United Bank of India
-
బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్
ప్రతి నెల ఒకటవ తేదీన దేశంలో అనేక కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. కొత్త కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయి. అయితే, అక్టోబర్ 1 నుంచి కూడా కొన్ని కొత్త నిబంధనలు అమలులోకి రాబోతున్నాయి. ఇందులో బ్యాంకుకు చెందిన అంశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ కొత్త నిబంధనల వల్ల మీపై నేరుగానే ప్రభావం పడే అవకాశముంది. అందుకే, అక్టోబర్ 1 నుంచి ఏ ఏ రూల్స్ మారబోతున్నాయో తెలుసుకోండి.(చదవండి: వారానికి నాలుగు రోజులే ఆఫీస్.. తెరపైకి కొత్త పాలసీ!) ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ), యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ) ఖాతాదారుల చెక్‌బుక్‌లు అక్టోబర్ 1 నుంచి చెల్లవు అని పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) అప్రమత్తం చేసింది. ఈ రెండు బ్యాంకు ఖాతాదారులు పీఎన్బీ బ్రాంచీ నుంచి కొత్త చెక్‌బుక్స్ పొందాల్సి ఉంటుంది అని తెలిపింది. అప్ డేట్ చేసిన ఐఎఫ్ఎస్సీ, ఎంఐసీఆర్‌తో కూడిన పీఎన్బీ చెక్‌బుక్స్ అక్టోబర్ 1, 2021 నుంచి చెల్లుబాటు అవుతాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) తప్పనిసరి చేసిన కొత్త నిబందనల ప్రకారం.. అక్టోబర్ 1 నుంచి క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా ఆటో డెబిట్ సదుపాయాన్ని వినియోగించుకోవాలంటే.. ఆ పేమెంట్‌కు ఓటీపీ అదనపు ధ్రువీకరణ(ఏఎఫ్ఏ) అవసరం. రూ.5000 కంటే ఎక్కువ మొత్తానికి ఆటో డెబిట్ సదుపాయాన్ని వాడుకోవాలంటే ఓటీపీ అదనపు ధ్రువీకరణ(ఏఎఫ్ఏ) అవసరమవుతుంది. ఆటో డెబిట్ తేదీకి కొన్ని రోజుల ముందే లావాదేవికి సంబంధించిన సమాచారాన్ని వినియోగదారుడికి బ్యాంకులు పంపిస్తాయి. అక్టోబర్ 1 నుంచి 80 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పెన్షనర్లు దేశంలోని సంబంధిత హెడ్ పోస్ట్ ఆఫీసు "జీవన్ ప్రమాణ్ సెంటర్స్"లో తమ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్లను సబ్మిట్ చేసే అవకాశాన్ని కల్పించింది. 80 ఏళ్లు పైబడిన వారు ఇకపై పెన్షన్‌ను సక్రమంగా అందుకోవాలంటే డిజిటల్ ఫార్మాట్లో జీవన ధ్రువీకరణ పత్రాన్ని తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) ప్రకటించినట్లుగా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ(ఏఎంసీ)ల్లో పనిచేసే జూనియర్ స్థాయి ఉద్యోగులు తమ స్థూల వేతనంలో 10 శాతం ఆ మ్యూచువల్ ఫండ్ యూనిట్లలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. -
అక్టోబర్ 1 నుంచి ఈ బ్యాంకుల చెక్ బుక్‌లు పనిచేయవు
మీకు ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ), యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ)లో బ్యాంక్ అకౌంట్ ఉందా? అయితే, ఒక హెచ్చరిక. ఈ రెండు బ్యాంకులకు చెందిన పాత చెక్ బుక్‌లు వచ్చే నెల అక్టోబర్ 1 నుంచి చెల్లుబాటు కావు. అంటే ఈ చెక్ బుక్స్ ద్వారా బ్యాంక్ కస్టమర్లు ఎలాంటి లావాదేవీలు నిర్వహించలేరు. కాబట్టి ఈ బ్యాంకు ఖాతాదారులు వెంటనే కొత్త చెక్‌బుక్‌లు తీసుకోవాలంటూ పంజాబ్ నేషనల్ బ్యాంక్ తెలిపింది. ఓబీసీ, యూబీఐ రెండూ ఏప్రిల్ 2020లో పంజాబ్ నేషనల్ బ్యాంకులో విలీనం అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు విలీనమైనప్పటికీ ఇప్పటి వరకు పాత బ్యాంకుల చెక్‌బుక్‌లనే కొనసాగించారు. ఈ రెండు బ్యాంకుల కస్టమర్లు వీలైనంత త్వరగా పీఎన్బీ ఐఎఫ్ఎస్సీ, ఎంఐసీఆర్‌లతో ఉన్న కొత్త చెక్‌బుక్‌లను తీసుకోవాలని తెలిపింది. ఏటీఎం, ఇంటర్నెట్ బ్యాంకింగ్, పీఎన్బీ వన్ నుంచి వీటిని పొందొచ్చని పేర్కొంది. లేదంటే కస్టమర్లు నేరుగా బ్యాంకు బ్రాంచీలకు వెళ్లి కూడా కొత్త చెక్‌బుక్‌లు తీసుకోవచ్చని తెలిపింది. ఏదైనా సాయం లేదా క్వైరీ కొరకు కోసం టోల్ ఫ్రీ నెంబరు 1800-180-2222ని సంప్రదించండి అని కూడా తెలిపింది.(చదవండి: భారీ లాభాలను గడించిన డ్రీమ్-11..! ఏంతంటే..?) -
ఖాతాదారులకు అలర్ట్.. ఇక ఈ బ్యాంకు చెక్‌బుక్‌లు పనిచేయవు
ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) కొత్త చెక్‌బుక్ నిబందనలో మార్పుకు సంబంధించి తన ఖాతాదారులకు ఒక కీలక ప్రకటన చేసింది. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ), యునైటెడ్ బ్యాంక్ ఇండియా(యుబీఐ)లకు చెందిన ప్రస్తుత చెక్‌బుక్‌లు అక్టోబర్ 1, 2021 నుంచి పనిచేయవని బ్యాంక్ ట్విట్టర్ వేదికగా తెలిపింది. ఆ రెండు బ్యాంకుల ఖాతాదారులు వారి పాత చెక్‌బుక్‌ల స్థానంలో కొత్తవి తీసుకోవాలని కోరింది. (చదవండి: చౌక వడ్డీకే ఐపీపీబీ గృహ రుణాలు.. ఎంతంటే?) "ప్రియమైన వినియోగదారులరా.. ఈఓబీసీ, ఈయుబీఐ బ్యాంకులకు చెందిన పాత చెక్‌బుక్‌లు 1-10-2021 నుంచి నిలిపివేస్తున్నాము. దయచేసి ఈఓబీసీ, ఈయుబీఐ పాత చెక్‌బుక్‌ల స్థానంలో ఐఎఫ్ఎస్ సీ, ఎమ్ ఐసీఆర్ తో అప్ డేట్ చేసిన పీఎన్బీ కొత్త కొత్త చెక్‌బుక్‌లు పొందండి. కొత్త చెక్‌బుక్ కోసం ఎటీఎమ్/ఐబీఎస్/పీఎన్బీ వన్ ద్వారా అప్లై చేసుకోండి" అని ఒక ట్వీట్ చేసింది. Take note & apply for your new cheque book through👇 ➡️ ATM ➡️ Internet Banking ➡️ PNB One ➡️ Branch pic.twitter.com/OEmRM1x6j0 — Punjab National Bank (@pnbindia) September 8, 2021 లేదంటే కస్టమర్లు నేరుగా బ్యాంకు బ్రాంచీలకు వెళ్లి కూడా కొత్త చెక్‌బుక్‌లు తీసుకోవచ్చని పేర్కొంది. ఏప్రిల్, 2020లో ఓబీసీ, యునైటెడ్ బ్యాంక్ ఇండియా(యుబీఐ) పీఎన్బీలో విలీనం అయిన తర్వాత ఈ కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. ఈ రెండు కాకుండా, మరో నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రభుత్వ మెగా కన్సాలిడేషన్ ప్రణాళిక కింద ఇతర బ్యాంకుల్లో విలీనం అయ్యాయి. -
ఏదైనా కొత్త పేరు కావాలి
న్యూఢిల్లీ: పలు ప్రభుత్వ రంగ బ్యాంకుల(పీఎస్బీ) విలీన ప్రక్రియ పూర్తి కావడానికి సమయం దగ్గరపడుతోంది. ఈ తరుణంలో ఆయా బ్యాంకులు కొత్త డిమాండ్‌ను తెరపైకి తెస్తున్నాయి. విలీనం తర్వాత ఏర్పడే బ్యాంకుకు కొత్త పేరేదైనా పెట్టాలని, కొత్తగా బ్రాండింగ్ చేయాలని కోరుతున్నాయి. ఇందుకు సంబంధించి యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ).. ఇప్పటికే కేంద్రానికి లేఖ రాసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అటు సిండికేట్ బ్యాంక్ కూడా విలీన సంస్థకు కొత్త పేరు పెట్టాలంటూ కేంద్రాన్ని కోరే యోచనలో ఉంది. కొన్నాళ్ల క్రితమే రెండు బ్యాంకుల విలీనంతో భారీ సంస్థగా ఆవిర్భవించిన బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) తరహా అనుభవం పునరావృతం కాకూడదని తాజాగా విలీనం కాబోయే బ్యాంకులు భావిస్తుండటమే ఇందుకు కారణం. బీవోబీలో విజయా, దేనా బ్యాంకు విలీనం తర్వాత.. మూడింటి లోగోలను కలిపి ఒక లోగోను తయారు చేశారు. దీనికి పవర్ ఆఫ్ 3 అనే ట్యాగ్‌లైన్ ఉంటుంది. అయితే, ఇందులో మిగతా రెండు బ్యాంకుల కన్నా బీవోబీ లోగో ప్రముఖంగా కనిపిస్తుంటుంది. దీంతో, ఈసారి మాత్రం ఈ తరహా బ్రాండింగ్ వద్దని కొత్తగా విలీనం కాబోయే (నాన్–యాంకర్) బ్యాంకులు కోరుతున్నాయి. ‘విలీనంతో ఏర్పడే బ్యాంకు పేరు.. మూడు బ్యాంకుల అస్తిత్వాన్ని తెలియపర్చే విధంగా పేరు ఉండాలి. దానికి తగ్గట్టే ఏదైనా కొత్త పేరు పెట్టాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం’ అని యునైటెడ్ బ్యాంక్ వర్గాలు తెలిపాయి. విలీన సంస్థలో తమ బ్యాంకు గుర్తింపు కూడా ఉండాలని తామూ కోరుకుంటున్నామని సిండికేట్ బ్యాంక్ వర్గాలు తెలిపాయి. కొత్త బ్రాండ్ సులువేనా.. ప్రస్తుతం పీఎన్బీలో ఓబీసీ, యునైటెడ్ బ్యాంక్ విలీన ప్రక్రియను పర్యవేక్షిస్తున్న ప్రత్యేక కమిటీ.. కొత్తగా బ్రాండింగ్పైనా కసరత్తు చేస్తోంది. విలీన బ్యాంకుకు తగిన పేరును సూచించేందుకు బ్రాండింగ్ ఏజెన్సీల సహకారం కూడా తీసుకోవాలని యోచిస్తోంది. అయితే, విలీన బ్యాంకుకు కొత్త పేరు పెట్టాలన్న డిమాండ్‌తో విభేదిస్తున్న బ్యాంకులూ ఉన్నాయి. అలహాబాద్ బ్యాంక్ వీటిలో ఒకటి. ఇప్పటిదాకా ప్రాచుర్యంలో ఉన్న పేర్లను పూర్తిగా మార్చేయడం వల్ల బ్రాండ్ రీకాల్ విలువ దెబ్బతినవచ్చని అలహాబాద్ బ్యాంక్ వర్గాలు తెలిపాయి. ఇది అంతర్జాతీయ కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం చూపొచ్చని పేర్కొన్నాయి. ఇక, విలీన సంస్థ పేరు మార్చాలంటూ నాన్–యాంకర్ బ్యాంకులు కోరుతున్నా.. అదంత సులువైన వ్యవహారం కాదని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనికి పార్లమెంటు ఆమోదం కావాల్సి ఉంటుందని, గెజిట్ నోటిఫికేషన్ అవసరమని పేర్కొన్నాయి. ఇందుకు చాలా సమయం పట్టేస్తుందనేది బ్యాంకింగ్ వర్గాల మాట. విలీనమయ్యే బ్యాంకులివే.. కేంద్రం గతేడాది ప్రకటించిన ప్రభుత్వ రంగ బ్యాంకుల మెగా విలీన ప్రక్రియలో భాగంగా 10 బ్యాంకులను నాలుగింటిగా మార్చనున్నారు. ఇందులో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్, ఇండియన్ బ్యాంకులు.. యాంకర్ బ్యాంకులుగా వ్యవహరించనున్నాయి. మిగతావి నాన్–యాంకర్ బ్యాంకులుగా ఉంటాయి. పీఎన్బీలో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ), యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కలవడం ద్వారా దేశీయంగా రెండో అతి పెద్ద బ్యాంకు ఏర్పాటు కానుంది. అలాగే, కెనరా బ్యాంకులో సిండికేట్ బ్యాంక్ విలీనం కానుంది. ఇక, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంకు కలుస్తాయి. ఇండియన్ బ్యాంకులో అలహాబాద్ బ్యాంకు విలీనమవుతుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు 2020 ఏప్రిల్ 1 డెడ్‌లైన్‌గా కేంద్రం నిర్దేశించింది. -
