Kingfisher Airlines
-
మాల్యా పెళ్లి సందడి : మెనూలో అదే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్
భారతీయ బ్యాంకులకు వేలకోట్ల రూపాయలను ఎగవేసి విదేశాలకు చెక్కేసిన వ్యాపారవేత్త, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ప్రమోటర్ విజయ్ మాల్యా కుమారుడు సిద్ధార్థ మాల్యా తన చిరకాల స్నేహితురాలు జాస్మిన్ను పెళ్లి చేసుకున్నాడు.లండన్‌లో జూన్ 22న సిద్ధార్థ-జాస్మిన్ వివాహ వేడుక జరిగింది. అయితే ఈ పెళ్లి సందడిలో వడ్డించిన వంటలు, ఇతర పదార్థాలపై ఇంటర్నెట్లో చర్చ నడుస్తోంది.ముఖ్యంగా ఫ్యాషన్ డిజైనర్ మనోవిరాజ్ ఖోస్లా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఇంట్రస్టింగ్ సంగతులను షేర్ చేశాడు. ముఖ్యంగా కింగ్‌ఫిషర్ బీర్ ఇమేజ్ను షేర్ చేయడంతో ఇది ఫాలోయర్లను ఆకట్టుకుంటోంది. లండన్‌లో కింగ్ పిషర్కు మించింది ఏముంటుంది అనే క్యాప్షన్‌తో ఫోటోను కూడా పోస్ట్ చేశాడు. ఇంకా కడీపట్టా బుర్రట్టా, పాన్-ఫ్రైడ్ అట్లాంటిక్ సీ బాస్ లాంటి వాటితో పాటు ఇతర వంటకాలున్నాయని తన స్టోరీలో తెలిపాడు. మరోవైపు సిద్ధార్థ-జాస్మిన్ పెళ్లి సంబరాలకు సంబంధించి ఫోటోలు వైరల్ అయ్యాయి. తాజాగా పెళ్లి కళ ఉట్టిపడుతున్న తమ రెండు ఫోటోలను సిద్ధార్థ మాల్యా ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. అంతకుముందు తన కాబోయే భార్యతో పోజులిచ్చిన ఫోటోలను షేర్ చేసి, తన ఫ్యాన్స్‌కు పెళ్లికబురు అందించిన సంగతి తెలిసిందే. -
సంచలనం సృష్టించి కనుమరుగైపోయిన భారతీయ బడా కంపెనీలు ఇవే!
ప్రపంచం మార్కెట్లో ఎన్నో కంపెనీలు ఆవిర్భవించి కొన్ని దశాబ్దాలు తిరుగులేని సంస్థలుగా అవతరించి కాల గర్భంలో కలిసిపోయాయి. అలాంటి కోవకు చెందిన టాప్ 5 ఇండియన్ కంపెనీలను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ప్రీమియర్ ఆటోమొబైల్ (Premier Automobiles) 19వ దశకంలో భారతదేశంలో ఒక మెరుపు మెరిసిన ప్రీమియర్ ఆటోమొబైల్ కంపెనీ మొదటి కార్ రిపేర్ వర్స్క్ షాప్ మాదిరిగా ముంబైలో ప్రారంభమైంది. ఆ తరువాత ఆటో మొబైల్ రంగంలోకి అడుగు పెట్టింది. ఇందులో భాగంగానే కంపెనీ 1970లో 'ప్రీమియర్ పద్మిని' అనే అద్భుతమైన కారుని పరిచయం చేసింది. ఇది 2004 వరకు మార్కెట్లో విస్తృతమైన అమ్మకాలను పొందింది. మార్కెట్లో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో విఫలమైన ఈ కంపెనీ కొత్త కార్లను పరిచయం చేయడంలో కూడా సక్సెస్ కాలేక పోయింది. ఆ తరువాత ప్రీమియర్ పద్మిని ఉత్పత్తి 1980లోనే నిలిచిపోయింది. కాగా కంపెనీ ఆటోమొబైల్ రంగం నుంచి పూర్తిగా 2004కి బయటకు వచ్చేసింది. గోల్డ్ స్పాట్ (Gold Spot) భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొంది, ప్రత్యర్థులను ఎదుర్కోలేక నిలిచిపోయిన కంపెనీలలో ఒకటి ఈ గోల్డ్ స్పాట్. 1950లోనే యూత్ ఫెవరెట్ బ్రాండ్‌గా మారిన ఈ సాఫ్ట్ డ్రింక్ 'పార్లే' (Parle) కంపెనీకి చెందినది కావడం గమనార్హం. 1960 & 70లలో బాగా పాపులర్ అయినప్పటికీ.. కోక్ అండ్ పెప్సీ కంపెనీ సాఫ్ట్ డ్రింకులతో పోటీ పడలేక 2000 ప్రారంభంలో కంపెనీ ఈ ఉత్పత్తిని నిలిపివేసింది. హెచ్ఎమ్టి (HMT) ఆధునిక కాలంలోనే హెచ్ఎమ్టి వాచ్‌ల గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ ఒకప్పుడు ఈ బ్రాండ్‌కు పెద్ద ఫాలోయింగ్ ఉండేది. నిజానికి 1953లో ఇండియన్ గవర్నమెంట్ ఆధ్వరంలో మన దేశంలో ఈ కంపెనీ ప్రారంభమై 2016 వరకు కొనసాగింది. ఇందులో హెచ్ఎమ్టి జనతా అనే వాచ్ చాలా మందికి ఇష్టమైనదని చెబుతారు. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా కంపెనీ మారలేక.. కొత్త ఉత్పత్తులకు సరైన పోటీ ఇవ్వలేక 2016లో కనుమరుగైపోయింది. రాజ్‌దూత్ మోటార్‌సైకిల్స్ (Rajdoot MotorCycles) ఆటో మొబైల్ మార్కెట్లో చరిత్ర సృష్టించిన రాజ్‌దూత్ మోటార్ సైకిల్స్ 1960 నుంచి 2005 వరకు కుర్రకారుని ఎంతగానో ఆకర్శించింది. ఈ బైకులు ప్రముఖ ఇంజినీరింగ్ కంపెనీ ద్వారా రూపుదిద్దుకున్నాయి. కావున చాలా వరకు అప్పట్లోనే అడ్వాన్స్డ్ ఫీచర్స్ కలిగి ఉండేది. 1973లో విడుదలైన బాబీ అనే చిత్రం ద్వారా ఈ బైక్ మరింత పాపులర్ అయింది. అయితే మార్కెట్లో జరిగుతున్న ఆధునీకరణకు, ఇతరత్రా కారణాల వల్ల కంపెనీ రాజ్‌దూత్ ఉత్పత్తిని నిలిపివేసింది. అప్పుడప్పుడు వింటేజ్ బైకుల మాదిరిగా అక్కడక్కడా దర్శనమిస్తూ ఉంటాయి. (ఇదీ చదవండి: ఎంత మిలియనీర్ అయినా.. ఇండియాలో ఇలాగే ఉంటది!) అంబాసిడర్ (Ambassador) ఇక భారతదేశ ఆటో మోటివ్ ఇండస్ట్రీ సింబల్ మాదిరిగా ప్రజాదరణ పొంది సాధారణ ప్రజల దగ్గర నుంచి గవర్నమెంట్ ఉద్యోగుల వరకు విరివిగా ఉపయోగించిన కార్లలో అంబాసిడర్ ఒకటి. ఇప్పటికి కూడా అక్కడక్కడా కనిపించే ఈ కార్లు ఒకప్పుడు తిరుగులేని అమ్మకాలను పొందాయి. డిజైన్, ఫీచర్స్ పరంగా ఉత్తమంగా ఉండే ఈ కారు ఇండియన్ రోడ్ కండిషన్‌కి అనుకూలంగా ఉండేది. అయితే కాలక్రమంలో ఏర్పడిన పోటీ, ఆధునికతను తట్టుకోలేక 2014లో వీటి ఉత్పత్తి కూడా నిలిచిపోయింది. (ఇదీ చదవండి: ఒక ఒప్పందం.. వేల కోట్లు ఇన్వెస్ట్ - గోగోరో ప్లాన్ ఏంటంటే?) కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ (Kingfisher Airlines) భారతదేశంలో అతి తక్కువ కాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని పొందగలిగిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ విజయ్ మాల్యా ద్వారా 2005లో ముంబై హెడ్ క్వార్టర్‌గా ప్రారంభమైంది. ప్రయాణికులకు సౌకర్యవంతమైన సదుపాయాలను అందిస్తూ ముందుకు సాగిన ఈ కంపెనీ ఎయిర్‌లైన్స్‌లో ఒక రికార్డ్ సృష్టించింది. ఆ తరువాత ఆర్థిక పరమైన ఇబ్బందులను ఎదుర్కొలేకే 2012లో తన కార్య కలాపాలను నిలిపివేసింది. ఆ తరువాత 2013లో కంపెనీ పూర్తిగా దివాళా తీసినట్లు ప్రకటించింది. -
Yogita Bhayana: కింగ్‌ఫిషర్ టూ పరి..బాధితుల కోసం ‘భయనా’
ఢిల్లీకి చెందిన యోగిత భయనా అత్యాచార బాధితులకు పునరావాసం కల్పించడం కోసం ఏవియేషన్ కెరీర్ నుంచి బయటకు వచ్చి ‘పరి (పీపుల్ అగైనెస్ట్ రేప్ ఇన్ ఇండియా)’ అనే ఎన్జీవో స్థాపించింది. వాళ్లకు పునరావాసం, పోషణ, న్యాయపోరాటంతోపాటు చదువు కూడా చెప్పిస్తోంది. వినడానికి ఇది రెండు వాక్యాల విషయం లాగానే అనిపిస్తుంది. కానీ...ఈ ప్రస్థానంలో ఆమె దరి చేర్చిన జీవితాల సంఖ్య ఎంత పెద్దదంటే ఓ వెయ్యికి పైగానే. అంతమంది బాధితుల జీవితాలను గాడిన పెట్టడంలో నిమగ్నమైన యోగిత తనకు అత్యంత పెద్ద సవాల్ న్యాయవ్యవస్థలో నెలకొన్న జాగు అని చెప్తోంది. నిర్భయ పోరాటంలో నిర్భయ తల్లికి అండగా నిలిచిన యోగిత జీవిత ప్రస్థానం ఇది. చిన్నప్పటి నుంచి యాక్టివ్ యోగిత పద్నాలుగేళ్ల నుంచే సామాజిక సేవలో చురుగ్గా ఉండేది. ట్యూషన్లు చెప్పి ఆ డబ్బును వార్ధక్యంలో అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్లకు ఆర్థిక సహాయం చేసేది. స్కూల్ తర్వాత ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతోపాటు సామాజకి కార్యకర్తగా ఎదిగింది. ఆ తర్వాత ఉమెన్ యాక్టివిస్ట్‌గా ఒక స్పష్టమైన దారిని ఎంచుకుంది. కెరీర్ పరంగా ఏవియేషన్ రంగం మీద ఏర్పడిన క్రేజ్‌తో కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌లో చేరింది. కానీ ఆ ఉద్యోగంలో ఎక్కువ కాలం కొనసాగలేకపోయిందామె. జీవితంలో గొప్ప రిలీఫ్ పొందిన క్షణం ఏదంటే ఉద్యోగం మానేసినరోజేనంటోంది యోగిత. తన జీవితాన్ని సామాజిక సేవలో నిర్బంధించిన సంఘటనను గుర్తు చేసుకుంటారామె. కట్టిపడేసిన సంఘటన ‘‘ఓ రోజు రోడ్డు మీద నా కళ్ల ముందే ఓ యాక్సిడెంట్ జరిగింది. ప్రమాదానికి కారణమైన వాహనం ఆగకుండా వెళ్లిపోయింది. గాయపడిన వ్యక్తిని కాపాడడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. నేను, నా ఫ్రెండ్ ధైర్యం చేసి అతడిని హాస్పిటల్‌కు తీసుకువెళ్లాం. ఆ ప్రభుత్వ వైద్యశాలలో గాయపడిన వ్యక్తికి వైద్యం చేయడానికి అవసరమైన పరికరాలు కూడా సరిగ్గా లేవు. అన్నీ సమకూర్చుకుని వైద్యం మొదలుపెట్టేలోపు ఆలస్యం అయిపోయింది. అతడు దక్కలేదు. అతడి భార్య, బిడ్డలు దిక్కులేని వాళ్లయిపోయారు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆ సంఘటన వెంటాడుతూనే ఉండేది. నిద్రపోవడానికి కళ్లు మూసుకుంటే ఆ కుటుంబమే కళ్ల ముందు మెదిలేది. ఆలోచించే కొద్దీ పేదరికం ఎంత నరకమో అర్థం కాసాగింది. నిజానికి నన్ను మేల్కొలిపిన సందర్భం అది. బాధిత కుటుంబానికి అండగా నిలవాలని నిర్ణయించుకున్నాను. కోర్టులో సాక్ష్యం చెప్పాను. చనిపోయిన వ్యక్తి కుటుంబానికి నష్టపరిహారం లభించే వరకు వారికి సహాయంగా ఉన్నాను. ఆ సంఘటన రగిలించిన ఆవేదనతో 2007లో దాస్ చారిటబుల్ ఫౌండేషన్‌ను స్థాపించాను. రోడ్డు ప్రమాదాల పట్ల చైతన్యవంతం చేయడం, కళ్ల ముందు ప్రమాదం జరిగితే ఎలా స్పందించాలనే అవగాహన సదస్సులు, ర్యాలీలు నిర్వహించాం. సేవామార్గంలో మలుపు నా కార్యకలాపాలు ఇలా కొనసాగుతుండగా 2012 లో నిర్భయ ఘటన జరిగింది. దేశరాజధానిలో ఒక యువతి అమానవీయంగా అత్యాచారానికి గురి కావడం, ప్రాణాలతో పోరాడి తుదిశ్వాస వదలడం గుర్తుండే ఉంటుంది. దేశాన్ని కుదిపేసిన ఆ సంఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. ఆ న్యాయపోరాటంలో తీర్పు రావడానికి ఏళ్లు పట్టింది. ఆంత కాలం నిర్భయ తల్లికి అండగా ఉన్నాను. ఆ సమయంలో నాకు ఎంతోమంది నుంచి వినతులు వస్తుండేవి. ‘మాకు కూడా ఇలాగే జరిగింది. న్యాయపోరాటం చేయాలంటే మాకు తోడుగా ఎవరూ రావడం లేదు’ అంటూ తమకు సహాయం చేయమని అడిగేవాళ్లు. తరచూ కోర్టుకు వెళ్లాల్సి రావడంతో మరికొన్ని సంగతులు కూడా తెలిశాయి. నిర్భయ కేసు... సామాన్యుల నుంచి పాలకుల వరకు అందరి దృష్టిలో పడింది కాబట్టి అప్పటికైనా విచారణ పూర్తి చేసుకుని తీర్పుకు నోచుకుంది. పదిహేనేళ్లు దాటినా కూడా అతీగతీ లేకుండా కాగితాల్లో మూలుగుతున్న కేసులు లెక్కకు మించి ఉన్నాయని తెలిసింది. ఒక యాక్టివిస్టుగా నేను చేయల్సిన పని చాలా ఉందనిపించి పరి ఎన్జీవోను స్థాపించాను. ఈ వేదిక ద్వారా సహాయం పొందిన బాలికలు, యువతులు, మహిళల వివరాలను చెప్పలేను. కానీ వెయ్యికి పైగా జీవితాలు గాడిలో పడ్డాయని చెప్పగలను. వాళ్ల తరఫున న్యాయపోరాటం చేయడం, పునరావాసం కల్పించడం, చదువుకునే వాళ్లను చదివించడం వంటివన్నీ చేస్తున్నాను. అత్యాచార బాధితులతోపాటు ఒంటరి మహిళలకు కూడా మా దగ్గర కారు డ్రైవర్, కారు క్లీనర్, హౌస్ కీపింగ్ వంటి పనుల్లో శిక్షణ తీసుకుని ఉద్యోగాలు చేసుకుంటున్నారు’’ అని చెప్పింది యోగిత. छात्रों की समस्या का समाधान किया जाए. पिछले एक साल से सिर्फ एक मौके की मांग कर रहे छात्रों के साथ न्याय जरूरी है. #UPSCExtraAttempt EXTRA ATTEMPT FOR ALL pic.twitter.com/C9Umb146jp — Yogita Bhayana योगिता भयाना (@yogitabhayana) December 1, 2021 -
భారత్‌కు మాల్యా.. 28 రోజుల్లో
లండన్: వ్యాపార వేత్త, బ్యాంకులకు రూ.9,000 కోట్లు ఎగవేసి బ్రిటన్‌లో తలదాచుకుంటున్న విజయ్‌మాల్యా (64) న్యాయపరమైన పోరాటంలో చివరి అవకాశాన్ని కూడా కోల్పోయారు. దీంతో ఆయన్ను భారత్‌కు అప్పగించడం దాదాపుగా ఖరారైపోయినట్టే. ఈ ప్రక్రియ గరిష్టంగా 28–30 రోజుల్లోపు పూర్తికానుంది. బ్రిటన్ హోంమంత్రి ఆమోదం తర్వాత మాల్యాను భారత్‌కు అప్పగించే ప్రక్రియను పూర్తి చేస్తారు. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మూతపడడం, ఎయిర్‌లైన్స్ సంస్థ తరఫున తీసుకున్న సుమారు రూ.9,000 కోట్ల రుణాలను చెల్లించకపోవడంతో.. మాల్యాపై మనీలాండరింగ్, మోసపూరిత అభియోగాలతో భారత దర్యాప్తు సంస్థలు (సీబీఐ, ఈడీ) బ్రిటన్‌లో న్యాయపరమైన చర్యలను చేపట్టాయి. ‘బ్రిటన్–భారత్ మధ్య అప్పగింత ఒప్పందం’ కింద మాల్యాను తమకు అప్పగించాలని కోరాయి. ఇందుకు అనుకూలంగా వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు 2018 డిసెంబర్లోనే ఆదేశాలు వెలువరించింది. ఈ ఆదేశాలను బ్రిటన్ హైకోర్టు సమర్థించగా.. దీనిపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు మాల్యాకు 14 రోజుల గడువు ఉంది. అయితే, సుప్రీంకోర్టులో అప్పీల్ కోసం అనుమతించాలన్న ఆయన దరఖాస్తును తాజాగా లండన్ హైకోర్టు కొట్టివేసింది. సాధారణ ప్రజా ప్రాముఖ్యత కోణంలో సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకోవచ్చన్న న్యాయపరమైన అంశాన్ని ధ్రువీకరించేందుకు తిరస్కరిస్తున్నట్టు లండన్‌లోని రాయల్ కోర్ట్స్ ఆఫ్ జస్టిస్ ధర్మాసనం స్పష్టం చేసింది. యూకే ఎక్స్ట్రాడిషన్ యాక్ట్ 2003 చట్టంలోని సెక్షన్ 36, సెక్షన్ 116 కింద అప్పగింత ప్రక్రియను నిర్ధేశించిన 28 రోజుల్లోపు పూర్తి చేయాలని కోర్టు ఆదేశించింది. పెద్ద ఎత్తున బ్యాంకులకు రుణాలను ఎగవేసిన వ్యాపారవేత్తలను విదేశాలకు పారిపోనిచ్చారంటూ మోదీ సర్కారు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఒక్క చాన్స్! అయితే, ఒక్క అవకాశం మాత్రం మాల్యాకు మిగిలి ఉంది. యూరోపియన్ కోర్ట్ ఆఫ్ çహ్యూమన్‌రైట్స్ (ఈసీహెచ్ఆర్)ను ఆశ్రయించొచ్చు. పారదర్శక విచారణ లభించలేదంటూ యూరోపియన్ కన్వెన్షన్ ఆన్ హ్యూమన్ రైట్స్‌లోని ఆర్టికల్ 3 కింద అప్పగింతను నిరోధించాలంటూ కోరొచ్చు. అయితే, ఈసీహెచ్ఆర్లో అప్పీల్ కు అవకాశాలు చాలా తక్కువేనని నిపుణులు చెబుతున్నారు. ఇవే అంశాల ఆధారంగా ఇప్పటికే కోర్టుల్లో వాదనలు వీగిపోవడాన్ని పేర్కొంటున్నారు. రుణాలు చెల్లించేస్తా.. వదిలిపెట్టండి ఓటమిని గుర్తించిన మాల్యా మరోసారి రుణాలన్నింటినీ తిరిగి చెల్లిస్తానని, వాటిని తీసుకుని తనపై ఉన్న కేసును మూసేయాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ‘‘కరోనా ప్యాకేజీ కోసం భారత ప్రభుత్వం నచ్చినంత నగదును ముద్రించుకోగలరు. కానీ, ప్రభుత్వ బ్యాంకులకు చెల్లించాల్సిన నూరు శాతాన్ని తిరిగి చెల్లించేస్తానంటున్న నా విన్నపాన్ని అదే పనిగా విస్మరిస్తున్నారు. ఎటువంటి షరతుల్లేకుండా నా నుంచి డబ్బులు తీసుకోండి. కేసును క్లోజ్ చేయండి’’ అంటూ విజయ్‌మాల్యా ట్వీట్ చేశారు. తదుపరి ఏమిటి..? ► విజయ్ మాల్యాను భారత్‌కు అప్పగించిన తర్వాత దర్యాప్తు సంస్థలు ఆయన్ను ఇక్కడి కోర్టుల్లో ప్రవేశపెట్టి విచారణ ప్రక్రియను చేపట్టాల్సి ఉంటుంది. ► ముంబైలోని ఆర్ధర్‌రోడ్డు జైలులో బరాక్ 12లో ఆయన్ను పూర్తి స్థాయి వైద్య సదుపాయాలతో ఉంచుతామని దర్యాప్తు సంస్థలు లోగడే బ్రిటన్ కోర్టులకు తెలియజేశాయి. ► విజయ్‌మాల్యా 2016 మార్చిలో బ్రిటన్‌కు వెళ్లిపోయారు. దీంతో ఆయన్ను పారిపోయినట్టు భారత్ ప్రకటించింది. ► 2017లో ఏప్రిల్ 18న అప్పగింత వారెంట్‌పై ఆయన్ను అరెస్ట్ చేయగా, బెయిల్‌పై బయట ఉన్నారు. ► 2018 డిసెంబర్లో చీఫ్ మేజిస్ట్రేట్ కోర్టు అప్పగింతకు అనుకూలంగా ఆదేశాలు జారీ చేసింది. ► దీన్ని 2020 ఏప్రిల్‌లో బ్రిటన్ హైకోర్టు సమర్థించింది. దీనిపై అప్పీల్ చేసుకునేందుకు తాజాగా అనుమతించలేదు. -
మాల్యాకు డీఆర్టీ మరో షాక్...
న్యూఢిల్లీ: బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరస్తుడు, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ అధినేత విజయ్ మాల్యా యునైటెడ్ బ్రేవరీస్ హోల్డింగ్స్ (యూబీహెచ్ఎల్)కు చెందిన 74 లక్షల షేర్లను రూ. 1,008 కోట్లకు ఈడీ విక్రయించింది. ఈ మేరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం మీడియాకు వెల్లడించింది. విజయ్ మాల్యాపై మనీ లాండరింగ్ విచారణలో భాగంగా ఈడీ ఈ షేర్లను అటాచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈడీ అటాచ్‌లో ఉన్న ఈ షేర్లు డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్టీ)కు వెళ్లాయి. ఈ నెల తొలి వారంలోనే డీఆర్టీ ఆదేశించిన మేరకు యూబీహెచ్ఎల్కు చెందిన 74,04,932 షేర్లను విక్రయించింది. ఈడీ సమర్పించిన పత్రాలు, తీసుకున్న చర్యల ఆధారంగాను, ఎస్బీఐ కన్సార్టియంకు విజయ్ మాల్యా భారీమొత్తంలో రుణాలు బాకీ ఉన్న కారణంగాను ఈ షేర్లను అమ్మేందుకు అక్రమ నగదు రవాణా నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కోర్టు ఈనెల 26న అనుమతినిచ్చింది. దీంతో బుధవారం డీఆర్టీకి చెందిన రికవరీ అధికారి ఈ షేర్లను రూ. 1008 కోట్లకు విక్రయించారు. విజయ్ మాల్యా రుణాల రికవరీ ప్రక్రియలో ఇది తొలి ఘట్టమేనని, మరికొద్ది రోజుల్లో మిగిలినవి కూడా విక్రయిస్తామని డీఆర్టీ అధికారులు తెలిపారు. -
మాల్యాకు డీఆర్టీ మరో షాక్...
