ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ) కొత్త చెక్‌బుక్ నిబందనలో మార్పుకు సంబంధించి తన ఖాతాదారులకు ఒక కీలక ప్రకటన చేసింది. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ), యునైటెడ్ బ్యాంక్ ఇండియా(యుబీఐ)లకు చెందిన ప్రస్తుత చెక్‌బుక్‌లు అక్టోబర్ 1, 2021 నుంచి పనిచేయవని బ్యాంక్ ట్విట్టర్ వేదికగా తెలిపింది. ఆ రెండు బ్యాంకుల ఖాతాదారులు వారి పాత చెక్‌బుక్‌ల స్థానంలో కొత్తవి తీసుకోవాలని కోరింది. (చదవండి: చౌక వడ్డీకే ఐపీపీబీ గృహ రుణాలు.. ఎంతంటే?)
"ప్రియమైన వినియోగదారులరా.. ఈఓబీసీ, ఈయుబీఐ బ్యాంకులకు చెందిన పాత చెక్‌బుక్‌లు 1-10-2021 నుంచి నిలిపివేస్తున్నాము. దయచేసి ఈఓబీసీ, ఈయుబీఐ పాత చెక్‌బుక్‌ల స్థానంలో ఐఎఫ్ఎస్ సీ, ఎమ్ ఐసీఆర్ తో అప్ డేట్ చేసిన పీఎన్‌బీ కొత్త కొత్త చెక్‌బుక్‌లు పొందండి. కొత్త చెక్‌బుక్ కోసం ఎటీఎమ్/ఐబీఎస్/పీఎన్‌బీ వన్ ద్వారా అప్లై చేసుకోండి" అని ఒక ట్వీట్ చేసింది.
Take note & apply for your new cheque book through👇
— Punjab National Bank (@pnbindia) September 8, 2021
➡️ ATM
➡️ Internet Banking
➡️ PNB One
➡️ Branch pic.twitter.com/OEmRM1x6j0
లేదంటే కస్టమర్లు నేరుగా బ్యాంకు బ్రాంచీలకు వెళ్లి కూడా కొత్త చెక్‌బుక్‌లు తీసుకోవచ్చని పేర్కొంది. ఏప్రిల్, 2020లో ఓబీసీ, యునైటెడ్ బ్యాంక్ ఇండియా(యుబీఐ) పీఎన్‌బీలో విలీనం అయిన తర్వాత ఈ కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. ఈ రెండు కాకుండా, మరో నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రభుత్వ మెగా కన్సాలిడేషన్ ప్రణాళిక కింద ఇతర బ్యాంకుల్లో విలీనం అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment