e-auction
-
HMDA: భూములు వేలం.. హెచ్‌డీఎంకు బిడ్డర్ల ఝలక్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ)కు బిడ్డర్లు హ్యాండ్ ఇచ్చారు. హెచ్ఎండీఏ పరిధిలో ఇటీవల ఈ-వేలంలో ప్లాట్లకు పాటపాడి బిడ్డర్లు డబ్బులు చెల్లించకుండా డిఫాల్టర్లుగా మారుతున్నారు. హెచ్ఎండీఏ పరిధిలోని ఆరు లేఅవుట్లలో ఏకంగా 497 మంది డిఫాట్లర్టుగా మారడం గమనార్హం. కాగా, డబ్బులు చెల్లించేందుకు నిర్ణీత గడువు కంటే ఎaక్కువ సమయం ఇచ్చినా బిడ్డర్లు మిగతా వాయిదాలు చెల్లించలేదు. దీంతో, ఆ ప్లాట్ల ధరావతు సొమ్ము రూ.4.5 కోట్లకుపైగా హెచ్ఎండీఏ జప్తు చేసింది. వివరాల ప్రకారం.. హెచ్ఎండీఏలో ఈ-వేలంలో ప్లాట్లను దక్కించుకున్న వారిలో చాలామంది డిఫాల్టర్లుగా నిలిచారు. ఆరు లేఅవుట్లకు సంబంధించి 497 మంది చెల్లింపులు చేయలేక చేతులెత్తేశారు. వారికి నిర్ణీత గడువు కంటే మరికొంత సమయం ఇచ్చినా సొమ్ము చెల్లించలేదు. ఈ క్రమంలో చేసేదేమీ లేకపోవడంతో ఆ ప్లాట్ల ధరావతు సొమ్ము రూ.4.5 కోట్లకుపైగా హెచ్ఎండీఏ జప్తు చేసింది. ► ఇక, మోకిలలో ఇటీవల నిర్వహించిన ఈ-వేలంలో చదరపు గజం రూ.లక్ష పలకడం రియల్ ఎస్టేట్ రంగంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇలా అధిక ధరకు ప్లాట్లు దక్కించుకున్న చాలామంది డబ్బులు చెల్లించడంలో వెనకడుగు వేశారు. ఒక్క మోకిలలోనే 148 మంది వరకు డిఫాల్టర్లుగా మిగిలారు. షాబాద్‌లో 50 ప్లాట్లకుగాను కేవలం 10 మందే చెల్లింపులు చేశారు. తొర్రూరులో 504 ప్లాట్లకు 114 మంది డబ్బులు కట్టలేదు. మిగతా లేఅవుట్లలోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. ►ఆరు నెలల్లో మోకిల, మేడిపల్లి, బాచుపల్లి, బహదూర్‌పల్లి, తొర్రూరు, షాబాద్ తదితర ప్రాంతాల్లో వెయ్యికి పైగా ప్లాట్లను హెచ్ఎండీఏ వేలం వేసింది. వేలంలో పాల్గొనాలంటే ప్రతి ప్లాటుకు తొలుత రూ.లక్ష ధరావతు చెల్లించాలి. కొన్నిచోట్ల ఈ మొత్తం తక్కువ ఉంటుంది. అలా వేలంలో ప్లాటు దక్కించుకున్న తర్వాత మిగతా మొత్తం కట్టకుంటే డిఫాల్టర్లుగా తేల్చి ఆ ధరావతును జప్తు చేస్తారు. అంతేకాక డిఫాల్టర్లు భవిష్యత్తులో వేలంలో పాల్గొనలేరు. -
2వేల టన్నుల గోధుమలకు 11న ఈ–వేలం
సాక్షి, అమరావతి: బహిరంగ మార్కెట్లో గోధుమల ధరలను స్థిరీకరించడానికి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్–డొమెస్టిక్ ద్వారా కేంద్రం నిర్ణయించిన సబ్సిడీ ధరలకు ఆహార ధాన్యాలను (గోధుమలు) ఈ నెల 11వ తేదీన ఈ–వేలం ద్వారా విక్రయిస్తున్నట్లు శనివారం ఎఫ్‌సీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. గోధుమ ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేసే వారు, గోధుమ పిండి మిల్లర్లకు మాత్రమే గోధుమలను విక్రయిస్తున్నట్లు తెలిపింది. కనీసం 10 మెట్రిక్ టన్నుల నుంచి గరిష్టంగా 100 మెట్రిక్ టన్నులకు బిడ్ వేయడానికి అర్హులని, ఈ–వేలంలో పాల్గొనదలచిన బిడ్డర్ తప్పనిసరిగా ఎఫ్.ఎస్.ఎస్.ఎ.ఐ లైసెన్స్, జి.ఎస్.టి. / ట్రేడ్ ట్యాక్స్ రిజి్రస్టేషన్, పాన్ కలిగి ఉండాలని స్పష్టం చేసింది. అమరావతిలోని ఎఫ్‌సీఐ ప్రాంతీయ కార్యాలయంలో 2వేల మెట్రిక్ టన్నుల విక్రయానికి.. క్వింటా రూ.2150 చొప్పున ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ఈ–వేలం నిర్వహిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. -
DERIVAZ AND IVES: జ్ఞాపకాల ‘రే’ఖలు
సత్యజిత్ రే చిత్రాలు కాలాతీతమైనవి. ఆ జ్ఞాపకాలు ఏ కాలానికైనా అపురూపమైనవి. ఇట్టి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆన్లైన్ యాక్షన్ హౌజ్ డెరివాజ్ అండ్ ఐవ్స్ సత్యజిత్ రే సినిమాలకు సంబంధించి రేర్ పోస్టర్లు, ఫోటోగ్రాఫిక్ స్టిల్స్, లాబీ కార్డ్స్, సినాప్సిస్ బుక్‌లెట్స్‌తో పాటు ఆయన రూపొందించిన కళారూపాలను వేలం వేసింది. ఈ వేలంలో పాల్గొనడానికి రే అభిమానులు, సినీ పండితులు, ఆర్ట్ కలెక్టర్లు ఆసక్తి చూపుతున్నారు. కాలం కంటే ముందు ఉన్న ఆలనాటి పోస్టర్ డిజైనింగ్, కాలిగ్రాఫిక్ క్వాలిటీని అర్థం చేసుకోవడానికి... స్థూలంగా చెప్పాలంటే ఐకానిక్ ఫిల్మ్‌మేకర్ అద్భుత ప్రయాణాన్ని అన్వేషించడానికి ఈ వేలం ఒక సాధనం అవుతుంది. -
హైదరాబాద్‌లో మరో భారీ భూ వేలంపాట
సాక్షి, హైదరాబాద్: నగరం శివారులో మరో భారీ భూ వేలం పాటకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధం అవుతోంది. మొకిలా ఫేజ్- 2 భూ వేలానికి హెచ్ఎండీఏ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. రంగారెడ్డి జిల్లా మొకిలా వద్ద మూడు వందల పాట్ల అమ్మకానికి నోటిఫికేషన్ ఇచ్చింది. మూడు వందల ప్లాట్లలో 98,975 గజాలను అమ్మకానికి పెట్టిన సర్కార్.. ఈ లేఔట్లో మూడు వందల నుంచి 5 వందల గజాల ప్లాట్స్‌ను అందుబాటులో ఉంచింది. నేటి నుంచి ఆగస్ట్ 21వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించింది. రూ. 1,180 ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వేలంలో పాల్గొనే వారు EMD రూ. 1 లక్ష చెల్లించాల్సి ఉంటుంది. చదరవు గజానికి 25 వేల రూపాయలు అప్సెట్ ధరగా నిర్ణయించారు. మొకిలా మొదటి ఫేజ్‌లో గజానికి అత్యధిక ధర 1లక్ష 5వేలు కాగా, అత్యల్పంగా 72వేలు నిర్ణయించారు. ఫెజ్ వన్‌లో గజంపై ప్రభుత్వానికి సరాసరిగా రూ. 80,397 ఆదాయం వచ్చింది. ఇప్పుడు 98,975 గజాలకు 8 వందల కోట్లు వచ్చే అవకాశం ఉందంటున్నారు. చదవండి: బుద్వేల్ భూం భూం.. -
కాసులు కురిపించిన మోకిలా.. ప్లాట్లకు మూడు రెట్ల ధర.. గజం రూ.1,05,000
సాక్షి, హైదరాబాద్: మోకిలాలోని హెచ్ఎండీఏ ప్లాట్లకు సోమవారం నిర్వహించిన ఆన్లైన్ వేలానికి అనూహ్యమైన స్పందన లభించింది. చదరపు గజం అత్యధికంగా రూ.1,05,000, కనిష్టంగా రూ.72,000 చొప్పున ధర పలికింది. సగటున రూ.80,397 చొప్పున ఆన్లైన్ బిడ్డింగ్‌లో విక్రయించినట్టు హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. మొత్తం 50 ప్లాట్లపైన హెచ్ఎండీఏకు రూ.121.40 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ ప్లాట్లకు చదరపు గజానికి రూ.25 వేల చొప్పున కనీసధర నిర్ణయించగా, దానికి మూడురెట్లు వేలంలో డిమాండ్ వచ్చినట్టు అధికారులు తెలిపారు. నార్సింగి–శంకర్పల్లి మార్గంలో ఉన్న మోకిలాలో భూములు హాట్‌కేకుల్లా అమ్ముడుపోవడం విశేషం. హెచ్ఎండీఏకు ఇక్కడ 165 ఎకరాల భూమి ఉంది. వీటిలో 15,800 చదరపు గజాల్లో విస్తరించి ఉన్న 50 ప్లాట్లకు సోమవారం ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలుగా అధికారులు వేలం నిర్వహించారు. ఒక్కో ప్లాట్ 300 గజాల నుంచి 500 గజాల వరకు ఉంది. ఇటీవల కోకాపేటలో నియోపోలీస్ రెండో దశ భూముల తరహాలోనే మోకిలాలోనూ హెచ్ఎండీఏ ప్లాట్లకు భారీ డిమాండ్ రావడం గమనార్హం. ఈ లే అవుట్లో త్వరలో రెండోదశ ప్లాట్లకు కూడా ఆన్లైన్ వేలం నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. చదవండి: ఆర్టీసీ బస్సుల్లో సీటు బెల్టులు -