బ్యాంక్‌ల విలీనానికి కేంద్రం ఆమోదం
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాల విలీనానికి కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ అదీనంలోని ఆర్థిక సేవల విభాగం ఒక లేఖ రాసిందని పంజాబ్ నేషనల్ బ్యాంక్ తెలిపింది. మరోవైపు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్‌ల విలీనానికి కూడా కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు తమకు కూడా ఆర్థిక సేవల విభాగం నుంచి లేఖ అందిందని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. బ్యాంక్‌ల విలీనం కారణంగా ప్రస్తుతం ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల సంఖ్య 12కు తగ్గింది. 2017లో ఈ బ్యాంక్‌ల సంఖ్య 27గా ఉంది. -
ఎన్సీఎల్టీ కేసుల నుంచి రూ. 3,000 కోట్ల రికవరీ
కోల్‌కతా: జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)కి సిఫార్సు చేసిన పలు మొండి ఖాతా కేసుల నుంచి దాదాపు రూ. 3,000 కోట్లు రికవర్ కాగలవని ఆశిస్తున్నట్లు ప్రభుత్వ రంగ యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) ఎండీ పవన్ బజాజ్ తెలిపారు. ఇప్పటిదాకా 40 కేసులను ఎన్సీఎల్టీకి సిఫార్సు చేశామని, దాదాపు రూ. 580 కోట్లు రికవర్ అయ్యిందని బ్యాంక్ వార్షిక సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆయన వివరించారు. ప్రస్తుతం ఎన్సీఎల్టీ వద్ద ఉన్న కేసులన్నీ.. సెటిల్మెంట్ తుదిదశలో ఉన్నాయని బజాజ్ చెప్పారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి యూబీఐ స్థూల నిరర్ధక ఆస్తుల (జీఎన్‌పీఏ) పరిమాణం 24 శాతంగా ఉందని తెలిపారు. కరెంటు అకౌంటు, సేవింగ్స్ అకౌంటు నిష్పత్తి అధికంగానే ఉన్న నేపథ్యంలో ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు తగినంత స్థాయిలో లిక్విడిటీ ఉందని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో యూబీఐ రూ. 220 కోట్ల నికర నష్టం నమోదు చేసిందని, వచ్చే ఏడాది మార్చి ఆఖరు నాటికి మళ్లీ లాభాల్లోకి మళ్లగలదని ఆయన వివరించారు. రూ.1,500 కోట్లు సమీకరిస్తాం న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.1,500 కోట్ల నిధులు సమీకరించనున్నది. ఒకటి లేదా అంతకు మించిన విడతల్లో ఈక్విటీ షేర్ల జారీ ద్వారా ఈ పెట్టుబడులు సమీకరిస్తామని యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. శుక్రవారం జరిగిన వార్షిక సాధారణ సమావేశంలో వాటాదారులు ఈ మేరకు తమ ఆమోదాన్ని తెలిపారని బ్యాంక్ పేర్కొంది. ప్రభుత్వం ఇచ్చే నిధులకు ఇది అదనమని వివరించింది. ఈ పెట్టుబడుల వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్ 0.3 శాతం నష్టంతో రూ.11.05 వద్ద ముగిసింది. -
21 శాతం తగ్గిన యునెటైడ్ బ్యాంక్ లాభం
కోల్‌కతా: యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలానికి 21 శాతం క్షీణించింది. గత క్యూ1లో రూ.66 కోట్లుగా ఉన్న బ్యాంక్ నికర లాభం ఈ క్యూ1లో రూ.52 కోట్లకు తగ్గింది. వడ్డీ రేట్లు తగ్గించడం, అధిక కేటాయింపులు కారణంగా నికర లాభం తగ్గిందని యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. మొత్తం ఆదాయం రూ.3,004 కోట్ల నుంచి రూ.2,897 కోట్లకు తగ్గిందని బ్యాంక్ ఎండీ, సీఈఓ పి. శ్రీనివాస్ చెప్పారు. నికర వడ్డీ ఆదాయం మాత్రం రూ.596 కోట్ల నుంచి 5 శాతం వృద్ధితో రూ.628 కోట్లకు పెరిగిందని వివరించారు. మొత్తం కేటాయింపులు రూ.508 కోట్ల నుంచి రూ.526 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు. అయితే మొండి బకాయిలకు కేటాయింపులు రూ.225 కోట్ల నుంచి రూ.176 కోట్లకు తగ్గాయని తెలిపారు. స్థూల మొండి బకాయిలు 10.49 శాతం(రూ.7,097 కోట్లు) నుంచి 9.57 శాతానికి(6,533 కోట్లకు), నికర మొండి బకాయిలు 7.23 శాతం(రూ.4,667 కోట్లు) నుంచి 6.30 శాతానికి(రూ.4,091 కోట్ల) తగ్గాయని పేర్కొన్నారు. నికర వడ్డీ మార్జిన్లు 2.09 శాతం నుంచి 2.2 శాతానికి పెరిగాయని శ్రీనివాస్ తెలిపారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో ఎన్ఎస్ఈలో ఈ షేర్ 4 శాతం వృద్ధితో రూ.26కు పెరిగింది. -
మొండి బకాయిల్లో యునెటైడ్ బ్యాంక్ టాప్