న్యూఢిల్లీ: బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరస్తుడు, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ అధినేత విజయ్ మాల్యా యునైటెడ్ బ్రేవరీస్ హోల్డింగ్స్ (యూబీహెచ్ఎల్)కు చెందిన 74 లక్షల షేర్లను రూ. 1,008 కోట్లకు ఈడీ విక్రయించింది. ఈ మేరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం మీడియాకు వెల్లడించింది. విజయ్ మాల్యాపై మనీ లాండరింగ్ విచారణలో భాగంగా ఈడీ ఈ షేర్లను అటాచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈడీ అటాచ్‌లో ఉన్న ఈ షేర్లు డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్టీ)కు వెళ్లాయి. ఈ నెల తొలి వారంలోనే డీఆర్టీ ఆదేశించిన మేరకు యూబీహెచ్ఎల్కు చెందిన 74,04,932 షేర్లను విక్రయించింది. ఈడీ సమర్పించిన పత్రాలు, తీసుకున్న చర్యల ఆధారంగాను, ఎస్బీఐ కన్సార్టియంకు విజయ్ మాల్యా భారీమొత్తంలో రుణాలు బాకీ ఉన్న కారణంగాను ఈ షేర్లను అమ్మేందుకు అక్రమ నగదు రవాణా నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కోర్టు ఈనెల 26న అనుమతినిచ్చింది. దీంతో బుధవారం డీఆర్టీకి చెందిన రికవరీ అధికారి ఈ షేర్లను రూ. 1008 కోట్లకు విక్రయించారు. విజయ్ మాల్యా రుణాల రికవరీ ప్రక్రియలో ఇది తొలి ఘట్టమేనని, మరికొద్ది రోజుల్లో మిగిలినవి కూడా విక్రయిస్తామని డీఆర్టీ అధికారులు తెలిపారు. -
కింగ్‌ఫిషర్‌ను కూల్చారు.. జెట్‌ను గట్టెక్కిస్తున్నారు
న్యూఢిల్లీ: మాజీ లిక్కర్ కింగ్, వ్యాపారవేత్త విజయ్‌మాల్యా బ్యాంకుల ద్వంద్వ ప్రమాణాలపై మండిపడ్డారు. ఒకప్పుడు కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ నిర్దాక్షిణ్యంగా విఫలమయ్యేందుకు కారణమైన బ్యాంకులు... ఇప్పుడు అదే విధమైన పరిస్థితిలో ఉన్న జెట్ ఎయిర్వేస్ను మాత్రం ఒడ్డెక్కిస్తున్నాయని ఎత్తిచూపారు. సమస్యల్లో ఉన్న జెట్ ఎయిర్వేస్ను ఎస్బీఐ ఆధ్వర్యంలోని బ్యాంకుల కమిటీ తన నియంత్రణలోకి తీసుకోవడంపై వరుస ట్వీట్లతో మాల్యా తన స్పందన తెలియజేశారు. కింగ్‌ఫిషర్ విషయంలోనూ ఇదే జరగాల్సి ఉందన్నారు. ‘‘పీఎస్‌యూ బ్యాంకులు జెట్ఎయిర్వేస్కు బెయిలవుట్ కల్పించడం, ఉద్యోగాలను, సేవల కనెక్టివిటీని కాపాడడం చూడ్డానికి ఆనందంగా ఉంది. ఇవే పీఎస్‌యూ బ్యాంకులు భారత్‌లోనే అత్యుత్తమమైన ఎయిర్‌లైన్ (కింగ్‌ఫిషర్), మెరుగైన ఉద్యోగులు, అనుసంధానత ఉన్న దాన్ని నిర్దాక్షిణ్యంగా కూల్చేశాయి’’ అని మాల్యా ట్వీట్ చేశారు. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌ను నిలబెట్టేందుకు తాను చేసిన ప్రయత్నాలను గుర్తించలేదని, బదులుగా అన్ని ద్వారాలను మూసేశారని ఆక్షేపించారు. కంపెనీని, ఉద్యోగులను కాపాడేందుకు కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్‌లో తాను రూ.4,000 కోట్లకు పైగా ఇన్వెస్ట్ చేసినట్టు మాల్యా చెప్పారు. జెట్‌ఎయిర్‌వేస్, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ విషయంలో భిన్న విధానాన్ని అనుసరించడం పట్ల కేంద్రంలోని బీజేపీ సర్కారును విమర్శించారు. ‘‘నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు నేను రాసిన లేఖలను బీజేపీ అధికార ప్రతినిధి అనర్గళంగా చదువుతారు. యూపీఏ ప్రభుత్వం హయాంలో పీఎస్ యూ బ్యాంకులు అక్రమంగా కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు సహకరించాయని చెబుతారు. మరి ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో ఏం మారిపోయిందన్నది ఆసక్తి కలిగిస్తోంది’’ అని మాల్యా విమర్శించారు. నా డబ్బులు తీసుకోండి... ‘‘పీఎస్‌యూ బ్యాంకులు, ఇతర రుణదాతలకు చెల్లించేందుకు గాను కర్ణాటక హైకోర్టు ముందు నా లిక్విడ్ ఆస్తులను (వెంటనే నగదుగా మార్చుకునేవి) ఉంచాను. వాటిని తీసుకోవాలని మరోసారి అభ్యర్థిస్తున్నాను. బ్యాంకులు నా డబ్బులను ఎందుకు తీసుకోవడం లేదు? జెట్ఎయిర్వేస్ను కాపాడేందుకు ఇవి ఉపయోగపడతాయి’’ అని తన ట్వీట్లో మాల్యా పేర్కొన్నారు. బ్యాంకులకు మాల్యా రూ.9,000 కోట్లకు పైగా రుణ బకాయిలు చెల్లించాల్సి ఉంది. బ్రిటన్‌లో ఉన్న ఆయన్ను భారత్‌కు రప్పించే ప్రయత్నాలు జరుగుతున్న విషయం తెలిసిందే. రూ.8,000 కోట్లకు పైగా రుణాలను చెల్లించలేక, అదే సమయంలో కార్యకాలాపాల నిర్వహణకు నిధుల్లేక మునిగిపోయే పరిస్థితికి చేరిన జెట్ ఎయిర్వేస్ను సంక్షోభం నుంచి బయటపడేసేందుకు ఎస్బీఐ ఆధ్వర్యంలోని బ్యాంకుల కమిటీ ఓ పరిష్కార ప్రణాళికను రూపొందించిన విషయం గమనార్హం. బ్యాంకులు తమ రుణాలను జెట్‌ఎయిర్‌వేస్‌లో వాటాల కింద మార్చుకుని తమ అధీనంలోకి తీసుకునేందుకు నిర్ణయించాయి. -
ఆ పదం తొలగించాలని సుప్రీం ముందుకు మాల్యా
సాక్షి, న్యూఢిల్లీ : బ్యాంకులకు రూ 9000 కోట్ల రుణాల ఎగవేత కేసులో నిందితుడైన లిక్కర్ కింగ్, పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా తనను పరారీలో ఉన్నట్టు ఈడీ పేర్కొనడాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తన పేరుకు ముందు పరారీ పదాన్ని తొలగించాలని ఆయన కోరారు. బ్యాంకులకు వేల కోట్ల రుణ బకాయిల ఆరోపణలు ఎదుర్కొంటున్న మాల్యా 2016, మార్చి 2న భారత్‌ను విడిచివెళ్లి బ్రిటన్‌లో తలదాచుకున్న సంగతి తెలిసిందే. దర్యాప్తు సంస్థల చార్జ్షీట్ల ఆధారంగా న్యాయస్ధానం ఆయనను ఉద్దేశపూరిత ఎగవేతదారుగా ప్రకటించగా, పరారీలో ఉన్న ఎగవేతదారుగా ఈడీ నిర్ధారించింది. కాగా, మాల్యాను భారత్‌కు అప్పగించాలని కోరుతూ భారత్ దాఖలు చేసిన పిటిషన్ వచ్చే వారం వెస్ట్‌మినిస్టర్ కోర్టులో విచారణకు రానున్న క్రమంలో తాను గతంలో కర్నాటక హైకోర్టు ముందుంచిన సెటిల్మెంట్ ప్రతిపాదనకు అంగీకరించాలని బ్యాంకులను కోరారు. రుణంలో అసలు మొత్తం చెల్లించేందుకు ఇటీవల మాల్యా సంసిద్ధత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాను తీసుకున్న రుణాల్లో అత్యధిక మొత్తం నష్టాల్లో కూరుకుపోయిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు మళ్లించామని, యునైటెడ్ బ్రూవరీస్ వంటి లిక్కర్ వ్యాపారం ద్వారా ప్రభుత్వ ఖజానాకు తమ సంస్ధలు అత్యధిక రాబడిని సమకూర్చాయని మాల్యా గుర్తు చేశారు. -
రుణాల్లో అసలు తీర్చేస్తా..
న్యూఢిల్లీ: బ్యాంకులకు రుణాలు ఎగవేసి బ్రిటన్‌కు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా తాజాగా అప్పుల్లో అసలు భాగం మొత్తాన్ని తీర్చేసేందుకు సిద్ధమని మరోసారి స్పష్టం చేశారు. ప్రజాధనాన్ని నూటికి నూరు శాతం చెల్లించేస్తానని మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్లో ట్వీట్ చేశారు. ‘ఈ అంశం ముఖ్యంగా ప్రజాధనంతో ముడిపడి ఉంది. (పెరిగిపోతున్న కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్) నష్టాలను తట్టుకునేందుకు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని కుమ్మరించాల్సి వచ్చింది. అక్కడికీ రుణంలో అసలు భాగాన్ని 100 శాతం తిరిగి చెల్లించేస్తానని బ్యాంకులు, ప్రభుత్వానికి ఆఫర్ చేస్తున్నాను. దయచేసి తీసుకోవాలని కోరుతున్నాను. దీనికి నిరాకరిస్తే.. ఎందుకు నిరాకరిస్తున్నారన్నదైనా తెలపాలి’ అని ఆయన పేర్కొన్నారు. రాజకీయ పక్షాలు, మీడియా తనపై కావాలనే ‘డిఫాల్టర్’ అనే తప్పుడు ముద్ర వేశాయని మాల్యా ఆక్రోశం వ్యక్తం చేశారు. ‘ప్రభుత్వ రంగ బ్యాంకుల సొమ్ముతో పరారయ్యానని, డిఫాల్టర్ అని రాజకీయ పక్షాలు, మీడియా ప్రచారం చేస్తున్నాయి. ఇదంతా అబద్ధం. రుణాల వ్యవహారాన్ని సెటిల్ చేసుకుంటానంటూ కర్ణాటక హైకోర్టుకు నేను సమర్పించిన సమగ్ర ఆఫర్ గురించి మాత్రం ఎవరూ మాట్లాడటం లేదు. ఇది బాధాకరం‘ అని వ్యాఖ్యానించారు. మరోవైపు, బ్రిటన్ తనను భారత్‌కు అప్పగించే విషయంలో మీడియా ఏవేవో రాస్తోందని, కానీ చట్టం తన పని తాను చేసుకుపోతుందని మాల్యా తెలిపారు. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కోసం తీసుకున్న రూ. 9,000 కోట్ల రుణాన్ని ఎగవేసిన మాల్యా 2016 మార్చిలో బ్రిటన్‌కు పరారైన సంగతి తెలిసిందే. -
మాల్యా అప్పగింత : నేడే కీలక పరిణామం
భారత బ్యాంక్‌లకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన లిక్కర్ టైకూన్ విజయ్ మాల్యా కేసులో నేడు కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. అతన్ని భారత్‌కు అప్పగించే కేసులో యూకే కోర్టులో జరుగుతున్న విచారణలో నేడే తుది ఘట్టం. మంగళవారం జరుగబోయే ఫైనల్ విచారణలో ఈ కేసు ముగింపు అంకానికి రాబోతుందని తెలుస్తోంది. లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మెజిస్ట్రేట్ వద్ద చీఫ్ మెజిస్ట్రేట్ ముందు ప్రాసిక్యూషన్, డిఫెన్స్ రెండూ కూడా తమ తమ తుది వాదనలను వినిపించబోతున్నాయి. భారత్ తరఫున ది క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీసెస్(సీపీఎస్) ఈ కేసును వాదిస్తోంది. ఈ కేసుపై తుది తీర్పును యూకే కోర్టు సెప్టెంబర్‌లో వెల్లడించనుంది. మధ్యాహ్నం రెండున్నర గంటలకు ఈ కేసు తుది విచారణ ప్రారంభం కానుందని తెలిసింది. గత డిసెంబర్లోనే మాల్యాను భారత్‌కు అప్పగించే కేసు తుది విచారణ చేపట్టాలని యూకే కోర్టు నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు తుది విచారణలో కాస్త జాప్యం జరిగింది. ఈ కేసులో ఎక్కువగా కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్, ఐడీబీఐ బ్యాంక్‌కు ఎగ్గొట్టిన రుణాలపై వాదన జరుగుతోంది. మొత్తం అన్ని భారత బ్యాంక్‌లకు కలిపి రూ.9900 కోట్ల రుణాలను మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ బాకీ పడింది. ఈ రుణాలన్నింటిన్నీ ఎగ్గొట్టి మాల్యా విదేశాలకు పారిపోయారు. మాల్యా 2016 మార్చి నుంచి బ్రిటన్‌లో లగ్జరీ జీవితం గడుపుతున్నారు. అతనిని తమకు అప్పగించాలంటూ భారత్ చేసుకున్న అభ్యర్థనపై స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు మాల్యాను అరెస్ట్ చేశారు కూడా. ఆ అనంతరం లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ కోర్టులో మాల్యాను భారత్‌కు అప్పగించే కేసుపై విచారణ ప్రారంభమైంది. మరోవైపు మాల్యా భారత్‌కు వచ్చేందుకు సముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. మాల్యాపై పరారీ ఆర్థిక నేరగాడుగా ముద్ర వేయడంతోపాటు అతనికి చెందిన రూ.12,500 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను స్వాధీనపర్చుకునేందుకు అనుమతివ్వాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) ముంబైలోని ప్రత్యేక కోర్టును కోరింది. ఈ పిటిషన్‌పై విచారణ కోసం వచ్చేనెల 27న ప్రత్యక్షంగా హాజరుకావాలని మాల్యాకు కోర్టు సమన్లు జారీ చేసింది. విచారణకు హాజరుకాకుంటే కోర్టు మాల్యాను పరారీ ఆర్థిక నేరగాడుగా ప్రకటించడంతోపాటు ఆయన ఆస్తుల స్వాధీనానికి అనుమతిచ్చే అవకాశం ఉంది. అదే గనక జరిగితే మాల్యాకు దేశ, విదేశాల్లో ఉన్న ఆస్తులను దర్యాప్తు ఏజెన్సీ తక్షణమే స్వాధీనం చేసుకోనుంది. దాంతో దిగొచ్చిన మాల్యా.. విచారణకు ప్రత్యక్షంగా హాజరై తన గోడు వెళ్లబోసుకోవాలనుకుంటున్నట్లు సమాచారం. -
ప్రధానికి లేఖ రాసిన కింగ్‌ఫిషర్ స్టాఫ్
న్యూఢిల్లీ : గత ఆరు ఏళ్ల క్రితం అంటే 2012లో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ తన దుకాణం మూసివేసింది. ఈ కంపెనీ ఉద్యోగులు ఇప్పుడు ఎక్కడెక్కడో ఉన్నారు. కానీ తాజాగా కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ తమకు చెల్లించాల్సి ఉన్న బకాయిలను ఇప్పించండి అంటూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మాల్యాకు వ్యతిరేకంగా తాజాగా ఛార్జ్‌షీటు నమోదు చేసిన వెంటనే కంపెనీ మాజీ ఉద్యోగులు తమ బకాయిలు చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ 2012లో మూత పడింది. బ్యాంకులకు భారీగా రుణాలు ఎగవేసి, విదేశాలకు పారిపోయిన విజయ్‌మాల్యా, తమ వేతనం కానీ, గ్రాట్యుటీ, పరిహారాలు కానీ ఏమీ చెల్లించలేదని ప్రధానికి రాసిన లేఖలో ఉద్యోగులు పేర్కొన్నారు. లండన్, ఇతర దేశాలకు చెందిన ఉద్యోగులకు మాత్రం మాల్యా అన్ని రకాల పేమెంట్లు జరిపారని తెలిపారు. లిక్విడేషన్ ప్రాసెస్‌తో తమ పీఎఫ్ మొత్తాన్ని కూడా విత్‌డ్రా చేసుకోవడానికి కుదరడం లేదన్నారు. మాల్యా చేతుల్లో తాము రక్తం చిమ్మించి చేసిన పని ఉందని, అతన్ని వెనక్కి తీసుకొచ్చి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మనీ లాండరింగ్ కేసులో మాల్యాకు వ్యతిరేకంగా ఈడీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన ఒక్క రోజు అనంతరమే కింగ్‌ఫిషర్ మాజీ ఉద్యోగులు ప్రధానికి లేఖ రాశారు. -
మాల్యా ‘కింగ్‌ఫిషర్’ అవుట్
ముంబై : బ్యాంకులకు వేలకోట్ల రూపాయలు ఎగనామం పెట్టి విదేశాలకు పారిపోయిన విజయ్‌మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌పై నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీ వేటు వేసింది. ఆ కంపెనీని డీలిస్ట్ చేయాలని ఎన్ఎస్ఈ నిర్ణయించింది. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌తో పాటు 17 సంస్థలను మే 30 నుంచి డీలిస్ట్ చేయబోతున్నట్టు ఎన్ఎస్ఈ ప్రకటించింది. ఇంతకు ముందే బీఎస్ఈ 200 కంపెనీలను డీలిస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆరు నెలల పాటు వీటిని సస్పెండ్ చేస్తున్నట్టు తెలిపింది. అక్రమంగా నిధులు తరలిస్తున్న షెల్ కంపెనీలు, మోసపూరిత కంపెనీలను జాబితా నుంచి తొలగించాలనుకున్న నేపథ్యంలోనే కింగ్‌ఫిషర్‌పైనా వేటు వేస్తున్నట్టు తెలిసింది. 331 అనుమానిత షెల్ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని ఆగస్టులోని మార్కెట్ రెగ్యులేటర్ సెబీ స్టాక్ ఎక్స్ఛేంజీలను ఆదేశించింది. సుదీర్ఘకాలంగా ఎలాంటి వ్యాపార లావాదేవీలు నడవని 2 లక్షల షెల్ కంపెనీలపైనా కేంద్ర ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే. నేడు ఎన్ఎస్ఈ చేస్తున్నట్టు ప్రకటించిన కంపెనీల్లో కింగ్‌షిఫర్‌తో పాటు ప్లెథికో, ఆగ్రో డచ్ ఇండస్ట్రీస్, బ్రాడ్కాస్ట్ ఇన్షియేటివ్స్, క్రెస్ట్ యానిమేషన్ స్టూడియోస్, కేడీఎల్ బయోటెక్, కెమ్రాక్ ఇండస్ట్రీస్ అండ్ ఎక్స్‌పోర్ట్స్, లూమ్యాక్స్ ఆటోమోటివ్ సిస్టమ్స్, నిస్సాన్ కాపర్, శ్రీ ఆస్టర్ సిలికేట్స్, సూర్య ఫార్మాస్యూటికల్స్ తదితర కంపెనీలు ఉన్నాయి. -
మాల్యాకు మరో షాక్
లండన్/సింగపూర్ : బ్యాంకులకు రూ . వేల కోట్ల రుణాల ఎగవేతకేసులో నిందితుడైన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ విమానాలను అద్దెకు తీసుకున్న బీఓసీ ఏవియేషన్‌కు 90 మిలియన్ డాలర్లు చెల్లించాలని బ్రిటన్ హైకోర్టు తేల్చిచెప్పడంతో మాల్యాకు న్యాయపోరాటంలో భంగపాటు తప్పలేదు. లీజింగ్ అగ్రిమెంట్ ప్రకారం కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు సింగపూర్‌కు చెందిన బీఓసీ ఏవియేషన్ మూడు విమానాలను సరఫరా చేసింది. కాగా, లండన్ కోర్టు వెలువరించిన తీర్పును బీఓసీ ఏవియేషన్ స్వాగతించింది. మరోవైపు రుణ ఎగవేతకేసులో నిందితుడైన విజయ్ మాల్యాను భారత్‌కు అప్పగించే కేసుపై లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ కోర్టులో విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. -
వేలంలో మాల్యా ‘కారు’చౌక
సాక్షి, బెంగళూరు: కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కోసం తీసుకున్న రూ.9వేల కోట్లకు పైగా బకాయిలను చెల్లించకుండా దేశం వదిలి వెళ్లిపోయిన లిక్కర్ కింగ్ విజయ్‌మాల్యా ఆస్తులు ఒక్కొక్కటీ వేలానికి వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వేలానికి వచ్చిన అతని రెండు లగ్జరీ కార్లను హుబ్లీకి చెందిన హనుమంతరెడ్డి అనే వ్యాపారవేత్త కారు చౌకగా సొంతం చేసుకున్నారు. దాదాపు రూ.34 లక్షలు విలువ చేసే రెండు వాహనాలను ముంబై నుంచి నిర్వహించిన ఆన్లైన్ వేలంలో ఆయన రూ.1.4 లక్షలకే కొనుగోలు చేశారు. మాల్యా వాడిన హ్యుండాయ్ సొనాటా గోల్డ్, హోండా ఎకార్డ్‌లకు ముంబై నుంచి ఆన్లైన్ వేలాన్ని నిర్వహించారు. సొనాటా గోల్డ్ మార్కెట్ ఖరీదు రూ.13.15 లక్షలు, హోండా ఎకార్డ్ విలువ రూ.21 లక్షలు. సొనాటా గోల్డ్‌ను రూ.40 వేలకు, ఎకార్డ్‌ను రూ.లక్షకే హనుమంత రెడ్డి సొంతం చేసుకున్నారు. అమ్మాలని అడుగుతున్నారు ‘ఆన్లైన్ వేలంలో రోల్స్‌రాయల్స్ మొదలు అనేక మోడళ్ల లగ్జరీ కార్లు మొత్తం 52 వరకూ ఉన్నాయి. రోల్స్‌రాయల్స్ వంటి వాటికి ఎక్కువ పోటీ కనిపించింది. నేను కొనుగోలు చేసిన కార్లు మంచి కండిషన్లోనే ఉన్నాయి. వీటిని కొన్న తరువాత రెండింతల ధర ఇస్తాం, అమ్మాలనేవారి సంఖ్య పెరుగుతోంది’ అని హనుమంతరెడ్డి తెలిపారు. -
అరెస్ట్‌కు దారితీసిన మాల్యా 12 ఏళ్ల ప్రయాణం
-
విజయ్ మాల్యా అరెస్ట్
-
విజయ్ మాల్యా అరెస్ట్
