kingfisher house
-
ఆరోసారి వేలానికి కింగ్‌ఫిషర్ హౌస్
కోల్కత్తా : భారత్ బ్యాంకులకు వేలకోట్లు ఎగనామం పెట్టి విదేశాల్లో తలదాచుకుంటున్న విజయ్ మాల్యా కింగ్ ఫిషర్ హౌజ్ మరోసారి వేలానికి రాబోతుంది. రూ.82 కోట్ల రిజర్వు ధరతో దీని వేలం నిర్వహించబోతున్నారు. ప్రభుత్వం ఈ ప్రాపర్టీని వేలం వేయడం ఇది ఆరోసారి. డెట్ రికవరీ ట్రిబ్యునల్(కర్నాటక), డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్సియల్ సర్వీసెస్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం కింగ్‌ఫిషర్ హౌజ్(కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ముంబై ఆఫీసు) డిసెంబర్ 19న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వేలం వేయనున్నట్టు తెలిసింది. ఆసక్తి ఉన్న బిడ్డర్లు ముందస్తుగా రూ.50 లక్షల ఇంక్రిమెంటల్ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. కాగ, కింగ్‌ఫిషర్ హౌజ్‌కు చెందిన 9 వాహనాలను రూ.4,90,00 రిజర్వు ధరకు ఈ నెల 11న వేలం వేశారు. మే 31న నాడు నిర్వహించిన వేలంలో రిజర్వు ధరను రూ.93.50 కోట్లకు తగ్గించినప్పటికీ ఈ స్థిరాస్తిని కొనడానికి ఎవరు ముందుకు రాలేదు. 2401.70 చదరపు మీటర్ల విస్తర్ణీంలో ఇది విస్తరించింది. గతేడాది మార్చిలో ఈ ప్రాపర్టీ తొలిసారి వేలానికి వచ్చింది. అప్పట్లో రిజర్వు ధర రూ.150కోట్లు. -
కింగ్ ఫిషర్ వేలం మళ్లీ విఫలం
రూ.135 కోట్ల రిజర్వ్ ధరకు బిడ్డింగ్ కరువు ముంబై: బ్రిటన్‌కు పారిపోయిన ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారు విజయ్‌మాల్యా నియంత్రణలోని కింగ్‌ఫిషర్ హౌస్ వేలం మళ్లీ విఫలమైంది. ఈ హౌస్ వేలానికి సంబంధించి రూ.135 కోట్ల బిడ్ నిర్ణయించినా, ఈ ధరకు ఎవ్వరూ ముందుకు రాలేదు. ఇంతక్రితం మార్చిలో రూ.150 కోట్ల రిజర్వ్ ధర పెట్టినా, బిడ్డింగ్‌కు ఎవ్వరూ ముందుకురాకపోవడంతో ఈ ధరలు తగ్గించింది. అయితే ఈ ధరకూ బిడ్డింగ్ లభించలేదని మాల్యాకు దాదాపు రూ.9,000 కోట్ల రుణాలు అందించిన 17 బ్యాంకుల కన్సార్షియం వర్గాలు తెలిపాయి. రిజర్వ్ ధరను మరింత తగ్గించే అవకాశం ఉందనీ తెలిపాయి. ముంబై విమానాశ్రయంలో నిలిపి ఉంచిన మాల్యా విమానం, కింగ్‌ఫిషర్ లోగోల విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. గతంలో మాల్యా విమానానికి రిజర్వ్ ధర రూ.152 కోట్లు కాగా, బిడ్ రిజర్వ్ ధరలో ఒకశాతంకన్నా తక్కువగా రూ.1.09 కోట్లుకు దాఖలైంది. దీనితో సంబంధిత వేలాన్ని సేవల పన్ను విభాగం రద్దు చేసింది. -
ఏడువేల కోట్ల రుణానికి.. 150 కోట్ల ఆస్తా?