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో యునెటైడ్ బ్యాం క్ ఆఫ్ ఇండియాకు అత్యధికంగా మొండి బకాయిలు ఉన్నాయి. భారత రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) ఆర్థిక మంత్రిత్వ శాఖకు నివేదించిన వివరాల ప్రకారం..., ఈ ఏడాది మార్చి నాటికి యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 21.5 శాతం రుణాలు మొండి బకాయిలు(పునర్వ్యస్థీకరించిన రుణాలను కూడా కలుపుకొని)గా ఉన్నాయి. ఈ తరహా రుణాలు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 21.3 శాతంగా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌కు 19.4 శాతంగా, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్‌కు 18.7 శాతంగా, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు 17.9 శాతంగా ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, అలహాబాద్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యూకో, దేనా బ్యాంక్‌లకు ఈ తరహా రుణాలు 15 శాతానికి పైగానే ఉన్నాయి. మొండి బకాయిలు పెరగడం ఆర్బీఐని, ప్రభుత్వానికి కూడా ఆందోళన కలిగిస్తోంది. వీటిని తగ్గించడానికి ఆర్బీఐ పలు ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఏడాది మార్చి నాటికి మొత్తం ప్రభుత్వ రంగ బ్యాంకుల స్థూల మొండి బకాయిలు రూ.2,55,180 కోట్లు. వీటిలో 30%(రూ.93,769 కోట్లు) టాప్-30 డిఫాల్టర్లవే. -
కింగ్‌ఫిషర్ రుణాలు దీర్ఘకాలంలో రికవర్ కావొచ్చు
ముంబై:కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కి ఇచ్చిన రుణాలను ఇప్పుడప్పుడే రాబట్టుకోలేకపోవచ్చని అయితే దీర్ఘకాలంలో రికవర్ చేసుకునే అవకాశాలు ఉన్నాయని యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. కింగ్‌ఫిషర్ రుణాలు తిరిగి వస్తాయని భావించడం లేదంటూ యూబీఐ ఎండీ పి. శ్రీనివాస్ వ్యాఖ్యలపై స్పష్టతనివ్వాలంటూ బీఎస్ఈ సూచించిన మీదట బ్యాంక్ సోమవారం ఈ వివరణ ఇచ్చింది. చట్టపరంగా ఎదురైన సమస్యలు తేలేందుకు సుదీర్ఘకాలం పట్టే అవకాశాలున్నందున రుణాల రికవరీకి కూడా సమయం పట్టొచ్చని బ్యాంక్ వివరించింది. కంపెనీకి ఇచ్చిన రూ. 400 కోట్ల మేర రుణాలపై వడ్డీ తప్ప అసలు మొత్తం రాకపోవచ్చంటూ శ్రీనివాస్ ఇటీవల వ్యాఖ్యానించారు. -
యునైటెడ్ బ్యాంక్ పై కోర్టుకెళతా: మాల్యా
హైదరాబాద్: యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తనను ఎగవేతదారుడిగా ప్రకటించడంపై కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ అధినేత, లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా అసంతృప్తి వ్యక్తం చేశారు. డిఫాల్టర్ ట్యాగ్ ను అంగీకరించబోనని, ఆ బ్యాంకుపై న్యాయపరమైన చర్య తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. న్యాయవ్యవస్థపై తనకు నమ్మకం ఉందని పేర్కొన్నారు. విజయమాల్యాను యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సోమవారం డిఫాల్టర్‌గా ప్రకటించింది. బ్యాంకుల నుంచి రుణాలు పొంది నిబంధనలకు విరుద్దంగా ఇతర అవసరాలకు కేటాయించడం, తిరిగి చెల్లించకపోవడం లాంటి చర్యలకు ఆయన పాల్పడ్డారని ఆరోపించింది. -
మాల్యాను డిఫాల్టర్‌గా ప్రకటించిన యునైటెడ్ బ్యాంక్
ముంబయి : కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ అధినేత, లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఉద్దేశపూర్వకంగానే మాల్యా బకాయిలు ఎగవేస్తున్నారని ఆ బ్యాక్ వ్యాఖ్యానించింది. కాగా బ్యాంకుల నుంచి రుణాలు పొంది నిబంధనలకు విరుద్దంగా ఇతర అవసరాలకు కేటాయించడం, తిరిగి చెల్లించకపోవడం లాంటి చర్యలు ఉద్దేశ్యపూర్వక డిఫాల్టర్ల కిందకు వస్తారు. సదరు వ్యక్తికి మంజూరు చేసిన రుణాలను రీకాల్ చేసుకునే అధికారం బ్యాంకులకు లభిస్తుంది. విల్‌ఫుల్ డిఫాల్టర్‌కు బ్యాంకుల రుణాలు పుట్టవు, వారు డైరెక్టర్‌గా ఉన్న కంపెనీలను కూడా బ్యాంకులు దూరంగా పెడతాయి. కోల్కత్తా కేంద్రంగా పని చేస్తోన్న యునైటెడ్ బ్యాంకు ఆఫ్ ఇండియా తొలిసారి విజయ మాల్యను డిఫాల్టర్‌గా ప్రకటించటం విశేషం. ఇప్పటికే మాల్యాను ఎందుకు ఎగవేతదారుడిగా ప్రకటించకూడదో వెల్లడించాలంటూ ఆయనకు నోటీసులు జారి చేసిన విషయం తెలిసిందే. -
సెబీ సంస్కరణల మోత...
బోర్డు సమావేశంలో పలు ప్రతిపాదనలకు ఆమోదం.. పీఎస్‌యూల్లో 25 శాతం పబ్లిక్ వాటా తప్పనిసరి; మూడేళ్ల గడువు ఐపీఓ, ఓఎఫ్సీ నిబంధనల్లోనూ మార్పులు... ఎసాప్స్ స్కీమ్‌లకు కొత్త నిబంధనలు... న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లో ఇటు ఇన్వెస్టర్లు, అటు ప్రమోటర్లకు సంబంధించి కీలక సంస్కరణలకు తెరలేచింది. నియంత్రణ సంస్థ సెబీ... గురువారం జరిగిన బోర్డు సమావేశంలో పలు ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేశారు. ప్రధానంగా మూడేళ్లలోగా స్టాక్ మార్కెట్లో లిస్టయిన అన్ని ప్రభుత్వ రంగ కంపెనీ(పీఎస్‌యూ)ల్లో కనీసం 25 శాతం పబ్లిక్ వాటా తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల 25 శాతం కంటే తక్కువ పబ్లిక్ వాటా ఉన్న 36 పీఎస్‌యూల్లో రానున్న మూడేళ్లలో ప్రభుత్వం కచ్చితంగా వాటాను విక్రయించాల్సి ఉంటుంది. వెరసి సుమారు రూ.60 వేల కోట్ల మేర ఖజానాకు జమయ్యే అవకాశం ఉంది. ఇప్పటివరకూ ఉన్న నిబంధనల ప్రకారం పీఎస్‌యూల్లో కనీసం 10% పబ్లిక్ వాటా తప్పనిసరి కాగా, లిస్టెడ్ నాన్-పీఎస్యూలకైతే ఈ పరిమితి 25%. బోర్డు సమావేశంలో స్టాక్ మార్కెట్లకు సంబంధించి కొన్ని అత్యంత ముఖ్యమైన నిర్ణయాలను తీసుకున్నామని సెబీ చైర్మన్ యూకే సిన్హా చెప్పారు. ప్రమోటర్లు ఎవరనేదానితో సంబంధం లేకుండా అన్ని లిస్టెడ్ కంపెనీలకూ ఒకేవిధమైన నిబంధనలను అమలు చేయడమే ఈ చర్యల ముఖ్య ఉద్దేశమన్నారు. ఐపీఓ నిబంధనలు సరళతరం... ప్రైమరీ మార్కెట్‌ను మళ్లీ పరుగులు పెట్టించడమే లక్ష్యంగా ప్రారంభ పబ్లిక్ ఆఫర్(ఐపీఓ) నిబంధనలను సెబీ సరళతరం చేసింది. దీనిప్రకారం ఇకనుంచి రూ.4,000 కోట్లకు మించి ఇష్యూ అనంతర మూలధనం(పోస్ట్-ఇష్యూ క్యాపిటల్) ఉండే కంపెనీలు కనీసం 10 శాతం వాటాను ఐపీఓల్లో విక్రయించాల్సి ఉంటుంది. ఇతర కంపెనీల ఐపీఓల్లో మాత్రం 25 శాతం వాటా లేదా రూ.400 కోట్లు వీటిలో దేనివిలువ తక్కువగా ఉంటే ఆమేరకు వాటాను విక్రయించేలా నిబంధనల్లో మార్పులు చేశారు. అయితే, 25 శాతం కంటే తక్కువ వాటా విక్రయించిన కంపెనీలన్నీ మూడేళ్లలోగా ఈ పరిమితిని తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంటుంది. మరోపక్క, పబ్లిక్ ఇష్యూల్లో సంస్థాగత ఇన్వెస్టర్లకు సంబంధించి షేర్ల కేటాయింపుల్లో ఇప్పటిదాకా యాంకర్ ఇన్వెస్టర్లకు కేటాయిస్తున్న 30 శాతం వాటాను... ఇకపై 60 శాతానికి పెంచుతూ కూడా సెబీ నిర్ణయం తీసుకుంది. ఫ్రిఫరెన్షియల్ పద్ధతిలో షేర్ల కేటాయింపు తుది ధరను ఇప్పటివరకూ అమల్లో ఉన్న ట్రేడింగ్ పరిమాణం సగటు రేటు ఆధారంగా కాకుండా... ఇష్యూ ముందురోజు ముగింపు రేటు ప్రకారం ఇచ్చేలా నిబంధనలను సెబీ మార్చింది. పబ్లిక్ ఇష్యూ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఏడాది వ్యవధిలోపు కేటాయించిన బోనస్ షేర్లను సైతం ఇష్యూలో విక్రయించేందుకు లైన్‌క్లియర్ చేసింది. ఆఫర్ ఫర్ సేల్ మరింత విస్తృతం... లిస్టెడ్ కంపెనీలు ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) విధానంలో విక్రయించే షేర్ల పరిమాణంలో రిటైల్ ఇన్వెస్టర్లకు కచ్చితంగా 10% వాటాను కేటాయించాలన్న నిబంధనను సెబీ ఆమోదించింది. అంతేకాకుండా రిటైలర్లకు షేర్ల విక్రయం ధరలో డిస్కౌంట్ కూడా ఇచ్చేందుకు అనుమతించింది. లిస్టెడ్ కంపెనీలో 10% కంటే అధికంగా వాటా ఉన్న నాన్-ప్రమోటర్ వాటాదారులు ఓఎఫ్ఎస్ రూట్లో తమ షేర్లను విక్రయించుకునేందుకు సెబీ అవకాశం కల్పించింది. 2012 ఫిబ్రవరిలో సెబీ ప్రవేశపెట్టిన ఈ విధానం విజయవంతమైంది. అప్పటినుంచి.. 100కు పైగా కంపెనీలు ఈ రూట్లో రూ.50,000 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ఇప్పటిదాకా మార్కెట్ విలువపరంగా టాప్-100 కంపెనీలకు మాత్రమే అవకాశం ఉన్న ఓఎఫ్ఎస్ రూట్‌ను టాప్-200 కంపెనీలన్నింటికీ వర్తించేలా సెబీ అనుమతించింది. ఇతర నిర్ణయాలు ఇవీ... కేవైసీ: స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్లకు సంబంధించిన వివరాల (కేవైసీ)ను ఇతర ఫైనాన్షియల్ రంగ నియంత్రణ సంస్థలతోనూ పంచుకునేందుకు అనుమతి. ఇప్పటివరకూ సెబీ వద్ద రిజిస్టర్ అయిన సంస్థల మధ్యే కేవైసీ వివరాల షేరింగ్ ఉంది. ఫైనాన్షియల్ మార్కెట్లో ఇన్వెస్టర్లందరికీ ఒకేవిధమైన కేవైసీ ప్రక్రియ అమలులో భాగంగా ఈ చర్యలు తీసుకున్నారు. రీసెర్చ్ ఎనలిస్ట్లపైనా నియంత్రణ: రీసెర్చ్ ఎనలిస్ట్‌ల కార్యకలాపాల్లో మరింత పారదర్శకతను తీసుకొచ్చేందుకుగాను వాళ్లను నియంత్రణ పరిధిలోని తీసుకొస్తూ నిబంధనలను తీసుకొచ్చారు. ముఖ్యంగా ఆయా సంస్థలు తప్పుడు నివేదికలతో ఇన్వెస్టర్లను మోసగించకుండా వాళ్లకు మరింత రక్షణ కల్పించడమే వీటి ప్రధానోద్దేశం. ఇప్పటివరకూ రీసెర్చ్ ఎనలిస్ట్‌లపై నియంత్రణేదీ లేదు. కొత్త నిబంధనల ప్రకారం వ్యక్తిగత, సంస్థాగత రీసెర్చ్ ఎనలిస్ట్లంతా సెబీ వద్ద నమోదు చేసుకోవాలి. వాళ్లిచ్చే నివేదికలు ఇతరత్రా అంశాలకు సంబంధించిన కొన్ని వివరాలను సెబీకి తెలియజేయాల్సి ఉంటుంది. అయితే, ఇన్వెస్ట్మెంట్ అడ్వయిజర్లు, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు, పోర్ట్‌ఫోలియో మేనేజర్లు, ఇన్వెస్ట్మెంట్/వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ మాత్రం ఈ నిబంధనల ప్రకారం రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎసాప్స్ స్కీమ్స్: ఎంప్లాయీస్ స్టాక్ ఆప్షన్స్(ఎసాప్స్) స్కీమ్‌లకు సంబంధించిన నిబంధనలను సెబీ మరింత సరళతరం చేసింది. కొత్త నిబంధనల ప్రకారం ఎసాప్ ట్రస్ట్‌లను షేర్‌హోల్డింగ్ సంస్థల్లో ప్రత్యేక విభాగంగా ఇకపై పరిగణిస్తారు. అంటే ఈ ట్రస్ట్‌లోని షేర్లను పబ్లిక్‌కి సంబంధించిన కేటగిరీలో లేదా ప్రమోటర్ గ్రూప్ కేటగిరీ కిందకానీ ఇకపై పరిగణించరు. ఈ నిబంధనల పూర్తికి అయిదేళ్ల గడువు ఇస్తున్నట్లు సెబీ పేర్కొంది. ఎసాప్స్ కింద ఉద్యోగులకు షేర్ల కేటాయింపు జరిపే కంపెనీలు కొన్ని నిబంధనలకు లోబడి తమ సొంత కంపెనీ షేర్లను కొనుగోలు చేసేందుకు సెబీ వీలుకల్పించింది. -
