
వేలానికి కింగ్‌ఫిషర్ హౌస్
న్యూఢిల్లీ: బకాయిల వసూలు నిమిత్తం ముంబై దేశీ విమానాశ్రయం సమీపంలో ఉన్న కింగ్‌ఫిషర్ హౌస్‌ను మార్చి 17న ఎస్‌బీఐ.. ఈ-వేలం వేయనున్నది. దీన్ని ఎస్‌బీఐక్యాప్ ట్రస్టీ నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా 2,402 చదరపు మీటర్ ప్రాపర్టీని వేలం ద్వారా ఇతరులకు విక్రయించనున్నది.