808 ఎఫ్ఎం రేడియో స్టేషన్లకు త్వరలో ఈ వేలం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 284 నగరాల్లో 808 ఎఫ్ఎం రేడియో స్టేషన్ల ఏర్పాటుకు ప్రభుత్వం త్వరలోనే ఈ వేలం నిర్వహించనుందని కేంద్ర సమాచార ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. ప్రస్తుతం దేశంలోని 26 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 113 నగరాల్లో 388 ఎఫ్ఎం స్టేషన్లు నడుస్తున్నాయని చెప్పారు. కవరేజీ పెంచేందుకు గాను మారుమూల ప్రాంతాల్లోనూ రేడియో టవర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కమ్యూనిటీ రేడియోలు సహా రేడియో స్టేషన్లకు లైసెన్స్ జారీ ప్రక్రియను సులభతరం చేశామన్నారు. టయర్–2, 3 నగరాల్లోనూ విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఆలిండియా రేడియో ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ల ద్వారా దేశంలోని భౌగోళిక ప్రాంతాన్ని 59 శాతం నుంచి 66 శాతానికి, జనాభాలో 68 నుంచి 80 శాతం మందికి సేవలందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. మారుమూల, గిరిజన, వామపక్ష తీవ్రవాద ప్రాబల్య ప్రాంతాల్లోని వారికి ఉచితంగా 8 లక్షల డీడీ ఫ్రీ డిష్ సెట్ టాప్ బాక్సులను అందజేయనున్నామని తెలిపారు. -
ఖనిజ లీజులకు దశల వారీగా ఈ–వేలం
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చిన్న తరహా ఖనిజాల తవ్వకానికి గనులను లీజుకిచ్చేందుకు ప్రభుత్వం దశల వారీగా నిర్వహిస్తున్న ఈ–వేలం ప్రక్రియ విజయవంతంగా జరుగుతోంది. తొలి దశలో గ్రానైట్ మినహా మిగిలిన చిన్న తరహా ఖనిజాల లీజులకు మంచి స్పందన లభించింది. 35 లీజులకు నిర్వహించిన ఈ–వేలంలో రూ. 16 కోట్ల ఆదాయం లభించింది. రెండో దశలో 27 లీజులకు ఈ–వేలం ప్రక్రియ ప్రస్తుతం జరుగుతోంది. ఇప్పటి వరకు 20 లీజులకు వేలం పూర్తయింది. వారం రోజుల్లో మిగిలిన 7 లీజులకు ఈ–వేలం పూర్తి చేస్తామని మైనింగ్ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా లీజు పొంది పని చేయకుండా ఉన్న 2,724 చిన్న తరహా గనులను ఆపరేషన్లోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ–వేలం విధానాన్ని ప్రారంభించారు. సీఎం చొరవతో ఈ–వేలానికి సుమారు 700 గనులు ఆపరేషన్ చేయడం ప్రారంభించాయి. ఈ లీజుల్లో ఎక్కువ క్వార్ట్జ్, బ్లాక్ గ్రానైట్, బెరైటీస్, సిలికాశాండ్, ప్రొఫలైట్ ఖనిజాలు ఎక్కువ ఉన్నాయి. మిగిలిన వాటికి ఈ–వేలం నిర్వహించి తవ్వకాలు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నారు. గతంలో ఉన్న మైనింగ్ విధానం ప్రకారం లీజు దరఖాస్తులు సుదీర్ఘకాలం పెండింగ్‌లో ఉండిపోయేవి. లీజులు తీసుకున్న వారిలో ఎక్కువ మంది తవ్వకాలు జరపకుండా వదిలేయడంతో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. అనుమతిచ్చిన ఈ లీజుల్లో తవ్వకాలు చేయకపోవడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం నిలిచిపోవడంతో పాటు, మైనింగ్ ఆధారిత పరిశ్రమలకు ముడిసరుకు కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో తవ్వకాలు జరపని క్వారీలకు ఒక అవకాశం ఇచ్చి చూశారు. సద్వినియోగం చేసుకోని లీజులను రద్దు చేసి వాటికి ఈ–వేలం నిర్వహిస్తున్నారు. దశల వారీగా 6 నెలల్లో వెయ్యి లీజుల్లో తవ్వకాలు ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వీటి ద్వారా ప్రభుత్వ ఆదాయం రూ. 500 కోట్ల మేర పెరిగే అవకాశం ఉందని గనుల శాఖ అంచనా వేస్తోంది. -
తగ్గిన సీఆర్డీఏ ప్లాట్ల రిజిస్ట్రేషన్ ధరలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఏపీ సీఆర్డీఏ) ఎన్టీఆర్ , గుంటూరు జిల్లాల పరిధిలోని నాలుగు టౌన్షిప్ లలో ఉన్న ప్లాట్ల రిజిస్ట్రేషన్ ధరలను భారీగా తగ్గించింది. గతంలో నిర్ణయించిన ధరలు అధికంగా ఉండడంతో కొనుగోలుదారులు పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో అధికారులు ఆ ప్లాట్లకు అమ్మకపు ధర, అభివృద్ధి చార్జీలను వేర్వేరుగా విభజించారు. అందులో అమ్మకపు ధరకే రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించేలా మార్పు చేశారు. ప్లాట్ ధరలో నికర ధర 60 శాతంగా, అభివృద్ధి చార్జీలు 40 శాతంగా నిర్ణయించారు. ప్లాట్ నికర ధర 60 శాతానికి రిజిస్ట్రేషన్ ఫీజు ఎంతయితే అంత చెల్లిస్తే సరిపోతుంది. గతంలో ప్లాట్ ధర మొత్తానికి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి వచ్చేది. ఇది కొనుగోలుదారులకు భారంగా ఉండేది. దీంతో ఈ మార్పు చేశారు. పైగా, నికర ధరను ప్లాట్ పొందిన మూడు రోజుల్లో పది శాతం మాత్రమే చెల్లించాలి. మిగిలిన నికర ధర, అభివృద్ధి చార్జీలను ఏడాదిలో నాలుగు వాయిదాలుగా చెల్లించే అవకాశం కూడా కల్పించింది. కొనుగోలుదారులు ఒప్పందం కుదిరిన 5 నెలల లోపు మొత్తం ప్లాట్ ధరను ఒకేసారి చెల్లిస్తే అదనంగా 5 శాతం రాయితీ కూడా సీఆర్డీఏ ప్రకటించింది. వివిధ వర్గాల నుంచి వచ్చిన వినతులను పరిగణనలోకి తీసుకుని రిజిస్ట్రేషన్ విధానంలో మార్పులు చేసినట్లు సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ తెలిపారు. నగరం మధ్యలో, అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ఉన్న ఈ ప్లాట్లను ఇప్పుడు సామాన్యులు సైతం కొనేలా మార్పులు చేశామని, సులభమైన వాయిదా పద్ధతుల్లో నగదు చెల్లించేందుకు కూడా అవకాశం కల్పించినట్టు చెప్పారు. ఫోన్ ఓటీపీ ద్వారా ప్లాట్ల కొనుగోలుకు పేర్లు నమోదు చేసుకోవచ్చన్నారు. విజయవాడ పాయకాపురం టౌన్షిప్, ఇబ్రహీంపట్నం ట్రక్ టెర్మినల్, తాడేపల్లి–మంగళగిరి కార్పొరేషన్ పరిధిలోని అమరావతి టౌన్షిప్, తెనాలి చెంచుపేటలో నివాస, వాణిజ్య అవసరాలకు అనుగుణంగా మొత్తం 424 ప్లాట్లు ఉన్నాయి. ప్లాట్లు, ధరల వివరాలు సోమవారం నుంచి ఆన్లైన్లో ఉంటాయని, ఆసక్తి గలవారు https:// konugolu.ap.gov.in,, లేదా https://crda.ap.gov.in వెబ్సైట్లో అక్టోబర్ 10వ తేదీలోగా వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ ఫీజు 10 శాతం చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ సూచించారు. ప్లాట్లకు అక్టోబర్ 13న ఈ–వేలం నిర్వహిస్తామన్నారు. ఇతర వివరాలకు 0866–2527124 నంబర్లో సంప్రదించవచ్చని చెప్పారు. ఈ ప్లాట్ల అమ్మకం ద్వారా వచ్చే మొత్తాన్ని అమరావతి ప్రాంతంలో మౌలిక వసతుల అభివృద్ధికి వెచ్చిస్తామని తెలిపారు. -
నీరజ్ చోప్రా 'జావెలిన్'కు భారీ ధర.. దక్కించుకుంది ఎవరంటే?
భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణ పతకం సాధించిన సంగతి తెలిసిందే. ఒలింపిక్స్‌లో అథ్లెట్ విభాగంలో తొలి పతకం.. వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధించిన రెండో అథ్లెట్‌గా నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. తాజాగా అతను టోక్యో ఒలింపిక్స్‌లో వాడిన జావెలిన్‌ను ఈ-వేలంలో బీసీసీఐ భారీ ధరకు దక్కించుకున్నట్లు సమాచారం. నీరజ్ జావెలిన్‌ను దాదాపు రూ.1.5 కోట్ల బిడ్‌తో బీసీసీఐ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. కాగా టోక్యో ఒలింపిక్స్ ముగిసిన అనంతరం భారత ప్రధాని టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన తన నివాసానికి మర్యాద పూర్వకంగా ఆహ్వానించి అథ్లెట్లను ఘనంగా సన్మానించారు. ఈ నేపథ్యంలోనే నీరజ్ చోప్రా.. ప్రధాని మోదీకి ఒక జావెలిన్‌ను అందజేశాడు. దీనితో పాటు మరికొందరు అథ్లెట్లు కూడా తమ వస్తువులను ప్రధాని మోదీకి కానుకగా ఇచ్చారు. మహిళా బాక్సర్ లవ్లీనా బొర్హంగైన్ పతకాలతో దేశఖ్యాతిని ఇనుమడింపచేసిన క్రీడాకారులకు చెందిన వస్తువులను వేలం వేయాలని ప్రధాని భావించారు. వేలం ద్వారా వచ్చిన డబ్బును ''నమామి గంగే'' కార్యక్రమానికి ఉపయోగించాలని ప్రధాని తీర్మానించారు. కాగా 2014లో గంగా నది పరిరక్షణ, పరిశుభ్రంగా ఉంచాలనే సంకల్పంతో ప్రధాని మోదీ నమామి గంగే కార్యక్రమానికి స్వీకారం చుట్టారు. కాగా కోవిడ్-19 తొలి దశలో బీసీసీఐ పీఎం కేర్ ఫండ్స్‌కు రూ. 50 కోట్లు విరాళం ఇచ్చి తన పెద్ద మనసును చాటుకుంది. ఇక గతేడాది సెప్టెంబర్- అక్టోబర్‌లో నీరజ్ చోప్రా జావెలిన్‌తో పాటు మరికొందరు ఆటగాళ్లకు చెందిన వస్తువులకు ఈ-వేలం నిర్వహించారు. ఫెన్సర్ భవానీ దేవీ తాజాగా ఈ-వేలానికి సంబంధించిన వివరాలు వెల్లడించగా.. నీరజ్ చోప్రా జావెలిన్‌కు భారీ స్థాయిలో పోటీ ఏర్పడగా.. చివరకు బీసీసీఐ రూ. 1.5 కోట్లు బిడ్ వేసి దక్కించుకున్నట్లు సమాచారం. అలాగే మహిళా ఫెన్సర్ భవానీ దేవి వాడిని ఖరవాలానికి రూ 1.25 కోట్ల ధర పలకడం విశేషం. అలాగే పారాలింపియన్ సుమిత్ అంటిల్ జావెలిన్‌ను రూ. 1.002 కోట్లకు మరొక సంస్థ సొంతం చేసుకుంది. సుమిత్ అంటిల్ అలాగే టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గిన మహిళా బాక్సర్ లవ్లీనా బొర్హంగైన్ బాక్సింగ్ గ్లోవ్స్ రూ. 91 లక్షలకు అమ్ముడయ్యాయి. ఓవరాల్‌గా ఈ-వేలానికి దాదాపు 8600 బిడ్స్ రావడం విశేషం. ఇక ఇటీవలే నీరజ్ చోప్రా తాను స్వర్ణం గెలిచిన జావెలిన్ త్రోను లుసానే ఒలింపిక్ మ్యూజియానికి విరాళంగా ఇచ్చాడు. ఈ విషయాన్ని లుసానే ఒలింపిక్ మ్యూజియం నిర్వాహకులు తమ ట్విటర్లో అధికారికంగా ప్రకటించారు. చదవండి: Neeraj Chopra: చిన్న గ్యాప్ మాత్రమే.. ప్రపంచ రికార్డుతో ఘనంగా రీఎంట్రీ Serena Williams-Lebron James: G.O.A.T అని ఇలా కూడా పిలవొచ్చా.. వారెవ్వా! -
234 ఖనిజ లీజులకు ఈ–వేలం
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలు చిన్న తరహా ఖనిజాల తవ్వకానికి లీజు అనుమతులు ఇచ్చేందుకు ప్రభుత్వం చేపట్టిన ఈ–వేలం కొనసాగుతోంది. తొలి దశలో 234 ఖనిజాలకు క్వారీ లీజులు ఇచ్చేందుకు గనుల శాఖ జిల్లాలవారీగా టెండర్లు పిలిచింది. అందులో 169 కలర్ గ్రానైట్‌వే. మిగిలినవి క్వార్‌ట్ట్జ, బ్లాక్ గ్రానైట్, బెరైటీస్, సిలికా శాండ్, ప్రొఫలైట్ ఖనిజ లీజులు. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 70 క్వారీ లీజులకు ఈ–వేలం నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత అనంతపురం జిల్లాలో 54, విజయనగరం జిల్లాలో 35, వైఎస్సార్ జిల్లాలో 31, కర్నూలు జిల్లాలో 18, నెల్లూరు జిల్లాలో 9, విశాఖపట్నం జిల్లాలో 9, తూర్పు గోదావరి జిల్లాలో 8 లీజులకు వేలం నిర్వహిస్తున్నారు. వీటిలో కొన్నిటికి ఇప్పటికే అనుమతులు కూడా మంజూరు చేశారు. మరికొన్నింటికి త్వరలో మంజూరు చేయనున్నారు. గతంలో ఉన్న మైనింగ్ విధానం ప్రకారం లీజు దరఖాస్తులు సుదీర్ఘకాలం పెండింగ్‌లో ఉండిపోయేవి. లీజులు తీసుకున్న వారిలో ఎక్కువ మంది తవ్వకాలు జరపకుండా వదిలేసేవారు. అలాంటివి 2,162 లీజులు ఉన్నట్లు గుర్తించారు. అనుమతిచ్చిన ఈ క్వారీల్లో తవ్వకాలు చేయకపోవడం వల్ల ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం నిలిచిపోయింది. మైనింగ్ ఆధారిత పరిశ్రమలకు ముడిసరుకు కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో తవ్వకాలు జరపని క్వారీలకు ఒక అవకాశం ఇచ్చి చూశారు. అప్పటికీ సద్వినియోగం చేసుకోకపోవడంతో ఆ లీజులను రద్దు చేసి వాటికి ఈ–వేలం నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం వెయ్యి క్వారీలను తిరిగి ఆపరేషన్లోకి తేవాలని నిర్ణయించారు. అందులో భాగంగా తొలి దశలో 234 లీజులకు ఈ–వేలం నిర్వహిస్తున్నారు. ఇందులో అనుమతి పొందిన వారికి రెవెన్యూ శాఖ నుంచి త్వరితగిన నిరభ్యంతర పత్రాలు ఇప్పించంతోపాటు ఇతర అనుమతులూ త్వరగా వచ్చేలా చూస్తున్నారు. -
రికార్డులు బద్దలు కొడుతున్న ఐపీఎల్ మీడియా రైట్స్..