నిధుల సమీకరణకు సన్నాహాలు
మోడీ సర్కారు రాకతో మెరుగుపడిన సెంటిమెంట్ న్యూఢిల్లీ: మార్కెట్ల జోరు కొనసాగుతుండడంతో షేర్లు, సెక్యూరిటీల జారీ ద్వారా నిధులు సమీకరించేందుకు పలు కంపెనీలు క్యూ కడుతున్నాయి. దాదాపు రూ.15 వేల కోట్ల సమీకరణ యోచనలో ఉన్నట్లు గత పక్షంలో కనీసం ఐదు కంపెనీలు ప్రకటించాయి. ఇటీవలి ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం, ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతల స్వీకరణతో మార్కెట్ సెంటిమెంట్ బలోపేతమైంది. నిధుల సమీకరణ యోచనలు అప్పటినుంచే రూపుదిద్దుకోవడం మొదలైంది. మార్కెట్ నుంచి నిధులు సమీకరించే ఆలోచనలో ఉన్నట్లు ప్రకటించిన కంపెనీల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, జైప్రకాశ్ పవర్ వెంచర్స్, యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బీఎఫ్ యుటిలిటీస్, ఆమ్టెక్ ఆటో ఉన్నాయి. యునెటైడ్ బ్యాంక్‌ను మినహాయిస్తే మిగిలిన కంపెనీలు నిధుల సమీకరణకు బోర్డు అనుమతులు పొందాయి. ఇంకా అనేక కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లతోనూ, అంతర్గత బృందాలతోనూ నిధుల సమీకరణపై చర్చిస్తున్నాయి. సెకండరీ మార్కెట్లలో లావాదేవీలు ఇటీవల భారీగా పుంజుకున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఇటీవలి వారాల్లో కొత్త శిఖరాలకు చేరుతోంది. ఆర్థిక సంస్కరణలకు మోడీ సర్కార్ శ్రీకారం చుట్టగానే ఇన్వెస్టర్ సెంటిమెంట్ మరింత మెరుగుపడుతుందని అంచనా. దేశీయ మార్కెట్‌తో పాటు విదేశీ ఇన్వెస్టర్ల నుంచి కూడా నిధుల సమీకరణకు కంపెనీలు యోచిస్తున్నాయి. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్స్ (క్విప్), విదేశీ వాణిజ్య రుణాలు (ఈసీబీ), ఫారిన్ కరెన్సీ కన్వర్టిబుల్ బాండ్స్ (ఎఫ్‌సీసీబీ), అమెరికన్ డిపాజిటరీ రిసీట్స్ (ఏడీఆర్), గ్లోబల్ డిపాజిటరీ రిసీట్స్ (జీడీఆర్), ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్‌పీఓ) తదితర పద్ధతుల్లో నిధులు సమీకరించాలని ఆలోచిస్తున్నాయి. అంతా అనుకూలం నిధుల సమీకరణకు అనుకూలమైన వాతావరణం నెలకొంది. సెన్సెక్స్, నిఫ్టీలు కొత్త గరిష్టాలకు చేరుతున్నాయి. సంస్థాగత ఇన్వెస్టర్లలో మళ్లీ విశ్వాసం నెలకొంది. ఈక్విటీ మార్కెట్, ఇతర సాధనాల ద్వారా నిధుల సమీకరణకు ఇదే తగిన సమయం. - అలెక్స్ మాథ్యూ, ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్, జియోజిత్ బీఎన్పీ పారిబా -
మావద్ద మంత్రదండం లేదు
ముంబై: మొండిబకాయిల (ఎన్పీఏ) సంక్షోభంలో చిక్కుకున్న యునెటైడ్ బ్యాంక్ (యూబీ)కు సహాయం చేయడానికి తమ వద్ద మంత్రదండం ఏదీ లేదని రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ కేసీ చక్రవర్తి గురువారం పేర్కొన్నారు. కోల్‌కతా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆ బ్యాంక్ ఉద్యోగులు కష్టపడి పనిచేసి, ప్రస్తుత సంక్షోభం నుంచి బయటపడాల్సి ఉంటుందని అన్నారు. ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న చక్రవర్తి ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. డిసెంబర్ త్రైమాసికంలో బ్యాంక్ స్థూల మొండిబకాయిలు 11 శాతం పైబడి ఆందోళనకరంగా మారిన సంగతి తెలిసిందే. అసెట్ నాణ్యత పెంపు, నిర్వాహణా వ్యయాల తగ్గింపు, వ్యాపారాభివృద్ధి తత్సబంధ అంశాలపై యునెటైడ్ బ్యాంక్ సిబ్బంది దృష్టి సారించాలని ఆయన సూచించారు. పుత్తడి దిగుమతులకు మరిన్ని బ్యాంకులను అనుమతించడాన్ని చక్రవర్తి సమర్థించుకున్నారు. ఈ నిర్ణయం దేశీయంగా సరఫరాలు మెరుగుపడి ధరలు తగ్గడానికి దోహదపడుతుందన్నారు. పదవికి ముందస్తు రాజీనామా.. కేసీ చక్రవర్తి తన డిప్యూటీ గవర్నర్ పదవికి రాజీ నామా చేశారు. పదవీ విరమణకు 3 నెలల ముందుగానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. 62 సంవత్సరాల చక్రవర్తి 2009 జూన్ 15న మూడేళ్ల కాలానికి ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా నియమితులయ్యారు. తదుపరి ఆయన పదవీ కాలాన్ని ప్రభుత్వం రెండేళ్లు పొడిగించింది. దీని ప్రకారం ఆయన 2014 జూన్ 15న పదవీ విరమణ చేయాల్సి ఉంది. ముందస్తు రాజీనామాకు వ్యక్తిగత అంశాలే కారణమని సమాచారం. ఏప్రిల్ 25 వరకూ బాధ్యతల్లో..: ఏప్రిల్ 25కల్లా తనను బాధ్యతల నుంచి తప్పించాలని చక్రవర్తి కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించడానికి ముందు ఆయన పంజాబ్ నేషనల్ బ్యాంక్ సీఎండీగా పనిచేశారు. నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్ఆర్- బ్యాంకులు తమ డిపాజిట్లలో ఆర్బీఐ ఉంచాల్సిన పరిమాణం) ముఖ్య పాత్ర పోషిస్తుందని, దీన్ని కొనసాగించాల్సిందేనని గట్టిగా భావించే వ్యక్తుల్లో చక్రవర్తి ఒకరు. ఈ విషయంలో ఆయన ఎస్బీఐ గత చైర్మన్ ప్రతిప్ చౌదరితో విభేదించారు కూడా. -
మొండి బకాయిలు ఫర్ సేల్!
