Cheque books
-
ఖాతాదారులకు అలర్ట్.. ఇక ఈ బ్యాంకు చెక్‌బుక్‌లు పనిచేయవు
ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) కొత్త చెక్‌బుక్ నిబందనలో మార్పుకు సంబంధించి తన ఖాతాదారులకు ఒక కీలక ప్రకటన చేసింది. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ), యునైటెడ్ బ్యాంక్ ఇండియా(యుబీఐ)లకు చెందిన ప్రస్తుత చెక్‌బుక్‌లు అక్టోబర్ 1, 2021 నుంచి పనిచేయవని బ్యాంక్ ట్విట్టర్ వేదికగా తెలిపింది. ఆ రెండు బ్యాంకుల ఖాతాదారులు వారి పాత చెక్‌బుక్‌ల స్థానంలో కొత్తవి తీసుకోవాలని కోరింది. (చదవండి: చౌక వడ్డీకే ఐపీపీబీ గృహ రుణాలు.. ఎంతంటే?) "ప్రియమైన వినియోగదారులరా.. ఈఓబీసీ, ఈయుబీఐ బ్యాంకులకు చెందిన పాత చెక్‌బుక్‌లు 1-10-2021 నుంచి నిలిపివేస్తున్నాము. దయచేసి ఈఓబీసీ, ఈయుబీఐ పాత చెక్‌బుక్‌ల స్థానంలో ఐఎఫ్ఎస్ సీ, ఎమ్ ఐసీఆర్ తో అప్ డేట్ చేసిన పీఎన్బీ కొత్త కొత్త చెక్‌బుక్‌లు పొందండి. కొత్త చెక్‌బుక్ కోసం ఎటీఎమ్/ఐబీఎస్/పీఎన్బీ వన్ ద్వారా అప్లై చేసుకోండి" అని ఒక ట్వీట్ చేసింది. Take note & apply for your new cheque book through👇 ➡️ ATM ➡️ Internet Banking ➡️ PNB One ➡️ Branch pic.twitter.com/OEmRM1x6j0 — Punjab National Bank (@pnbindia) September 8, 2021 లేదంటే కస్టమర్లు నేరుగా బ్యాంకు బ్రాంచీలకు వెళ్లి కూడా కొత్త చెక్‌బుక్‌లు తీసుకోవచ్చని పేర్కొంది. ఏప్రిల్, 2020లో ఓబీసీ, యునైటెడ్ బ్యాంక్ ఇండియా(యుబీఐ) పీఎన్బీలో విలీనం అయిన తర్వాత ఈ కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. ఈ రెండు కాకుండా, మరో నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రభుత్వ మెగా కన్సాలిడేషన్ ప్రణాళిక కింద ఇతర బ్యాంకుల్లో విలీనం అయ్యాయి. -
ఎదురుచూపులు
మహబూబ్‌నగర్ రూరల్: రబీ సీజన్‌కు రైతులకు పెట్టుబడి సాయం అందే పరిస్థితి కనిపించడంలేదు. ప్రభుత్వం డబ్బులను సకాలంలో అందించాలని యోచిస్తున్నా సాధ్యం కావడంలేదు. ఇందుకు ఎన్నో కారణాలు ఉన్నాయి. పెట్టుబడి సాయం అందించే బాధ్యతను జిల్లా వ్యవసాయ శాఖకు అప్పగించగా వారు పూర్తిస్థాయిలో విఫలమయ్యారనే చెప్పాలి. ప్రస్తుతం ఎన్నికల ప్రచార సమయం కావడంతో ‘రైతుబంధు’ చెక్కుల పంపిణీకి అభ్యంతరం తెలిపిన ఎన్నికల కమిషన్ రైతుల ఖాతాల్లో నేరుగా పెట్టుబడి సాయం అందించడానికి అంగీకరించింది. దీంతో అధికారులు రైతుల ఖాతాల వివరాలు తీసుకుని జమ చేయడానికి ప్రయత్నాలు మొదలెట్టారు. జిల్లాలో 3,40,674 మంది రైతులు వ్యవసాయ శాఖ అధికారులు ఈనెల 10వ తేదీ నుంచి జిల్లాలో 3,40,674 మంది రైతుల బ్యాంకు ఖాతాలు, పాస్ పుస్తకం, ఆధార్ నంబర్లను సేకరించి ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియను మొదలుపెట్టారు. ప్రభుత్వం ఇచ్చిన తేదీ ప్రకారం నేటి నుంచే రైతుబం«ధు పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. మొత్తం 