► లండన్‌లో అదుపులోకి తీసుకున్న స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు ► అరెస్టయిన మూడు గంటల్లోపే బెయిల్‌పై బయటకు.. ► మాల్యాపై నేరస్తుల అప్పగింత ప్రక్రియలో తొలి అడుగు ► మాల్యాను రప్పించడం అంత సులువేం కాదు: నిపుణులు ► దోచుకున్న సొమ్మును ఇవ్వాల్సిందేనంటూ ప్రధాని మోదీ ట్వీట్ వేలకోట్లు ఎగవేసి, బ్రిటన్‌లో విలాస జీవితం అనుభవిస్తున్న కింగ్‌ఫిషర్ మాజీ అధినేత విజయ్ మాల్యాను భారత్ రప్పించే ప్రక్రియలో ఎట్టకేలకు తొలి అడుగు పడింది. అతన్ని అప్పగించాలన్న భారత్ ఒత్తిడి మేరకు లండన్‌లో మాల్యాను అరెస్టు చేశారు. నేరస్తుల అప్పగింతలో విచారణలో భాగంగా స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు మంగళవారం ఉదయం మాల్యాను అదుపులోకి తీసుకుని.. అనంతరం సెంట్రల్ లండన్ పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఒకవైపు వార్తాచానళ్లలో మాల్యా అరెస్టు వార్తలు ప్రసారం అవుతుండగానే.. వెస్ట్‌మినిస్టర్ కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. ఒకప్పుడు రాజభోగాలు, విలాసాల్లో మునిగితేలిన ఈ రుణ ఎగవేతదారుడు కేవలం మూడు గంటల్లోనే బెయిల్‌పై బయటికి వచ్చారు. వెంటనే ట్వీటర్లో స్పందిస్తూ ‘ఎప్పటిలానే భారతీయ మీడియా హడావుడి చేసింది. అనుకున్న ప్రకారమే నేరస్తుల అప్పగింతపై విచారణను కోర్టు ప్రారంభించింది’అని ట్వీట్ చేశారు. మే 17న మాల్యా మళ్లీ లండన్ కోర్టు ముందు హాజరుకావాల్సి ఉంది. నేరస్తుల అప్పగింతపై భారత్ అందచేసిన ఆధారాల్ని పరిశీలించాక కోర్టు నిర్ణయం తీసుకుంటుంది. ఈ కేసులో న్యాయ పోరాటం కొనసాగిస్తానని మాల్యా స్పష్టం చేశారు. కాగా విజయ్ మాల్యాను భారత్‌కు తీసుకురావడం అంత సులువేం కాదని విదేశాంగ వ్యవహారాల నిపుణులు చెబుతున్నారు. భారత కాలమానం ప్రకారం ఉదయం 9.30 గంటలకు మాల్యాను అరెస్టు చేశామని సీబీఐ అధికారులకు లండన్ పోలీసులు సమాచారం అందించారు. అనంతరం స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు స్పందిస్తూ.. ‘మెట్రోపాలిటన్ పోలీసు విభాగానికి చెందిన నేరస్తుల అప్పగింత విభాగం మాల్యాను అరెస్టు చేసింది. మోసం ఆరోపణలకు సంబంధించి భారతీయ అధికారుల తరఫున విజయ్ మాల్యాను అరెస్టు చేశాం’ అని చెప్పారు. సెంట్రల్ లండన్ పోలీసు స్టేషన్‌కు మాల్యాను తీసుకెళ్లాకే అరెస్టు చేశామని మెట్రోపాలిటన్ పోలీసులు పేర్కొన్నారు. అనంతరం లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టులో కనిపించిన మాల్యా... వెంటనే బెయిల్ దొరకడంతో న్యాయవాదుల బృందంతో కోర్టు నుంచి బయటకు వచ్చారు. ‘ఇది కేవలం స్వచ్ఛందంగా చోటుచేసుకున్న పరిణామం. కొద్ది నిమిషాల్లోనే మాల్యా బయటకొచ్చారు’అని ఆయన తరఫు న్యాయవాది ఒకరు పేర్కొన్నారు. మరోవైపు త్వరలో బ్రిటన్ పర్యటన సందర్భంగా మాల్యా అప్పగింతపై చర్చించవచ్చని ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ చెప్పిన నేపథ్యంలో ఈ అరెస్టు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. గత నెల్లో భారత్ విజ్ఞప్తిని ధ్రువీకరించిన బ్రిటన్ భారత్, బ్రిటన్ మధ్య నేరస్తుల అప్పగింత ఒప్పందం మేరకు మాల్యాను అప్పగించాలంటూ ఫిబ్రవరి 8న అధికారికంగా భారత్ విజ్ఞప్తి చేసింది. మాల్యాపై చట్టప్రకారం కేసులు ఉన్నాయని, తమ విజ్ఞప్తిని అంగీకరిస్తే.. భారత ఆందోళన పట్ల బ్రిటన్ సానుకూల ప్రతిస్పందనగా భావిస్తామని అందులో పేర్కొంది. గత నెల్లో బ్రిటన్ ప్రభుత్వం భారత విజ్ఞప్తిని ధ్రువీకరించడంతో పాటు తదుపరి చర్యలు చేపట్టాలంటూ దానిని జిల్లా జడ్డికి పంపారు. దాంతో మాల్యా అరెస్టుకు కోర్టు వారెంట్ జారీచేవడంతో బ్రిటన్ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. మాల్యాను రప్పించడం సుధీర్ఘ ప్రక్రియే.. మాల్యాను భారత్ రప్పించడం అంత సులువైన ప్రక్రియ కాదని, సుధీర్ఘ సమయం పట్టవచ్చని భావిస్తున్నారు. భారత్, బ్రిటన్ల మధ్య నేరస్థుల అప్పగింత ఒప్పందం ఉన్నా అది టైప్–బీ కేటగిరి కిందకు వస్తుంది. టైప్–ఏలో అమెరికా, పలు యూరప్ దేశాలు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లు ఉన్నాయి. ఈ దేశాలతో నేరస్తుల అప్పంగిత ప్రక్రియ చాలా వేగంగా కొనసాగుతుంది. టైప్–2 దేశాలతో మాత్రం నేరస్తుల అప్పగింతపై బ్రిటన్ ఆచీతూచి వ్యవహరించడంతో పాటు జాప్యం చేస్తోంది. బ్రిటన్‌లో తలదాచుకుంటున్న అనేకమంది నేరస్తుల్ని అప్పగించాలన్న భారత్ విజ్ఞప్తుల్ని పలుమార్లు ఆ దేశం తోసిపుచ్చింది. గత ఐదేళ్లలో గుజరాత్ అల్లర్ల నిందితుడు సమీర్‌భాయ్ పటేల్‌ను మాత్రమే అప్పగించినట్లు కేంద్ర విదేశాంగ శాఖ సహాయమంత్రి వీకే సింగ్ ఇటీవల చెప్పారు. ఇప్పుడు మాల్యాను అప్పగిస్తే మిగతా నేరస్తుల్ని కూడా అప్పగించాల్సి రావచ్చన్న ఆందోళన నేపథ్యంలో మాల్యా విషయంలో బ్రిటన్ జాప్యం చేయవచ్చని భావిస్తున్నారు. అంతిమ నిర్ణయం బ్రిటన్ సుప్రీంకోర్టుదే కేటగిరి–బి దేశాలకు నేరస్తుల అప్పగించాలంటే సుధీర్ఘ ప్రక్రియ పూర్తిచేయాల్సి ఉంటుంది. ముందుగా నేరస్తుల అప్పగింతపై బ్రిటన్ విదేశాంగ శాఖకు అధికారికంగా విజ్ఞప్తి చేయాలి. ఈ అభ్యర్థనను అంగీకరించాలో.. వద్దో? విదేశాంగ శాఖ నిర్ణయిస్తుంది. అనంతరం ఈ అంశాన్ని జిల్లా కోర్టుకు సిఫార్సు చేస్తారు. నేరస్తుడిగా పేర్కొన్న వ్యక్తిపై అరెస్టు వారంట్ జారీ చేయాలా? వద్దా? అనేది జిల్లా జడ్డి నిర్ణయిస్తారు. వారెంట్ జారీ చేస్తే... అతన్ని అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరుస్తారు. మొదట ప్రాధమిక విచారణ, అనంతరం నేరస్తుల అప్పగింతపై విచారణ నిర్వహిస్తారు. అనంతరం నేరస్తుడ్ని అప్పగించాలా? వద్దా? అన్న అంశాన్ని విదేశాంగ శాఖ నిర్ణయిస్తుంది. నేరస్తుల్ని అప్పగించమని కోరుతున్న దేశాలు క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్(సీపీఎస్)కు మరోసారి విజ్ఞప్తిని సమర్పించాలని బ్రిటన్ విదేశాంగ శాఖ సూచిస్తుంది. అనంతరం అప్పగింత ప్రక్రియ మొదలవుతుంది. అయితే తీర్పుపై ఉన్నత న్యాయస్థానాల్లో అప్పీలుకు వెళ్లవచ్చు. బ్రిటన్ సుప్రీంకోర్టు నిర్ణయమే అంతిమం. సాధ్యాసాధ్యాల్ని నిశితంగా పరిశీలిస్తున్నాం: కేంద్ర ప్రభుత్వం అరెస్టుపైకేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ మాట్లాడుతూ.. మాల్యాను భారత్‌కు రప్పించడం, న్యాయ విచారణ ప్రారంభించడంపై సాధ్యాసాధ్యాల్ని అంచనావేస్తున్నామని చెప్పారు. ఆర్థిక నేరాలకు పాల్పడినవారు ఎవరైనా సరే చట్టం ముందుకు నిలబెట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. బ్రిటన్ నుంచి ఇతర నేరస్తుల్ని రప్పించే ప్రక్రియ కూడా కొనసాగుతుందని చెప్పారు. మరోవైపు మాల్యా అప్పగింతపై బ్రిటన్ ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని భారత విదేశాంగ శాఖ తెలిపింది. న్యాయపరంగా అన్ని ప్రక్రియలు కొనసాగుతాయని విదేశాంగ శాఖ ప్రతినిధి గోపాల్ బాగ్లే అన్నారు. మాల్యా అరెస్టు దర్యాప్తు సంస్థలు సాధించిన విజయంగా సీబీఐ మాజీ డైరక్టర్ అనిల్ సిన్హా అభివర్ణించారు. మాల్యాను భారత్‌కు తీసుకొచ్చే ప్రక్రియ విజయవంతం అవుతుందనే నమ్మకం ఉందన్నారు. ఆర్థిక నేరగాళ్లపై మోదీ ప్రభుత్వం చర్యలు చేపడుతుందనే విషయాన్ని ఈ అరెస్టు రుజువు చేసిందని బీజేపీ పేర్కొంది. అలాంటి వారితో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందనేందుకు ఇదే నిదర్శమని బీజేపీ ప్రతినిధి నలిన్ కోహ్లీ అన్నారు. మాల్యా అరెస్టుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తప్పుదారి పట్టిస్తున్నారని, మాల్యాను కస్టడీలోకి తీసుకుని ఎప్పటిలోగా రుణాలు రాబడతారో చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. మాల్యాను బహిష్కరించమని కోరకుండా, అప్పగింతకు మోదీ ప్రభుత్వం ఎందుకు పట్టుబడుతుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా ప్రశ్నించారు. మాల్యాను అదుపులోకి తీసుకుని వెంటనే విడుదల చేశారని, ఇది ఏరకమైన నేరస్తుల అప్పగింత ప్రక్రియని ఆయన ప్రశ్నించారు. దోచుకున్న సొమ్మును ఇవ్వాల్సిందే: ప్రధాని న్యూఢిల్లీ: ‘పేదలు, మధ్య తరగతి ప్రజల్ని దోచుకుని సంపాదించిన సొమ్మును ఆ వ్యక్తులు తిరిగి ఇవ్వాల్సిందే. దేశంలో అవినీ తికి చోటులేదు’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. మాల్యా అరెస్టు నేపథ్యంలో ఈ ట్వీ ట్ ప్రాధాన్యం సంతరించుకుంది. కష్టించి సంపాదించిన ధనాన్నే కాకుండా గౌరవాన్ని కూడా అవినీతి దోచుకుంటుందన్న ట్వీట్‌కు స్పందిస్తూ ప్రధాని రీట్వీట్ చేశారు. -
అరెస్ట్‌కు దారితీసిన మాల్యా 12 ఏళ్ల ప్రయాణం
యూబీ గ్రూప్ మాజీ అధిపతి విజయ్ మాల్యా లండన్‌లో అరెస్ట్‌కు దారితీసిన ఆయన పన్నెండేళ్ల వ్యాపార, బ్యాంక్ లావాదేవీలు, నేరాభియోగాలపై చట్టాలు అమలుచేసే ప్రభుత్వ సంస్థల చర్యలు క్లుప్తంగా... 2005: యునైటెడ్ బ్రూవరీస్(హోల్డింగ్స్)లి. చైర్మన్ హోదాలో మాల్యా కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్(కేఎఫ్యే) ఏర్పాటు చేసి ప్రపంచస్థాయి విమానయాన సంస్థగా ఇది ఎదుగుతుందనే భారీ ప్రచారం. 2006: విమానాల కొనుగోలుకు ఐడీబీఐ బ్యాంక్‌కు రుణం కోసం కింగ్‌ఫిషర్ దరఖాస్తు చేయగా, యూబీ గ్రూపుతో పాత అనుభవాల దృష్ట్యా అందుకు ‘నో’చెప్పిన ప్రభుత్వరంగ బ్యాంకు. ఇతర బ్యాంకులతో మాట్లాడి రుణాలు సాధించడంలో మాల్యా విజయం. 2007: దాదాపు దివాలాతీసిన ఎయిర్ డక్కన్లో వాటా తీసుకోవడానికి కింగ్‌ఫిషర్ నిర్ణయం. 2008: ఎయిర్డక్కన్లో 26 శాతం వాటా కొనుగోలుకు యునైటెడ్ బ్రూవరీస్ రూ.550 కోట్లు చెల్లించింది. మార్చినాటికి ఈ అప్పులు రూ. 934 కోట్లకు పెరగగా, సెప్టెంబర్‌లో బెంగళూరు–లండన్ సర్వీసుతో, కింగ్‌ఫిషర్ అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభించింది. 2009: ఫలితంగా కింగ్‌ఫిషర్ రుణాలు రూ.5,665 కోట్లకు పెరిగి, వేగంగా ఏడువేల కోట్లకు చేరాయి. మొదట అప్పివ్వడానికి నిరాకరించిన ఐడీబీఐ బ్యాంక్ ఈ ఎయిర్‌లైన్స్‌కు రూ.900 కోట్లరుణం ఇవ్వాలని నిర్ణయిస్తుంది. 2010: రుణాలు 9 నెలల్లో తిరిగి చెల్లించాలని అన్ని బ్యాంకులూ కింగ్ఫిషర్కు గడువు విధించాయి. అప్పటికి రాజ్యసభ సభ్యుడు కూడా అయిన మాల్యా రుణాలు చెల్లించడానికి ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, భారీ ఖర్చుతో కూడిన జీవనశైలిని కొనసాగించారు. 2011–12: కింగ్ఫిషర్లో తన వేతనం కింద ఏటా రూ.36 కోట్ల చొప్పున భారీ మొత్తాన్ని మాల్యా తీసుకుంటూనే ఉన్నారు. విమానాలు నడిపే లైసెన్స్‌ను ప్రభుత్వం తాత్కాలికంగా రద్దుచేయడంతో, సిబ్బందికి జీతాలు చెల్లించలేని స్థితికి కింగ్‌ఫిషర్ ఎదుర్కొంది. 2016 మార్చి నాటికి మూడు వేలమంది సిబ్బందికి చెల్లించాల్సిన వేతనాలు రూ.3000 కోట్లకు దాటిపోయాయి. ఎస్బీఐ, ఐడీబీఐ వంటి బ్యాంకులకు చెల్లించాల్సిన రుణాల మొత్తం వంద కోట్ల డాలర్లకు మించిపోయింది. 2013: ఈ ఎయిర్‌లైన్స్‌కు ఇచ్చిన రూ.6,493 కోట్ల రుణాలను తిరిగి చెల్లించాలంటూ స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా అప్పులిచ్చిన బ్యాంకుల కన్సార్షియం యునైటెడ్ బ్యూవరీస్(హో)లిమిటెడ్‌ను కోరగా, అత్యధిక భాగం రుణాన్ని త్వరలో చెల్లిస్తానని మాల్యా హామీ ఇచ్చారు. 2014: ఎయిర్‌లైన్స్ కోసం భారీగా అప్పుచేసి, బాకీ కట్టని మాల్యాను ‘ఉద్దేశపూర్వక ఎగవేతదారు’గా మొదట యునైటెడ్బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించగా, ఎస్బీఐ, పంజాబ్నేషనల్ బ్యాంక్ కూడా అదే ముద్ర ఆయనకు వేశాయి. 2016: యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ డైరెక్టర్ల బోర్డు మాల్యాను రాజీనామా చేయాలని ఫిబ్రవరిలో కోరుతుంది. మాల్యాను దేశం నుంచి పారిపోకుండా ఆపాలని సుప్రీంకోర్టును కింగ్ఫిషర్కు రుణాలిచ్చిన బ్యాంకులు కోరతాయి. అప్పటికే మాల్యా ఇండియా వదలి లండన్‌కు పారిపోయిన విషయం వెల్లడయింది.అనేక పెండింగ్ కేసులకు సంబంధించి హాజరుకాలేదనే కారణంపై స్పెషల్ మేజిస్ట్రేట్ కోర్టు మాల్యాకు నాన్‌బెయిలబుల్ వారంట్ జారీచేస్తుంది. 2002 ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ చట్టంకింద మరో నాన్‌బెయిలబుల్ వారంట్ జారీ చేయాలని ప్రత్యేక న్యాయస్థానాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోరింది. అప్పటికే మాల్యా విదేశాలకు 59 కోట్ల డాలర్లు రహస్యంగా తరలించారని వార్తలొచ్చాయి. 2017: నిష్పాక్షిక విచారణ జరపకుండానే తనను నరేంద్ర మోదీ ప్రభుత్వం తనను దోషిగా నిరూపించాలనే పట్టుదలతో ఉందని మాల్యా మార్చి నెలలో ఆరోపిస్తారు. విజయ్ మాల్యాను పంపిచాలని కోరుతూ ఇండియా చేసిన అభ్యర్థనను బ్రిటన్ సర్కారు ఓ ఇంగ్లండ్ కోర్టుకు అందజేస్తుంది. ఏప్రిల్‌లో గోవాలోని మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్ విల్లాను వేలం వేసిన కొన్ని రోజులకే లండల్లో మాల్యా అరెస్ట్–విడుదలతో కింగ్‌ఫిషర్ వ్యవహారం కీలక దశకు చేరినట్టయింది. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
సాయం కోసమే చేతులు చాచాను: మాల్యా
న్యూఢిల్లీ : లిక్కర్ కింగ్ విజయ్‌మాల్యా ఇక అన్ని దారులు మూసుకుపోతున్న నేపథ్యంలో ప్రభుత్వంపై విరుచుకుపడటం ప్రారంభించారు. ప్రభుత్వం అనుసరించిన విధానాలే కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ సంక్షోభానికి కారణమయ్యాయంటూ ఆరోపించారు. ఓ వైపు ప్రభుత్వ పాలసీలు, మరోవైపు ఆర్థిక పరిస్థితులు కింగ్‌ఫిషర్‌ను దెబ్బతీశాయన్నారు. ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాను ఆదుకునేందుకు మాత్రం ప్రభుత్వం పబ్లిక్ ఫండ్స్ అన్నింటిన్నీ వెచ్చించిందని, కానీ కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు ఎలాంటి బెయిల్ అవుట్ ప్రకటించలేదని ఆరోపించారు. ఎయిరిండియాకు అవసరమైన అన్ని సహాయాలను ప్రభుత్వం చేపట్టిందని చెప్పారు. విధానాల్లో మార్పుల కొరకే తాను చేతులు చాచానని, రుణాల కోసం కాదని చెప్పుకొచ్చారు. కానీ పాలసీల్లో ఎలాంటి మార్పులు చేపట్టలేదని, దీంతో తన ఎయిర్‌లైన్స్ తీవ్రంగా నష్టాల్లో కూరుకుపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. సాయం కోసమే తాను అర్థించానని, రుణాల కోసం కాదంటూ పలు ట్వీట్లు చేశారు. పబ్లిక్ ఫండ్స్ మొత్తాన్ని ఎయిరిండియాకు అలా ఎలా కేటాయిస్తారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బ్యారెల్ ఆయిల్ ధర డాలర్లకు పెరగడం, రూపాయి డీవాల్యుయేషన్తో సేల్స్ ట్యాక్స్ భారం ఇవన్నీ కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ సంక్షోభానికి కారణమని చెప్పారు. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ భారత్‌లో అతిపెద్ద విమానయాన సంస్థ, కేవలం ప్రభుత్వం అనుసరించిన విధానాలు, ఆర్థిక పరిస్థితుల వల్లే ఇది ఫెయిల్ అయిందంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఈ సందర్భంగా తాను కింగ్‌ఫిషర్ ఉద్యోగులకు, స్టాక్ హోల్డర్స్ అందరికీ మనస్ఫూర్తిగా క్షమాపణ చెబుతున్నానని ట్వీట్ చేశారు. సీబీఐ దీన్ని విచారిస్తుందని ఒక్క రూపాయి కూడా తప్పుదోవ పట్టించలేదని మాల్యా తెలిపారు. -
మాల్యా కేసులో మా ఆర్డర్ ఫలించలేదు
బెంగళూరు: మద్యం వ్యాపారి విజయమాల్యాతో బ్రిటిష్ లిక్కర్ దిగ్గజం డియాజియో ఒప్పందం మేరకు అతనికి తొలివిడతగా ఇవ్వాల్సిన 40 మిలియన్ డాలర్ల(దాదాపు రూ.270 కోట్లు)ను నిలిపివేయాలన్న రుణ రికవరీ ట్రిబ్యునల్ ఆదేశాలు వ్యర్థమయ్యాయని డీఆర్టీ ప్రిసైడింగ్ ఆఫీసర్(పీఓ) సీఆర్ బెనకనహళ్లి తెలిపారు. మార్చి 7 న జారీచేసిన ఈ ఆదేశాలకు ముందే సదరు మొత్తం మాల్యా బ్యాంక్ ఖాతాలో జమఅయ్యాయని వెల్లడించారు. ముంబై సర్వీస్ టాక్స్ డిపార్ట్ మెంట్ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ఆయన ఆ విషయాన్ని వెల్లడించారు. మార్చి 7 ట్రిబ్యునల్ ఆర్డర్ కంటే చాలా ముందుగానే బదిలీ జరగడంతో తమ ఆదేశాలు ఫలించలేదని తెలిపారు. ఒప్పందం ప్రకారం మాల్యా ఖాతాలోఆ సొమ్ము మొత్తం జమ అయ్యాయన్నారు. అలాగే ట్రిబ్యునల్ నిబంధనలు, షరతులు ప్రకారం , మిగిలిన 35 మిలియన్ డాలర్ల చెల్లింపును నిలిపివేయమని ఆదేశించలేమన్నారు. రాబోయే ఐదు సంవత్సరాలలో వారి ఒప్పందం అమల్లో ఉంటుంది గనుక అటు మాల్యాకు గానీ, డియాజియో కు ఈ తరహా ఆదేశాలివ్వలేమని బెనకనహళ్లి స్పష్టం చేశారు. మరోవైపు ఈ వ్యవహారంలోరుణాలు తీసుకుంటున్న సమయంలో బ్యాంకులు రుణదాత(మాల్యా), ఆయనకు సంబంధించి కంపెనీలకు ఉన్న ఆస్తుల వివరాలతో కూడిన డిక్లరేషన్‌ను ఎందుకు అడగలేదని బ్యాంకులకు మొట్టికాయలు వేసిన బెనహనకల్లి తాజాగా టాక్స్ డిపార్ట్ మెంట్ వైఖరిని కూడా దుయ్యబట్టారు. ఎటాచ్ చేయబడిన మాల్యా స్థిర,చరాస్తులను ఎందుకు విక్రయించలేదని సేవా పన్ను శాఖపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఇల్లు, విమానం, హెలికాప్టర్లు అమ్మకం ఎందుకు పూర్తి కాలేదని ప్రశ్నించారు. అనంతరం తదుపరి విచారణను ఇవాల్టికి(14 జూలై గురువారం) వాయిదా వేశారు. డియోజియో కంపెనీమాల్యాకు చెల్లించాల్సిన ఒప్పంద మొత్తాన్ని చెల్లించవద్దని ఇటివల డెట్ రికవరీ ట్రిబ్యునల్(డీఆర్టీ) ఆదేశించింది. మరోపక్క, మాల్యా బ్యాంక్ ఖాతాకు సంబంధించిన స్టేట్మెంట్ వివరాలను తమకు సమర్పించాలని న్యూయార్క్‌కు చెందిన జేపీ మోర్గాన్ బ్యాంకుకు కూడా డీఆర్టీ ఆదేశాలు జారీ చేసింది. మాల్యా యూబీ గ్రూప్ కంపెనీ అయిన యునెటైడ్ స్పిరిట్స్‌లో మెజారిటీ వాటాను డియాజియో 2012లో చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. కంపెనీ డెరైక్టర్ల బోర్డు నుంచి పూర్తిగా వైదొలగే షరతుపై మాల్యా 75 మిలియన్ డాలర్లు(దాదాపు రూ.500 కోట్లు) చెల్లించే విధంగా డియాజియో ఒప్పందాన్నిప్రకారం ముందస్తుగా 40 మిలియన్ డాలర్లను చెల్లించేందుకు ఒప్పుకుంది. అయితే, ఈ మొత్తం తమకే చెందాలని.. రూ. వేల కోట్లు బకాయిలు పడిన మాల్యాకు ఈ సొమ్మును డియాజియో చెల్లిం చకుండా ఆదేశించాలంటూ ఎస్బీఐ కాన్సార్షియం డీఆర్టీని ఆశ్రయించింది.ఈ నేపథ్యంలోఆ చెల్లింపులను నిలిపివేయాలని డియోజియోను డీఆర్ టీని ఇటీవల ఆదేశించిన సంగతి తెలిసిందే. -
జనం ముందుకు విజయ్ మాల్యా!
