కింగ్‌ఫిషర్ ఆస్తులు అటాచ్
బెంగళూరు: కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ అన్ని ఆస్తులను ఆదాయపు పన్ను విభాగం అటాచ్ చేసింది. ఈ కంపెనీ రూ.350 కోట్ల ఆదాయపు పన్ను బకాయిలు చెల్లించనందుకు ఆస్తులను అటాచ్ చేశామని ఐటీ అధికారి లోకేశ ఆదివారం చెప్పారు. ఈ ఆస్తుల విక్రయం, అటాచ్‌మెంట్‌ల ద్వారా తమ బకాయిలను రికవరీ చేసుకునే ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు. 2010-11, 2011-12 ఆర్థిక సంవత్సరాల్లో ఈ కంపెనీ ఉద్యోగుల వేతనాల నుంచి టీడీఎస్( మూలం వద్ద పన్ను కోత) రూపంలో కోత కోసిన పన్నును ఇప్పటి వరకూ ఆదాయపు పన్ను శాఖకు చెల్లించలేదు. 1961 నాటి ఆదాయపు పన్ను చట్టం కింద ముంబై దేశీయ విమానాశ్రయం సమీపంలోని వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవేలోని కింగ్‌ఫిషర్ హౌస్‌ను ఎటాచ్ చేశామని లోకేశ పేర్కొన్నారు.