3,40,674 మంది రైతులకు గాను కేవలం 9వేల మంది పైచిలుకు రైతుల ఖాతాల్లో మాత్రమే జమ కానుంది. పెట్టుబడి సాయం రైతులకు అందజేసే విషయంలో ఎన్నికల కమిషన్ నిబంధనలు విధించినప్పటి నుంచి నేటివరకు వ్యవసాయ శాఖ అవలంభిస్తున్న వైఖరితో రైతులకు సకాలంలో పెట్టుబడి సాయం అందకుండా పోయింది. ప్రణాళిక లేకనే.. వ్యవసాయ శాఖ అధికారులు ఓ ప్రణాళిక ప్రకారం వ్యవహరించకపోవడంతో ఖాతాల్లోకి పంట పెట్టుబడి సాయం జమ చేసే ప్రక్రియ తూతూమంత్రంగా జరిగిందనే విమర్శలు వస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ శాఖలో 38 మంది ఏఓలు, 162 మంది ఏఈఓలు ఉన్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కూడా ఇందుకు కారణంగా చెప్పవచ్చు. మండలానికి ఏఓతో పాటు నలుగురు, ఐదుగురు చొప్పున ఏఈఓలు ఉన్నారు. వారికి గ్రామాల్లో సహకారం అందించేందుకు వీఆర్ఏలు గ్రామానికి సుమారు 10 మంది చొప్పున ఉన్నారు. వీరంతా చురుకుగా విధులు నిర్వహిస్తే బ్యాంకు ఖాతాల వివరాల సేకరణ, ఆన్లైన్ నమోదు చకచకా జరిగిపోతుంది. ఇప్పటికే 1.10 లక్షల ఖాతాలను ఆన్లైన్ చేసినట్లు వ్యవసాయ శాఖ చెబుతోంది. అయితే బ్యాంకు ఖాతాల వివరాల పరిశీలన తర్వాతనే రాష్ట్ర ట్రెజరీ ద్వారా ప్రభుత్వం రైతుల బ్యాంకు ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేయనుంది. గత అనుభవాలతోనైనా.. ఖరీఫ్ సీజన్లో చెక్కుల పంపిణీ నేరుగా చేయడం వల్ల సాంకేతికంగా పలు తప్పులు దొర్లాయి. ఆయా మండలాల తహసీల్దార్లు వాటిని సరిచేసే అవకాశం ఉంది. ఖరీఫ్ సీజన్లో రూ. 355.21 కోట్ల పెట్టుబడి సాయం జిల్లాకు మంజూరు కాగా వివిధ కారణాల వల్ల రూ. 50.21 కోట్లు పంపిణీకి నోచుకోలేదు. రూ. 305 కోట్లు పంపిణీకి నోచుకున్నాయి. రబీ సీజన్లో రూ. 305 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో ఎకరాకు రూ. 4వేల చొప్పున నేరుగా జమ చేయాల్సి ఉన్నందున బ్యాంకు ఖాతాల వివరాల సేకరణ, ఆన్లైన్ నమోదు ఎలాంటి తప్పులు దొర్లకుండా ఉంటేనే సమస్య ఉత్పన్నం కాదు. రైతుల పేర్లు, వివరాలు, భూ వివరాలు, ఖాతాల్లోని పేర్లతో ఏమాత్రం సరిపోని విధంగా ఉన్నా అందులో పెట్టుబడి సాయం జమఅయ్యే అవకాశం లేదు. -
ముహూర్తం ఖరారు
యాసంగి పంటలకు పెట్టుబడి సాయం పంపిణీకి ముహూర్తం ఖరారయ్యింది. సోమవారం నుంచి పంపిణీ ప్రారంభం కానుంది. ఈసారి చెక్కుల రూపంలో కాకుండా నేరుగా రైతుల ఖాతాల్లోనే డబ్బులు జమ చేయనున్నారు. ఈ పథకం ద్వారా జిల్లాలో లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. సాక్షి, కామారెడ్డి: రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా ఏటా రెండు పంటలకు ఎకరాకు రూ.4 వేల చొప్పున అందిస్తున్నారు. ఖరీఫ్‌లో రైతులకు చెక్కుల రూపంలో అందించారు. ప్రస్తుతం ఎన్ని కల కోడ్ అమలులో ఉన్నందున నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోనే డబ్బులు జమ చేయాలని నిర్ణయించారు. దీంతో వ్యవసాయ అధికారులు రైతుల బ్యాంకు ఖాతాల వివరాలు సేకరిస్తున్నారు. జిల్లాలో 2,07,611 మంది రైతులకు యాసం గిలో రూ. 