లండన్: భారత బ్యాంకులకు దాదాపు రూ.9 వేలకోట్లు ఎగనామం పెట్టి, విదేశాలకు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా చాలా రోజుల తర్వాత అధికారిక సమావేశంలో కనిపించనున్నారు. గత మార్చి నెలలో యూకేకు పారిపోయిన తర్వాత మాల్యా అధికారిక ఈవెంట్లలో కనిపించలేదు. ప్రస్తుతం యూకేలోని లండన్‌లో నివాసం ఉంటున్న మాల్యా శుక్రవారం జరగనున్న బ్రిటీష్ గ్రాండ్ ప్రీ కన్నా కొంత సమయం ముందు ఇతర జట్ల డైరెక్టర్లు, ఉన్నతాధికారులతో భేటీ అవనున్నారు. ఫోర్స్ ఇండియాకు యజమాని అయిన మాల్యా.. ఫెరారీ, మెక్ లారెన్, మెనార్, విలియమ్స్, మెర్సిడేజ్ ఎఫ్1 రేస్ డైరెక్టర్లతో చర్చలు జరపనున్నట్లు సమాచారం. వ్యక్తిగతంగా మాల్యా చిక్కుల్లో ఉన్నప్పటికీ, ఫోర్స్ ఇండియా మాత్రం సీజన్లో మంచి ఫలితాలను రాబట్టింది. కాగా గత నెల లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను ఉద్దేశ పూర్వక ఎగవేత దారుడిగా ముంబై కోర్టు ప్రకటించించిన విషయం తెలిసిందే. పలుమార్లు విచారణకు హాజరుకానందున, ఈడీ ఆస్తులను జప్తు చేయకముందే వాటిని అమ్మకాలు చేపట్టినందున ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు అధిష్టానం ప్రకటించింది. మనీ లాండరింగ్ కేసులో జులై 29న ఉదయం 11 గంటల లోపు కోర్టు ముందు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారించిన కోర్టు... లిక్కర్ కింగ్ విజయమాల్యా భారత బ్యాంకులను సుమారు 9000 కోట్ల రూపాయల రుణం తీసుకొని మోసగించిన మాట వాస్తవమేనని ప్రకటించింది. -
మాల్యా ఆస్తులు అటాచ్
ఐడీబీఐ రుణం కేసులో రూ.1,411 కోట్ల ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ ముంబై: ఐడీబీఐ బ్యాంకుకు రుణాన్ని ఎగవేసిన కేసులో కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ప్రమోటర్ విజయ్ మాల్యా, యూబీ సంస్థలకు చెందిన కొన్ని ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్(ఈడీ) శనివారం అటాచ్ చేసింది. వీటి మార్కెట్ విలువ సుమారు రూ. 1,411 కోట్లు ఉంటుందని ఈడీ అధికారులు తెలిపారు. మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టం కింద అటాచ్ చేసిన ఆస్తుల జాబితాలో రూ.34 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్, బెంగళూరు.. ముంబైలలో రెండు ఫ్లాట్లు, చెన్నైలో పారిశ్రామిక ప్లాటు, కూర్గ్‌లో 28.75 ఎకరాల కాఫీ ప్లాంటేషన్ స్థలం తదితరాలున్నాయి. ఐడీబీఐ బ్యాంకు నుంచి కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ పొందిన రూ. 900 కోట్ల పైచిలుకు రుణాల విషయంలో మనీ ల్యాండరింగ్ కోణంపై ఈడీ విచారణ జరుపుతోంది. గతేడాది సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రాతిపదికగా మాల్యాతో పాటు మరికొందరిపై మనీ ల్యాండరింగ్ కేసు నమోదు చేసింది. రుణాల ఎగవేత ఆరోపణలెదుర్కొంటున్న దరిమిలా మాల్యా .. దేశం విడిచి వెళ్లిన సంగతి తెలిసిందే. -
కోర్టు జప్తుల్లోఉన్న రూ.2,000 కోట్లపై దృష్టి పెట్టండి
ముందుగా వాటిని రికవరీ చేసుకోండి.. ‘కింగ్‌ఫిషర్’ మాల్యా కేసులో బ్యాంకులకు డీఆర్టీ సూచన బెంగళూరు: కింగ్‌షిఫర్ ఎయిర్‌లైన్స్, దాని ప్రమోటర్ విజయ్ మాల్యా కేసులో బ్యాంకులకు డెట్ రికవరీ ట్రిబ్యునల్(డీఆర్టీ) మంగళవారం కీలక సూచనలు చేసింది. రూ.9,000 కోట్ల మేర రుణ బకాయిల కారణంగా వాటిల్లుతున్న నష్టాన్ని కొంతైనా పూడ్చుకోవాలంటే.. ముందుగా ఈ కేసుకు సంబంధించి వివిధ కోర్టుల జప్తుల్లో ఉన్న దాదాపు రూ.2,000 కోట్ల మొత్తాన్ని రికవరీ చేసుకోవడంపై దృష్టిసారించాలని ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియంకు డీఆర్టీ ప్రిసైడింగ్ ఆఫీసర్(పీఓ) బెనకనహళ్లి సూచించారు. దీన్ని పరిష్కరించుకోవడానికి బ్యాంకులన్నీ కలసికట్టుగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. బ్యాంకుల కన్సార్సియం, డియాజియో(హోల్డింగ్స్) నెదర్లాండ్స్ తమ పిటిషన్లను ప్రాధాన్య ప్రాతిపదికన విచారించాలంటూ చేసిన విజ్ఞప్తిని పరిశీలించిన పీఓ తాజా వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో కోర్టుల దగ్గరున్న రూ.2,000 కోట్లను రికవరీ చేసుకోగలిగితే వడ్డీరూపంలో రూ.200-300 కోట్లు లభిస్తాయని.. నష్టం కొంతైనా పూడుతుందని బెనకనహళ్లి బ్యాంకుల కన్సార్షియంకు సూచించారు. -
ఉద్దేశపూర్వక ఎగవేతదారులపై సెబీ కొరడా
► స్టాక్ మార్కెట్ నుంచి నిధుల సమీకరణపై నిషేధం.. ► లిస్టెడ్ కంపెనీల్లో బోర్డు పదవులకూ చెక్... ► సవరించిన నిబంధనలను నోటిఫై చేసిన సెబీ న్యూఢిల్లీ: మొండిబకాయిల సమస్యతో బ్యాంకింగ్ రంగం అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కూడా కఠిన చర్యలను చేపట్టింది. ఆర్బీఐ మార్గదర్శకాల మేరకు ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుల(విల్‌ఫుల్ డిఫాల్టర్లు) జాబితాలో ఉన్న సంస్థలు, వ్యక్తులు ఎవరైనా క్యాపిటల్ మార్కెట్ల నుంచి ఇకపై నిధులను సమీకరించకుండా నిషేధం విధించింది. అదేవిధంగా సంబంధిత వ్యక్తులు లిస్టెడ్ కంపెనీల డెరైక్టర్ల బోర్డుల్లో కూడా ఎలాంటి పదవులూ చేపట్టడానికి అవకాశం లేనట్టే. ఈ మేరకు సవరించిన నిబంధనలను సెబీ నోటిఫై చేసింది. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్, దాని ప్రమోటర్ విజయ్ మాల్యా బ్యాంకులకు రూ.9,000 కోట్లకుపైగా రుణాలను ఎగవేసి.. దేశం విడిచి పరారైన నేపథ్యంలో సెబీ చర్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పలు బ్యాంకులు ఇప్పటికే మాల్యాను విల్‌ఫుల్ డిఫాల్టర్‌గా ప్రకటించాయి కూడా. మరోపక్క, డియాజియోతో ఒప్పందం ప్రకారం యునెటైడ్ స్పిరిట్స్ కంపెనీ చైర్మన్, డెరైక్టర్ పదవి నుంచి తప్పుకున్న మాల్యా.. ఇంకా పలు ఇతర కంపెనీల డెరైక్టర్ల బోర్డుల్లో మాత్రం కొనసాగుతున్నారు. సెబీ సవరించిన నిబంధనలు బుధవారం నుంచే అమల్లోకి వచ్చాయి. అయితే, ఇలాంటి కంపెనీలకు మార్కెట్ నుంచి పూర్తిగా నిధుల సమీకరణ చేయకుండా నిషేధం విధించడం వల్ల ఇతర వాటాదారుల ప్రయోజనాలు దెబ్బతింటాయన్న వాదనలూ వినిపిస్తున్నాయి. నిబంధనల్లో ఇతర ముఖ్యాంశాలివీ... ► విల్‌ఫుల్ డిఫాల్టర్‌గా ప్రకటించిన కంపెనీలు మ్యూచువల్ ఫండ్స్, బ్రోకరేజి సంస్థలు వంటి మార్కెట్ ఆధారిత సంస్థలను ఏర్పాటు చేయడాలికి వీల్లేదు. అదేవిధంగా ఇతర లిస్టెడ్ కంపెనీలను టేకోవర్ చేయడం కూడా కుదరదు. ► డిఫాల్ట్ అయిన కంపెనీ లేదా సంబంధిత ప్రమోటర్లు, డెరైక్టర్లు ఎవరూ పబ్లిక్ ఇష్యూల ద్వారా షేర్ల జారీ, డెట్ సెక్యూరిటీలు, నాన్-కన్వర్టబుల్ రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్ల జారీ ద్వారా నిధుల సమీకరణ చేపట్టకూడదు. ► ప్రస్తుత వాటాదారుల నుంచి(ప్రమోటర్లు సహా) రైట్స్ ఇష్యూ, ప్రైవేట్ ప్లేస్మెంట్, ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ రూపంలో ఇటువంటి కంపెనీలు నిధులను సమీకరిచేందుకు అవకాశం ఉంటుంది. అయితే, తమను ఏ బ్యాంకు విల్‌ఫుల్ డిఫాల్టర్‌గా ప్రకటించిందో.. ఎంత బకాయి చెల్లించాల్సి ఉందో ఇతరత్రా వివరాన్నింటినీ సంబంధిత కంపెనీ తెలియజేయాల్సి ఉంటుంది. ► ప్రమోటర్లు లేదా కీలకమైన యాజమాన్య పదవుల్లో ఉన్న వ్యక్తులు లేదా డెరైక్టర్లు విల్‌ఫుల్ డిఫాల్టర్‌గా ఉన్న కంపెనీల కొత్త రిజిస్ట్రేషన్లకు సెబీ అనుమతించదు. -
మాల్యాకు రూ.270 కోట్లు చెల్లించొద్దు..
డియాజియోకు డీఆర్టీ ఆదేశం బెంగళూరు: కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు సంబంధించి వేల కోట్ల రూపాయల రుణ ఎగవేత ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పారిశ్రామికవేత్త విజయ్ మాల్యాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. బ్రిటిష్ లిక్కర్ దిగ్గజం డియాజియోతో ఒప్పందం మేరకు ఆయనకు తొలివిడతగా ఇవ్వాల్సిన 40 మిలియన్ డాలర్ల(దాదాపు రూ.270 కోట్లు)ను చెల్లించవద్దని ఆ కంపెనీని డెట్ రికవరీ ట్రిబ్యునల్(డీఆర్టీ) మంగళవారం ఆదేశించింది. మరోపక్క, మాల్యా బ్యాంక్ ఖాతాకు సంబంధించిన స్టేట్మెంట్ వివరాలను తమకు సమర్పించాలని న్యూయార్క్‌కు చెందిన జేపీ మోర్గాన్ బ్యాంకుకు కూడా డీఆర్టీ ఆదేశాలు జారీ చేసింది. మాల్యాకు సంబంధించిన సంస్థ వాట్సన్ లిమిటెడ్‌తో పాటు ఇతర కంపెనీలకు చెందిన షేర్లను ట్రిబ్యునల్‌కు అటాచ్ చేయాల్సిందిగా డీఆర్టీ ప్రిసైడింగ్ ఆఫీసర్(పీఓ) బెనకనహల్లి ఆదేశించారు. బ్యాంకులకు మొట్టికాయలు... మాల్యా యూబీ గ్రూప్ కంపెనీ అయిన యునెటైడ్ స్పిరిట్స్‌లో మెజారిటీ వాటాను డియాజియో 2012లో చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఆ తర్వాత యునెటైడ్ స్పిరిట్స్ చైర్మన్ పదవి నుంచి తప్పుకోవడానికి మాల్యా నిరాకరించారు. దీంతో కంపెనీ డెరైక్టర్ల బోర్డు నుంచి పూర్తిగా వైదొలగే షరతుపై మాల్యా 75 మిలియన్ డాలర్లు(దాదాపు రూ.500 కోట్లు) చెల్లించే విధంగా డియాజియో ఆయనతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీనిలో ముందస్తుగా 40 మిలియన్ డాలర్లను చెల్లించేందుకు ఒప్పుకుంది. అయితే, ఈ మొత్తం తమకే చెందాలని.. రూ. వేల కోట్లు బకాయిలు పడిన మాల్యాకు ఈ సొమ్మును డియాజియో చెల్లిం చకుండా ఆదేశించాలంటూ ఎస్బీఐ కాన్సార్షియం డీఆర్టీని ఆశ్రయించింది. ఈ నేపథంలో తాజా ఆదేశాలు వెలువడ్డాయి. అయితే, డియాజియోతో మల్యా ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు మీకు తెలిసినప్పటికీ.. ఆ సొమ్ముకు సంబంధించిన లావాదేవీలు తెలుసుకోవడం, తగిన చర్యలు చేపట్టడం వంటివి ఎందుకు చేయలేదని బ్యాంకర్లను బెనహనకల్లి ప్రశ్నించారు. అంతేకాకుండా రుణాలు తీసుకుంటున్న సమయంలో బ్యాంకులు రుణదాత(మాల్యా), ఆయనకు సంబంధించి కంపెనీలకు ఉన్న ఆస్తుల వివరాలతో కూడిన డిక్లరేషన్‌ను ఎందుకు అడగలేదని కూడా ఆయన తప్పుబట్టారు. తదుపరి విచారణను జూన్ 2కు వాయిదా వేశారు. -
కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ లావాదేవీలపై ఈడీ ఆరా
వివరాలు సమర్పించాలని బ్యాంకులకు ఆదేశాలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విజయ్ మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్(కే ఎఫ్ఏ)పై ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టర్ (ఈడీ) కన్నేసింది. కేఎఫ్ఏ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలను సమర్పించాలని ఆ కంపెనీకి రుణాలిచ్చిన బ్యాంకులకు ఆదేశాలను జారీ చేసింది. అలాగే కేఎఫ్‌ఏకు సంబంధించిన దేశ, విదేశీ చెల్లింపుల వివరాలనూ ఇందులో సమర్పించాలని కోరింది. అంటే ఏ ఖాతా నుంచి డబ్బు వచ్చేది మరియు ఏ ఖాతాకు డబ్బు బదిలీ చేయబడేది అనే కీలక సమాచారాన్ని ఇవ్వాలని పేర్కొంది. ఎందుకంటే ఈ సందర్భంలోనైనా మనీ ల్యాండరింగ్ జరిగిందో లేదో తెలుసుకోవడానికి ఇదొక కీలక సాక్ష్యంగా నిలుస్తుందని పేర్కొంది. ఒకవేళ సంబంధిత డబ్బుకు పన్ను చెల్లించారో లేదో తెలుసుకోవటమే తమ ఉద్దేశ్యమని ఒక ప్రతినిధి పేర్కొన్నారు. ఐడీబీఐ బ్యాంకు కేఎఫ్‌ఏకు ఇచ్చిన రూ.900 కోట్ల రుణంపై ఆరా తీసింది. ఈ ప్రక్రియలో మనీ ల్యాండరింగ్ జరిగిందన్న అనుమానాన్ని ఈడీ వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐడీబీఐతో పాటూ ఇతర బ్యాంకుల నుంచి వివరాలను పరిశీలిస్తూ దర్యాప్తును ముమ్మరం చేసింది. గత నెలలో ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) కింద కోర్టు ఐడీబీఐ కేసులో విజయ్ మాల్యాకు నాన్ బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసిన సంగతి తెలిసిందే. సెబీ కూడా.. మరోవైపు స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కూడా విజయ్ మాల్యాకు చెందిన యూబీ గ్రూప్ ఆర్థిక లావాదేవీలపై ఆరా తీస్తోంది. యూబీ గ్రూప్‌కు చెందిన వివిధ లిస్టెడ్ కంపెనీలు, ప్రమోటర్ల ఆర్థిక వ్యవహారాలు సరిగా లేవని.. నిధుల మళ్లింపు జరిగిందనే అనుమానంతో దర్యాప్తును ముమ్మరం చేసింది. వచ్చే నెలలో మాల్యా ప్రైవేట్ జెట్ వేలం.. విజయ్ మాల్యాకు చెందిన ప్రైవేట్ లగ్జరీ జెట్ (ఎయిర్‌బస్ ఏ319-133 సీజే) వేలం వాయిదా పడింది. వాస్తవానికి ఈనెల 12-13 తేదీల్లో జరగాల్సి ఉండగా.. ఒకే ఒక్క బిడ్డర్ మాత్రమే పోటీలో పాల్గొనడంతో వేలాన్ని వాయిదా వేసారు. కింగ్‌ఫిషర్ నుంచి రావాల్సిన రూ. 500 కోట్ల సర్వీసు ట్యాక్స్ బకాయిల కోసం మహారాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్టీసీ లిమిటెడ్ వచ్చే నెల 29-30 తేదీల్లో వేలాన్ని నిర్వహించనుంది. ఆసక్తి ఉన్నవారు ప్రి-బిడ్డింగ్ కింద కోటి రూపాయలు డిపాజిట్ చేసి వేలంలో పాల్గొనవచ్చని ఎంఎస్టీసీ లిమిటెడ్ తెలిపింది. -
‘కింగ్‌ఫిషర్’ బ్రాండ్ల వేలం మళ్లీ ఫ్లాప్
♦ రిజర్వు ధర రూ.366 కోట్లు ♦ అయినా ముందుకు రాని బిడ్డర్లు ముంబై: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్... బ్రాండు, ట్రేడ్‌మార్క్‌ల వేలం మరోసారి ఫ్లాపయ్యింది. దాదాపు రూ.9,000 కోట్ల రుణ బకాయిలను రాబట్టుకోవడానికి బ్యాంకులు శనివారం నిర్వహించిన వేలానికి స్పందన కరువైంది. 2010లో బ్రాండ్ విలువను దాదాపు రూ.4,000 కోట్ల మేర లె క్కించి రుణాలిచ్చిన బ్యాంకులు.. ప్రస్తుతం రిజర్వ్ ధరను అందులో పదో వంతు కన్నా తక్కువగా రూ.366.70 కోట్లుగా నిర్ణయించి వేలానికి పెట్టాయి. అయినా కూడా ఒక్క బిడ్ సైతం రాలేదు. ఈ రేటు ఎక్కువ కావటంతో బిడ్డర్లు రాలేదని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. నెలన్నర కిందట 17 బ్యాంకుల కన్సార్షియం కింగ్ ఫిషర్ హౌస్‌ను రూ.150 కోట్లకు వేలానికి పెట్టినప్పుడూ ఇదే పరిస్థితి. ఒక్క బిడ్ కూడా రాలేదు. తాజా పరిణామంతో బ్యాంకులు.. కింగ్‌ఫిషర్ హౌస్, కింగ్‌ఫిషర్ బ్రాండ్ రిజర్వ్ ధరను పునఃసమీక్షించి, తగ్గించే అవకాశం ఉండొచ్చని బ్యాంకింగ్ వర్గాలు చెప్పాయి. శనివారం కింగ్‌ఫిషర్ లోగోతో పాటు ‘ఫ్లై ది గుడ్‌టైమ్స్’ ట్యాగ్‌లైను, ఫ్లయింగ్ మోడల్స్, ఫన్‌లైనర్, ఫ్లై కింగ్‌ఫిషర్, ఫ్లయింగ్ బర్డ్ డివైజ్ తదితర ట్రేడ్‌మార్క్‌లను వేలానికి ఉంచారు. ఎస్బీఐ క్యాప్ ట్రస్టీ కంపెనీ ఆధ్వర్యంలో ఉదయం 11.30 గం.కు ప్రారంభమైన ఈ-ఆక్షన్ .. దాదాపు గంటసేపు సాగింది. కింగ్‌ఫిషర్ లోగోను ఏవియేషన్ అవసరాలకు మాత్రమే తప్ప ఇతరత్రా వ్యాపారాలకు వినియోగించుకోవడానికి వీల్లేదంటూ యునెటైడ్ బ్రూవరీస్ (కింగ్‌ఫిషర్ ప్రమోటరు విజయ్ మాల్యా కంపెనీ) హెచ్చరించడం కూడా వేలంపై ప్రభావం చూపి ఉండొచ్చని మరో బ్యాంకరు అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బ్రాండును కొనుక్కుని, పునరుద్ధరించడం కన్నా కొత్తగా ఎయిర్‌లైన్ కంపెనీ పెట్టడమే చవకైన వ్యవహారమని బ్రాండింగ్ నిపుణులు చెప్పారు. 2010లో కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ పరిస్థితి బాగున్నప్పుడు కన్సల్టెన్సీ సంస్థ గ్రాంట్ థార్న్టన్.. కంపెనీ బ్రాండ్ విలువను రూ. 4,000 కోట్లుగా లె క్కించింది. -