ఐపీఎల్ మీడియా హక్కులకు సంబంధించిన ఈ-వేలం జోరుగా సాగుతుంది. 2023-2027 కాలానికి గాను ముంబైలో బీసీసీఐ వేలం ప్రక్రియ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం మధ్యాహ్నం ముంబై లో ఇ-వేల ప్రారంభమైంది. నాలుగు ప్యాకేజీలుగా విభజించి వేలాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం.. ఐపీఎల్ మీడియా హక్కుల విలువ ఇప్పటికే రూ. 40 వేల కోట్లు దాటిందని తెలుస్తున్నది. ముందుగా ఉపఖండంలో టీవీ హక్కులు.. ఆ తర్వాత డిజిటల్ హక్కుల విభాగాలకు వేర్వేరుగా వేలం నిర్వహిస్తున్నారు. టీవీ ప్రసారం హక్కుల కోసం ఒక్కో మ్యాచ్ కు రూ. 49 కోట్లు బేస్ ప్రైజ్ గా నిర్ణయించగా.. డిజిటల్ హక్కులు రూ. 33 కోట్లుగా నిర్ణయించారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం టీవీ ప్రసార హక్కుల వేలం రూ. 24 వేల కోట్లు చేరిందని.. డిజిటల్ హక్కులు రూ. 19 వేల కోట్లు దాటాయని తెలుస్తున్నది. మొత్తానికి ఇప్పటికే ఐపీఎల్ మీడియా హక్కుల విలువ రూ. 43 వేల కోట్లు దాటిందని సమాచారం. ఈ అంకె ప్రతి అరగంటకూ పెరుగుతున్నది. ఈ-వేలం సోమవారం కూడా కొనసాగనుంది. దీనిని బట్టి చూస్తే బీసీసీఐ పెట్టుకున్న టార్గెట్ (రూ. 50వేల కోట్లు) చేరుకోవడం పెద్ద కష్టమేం కాకపోవచ్చు. ప్రస్తుతం ఐపీఎల్ మీడియా హక్కుల వేలంలో డిస్నీ స్టార్, సోనీ నెట్వర్క్, వయాకామ్ రిలయన్స్ 18, జీ, ఫన్ ఆసియా, సూపర్ స్పోర్ట్, టైమ్స్ ఇంటర్నెట్ లు పోటీలో ఉన్నాయి. 2017-2022 కాలానికి గాను (డిస్నీ స్టార్) మీడియా హక్కుల ప్రారంభ ధర రూ. 16 వేల కోట్లు కాగా ఇప్పుడది ఏకంగా డబుల్ (రూ. 32 వేల కోట్లు) అయింది. పోటీ నుంచి అమెజాన్, గూగుల్ వంటి దిగ్గజ సంస్థలు తప్పుకున్నా పోటీ మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా ఉంది. ఇదే స్పీడ్ కొనసాగితే బీసీసీఐ.. రూ. 60 వేల కోట్లు అర్జించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. చదవండి: ఒడిశా ఎలా ఉంది?.. దక్షిణాఫ్రికా ఆటగాడి ఎపిక్ రిప్లై Bidding for IPL TV, digital rights goes past Rs 42,000 cr Read @ANI Story | https://t.co/Ah5MWfeuKv#IPL #IPLMediaRights #BCCI pic.twitter.com/z87ATGtUiX — ANI Digital (@ani_digital) June 12, 2022 -
IPL: అమెజాన్ అవుట్
న్యూఢిల్లీ: భారత కుబేరుడు ముకేశ్ అంబానీ, ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్‌ల మధ్య ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మీడియా ప్రసార హక్కుల పోటీ రసవత్తరం అవుతుందనుకుంటే... మరోకటి జరిగింది. ఈ రేసు నుంచి ఓటీటీ సంస్థ అమెజాన్ తప్పుకుంది. దీంతో రిలయన్స్‌కు చెందిన ‘వయాకామ్ 18’ మిగతా మూడు సంస్థలతో రేసులో నిలిచింది. అమెజాన్ సహా డిస్నీ స్టార్, వయాకామ్–18, సోనీ, జీ సంస్థలు ప్రాథమిక బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొన్నాయి. అయితే శుక్రవారం అమెజాన్ ప్రైమ్ వైదొలగడంతో ఇప్పుడు టీవీ, డిజిటల్ హక్కుల పోటీ ప్రధానంగా నాలుగు సంస్థల మధ్యే నెలకొనే అవకాశముంది. నిజానికి అపర కుబేరుడికి చెందిన అమెజాన్ పోటీలో ఉన్నంతసేపూ ఈసారి ఐపీఎల్ మీడియా హక్కులకు ఎవరూ ఊహించని విధంగా రూ. 70 వేల కోట్ల మొత్తం రావొచ్చని బ్రాడ్‌కాస్టింగ్ వర్గాలు భావించాయి. కానీ కారణం లేకుండానే అమెజాన్ తప్పుకోవడంతో ముందనుకున్న అంచనాలు తప్పే అవకాశముంది. ‘అవును అమెజాన్ ఐపీఎల్ మీడియా ప్రసార హక్కుల ప్రక్రియ నుంచి వైదొలగింది. బిడ్ వేసేందుకు డాక్యుమెంట్లు తీసుకుంది. కానీ శుక్రవారం కీలకమైన సాంకేతిక బిడ్డింగ్‌లో వాటిని దరఖాస్తు చేయలేదు. గూగుల్‌కు చెందిన యుట్యూబ్ వాళ్లు కూడా డాక్యుమెంట్ కొనుగోలు చేశారు. కానీ వారు కూడా దరఖాస్తు సమర్పించలేదు. అయితే నాలుగు ప్రధాన టెలివిజన్, స్ట్రీమింగ్కు చెందిన మొత్తం 10 సంస్థలు పోటీలో ఉన్నాయి. ఆదివారం మొదలయ్యే ఇ–వేలం రెండు రోజులపాటు జరిగే అవకాశ ముంది.’ అని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. నిజమా... రూ. 45 వేల కోట్లా? అమెజాన్ వైదొలగినప్పటికీ... పోటీలో ఉన్న సంస్థలన్నీ పెద్ద మొత్తం చెల్లించేందుకు సై అంటున్నాయి. ఐదారేళ్ల క్రితంతో పోల్చుకుంటే డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఇప్పుడు అందరి ‘అరచేతి’ లో ఉండటమే కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బిడ్ ప్రారంభ ధరే రూ. 32 వేల కోట్లు ఖాయమంటున్నాయి బీసీసీఐ వర్గాలు. ఇదే జరిగితే పోటాపోటీలో అక్షరాలా 45 వేల కోట్ల రూపాయాలు ఐపీఎల్ మీడియా హక్కుల ద్వారా రావొచ్చని అంచనా. అంటే గత మొత్తం రూ. 16,347.50 కోట్లకు రెండున్నర రెట్లు అధిక మొత్తం ఈసారి గ్యారంటీ! ఇ–వేలం సంగతేంటి? బీసీసీఐ టెండర్ల ప్రక్రియతో గత హక్కు లు కట్టబెట్టింది. ఇప్పుడు ఇ–ఆక్షన్ (ఎలక్ట్రానిక్ వేలం) నిర్వహించనుంది. ఆదివారం మొదలయ్యే ఈ ఇ–ఆక్షన్‌లో పోటీదారులంతా ఆన్లైన్ పోర్టల్‌లో బిడ్లు వేస్తారు. స్క్రీన్‌లో ఎక్కువ మొత్తం పెరుగుతున్న కొద్దీ పోటీలో ఉన్న సంస్థలు తప్పుకుంటాయి. చివరకు మిగిలిన సంస్థ విజేతగా నిలుస్తుంది. అయితే ఎంత మొత్తమో కనబడుతుంది కానీ ఎవరు వేసింది అనేది స్క్రీన్‌లో కనపడదు. ఎందుకంటే పలా నా సంస్థ వేసిందంటే దానికి ధీటుగా వేయా లని ఇతర సంస్థలు నిర్ణయించుకుంటాయి. నాలుగు ‘ప్యాకేజీ’లు నాలుగు ప్యాకేజీల్లో ఎ, బి, సి పూర్తిగా భారత ఉపఖండానికి సంబంధించినవి. ‘ఎ’ టీవీ హక్కులు, ‘బి’ డిజిటల్ రైట్స్. ‘సి’ ప్లే–ఆఫ్స్ సహా కొన్ని ప్రత్యేక మ్యాచ్‌లకు సంబంధించిన డిజిటల్ రైట్స్. ఇక ‘డి’ ఉపఖండం మినహా మొత్తం ప్రపంచానికి సంబంధించిన ఉమ్మడి టీవీ, డిజిటల్ రైట్స్. కొత్తగా ‘ప్రత్యేక’ హక్కులేంటంటే... సీజన్లో ఒక్కోసారి మ్యాచ్‌లు పెరిగితే దానికి సంబంధించిన ప్యాకేజీ అన్నమాట. ఒక సీజన్లో 74 ఉండొచ్చు. ఇవి మరో సీజన్లలో 84 లేదంటే 94కు పెరగొచ్చు. ఇవీ ప్రారంభ ధరలు... ‘ఎ’ టీవీ ప్యాకేజి కోసం ఒక్కో మ్యాచ్‌కు రూ. 