176 కోట్ల పెట్టుబడి సాయం అందించా ల్సి ఉంది. వ్యవసాయ శాఖ అ«ధికారులు ఇప్పటివరకు 60 వేల మంది రైతుల బ్యాంకు ఖాతా నంబర్లను సేకరించారు. అయితే ప్రభుత్వం ఈ నెల 22 నుంచి రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం సొమ్మును జమ చేయడానికి నిర్ణయించింది. జిల్లాలో తొలిరోజు 6,133 మంది రైతుల ఖాతాల్లో రూ. 6.25 కోట్లు జమ చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. రోజు కొన్ని ఖాతాల చొప్పున రైతుల ఖాతాల్లో పెట్టుబడి సొమ్ము జమ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. 60 వేలమంది వివరాలు మాత్రమే.. ఖరీఫ్ సీజన్లో రైతులకు పెట్టుబడి సాయాన్ని చెక్కులద్వారా పంపిణీ చేశారు. రైతులు చెక్కులను బ్యాంకులకు తీసువెళ్లి డ్రా చేసుకున్నారు. అయితే ఈసారి కూడా చెక్కుల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేశారు. కానీ ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో చెక్కుల పంపిణీకి ఎన్నికల కమిషన్ అనుమతి ఇవ్వలేదు. దీంతో రైతుల ఖాతాల్లోనే డబ్బులు జమ చేయాలని నిర్ణయించారు. చాలా మంది రైతులకు అప్పు కోసం తీసుకున్న ఖాతాలే ఉన్నాయి. కొందరికి మాత్రమే సేవింగ్స్ ఖాతాలున్నాయి. దీంతో రైతుల నుంచి బ్యాంకు ఖాతా నంబర్ల సేకరణ వ్యవసాయ శాఖకు కొంత ఇబ్బందికరంగా తయారైంది. రైతులు బ్యాంకులకు వెళ్లి కొత్త ఖాతాలు తీయడానికి సమయం పడుతుండడంతో ఇప్పటి వరకు కేవలం 60 వేల ఖాతాలు మాత్రమే వ్యవసాయ శాఖ సేకరించగలిగింది. రైతుల బ్యాంకు ఖాతాల వివరాలను ఈ నెల 25 లోగా సేకరించడం పూర్తయితే ఈ నెలాఖరులోపు అందరి ఖాతాల్లో పెట్టుబడి సాయం డబ్బులు జమ చేసే అవకాశాలుంటాయి. సాగు చేసేవారికి అందిస్తేనే.. ఎకరాకు రూ.4 వేల చొప్పున ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. గత ఖరీఫ్ సీజన్లో రైతుబంధు పథకం మొదలైంది. యాసంగితో రెండో విడత పంపిణీ జరుగుతోంది. అయితే పెట్టుబడి సాయం పెద్ద రైతులకే ఎక్కువగా మేలు చేస్తోందన్న అభిప్రాయం చిన్న, సన్నకారు రైతుల్లో ఉంది. జిల్లాలో అత్యధికంగా చిన్న, సన్నకారు రైతులే ఉన్నారు. వారిలో ఎకరం, ఎకరంనర, రెండెకరాలు ఉన్న రైతులు 80 శాతంపైనే ఉన్నారు. అయితే పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసి, పడావుగా వదిలేసిన వారికి రూ.లక్షల్లో పెట్టుబడి సాయం అందుతుండడంపై రైతులు పెదవి విరుస్తున్నారు. పంట సాగు చేసేవారికి సాయం అందించకుండా భూములు పెద్ద ఎత్తున కొనుగోలు చేసి వృథాగా వదిలేసిన వారికి ఇవ్వడం వల్ల ప్రజాధనం వృథా అవుతోందన్న అభిప్రాయం ఉంది. అలాగే కౌలు రైతులకు ఈ పథకం వర్తించకపోవడంతో వారు నష్టపోతున్నారు. తమకు కూడా పెట్టుబడి సాయం అందించాలని కౌలు రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
చెక్‌బుక్‌లపై ఎస్బీఐ మరో ప్రకటన
న్యూఢిల్లీ : దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) చెక్‌బుక్‌లపై మరో ప్రకటన చేసింది. మార్చి 31 వరకు కొత్త చెక్‌బుక్‌లను దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. గతేడాది ఎస్బీఐ తన ఐదు అనుబంధ బ్యాంకులతో పాటు, భారతీయ మహిళా బ్యాంకును తనలో విలీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాను విలీనం చేసుకున్న బ్యాంకుల కస్టమర్లను కొత్త చెక్‌బుక్‌లు తీసుకోవాలని ఆదేశించింది. పాత చెక్‌బుక్‌లు చెల్లవని తెలిపింది. దీని కోసం తొలుత సెప్టెంబర్ 30 వరకు గడువిచ్చింది. అనంతరం ఆ గడువును 2017 డిసెంబర్ 31 వరకు పొడిగించింది. ప్రస్తుతం విలీన బ్యాంకుల కస్టమర్లు కొత్త చెక్‌బుక్‌లను దరఖాస్తు చేసుకోవడానికి 2018 మార్చి 31 వరకు సమయమిస్తున్నట్టు తెలిపింది. అప్పటి వరకు పాత చెక్‌బుక్‌లు చెల్లుతాయని చెప్పింది. 2018 మార్చి 31 అనంతరం నుంచి మాత్రం పాత చెక్ బుక్‌లు చెల్లవని తన అధికారిక ట్విటర్ అకౌంట్లో వెల్లడించింది. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ లేదా ఏటీఎంలు, ఎస్బీఐ బ్రాంచులను ఆశ్రయించి, కొత్త చెక్‌బుక్‌లను కస్టమర్లు దరఖాస్తు చేసుకోవాలని ఎస్బీఐ తెలిపింది. ఇప్పుడే కొత్త చెక్‌బుక్ కోసం దరఖాస్తు చేసుకుని, అసౌకర్యాన్ని నివారించుకోండి అని చెప్పింది. గతేడాది ఎస్బీఐ, భారతీయ మహిళా బ్యాంక్‌తో సహా స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్-జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ రాయ్‌పూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావన్‌కోర్‌ను తనలో విలీనం చేసుకున్న సంగతి తెలిసందే. ఈ విలీనంతో గ్లోబల్‌గా టాప్-50 బ్యాంకుల్లో ఒకటిగా ఎస్బీఐ నిలిచింది. విలీనం తర్వాత 1300 బ్రాంచుల పేర్లను, ఐఎఫ్ఎస్సీ కోడ్లను కూడా ఎస్బీఐ మార్చేసింది. All #customers of erstwhile #AssociateBanks and Bharatiya Mahila Bank are requested to apply for SBI #cheque books by 31st March 2018, to avoid any inconvenience. The old e- AB / BMB cheque books will not be valid post 31.03.2018.#StateBankOfIndia #SBI #INB #deadline #March2018 pic.twitter.com/5qtGj54wbV — State Bank of India (@TheOfficialSBI) March 20, 2018 -
ఇక ఆ చెక్‌బుక్‌లు చెల్లవు