ఎన్పీఏలను వదిలించుకోవడానికి బ్యాంకుల ‘ఆర్క్స్’ మంత్రం తొలిసారిగా ఎన్పీఏలను అమ్మడానికి ముందుకొచ్చిన ఎస్బీఐ ఇదే బాటలో రాష్ట్ర బ్యాంకులు... ఈ ఏడాది రూ.20,000 కోట్ల ఎన్పీఏలను కొంటున్న ఆర్క్స్... వచ్చే ఏడాదికి రూ.50 వేల కోట్ల పైమాటే..! కొండలా పెరిగిపోతున్న మొండి బకాయిలతో చైర్మన్ పదవులకే ఎసరు వస్తుండటంతో బ్యాంకులు ఇప్పుడు వాటిని వదిలించుకునే పనిలో పడ్డాయి. దీంతో బ్యాంకులు ఇకరావు అని ఆశలు వదులుకున్న మొండి బకాయిలను వేరే సంస్థలకు అమ్మేసి, బ్యాలెన్స్ షీట్స్‌ను చక్కదిద్దుకుంటున్నాయి. ఏదో చిన్నా చితకా బ్యాంకులు కాదు ఎస్బీఐ వంటి దేశీయ అతిపెద్ద బ్యాంకు కూడా ఇదే పనిలో ఉండటం గమనార్హం. ఈ వ్యాపారం బాగుండటంతో మొండి బకాయిలను కొనుగోలు చేసే సంస్థలు.. అసెట్ రీకనస్ట్రక్షన్ కంపెనీల(ఆర్క్స్)కు డిమాండ్ బాగా పెరిగింది. ఇప్పుడు బ్యాంకింగ్ రంగాన్ని బాగా కుదిపేస్తున్న అతిపెద్ద సమస్య మొండి బకాయిలు. ఈ నిరర్థక ఆస్తుల (ఎన్పీఏల) వల్ల యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీఎండీ రాజీనామా చేయాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎంత దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఉద్యోగాలకే ఎసరు వస్తుండటంతో ప్రభుత్వరంగ బ్యాంకులు ఈ మొండి బకాయిలను తగ్గించుకునే పనిలో పడ్డాయి. యునెటైడ్ బ్యాంక్ ఇప్పటికే రూ.700 కోట్ల మొండి బకాయిలను వదిలించుకోగా, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, సిండికేట్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లు ఇప్పటికే ఈ పనిలో ఉన్నాయి. ఇప్పుడు వీటికి జతగా దేశీయ అతిపెద్ద బ్యాంక్ తొలిసారిగా ఎస్బీఐ వచ్చి చేరింది. మొండి బకాయిలను తగ్గించుకోవడానికి ఈ త్రైమాసికంలోనే ఎన్పీఏలను విక్రయిస్తున్నట్లు ఎస్బీఐ చైర్మన్ అరుంధతీ భట్టాచార్య ప్రకటించింది. ఎస్బీఐ స్థూల నిరర్థక ఆస్తులు డిసెంబర్ త్రైమాసికానికి 5.76 శాతానికి చేరి భయపెడుతున్నాయి. అంతేకాదు ఈ ఒక్క త్రైమాసికంలోనే రూ.6,100 కోట్ల రుణాలను పునర్ వ్యవస్థీకరించగా మరో రూ.9,500 కోట్ల రుణాలు ఇందుకోసం ఎదురు చూస్తున్నాయి. దీంతో ఎస్బీఐ కూడా ఆర్క్స్‌కు విక్రయించడం ద్వారా ఎన్పీఏలను తగ్గించుకోవాలని చూస్తోంది. రాష్ట్రానికి చెందిన ఆంధ్రాబ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరా బాద్‌లు కూడా ఇదే విధమైన ఆలోచనలో ఉన్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.525 కోట్ల మొండి బకాయిలను విక్రయించాలని నిర్ణయం తీసుకున్నామని, ఇప్పటికే వీటిని గుర్తించినట్లు ఎస్బీహెచ్ మేనేజింగ్ డెరైక్టర్ ఎం.భగవంతరావు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎటువంటి మొండి బకాయిలను విక్రయించడం లేదని, వచ్చే సంవత్సరం విక్రయించడానికి ఆస్తులను గుర్తిస్తున్నట్లు ఆంధ్రాబ్యాంక్ సీఎండి సీవీఆర్ రాజేంద్రన్ తెలిపారు. ఆర్క్స్కి నిధుల కొరత దేశంలో అసెట్ రీకనస్ట్రక్షన్ వ్యాపారం 2000 సంవత్సరంలోనే ప్రారంభమైనప్పటికీ ఈ మధ్యనే ఇది బాగా విస్తరిస్తోంది. దేశంలోని 15 ప్రధాన బ్యాంకులు కలిసి అసెట్ రీకనస్ట్రక్షన్ కంపెనీ (ఇండియా) పేరుతో ప్రారంభించాయి. ఇప్పుడిదే అదిపెద్ద ఆర్క్‌గా ఉంది. దీనికి తోడు ఇప్పుడు ఎడల్విస్, జేఎం ఫైనాన్షియల్, ఇన్వెన్ట్ అసెట్ సెక్యూరిటైజేషన్ వంటి సంస్థలు కూడా వచ్చి చేరాయి. ఎన్పీఏలు పెరిగి వ్యాపారం పెరగడంతో వీటిని కొనడానికి తగినంత మూలధనం లేక ఈ సంస్థలు ఇబ్బందులు పడుతున్నాయి. ప్రస్తుతం ఆర్క్స్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 100 శాతం అనుమతిస్తున్నా, ఒక విదేశీ సంస్థకు 49 శాతం మించి వాటా ఉండకూడదన్న నిబంధన వ్యాపార విస్తరణకు ప్రధాన అడ్డంకిగా మారిందని, దీన్ని సవరించాలని ఈ సంస్థలు ఆర్బీఐని కోరుతున్నాయి. - బిజినెస్ బ్యూరో, హైదరాబాద్ అమ్మకానికి రూ. 50 వేల కోట్ల ఎన్పీఏలు ఆర్థిక వృద్ధి మందగించడంతో నిరర్థక ఆస్తుల విక్రయ వ్యాపారం ఏటా రెట్టింపు స్థాయిలో వృద్ది చెందుతున్నట్లు గణాంకాలు తెలియచేస్తున్నాయి. 2012-13 ఆర్థిక సంవత్సరంలో రూ.12,000 కోట్లుగా ఉన్న ఆర్క్స్ వ్యాపారం ఈ ఆర్థిక సంవత్సరాంతానికి రూ.20,000 కోట్లు దాటుతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం(2014-15)లో ఈ వ్యాపారం పరిమాణం రూ.50,000 కోట్లు దాటొచ్చని ఒక అంచనా. -
ఫార్మా షేర్ల కి డిమాండ్