49 కోట్లు ప్రారంభ బిడ్డింగ్ ధర కాగా... ‘బి’ డిజిటల్ కోసం మ్యాచ్‌కు రూ. 33 కోట్లు, ‘సి’లో ప్రాథమిక ధర రూ. 11 కోట్లు, ‘డి’లో రూ. 3 కోట్లకు తక్కువ కాకుండా బిడ్ వేయాల్సి ఉంటుంది. ఒక సంస్థ ఒకదానికే పరిమితమన్న నిబంధన లేదు. నాలుగు ప్యాకేజీలకూ ఒకే సంస్థ పోటీ పడొచ్చు. అయితే గతంలో ఏక మొత్తంలో ఒకే సంస్థకు కట్టబెట్టినట్లుగా కాకుండా ఈసారి ప్రతీ ప్యాకేజీలో ఎవరు ఎక్కువకు కోట్ చేస్తే వాళ్లకే హక్కులిస్తారు. గతంలో టీవీ హక్కులకు భారీ మొత్తం కోట్ చేసిన స్టార్ నెట్వర్క్ డిజిటల్‌కు తక్కువ కోట్ చేసింది. ఫేస్బుక్ డిజిటల్ కోసం రూ.3,900 కోట్లు కోట్ చేసినా... ఓవరాల్‌గా గరిష్ట మొత్తాన్ని పరిగణించి స్టార్‌కు హక్కులిచ్చారు. ఈసారి డిజిటల్ విభాగంలో టైమ్స్ ఇంటర్నెట్, ఫన్ఆసియా, డ్రీమ్11, ఫ్యాన్‌కోడ్... ఉపఖండం ఆవల హక్కుల కోసం స్కై స్పోర్ట్స్ (ఇంగ్లండ్), సూపర్‌స్పోర్ట్ (దక్షిణాఫ్రికా) కూడా బరిలో ఉన్నాయి. -
విజయవాడ: రికార్డు స్థాయిలో తలనీలాల ఆదాయం
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు భక్తులు సమర్పించే తలనీలాలకు రికార్డు ధర పలికింది. వచ్చే జనవరి 1వ తేదీ నుంచి ఏడాదిపాటు తలనీలాలు సేకరించుకునేందుకు రూ.7,15,99,999 చెల్లిస్తామని తమిళనాడుకు చెందిన కేఎం ఇండస్ట్రీస్ ముందుకొచ్చింది. గత ఏడాది రూ.5.67 కోట్లు పలికిన టెండర్ ఈ దఫా రూ.7.16 కోట్లకు చేరింది. దీంతో నిరుటికంటే రూ.1.49 కోట్ల మేర ఆలయానికి అధికంగా ఆదాయం సమకూరింది. భక్తులు అమ్మవారికి సమర్పించిన తలనీలాలను పోగుచేసుకునే హక్కుకోసం ఆలయ అధికారులు టెండర్ ప్రక్రియను నిర్వహించారు. బహిరంగ వేలం, సీల్డ్ టెండర్, ఈ–టెండర్ విధానాల ద్వారా టెండర్లు ఆహ్వానించారు. దుర్గగుడి పరిపాలన భవనంలో నిర్వహించిన టెండర్ల ప్రక్రియలో మన రాష్ట్రంతోపాటు తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన మొత్తం పదిమంది కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. ఈ టెండర్ దేవదాయశాఖ కమిషనర్ ఆమోదం పొందిన 72 గంటల్లోనే కేఎం ఇండస్ట్రీస్ ఆ మొత్తాన్ని ఆలయానికి చెల్లించాల్సి ఉంటుంది. టెండర్ ప్రక్రియను దేవస్థానం ఏఈవో వెంకటరెడ్డి, పాలకమండలి సభ్యులు బాల, సుజాత పర్యవేక్షించారు. (చదవండి: విజయవాడలో అరుదైన పిల్లి హల్చల్.. ఎలా వచ్చింది?) -
ఎస్బీఐ మెగా ఆఫర్: మార్కెట్ రేటు కంటే తక్కువకే
సాక్షి, ముంబై: ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మరోసారి బంపర్ ఆఫర్ ప్రకటించింది. మార్కెట్ రేట్ల కంటే చాలా తక్కువ ధరకే కొత్త ఆస్తిలను కొనుగోలు చేసే అవకాశాన్ని ప్రజలకు అందిస్తోంది. ఈ మేరకు మార్చి 5 న మెగా ఇ- వేలం నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. రుణ ఎగవేతదారుల తనఖా ఆస్తులను విక్రయించడానికి ఈ-వేలం నిర్వహిస్తుంది. తద్వారా బకాయిలను తిరిగి పొందనుంది. ఈ వేలంలో నివాస, వాణిజ్య ఆస్తులు భూమి, వాహనాలు, యంత్రాలు, తదితరాలను తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చని ఎస్బీఐ ట్విటర్ ద్వారా వెల్లడించింది. ఈ వేలం కోసం జారీ చేసిన పబ్లిక్ నోటీసులలో సంబంధిత వివరాలను అందించినట్టు తెలిపింది. (రెడ్మి నోట్ 10 స్మార్ట్ఫోన్లు వచ్చేసాయ్!) వేలంలోని ఆస్తి వివరాలను ఎలా పొందాలి? దీనికి సంబంధించి కొన్ని లింక్‌లను అందుబాటులో ఉంచింది. అలాగే ఆయా బ్రాంచ్‌లలో సంబంధింత సమాచారాన్ని అందించేందుకు ఒక ఉద్యోగి ప్రత్యేకంగా అందుబాటులో ఉంటారు. తద్వా వేలం వేయనున్న ప్రాపర్టీ వివరాలు, వేలం ప్రక్రియ, వివరాలను కొనుగోలుదారులు తెలుసుకోవచ్చని బ్యాంక్ పేర్కొంది. ఇ-వేలంలో పాల్గొనేందుకు అర్హత దీనికి బిడ్డర్లు కొన్ని ఫార్మాలిటీలను ముందుగానే పూర్తి చేయాలి. నోటీసులో పేర్కొన్న విధంగా నిర్దిష్ట ఆస్తి కొనుగోలుకు నిర్దేశిత సొమ్మును చెల్లించాలి. కేవైసీ పత్రాలు సంబంధిత శాఖకు సమర్పించాలి. చెల్లుబాటు అయ్యే డిజిటల్ సంతకాన్ని ఇవ్వాలి. ఇందుకు బిడ్డర్లు ఇ-వేలం వేసేవారిని లేదా మరే ఇతర అధీకృత ఏజెన్సీని సంప్రదించవచ్చు. ఈఎండీ డిపాజిట్ , కేవైసీ పత్రాలు అందించిన అనంతరం లాగిన్ ఐడీ, పాస్వర్డ్ బిడ్డర్ల ఇమెయిల్ పంపిస్తారు. దీంతో వేలం నిబంధనల ప్రకారం ఇ-వేలంలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. Bid for the best! Here’s your chance to buy cheaper Residential & Commercial Properties, Land, Plant & Machinery, Vehicles and many more. Attend SBI Mega E-Auction and place your best bid. Know more: https://t.co/vqhLcagoFF #Auction #MegaEAuction #Properties #DreamHome #Land pic.twitter.com/80CNZueg6k — State Bank of India (@TheOfficialSBI) March 1, 2021 -
24 వరకు రిమాండ్‌లో నీరవ్
లండన్: పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేల కోట్ల రూపాయలు టోకరా వేసి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి లండన్ కోర్టు మే 24 వరకు రిమాండ్ విధించింది. భారత్‌కు నీరవ్‌ను తిరిగి అప్పగించే కేసు లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ కోర్టులో నడుస్తోంది. ఈ కేసులో నీరవ్ గత నెలలో అరెస్టయ్యారు. అప్పటినుంచి వాండ్స్‌వర్త్ జైలులోనే ఉంటున్నారు. ఈ కేసు శుక్రవారం మరోసారి విచారణకు రాగా, వెస్ట్‌మినిస్టర్ కోర్టు చీఫ్ మేజిస్ట్రేట్ ఎమ్మా అర్బత్నాట్ ముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నీరవ్ హాజరయ్యారు. మే 30న పూర్తి స్థాయి వాదనలు వింటామని, ఆ రోజు వ్యక్తిగతంగా కోర్టులో హాజరుకావాలని ఎమ్మా ఆదేశించారు. అయితే మే 24న మరోసారి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరుకావాలని చెప్పారు. ఈ విషయంలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని నీరవ్ తరఫు న్యాయవాది జెస్సికా జోన్స్‌ను అడగగా.. ఏమీ లేవని బదులిచ్చారు. దీంతో నీరవ్ తరఫున వేరే బెయిల్ పిటిషన్ ఏదీ దాఖలు