సాక్షి, న్యూఢిల్లీ : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనమైన ఆరు అనుబంధ బ్యాంకుల చెక్‌బుక్‌లు ఇక నుంచి చెల్లవని ఎస్బీఐ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ఆరు బ్యాంకులకు చెందిన ఖాతాదారులు కొత్త చెక్‌బుక్‌లను తీసుకోవడానికి 31 డిసెంబరు 2017 వరకు అవకాశం కల్పిస్తున్నట్టు 2017 సెప్టెంబరులో ఎస్బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం గడువు తీరిపోవడంతో, ఇక వీటి చెక్ బుక్ చెల్లవని ప్రకటించేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్, జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌తో పాటు భారతీయ మహిళా బ్యాంక్‌లు 2017 ఏప్రిల్ 1న ఎస్బీఐలో విలీనమైన సంగతి తెలిసిందే. వీటి విలీనంతో ఎస్బీఐ గ్లోబల్ టాప్ 50 బ్యాంకుల్లో ఒకటిగా చేరింది. ఐఎన్‌బీ, ఎస్బీఐ ఎనీవేర్, ఎస్బీఐ మింగిల్(వెబ్ అప్లికేషన్) లేదా సమీపంలోని ఏటీఎం లేదా బ్రాంచు వద్ద కొత్త చెక్ బుక్‌లను కస్టమర్లు దరఖాస్తు చేసుకోవాలని ఎస్బీఐ తన ట్విట్టర్ అకౌంట్లో పేర్కొంది. చెక్‌బుక్‌లు చెల్లవనే ఫైనల్ వార్నింగ్‌ను కూడా రెండు రోజుల క్రితమే ఎస్బీఐ ప్రకటించింది. -
డిసెంబర్ 31 నుంచి ఆ చెక్‌బుక్‌లు చెల్లవు
న్యూఢిల్లీ : భారతీయ స్టేట్ బ్యాంక్ తనలో విలీనం చేసుకున్న ఆరు బ్యాంకుల ఖాతాదారులు ఇంకా పాత చెక్‌బుక్, ఐఎఫ్ఎస్ కోడ్లే వాడుతున్నారా? అయితే త్వరగా మార్చేసుకోండి. 2017 డిసెంబర్ 31 నుంచి ఎస్బీఐ తన విలీనం చేసుకున్న ఆరు బ్యాంకుల ఖాతాదారులకు చెందిన పాత చెక్‌బుక్‌లు, ఐఎఫ్ఎస్సీ కోడ్లు చెల్లవు. ఈ లోపలే కొత్త చెక్‌బుక్‌లు, ఐఎఫ్ఎస్సీ కోడ్లు తీసుకోవాలని ఎస్బీఐ తన ఖాతాదారులకు సూచిస్తోంది. గతంలో పాత చెక్‌బుక్‌లను మార్చుకోవడానికి 2017 సెప్టెంబర్ 30న డెడ్‌లైన్‌గా గడువు విధించింది. అనంతరం ఆ గడువును డిసెంబర్ 31 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం గడువు దగ్గర పడుతున్న క్రమంలో ఎస్బీఐ మరోసారి తన కస్టమర్లకు ఈ సూచన చేస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనేర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ రాయ్‌పూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్ సహా భారతీయ మహిళా బ్యాంకులు ఎస్బీఐలో విలీనమైన విషయం తెలిసిందే. కొత్త చెక్‌బుక్ పొందడానికి బ్యాంకు శాఖనైనా సందర్శించవచ్చని లేదా ఎటీఎం, ఎస్బీఐ మొబైల్ యాప్ ద్వారానైనా దీన్ని పొందవచ్చని పేర్కొంది. ఎస్బీఐ కూడా మేజర్ సిటీల్లో ఉన్న బ్రాంచు పేర్లను, బ్రాంచు కోడ్లను, ఐఎఫ్ఎస్సీ కోడ్లను మారుస్తోంది. ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్కత్తా, పాట్న, అహ్మదాబాద్, భోపాల్, అమరావతి, చంఢీగర్, జైపూర్, తిరువనంతపురం, లక్నో వంటి నగరాల్లో ఎస్బీఐ బ్రాంచు పేర్లను, బ్రాంచు కోడ్లను, ఐఎఫ్ఎస్సీ కోడ్లను మార్చేసింది. -