దేశీ స్టాక్స్‌లో ఎఫ్ఐఐల కొనుగోళ్లు కొనసాగడంతోపాటు, ఫార్మా దిగ్గజాలకు డిమాండ్ పెరగడంతో సెంటిమెంట్ బలపడింది. దీంతో వారం ఆరంభంలోనే సెన్సెక్స్ 111 పాయింట్లు లాభపడి 20,811 వద్ద ముగిసింది. ఇది నెల రోజుల గరిష్టంకాగా, నిఫ్టీ కూడా 36 పాయింట్లు పుంజుకుని 6,186 వద్ద ముగిసింది. ఫార్మా షేర్లు క్యాడిలా హెల్త్, ర్యాన్‌బాక్సీ, డాక్టర్ రెడ్డీస్, లుపిన్, గ్లెన్‌మార్క్ 5-2% మధ్య ఎగశాయి. వెరసి డాక్టర్ రెడ్డీస్(రూ. 2,795), లుపిన్(రూ. 956), క్యాడిలా(రూ. 995) చరిత్రాత్మక గరిష్ట స్థాయిల వద్ద ముగిశాయి. గత వారం రూ. 2,500 కోట్లను ఇన్వెస్ట్ చేసిన ఎఫ్ఐఐలు తాజాగా రూ. రూ. 267 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ ఫండ్స్ యథాప్రకారం రూ. 249 కోట్ల విలువైన అమ్మకాలను చేపట్టాయి. ఎన్టీపీసీ డౌన్, టాటా పవర్ అప్ కేంద్ర విద్యుత్ నియంత్రణ సంస్థ(సీఈఆర్సీ) విద్యుత్ టారిఫ్‌లకు సంబంధించి కొత్తగా ప్రకటించిన నిబంధనల కారణంగా ప్రభుత్వ రంగ దిగ్గజం ఎన్టీపీసీ బీఎస్ఈలో 11%పైగా పతనమై రూ. 117 వద్ద ముగిసింది. ఇది 52 వారాల కనిష్టంకాగా, రెండు ఎక్స్ఛేంజీలలోనూ కలిపి దాదాపు 3.5 కోట్ల షేర్లు చేతులు మారాయి. ఉత్పత్తినిబట్టి కాకుండా అమ్మకపుస్థాయి(ఆఫ్టేక్) ఆధారంగా టారిఫ్ నిర్ణయంకానుండం ఇందుకు కారణమైంది. అయితే ముంద్రా ప్రాజెక్ట్‌లో ఉత్పత్తయ్యే విద్యుత్‌పై నష్టపరిహారంకింద యూనిట్‌కు రూ. 50 పైసలను అదనంగా వసూలు చేసుకునేందుకు సీఈఆర్సీ అంగీకరించడంతో టాటా పవర్ 5% జంప్‌చేసి రూ. 83 వద్ద ముగిసింది. అమెరికా మార్కెట్ల దూకుడు న్యూయార్క్: అమెరికా స్టాక్ మార్కెట్లు జోరుమీదున్నాయి. కేటర్పిల్లర్, మెర్క్ అండ్ కంపెనీ వంటి దిగ్గజాలు ఏడాది గరిష్టానికి చేరడంతో ఎస్అండ్పీ-500 సూచీ చరిత్రాత్మక గరిష్ట స్థాయిని తాకింది. ఇంతక్రితం జనవరి 15న సాధించిన 1,848 పాయింట్ల లైఫ్‌టైమ్ హైను అధిగమించి 1,857 వద్ద కదులుతోంది. ఇక నాస్డాక్ 14 ఏళ్ళ గరిష్టమైన 4,309కు చేరగా, డోజోన్స్ 184 పాయింట్లు ఎగసి 16,287 వద్ద ట్రేడవుతోంది. -
యునెటైడ్ బ్యాంక్‌కు అర్చన రాజీనామా
న్యూఢిల్లీ: యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ అర్చనా భార్గవ తన పదవికి రాజీనామా చేశారు. మొండిబకాయిల వెల్లడికి సంబంధించి ఈ ప్రభుత్వ రంగ బ్యాంకుపై దర్యాప్తు మొదలైన నేపథ్యంలో అర్చన రాజీనామాకు ప్రాధాన్యత ఏర్పడింది. అర్చన స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశారని ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ రాజీవ్ టక్రు చెప్పారు. ఆమె రాజీనామాను ప్రభుత్వం ఆమోదించిందని, ఈ నెల 20 నుంచి ఇది వర్తిస్తుందని తెలిపారు. రాజీనామాకు ఆరోగ్య సమస్యలను అర్చన ప్రస్తావించినట్లు తెలుస్తోంది. బ్యాంకు చైర్‌పర్సన్‌గా 2013 ఏప్రిల్ 23న అర్చన పదవీ బాధ్యతలు స్వీకరించారు. నిజానికి 2015 ఫిబ్రవరి 28న ఆమె పదవీ విరమణ చేయాల్సి ఉంది. మొండిబకాయిల వెల్లడి, రుణ ఎగవేతల ఖాతాలు, రుణ పునర్వ్యవస్థీకరణ వంటి అంశాలలో బ్యాంకు విఫలమైన నేపథ్యంలో ప్రస్తుతం పాలనా సంబంధ దర్యాప్తు నడుస్తున్న విషయం విదితమే. బీఎస్ఈలో బ్యాంకు షేరు 0.4% లాభపడి రూ. 24.35 వద్ద ముగిసింది. -
మొండిబకాయిల పాపం ఇన్ఫీ సాఫ్ట్‌వేర్‌దే: యునెటైడ్ బ్యాంక్
న్యూఢిల్లీ: నిరర్ధక ఆస్తుల (ఎన్పీఏ) మొత్తం భారీగా పెరిగినట్లుగా కనిపించడానికి లోపభూయిష్టమైన ఇన్ఫోసిస్ సాఫ్ట్‌వేరే కారణమని యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) ఆరోపించింది. కొన్ని విభాగాల్లో ఆస్తులను వర్గీకరించడంలో ఈ సాఫ్ట్వేర్ విఫలమవుతోందని పేర్కొంది. కోర్ బ్యాంకింగ్ సేవల కోసం తమతో పాటు పలు బ్యాంకులు ఇన్ఫోసిస్ రూపొందించిన ఫినాకిల్ సాఫ్ట్‌వేర్‌నే ఉపయోగిస్తున్నాయని స్టాక్ ఎక్స్చేంజీ బీఎస్ఈకి యూబీఐ తెలిపింది. అయితే, పునర్వ్యవస్థీకరించిన ఖాతాలు, ఓవర్‌డ్రాఫ్ట్ అకౌంట్లు తదితర విభాగాల వివరాలను వర్గీకరించడంలో ఈ సాఫ్ట్వేర్ పొరపాట్లు చేస్తోందని వివరించింది. ఇలాంటి పొరపాట్ల వల్లే భేషుగ్గా ఉన్న ఖాతాలను ఎన్పీఏలుగాను, ఎన్పీఏలను మంచి ఖాతాలుగానూ చూపించిందని యూబీఐ తెలిపింది. వివిధ త్రైమాసికాల్లో ఎన్పీఏలు భారీగా ఎగియడంపై సందేహాలు వ్యక్తం చేసిన ఆర్బీఐ.. యునెటైడ్ బ్యాంక్ ఖాతాల ఫోరెన్సిక్ ఆడిట్‌కి ఆదేశించిన సంగతి తెలిసిందే. మరోవైపు, తమ సాఫ్ట్‌వేర్‌లో ఎటువంటి లోపాలు లేవని, ఆర్బీఐ నిర్దేశాలకు అనుగుణంగానే అది పనిచేస్తుందని ఇన్ఫోసిస్ వర్గాలు స్పష్టం చేశాయి.