సాక్షి, హైదరాబాద్: నగరం శివారులో మరో భారీ భూ వేలం పాటకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధం అవుతోంది. మొకిలా ఫేజ్- 2 భూ వేలానికి హెచ్‌ఎండీఏ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
రంగారెడ్డి జిల్లా మొకిలా వద్ద మూడు వందల పాట్ల అమ్మకానికి నోటిఫికేషన్ ఇచ్చింది. మూడు వందల ప్లాట్లలో 98,975 గజాలను అమ్మకానికి పెట్టిన సర్కార్.. ఈ లేఔట్‌లో మూడు వందల నుంచి 5 వందల గజాల ప్లాట్స్‌ను అందుబాటులో ఉంచింది. నేటి నుంచి ఆగస్ట్ 21వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించింది. రూ. 1,180 ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వేలంలో పాల్గొనే వారు EMD రూ. 1 లక్ష చెల్లించాల్సి ఉంటుంది. చదరవు గజానికి 25 వేల రూపాయలు అప్సెట్ ధరగా నిర్ణయించారు.
మొకిలా మొదటి ఫేజ్‌లో గజానికి అత్యధిక ధర 1లక్ష 5వేలు కాగా, అత్యల్పంగా 72వేలు నిర్ణయించారు. ఫెజ్ వన్‌లో గజంపై ప్రభుత్వానికి సరాసరిగా రూ. 80,397 ఆదాయం వచ్చింది. ఇప్పుడు 98,975 గజాలకు 8 వందల కోట్లు వచ్చే అవకాశం ఉందంటున్నారు.
చదవండి: బుద్వేల్ భూం భూం..
Comments
Please login to add a commentAdd a comment