ముంబై: భారీగా అప్పులు ఎగ్గొట్టి, ప్రస్తుతం పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్‌మాల్యా ఆస్తులను వేలానికి బ్యాంకులు సిద్ధమయ్యాయి. బ్యాంకులకు విజయ్‌మాల్యా రూ. 7వేల కోట్ల వరకు ఎగనామం పెట్టారు. ఈ క్రమంలో ఆయన నుంచి ఎగ్గొట్టిన రుణాలను రాబట్టుకునేందుకు బ్యాంకులు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా ముంబైలోని మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్ హౌస్‌ను గురువారం ఈ-వేలం వేయనున్నారు. అంధేరిలోని 2,401.70 చదరపు మీటర్లు విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాపర్టీకి రూ. 150 కోట్లకు మించి ధర పలికే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో రూ. ఏడువేల కోట్ల అప్పులకు ఈ 150 కోట్ల ఆస్తి ఏ మూలకు సరిపోతుందనే వాదన వినిపిస్తోంది. ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం గురువారం ఈ కింగ్‌ఫిషర్ హౌస్‌ను ఆన్లైన్లో ఈ వేలం వేయనుంది. ఈ వేలంలో పాల్గొనేవాళ్లు రూ. 5 లక్షలు చెల్లించి, రూ. 15 లక్షలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. విజయ్‌మాల్యాకు చెందిన కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ సంస్థ బ్యాంకుల నుంచి రూ. 6,963 కోట్లు రుణాలు తీసుకొని.. ఎగ్గొట్టింది. ప్రస్తుతం కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ దివాళాతీసి మూతపడటంతో గత ఏడాది దానికి చెందిన ఈ భవనాన్ని ఎస్బీఐ స్వాధీనం చేసుకుంది. బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులకుగాను కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌తోపాటు విజయ్‌మాల్యా, ఆయనకు చెందిన యునైటెడ్ బ్రివరీస్ లిమిటెడ్ కూడా పూచికత్తు దారులుగా ఉన్నాయి. బ్యాంకు రుణాల ఎగవేత వ్యవహారం తలకు చుట్టుకోవడంతో విజయ్‌మాల్యా దేశం నుంచి వెళ్లిపోయి ప్రస్తుతం లండన్‌లో ఉన్నట్టు భావిస్తున్నారు. గోవాలోని కింగ్ఫిషర్కు చెందిన విల్లాను కూడా బ్యాంకులు స్వాధీనం చేసుకున్నాయి. ఈ విల్లాకు రూ. 90 కోట్లు ధర పలుకుతుందని భావిస్తున్నారు. -
వేలానికి కింగ్‌ఫిషర్ హౌస్
న్యూఢిల్లీ: బకాయిల వసూలు నిమిత్తం ముంబై దేశీ విమానాశ్రయం సమీపంలో ఉన్న కింగ్‌ఫిషర్ హౌస్‌ను మార్చి 17న ఎస్బీఐ.. ఈ-వేలం వేయనున్నది. దీన్ని ఎస్బీఐక్యాప్ ట్రస్టీ నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా 2,402 చదరపు మీటర్ ప్రాపర్టీని వేలం ద్వారా ఇతరులకు విక్రయించనున్నది. -
కింగ్‌ఫిషర్ హౌస్ స్వాధీనం