మాల్యా పాస్‌పోర్టు రద్దు
► రుణ ఎగవేత కేసుల నేపథ్యంలో విదేశాంగ శాఖ నిర్ణయం ► డిపోర్టేషన్‌కు చర్యలు వేగవంతం! న్యూఢిల్లీ: కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రూ.9,400 కోట్ల రుణ ఎగవేత కేసుల్లో చిక్కుకుని దేశం విడిచిపోయిన విజయ్ మాల్యా పాస్ట్‌పోర్టును ఆదివారం భారత్ రద్దు చేసింది. దీంతో ప్రస్తుతం బ్రిటన్‌లో ఉన్న మాల్యాను వెనక్కిరప్పించే(డిపోర్టేషన్) ప్రక్రియ మొదలుపెట్టేందుకు మార్గం సుగమం కానుంది. ఐడీబీఐ బ్యాంకు రుణ ఎగవేతకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్(ఈడీ) దాఖలు చేసిన మనీలాండరింగ్ కేసులో ఇప్పటికే ముంబై కోర్టు మాల్యాకు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. విచారణ కోసం ఈడీ ముందు హాజరు కావాల్సిన మాల్యా.. దీనికి మూడుసార్లు కూడా నిరాకరించడంతో ఆయన పాస్‌పోర్టును రద్దు చేయాలంటూ ఈడీ విదేశాంగ శాఖను కోరింది. దీంతో ఈ నెల 15న విదేశాంగ శాఖ మాల్యా డిప్లొమాటిక్ పాస్‌పోర్టును సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. పాస్‌పోర్టును ఎందుకు రద్దుచేయకూడదో చెప్పాలంటూ షోకాజ్ నోటీసును కూడా జారీచేసింది. దీనికి మాల్యా ఇచ్చిన సమాధానం ఏమాత్రం సంతృప్తికరంగా లేకపోవడంతో చివరకు ఆయన పాస్‌పోర్టును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాశ్ స్వరూప్ చెప్పారు. రుణ ఎగవేత కేసులు చుట్టుముట్టడంతో మాల్యా మార్చి 2న దేశం విడిచి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన బ్రిటన్‌లో ఉన్నట్లు సమాచారం. కాగా, రూ.900 కోట్ల ఐడీబీఐ రుణానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో మాల్యాను స్వదేశానికి రప్పించేందుకు(డిపోర్టేషన్) ఈడీ చర్యలు ప్రారంభించింది. ఈడీ విజ్ఞప్తి మేరకు విదేశాంగ శాఖ మాల్యా డిపోర్టేషన్‌కు సంబంధించి న్యాయ నిపుణులతో సంప్రదింపులు కూడా జరుపుతోంది. ఈ ప్రక్రియ ప్రారంభమైతే.. మాల్యాను తమకు అప్పగించాల్సిందిగా భారత్ సర్కారు.. బ్రిటన్ ప్రభుత్వ సహకారాన్ని కోరనుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. పాస్‌పోర్టు రద్దు, ముంబై కోర్టు జారీ చేసిన నాన్-బెయిలబుల్ వారెంట్ల ఆధారంగా మాల్యా డిపోర్టేషన్‌ను భారత్ కోరనుందని ఆయా వర్గాలు చెబుతున్నాయి. పాస్‌పోర్టు రద్దవటంతో విదేశాల్లో ఉండటం చట్టవిరుద్ధం అవుతుందని.. తప్పకుండా భారత్‌కు రావాల్సిందేననేది విదేశాంగ శాఖ వర్గాల వాదన. కాగా, ఇప్పుడు మాల్యా తనను బ్రిటన్‌లోనే ఉండేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా బ్రిటిష్ అధికారులను సంప్రదించే అవకాశం ఉంది. అదేవిధంగా పాస్‌పోర్టు రద్దును సవాలు చేస్తూ భారత్‌లోని కోర్టులను కూడా ఆశ్రయించవచ్చని భావిస్తున్నారు. రుణ ఎగవేత, మోసపూరిత కుట్ర, మనీలాండరింగ్ వంటి ఆరోపణలకు సంబంధించి ఈడీతోపాటు సీబీఐ, ఎస్ఎఫ్ఐఓ ఇతరత్రా దర్యాప్తు సంస్థలు కూడా మాల్యాపై విచారణ జరుపుతున్నాయి. యూకే ఓటర్ల జాబితాలో మాల్యా... రుణ ఎగవేత కేసుల కారణంగా బ్రిటన్‌కు పలాయనం చిత్తగించిన మాల్యా... అక్కడి పౌరుడిగా ఓటర్ల లిస్టులో కూడా ఉన్నారు. భారత్ నుంచి తానేమీ పరారైపోలేదని.. తనపై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమంటూ వాదిస్తున్న మాల్యా.. హెర్ట్‌ఫోర్డ్‌షైర్‌లోని టెవిన్ గ్రామంలో ఉన్న మూడంతస్తుల భవంతి(లేడీవాక్)ని ప్రస్తుతం తన అధికారిక అడ్రస్‌గా ధ్రువీకరించినట్లు సండేటైమ్స్ పత్రిక పేర్కొంది. ఉత్తర లండన్ నుంచి గంటన్నర ప్రయాణంతో ఇక్కడికి చేరుకోవచ్చని తెలిపింది. కాగా, ఇక్కడున్న తన చిరునామా సమాచారాన్ని భారతీయ అధికారులకు కూడా తెలియజేసినట్లు మాల్యా చెప్పారని సండేటైమ్స్ వెల్లడించింది. బ్రిటిష్ ఫార్ములా వన్ చాంపియన్ లెవిస్ హామిల్టన్ తండ్రి వద్దనుంచి మాల్యా ఈ భవంతిని 11.5 మిలియన్ పౌండ్లకు కొనుగోలు చేశారు. విదేశీ మూలాలున్న తన కంపెనీ ద్వారా ఆయన ఈ ప్రాపర్టీని దక్కించుకున్నట్లు ఆ పత్రిక పేర్కొంది. -
కింగ్ ఫిషర్ కేసులో ఐదు దేశాలకు సీబీఐ లేఖలు
న్యూఢిల్లీ: పారిశ్రామికవేత్త విజయ్ మాల్యకు చెందిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్...ఐడీబీఐ బ్యాం క్ నుంచి తీసుకున్న రుణాల తరలింపు ఆరోపణలకు సంబంధించి సమాచారాన్ని కోరుతూ అమెరికా, బ్రిటన్లతో సహా ఐదు దేశాలకు సీబీఐ త్వరలో జ్యుడీషియల్ విజ్ఞప్తి లేఖలు పంపనుంది. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ లావాదేవీలపై ఫైనాన్షియల్ ఇంటిలిజెన్స్ యూనిట్ నుంచి తగిన వివరాలు అందడంతో ఆయా దేశాలను సంప్రదించాలని సీబీఐ నిర్ణయించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. సీబీఐ ఇప్పటికే ఈ లేఖల్ని రూపొందించిందని, వాటిని బ్రిటన్, అమెరికా, హాంకాంగ్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ దేశాలకు పంపుతుందని ఆ వర్గాలు తెలిపాయి.ఐడీబీఐ బ్యాంక్ నుంచి కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ తీసుకున్న రూ. 930 కోట్ల రుణంలో అధికభాగం ఇతర దేశాలకు తరలివెళ్లినట్లు సీబీఐ భావిస్తోంది. -
ఎగిరి..పడ్డ 'కింగ్'
♦2005లో ఆరంభమైన కింగ్ ఫిషర్ ♦ ఆరేళ్లు తిరక్కుండానే కష్టాలు; భారీ అప్పులు ♦ ఏడేళ్లకే మూత; అప్పులు రూ.10వేల కోట్లపైనే ♦ దేశంలో విజయ్ మాల్యా ఆస్తులు రూ.5వేల కోట్లు! ♦ విదేశాల్లో సైతం విలువైన ఆస్తులు అలా చేసి ఉండకపోతే...! జీవితంలో ఈ మాట చాలామంది అనుకుంటుంటారు. విజయ్ మాల్యా ఇలా అనుకున్నారో లేదో గానీ... ఆయన గురించి తెలిసిన వారు మాత్రం ‘‘ఆయన విమానయాన రంగంలోకి వెళ్లి ఉండకపోతే!!’’ అని అనుకోకుండా ఉండలేరు. ఎందుకంటే... 22 ఏళ్ల పాటు తెలివిగా ఎత్తుగడలు వేస్తూ యూబీ గ్రూప్‌ను మహా సామ్రాజ్యంగా మార్చారు మాల్యా. విదేశీ కంపెనీల్ని చేజిక్కించుకుని విజయ బావుటా ఎగరెయ్యటమే కాదు. విదేశాల్లో వేలానికి పెట్టిన మనదేశ పరువు ప్రతిష్టల్నీ ఒకరకంగా కాపాడారు. భారీ మొత్తాలు వెచ్చించి టిప్పు సుల్తాన్ ఖడ్గాన్ని, మహాత్ముడి వస్తువుల్ని తిరిగి దేశానికి తెచ్చారు. శెహబాశ్ అనిపించుకున్నారు. కానీ 2005లో ఆరంభించిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్... మాల్యా పేరు మార్చేసింది. పరువు ప్రతిష్టల్ని దిగజార్చింది. విమానయాన రంగంలో అతివేగంగా డబ్బులు పోగొట్టి... ఆరేళ్లు తిరక్కుండానే అప్పుల పాలయ్యారు. అవి తీర్చకుండా ఎగవేసి ఎగవేతదారుగా మిగిలారు. పులి మీద పుట్రలా... అదే సమయంలో మిగిలిన కంపెనీల్లోనూ మెజారిటీ వాటా పోగొట్టుకున్నారు. సొంత యూబీ గ్రూప్ చైర్మన్ పదవినీ వదులుకున్నారు. తండ్రి సుదీర్ఘకాలం శ్రమించి ఏర్పాటు చేసిన సామ్రాజ్యాన్ని 28 ఏళ్ల వయసులో భుజానికెత్తుకున్న మాల్యా... ‘కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్’ అనే తన యూబీ గ్రూపు నినాదానికి తానే బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచారు. ఇపుడు రాజ్యాధికారాన్ని పోగొట్టుకుని... వేరొకచోట శరణార్థిగా మిగిలిపోయారు. తండ్రి మరణించటంతో.... మాల్యా పుట్టింది 1955 డిసెంబరు 18న. తండ్రి విఠల్ మాల్యా యూబీ గ్రూపు వ్యవస్థాపకుడు. 1983లో తండ్రి మరణించటంతో మాల్యా యూబీ గ్రూపు బాధ్యతలు చేపట్టారు. సమీరతో పరిచయం; వివాహం ఎయిరిండియాలో ఎయిర్ హోస్టెస్‌గా పనిచేసే సమీరా త్యాబ్జీతో మాల్యాకు పరిచయం ఏర్పడింది. సమీర పుట్టింది 1970లో. ఆమెను మాల్యా 1986లో వివాహం చేసుకున్నారు. ఏడాది గడిచాక వీరికి సిద్ధార్థ్ మాల్యా పుట్టారు. యూబీ గ్రూపు వారసుడు కూడా సిద్దార్థ్ మాల్యానే. వివిధ కారణాలతో కొన్నాళ్లకు ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. రేఖతో రెండో వివాహం రేఖ మాల్యా బెంగ ళూరులో మాల్యా ఇంటిపక్కనే ఉండేవారు. రేఖ మొదట కూర్గ్‌లోని కాఫీ తోటల యజమాని ప్రతాప్ చెట్టియప్పను వివాహం చేసుకున్నారు. తరవాత భర్త నుంచి విడాకులు తీసుకుని షాహిద్ మహమూద్‌ను వివాహం చేసుకున్నారు. మహమూద్‌కు- రేఖకు లైలా, కబీర్ అనే ఇద్దరు పిల్లలున్నారు. తరవాత మహమూద్ నుంచి విడాకులు తీసుకున్నాక మూడో వివాహం గురించి ఆలోచిస్తున్న సమయంలో మాల్యా నుంచి ప్రతిపాదన రావటంతో ఆమె అంగీకరించారు. 1993లో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. వీళ్లకు లీనా, తాన్యా అనే ఇద్దరు అమ్మాయిలున్నారు. రేఖకు మొదటి భర్త ద్వారా కలిగిన లైలాను కూడా మాల్యా దత్తత తీసుకున్నారు. సొంత బిడ్డలానే చూసుకున్నారు. ప్రస్తుతం లీనా, తాన్యా ఇద్దరూ శాన్ఫ్రాన్సిస్కోలో తల్లితోనే ఉంటున్నారు. లైలా మాత్రం యూరప్ నుంచి మహిళల యాక్సెసరీస్‌ను దిగుమతి చేసుకుని విక్రయించే వ్యాపారం చేస్తున్నారు. కింగ్ ఆఫ్ గుడ్‌టైమ్స్... మాల్యా జీవనశైలి ఆది నుంచీ సంచలనమే. ఆయన ప్రత్యేక శ్రద్ధపెట్టి తయారు చేసే కింగ్‌ఫిషర్ క్యాలెండర్ ప్రాధాన్యం వేరే చెప్పాల్సిన పనిలేదు. ఒక క్యాలెండర్ కావాలంటూ వీవీఐపీలు కూడా ఎగబడే వారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇక ఆయనిచ్చే పార్టీలు దేశమంతా ఫేమస్. ప్రపంచ వ్యాప్తంగా 25కు పైగా విలాసవంతమైన ఇళ్లున్న మాల్యా... ఫ్రాన్స్‌లో ఏకంగా ఓ దీవినే సొంతం చేసుకున్నారు. 250కి పైగా పురాతన కార్లు, ఖరీదైన వింటేజ్ యాచ్‌తో (విలాసవంతమైన పడవ) పాటు... ప్రయివేటు జెట్లు కూడా ఈయన సొంతం. అంతేకాదు! మాల్యాకు దేశంతో పాటు విదేశాల్లో కూడా అత్యంత ప్రముఖులతో సన్నిహిత సంబంధాలున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ వద్ద మాల్యా ఓ అపార్ట్మెంట్ కొనుగోలు చేశారు. స్విస్ యువరాజుతో పాటు బోలెడంత మంది హాలీవుడ్ ప్రముఖులు విదేశాల్లో మాల్యా అతిథి గృహాల్లో అతిథులుగా ఉన్నారు. చేజారిన సామ్రాజ్యం... 2013 జులై: యునెటైడ్ స్పిరిట్స్ లిమిటెడ్‌లో (యూఎస్ఎల్) 27 శాతం వాటాను రూ.6,500 కోట్లకు డియాజియో సంస్థ కొనుగోలు చేసింది. ఈ డబ్బుల్లో పైసా కూడా కింగ్‌ఫిషర్ రుణదాతలకు దక్కలేదు. ప్రస్తుతం యూఎస్‌ఎల్‌లో డియాజియో వాటా... 55 శాతం. 2013 ఆగస్టు: ముంబై విమానాశ్రయానికి అతి సమీపంలో ఉన్న అత్యంత విలువైన ‘కింగ్‌ఫిషర్ హౌస్’ను... రుణం ఎగవేసినందుకు ఎస్బీఐ సొంతం చేసుకుంది. 2013 అక్టోబరు: ఇన్ని రుణాలున్నా... ఫోర్బ్స్ కుబేరుల జాబితాలో విజయ్ మాల్యా 84వ స్థానంలో నిలిచారు. 2013 డిసెంబరు: మాల్యాకు చెందిన యునెటైడ్ బ్రూవరీస్ లిమిటెడ్‌లో (యూబీఎల్)... ప్రపంచంలో 3వ అతిపెద్ద బ్రూవరీ అయిన డచ్ కంపెనీ ీహ నికెన్ అతిపెద్ద వాటాదారుగా మారింది. ప్రస్తుతం యూబీఎల్‌లో హీనికెన్కు 38.76 శాతం వాటా ఉంది. 2014 సెప్టెంబరు: మాల్యాను ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా (విల్‌ఫుల్ డి ఫాల్టర్) యుైనె టెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. 2015 సెప్టెంబరు: యునెటైడ్ స్పిరిట్స్, యునెటైడ్ బ్రూవరీస్ తరవాత... మంగళూరు కెమికల్స్‌పై మాల్యా నియంత్రణ కోల్పోయారు. మెజారిటీ వాటా జువారీ గ్రూప్ చేతికి వెళ్లింది. 2015 నవంబరు: బ్యాంకుల ఒత్తిడి పెరిగింది. ఎట్టకేలకు... అప్పులిచ్చిన బ్యాంకులకు లీడర్‌గా వ్యవహరించిన ఎస్బీఐ... మాల్యాను, ఆయనకు చెందిన రెండు కంపెనీలను ఉద్దేశపూర్వక ఎగవేతదార్లుగా ప్రకటించింది. 2015 డిసెంబరు: మాల్యా తన 60వ జన్మదినాన్ని మూడు రోజుల పాటు అట్టహాసంగా జరుపుకున్నారు. బాలీవుడ్ గాయకుడు సోనూ నిగమ్‌తో పాటు లాటిన్ పాప్‌స్టార్ ఎన్రిక్ కూడా అతిథుల్ని అలరించారు. 2016 ఫిబ్రవరి: కరీబియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ బార్బడోస్‌ను రూ.13 కోట్లకు కొనుగోలు చేశారు. ఇది.. ఐపీఎల్ తరవాత క్రికెట్లో మాల్యా రెండో పెట్టుబడి. ఫిబ్రవరి 17: యూబీ హోల్డింగ్స్ లిమిటెడ్‌ను ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా పంజాబ్ నేషనల్ బ్యాంకు ప్రకటించింది. ఫిబ్రవరి 26: డియాజియోతో ఒప్పందం మేరకు యూఎస్ఎల్ చైర్మన్ పదవి నుంచి మాల్యా తప్పుకున్నారు. ఇందుకు ఆయనకు ఐదేళ్లలో రూ.500 కోట్ల వరకూ అందుతాయి. మార్చి 4: ఈ 500 కోట్లూ తనకే దక్కాలంటూ రుణ రికవరీ ట్రిబ్యునల్‌ను ఎస్బీఐ ఆశ్రయించింది. మార్చి 9: మాల్యా రెండో తేదీనే దేశం విడిచి వెళ్లిపోయినట్లు సుప్రీంకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. అంతేకాదు! డియాజియో చెల్లించాల్సిన దాంట్లో అప్పటికే రూ.270 కోట్లు ఆయనకు చెల్లించినట్లు కూడా కోర్టుకు ప్రభుత్వం వెల్లడించింది. అప్పుల కుప్ప... బ్యాంకులకు చెల్లించాల్సిన బకాయిలు, ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు, వడ్డీ కలిపితే... మాల్యా అప్పులు రూ.10వేల కోట్లకన్నా ఎక్కువే. కింగ్ ఫిషర్ ఉద్యోగులు అడుగుతున్న ఎరియర్స్ బకాయిలు దీనికి అదనం. ఇవి కాక కొన్ని ప్రధానమైన ఢిల్లీ, ముంబైలలో భవంతులు, మరికొన్ని రియల్ ఎస్టేట్ ఆస్తులు, గుర్రాల ఫాం, ప్రైవేటు జెట్, దాదాపు రెండు వందల వింటేజ్ కార్ల్లు ఉన్నాయి. వీటన్నిటినీ కలిపితే ఆస్తుల విలువ రూ.4,500-రూ.5,000 కోట్ల మధ్య ఉండవచ్చని అంచనా. దేశంలో ఉన్న ఆస్తుల విలువ మొత్తం కలిపితే దాదాపు రూ.5000 కోట్ల వరకూ ఉండవచ్చని అంచనా. ఇవి కాక విజయ్ మాల్యాకు పలు దేశాల్లో విలువైన ఆస్తులున్నాయి. వీటిలో బహిరంగంగా బయటకు తెలిసిన ఆస్తులివీ... సాసాలిటొ: అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న ఈ ఇల్లు... అక్కడ చాలా ఫేమస్. ఈ ఇంట్లోంచి బెల్వెడర్ సిటీతో పాటు శాన్ ఫ్రాన్సిస్కో-ఓక్లాండ్ బే బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది. 2003లో ‘శాన్ఫ్రాన్సిస్కో గేట్’ తెలిపిన వివరాల మేరకు... 6-బల్కీ అవెన్యూలో ఉన్న సాసాలిటో ప్రాపర్టీని 1987లో మాల్యా కొన్నారు. మాల్యా భార్య రేఖ గర్భిణిగా ఉండగా... ప్రసవం కష్టం కావటంతో అక్కడకు వెళ్ళారు. కొన్నాళ్లు అక్కడే ఉండాలని వైద్యులు చెప్పటంతో... 11వేల చదరపు అడుగుల ఈ భవంతిని 12 లక్షల డాలర్లకు మాల్యా కొన్నారు. పలు మార్లు ఈ భవంతిలోకి నీరు ప్రవేశించి మునిగిపోయే పరిస్థితి ఏర్పడగా... మాల్యా మరమ్మతులు చేయిస్తూ వచ్చారు. క్లిఫ్టన్ ఎస్టేట్: దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్ బీచ్ ఒడ్డునున్న క్లిఫ్టన్లో 84 లక్షల డాలర్లు వెచ్చించి 2010లో మాల్యా ఓ ఎస్టేట్‌ను కొన్నారు. దీన్ని కేప్‌టౌన్‌లోనే అత్యుత్తమ ఎస్టేట్‌గా సండే టైమ్స్ (దక్షిణాఫ్రికా) వర్ణించింది. ఈ భవంతిలో సానాతో పాటు వాకింగ్ ట్రాక్, జిమ్, నాలుగు కార్ల గ్యారేజ్ ఉన్నాయి. 