లో సమాచారం అందించారు. రైతులకు జరిగిన అన్యాయం గురించి వివరించారు. త్వరలో తాను గ్రామానికి వస్తానని రైతులకు అన్యాయం జరగకుండా వారితో కలిసి ప్రభుత్వంపై పోరాటం చేద్దామని ఆయన భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో వికారాబాద్ పట్టణ జేఏసీ చైర్మన్ కె.నర్సింలు, కన్వీనర్ రామరావుజోషి, మోకిల సర్పంచ్ అనందం, వైస్‌ఎంపీపీ శశిధర్‌రెడ్డి, నాయకులు మారుతి వై.దాసు, అడివయ్య, ఖాదర్‌పాష, సిహెచ్.యాదయ్య, రాజునాయక్, పాపాయ్య, గోపాల్, నర్సింలు, చోక్లనాయక్, యేషయ్య, ఎండీ.జానీ, పాండు, శ్రీశైలం, సదానందం, సామాజిక కార్యకర్త, ఉపాధ్యాయుడు ఆశీర్వాదం ఉన్నారు.