ముంబై: అప్పుల ఊబిలో కూరుకుపోయిన విజయ్ మాల్యా యూబీ గ్రూప్‌పై బ్యాంకులు కొరడా ఝులిపిస్తున్నాయి. బకాయిల వసూలు చర్యల్లో భాగంగా కింగ్‌ఫిషర్ హౌస్‌ను మంగళవారం స్వాధీనం చేసుకున్నాయి ఎస్బీఐ నేతృత్వంలోని 17 బ్యాంకుల కన్సార్షియం ఈ మేరకు చర్యలు తీసుకుంది. దీని విలువ రూ.100 కోట్లుగా అంచనా. మూతబడిన మాల్యా కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ నుంచి దాదాపు 20 బ్యాంకులకు మొత్తం రూ.6,800 కోట్ల మేర రుణ బకాయిలు(వడ్డీ కాకుండా) రావాల్సి ఉంది. దీనికోసం కొన్ని బ్యాంకులు ఆయనపై ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారు ముద్రను కూడా వేయడం.. మాల్యా దీన్ని సవాలు చేయడం జరిగాయి. కింగ్‌షిషర్ ఎయిర్‌లైన్స్‌కు అతిపెద్ద ఆస్తుల్లో ఒకటైన కింగ్‌ఫిషర్ హౌస్ విస్తీర్ణం 17,000 చదరపు అడుగులు. ఇది ఇక్కడి దేశీ ఎయిర్పోర్ట్ టెర్మినల్‌కు దగ్గర్లోని విలే పార్లేవద్ద ఉంది. యూబీ గ్రూప్‌లో కీలక కంపెనీగా వెలుగొందిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మూసివేత తర్వాత బ్యాంకులు 2013 ఫిబ్రవరిలోనే బకాయిల రికవరీ ప్రక్రియకు తెరతీశాయి. 2012 అక్టోబర్‌లో ఎయిర్‌లైన్స్ కార్యకలాపాలు పూర్తిగా ఆగిపోయాయి. అదే ఏడాది డిసెంబర్లో ప్లయింగ్ లెసైన్స్ కూడా రద్దయింది. కాగా, తమ రుణదాతలకు కన్సార్షియంగా వ్యవహరిస్తున్న ఎస్బీఐక్యాప్ ట్రస్టీకి కింగ్‌ఫిషర్ హౌస్ ప్రాపర్టీని స్వాధీనం చేసినట్లు కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, కింగ్‌ఫిషర్ హౌస్ స్వాధీనాన్ని ఎస్బీఐ డిప్యూటీ ఎండీ, గ్రూప్ ఎగ్జిక్యూటివ్(మొండిబకాయిల నిర్వహణ) ప్రవీణ్ కుమార్ మల్హోత్రా ధ్రువీకరించారు. ఇదే ప్రాపర్టీని ఆదాయ పన్ను, సేవల పన్ను విభాగాలు కూడా తమ బకాయిల వసూలుకోసం జప్తు చేసిన విషయంపై మల్హోత్రా మాట్లాడుతూ.. సంబంధిత పన్నుల విభాగాలతో చర్చించిన తర్వాత తదుపరి నిర్ణయం ఉంటుందని చెప్పారు. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రూ.350 కోట్లు బకాయిపడిందని.. ఐటీ చట్టం కింద కింగ్‌ఫిషర్ హౌస్‌ను అటాచ్ కూడా చేసిన నేపథ్యంలో తమ బకాయిలను ముందుగా సెటిల్ చేసిన తర్వాతే ఈ బిల్డింగ్‌ను స్వాధీనం చేసుకునేందుకు ముందుకెళ్లేలా బ్యాంకులను ఆదేశించాలంటూ ఐటీ శాఖ 2013 డిసెంబర్లో బెంగళూరు హైకోర్టును ఆశ్రయించింది. -
కింగ్‌ఫిషర్ ఆస్తులు అటాచ్
బెంగళూరు: కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ అన్ని ఆస్తులను ఆదాయపు పన్ను విభాగం అటాచ్ చేసింది. ఈ కంపెనీ రూ.350 కోట్ల ఆదాయపు పన్ను బకాయిలు చెల్లించనందుకు ఆస్తులను అటాచ్ చేశామని ఐటీ అధికారి లోకేశ ఆదివారం చెప్పారు. ఈ ఆస్తుల విక్రయం, అటాచ్మెంట్ల ద్వారా తమ బకాయిలను రికవరీ చేసుకునే ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు. 2010-11, 2011-12 ఆర్థిక సంవత్సరాల్లో ఈ కంపెనీ ఉద్యోగుల వేతనాల నుంచి టీడీఎస్( మూలం వద్ద పన్ను కోత) రూపంలో కోత కోసిన పన్నును ఇప్పటి వరకూ ఆదాయపు పన్ను శాఖకు చెల్లించలేదు. 1961 నాటి ఆదాయపు పన్ను చట్టం కింద ముంబై దేశీయ విమానాశ్రయం సమీపంలోని వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవేలోని కింగ్‌ఫిషర్ హౌస్‌ను ఎటాచ్ చేశామని లోకేశ పేర్కొన్నారు.