2010 ప్రపంచ కప్ సమయంలో స్వీడన్ యువరాజు కార్ల్ఫిలిప్ ఇక్కడే బసచేశారు. సింగర్ జార్జ్ మైఖేల్‌తో పాటు లార్డ్ ఆఫ్ వార్ సినిమా షూటింగ్ సమయంలో హాలీవుడ్ స్టార్ నికొలస్ కేజ్ దాదాపు రెండు నెలలకు పైగా ఇదే ఇంట్లో బస చేశారు. 2014 మార్చిలో మాల్యా ఈ ప్రాపర్టీని విక్రయించారు. ట్రంప్ ప్లాజా: 2011 సెప్టెంబర్‌లో మాల్యా న్యూయార్క్‌లోని ట్రంప్ ప్లాజాలో 24 లక్షల డాలర్లు వెచ్చించి ఓ పెంట్‌హౌస్‌ను కొనుగోలు చేశారు. ఈ ట్రంప్ ప్లాజా వేరెవరిదో కాదు. ప్రస్తుతం అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్‌ది. న్యూయార్క్‌లో అత్యంత ఖరీదైన టవర్ కూడా ఇదే. 37 అంతస్తుల ఈ రెసిడెన్షియల్ టవర్‌లో... డొనాల్డ్ ట్రంప్‌తో పాటు సెలబ్రిటీలు బియాన్స్ నోల్స్, బ్రూస్ విల్లీస్, టోనీ ఎంబ్రీ ఇళ్లు కూడా ఉన్నాయి. ద గ్రాండ్ గార్డెన్ (ఫ్రాన్స్): ‘లె గ్రాండె జార్డిన్’ పేరిట పిలిచే ఈ దీవిని... సెలబ్రిటీలు, రష్యన్ బిలియనీర్లతో పోటీపడి మరీ 2008 మార్చిలో మాల్యా కొనుగోలు చేశారు. లెరిన్స్లోని 4 దీవుల్లో రెండే నివాస యోగ్యమైనవి. వీటిలో పెద్దది సెయింట్ మార్గరెట్. దీన్లోనే ‘లె గ్రాండ్’ ఉంది. మాల్యా కొన్నపుడు దీని ధర 7.6 కోట్ల నుంచి 8.8 కోట్ల డాలర్ల మధ్య ఉన్నట్లు సమాచారం. మబూలా గేమ్లాడ్జ్ (జొహన్నెస్‌బర్గ్): దక్షిణాఫ్రికాలోని అత్యుత్తమ గేమ్ రిజర్వ్‌లలో మబూలా ఒకటి. గేమ్ రిజర్వ్ అంటే... వన్యప్రాణులతో నిండిన ప్రయివేటు అరణ్యం. 25,000 ఎకరాల్లో విస్తరించిన ఈ గేమ్ రిజర్వ్‌లో 99.5 శాతం వాటా మాల్యాదే. 1990లలో 60 లక్షల డాలర్లు వెచ్చించి మాల్యా ఈ గేమ్ లాడ్జ్‌ను కొనుగోలు చేశారు. టెవిన్ విలేజ్; హెర్ట్‌ఫోర్డ్‌షైర్ (ఇంగ్లాండ్): తాజాగా టెవిన్ దగ్గర్లో ఓ పెద్ద ఇంటిని మాల్యా కొన్నారు. హెర్బర్ట్షైర్లోని వెల్విన్ గార్డెన్ సిటీకి వెలుపల టెవిన్ విలేజ్ ఉంటుందని ఫార్ములా వన్ బ్లాగర్ జో సవార్డ్ తెలియజేశారు. కీలూర్ కేజిల్, పెర్త్షైర్: స్కాట్లాండ్లోని పెర్త్షైర్లో ఉంది కీలూర్ కేజిల్. 2007లో స్కాటిష్ బ్రాండ్ వైట్ అండ్ మెకేను కొనుగోలు చేసే సమయంలో ఆయా కార్యకలాపాల్ని పర్యవేక్షించడానికి మాల్యా అక్కడ ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో మాల్యా ఈ ఇంటిని కొనుగోలు చేశారు. కలిసొచ్చిన కాలం... 1983: మాల్యా వయసు 28 ఏళ్లు. తండ్రి విఠల్ మాల్యా మరణించటంతో యునెటైడ్ బ్రూవరీస్ గ్రూప్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. అప్పటికే ఈ గ్రూపు ఇతర రంగాలతో పాటు ప్రధానంగా లిక్కర్, ఫార్మా, ఆగ్రో కెమికల్స్, పెయింట్ల రంగాల్లో విస్తరించి ఉంది. 1986: మరో లిక్కర్ కంపెనీ ‘షా వాలెస్’ను కొనుగోలు చేయడానికి దాని యజమాని మనూ ఛాబ్రియాతో అప్పటికే కొన్నాళ్లుగా పోరాడుతున్నారు మాల్యా. ఆ సమయంలో ఫారెక్స్ నిబంధనలను ఉల్లంఘించారనే కారణంతో మాల్యా కొన్నాళ్లపాటు అరెస్టయ్యారు. 1990: కర్ణాటక ప్రభుత్వం మంగళూరు కెమికల్స్, ఫెర్టిలైజర్స్‌ను ఖాయిలా సంస్థగా ప్రకటించింది. దాన్ని కొని, తన నియంత్రణలోకి తెచ్చుకున్నారు మాల్యా. 1991: బెర్జర్ పెయింట్స్‌లో మెజారిటీ వాటాను 66 మిలియన్ డాలర్లకు విక్రయించారు. ఆ నిధుల్ని లిక్కర్ వ్యాపారంలో ఇన్వెస్ట్ చేశారు. 1993: ‘కిసాన్’ బ్రాండ్‌ను హిందుస్తాన్ యూనిలీవర్‌కు భారీ మొత్తానికి విక్రయించారు. 1994: రామస్వామి వడయార్ నుంచి గోల్డెన్ ఈగిల్ కమ్యూనికేషన్స్‌ను కొనుగోలు చేశారు. దాన్ని విజయ టీవీగా పేరు మార్చారు. 1996: బెర్జర్ పెయింట్స్ అంతర్జాతీయ వ్యాపారాన్ని మలేసియా కంపెనీకి విక్రయించారు. 1998: కోల్‌కతాకు చెందిన ఈస్ట్‌బెంగాల్ ఫుట్‌బాల్ క్లబ్లో యూబీ గ్రూప్ తరఫున వాటా కొన్నారు. దాని ప్రత్యర్థి మోహన్ బగాన్లోనూ వాటా తీసుకున్నారు. 1999: యూబీ గ్రూపు ‘కింగ్ ఫిషర్’ స్ట్రాంగ్ బీర్‌ను మార్కెట్లోకి తెచ్చింది. దేశంలో ఇప్పటికీ అత్యధికంగా అమ్ముడవుతున్న బీర్ బ్రాండ్ ఇదే. 2001: బాలీవుడ్ సినీ గాసిప్ మ్యాగజైన్ ‘సినీ బ్లిట్జ్’ను ప్రచురించే రిఫా పబ్లికేషన్స్‌ను కొనుగోలు చేశారు. 2004: యూకేలో జరిగిన వేలంలో రూ.1.75 కోట్లు వెచ్చించి టిప్పుసుల్తాన్ ఖడ్గాన్ని సొంతం చేసుకున్నారు. 2005: షా వాలెస్‌ను పూర్తిగా హస్తగతం చేసుకుని.. విస్కీ బ్రాండ్ రాయల్ చాలెంజ్‌పై తన పట్టు పెంచుకున్నారు. కలసిరాని కాలం... 2005 మే: ఏవియేషన్ రంగంలోకి ప్రవేశించారు. తొలి కింగ్ ఫిషర్ విమానం ఎగిరింది. ఎయిర్‌బస్ ఏ-380 విమానం కొనుగోలుకు ఆర్డరిచ్చారు. దీనికి ఆర్డరిచ్చిన తొలి దేశీ కంపెనీ కింగ్ఫిషరే. తరువాత ఇది రద్దయింది. 2006: బ్యాగ్‌పైపర్, రొమనోవ్ వోడ్కా వంటి బ్రాండ్లను తయారు చేసే హెర్బర్స్టోన్స్ను కొనుగోలు చేశారు. 2007: ప్రపంచంలో స్కాచ్ తయారీలో 4వ స్థానంలో ఉన్న వైట్ అండ్ మెకేను దాదాపు రూ.5,950 కోట్లు వెచ్చించి కొనుగోలు చేశారు. యూరోపియన్ విస్కీ మార్కెట్లో గట్టి పట్టు సంపాదించారు. 2007 జూన్: విదేశాలకు విమానాలు నడపాలంటే ఐదేళ్ల అనుభవం తప్పనిసరి కావటంతో... కింగ్‌ఫిషర్ సంస్థ ఎయిర్ డెక్కన్ కొనుగోలు చేసింది. 2008: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంఛైజీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరును 11.16 కోట్ల డాలర్లు వెచ్చించి కొనుగోలు చేశారు మాల్యా. 2009: న్యూయార్క్‌లో జరిగిన వేలంలో 18 లక్షల డాలర్లు వెచ్చించి మహాత్మా గాంధీకి చెందిన వస్తువుల్ని కొనుగోలు చేశారు. 2010 మార్చి: కింగ్‌ఫిషర్ సంస్థ తొలి అంతర్జాతీయ విమాన సర్వీసును ఆరంభించింది. 2010 నవంబర్: కింగ్‌ఫిషర్ అప్పులు రూ.6,000 కోట్లకు చేరాయి. బోర్డు సమావేశమై వీటి పునర్వ్యవస్థీకరణకు సిఫారసు చేసింది. 2011 సెప్టెంబర్: ఆరేళ్లు గడిచాయో లేదో... చౌక విమానయాన సర్వీసుల నుంచి కింగ్‌ఫిషర్ నిష్ర్కమించింది. ‘కింగ్‌ఫిషర్ రెడ్’ను మూసేసింది. 2011 డిసెంబర్: కష్టాలు షురూ... సర్వీస్ ట్యాక్స్ రూపంలో రూ.70 కోట్లు బకాయి పడటంతో కింగ్ఫిషర్కు చెందిన 11 బ్యాంకు ఖాతాలను ప్రభుత్వం స్తంభింపజేసింది. 2012 మార్చి: కింగ్ఫిషర్లో టికెట్లు బుక్ చేసుకుంటే ప్రయాణానికి గ్యారంటీ ఉండదని ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ హెచ్చరించింది. 2012 జూలై: కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు ప్యాకేజీ ఇచ్చి ఆదుకోవటానికి కేంద్ర పౌరవిమానయాన శాఖ నో చెప్పింది. 2012 సెప్టెంబర్: నిర్వహణ ఖర్చులకు రూ.200 కోట్లు రుణం కావాలని చేసిన దరఖాస్తును ఎస్బీఐ తిరస్కరించింది. 2012 అక్టోబర్: కింగ్‌ఫిషర్ పర్మిట్‌ను... విమానయాన నియంత్రణ సంస్థ రద్దు చేసింది. విమానాలు నిలిచిపోయాయి. సిబ్బంది సమ్మెకు దిగారు. 2012 డిసెంబర్: కింగ్‌ఫిషర్ ఎయిర్ ఆపరేషన్స్ పర్మిట్ కూడా రద్దయింది. -
‘కింగ్‌ఫిషర్’ బ్రాండ్ వేల్యూపై ఎస్ఎఫ్ఐవో దృష్టి
న్యూఢిల్లీ: రుణాల ఎగవేత కేసులు ఎదుర్కొంటున్న కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ బ్రాండ్ వేల్యుయేషన్‌పై సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐవో) దృష్టి సారించింది. బ్రాండ్ విలువను ఉన్న దానికంటే అధికంగా .. రూ. 4,000 కోట్ల పైగా చేసి చూపారన్న ఆరోపణలపై విచారణ చేపట్టింది. బ్యాంకుల నుంచి మరింత రుణం తీసుకుని, ఎయిర్‌లైన్స్ కాకుండా ఇతర అవసరాలకు మళ్లించేందుకు మోసపూరితంగా విలువను ఎక్కువ చేసి చూపారా అన్న కోణంలోను, ఇందులో కన్సల్టెన్సీ సంస్థ గ్రాంట్ థార్న్టన్ పాత్రపైన ఎస్ఎఫ్ఐవో దర్యాప్తు ప్రారంభించింది. గోవాలో కేసినో లెసైన్సుకు ‘మాల్యా’ కంపెనీ దరఖాస్తు కాగా విజయ్‌మాల్యా నియంత్రణలోని యూబీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ సంస్థ.. గోవాలో కేసినో లెసైన్సు కోసం దరఖాస్తు చేసింది. 2013 నుంచి కేసినోల ఏర్పాటు కోసం వచ్చిన దరఖాస్తుల వివరాలను వెల్లడిస్తూ గోవా ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పార్సేకర్.. అసెంబ్లీలో ఈ విషయాలు తెలిపారు. -
కింగ్ ఫిషర్ ‘పీఎఫ్’ అవకతవకలపై విచారణ
న్యూఢిల్లీ: కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌లో ప్రావిడెంట్ ఫండ్ అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు ఇప్పుడు లిక్కర్ కింగ్ విజయమాల్యాను చుట్టుముడుతున్నాయి. ఈ అంశాలపై విచారణకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్ఓ) ఒక ప్రత్యేక విచారణా బృందాన్ని నియమించింది. మాల్యా ప్రమోట్ చేసిన ఎయిర్‌లైన్స్‌కు పీఎఫ్ బకాయిల విషయమై, రూ.7.62 లక్షలకు సంబంధించి ఈపీఎఫ్ఓ ఒక నోటీసును కూడా జారీ చేసినట్లు కార్మిక మంత్రిత్వశాఖ వర్గాలు పేర్కొన్నాయి. కాగా కంపెనీ ఈపీఎఫ్ బకాయిలు చెల్లించకపోవడానికి సంబంధించి కొన్ని ఆరోపణలు ఉన్నప్పటికీ, కింగ్‌ఫిషర్ సభ్యుల నుంచి గానీ లేక యూనియన్ల నుంచి కానీ ఎటువంటి లిఖితపూర్వక ఫిర్యాదూ నమోదుకాలేదని కార్మికమంత్రిత్వశాఖ తెలిపింది. 2015 సెప్టెంబర్‌కు ముందు కింగ్ ఫిషర్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న కాలంలో ప్రావిడెండ్ ఫండ్ చెల్లింపుల్లో ఏమైనా అవకతవకలు జరిగాయా లేదా అన్న విషయమై దర్యాప్తు జరపుతామని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. బ్యాంకులకు భారీ బకాయిలు పడ్డాడన్న ఆరోపణల నేపథ్యంలో... మాల్యా మార్చి 4న దేశం వదిలి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పరిణామం పెద్ద చర్చకు దారితీసింది. మరోవైపు కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కి ఇచ్చిన రుణాలు, ఎగవేతపై చర్యల వివరాలు తెలపాలంటూ 17 బ్యాంకులను కోరగా ఇప్పటిదాకా అరడజను బ్యాంకులు నివేదికలు ఇచ్చినట్లు ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్(ఈడీ) వర్గాలు తెలిపాయి. ఐడీబీఐ బ్యాంకు నుంచి తీసుకున్న రుణాల ఎగవేత, మనీ లాండరింగ్‌పై ఈడీ దర్యాప్తు చేస్తోంది. అటు, రుణాల డిఫాల్టుపై కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్, యూబీగ్రూప్ల మాజీ సీఎఫ్‌వోలను సీబీఐ మంగళవారం కూడా ప్రశ్నించింది. -
కింగ్‌ఫిషర్ పీఎఫ్ అవకతవకలపై విచారణ
కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ న్యూఢిల్లీ: తమకు జీతాలు చెల్లించకపోయినప్పటికీ, ప్రావిడెండ్ ఫండ్(పీఎఫ్)ను మాత్రం కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ చెల్లించిందని ఈ కంపెనీకి చెందిన మహిళ ఉద్యోగులు ఇటీవల రాసిన లేఖపై కేంద్రం దృష్టి సారిస్తోంది. కింగ్ ఫిషర్ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తున్న కాలంలో ప్రావిడెండ్ ఫండ్ చెల్లింపుల్లో ఏమైనా అవకతవకలు జరిగాయా లేదా అన్న విషయమై దర్యాప్తు జరపుతామని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఇప్పటివరకూ ఈ విషయాలను పరిశీలించలేదని, తర్వలోనే దర్యాప్తు జరుపుతామని వివరించారు. కాగా కింగ్ ఫిషర్ కంపెనీ తమకు వేతన బకాయిలు చెల్లించలేదని పలువురు మాజీ ఉద్యోగులు న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు. -
‘కింగ్’ను విచారిస్తున్న ఈడీ
రెండోరోజూ కింగ్‌ఫిషర్ మాజీ సీఎఫ్‌వో విచారణ ♦ బ్యాంకు అధికారులకూ ఈడీ నోటీసులు ♦ ఆదుకోండంటూ.. ప్రధానికి ఉద్యోగుల లేఖ ముంబై/బెంగళూరు: మనీ లాండరింగ్ కేసులో కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మాజీ సీఎఫ్‌వో ఏ రఘునాథన్ వరుసగా రెండో రోజూ ఈడీ విచారణకు హాజరయ్యారు. ఐడీబీఐ బ్యాంకుకు విజయ్‌మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ (కేఎఫ్ఏ) కంపెనీ రూ. 9కోట్ల అప్పు ఎగ్గొట్టిన కేసులో విచారణ కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి ఆరేడుగురు కేఎఫ్ఏ అధికారులకు విచారణకు రావాలంటూ ఈడీ నోటీసులు జారీచేసింది. విచారణలో వీరి వ్యక్తిగత ఐటీ రిటర్న్ పత్రాలు తీసుకురావాలన్నారు. రఘునాథన్తోపాటు, ఐడీబీఐ బ్యాంకు మాజీ చైర్మన్, ఎండీ యోగేశ్ అగర్వాల్, కేఎఫ్ఏ, బ్యాంకుల సీనియర్ ఎగ్జిక్యూటివ్ అధికారులకూ నోటీసులందాయి. వీరిని పూర్తిగా విచారించాకే లిక్కర్ కింగ్ మాల్యాకు నోటీసులివ్వాలని ఈడీ యోచిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా పరిమితికి మించిన నిధులను కేఎఫ్‌ఏకు ఇవ్వటంలో బ్యాంకు అధికారుల పాత్ర ఉందనే కోణంలోనూ విచారణ జరుపుతోంది. కాగా, సంస్థనుంచి రావాల్సిన రూ. 300 కోట్లను ఇప్పించి ఆదుకునేందుకు జోక్యం చేసుకోవాలని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఉద్యోగులు ప్రధానికి లేఖ రాశారు. కేఎఫ్ఏ మూసివేత వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 7వేల మంది ఉద్యోగుల జీవితాలు రోడ్డుపైకి వచ్చాయన్నారు. ‘మీరు తప్ప మమ్మల్ని ఎవరూ ఆదుకోలేరు. ఈ లేఖ వ్యర్థం కాదని భావిస్తున్నాం’ అని పేర్కొన్నారు. అదో కారణమంతే: కాంగ్రెస్ మాల్యాను ప్రభుత్వం కావాలనే తప్పించిందని విమర్శిస్తున్న కాంగ్రెస్.. తాజాగా సీబీఐ తప్పుడు లుకౌట్ నోటీసు ఇందుకు ఓ కారణమంది. మాల్యాను తప్పించేందుకు కావాలనే తప్పుడు నోటీసులిచ్చి వెనక్కు తీసుకున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ తెలిపారు. మాల్యా పారిపోలేదు: దేవెగౌడ కర్ణాటక మట్టిలో పుట్టి పెరిగి, పారిశ్రామికవేత్తగా ఎదిగిన మాల్యా అప్పులు తీర్చకుండా దేశం విడిచి పారిపోయారనడం సరికాదని జేడీ(ఎస్) జాతీయాధ్యక్షుడు, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ బెంగళూరులో అన్నారు. ‘మాల్యా విదేశాలకు పారిపోయారనడం సరికాదు. బహుశా విదేశాల్లో ఏదైనా పనులు ఉండటం వల్ల అక్కడికి వెళ్లి ఉండొచ్చు. అంతేకానీ దేశం విడిచి పారిపోయే వ్యక్తి కాదు. రూ. 9వేల కోట్ల అప్పు తీర్చలేని స్థితిలో మాల్యా ఉన్నారనుకోను’ అని పేర్కొన్నారు. ‘బికినీ బ్యూటీ’లే మాల్యా ఆస్తి మాల్యాపై డెరైక్టర్ రాంగోపాల్ వర్మ ట్విటర్లో స్పందించారు. ఆయన పెంచిపోషించిన ‘బికినీ బ్యూటీ’లను ఒక్కో బ్యాంకుకు ఇచ్చేస్తే మాల్యా అప్పులన్నీ తీరతాయని వ్యంగ్యంగా అన్నారు. ‘మాల్యా బికినీ బ్యూటీ ప్రతిపాదనను బ్యాంకులు ఒప్పుకోకపోవచ్చు కానీ బ్యాంకర్లు ఒప్పుకుంటారు. ఈ బ్యూటీలకోసమే ఇంత అప్పుచేసిన మాల్యాకు.. అప్పులు తీర్చుకునేందుకు ఈ బ్యూటీలు సరిపోరా?’ అని ట్వీట్ చేశారు. బ్యాంకర్లను వశపరుచుకునేందుకు మాల్యాకు కేలండర్ బ్యూటీలయిన దీపిక పదుకొనె, నర్గిస్ ఫక్రిస్, ఇషా గుప్తా, కత్రినాకైఫ్ వంటి వాళ్లు చాలా సాయపడి ఉండొచ్చన్నారు. -
మాల్యా ఒక్క రూపాయి కూడా అప్పులేరట!