కాలేదని ఎమ్మా రుజువు చేసుకుని విచారణ కొనసాగించారు. నీరవ్‌కు బెయిల్ మంజూరు చేస్తే తిరిగి లొంగిపోరనే కారణంతో మార్చి 29న ఆయనకు కోర్టు బెయిల్ నిరాకరించింది. నీరవ్ కార్ల వేలం.. నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలకు చెందిన 13 లగ్జరీ కార్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వేలం వేసింది. నీరవ్‌కు చెందిన 11 కార్లు, చోక్సీకి చెందిన రెండు కార్లను ఈ–వేలం వేసింది. దీంతో ప్రభుత్వ ఖజానాకు రూ.3.29 కోట్ల ఆదాయం వచ్చింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద వారి కార్లను ఈడీ అటాచ్ చేసింది. వాటిని వేలం వేసుకోవచ్చని ఈడీకి మార్చిలోనే ముంబైలోని పీఎంఎల్ఏ కోర్టు అనుమతులిచ్చింది. దీంతో గురువారం వాటిని ఈడీ ఆన్లైన్లో వేలం వేసింది. మెటల్ స్క్రాప్ ట్రేడ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ వేలాన్ని నిర్వహించింది. -
అగ్రిగోల్డ్ ఆస్తుల వేలానికి శ్రీకారం
సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ ఆస్తుల్ని జిల్లా స్థాయి ఉన్నతాధికారుల కమిటీ ద్వారా ఈ–వేలం విధానంలో విక్రయించాలని హైకోర్టు నిర్ణయించింది. ముందుగా కృష్ణా జిల్లాలోని అత్యంత ఖరీదైన ఐదు ఆస్తులను జిల్లా స్థాయి కమిటీ ద్వారా అమ్మాలని ఆదేశాలిచ్చింది. జిల్లా కలెక్టర్, జిల్లా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ రిజిస్ట్రార్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శిలతో కూడిన కమిటీ వేలం ప్రక్రియను ప్రారంభించాలని, ఈ కమిటీకి సీఐడీలోని బాధ్యత గల అధికారి సహకరించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రహ్మణియన్, జస్టిస్ ఎస్వీ భట్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. విజయవాడ గాంధీనగర్‌లోని వాణిజ్యపరమైన షెడ్‌తో కూడిన 1,712 చదరపు గజాల స్థలం, మొగల్రాజపురంలోని భవనం, పాయకరావుపేటలోని ఖాళీ స్థలంతోపాటు, వీర్లపాడు మండలంలోని వ్యవసాయ భూమి, జిల్లా కేంద్రం మచిలీపట్నంలోని స్థలాలను ఈ–వేలం ద్వారా విక్రయించాలని స్పష్టం చేసింది. ‘మా ఉత్తర్వులు వెలువడిన రెండు వారాల్లోగా ఆగ్రిగోల్డ్ ఆస్తుల వేలానికి నోటిఫికేషన్ విడుదల చేయాలి. రెండు తెలుగు దినపత్రికల జిల్లా ఎడిషన్లలో ప్రకటనలు ఇచ్చి పూర్తి వివరాల్ని వెబ్సైట్లో పొందుపర్చాలి. వేలంలో నిర్ణయించిన కనీస ధరలో పదో శాతం వేలందారులు డిపాజిట్ చేయాలి. వేలం గురించి ముందుగానే దండోరా వేయించాలి. కరపత్రాలు ప్రచురించి పంపిణీ చేయాలి. గ్రామ పంచాయతీ, ప్రభుత్వ కార్యాలయాల్లోని బోర్డుల్లో వేలం వివరాలు ప్రదర్శించాలి. ఈ–వేలం నిబంధనలను జిల్లా స్థాయి కమిటీ అమలు చేయాలి. నోటిఫికేషన్ తర్వాత ఆరువారాల్లో వేలం ప్రక్రియను పూర్తి చేయాలి’ అని షరతులు విధించింది. విచారణ సాగిందిలా: అగ్రిగోల్డ్, అక్షయగోల్డ్ కంపెనీల మోసాలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలంటూ దాఖలైన వేర్వేరు వ్యాజ్యాలను ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారించింది. జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి ఆస్తుల్ని విక్రయించాలని, ఆ కమిటీలో కలెక్టర్, రిజిస్ట్రార్లతోపాటు జిల్లా జడ్జి ఉండాలని గత విచారణ సందర్భంగా అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ సూచించారు. న్యాయపరంగా కేసుల ఒత్తిడి ఉన్నందున జిల్లా జడ్జిని నియామకానికి ధర్మాసనం అంగీకరించలేదు. జిల్లా జడ్జి స్థానంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఉంటారని స్పష్టం చేసింది. కాగా, అగ్రిగోల్డ్‌కు చెందిన 10 ఆస్తులను వేలం వేసేందుకు జాబితాను ఏపీ సీఐడీ గతంలో హైకోర్టుకు సమర్పించింది. వీటిలో ఐదు ఆస్తుల వేలానికి న్యాయస్థానం అనుమతిచ్చింది. మిగిలిన ఐదింటిలోని ఒక ఆస్తిని తమ ఆస్తుల జప్తునకు ముందే 2015లోనే అమ్మేసినట్లుగా అగ్రిగోల్డ్ యాజమాన్యం తరఫు సీనియర్ న్యాయవాది రవిచందర్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఆ ఆస్తిని అమ్మి ఉంటే ఈసీలో కొనుగోలు చేసిన యజమాని పేరు ఎందుకు లేదని ఏజీ ప్రశ్నించారు. ధర్మాసనం కల్పించుకుని.. గతంలోనే విక్రయించినట్లు చెబుతున్న సదరు ఆస్తికి చెందిన రిజిస్ట్రేషన్ పత్రాల్ని తమ ముందుంచాలని అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని ఆదేశించింది. మరో రెండు ఆస్తులు ఆంధ్రాబ్యాంకులో తనఖా పెట్టినందున వాటి జోలికి ధర్మాసనం వెళ్లలేదు. నెల్లూరు జిల్లాలోని రెండు ఆస్తులకు సీఐడీ అధికారులు నిర్ణయించిన విలువ తక్కువగా ఉందని అగ్రిగోల్డ్ అభ్యంతరం చెప్పడంతో ఈ రెండింటి వేలంపై ధర్మాసనం తన నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఈ నెల 25న జరిగే తదుపరి విచారణ నాటికి వేలం ప్రక్రియలో పురోగతి తెలపాలని ఆదేశించింది. అక్షయ గోల్డ్ కేసులో.. మరోవైపు అక్షయగోల్డ్ కేసులో నాలుగు ఆస్తుల్లో రెండింటికి మాత్రమే బిడ్లు వచ్చాయి. కర్నూలులో ఒక భవనాన్ని కొనుగోలు చేసేందుకు రూ.1.31 కోట్లకు అత్యధిక బిడ్ వచ్చింది. అయితే పిటిషనర్ తీసుకొచ్చిన వ్యక్తి అదే భవనాన్ని రూ.1.51 కోట్లకు కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని వారి న్యాయవాది కరణం శ్రవణ్‌కుమార్ తెలిపారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. అత్యధిక బిడ్ దాఖలు చేసిన వ్యక్తితోపాటు పిటిషనర్ తీసుకొచ్చిన వ్యక్తినీ 25న జరిగే విచారణకు తీసుకురావాలని ఆదేశించింది. ఇక్కడే ఆ భవనం ధర ఎంతో తేల్చుతామంది. మరో ఆస్తికి ఒకే బిడ్ దాఖలు కావడంతో దాన్ని రద్దు చేయాలని ఆదేశించింది. తెలంగాణలో అక్షయగోల్డ్కున్న పది ఆస్తుల విలువలతో పూర్తి వివరాలను ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది శరత్‌కుమార్ అందజేయగా.. వీటి విలువలపై పిటిషనర్ అభిప్రాయం తెలపాలని ఆదేశాలిచ్చింది. -
తగ్గిన టీటీడీ తలనీలాల ఆదాయం
-
డిపాజిట్ పసిడి ఈ-ఆక్షన్ కు రంగం సిద్ధం!