చెక్‌బుక్కులపై ఎస్బీఐ గుడ్‌న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ మహిళా బ్యాంకుతో సహా ఎస్బీహెచ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ తదితర అనుబంధ బ్యాంకులు జారీచేసిన చెక్కులేవీ సెప్టెంబర్ 30 తర్వాత చెల్లబోవంటూ జారీచేసిన ఆదేశాలపై స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) వెనక్కి తగ్గింది. అసోసియేట్ బ్యాంకుల చెక్కుల వాలిడిటీని 2017 డిసెంబర్ 31 వరకు పొడిగిస్తున్నట్టు ఖాతాదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. అప్పటి వరకు కొత్త ఎస్బీఐ చెక్ బుక్కుల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించింది. హోమ్ బ్రాంచ్‌ను సందర్శించి లేదా మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం ద్వారా కొత్త చెక్ బుక్కులకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. ఎస్బీఐ విలీనమైన ఆరు బ్యాంకులకు చెందిన పాత చెక్ బుక్కులు, ఐఎఫ్ఎస్సీ కోడ్లు సెప్టెంబర్ 30 వరకే పనిచేస్తాయని, ఆ తర్వాత కొత్త వాటికే అనుమతిస్తామని ఎస్బీఐ ఇంతకుముందు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే పోస్టుడేటెడ్ చెక్కులు తీసుకున్న వారి పరిస్థితి దారుణంగా మారడంతో, ఎస్బీఐ ఈ నిర్ణయంపై కొంత వెనక్కి తగ్గింది. ఆ గడువును ఈ ఏడాది చివరి వరకు పొడిగించింది. The validity of cheques of former Associate Banks has been extended till 31st December, 2017. Apply now for a new SBI cheque book. pic.twitter.com/wkeuM2M9oI — State Bank of India (@TheOfficialSBI) October 11, 2017 -
ఎస్బీఐ సబ్సిడరీల చెక్ బుక్‌లు పనిచేయవు
సాక్షి, న్యూఢిల్లీ : ఐదు అనుబంధ బ్యాంకులతో పాటు భారతీయ మహిళా బ్యాంకును తనలో విలీనం చేసుకున్న స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. అనుబంధ బ్యాంకుల పాత చెక్ బుక్‌లు, ఐఎఫ్ఎస్ కోడ్లు 2017 సెప్టెంబర్ 30 నుంచి పనిచేయవని పేర్కొంది. ఈ మేరకు అనుబంధ బ్యాంకుల అకౌంట్లు కలిగి ఉన్న కస్టమర్లు కొత్త చెక్ బుక్‌ల కోసం ఎంత వీలైతే అంత త్వరగా దరఖాస్తు చేసుకోవాలని, వాటితో పాటు కొత్త ఐఎఫ్ఎస్ కోడ్‌ను పొందాలని సూచించింది. ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. భారతీయ మహిళ బ్యాంకుతో పాటు, స్టేట్ బ్యాంకు ఆఫ్ పటియాలా, స్టేట్ బ్యాంకు ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంకు ఆఫ్ రాయ్‌పూర్, స్టేట్ బ్యాంకు ఆఫ్ ట్రావెన్కోర్, స్టేట్ బ్యాంకు ఆఫ్ హైదరాబాద్ కస్టమర్లు తమ చెక్ బుక్‌లను అప్డేట్ చేయించుకోవాలని ఎస్బీఐ ఆదేశించింది. ఇలా అప్డేట్ చేసుకోని పక్షంలో ఆ బ్యాంకుల పాత చెక్ బుక్‌లు సెప్టెంబర్ 30 నుంచి పనిచేయకుండా పోతాయి. ఈ విలీనంతో ప్రపంచంలో అతిపెద్ద బ్యాంకుల్లో ఎస్బీఐ ఒకటిగా అవతరించింది. అంతేకాక ఎస్బీఐ ఆస్తుల విలువ కూడా రూ.37 లక్షల కోట్లకు చేరింది. ఖాతాదారుల సంఖ్య కూడా 50 కోట్లు దాటింది. We request customers of SBI's erstwhile Associate banks and Bharatiya Mahila Bank to apply for new SBI Cheque books as soon as possible. pic.twitter.com/iWhq4xtbrn — State Bank of India (@TheOfficialSBI) September 20, 2017