న్యూఢిల్లీ: లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు చెందిన సంస్ధలు, ఆస్తుల విలువ వేల కోట్ల రూపాయలు ఉంటుంది. మాల్యాకు బీర్ల తయారీ కంపెనీ, ఐపీఎల్ జట్టు, ఎఫ్ వన్ టీమ్, కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ సహా పలు వ్యాపారాలున్నాయి. బ్రిటన్‌లో ఆయనకు ఓ బంగ్లా కూడా ఉందని వార్తలు వచ్చాయి. 2013 ఫోర్బ్స్ జాబితా ప్రకారం భారత్‌లో అత్యంత ధనవంతులైన 100 మందిలో ఆయన 84వ స్థానంలో నిలిచారు. ఇక మాల్యాకు చెందిన సంస్థలు బ్యాంకులకు ఎగవేసిన మొత్తం 9 వేల కోట్ల రూపాయలు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మాల్యాకు సొంత ఇల్లు లేదట. భూమి అసలే లేదు. చేతిలో 9500 రూపాయల నగదు మాత్రమే ఉంది. ఆయన ఒక్క రుపాయి కూడా అప్పులేరు. ఫెర్రారీ కారు, బంగారు, బాండ్లు, డిపాజిట్లు ఇతర ఆస్తలున్నీ కలిపి ఆయనకు 615 కోట్ల రూపాయల సంపద ఉంది. ఈ విషయాలన్నీ ఆయనే వెల్లడించారు. 2010లో రాజ్యసభకు పోటీచేసినపుడు మాల్యా దాఖలు చేసిన అఫిడవిట్లో ఈ విషయాలు పొందుపరిచారు. ఆరేళ్ల క్రితం మాల్యాకు 615 కోట్ల విలువైన ఆస్తులు మాత్రమే ఉన్నాయా? అయితే ఆయన సంస్థలకు బ్యాంకులు వేలాది కోట్ల రూపాయల రుణాలు ఎలా ఇచ్చాయి? ఇప్పుడు ఇన్ని వేల కోట్లు ఎలా ఎగ్గొట్టారు? మాల్యా దేశం విడిచి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని బ్యాంకులు సుప్రీం కోర్టును ఆశ్రయించేలోపే ఆయన విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే. -
ఐడీబీఐ బ్యాంక్ అధికారులకు ఈడీ సమన్లు
ముంబై: మనీ లాండరింగ్ కేసు విచారణలో భాగంగా వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు చె ందిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్, ఐడీబీఐ బ్యాంకుకు చెందిన అధికారులకు ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. తమ తమ వ్యక్తిగత ఆర్థిక వివరాలు, గత ఐదేళ్ల ఐటీ రిటర్నులు మొదలైనవి విచారణ అధికారులకు సమర్పించాలని సూచించింది. మరికొద్ది రోజుల్లో విచారణకు హాజరై తమ వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించినట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. ముందుగా బ్యాంకు, కంపెనీ కీలక అధికారులను ప్రశ్నించిన తర్వాత మాల్యాకు సమన్లు జారీ చేసే విషయంపై నిర్ణయం తీసుకోనున్నట్లు వివరించాయి. సమన్లు జారీ అయిన వారిలో ఐడీబీఐ బ్యాంకు మాజీ సీఎండీ యోగేశ్ అగర్వాల్, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ సీఎఫ్‌వో ఎ. రఘునాథన్ తదితరులు ఉన్నారు. ఐడీబీఐ బ్యాంకు నుంచి కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ తీసుకున్న రూ. 900 కోట్ల రుణాల ఎగవేతకు సంబంధించి మనీ లాండరింగ్ కోణంపై ఈడీ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. లుక్అవుట్ నోటీసులు మార్చేసిన సీబీఐ.. మాల్యా దేశం విడిచి వెడితే ఆయన్ను నిర్బంధించాలంటూ జారీ చేసిన లుక్అవుట్ నోటీసుల్లో ఆదేశాలను నెలరోజుల వ్యవధిలో సీబీఐ మార్చేసింది. ఆయన రాకపోకల సమాచారం మాత్రమే తమకు అందిస్తే చాలని బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్‌కు సూచించింది. తొలి లుక్అవుట్ నోటీసు గతేడాది అక్టోబర్ 16న జారీ అయింది. విచారణలో ఆయన పూర్తిగా సహకరిస్తున్నందునే ఆ తర్వాత దాన్ని మార్చినట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. అందుకే తాజాగా ఆయన దేశం విడిచి వెడుతున్నా కూడా ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆయన్ను అడ్డుకోలేదు. -
పారిపోలేదు, రుణ ఎగవేతదారును కాను
నన్ను అలా చిత్రీకరించారు * విజయ్ మాల్యా ఆవేదన న్యూఢిల్లీ: కింగ్ ఫిషర్ కేసులో తాను పారిపోతున్నట్లుగా చిత్రీకరించారని విజయ్ మాల్యా ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని బ్యాంకుల మొండి బకాయిలకు తానే కారణమన్నట్లుగా ప్రచారం చేశారని ఆయన విరుచుకుపడ్డారు. కింగ్ ఫిషర్ కార్యకలాపాలు ఆపేసిన తర్వాత బ్యాంకులు తాము తనఖా పెట్టిన షేర్లను విక్రయించి రూ.1,244 కోట్లు నగదును పొందాయని మాల్యా పేర్కొన్నారు. దీనికి అదనంగా రూ.600 కోట్లు కర్నాటక హై కోర్టులో డిపాజిట్ చేశామని, అంతేకాకుండా యునెటైడ్ బ్రూవరీస్ హోల్డింగ్స్‌కు చెందిన రూ.650 కోట్లను కూడా కర్నాటక హైకోర్ట్‌లో డిపాజిట్ చేశామని వివరించారు. ఈ మొత్తం రూ.2,494 కోట్లు అయిందని వివరించారు. బ్యాంకులతో వన్‌టైమ్ సెటిల్మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నానని పేర్కొన్నారు. బ్యాంకుల మొత్తం మొండి బకాయిలు రూ.11 లక్షల కోటకు పైగా ఉన్నాయని, తమకంటే భారీ మొత్తంలో రుణాలు ఎగవేసిన వారిని కావాలని రుణాలు ఎగవేసిన వ్యక్తులుగా ఎందుకు ప్రకటించలేదని ఆయన ప్రశ్నించారు. యూబీ గ్రూప్ కింగ్ ఫిషర్లో రూ.4,000కోట్లు ఇన్వెస్ట్ చేసిందని, ఈ మొత్తం హరించుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకులు తమ రుణాల్లో చాలాభాగం రికవరీ చేసుకోగలవని, కానీ తన గ్రూప్‌కు వచ్చిన నష్టం మాత్రం శాశ్వతమని పేర్కొన్నారు. నేడు తీర్పు... భారీ రుణ ఊబిలో కూరుకుపోయిన కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ 2012 నుంచి కార్యకలాపాలు నిలిపేసిన విషయం తెలిసిందే. బ్యాంకులకు రూ.7,000 కోట్ల వరకూ బకాయిలు ఉన్నాయి. ఇటీవలే యునెటైడ్ స్పిరిట్స్ చైర్మన్ పదవి నుంచి వైదొలగిన ఆయన దానికి ప్రతిఫలంగా రూ.515 కోట్ల ప్యాకేజీకి అంగీకరించిన విషయం తెలిసిందే. అయితే తమ బకాయిల కింద ఈ ప్యాకేజీని ఇప్పించాల్సిందిగా డెట్ రికవరీ ట్రిబ్యూనల్(డీఆర్టీ)ను కింగ్ ఫిషర్‌కు రుణమిచ్చిన ఎస్బీఐ ఆశ్రయిం చింది. ఈ కేసులో నేడు(సోమవారం) తీర్పు వెలువడనుంది. కాగా, ఈ ప్యాకేజీ తన వ్యక్తిగతమని, ఒక్క యునెటైడ్ కింగ్డమ్లో తప్ప ఎక్కడా వీటిపై ఎవరికీ హక్కు ఉండదని మాల్యా స్పష్టం చేశారు. తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి దర్యాప్తు సంస్థలకూ పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. -
మాల్యా అరెస్టు కోసం కోర్టుకు ఎస్బీఐ
బెంగళూరు:కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రుణాల ఎగవేత వివాదంలో దాని ప్రమోటరు, వ్యాపారవేత్త విజయ్ మాల్యా అరెస్టుకు ఆదేశించాలంటూ ఎస్బీఐ శుక్రవారం కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. కుటుంబంతో పాటు బ్రిటన్‌కు వెడుతున్నట్లు మాల్యా ఇటీవలే చేసిన ప్రకటన ప్రాతిపదికగా, ఆయన పాస్‌పోర్టును కూడా స్వాధీనం చేసుకోవాలని పిటీషన్లో పేర్కొన్నట్లు ఎస్బీఐ తరఫు న్యాయవాది వివరించారు. దీంతో మాల్యా, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌తో (కేఎఫ్ఏ) పాటు మరో 9 మంది ప్రతివాదులకు నోటీసుల జారీకి హైకోర్టు ఆదేశించింది. ఎస్బీఐ సారథ్యంలోని బ్యాంకుల కన్సార్షియంకు కేఎఫ్ఏ రూ.7,800 కోట్లు చెల్లించాల్సి ఉంది. రిలయన్సే పెద్ద డిఫాల్టరు .. మరోవైపు, మాల్యా అరెస్టు కోరుతూ ఎస్బీఐ వేసిన నాలుగు పిటీషన్లలో ఒకదానిపై విచారణ చేపట్టిన డెట్ రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్టీ).. ఉత్తర్వులను రిజర్వ్‌లో ఉంచింది. రిలయన్స్ వంటి భారీ ఎగవేతదారులతో పోలిస్తే మాల్యా చిన్న డిఫాల్టరేనని డీఆర్టీ ముందు ఆయన తరఫు న్యాయవాది ఉదయ్ హోలా వాదించారు. మాల్యా రాజ్యసభ సభ్యుడు అయినందువల్ల ఆయన్ను అరెస్టు చేస్తే పెద్దల సభ ప్రతిష్టను దెబ్బతీసినట్లే అవుతుందని పేర్కొన్నారు. -
ఇప్పుడు కింగ్ ఫిషర్ ఎగరలేకపోతోందే!
♦ తక్కువ చమురు ధరల పరిస్థితిని వినియోగించుకోలేకపోవడం నన్ను బాధిస్తోంది ♦ సంస్థ ప్రమోటరు విజయ్ మాల్యా న్యూఢిల్లీ: ఒక్క అంశంలో తప్ప మిగతా ఏ విషయంలోను బాధ లేదంటున్నారు రుణ ఎగవేతల వివాదాలు వెన్నాడుతున్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా. చమురు రేట్లు భారీగా పతనమైన ప్రస్తుత తరుణంలో కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఎగరలేకపోతోందే అన్నదే తనకు బాధ కల్గించే విషయమని ఆయన చెప్పారు. మాల్యా ప్రమోటర్‌గా వ్యవహరించిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఆర్థిక సంక్షోభాలతో 2012లోనే కార్యకలాపాలు నిలిపివేయడం, రుణాల రికవరీ కోసం బ్యాంకులు వెన్నాడుతుండటం తెలిసిందే. కింగ్‌ఫిషర్‌ను, దాని ప్రమోటింగ్ సంస్థ యూబీ గ్రూప్‌ను, మాల్యాను ఉద్దేశపూర్వక ఎగవేతదారులుగా కొన్ని బ్యాంకులు ఇప్పటికే ప్రకటించాయి. 28వ ఏటనే యూబీ గ్రూప్ పగ్గాలను చేపట్టి, దేశంలోనే అతి పెద్ద బీర్లు, స్పిరిట్స్ కంపెనీలను తీర్చిదిద్దిన తాను ఇప్పుడు ప్రత్యేకంగా నిరూపించుకోవాల్సిందేమీ లేదని మాల్యా చెప్పారు. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ విషయంలో లెక్కలు తప్పడానికి అనేక కారణాలు ఉన్నాయని పేర్కొన్నారు. ‘జీవితంలో ఎత్తుపల్లాలు ఉండటం సహజం. అంతిమంగా మాత్రం నేను గర్వంగా చెప్పుకోతగినవి చాలానే సాధించాను’ అని ఆయన పేర్కొన్నారు. డియాజియో డీల్ తర్వాత తాను ఇంగ్లాండుకు వెడుతుండంటపై వస్తున్న విమర్శలపై మాల్యా స్పందించారు. తాను గతంలోనూ ఇంగ్లాండులో చాలా కాలం ఉన్నానని, ఇందులో కొత్తేమీ లేదని స్పష్టం చేశారు. హైకోర్టులో మాల్యాకు ఎదురుదెబ్బ.. తనను ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా ఎస్బీఐ ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ మాల్యా వేసిన పిటీషన్‌పై విచారణకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఒకే అంశాన్ని రెండు వేర్వేరు బెంచ్‌లు విచారణ చేయడం కుదరదని స్పష్టం చేసింది. దీన్ని గతంలో బాంబే హైకోర్టు విచారణ చేసినందున, తిరిగి ఆ న్యాయస్థానం దృష్టికే తీసుకెళ్లాలని సూచించింది. దీంతో పిటీషన్‌ను ఉపసంహరించుకునేందుకు అనుమతించాలని మాల్యా తరఫు న్యాయవాదులు న్యాయమూర్తులను కోరారు. డిఫాల్టరుగా ప్రకటించే ముందు తన వాదనలను వినిపించే అవకాశాన్ని ఎస్బీఐ ఇవ్వలేదంటూ మాల్యా కోర్టుకెళ్లారు. తాను ఢిల్లీ నివాసిని కాబట్టి ఈ అంశం ఢిల్లీ హైకోర్టు పరిధిలోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు. అయితే, దీన్ని వ్యతిరేకించిన ఎస్బీఐ తరఫు న్యాయవాదులు.. మాల్యా నివాసం ముంబైలోనే ఉన్నందున, అక్కడి హైకోర్టులోనే దీన్ని విచారణ జరపాలంటూ విన్నవించారు. -
ఇక ఇంగ్లండ్ లోనే మాల్యా నివాసం
ఇకపై ఇంగ్లాండ్‌లోనే మాకాం... న్యూఢిల్లీ: కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రుణాలకు సంబంధించి ఉద్దేశపూర్వక ఎగవేతదారు ఆరోపణలు వెంటాడుతున్న నేపథ్యంలో విజయ్ మాల్యా గురువారం యునెటైడ్ స్పిరిట్స్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ‘నాపై వచ్చిన ఆరోపణలకు, డయాజియో.. యునెటైడ్ స్పిరిట్స్‌తో సంబంధాలపై అనిశ్చితికి తెర దించేందుకు సమయం వచ్చింది. దానికి అనుగుణంగానే నేను తక్షణమే రాజీనామా చేస్తున్నాను. ఇక సంతానానికి చేరువగా ఉండేలా మరింత సమయం ఇంగ్లాండులో గడపాలని నిర్ణయించుకున్నాను’ అని మాల్యా ఒక ప్రకటనలో తెలిపారు. మాల్యా కుటుంబం నెలకొల్పిన యునెటైడ్ స్పిరిట్స్‌ను డయాజియో సంస్థ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. యూబీ గ్రూప్ సంస్థలకు అక్రమంగా నిధులు మళ్లించారన్న ఆరోపణలపై మాల్యాకి, డయాజియోకి మధ్య వివాదం నడుస్తున్న పరిస్థితుల్లో ఆయన నిష్ర్కమణ ప్రాధాన్యం సంతరించుకుంది. యునెటైడ్ స్పిరిట్స్ గౌరవ వ్యవస్థాపకుడిగా తనకు గుర్తింపునిచ్చేలా డయాజియోతో సానుకూల ఒప్పందం కుదిరినట్లు మాల్యా వివరించారు. సంస్థ నుంచి నిష్ర్కమణకు గాను డయాజియో ఆయనకు దాదాపు రూ. 515 కోట్లు చెల్లించనుంది. ఆయన కుమారుడు సిద్ధార్థ్ మాల్యా.. యూఎస్ఎల్ గ్రూప్ బోర్డు సభ్యుడిగా కొనసాగుతారు. గ్రూప్‌లో భాగమైన ఐపీఎల్ టీమ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు చీఫ్ మెంటార్‌గా మాల్యా ఉంటారు. మరోవైపు, యూఎస్ఎల్ చైర్మన్‌గా మహేంద్ర కుమార్ శర్మను డయాజియో నియమించనుంది. -
వేలానికి కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఆస్తులు
ఏఆర్‌సీలతో చర్చిస్తున్న నాలుగు బ్యాంకులు న్యూఢిల్లీ: సంక్షోభంలో చిక్కుకున్న కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కి ఇచ్చిన రుణాల్లో కొంతైనా రాబట్టుకునేందుకు.. ఆ సంస్థ ఆస్తులను అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీలకు (ఏఆర్సీ) వేలం వేసేందుకు దాదాపు నాలుగు బ్యాంకులు సిద్ధమవుతున్నాయి. మూడు-నాలుగు బ్యాంకులు ఇందుకోసం ఏఆర్‌సీలతో చర్చలు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్బీఐ సారథ్యంలోని 17 బ్యాంకుల కన్సార్షియం.. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కి ఇచ్చిన దాదాపు రూ. 6,963 కోట్లు పైగా రుణాలను రాబట్టుకునేందుకు తంటాలు పడుతున్న సంగతి తెలిసిందే. ఎయిర్‌లైన్స్‌తో పాటు దాని ప్రమోటరు విజయ్ మాల్యా, యునెటైడ్ బ్రూవరీస్ హోల్డింగ్స్‌ను ఉద్దేశపూర్వక ఎగవేతదారులుగా (విల్‌ఫుల్ డిఫాల్టర్లు) ఎస్బీఐ, యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంకులు ఇప్పటికే ప్రకటించాయి. రికవరీ ప్రక్రియలో భాగంగా ముంబైలోని కింగ్‌ఫిషర్ హౌస్‌ను వచ్చే నెల వేలం వేయాలని ఎస్బీఐ కన్సార్షియం నిర్ణయించింది. ఈ ప్రాపర్టీకి సంబంధించిన అధికారాలున్న ఎస్బీఐ క్యాప్ ట్రస్టీ కంపెనీ .. ఈ-వేలాన్ని మార్చి 17న నిర్వహించనుంది. దీనికి రిజర్వు ధరను రూ. 150 కోట్లుగా నిర్ణయించింది. కన్సార్షియంలో అత్యధికంగా రూ. 1,600 కోట్ల మొత్తాన్ని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కి ఎస్బీఐ ఇచ్చింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంకులు చెరో రూ. 800 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 650 కోట్లు ఇచ్చాయి. -
మాల్యా ఇంటిపై సీబీఐ దాడులు
ఐడీబీఐ రుణ మంజూరీ కేసులో.. న్యూఢిల్లీ/బెంగళూరు/పణజి: నిబంధనలకు విరుద్ధంగా ఐడీబీఐ బ్యాంకు నుంచి దాదాపు రూ. 900 కోట్ల రుణాలు పొందిన వ్యవహారంలో కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్, దాని ప్రమోటర్ విజయ్ మాల్యా నివాసాలు, కార్యాలయాలపై సీబీఐ శనివారం దాడులు నిర్వహించింది. బెంగళూరు, ముంబై, పణజిలోని ఐదు ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. మాల్యాను కొన్ని బ్యాంకులు ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా ప్రకటించడంతో పాటు కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉందని తెలిసినప్పటికీ.. ఐడీబీఐ బ్యాంకు నిబంధనలు ఉల్లంఘించి కంపెనీకి రూ. 900 కోట్ల రుణం ఇవ్వడంపై సీబీఐ గతంలో కేసు నమోదు చేసింది. మాల్యా, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ రఘునాథన్‌తో పాటు ఐడీబీఐకి చెందిన కొందరు అధికారులపై ఈ కేసు నమోదైంది. కంపెనీకి నెగటివ్ రేటిం గ్ ఉన్నప్పటికీ, తొలిసారిగా అడగ్గానే అంత భారీ రుణాన్ని బ్యాంకు మంజూరు చేయడం వెనుక స్కామ్ ఉండొచ్చన్న సందేహాలు రేకెత్తించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనిపై 2014లోనే ప్రాథమిక విచారణ చేపట్టిన సీబీఐ.. కంపెనీకి మిగతా బ్యాంకులు ఇచ్చిన రుణాలు మొండి బకాయిలుగా మారిన తరుణంలో కన్సార్షియం పరిధిని దాటి ఐడీబీఐ బ్యాంకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రుణం ఇవ్వాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది. 2012 నుంచి కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కార్యకలాపాలు పూర్తిగా నిల్చిపోయాయి. కంపెనీకి పలు దేశీ బ్యాంకులు రూ. 7,000 కోట్ల పైగా రుణాలు ఇచ్చాయి. -
విజయ్ మాల్యాపై సీబీఐ దాడులు
న్యూఢిల్లీ: లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా ఇళ్లు, ఆయనకు చెందిన దివాళా తీసిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ సంస్థపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) శనివారం దాడులు జరిపింది. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు నెగెటివ్ క్రెడిట్ రేటింగ్స్ ఉన్నా.. ఆ సంస్థకు ఐడీబీఐ బ్యాంకు నుంచి భారీమొత్తం రూ. 950 కోట్ల రుణం ఇచ్చిన వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరుపుతున్నది. గత ఏడాది వెలుగులోకి వచ్చిన ఈ ఎన్పీఏ మోసంపై సీబీఐ విచారణ జరుపుతున్నది. పలు ప్రైవేటు కంపెనీలకు ప్రభుత్వ రంగం బ్యాంకులు భారీమొత్తంలో రుణాలు ఇవ్వడంలో అవకతవకలను వెలికితీయడానికి ప్రయత్నిస్తున్న సీబీఐ బృందాలు ఇందులో భాగంగానే మాల్యా నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించాయి. రుణమోసం వ్యవహారంపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదుచేసిన సీబీఐ త్వరలోనే విజయ్ మాల్యాను కూడా ప్రశ్నించే అవకాశముందని తెలుస్తున్నది. -
కింగ్ ఫిషర్ బకాయిలపై యునెటైడ్ బ్యాంక్ సీరియస్
కోల్‌కతా : కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు సంబంధించిన మొండిబకాయిల అంశమై యునెటైడ్ బ్యాంక్ సీరియస్‌గా ఉంది. కేవలం కింగ్‌ఫిషర్ పైనే కాకుండా తమకు బకాయిలు చెల్లించాల్సిన అన్ని సంస్థలపై సీరియస్‌గా వ్యవహరిస్తామని యునెటైడ్ బ్యాంక్ ఎండీ పి.శ్రీనివాస్ తెలిపారు. ఎస్ఎంఈ, రిటైల్ విభాగాలపై యునెటైడ్ బ్యాంక్ ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తుందన్నారు. కింగ్‌ఫిషర్‌ను యునెటైడ్ బ్యాంక్ ఇప్పటికే డీఫాల్టర్‌గా ప్రకటించడం తెలిసిందే. -
కింగ్‌ఫిషర్ రుణాలు దీర్ఘకాలంలో రికవర్ కావొచ్చు
ముంబై:కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కి ఇచ్చిన రుణాలను ఇప్పుడప్పుడే రాబట్టుకోలేకపోవచ్చని అయితే దీర్ఘకాలంలో రికవర్ చేసుకునే అవకాశాలు ఉన్నాయని యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. కింగ్‌ఫిషర్ రుణాలు తిరిగి వస్తాయని భావించడం లేదంటూ యూబీఐ ఎండీ పి. శ్రీనివాస్ వ్యాఖ్యలపై స్పష్టతనివ్వాలంటూ బీఎస్ఈ సూచించిన మీదట బ్యాంక్ సోమవారం ఈ వివరణ ఇచ్చింది. చట్టపరంగా ఎదురైన సమస్యలు తేలేందుకు సుదీర్ఘకాలం పట్టే అవకాశాలున్నందున రుణాల రికవరీకి కూడా సమయం పట్టొచ్చని బ్యాంక్ వివరించింది. కంపెనీకి ఇచ్చిన రూ. 400 కోట్ల మేర రుణాలపై వడ్డీ తప్ప అసలు మొత్తం రాకపోవచ్చంటూ శ్రీనివాస్ ఇటీవల వ్యాఖ్యానించారు. -
మాల్యాకు ఎదురుదెబ్బ
కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఎండీగా పునర్నియామకాన్ని తిరస్కరించిన కేంద్రం మంగళూరు కెమికల్స్ డెరైక్టర్ పదవికి రాజీనామా న్యూఢిల్లీ: విజయ్ మాల్యాకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఎండీగా మాల్యా పునర్నియామకాన్ని కేంద్రం తాజాగా తిరస్కరించింది. మరోవైపు గ్రూప్ సంస్థ మంగళూరు కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ (ఎంసీఎఫ్ఎల్) డెరైక్టర్ పదవికి ఆయన రాజీనామా చేశారు. ఇందుకు గల కారణాలు మాత్రం వెల్లడించ లేదు. మాల్యా పునర్నియామకానికి సంబంధించిన దరఖాస్తును కేంద్రం తిరస్కరించిందని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ సోమవారం స్టాక్ ఎక్స్చేంజీలకు వెల్లడించింది. దీనికి కారణాలను తెలపనప్పటికీ.. పునర్నియామకం విషయంలో ఇటు రుణదాతల నుంచి, అటు షేర్‌హోల్డర్ల నుంచి అనుమతులు పొందడంలో కింగ్‌ఫిషర్ విఫలమైనందువల్లే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఎంసీఎఫ్ఎల్ డెరైక్టర్ పదవికి ఆయన రాజీనామా చేసిన రోజే ఈ అంశం కూడా వెల్లడి కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అటు లిస్టింగ్ నిబంధనలను పాటించనందుకు గాను కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్, గ్రూప్‌లో మరో అనుబంధ సంస్థ యూబీ ఇంజినీరింగ్ షేర్లలో ట్రేడింగ్‌ను స్టాక్ ఎక్స్చేంజీలు సోమవారం నిలిపివేశాయి. యూబీ గ్రూప్‌లో భాగమైన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మార్కెట్క్యాప్ ఒకప్పుడు రూ. 10,000 కోట్ల పైచిలుకు ఉండగా.. రుణాలు, నష్టాల భారంతో ప్రస్తుతం రూ. 100 కోట్ల స్థాయికి పడిపోయింది. -
విజయ్ మాల్యా అడ్రస్ గల్లంతు!