న్యూఢిల్లీ: డిపాజిట్ పథకం కింద ప్రభుత్వ సమీకరించిన పసిడిని ఈ-ఆక్షన్ ద్వారా విక్రయించడానికి రంగం సిద్ధమయ్యింది. ప్రభుత్వ రంగ ట్రేడింగ్ సంస్థ- ఎంఎంటీసీ కనీసం ఐదు కేజీల కడ్డీల చొప్పున లాట్స్గా వీటిని విక్రయించనున్నట్లు సమాచారం. 2015-16 బడ్జెట్లో ప్రకటించిన ఈ పథకం గత ఏడాది నవంబర్ 5వ తేదీన ప్రారంభమైంది. ఇప్పటివరకూ 105 డిపాజిటర్ల నుంచి 2.8 టన్నుల పసిడి ఈ పథకం కింద డిపాజిట్ అయ్యిందని మేలో ఆర్థికమంత్రిత్వ శాఖ పార్లమెంటుకు తెలిపింది. ఇటీవల సమావేశం అయిన వాణిజ్య, ఆర్థిక శాఖ అధికారులు పసిడి ఆక్షన్ విషయమై చర్చించినట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. గృహాలు, వివిధ సంస్థలు, దేవాలయాల వద్ద ఉపయోగించకుండా ఉన్న పసిడిని సమీకరించడం, దేశంలో విక్రయిం చడం, దేశీయం గా తగిన సరఫరాల ద్వారా దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించడం లక్ష్యంగా కేంద్రం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. భారత్ ప్రతి యేడాదీ దాదాపు వెయ్యి టన్నుల పసిడి దిగుమతులకుగాను భారీ విదేశీ మారకద్రవ్యాన్ని వెచ్చించాల్సి వస్తోంది. -
తేలని ఈ-వేలం!
శ్రీకాకుళం టౌన్: జిల్లాలోని వంశధార, నాగావళి నదుల్లో 14 ఇసుక రేవుల కేటాయింపు కోసం ఈ-వేలం తేదీలను మైన్స్ అండ్ జియాలజీ అధికారులు సిద్ధం చేశారు. ఎంఎస్టీసీ పర్యవేక్షణలో ఆన్లైన్ బిడ్లు స్వీకరిస్తామని ప్రకటించినా ఇంతవరకు వేలం తేదీలు మాత్రం ఖరారు కాలేదు. ఈ నెల 15, 16 తేదీల్లో వేలం జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ మంత్రివర్గ సమావేశం ఉందన్న సాకుతో రద్దు చేశారు. ముందుగా ఈ-వేలానికి తొలుత 17 రేవులను ఎంపిక చేసిన అధికారులు ఆ తరువాత కోరాడ, మడపాం, పోతయ్యవలస రేవులకు వేలం నిలిపివేశారు. ఇప్పటికే రేవుల వారీగా దరఖాస్తులను విక్రయించిన ఎంఎస్టీసీ అధికారులు ఈ-వేలానికి సర్వం సిద్ధం చేయగా..కాంట్రాక్టర్లు, నిర్మాణ సంస్థలు సన్నద్ధమయ్యారు. ఇంతలోనే మూడు రేవులను రద్దు చేయడం వెనుక ఆంతర్యం అంతు చిక్కడం లేదని దరఖాస్తు దారులంటున్నారు. అక్రమ తవ్వకాలు వంశధార నదిపై ఫీజుబులిటీ పొందిన రేవుల్లో సరుబుజ్జిలి మండలం యరగాం, పురుషోత్తపురం, ఆమదాలవలస మండలం చెవ్వాకులపేట, దూసి, పొందూరు మండ లం సింగూరు, కొత్తూరు మండలం సిరుసువాడ, కడుమ, భామిని మండలం సింగిడి, బిల్లుమడ, శ్రీకాకుళం మండలం కళ్లేపల్లి, పొన్నాం, హయాతీనగరం, నరసన్నపేట మండలం బుచ్చిపేట, హిరమండలం మండ లం అందవరం రేవుల్లో ఇసుక తవ్వకాలకు సిద్ధం చేశారు. ఈ రేవుల్లో అత్యధికంగా దూసి రేవుకు 11 మంది దరఖాస్తు చేసుకోగా, చెవ్వాకులపేట, బుచ్చిపేటకు పదిమం ది దరఖాస్తు చేసుకున్నారు. హయాతీనగరం రేవుకు 9, పురుషోత్తపురం, పొన్నాం, సింగూరు రేవులకు ఎనిమిది వంతున దరఖాస్తులు వచ్చాయి. కళ్లేపల్లిలో 7, అందవరంలో ఆరు, కుడుమ, సింగిడి ఐదు, యరగాం, సిరుసువాడ రేవులకు ఏడు, బిల్లమడ రేవులో అత్యల్పంగా మూడు దరఖాస్తులు వచ్చాయి. అయితే వేలం నిర్వహించకపోవడంతో వీటితో పాటు ఇంకా పరిశీలనలో ఉన్న రేవుల్లో కూడా అక్రమ తవ్వకాలు ఊపందుకున్నాయి. రాత్రివేళ అడ్డూఆపులేకుండా ఇసుక తవ్వకాలు సాగిపోతున్నా అడ్డుకునే నాథుడే లేకుండా పోయాడు. 22వ తేదీతో ముగుస్తున్న పర్యావరణ అనుమతులు జిల్లాలో ఇసుక తవ్వకాలకు అనుమతులు జాప్యం వల్ల ప్రభుత్వ పనులకు అడ్డంకిగా మారింది. నదుల్లో ఇసుక తవ్వకాలకు పర్యావరణ అనుమతులు సైతం ఈ నెల 22వ తేదీతో ముగుస్తున్నాయి. ఈ-వేలంలో రేవులను దక్కించుకున్న వారే కొత్తగా పర్యావరణ అనుమతులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ అనుమతులు రావాలంటే మరో పది రోజులు పడుతోంది. ఈ-వేలం జరిగిన తర్వాత కూడా పర్యావరణ అనుమతులు రాక పోతే అవి వచ్చినంతవరకు తవ్వకాలకు జరపడానికి వీలుండదు. -
వేలానికి కింగ్‌ఫిషర్ హౌస్
న్యూఢిల్లీ: బకాయిల వసూలు నిమిత్తం ముంబై దేశీ విమానాశ్రయం సమీపంలో ఉన్న కింగ్‌ఫిషర్ హౌస్‌ను మార్చి 17న ఎస్బీఐ.. ఈ-వేలం వేయనున్నది. దీన్ని ఎస్బీఐక్యాప్ ట్రస్టీ నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా 2,402 చదరపు మీటర్ ప్రాపర్టీని వేలం ద్వారా ఇతరులకు విక్రయించనున్నది. -
ఏప్రిల్ 2న తలనీలాల ఈ-వేలం
తిరుమల : తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించిన తలనీలాలను విక్రయించడానికి ఏప్రిల్ 2వ తేదీన ఈ-వేలం నిర్వహించనున్నారు. ప్రతీనెలా మొదటి గురువారం ఈ-వేలం నిర్వహించాలని టీటీడీ ఈవో దొండపాటి సాంబశివరావు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో విశాఖపట్నంలోని మెటల్ స్క్రాప్ ట్రేడింగ్ కార్పొరేషన్ (ఎంఎస్టీసీ) లిమిటెడ్ సంస్థల్లోని ఈ-వేలం ద్వారా గురువారం టీటీడీ తలనీలాలు విక్రయించనుంది. ఆసక్తిగల బిడ్డర్లు తిరుపతిలోని టీటీడీ జనరల్ మేనేజరు(వేలం) కార్యాలయంలోని 0877-2264429 నంబరును సంప్రదించవచ్చని టీటీడీ ప్రజా సంబంధాల విభాగం తెలిపింది. శ్రీవారి దర్శనానికి 9 గంటలు : తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ తగ్గింది. గదులు సులభంగా లభించాయి. సాయంత్రం 6 గంటల వరకు 46,848 మంది భక్తులు శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అలానే సర్వదర్శనం కోసం 10 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు 9 గంటల్లో, కాలిబాట భక్తులకు 4 గంటల్లో స్వామి దర్శనం లభించింది. కాగా, మంగళవారం రూ.3.24 కోట్లు హుండీ కానుకలు లభించాయి. -
