
కింగ్‌ఫిషర్ రుణాలు దీర్ఘకాలంలో రికవర్ కావొచ్చు
ముంబై:కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కి ఇచ్చిన రుణాలను ఇప్పుడప్పుడే రాబట్టుకోలేకపోవచ్చని అయితే దీర్ఘకాలంలో రికవర్ చేసుకునే అవకాశాలు ఉన్నాయని యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. కింగ్‌ఫిషర్ రుణాలు తిరిగి వస్తాయని భావించడం లేదంటూ యూబీఐ ఎండీ పి. శ్రీనివాస్ వ్యాఖ్యలపై స్పష్టతనివ్వాలంటూ బీఎస్‌ఈ సూచించిన మీదట బ్యాంక్ సోమవారం ఈ వివరణ ఇచ్చింది. చట్టపరంగా ఎదురైన సమస్యలు తేలేందుకు సుదీర్ఘకాలం పట్టే అవకాశాలున్నందున రుణాల రికవరీకి కూడా సమయం పట్టొచ్చని బ్యాంక్ వివరించింది. కంపెనీకి ఇచ్చిన రూ. 400 కోట్ల మేర రుణాలపై వడ్డీ తప్ప అసలు మొత్తం రాకపోవచ్చంటూ శ్రీనివాస్ ఇటీవల వ్యాఖ్యానించారు.