సింగపూర్: వ్యాపార రంగంలో ప్రముఖంగా రాణించిన విలాసపురుషుడు, యూబీ గ్రూప్ చైర్మన్ విజయ్ మాల్యా ప్రస్తుత ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందనే విషయం తెలిసిందే. తాజాగా ప్రకటించిన 100 మందితో కూడిన భారత దేశ సంపన్న వ్యక్తుల ఫోర్బ్స్ జాబితా లో మాల్యా అడ్రస్ గల్లంతైంది. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ అప్పుల ఊబిలో కూరుకుపోవడంతో మాల్యా ఉద్దేశ పూర్వక ఎగవేతదారుడి(డిఫాల్టర్)గా మారినట్టు బ్యాంకు ప్రకటించాయి. 2013లో ఫోర్బ్స్ విడుదల చేసిన జాబితాలో మాల్యా 800 మిలియన్ కోట్ల సంపదతో 84వ స్థానాన్ని ఆక్రమించారు. మాల్యాతోపాటు మరో 11 మంది సంపన్నులు ఈ జాబితాలో చోటు సంపాదించుకోలేకపోయారు. ఉద్దేశపూర్వకంగా రుణాల్ని ఎగవేసినందుకే జాబితాను తప్పించినట్టు ఫోర్బ్స్ వెల్లడించింది. మాల్యా మొత్తం 17 బ్యాంకులకు 7600 కోట్ల రూపాయలు బాకీ పడ్డారు. ఇప్పటికే 200 కోట్ల విలువైన షేర్లను స్వాధీనం చేసుకోగా, మరికొన్ని ఆస్తులను స్వాధీనం చేసుకునే పనిలో ఉన్నారు. భూషణ్ స్టీల్ అధినే బ్రిజ్ భూషన్ సింఘల్ కుమారుడు ఓ కుంభకోణంలో అరెస్ట్ కావడంతో ఆయనను కూడా జాబితా నుంచి తప్పించామని ఫోర్బ్ తెలిపింది. -
కింగ్‌ఫిషర్ ఉదంతం ఓ నీటిబొట్టే
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల మొండి బకాయిల (ఎన్పీఏ) సమస్య చాలా పెద్దదనీ, కింగ్‌ఫిషర్ వ్యవహారం ఓ నీటిబొట్టు వంటిదేననీ మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) వినోద్ రాయ్ వ్యాఖ్యానించారు. ‘సన్నిహిత మిత్రులు’ రుణాలు పొందడానికి తమ సంబంధాలను వినియోగిస్తుండడమే ఎన్పీఏల సమస్యలకు కారణమని ఆరోపించారు. ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోలిస్తే ప్రైవేట్ బ్యాంకుల్లో ఎన్పీఏలు చాలా తక్కువగా ఉండడాన్ని గ్రహించాల్సి ఉందని తాజాగా వెలువరించిన పుస్తకంలో రాయ్ పేర్కొన్నారు. ‘ఇటీవల వెలుగులోకి వచ్చిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్, భూషణ్ స్టీల్స్ కేవలం పైకి కన్పిస్తున్న బిందువులు మాత్రమే. కార్పొరేట్ రుణాల పునర్‌వ్యవస్థీకరణలోకి పోయిన సొమ్ము వ్యవహారం మరో కథ...’ అని ఆయన వ్యాఖ్యానించారు. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ప్రమోటర్ విజయ్ మాల్యాతో పాటు అదే కంపెనీకి చెందిన ముగ్గురు డెరైక్టర్లను ఉద్దేశపూర్వక ఎగవేతదారులుగా యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నెల 1న ప్రకటించింది. ఎస్బీఐ సారథ్యంలోని 17 బ్యాంకుల కన్సార్షియంకు కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రూ.7 వేల కోట్లకుపైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. దాదాపు రూ.40 వేల కోట్లు బకాయిలున్న భూషన్ స్టీల్స్ ఖాతాలపై ఫోరెన్సిక్ ఆడిట్‌కు బ్యాంకుల బృందం ఆదేశించింది. కంపెనీ రుణ పరిమితి పెంచేందుకు సిండికేట్ బ్యాంక్ చైర్మన్ ఎస్.కె.జైన్ లంచం తీసుకున్న కేసులో భూషణ్ స్టీల్ వైస్‌చైర్మన్ నీరజ్ సింఘాల్‌ను సీబీఐ అరెస్టు చేసిన కొద్ది రోజులకే ఫోరెన్సిక్ ఆడిట్ ఉత్తర్వులు వెలువడ్డాయి. రిజర్వ్ బ్యాంక్ గణాంకాల ప్రకారం ప్రభుత్వ రంగ బ్యాంకుల ఎన్పీఏలు 2013లో 3.61 శాతం పెరిగాయని వినోద్ రాయ్ పేర్కొన్నారు. ఏ ప్రమాణాలతో చూసిన ఈ పెరుగుదల అసాధారణమని అన్నారు. ప్రైవేట్ బ్యాంకుల ఎన్పీఏలు ఇందులో సగం శాతమే ఎందుకు పెరిగాయో గ్రహించడానికి పెద్దగా విశ్లేషణ అవసరం లేదని చెప్పారు. కేజీ-డీ6పైనా... 2జీ, కోల్ గేట్ స్కామ్‌లలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రమేయం ఉందంటూ తన తాజా పుస్తకంలో పేర్కొని ప్రకంపనలు సృష్టించిన రాయ్.. కేజీ-డీ6 ఆడిట్ విషయంలోనూ ఆయనను ఇరికించారు. పైవేటు రంగాన్ని దెబ్బతీసే విధంగా ఆడిట్ ఉండకూడదని మన్మోహన్ తనకు చెప్పినట్లు రాయ్ పేర్కొన్నారు. అంతేకాదు రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశంలోనే అతిపెద్ద కార్పొరేట్ కంపెనీ అన్న విషయాన్ని గుర్తుంచుకోవాని చెబుతూ.. దానికి వత్తాసు పలికేలా మాట్లాడేవారని కూడా రాయ్ చెప్పారు. ప్రభుత్వం, కేజీ-డీ6 కాంట్రాక్టర్(ఆర్ఐఎల్)ల మధ్య పలు అంశాల్లో సయోధ్య కుదిరిన ప్రతిసారీ.. ఖజానాకు నష్టం కలిగిందన్నదే తమ వాదననని రాయ్ తన పుస్తకంలో అభిప్రాయపడ్డారు. -
ఐడీబీఐ బ్యాంక్‌కు సీబీఐ నోటీసు
న్యూఢిల్లీ/ముంబై: కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు ఐడీబీఐ బ్యాంక్ రుణం ఇవ్వడంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తు ప్రారంభించింది. బ్యాంకుకు ఎంక్వైరీ నోటీసు జారీ చేసింది. ఆర్థిక భారంతో సర్వీసులు నిలిచిపోయిన విజయ్‌మాల్యా నియంత్రణలోని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు ఐడీబీఐ బ్యాంక్ రూ.950 కోట్ల రుణం మంజూరు చేసింది. ఇంతభారీ మొత్తం రుణం మంజూరు చేయడంలో విశ్వసనీయత కొరవడిందన్నది సీబీఐ నోటీసుల సారాంశంగా తెలుస్తోంది. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ నెట్‌వర్త్ ప్రతికూలంగా ఉన్నప్పుడు రూ.950 కోట్ల భారీ రుణాన్ని ఐడీబీఐ బ్యాంక్ ఎలా మంజూరు చేసిందో తేలాల్సి ఉందని సీబీఐ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఇందుకోసమే ప్రాథమిక విచారణ (పీఈ)కు నోటీసులు జారీ అని తెలిపారు. వివరణ పంపుతాం: బ్యాంక్ సీఎండీ కాగా తాజా వ్యవహారంపై ఐడీబీఐ బ్యాంక్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ (సీఎండీ) ఎంఎస్ రాఘవన్ వివరణ ఇచ్చారు. ‘‘దీని గురించి సమాచారం అంతా ఉంది. కొన్ని ప్రశ్నలకు సమాధానాలను సీబీఐ కోరింది. వాటికి మేము రానున్న కొద్ది రోజుల్లో సమాధానం ఇవ్వాల్సి ఉంది. గతంలో కూడా ఈ తరహాలోనే కొన్ని ప్రశ్నలకు సమాధానాలు కోరడం జరిగింది. బ్యాంకు కూడా సమాధానాలు పంపింది. ఇక్కడ దాయడానికి ఏమీ లేదు. కన్సార్షియం లేదా మల్టిప్లై బ్యాంకింగ్‌లో భాగంగా రుణాలను బ్యాంక్ సమకూర్చింది’’ అని ఆయన అన్నారు. సిండికేట్ బ్యాంక్ నేపథ్యం... ప్రాధాన్యత నిబంధనలకు విరుద్ధంగా కంపెనీల రుణ పరిమితి పెంచేందుకు లంచం తీసుకున్న కేసులో సిండికేట్ బ్యాంక్ సీఎండీ ఎస్.కె.జైన్‌తో పాటు మరో ఏడుగురి అరెస్ట్, రిమాండ్ నేపథ్యంలో సీబీఐ తాజా నోటీసులకు ప్రాధాన్యత ఏర్పడింది. భూషణ్ స్టీల్ కంపెనీ సిండికేట్ బ్యాంకుకు కోట్లాది రూపాయల రుణాలకు సంబంధించిన వాయిదాలను చెల్లించకపోయిన్పటికీ ఆ కంపెనీ రుణ పరిమితిని పెంచేందుకు రూ.50 లక్షల కోసం సంప్రదింపులు జరుపుతున్న జైన్‌ను సీబీఐ అధికారులు ఇటీవలే అరెస్ట్ చేశారు. ప్రభుత్వ రంగ బ్యాం కుల్లో పాలనాపరమైన కొన్ని సమస్యలున్నాయని ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ఇటీవలి పాలసీ విధాన ప్రకటన సందర్భంలోనూ పేర్కొన్నారు. రుణాల మంజూరులో మరింత పారదర్శకత అవసరమన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల పాలన వ్యవస్థపై మరోమారు దృష్టిసారించి లోపాలను సరిదిద్దాల్సి ఉందన్నారు. రుణ బకాయిల్లో కూరుకుపోయిన కింగ్‌ఫిషర్ 2012 అక్టోబర్ నుంచీ కార్యకలాపాలను నిలిపివేసింది. ఎస్బీఐ సారథ్యంలోని 17 బ్యాంకుల బృం దానికి కేఎఫ్ఏ దాదాపు రూ.7,000 కోట్ల బకాయి ఉంది. దీనిలో ఎస్బీఐ వాటా దాదాపు 1,600 కోట్లు. -
డిఫాల్టర్లపై క్రిమినల్ కేసులు పెట్టాలి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొండలా పెరిగిపోతున్న మొండి బకాయిలు ప్రభుత్వరంగ బ్యాంకులకు గుదిబండగా మారాయని, ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే తొలిసారిగా పీఎస్‌యూ బ్యాంకులు దివాళా తీసే పరిస్థితులు తలెత్తుతాయని ఆంధ్రప్రదేశ్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (ఏఐబీఈఏ) ఆందోళన వ్యక్తం చేసింది. పీఎస్‌యూ బ్యాంకుల్లో మార్చి, 2013 నాటికి రూ.1.64 లక్షల కోట్లుగా ఉన్న ఎన్పీఏలు సెప్టెంబర్, 2013 నాటికి 2.36 లక్షల కోట్లకు చేరాయని, ఇప్పుడివి రూ.3.50 లక్షలు దాటినట్లు ప్రాథమిక అంచనాలను బట్టి తెలుస్తోందని ఏఐబీఈఏ ప్రధాన కార్యదర్శి బి.ఎస్.రాంబాబు తెలిపారు. రుణం తీసుకొని చెల్లించని వారిపై క్రిమినల్ కేసులు పెట్టి వారి ఆస్తులను జప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఏఐబీఈఏ దేశంలో రుణాలు తీసుకొని చెల్లించని సంస్థలు, వ్యక్తుల జాబితాను విడుదల చేసింది. రుణాలు ఎగ్గొట్టిన టాప్ 50 కంపెనీల్లో రాష్ట్రానికి చెందిన డెక్కన్ క్రానికల్ (రూ.700 కోట్లు), ఐసీఎస్ఏ ఇండియా (రూ.646 కోట్లు), ల్యాంకో హోస్టెక్ హైవే (రూ.533), ఎంబీఎస్ జ్యూయెలర్స్ (రూ.524 కోట్లు), రాజీవ్ స్వగృహ (రూ.385 కోట్లు), పోగ్రసివ్ కనస్ట్రక్షన్ (రూ.351 కోట్లు), సుజన యూనివర్సల్ (రూ.330 కోట్లు) ఉన్నాయి. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ బ్యాంకుల ఆడిట్ కమిటీలో ఉద్యోగ సంఘాలకు చోటు కల్పిస్తే రుణాల మంజూరులో పారదర్శకత పెరిగి మొండి బకాయిలు తగ్గుతాయన్నారు. -
కింగ్‌ఫిషర్ ఆస్తులు అటాచ్
బెంగళూరు: కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ అన్ని ఆస్తులను ఆదాయపు పన్ను విభాగం అటాచ్ చేసింది. ఈ కంపెనీ రూ.350 కోట్ల ఆదాయపు పన్ను బకాయిలు చెల్లించనందుకు ఆస్తులను అటాచ్ చేశామని ఐటీ అధికారి లోకేశ ఆదివారం చెప్పారు. ఈ ఆస్తుల విక్రయం, అటాచ్మెంట్ల ద్వారా తమ బకాయిలను రికవరీ చేసుకునే ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు. 2010-11, 2011-12 ఆర్థిక సంవత్సరాల్లో ఈ కంపెనీ ఉద్యోగుల వేతనాల నుంచి టీడీఎస్( మూలం వద్ద పన్ను కోత) రూపంలో కోత కోసిన పన్నును ఇప్పటి వరకూ ఆదాయపు పన్ను శాఖకు చెల్లించలేదు. 1961 నాటి ఆదాయపు పన్ను చట్టం కింద ముంబై దేశీయ విమానాశ్రయం సమీపంలోని వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవేలోని కింగ్‌ఫిషర్ హౌస్‌ను ఎటాచ్ చేశామని లోకేశ పేర్కొన్నారు. -
కింగ్‌ఫిషర్, మాల్యాపై ఎఫ్ఐఆర్
బెంగళూరు: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్, దాని ప్రమోటర్ విజయ్ మాల్యాపై క్రిమినల్ అభియోగాల కింద బెంగళూరులో ఎఫ్ఐఆర్ నమోదైంది. యూజర్ డెవలప్మెంట్ ఫీజు (యూడీఎఫ్), ప్యాసింజర్ సర్వీసు ఫీజులు (పీఎస్ఎఫ్) చెల్లించనందుకు గాను బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు (బీఐఏఎల్) ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఏసీపీ కమల్‌పంత్ తెలిపారు. బీఐఏఎల్ ఈ విషయంపై ఈ నెల 21న మేజిస్ట్రేట్ కోర్టుకు ఫిర్యాదు చేయగా, కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు బీఐఏఎల్ పోలీస్ స్టేషన్ ఈ మేరకు చర్య తీసుకున్నట్లు వివరించారు. సంస్థ వర్గాల ప్రకారం కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ సుమారు రూ. 208 కోట్లు బకాయిపడింది. మరోవైపు, బీఐఏఎల్ ఫిర్యాదు, ఎఫ్ఐఆర్ నమోదు కాపీలు తమకి అందలేదని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మాతృసంస్థ యూబీ గ్రూప్ తెలిపింది. ఒకవేళ దర్యాప్తు ప్రారంభమైన పక్షంలో విచారణలో పోలీసులకు పూర్తి సహకారం అందిస్తామని యూబీ గ్రూప్ ప్రతినిధి చె ప్పారు. -
విదేశీ ఇన్వెస్టర్‌తో కింగ్‌ఫిషర్ చర్చలు
బెంగళూరు: రుణ సంక్షోభంలో కూరుకుపోయి మూతపడ్డ విమానయాన సంస్థ కింగ్ఫిషర్లో వాటాను విక్రయించే ఆలోచనలో ఉన్నట్లు కంపెనీ చైర్మన్ విజయ్ మాల్యా మంగళవారం చెప్పారు. ఇందుకు వీలుగా ఓ విదేశీ ఇన్వెస్టర్‌తో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. అయితే ఇన్వెస్టర్ పేరు వెల్లడించలేదు. రానున్న మూడు నెలల్లో ఈ అంశం ఒక కొలిక్కి వస్తుందని తెలిపారు. యూబీ గ్రూప్ వార్షిక సాధారణ సమావేశం సందర్భంగా మాల్యా ఈ విషయాలను వెల్లడించారు. వాటా విక్రయ విషయమై గతంలోనూ కొన్ని కంపెనీలతో చర్చలు జరిపినప్పటికీ సఫలంకాలేదని చెప్పారు. కాగా, మరోవైపు 100 మంది కింగ్‌ఫిషర్ ఉద్యోగులు బుధవారం నుంచి నిరాహార దీక్షలు చేపట్టేందుకు సిద్ధపడుతున్నారు. గత 14 నెలలుగా జీతాలు చెల్లించకపోగా, ఈ విషయంపై యాజమాన్యం తగిన రీతిలో స్పందించడంలేదని సిబ్బంది వ్యాఖ్యానిస్తున్నారు. తలకు మించిన రుణాలు, నష్టాల భారంతో గతేడాది అక్టోబర్‌లో కంపెనీ మూతపడ్డ విషయం విదితమే. -
విజయ్ మాల్యా పాస్‌పోర్ట్‌తో కోర్టుకు రావాలి
సాక్షి, బెంగళూరు: యూబీ హోల్డింగ్స్ లిమిటెడ్(యూబీహెచ్ఎల్) రుణదాతలు దాఖలు చేసిన పలు పిటిషన్లకు సంబంధించి కర్ణాటక హైకోర్టు సోమవారం యూబీ గ్రూపు సంస్థల అధిపతి విజయ్ మాల్యాకు హెచ్చరికలు జారీ చేసింది. మంగళవారం పాస్‌పోర్ట్‌తో కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. లేనట్లయితే పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. మాల్యా సారథ్యంలోని యూబీ హోల్డింగ్స్ లిమిటెడ్ నుంచి రూ.600 కోట్ల వరకు బకాయిలను రాబట్టుకోవడానికి రుణదాతలు అనేక పిటిషన్లను దాఖలు చేశారు. గతంలో వాటా విక్రయాలకు సంబంధించి మే 24లోగా ఆడిట్ నివేదికను కోర్టుకు సమర్పించాలన్న ఆదేశాలను మాల్యా పట్టించుకోకపోవడం... కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని రుణదాత సంస్థలు ప్రత్యేకంగా దాఖలు చేసిన అర్జీపై న్యాయమూర్తి విచారణ చేపట్టారు -
'అంతా మీరే చేశారు'
ముంబై: కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కష్టాలకు ఉద్యోగులు, బ్యాంకులు తదితరులందరూ కారణమని ఆ సంస్థ చైర్మన్ విజయ్ మాల్యా ఆరోపించారు. ఇంజిన్ సప్లయర్స్ నుంచి ఉద్యోగులు, బ్యాంకులు, పన్ను అధికారులు... ప్రతీ ఒక్కరూ కింగ్ ఫిషర్ సంస్థ కష్టాల పాలవ్వడానికి కారకులయ్యారని ఆయన విమర్శించారు. కంపెనీ వార్షిక నివేదిక(2012-13)లో మాల్యా ఈ వివరాలు పేర్కొన్నారు. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కార్యకలాపాల పునరుద్ధరణ కోసం తగిన భాగస్వామిని ఎంచుకునే ప్రక్రియ కొనసాగుతోందని, ఇన్వెస్టర్లతో చర్చలు జరుపుతున్నామని కూడా ఈ నివేదికలో ఆయన వెల్లడించారు. ఈ నెల 24న జరగునున్న ఏజీఎం కోసం ఇన్వెస్టర్లకు ఈ వార్షిక నివేదికను పంపించారు. సమ్మెలతో షెడ్యూల్ అస్తవ్యస్తం ఇంటర్నేషనల్ ఏరో ఇంజిన్స్ ఏజీకి వ్యతిరేకంగా కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ హోల్డింగ్ కంపెనీ యునెటైడ్ బ్రూవరీస్(హోల్డింగ్స్) బెంగళూరు కోర్టులో కేసు వేసిందని ఈ నివేదిక తెలిపింది. లోపాలున్న ఇంజిన్లను తమకు అంటగట్టారని, రూ.1,477 కోట్ల నష్టపరిహారం కావాలంటూ ఈ కేసు దాఖలు చేశామని వివరించింది. ఇంధనం ధరలు అధికంగా ఉండడం, తదితర క్లిష్ట పరిస్థితులకు తోడు ఇంజిన్ సమస్యలు కూడా జతవడంతో కంపెనీ కార్యకలాపాలు, ఆర్థిక వనరులు కుదేలయ్యాయని వివరించింది. పులి మీద పుట్రలా పన్ను అధికారులు కర్కశంగా వ్యవహరించారని, ఆదాయ మార్గాలను, అకౌంట్లను అటాచ్ చేశారని ఈ నివేదిక పేర్కొంది. -
కింగ్‌ఫిషర్ పునరుద్ధరణ కష్టమే!
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంతో కుప్పకూలిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్.. పునరుద్ధరణ ప్రణాళికలకు ఆ కంపెనీ సొంత ఆడిటర్లే రెడ్ సిగ్నల్స్ చూపుతున్నారు. భవిష్యత్తులో మళ్లీ కార్యకలాపాలను ప్రారంభించే సామర్థ్యం ఉన్న(గోయింగ్ కన్సర్న్) కంపెనీగా ప్రకటించుకోవడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. వేల కోట్ల రూపాయల రుణాలు బకాయిపడటం, భారీ స్థాయిలో నష్టాలు పోగైనాకూడా ఎలా పునరుద్ధరించగలరో అర్థంకావడం లేదని, ఇది అసాధ్యమని ఆడిటర్లు తమ నివేదికలో పలు అనుమానాలను వ్యక్తం చేశారు. అసలు పునరుద్ధరణ ప్రణాళికలో స్పష్టతే లేదని తేల్చిచెప్పారు. మరోపక్క, కింగ్‌ఫిషర్ మాతృ సంస్థ యూబీ బ్రూవరీస్(హోల్డింగ్) ఆడిటర్లు కూడా ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. కింగ్ఫిషర్లో యూబీ బ్రూవరీస్‌కు రూ.14,000 కోట్ల మేర పెట్టుబడులు ఉన్నాయి. విజయ్ మాల్యాకు చెందిన యూబీ గ్రూప్‌లో ఈ కంపెనీలు భాగంగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి వ్యాపారం నిలిచిపోయినా.. భవిష్యత్తులో దివాలా ముప్పులేదనే భరోసాతో ఆర్థిక ఫలితాలను ప్రకటించడం ఇతరత్రా కార్యకలాపాలను చేపట్టే సంస్థలను ‘గోయింగ్ కన్సర్న్’గా వ్యవహరిస్తారు. కింగ్‌ఫిషర్ ఇప్పటిదాకా ఒక్క పూర్తి ఏడాదిలోకూడా లాభాలను ప్రకటించలేదు. అంతేకాదు కంపెనీ మొత్తం నష్టాలు రూ.17,000 కోట్లకు పేరుకుపోయాయి. ఇక బ్యాంకులకు చెల్లించాల్సిన రుణాలు రూ.6,000 కోట్లకు పైమాటే. ఇవన్నీ మొండిబకాయిలుగా మారిపోయాయి. వీటిని రాబట్టుకోవడానికి బ్యాంకులు కింగ్‌ఫిషర్ ఆస్తులను విక్రయించే పనిలో ఉన్నాయి. మరోపక్క, విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ కంపెనీ ఫ్లయింగ్ పర్మిట్‌ను రద్దుచేసింది కూడా. దీన్ని తిరిగి రెన్యువల్ చేయాలంటే సవివర పునరుద్ధరణ ప్రణాళిక, కొత్తగా నిధులను వెచ్చించడం, రుణాల పునర్వ్యవస్థీకరణ వంటివి చాలా అవసరమని ఆడిటర్లు అంటున్నారు. ఇవేమీ లేకుండానే ‘గోయింగ్ కన్సర్న్’ కంపెనీగా ఎలా ప్రకటిస్తారని, అసలు కంపెనీని పునరుద్ధరించడం అసాధ్యమని కూడా పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికానికి కంపెనీ రూ.1,157 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. ఇక మార్చి చివరినాటికి కంపెనీ నెట్‌వర్త్ మైనస్ రూ.1,292 కోట్లకు పడిపోవడం గమనార్హం. కార్యకలాపాలేవీ లేకపోయినా.. సిబ్బంది, విమానాల లీజు రెంటల్స్, ఇతర నిర్వహణ వ్యయాలను ఫలితాల్లో చూపుతుండటం గమనార్హం.