‘స్వగృహాలు’ కావాలంటే ధర కోట్ చేయండి
టీఎన్జీఓలకు ఈ-వేలం ఆఫర్ సీఎస్ ఆధ్వర్యంలో జరిగిన హైలెవల్ కమిటీ సమావేశంలో నిర్ణయం అవి ఆమోదయోగ్యంగా ఉంటాయో లేవో అప్పుడు చెబుతారట ప్రభుత్వపరంగా ధర నిర్ణయించకుండా దోబూచులాట సాధారణ ప్రజలకు మాత్రం ప్రస్తుతం అమల్లో ఉన్న రేట్లనే వర్తింపు సాక్షి, హైదరాబాద్: ఓ ప్రాజెక్టుకు మంచి డిమాండ్ ఉన్నప్పుడు వేలం నిర్వహించటం కద్దు. ఓ ప్రభుత్వ భూమి కోసం నలుగురైదుగురు పోటీ పడుతున్నప్పుడు ఎవరెక్కువ ధర చెల్లించేందుకు ముందుకొస్తే వారికి కేటాయించేందుకు ఆక్షన్ నిర్వహించిన దాఖలాలున్నాయి. కానీ కొనేవారు లేక దాదాపు రెండేళ్లుగా తెల్ల ఏనుగుల్లా మూలుగుతున్న ‘రాజీవ్ స్వగృహ’ ఇళ్లను వేలం ద్వారా అమ్మాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయించటం చర్చనీయాంశంగా మారింది. సాధారణ ప్రజలు కొనాలంటే మాత్రం ప్రస్తుతం అమలులో ఉన్న ధరే చెల్లించాలని, టీఎన్జీఓలకు రాయితీ ధరలకు వాటిని అమ్మనున్నట్టు ఇటీవల ముఖ్యమంత్రి చె.చంద్రశేఖరరావు ప్రకటించిన నేపథ్యంలో... వారికి వేలం పద్ధతిలో అమ్మాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాయితీ ధరలపై ఓ నిర్ణయం తీసుకునేందుకు సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ అధ్యక్షతన రాజీవ్‌స్వగృహ ఉన్నతస్థాయి కమిటీ సమావేశమైంది. ధర వెల్లడించొద్దు... రాజీవ్ స్వగృహ ఇళ్ల ధరలను కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం తగ్గించింది. ఎస్కలేషన్ పేర కాంట్రాక్టర్లకు గతంలో దాదాపు రూ.100 కోట్లను అదనంగా చెల్లించిన నేపథ్యంలో ఆ భారాన్ని కొనుగోలుదారులపై మోపేందుకు 2013 డిసెంబరులో గుట్టుచప్పుడు కాకుండా ఇళ్ల ధరలను పెంచారు. దీంతో ఇటీవల ధరలను స్వల్పంగా తగ్గించినా కొనుగోలుదారులకు పెద్దగా ప్రయోజనం లేదు. ఇదే సమయంలో టీఎన్జీవోలకు రాయితీధరలకు ఇళ్లను కేటాయించనున్నట్టు సీఎం ప్రకటించడంతో హైలెవల్ కమిటీ సోమవారం భేటీ అయింది. టీఎన్జీవోలు చదరపు అడుగు ధర రూ.1500 వరకు ఉండేలా సవరించాలని కోరుతున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యమేర్పడింది.అంతతక్కువ ధర నిర్ణయిస్తే ప్రభుత్వానికి భారీ నష్టం వాటిల్లనున్నందున అంతకంటే ఎక్కువ ధర ఉండాలని ఇందులో అభిప్రాయపడ్డారు. ఆ ధర ఎంత అనే విషయంపై ముం దుగా ఓ నిర్ణయానికి రావటం కంటే, టీఎన్జీఓలు వాస్తవంగా ఎంత ధర పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారో పరిశీలించాలని భావిస్తున్నారు. ఇందుకోసం ఈ-వేలం ద్వారా ఇళ్లను అమ్మనున్నట్టు ప్రకటన ఇచ్చి, వారిని దరఖాస్తు చేసుకునేందుకు ఆహ్వానిస్తారు. బండ్లగూడ, పోచారం ప్రాజెక్టులకు ఈ వెసులుబాటు కల్పించారు. కొనాలనుకునే టీఎన్జీఓ సభ్యులు స్వయంగా ఇళ్లను పరిశీలించి, మార్కె ట్ ధరలను తెలుసుకొని ఆ ఇంటికి ఎంత ధర పెట్టాలనుకుంటున్నారో ఈ-వేలం ద్వారా కోట్ చేసేలా సూచించాలని పేర్కొన్నారు. అలా వచ్చే కొటేషన్లను పరిశీలించి ఆ ధరలు ఆమోదయోగ్యంగా ఉన్నాయో లేవో పరిశీ లించి సీఎం ముందుంచనున్నారు. ఈ విధానా న్ని టీఎన్జీఓలకు మాత్రమే వర్తింపజేస్తారు. ఆ ధరలు ఆమోదయోగ్యం కాని పక్షంలో ప్రభుత్వపరంగా స్వగృహకు ‘రాయితీ’లు ఇవ్వాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే బ్యాంకు లోన్లు, వాటికి చెల్లిస్తున్న వడ్డీలు తడిసిమోపెడైన నేపథ్యంలో తక్కువ ధరలను ఖరారు చేస్తే స్వగృహపై భారం పడి తీవ్ర నష్టాలు వాటిల్లుతాయని అధికారులు సీఎస్ దృష్టికి తెచ్చారు. కేటాయించిన భూములకు గాను ‘స్వగృహ’ నుంచి రుసుము వసూలు చేయరాదని నిర్ణయిస్తే ధరలను తగ్గించేందుకు వెసులుబాటు ఉంటుందని అభిప్రాయపడ్డారు. దానికి సీఎం నుంచి ఆమోదం వస్తేనే ఇళ్లను తక్కువ ధరలకు ఖరారు చేయనున్నారు. ఈ-వేలానికి సంబంధించి పక్షం రోజు ల్లో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. సాధారణ ప్రజలు మాత్రం ఇళ్లను కొనాలంటే అధికారులు ఇప్పటికే నిర్ధారించిన ధరలే వర్తిస్తాయని అధికారులు తేల్చారు. సమావేశంలో గృహనిర్మాణ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. -
ఏపిలో నేటి నుంచి ఎర్రచందనం వేలం
-
బొగ్గు క్షేత్రాల 'ఈ ఆక్షన్' కు ఆర్డినెన్స్!
న్యూఢిల్లీ: బొగ్గు క్షేత్రాలపై కేంద్ర ప్రభుత్వం ఆర్టినెన్స్ తీసుకురావడానికి ప్రయత్నాలు చేపడుతోంది. సుప్రీం కోర్టు రద్దు చేసిన బొగ్గు క్షేత్రాల భూమిని కేంద్రం సేకరించనుంది. పీఎస్ యూ, రాష్ట్రాలకు ప్రత్యేక్షంగా భూకేటాయింపులు చేయడానికి ఈ-ఆక్షన్ నిర్వహించడానికి ఆర్డినెన్స్ తేవాలని కీలక నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. 1993 నుంచి చేసిన 214 బొగ్గు క్షేత్రాల కేటాయింపులను సుప్రీం కోర్టు రద్దు చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా ఈశాన్య రాష్ట్రాలు, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, చత్తీస్ ఘఢ్, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలకు లబ్ది చేకూరనుంది.